Saturday, 18 May 2024

అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము

 

అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము

              రచన : శ్రీ ప్రశాంత్ శౌరే  పూణే .                                                         అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు కడప .

అంతఃశుద్ధీకరణ సహజమార్గసాధనావిధానముననున్న నాలుగువిధులలో ఒకటి. అంతర్గత శుద్ధీకరణకీ విధి ఉపయోగపడుచున్నది. ఇందులో అభ్యాసి తన ఇచ్ఛాశక్తి నుపయోగించి తనలోనిచిక్కులు మలినములేగాకుండా తమస్సు కూడా, బహుకాలమునుండి ఆత్మచుట్టూ ముద్రలు లేక సంస్కారములై పొరలుపొరలుగా చుట్టుకొనియున్నవాటినెల్లా తొలగించివేయుటకు, గట్టిసంకల్పము చేయును. ఈ మలినములు, చెడుఆలోచనలతో బంధనముల నేర్పరచి  ప్రాపంచికఆకర్షణలకు లోనగునట్లు చేయుట వలన యేర్పడినవి. ఇవి కేవలం యీజన్మకు సంబంధించినవిమాత్రమే కాదు. మనమెఱుగని గతజన్మలలోనివి కూడా విక్షేపరూపమున వచ్చిచేరినవి.

 సహజమార్గసాధనలో భాగముగా యీఅంతఃశుద్ధీకరణను ప్రతిరోజు, తనపనులను ముగించుకొనిన తర్వాత సాయంత్రం నిర్వహించవలసిన విధి. ఇది సహజమార్గులకే ప్రత్యేకం. ఈవిధి మరెక్కడాలేదు. మతపరమైన ఆచారవ్యవహారములలోగాని, ఇతర ఆధ్యాత్మికపద్ధతులలోగాని యెక్కడా యిటువంటిది మనకగుపించదు. బాహ్యశుభ్రతగా, శరీరమునుగాని, యితర వస్తుసముదాయమునుగాని, శుభ్రపరచుకొను విధానమునకు ముఖ్యముగా ప్రాధాన్యమిచ్చుట, మతాచారములలో కలదు గాని, అంతఃశుద్ధీకరణ విషయమై యేవిధమైన ఆలోచనగాని లేక శ్రద్ధగాని చూపించి యెఱుగరు.

 మనపూజ్యగురువర్యులైన శ్రీరామచంద్రజీ మహరాజ్ (బాబూజీ) యీవిధానమును ప్రవేశపెట్టిరి. యీవిధానములో అభ్యాసి తనలోని మాలిన్యములన్ని, ఆవిరి లేక పొగరూపమున తనవీపునుండి బయటకు వెళ్ళిపోవుచున్నవని సంకల్పముచేయును . మనలోని ఆమలినములే మన ఆధ్యాత్మికప్రగతికి అడ్డంకిగామారి, మన స్వస్థానమునకు  తిరిగివెళ్ళు మార్గమున ప్రతిబంధకములగుచున్నవి. మన స్వస్థానమైన గమ్యమునుచేరి అక్కడ సంపూర్ణముగా ఆమహాప్రభువు (గురువు) తో ఐక్యమైపోదుము. ఆమహాప్రభువైన గురువర్యులు సంపూర్ణముగా అంతిమసత్యముతో లయమైయున్నారు. అభ్యాసి తను వదలుకొననెంచిన వాటిపై ధ్యానము చేయకుండా, వాటిని మామూలుగా   సులభంగాతుడిచివేయవలెను.

 ఒకానొక సందేశములో బాబూజీ, యెందుకీ అంతఃశుద్ధీకరణద్వారా గతాన్నంతా శుద్ధిచేసి తొలగిం చుకోవాలో వివరించారు. "మన పాతముద్రలు మనల్ని వెనక్కులాగుతాయి. మననడవడిని చెడుఆకృతికిమార్చి వాటిని సరిదిద్దుకొనలేని స్థితికి తెస్తాయి. మనపాత దురలవాట్ల సంస్కారములకు బానిసలమై పోదుము. అదే మన బంధానమై పోతుంది”.  ఆయన యింకా చెబుతూ, మనస్సు పూర్వసంస్కారముల ప్రభావములకులోనై వాటిని శుభ్రపరిస్తేనేగాని, అభ్యాసిలో మార్పుతీ సుకరావడానికి, వీలులేకుండాపోతుంది"అన్నారు . అవి (సంస్కారములు)  మనలో ఒకవైఖరిని యేర్పరచి, వాటిని మనం మార్చుకోవడం కష్టతరంచేస్తాయి, శుద్ధిచేయబడినట్లైన, చాలామంది విషయంలో వారి వైఖరినిమార్చి సహజంగా సులభంగా సరిచేయవచ్చును. అప్పుడు ఆలోచనాతీరు, నడవడి సహజంగా సరియైన పద్దతికి మారును.

