Monday, 25 March 2024

నాకార్యము – నావిధానము

 

నాకార్యము – నావిధానము

                                                             రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్  

 నేనేమంత గొప్ప అనుభవముగల వాడినికాను. నాకేమీ తెలియదన్నదే నాకు తెలిసిన విషయము. నేను నాస్వంతపుస్తకము మాత్రమే చదివితిని. అందులో జ్ఞానము అడుగంటి యున్నది. నేను గ్రుడ్డిగా ముందుకుసాగితిని. నేనేమిచేయువున్నానో, ఏదారిన తిరుగాడు చున్నానో కూడా నాకుతెలియదు. నేను మీకోసం యిప్పుడు సూచించినంత మాత్రంకూడా  నాధ్యేంపై నాకవగాహనలేదు. నాదృష్టి కేవలం ఆపవిత్రమూర్తిపై మాత్రమే నిలచియుండినది. ఆయనకే నాహృదయమర్పించితిని. నా దృక్పదంలో వేరొక ప్రయోజనమే లేక ఆయనకే నన్ను నేనర్పిపించుకొంటిని. ఇప్పటికీ నాస్థితి అలాగేవున్నది. కానీ ఒకచిన్న వ్యత్యాసమున్నది. అదేమంటే, అప్పటి విచక్షణకూడా యిప్పుడు లేదు.

 అంధుడు యేమీ చూడలేడు. నేనూ అంధుడనై, యేఅనుభూతిగానీ, చూడాల్సిందిగానీ లేకుండా పోతుంది. చూడకూడని వాటిని చూడకుండా వుండటానికి భక్తసూరదాసు తనకళ్ళను పొడిచేసు కున్నాడు. నేను నాదృష్టినంతా ఆయనవైపునకే మరల్చాను. తద్వారా ప్రాపంచిక విషయభారము నాహృదయముపై పడలేదు.

 మనము (మానవులము) యెక్కడున్నామో, అక్కడనుండి యేవిధమైన జ్ఞానము మనకు లభ్యముగాదు. కడకు అక్కడ మనల్నిగురించి కూడా మనకేమీతెలియదు. మరోవిధంగా చెప్పాలంటే, ఆ స్థంభించిపోయినస్థితి లేక చైతన్యరహితస్థితి సహజంగానే మనలో వుంది. అయితే ఆస్థితి సంపూర్ణసమత్వంలో లేశమైనా మన మనసునకనిపించియుంటే, లేక అనుభవమునకు వచ్చియుండియుంటే, అర్థమైయుండేది. దీని తర్వాతే ప్రతిదీ ఉనిలోనికి వచ్చినది. ఈగమ్యం మనంచేరడానికి మనలో వినమ్రత నెలకొనాలి. ఆ వినమ్రతకూడా మనయెఱుకలో లేకుండా పోవాలి. మనము గొప్పతనానందుకోవాలి, కానీ అదేమిటో కూడా మనకసలే తెలియకుండా వుండాలి. మనకైమనం గొప్పతనాన్ని సాధించి, గొప్పవారనుకుంటే, ఆ ఆలోచనే మనదారిలో అడ్డంకియైనిలచి మనల్ని ముందుకు సాగనివ్వదు. ఎవరుకూడా తనకైతాను యెవరికంటెను, యేవిధంగాను, దేనిలోనూ, యెప్పుడూ గొప్పవాడినని భావింప రాదు. ఈమహద్వాక్యం గమనించండి. "ఏలోపం లేని లోపమసలే వుండదు". ఈ వాక్య మర్థమవ్వడానికి, కొంతవరకు సహాయపడు మరోమాట చెబుతాను, గమనించండి. "నాస్థితి నాకుతెలియదుగానీ, ఒక్కోసారి నాకానందంగానూ, మరోసారి బాధగానూ వుంటుంది. అప్పుడు నేను నిద్రలో కలగన్నబిడ్డవలె యేడుస్తాను లేదా నవ్వేస్తాను.

 ఇతరులకు శిక్షణనిచువారు, అందుకుతగిన స్థాయివరకు చేరకుండానే శిక్షణ నిచ్చినట్లైన, అది వారిపతనానికి దారితీయును. ప్రశిక్షకునికి అనుమతినిచ్చేముందు, అతని హృదయములో నేను ప్రశిక్షకుడను, అధికుడను అనుభారము హృదయముపై వుండరాదు. ఈస్థితి అతడు తన అహాన్ని జయించినపుడు కలుగుతుంది. భగవంతుని ఆజ్ఞలను అమలుజరుపుట తప్ప, యితర మేమియు అతనికవసరమై వుండదు. అతనికి మంచి చెడు, తనవారు పరాయివారు అన్నతేడా వుండనే వుండదు. ఆజ్ఞ అంటేఆజ్ఞ అనునట్లతడు వ్యవహరించును.    

