Saturday, 27 April 2024

ఆఒకటికై అన్వేషణ

 

ఆఒకటికై అన్వేషణ

 "యోగము" అంటే అసలైన అర్థం "కలయిక".  రెండువుండి అవి ఒకవిధానంప్రకారం పయనించి ఒకదానితో ఒకటి కలవడమే యోగము. ద్వైతం, అద్వైతంరెండూ తొలుత వుంటేనే యీ యోగము నకు అర్థము సిద్ధిస్తుంది. ఒక్కటైయున్న దానికై సాగే అన్వేషణే యోగముయొక్క సారంశము.

 ప్రకృతిపరిధిలో ఉన్నది, కానున్నది అన్న వాదం ప్రక్కనబెడితేయోగసాధనానుభవమున ఒకటికైసాగే అన్వేషణ ముందుకు సాగుతుంది. లక్ష్యమునకు ఒకపేరిడి, దాని వివరణలివ్వవవచ్చును. కాని ప్రభువు అన్నమాట విషయగ్రహణకు చక్కగా సరిపోతుంది. ప్రభువు అన్నమాటకు భగవంతుడు లేక లక్ష్యము అన్నమాటగా అనువదించుటగాకదాని బదులుగా యిదమిద్దమని చెప్పుట భాషాపరంగా కష్టమగుచున్నది.

ప్రభువు అన్నమాటను గ్రహించి, ఒప్పుకున్నతర్వాత, ఇక ఆయనతో కలయికప్రక్రియ మొదలుపెట్టగనే, ముడి తర్వాత ముడిగా ఆటంకములు కలుగుచున్నవి. అనగా వ్యక్తి ఆశలు మరియు ముందేయేర్పరచుకున్న భావనలు అను అడ్డంకులను అధిగమించి పురోగమించవలసి యున్నది. ముడులనువిప్పి, కేవలం కలయిక మత్రమే గాకుండా, లక్ష్యంలో లీనమగునట్లు జేయు సరియైన మార్గము ప్రేమ మాత్రమే. కానీ ప్రేమ అన్నింటికంటెను బహుమోసకారి. వ్యక్తి ముందుగనే యేరికోరి వాంఛాపరితృప్తికై యేర్పరచుకున్న ప్రేమవలన ఉన్నముడులు మరింతగా బిగుసుకపోయి, ప్రభువుకృపా మహిమకు కూడా సడలనివైపోవును. ప్రేమ సహజరీతిలో ఉత్పన్న మైనదైతే, అది సరళము సులభమునై యుండును. అదే  ప్రయత్నపూర్వకముగా తెచ్చుకొని చూపెడి ప్రేమ సంక్లిష్టముగానూ, సంకుచితముగానూ వుండును.

 ప్రేమమార్గము చాలా యిరుకైనది. అందులో ఇద్దరు ఒకేసారి యిమడరు. నిజమైనప్రేమ ఒకరిని చచ్చేట్లుచేసి, ప్రభువును మాత్రమే సజీవంగానుంచును. వికటప్రేమ ప్రభువును చావనిచ్చి తానొక్కడే ఒంటిగా జీవిస్తాడు. ఒక కర్రయొక్క రెండుకొసలవద్ద ఒకేఒకదానికై అన్వేషణజరుపు యోగప్రక్రియను విషదపరచునవే యీరెండు విధానాలు.

 వాస్తవానికి ప్రేమించడం వ్యకియొక్క ముఖ్యవిధి. కాని ప్రభువే ప్రేమించాలనడం అసంబద్ధం. అయినా ప్రేమ ప్రభువు (గురువు) నుండే మొదలవ్వాలలి మరి. ఈవిషయంలో ప్రభువు (గురువు) స్వేచ్ఛకు, యెన్నికకు ఆటంకము కలుగరాదు. ముఖ్యముగా ఆయనకిష్ట మొచ్చిన రీతిలో, ఆయన యిష్టపడి యెన్నుకున్న వారిపై, ప్రేమ స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. ప్రభువుప్రేమ వర్షముకురిసినట్లు అందరియెడ సమానమే. కాని ప్రభువు యేబరువు బంధనము లేకుండా, సర్వము గ్రహించి గగనమున తేలిపోవు (తేలికయైపొయిన) వానినే యెన్నుకొనును. ఆయనతప్ప మరెవ్వరును ఆయన యెన్నికను అర్థముచేసుకొనజాలరు. గురువుయొక్క హృదయవేదన, పరితాపమునకు యెయ్యదియును సాటిరాదు. అత్యంతోన్నత స్థాయి గురువర్యులనేకులు, తాము విదుదలచేసిన శక్తిని సంపూర్ణముగ గ్రహించగల యోగ్యునికొఱకు తమదేహత్యాగం తరువాత వందల సంవత్సరములు నిరీక్షించ వలసి వచ్చినది.

 ప్రభువు (గురువు) ప్రేమద్వార ఉన్నముడులన్ని విప్పబడి, ఆయనలో లీనమగుట సంభవమై, యోగము లేక ఒక్కటికై అన్వేషణతో సహా సమస్తస్థితుల నధిగమించి, మరింతగా పురోగమింతురు. ప్రభువు (గురువు) ప్రస్తుతం సమాన్యజనం ఆరాధించు దేవునివలె వివిధరూపాలలో విడివిడిగానుండగా, విడివిడిగావున్న ఆమొత్తం ఒక పాత్రలో యిమిడిపోయి ఒక్కటైనరీతి, తగినట్లుగామారి సరియగువిధానమున ప్రభువు (గురువు) ప్రేమకు పాత్రు (యోగ్యు)లౌదురు. స్వార్థమెరుగని నిశ్చితబుద్ధితో ఒకేఒక్కదానినే (ఏకంసత్ నే  ) నమ్మియున్నట్లైన, అదే సరియైన దారి నేర్పరచి, జీవన్ముక్త (బ్రతికియుండియు మరణించిన వానివలెనుండు) స్థితికి చేర్చి, అన్వేషణను సఫల మొనర్చి, మన‍ఉనికియైన ఒకటిని ఒక్కటైయున్న దైవము (ఏకంసత్) వైపుకుత్రిప్పిమున్ముందుకు నడిపి, యీఒకటి ఆఒకటితో ఐక్యమొనర్చును.             

  (డా:శ్రీవాత్సవ గారి Divine Messages అను పుస్తకము లో ఆంగ్లములో ప్రచురించిన Search for One అను పాఠమునకిది తెలుగు అనువాదము)               

 

 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...