 ప్రభువు (గురువు) కార్యము

కనుక ప్రతిదినం, సాయంత్రం ఒక‍అరగంట శుద్ధీకరణవిధిని నిర్వహించడం అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినప్పటికి అతని పాతసంస్కారములు వెనక్కులాగుతాయి. ఆద్యాత్మికప్రగతి సక్రమంగా సాగాలంటే మనదేహాంతర శుద్ధీకరణ తప్పనిసరి. ఆధ్యాత్మికప్రగతి నాశించదలిస్తే, అభ్యాసి గురువుగారికి సహకరించితీరాలి. మనం శ్రద్ధగా సాధనలోని, ధ్యానము, శుద్ధీకరణ, ప్రార్థన, నిరంతరస్మరణ పాటిస్తూ గురువుగారికి సహకర్తించాల్సిన  అవసరమున్నది. తద్వారా మనమాయనతో  సంబంధమేర్పరచుకొనుట జరుగును. అప్పుడాయన కృపాధార నిరంతరంగా మనలోనికి ప్రవహించి తిరిగి సంస్కారములేర్పడుటను నిరోధించును.

బాబూజీ వ్రాసినట్లు, అభ్యాసి పూర్వసంస్కారముల  నిర్మూలన, గురువుల కర్తవ్యమే. అయినప్పటికీ  అభ్యాసి తన దురాలోచనలతోను, చెడునడత ద్వారాను తిరిగి జడత్వములోనికి జారిపోకుండా జాగరూకుడైయుండుట అత్యంతావస్యకము. కనుక జాగ్రత్త చాలాముఖ్యము. అంతఃశుద్ధీకరణ ప్రతిదినము చేసుకొనుచుండినచో, యేవిధమైన ముద్రలు పడకుండా, సంస్కారములేర్పడుట జరుగనిస్థితికి అభ్యాసిచేరుకొనును. 

ఆత్మవిశ్వాసంతో, నిశ్చయంతో శుద్ధిప్రక్రియ జరగాలి. శుద్ధిప్రక్రియ పూర్తికాగానే  వ్యక్తి తేలికదనాన్ని అనుభవములో పొందాలి. అనుదినధ్యానం, అంతఃశుద్ధీకరణ వలన మనలోని అస్థిరత, చపలచిత్తాన్ని పోగొట్టుకోగలము. ్రశాంతత  శాంతి మనయందంతటా నెలకొనాలి. మనలోని ముద్రలన్ని కడిగివేయబడగానే హృదయభారం తొలగిపోతుంది. సమర్థవంతమైన శుద్ధీకరణ, రాత్రి నిద్రించుటకుముందు చేయుప్రార్థన వల్ల ఉదయధ్యానం యేవిధమైన ఆలోచనల తీవ్రతలేకుండా సజావుగా సాగును.

ఒకసారి కర్నాటకరాష్ట్రంలోని గుల్బర్గకేంద్ర ప్రశిక్షకసోదరునికి చెబుతూ బాబూజీ శుద్ధీకరణప్రక్రియ జరుగునపుడు మరియు పూర్తవ్వగానే యేమౌతుందో యిలా తెలియజేశారు. "హృదయంలో శూన్యమేర్పడి, ఆశూన్యప్రదేసమంతా భగవత్‍కృపతో నింపబడుతుంది"

 ప్రయోజన ద్వయం  

అంతఃశుద్ధీకరణప్రక్రియలో చేసే సంకల్పం  లేక ప్రయోగించే ఇచ్ఛాశక్తి ధ్యానప్రక్రియలోకూడా అభివృద్దికితోడ్పడి నిరంతరస్మ రణతో శక్తివంతమౌతుంది. ఈరెండు సూత్రములతో  గురువుగారి కృపాప్రవాహం  నిరంతరంగా కొనసాగుతుంది. గురువుగారు చెప్పినట్లు "పాతవాటిని విఛిన్నంచేయడం ఆధ్యాత్మికశాస్త్రంలో ఒక‍అధ్యాయం" అది గురువుగారి బాధ్యత. సత్యతత్త్వమార్గంలో, పూర్వసంస్కారముల  విఛిన్నావసరమున అభ్యాసి సహకారమందించడం అవసరం.