 గురుదేవులకార్యము ఆగదు. ఆధ్యాత్మిక‍ఉద్యమం సంపూర్నస్థయిలో ముందుకు సాగిపోనున్నది. తనుచేరిన యేఆద్యాత్మిక స్థాయితోనూ సంతృప్తిచెందక పురోగమింపవలెను. ఇకచాలుఅన్న భావనను విసరి కుక్కలకు పడవేయవలెను. నేనునాజీవితకాలములో యెప్పుడు సంతృప్తి చెందలేదని మా గురువర్యులు చెప్పిరి. ఆతర్వాత అత్యున్నతస్థాయి చీకటిలో మున్ముందుకు యీదుట తటస్థించినది. వాస్తవానికి యెవ్వరుకూడ అనంతమైన ఆద్యాత్మిక సాగరాన్ని యీది దాటజాలరు. ఇది మహోన్నతస్థాయి ఆత్మలస్థితి. ఇక‍అల్పుల విషయం చెప్పవలసిన పనిలేదు.                                                 

    "పచ్చిగానున్నది పరిపక్వతజెందాలంటే ప్రయాణం చాలాకాలం సాగాల్సిందే"’

 అంతర్గతశక్తి నుపయోగించి సమస్తదోషములను నిర్మూలించవచ్చును. మనిషి తనలోని కొన్నిదోషములను నిర్మూలింపదలచియూ నిర్మూలింప వీలుకాలేదన్నమాట వుండదు. ఒకపురాతన వాక్యం యిట్లున్నది "మనిషికి ధైర్యముంటె భగవంతుని సహాయం వుండనే వుంటుంది". నాకు ఓడజను సార్లకంటె యెక్కువసార్లు మాగురుదేవులను భౌతికంగా కలవడానికి వీలుపడలేదు. కానీ నాఆలోచననుండి ఆయన దూరమైన సంఘటన నా మనస్సుకెప్పుడు కలుగలేదు. నాకుతెలిసి యెల్లప్పుడు ఆయనకు సన్నిహితంగానేవున్నాను. ఆయనకు నచ్చనిపని నావల్ల జరుగుతుందేమోనని భయపడుతూవుండేవాడిని. ఎల్లవేళల నాగురువర్యుల చింతన నాలో వుండటమనేది, సంపూర్ణవిస్వాసముతో గూడివుండేది. నాజీవితభవిష్యత్తు నిర్మాణమునకు యీఅంశములు స్థితులు సహాయకారులైనవి. నేనొక విధానమును మీకుచెబుతాను, అదేమంటే మీకునచ్చనిదేదైనా సంభవిస్తే, అది నాకు వెంటనే తెలియజేయండి , లేదా అదినాదేననుకొనండి. లేదా ఒరోవిధంగా చెప్పాలంటే, అదినా తప్పుగానో లేక లోపంగానోభావించండి. ఈవిధానం చాలాసులువైనది, ప్రతిభావంతమైనది. ఈవిధానం నాసోదర‍అభ్యాసి గురువునెడ తగదని, అమర్యాదకరమని, అసంబద్ధమైనదని వాదించెను. నేను నానీతిని, సద్గుణాలను నాగురుదేవులకు సంబంధంలేకుండా నావేనని తలచి, లేక నాగురువు సంపూర్ణుడుకాదని తలచినట్లైన, నీవుచెప్పినది సబబేనని నేను సమాధాన మిచ్చితిని.

 ఏవిధంగానైనా సరే, ఒకరికొకరం సహాయంచేసుకోవడం మనవిధి. మనుషులు ఒకరికొకరు సహకరించడమంటే, ఒకజీవిలోని వివిధ‍అంగములు పనిజేసినట్లే యగును. వారు ఒకరిపై ఒకరు ఆధారపడియుందురు. నేను హృదయపూర్వకముగా అందరిబాగుకోసం ప్రార్థిస్తున్నాను. మాటసాయంచేస్తాను. ఇంకా అవసరమైతే, అందరికీ తెలిసేటట్ట్లు సహాయపడతాను. ఆధ్యాత్మికస్థితియన్నది సహజంగా హృదయాధారితమైనది. అది భగవంతునిసృష్టిలోని జీవులందరి మేలునకు క్షేమమునకై యున్నది. సరియైనప్రార్థనలో ప్రార్థిస్తున్నానన్న యెఱుకవుండదు. ప్రార్థినామయస్థితి నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. ఎఱుకేవుంటే, అందులో అహంకారానికి ఆహుతైపోయే ఆశీర్వాదాంశం వుంటుంది. అంటే నేను దీవించే వాడిని అనే అహం వుంటుంది. ఒకవేళ దీవించు లేక ప్రార్దించువారు కోరినట్లు జరిగిందంటే, ఆప్రార్థించువారు లేక దీవించువారు తమనితాము ప్రత్యేకమైన పూజనీయులమని, యెన్ను కొనబడిన ఘనులమని తలంతురు. ఇక్కడకూడ ఉద్దేశ్యం మంచిదైతే అవశ్యంగా వచ్చేహాని యేమీవుండదు, అసలిట్టిచోట్లన్నిట హృదయమే ప్రాధాన్యత వహించి, అదే గణింపబడుతుంది.

