Saturday, 28 November 2020

ప్రార్థన

 ప్రార్థన

ప్రార్థన మనలను మృదుస్వభావులుగా మార్చి, మనలో అణకువ (నమ్రత) నుత్పన్నం చేస్తున్నది.  తద్వారా మనం, మనవి అనుకొంటూ అనేక వస్తువులపై మనకై మనమే యేర్పరచుకున్న వ్యామోహం తొలగిపోతుంది.  అందువల్ల తపనతో మనమాశిస్తున్న స్థితి మనలో నెలకొంటుంది.  దీనికనుగుణంగా మనలోని సత్వశక్తి విజృ౦భించి త్వరితగతిన సత్కార్యనిర్వహణగావిస్తుంది.

మన సాధన ప్రార్థనతో మొదలై ప్రార్థనతోనే ముగుస్తుంది – ఈ ఆది అంతిమాల మధ్య అనేక స్థితులను అధిగమించి సహజమార్గంలో మన ప్రయాణం సాగుతున్నది - యాత్రలోని మధ్యస్థస్థితులన్నీ అద్భుతాలే.


(శ్రీబాబూజీ మహరాజ్ గారు శ్రీసర్‌నాడ్‌జీ వారికి వ్రాసిన ఉత్తరం నుండి గ్రహించినది.

గ్రంథం: దివ్యసందేశ్ – కవరుపేజి)

***   ***   ***

అంతరార్థం:- ప్రార్థనలోని తొలివాక్యంతో మన గమ్యం గుర్తిస్తాము.  అది మొదలు. అంటే అది యాత్రకు ప్రారంభం. ఆఖరు వాక్యం మన దీనస్థితి, తద్వారా శరణాగతి పొందుటను సూచిస్తుంది. శరణాగతి పొందుటే అభ్యాసి సాధనకు అంతం.  తర్వాతకార్యం గురువే నెరవేరుస్తాడు.  అంటే బాధ్యత పూర్తిగా అభ్యాసి నుండి గురువుకు బదలాయింప బడుతుంది.  శరణాగతితో “అహం” (self) అణగారిపోతుంది.  కనుక “అహం” లేనప్పుడు చేసేదంతా గురువే అంటే దైవమే. 

---౦౦0౦౦---





No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...