మానవజాతికి బాబూజీ యిచ్చిన మొదటిసందేశంలో యిలా సెలవిచ్చారు. వ్యక్తి తనకుతాను యెలా మేలుచేసుకుంటాడో పరిశీలిద్దాం. ప్రపంచం సూక్ష్మపరమాణువుల కలయికవల్ల యేర్పడింది. అవి (పరమాణువులు) చాలాదట్టంగా మరియు చీకటిగానున్నవి. అయితే వాటిమధ్య మిణుకు మిణుకు మంటున్న కాంతికూడా యున్నది. అది పురుషుడు ప్రకృతి ప్రక్కప్రక్కనే యుండునన్న  సిద్ధాంతమును నిర్ధారించుచున్నది. తెలివి, వివేకముగలవారు దివ్యత్వమువైపునకు మరలి, కాంతిదిశకు దృష్టిసారించి ప్రయోజనము పొందగలిగారు. మిగిలినవారు ప్రాపంచికవస్తు ఆకర్షణకు లోనై చీకటిపరమాణువులతో సంబంధమేర్పరచుకొని దృడమౌతూ ఆత్మచుట్టూ పొరలపైపొరలలను చుట్టుకొనుచూ పోయిరి. వారు మాయప్రభావము స్థిరపడుటకు తగు సారవంతమైన భూమిని కల్పించిరి. అందువల్ల ఆప్రభావము శరీర‍అణువులపైబడి , అది పొరలపై కేంద్రీకృతమై,  అందుండి మెదడుమధ్యభాగమున ప్రతిఫలించినది. ఇదే సంస్కారములేపడుటకు కారణమైనది. ఆసంస్కరములే లోనికిచిచ్చుకొనిపోయి పరిసరములకు, మనస్సు తగులుకొని వ్యక్తిప్రవృత్తులకు ఊతమిచ్చినది. తద్వారా అతడు చెడునుండి మరింతచెడుకు లోనైపోయెను. ఈస్థితిలో గురువర్యుల శక్తిమాత్రమే అతని అంతర్గత తమస్సును  తొలగించి రక్షించ సమర్థము.  

 గురువు లీనమగుట

కేవలమొక కనుచూపుమాత్రమున సాధకునిలో తేలికదనాన్నుత్పన్నంచేయగల అద్భుతశక్తిమంతుడు మాత్రమే  నిజమైనగురువు. తొలుత నేరుగా చీకటివైపునకు సాగు, సాధకుని ఆలోచన, వెలుగును  అంతరంగమున గ్రహించునట్లు జేసి, కాంతివైపునకు ఆమహనీయుడు మరల్చును. తద్వారా అతనిని వెలుగులకుగొంపోవుదారి సుగమమై అతనిలోని అంతర్గతశక్తితో, ఆదారిన ప్రయాణముసాగించుటకు తోడ్పడును.అందువల్ల అతని సమస్య పరిష్కారమై అతనికి వ్యతిరేకముగా పనిచేయు శక్తులనుండి రక్షింపబడి అతనిమేలుకై వున్నవాటిని గ్రహించమొదలిడును. 

 "ఇంకొక విశేష విషయమొకటున్నది. అది గురువు లీనమగువిధమును గ్రహించి తనూ అదేవిధముగా గురువులో లీనమగుటను సాధించినయెడల, యిక అతడధిగమించలేని ఆధ్యాత్మికస్థితియే వుండదు. నేను దీనిననుసరించితిని. అది యిప్పుడు నేనున్న స్థాయికి చేరుటలో సహాయపడినది.భగవంతుడు మీకాశక్తి సామర్థ్యముల ననుగ్రహించుకాక--శ్రీరామచంద్రజీ షాజహాన్‍పూర్. (Messages Eternal)

(ఇది ఆధ్యత్మజ్ఞాన్ 2024 జనవరి మార్చి పత్రికలో   ప్రచురించిన, Importance  of  Cleaning  in Sahaj  Marg  Sadhana అను వ్యాసమునకు  తెలుగుఅనువాదము)

Friday, 17 May 2024

ఆయనకొఱకు తపన ఆవేదన

ఆయనకొఱకు తపన ఆవేదన

 రచన-శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్. 
అనువాదం :- శ్రీ పి. సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, కడప

సహజమార్గదర్శన మను పుస్తకమున పూజ్యబాబూజీ మహరాజ్ యిలా సెలవిచ్చారు. "సృష్టిజరుగుట అవసరమైనపుడు, భగవంతుడు ఉనికిలోనికి వచ్చెను. భగవంతుడు సృష్టిచేయవలునను యోచనచేయగనే, కేంద్రము లేక భూమాచుట్టూ నిగూఢమైయున్న చైతన్యము, కుదుపువలన, దైవీయశక్తి విశ్వనిర్మాణమునకై విడుదలైనది. కేంద్రమునుండి వేరుపడిన కారణమున వ్యధగలిగి, ఆవ్యధ మనిషిని తన మూలమును గూర్చి జ్ఞాపకము చేసుకొనుటకు దారితీసినది.

కనుక, సృష్టి దాని పరిణామక్రమములో తన ఉత్పత్తికి కారణమైన మూలమువైపునకు తిరిగి వెళ్ళుట, మనిషి ఆత్మయొక్క సహజత్వమైయున్నది. సంస్కారములచేత చుట్టబడిన పట్టుపురుగుప్యూపా వలెనున్నఆత్మ, మూలము లేక కేంద్రమునకు తిరిగివెళ్ళుటకు హృదయములో ఆతృత కలిగియున్నది.

లోతైనవిషయములు గల బాబూజీవారి దశాదేశములవ్యాఖ్యానము అను పుస్తకమున, మొదటి‍ఆదేశము తొమ్మిదవ ప్యారాలో యిలా వ్రాశారు. "మనిషి తను అంతర్గతముగా తన ఉత్పత్తిస్థానమునకు తిరిగి వెళ్ళవలెనను ఆకాంక్ష రేకెత్తుటకు కారణము, అతడు తనవంతుగా గైకొన్న ఆ సత్యసారము శక్తివంతమై, ఆవైపునకది ఆకర్షించుటే. సృష్టికికారణమై, ఉనికిలోనికి వచ్చిన ఆచైతన్యములో అతని వంతు భాగం అతనిలో (మనిషిలో) ప్రవేశించినది. మనిషిలో ఆ నిశ్చలస్థితికి తిరిగివెళ్ళవలెనను ఆలోచన వచ్చినంతనే, తనలోనికి ప్రవేశించి అంతర్గతముగా నిద్రాణమైయున్న శక్తి ఉత్తేజితమై, తనశక్తికొలది తిరుగుప్రయాణమునకు ప్రయత్నించినది. 

దివ్యశక్తిమూలంనుండి ఆవిర్భవించిన మానవమనస్సు తనమూలమునకు తిరిగివెళ్ళుటకు ఆవేదనతోను, ఆతృతతోనూ తహతహలాడుచున్నది. అది అందులకు తగు విధానము, పద్దతికై అన్వేషించుచున్నది.  అభ్యసి తన లక్ష్యముసాధించుటకు (అన్వేషణ ఫలించుటకు)  గురువు అతని హృదయలోనాటిన బీజరూప సత్యసత్వమును భక్తి ప్రేమలతో సక్రమముగా చేయు ధ్యానముద్వారా, పొంగివచ్చిన నిరంతరస్మరణ యనెడు జలమునందించి, బీజరూపమున తనలో నిక్షిప్తమైయున్న గురుశక్తిని పోషించును.  నిశ్చితమైన ఇచ్ఛాశక్తి, నిజమైన మానవ జీవితగమ్యమును చేరవలెనను ఆతృతగలిగి ఆమహాప్రభువగు గురువర్యుల దీవెన, దయ ప్రాప్తమైనయెడల మానవుని తిరుగుప్రయాణము సుగమమమగును.  

మనిషి కోరికలగు దాసుడై, ప్రాపంచికవస్తుసముపార్జనలో  వ్యధ లకులోనై  మానవజన్మ కలిగినందులకు నిజమైన లక్ష్యసాధన కొఱకు పాటుబడుటను విస్మరించినాడు.

ఆధ్యాత్మిక ప్రయాణము

తీవ్రమైన ఆకాంక్ష లేక ఆతృతతో లీనమవ్వడం, వ్యాప్తిజెందడం  మరియు  తననుతాను శూన్యునిజేసుకోవడమన్నది, పురోగమనానికి నిదర్శనము. సహజమార్గవిధానాన్ని సక్రమంగాపాటించడం,  ముఖ్యంగా ఆత్మపై యేర్పడిన ముద్రలను (సంస్కారములను) అంతఃశుద్ధీకరణద్వారా తొలగించుకోవడం వల్ల ఆమహాప్రభువు (గురువు)నకు శరణుజొచ్చి, మనస్వస్థానమునకు (భూమకు) తిరిగివెళ్ళుటకు తగు అర్హతనుబొందును.

అభ్యాసి గురువును ధ్యేయంగా నిశ్చయించుకొని (తూహీ హమారీ జిందగీకా మక్సద్ హై) ఆయనపైనే ధ్యాసవుంచినట్లైన, బాబూజీ  మనగమ్యము మనకు జ్ఞాపకముండేట్లు చేస్తారు. బాబూజీ వివరించినట్లు అంతరంగమున సృష్టికర్తతో తిరిగి ఐక్యమగుట కొఱకు ఆత్మపడు వ్యధ, ఆతృత కంటే, అనంతమువైపుసాగు ఆధ్యాత్మికప్రయాణములో కలుగు ప్రశాంతత, ఆనందము యేమంత గొప్పకాదు.  

మన స్వప్రయత్నమున వేలజన్మలకైనను మన నిజస్థానమునకు తిరిగివెళ్ళుట సాధ్యముకాదు. మన బాబూజీవంటి సద్గురువు, మనము అంతిమసత్యముతో ఐక్యమగునట్లు చేయగలరు. ఆ అంతిమసత్యమే సమస్తమునకు మూలము.

మన అదృష్టవశమున దివ్యత్వము మానవరూపమున శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్‍పూర్‍గా అవతరించినది. ఆయన అవతరణతో మొదటిసారిగా ఆధ్యాత్మికచరిత్రలో వ్యక్తికి సహజంగా  సులువుగా జీవితసమస్యాపరిష్కారము లభ్యమైనది.

కర్ణాటకలోని రాయచూర్ నివాసియైన పూజ్యశ్రీ రాఘవేంద్రరావ్ (ఆప్యాయతతో ఆయనను అప్పాజీ యని పిలుచుకొందుము) ఆయనొకసారి చెబుతూ, "నిర్వచింపబడిన ఆధ్యాత్మికసాధనలన్నింటిలో స్థిమితముకోల్పోయిన ఆతృతస్థితి మహోన్నతమైనది" అన్నారు.

ఉర్దూకవిత

1961 వ సంవత్సరం జనవరి 30 న బాబూజీ, అప్పాజీకి వ్రాసిన ఉత్తరంలో యిలా వున్నది. "నీవు చాలా అందమైనవాక్యం వ్రాశావు. నీవు నాచెంత లేకపోయినప్పటికిని నాదర్శనంకోసం తహతహలాడు చున్నావు. ఇది సత్యతత్త్వసామ్రాజ్యమందు నీవందుకున్న మహోన్నతస్థితిని సూచించుచున్నది. దీనినొక ‍ఉర్దూకవితలో, యిలా యిమడ్చబడింది. "రహే తలాబ్ మే ఐసే ఖుద్ రఫ్‍తా హోరహేహై మంజిల్ పహుంచ్‍కర్ మంజిల్ డూండ్‍తేహై" అనగా నేనెంతగా లీనమై మైమరచిపోయానంటే, నేను నాగమ్యం చేరుకొనికూడా యింకా గమ్యంకోసం వెతుకుతూనే వున్నాను.

దేవవాణి పుట 188 లో పూజ్యబాబూజీ యిలా చెప్పారు. "బాధ లేక ఆతృత, సత్యతత్త్వం వైపునకు దృష్టిమరల్చిన వారి కొఱకైతే, సత్యతత్త్వపుమత్తు నాకాంక్షించు వారికొఱకు శాంతి ప్రశాంతత వున్నవి" అన్నారు. మొదటిది పొందుటంత  కష్టమూగాదు, రెండవది సాధించుటంత సులువూగాదు. ఇప్పుడొక్కింత ఆలోచించండి. వ్యధ శాంతికన్నా వెయ్యిరెట్లు విలువైనది. నిజానికి బాధ (వ్యధ) అరుదైన మహనీయుల నీలోకమునకు దెచ్చిన నిర్మాణమునకాధారమై యున్నది.

 నేను బాధ, తీవ్రవాంఛ, ఆతృత లేక అశాంతిని హృదయపూర్వకముగా కోరుకొంటిని. వాటి కొఱకు నా వేయిజీవితములను సైతము త్యాగముచేయగలను. నా స్వరూపమంతయు  ఆ విధానముననే నిర్మితమైనది. ఈకారణముననే, మీఅందరిలోనూ యిట్టిబాధ ఉత్పన్నముకావలెనని నేను ఆతృతతో యెదురుచూచుచుందును. అదే నాకు సంతృప్తినిచ్చు విషయము.

ఈవిషయమున నన్ను సంతృప్తిపరచుట మీకర్తవ్యముకాదా! నాయెడల రవ్వంతైనా భక్తిప్రపత్తులున్న వ్యక్తి సహజంగా నాకు శాంతి, ఓదార్పు కలిగించుపని చేయుటకు పూనుకుంటాడు. అదేగదా! నాజీవితపరిశ్రమ, నా తీవ్రఆకాంక్ష. శాంతికంటే యీ తీవ్ర ఆతృత (అశాంతి) యొక్క శోభ (ఆకర్షణ) చాలా గొప్పదని నిశ్చితమగా మీకు నొక్కివక్కానిస్తున్నాను.    

ఇది తీపిలేని బహుతియ్యనిబాధ. ఒకసారి మీరు దీనిని రుచిచూస్తే చాలు ఒక్కక్షణమైనా  అదిలేకుండా వుండలేరు.  ఈస్థితిని వదలుకొనుటకంటే ప్రాణత్యాగమే మేలని తలంతురు. ఇది ధ్యానమున కావలనున్న స్థితి. ఈస్థితికి గొంపోవుటకు నిరంతరస్మరణ ఒకవాహనముగా పనిచేయును.

ఇది ప్రగాఢవిశ్వాసముతోగూడిన భక్తి ప్రేమల ఫలితము.

సదా సంబంధము గలిగియుండుట

ఇది తీవ్రమైన వాంఛతో ఆతృతతో ఆరాటముతో, విశ్వేశునికొఱకు  పడుతపన. నిరంతరం సజీవముగా మండుతున్న అగ్ని. ఆయనతప్ప మిగిలినదేదియు జ్ఞాపకములేని వాడుగా మారిపోవుట. ఆయనతోనే సంబంధమేర్పరచుకొని విడువకుండుట.

ప్రియసోదరీ సోదరులారా! దివ్యదీవెన వల్ల మనము, బాబూజీ మహరాజ్ వారి పవిత్రపాదముల చెంత చేరితిమి. ఒక నిముషమైననూ వృధాపరచుకొనక యీసదవకాశమును సద్వినియోగ పరచుకొందుము గాక! సహాయపడుటకు మన గురువర్యులు సదా మనకందుబాటులో నున్నారు. ఆయన దయానంద సాగరము. మనహృదయములలో నిత్యము సత్యమునై యున్నారు. ఆయనకోసం మనము ఆతృతతో వుండటంకన్నా మేలైన విషయమేమున్నది? ఆయనకృప మనలనందరిని ఆహ్వానిస్తూ, ఆయన హృదయంలో జీవించమంటున్నది. ఆయన జీవితమే ప్రశస్తజీవితం. ఆయనకొఱకు ఆతృత (తొందర) పడండి. బాబూజీ ఉత్తరం అప్పాజీకి వ్రాస్తూ, ఒక అద్భుతవాక్యాన్ని ఉదహరించారు. ఆవాక్యంతో నా యీప్రసంగాన్ని ముగిస్తాను.

"జో దర్డ్  అస్నా, దిల్ వహీహై కైసేకి ముహబ్బత్‍కి  ఖాబిల్ వహీహై"

అంటే "బాధకలవాటుపడిన హృదయమే ప్రేమించుటకర్హమైనది".---పుట 172

(2-12-2023 న సోలాపూర్ ఫౌండేషన్ డేలో ఆంగ్లములో యిచ్చిన ఉపన్యాసము. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ పత్రికనుండి గ్రహించడమైనది)

 


Sunday, 12 May 2024

స్వార్థము

 

స్వార్థము

రచన:  డా: విజస్యకుమార్ వైకుంఠ్, గుల్బర్గా, కర్ణాటక      అనువాదం :  శ్రీ పోలిచర్ల సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, హైదరాబాద్.

శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్‍పూర్ వారు రచించిన దశాదేశముల వ్యాఖ్యానము అను పుస్తకములోని ఆరవ ఆదేశమిలా వున్నది. "అందరిని సోదరులుగాభావించి, వారినట్లే ఆదరింపుము".

మొత్తముమీద  సత్యసంధతలో యేకమగుటకు దైవీయపిలుపుగా యీఆదేశము మన కనిపించుచున్నది. ఈవాక్యమునకు, మనము ప్రతిస్పందించినప్పటికిని, విషయమింకను, చర్చనీయాంశముగనే మిగిలియున్నది. పూజ్యగురువర్యులు అహంకార (స్వార్థ) సమస్య, దానికిగల కారణము, పరిష్కారమును గురించి వ్యాఖ్యానమున చర్చించిరి. "ఇందులో అంతర్గతముగానున్న నున్న విషయ మెవ్వరూ అర్థము చేసుకోలేదు" అన్న సూచన అర్థవంతమైనది. ఇప్పుడీ  విషయమునర్థము జేసికొనుట కొక్కింత ప్రయత్నింతము.

స్వార్థం పుట్టుక
గురువుగారు ఒక వంశవృక్ష ఉదాహరణతో దీనిని వివరించిరి. ఒకేతల్లికి జన్మించిన సోదరీసోదరులందరూ, ఒకరికొకరు దగ్గరిసంబంధము కలిగియుందురు. తొలుత వారందరూ ఒకజట్టు. ఆతర్వాత వారందరూ వారివారి కుటుంబములను యేర్పాటు చేసికొందురు. వారిబిడ్డలు  దాయాదులుగా బంధుత్వాన్ని కలిగియుందురు. అంతేగాని బహుదగ్గరి సంబంధము కలిగియుండరు. కాలముగడిచేకొద్దీ, మరియు కుటుంబముపెద్దదై సంఖ్యపెరిగేకొద్దీ, ఒకరికొకరు దూరమైఅన్యులైపోతారు

 వంశపరంగాచూస్తే, మనందరి మూలం కొక్కటే. చూడటానికిమాత్రం ఒకరివలె మరొకరుండక, ఆకారంలోను ఒడ్డూపొడవులోనూ వేరువేరుగా వున్నాము. మరోమాటలో చెప్పాలంటేమూలంలో ( ఉత్పత్తిస్థానంలో )           మనమంతా ఒకటేగానివ్యక్తిత్వమేర్పరచుకుంటూ వేరైపోతున్నాముసోదరభావమునకు మూలమైన తొల్లింటి 
  (నిజ  (అసలుస్థితి మానవ మేధస్సునుండి తొలగిపోయింది.  

 మానవునిదృష్టి  స్థూలరూపంవరకే పరిమితమైనదిఅతనిప్రేమ అంతవరకే పరిమితంస్థూలరూపాన్ని ప్రేమించడంవల్ల  కలిగేఫలి తం ద్వైతమైనదిఅంటే ప్రేమకలదన్నంతనేతద్విరుద్ధ ( వైర ) భావనకూడ   అందులో నిక్షిప్తమైయున్నదిమనిషియీమూలసత్యాన్ని గ్రహించలేక పోతున్నాడు

అందువల్ల అతడు, బంధువులు మిత్రులు అన్నభావననుండి దూరమై పోతున్నాడు . అతని ఆలోచనాస్వరూపము వైవిధ్యగాను, గందరగోళముగాను తయారయింది. ప్రతిదీ భిన్నముగా కనిపించడం ప్రారంభమైనది. ఇవన్ని వ్యక్తిగత (అల్లికకు (నిర్మాణమునకు తోడ్పడినవి. ఇది స్వార్థమునకు మరోపేరు. స్వేచ్ఛామార్గమున యిదొక ప్రతిబంధకము. ఈప్రతిబంధకమునుండి మనిషి తప్పించుకొనవలసి యున్నది.  
 పరిష్కాము
స్వార్థము, ఇచ్చట అచ్చట అన్నతేడాలేకుండా అంతట ఉండనేవున్నది. భావన విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కొక  రకంగా వుండవచ్చును. అయితే దీనిమూలకారణం వ్యక్తిగత‍అల్లికపై ఆధారపడియున్నది. అభ్యాసి తన వ్యక్తిగత‍ అల్లికను విచ్ఛిన్నము జేసికొన యత్నించి, నిజస్థితికిసమీపించేకొద్ది అతనిలోని సోదరభావము పొంగిపొరలును. మరోవిధంగా చెప్పాలంటే, అభ్యాసి సక్రమసాధనవల్ల, వారం వారం సత్సంగంలో  పాల్గొనడంవల్ల, ఇది సుసాధ్యమగును. నిజంచెప్పాలంటే, యిది అనుభవపూర్వక మార్గదర్శకత్వ పరిణామము. వ్యాఖ్యానములో నేరుగా విషయము చర్చింపబడనప్పటికి, లోతైన సూచనచేయబడింది. సహజమార్గ బోధనలలో యీవిషయంపై  నిశ్చితాభిప్రాయమైతే  తెలియజేయడం జరిగింది.
 వారంవారం సత్సంగము
సహజమార్గసాధనావిధానములో (శ్రీరామచద్ర మిషన్‍లో) వారానికొకసారైనా సత్సంగము నిర్వహించుట తప్పనిసరియై యున్నది. అందులో పాల్గొనడము సభ్యులందరి విధి. పాల్గొను అభ్యాసులందరితో గురువుగారీ సత్సంగమును నిర్వహింతురు. మార్గదర్శకములను సక్రమముగాపాటించినట్లయిన ఫలితము చాలా ప్రతిభావంతముగా నుండును.

(1) దైవీయ‍ఉనికిపై విశ్వసము. (2) రాజయోగపద్దతిలో ఆలోచన గలిగియుండుట. (3)మస్పూర్తిగా స్వేచ్ఛగా సత్సంగమున పాల్గొనుట. (4)సభ్యత మర్యాదగలిగి వ్యవహరించుట.   

 వారంవారం సత్సంగములవలన రెండువిధముల ప్రయోజనమున్నది.
 (అ) అభ్యాసి తన అంతర్గతకోశముల  లో యేర్పరచుకున్న వ్యక్తిగత అల్లికల  ప్రభా వమునధిగమించ గలుగును .
(ఇ ) సత్సంము యొక్క ఆరోగ్య వాతావరణము వలన  పరిస్థితుల ప్రభావమున  యేర్పడిన సమస్యలు  సమసిపోవును  లేదా  వాటి తీవ్రత తగ్గిపోవును
 
    సారాంశము

స్వార్థచింతన, మనిషితనకైతానే యేర్పరచుకున్నాడన్న, విషయమతడెరుగడు. ఇది అతడంగీకరించకపోయినా యిదే వాస్తవం. ఇది ఒకచిత్రమైన పరిస్థితి.  ది పతనావస్థ (దిగజారుడు స్థితి).  ప్రారంభంలో అభ్యాసి, “మనందరం ఒకటి” అన్నభావన, తనమనసుకు తానే మరిమరి సూచనలిచ్చుకొనవలెను. ఇది అతడు భక్తిపరిధిలో వున్నాడని, అలానే వుండటానికి ప్రయత్నిస్తున్నాడనడానికి నిదర్శనము. ఈవిషయవివరణము వ్యక్తిగతము. ఈవిషయమును గురించి చర్చించుకొనవవచ్చును . మీఅభిప్రాయములు నాకు తెలియజేయనూ వచ్చును


పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...