 తనకైతాను ఉత్తమస్థాయి కెదగాలనుకోవడం, యిప్పటి అవసరం. దేనికే గట్టిగా కట్టుబడి వుండాలి. అప్పుడు గమనించి చూడండి, యేమిజరుగుతుందో. అహో! ఇది హిందువులలో అంతర్గతంగా వున్నదే. అయినా వారు యీవిషయం అర్థంచేసుకోలేకపోతున్నారు. కారణం, తెసుకోవడానికి వారికి తీరికాలేదు, తెలుసుకోవాలనే కుతూహలమూలేదు. ముస్లింల ఆలోచన, నమ్మకం ప్రకారం మహమ్మదుప్రవక్త విచారణదినంనాడు నమ్మినవారిని స్వర్గంవెళ్ళుటకు, కానుకగా సిఫారసుచేస్తాడు. వాస్తవానికి విచారణదినం గడచిన తర్వాత అనుగ్రహించబడే స్వర్గంఅనేది అసలుందో లేదో కూడా తెలియదు. 

ఆధ్యాత్మికరంగమునకు వైవిద్యము విషము. మహోన్నతమైనది (దైవం) కలదను భావనకలిగి యుండి కూడా గొప్పవారమనుకుంటే, యిక ప్రేమ విరాజమానంకాదు. అలా కాకుండా మనల్నిమనం అల్పులమనుకుంటే, మన హృదయం ఉన్నతుని సేవించడానికి ఒప్పుకుంటుంది. ఇది శుభకరమైనది. ఒక సాధుపుంగవుడు సెలవిచ్చినట్లు "ఒకవేళ తననుతాను మరొకరికంటే గొప్పవాడననుకొని యితరులను, తక్కువ, హీనులు అనుకుంటే, అతడు తానున్న స్థితినుండి క్రిందకుపడిపోవును . మనము కులమునుబట్టి అంచనావేసి గౌరవించు పద్దతిలో నున్నాము. అన్నికులములు ఒకపెట్టెలోని అరలవంటివి. అవసరమొచ్చినపుడు, పెట్టెనుతెమ్మంటాముగాని అందులోని అరలనుతెమ్మనము. అన్నితెగలు పనివాని చేతిపనులే. కులములన్ని సంఘము యొక్క అనుకూలతకోసం యేర్పడినవే. నీవుపెట్టెను తెరిస్తే, అందులో అరలలోని వస్తువులన్నీ ఒకదానితో మరొకటి సంబంధం గలిగేవుంటాయి. అవికొన్ని చెక్కవైతే, మరికొన్ని ఉక్కు లేక యినుమువై వుంటాయి. కబీరుమహనీయుడు యిలా చక్కగా సెలవిచ్చారు. "అల్పులందరు పవిత్రసాధువుల  పాదములనాశ్రయించి, మోక్షముపొందగా, కులమురీత్యా ఘనుల మను కొన్నవారు, గర్వముతో పతనమై పోయారు.

 కులమనేవేరువద్ద ప్రకృతి గొడ్డలినుంచింది. కాలక్రమంలో కులం తప్పక సమసిపోయుంది.

 మీచూపును అంతరంగంవైపునకు మరల్చండి. మీముందున్న యీప్రపంచం నాది. కనుక మీరు స్వేచ్ఛను అనుభవించండి. నాస్వర్గం యితరులకొఱకు వదలివేశాను. ఇతరులకష్టములు, వేదనలను నావిగా గ్రహిస్తున్నాను. నేనునామోక్షన్ని గురించి పట్టించుకోవడంలేదు. నావద్ద ఒకతెల్లని, మరొకనల్లని పత్రము వున్నవి. నల్లనిదంటే, యితరుల కష్టములు వ్యధలు. నేను వారి శిక్షకునిగా వ్యవహరిస్తున్నాను గనుక ఆనలుపును నేనుపులుముకున్నాను. మీవ్యధలు, బాధలుఅనే పొరలను తొలగించుకోండి. వాటిని నన్ను భరించనీయండి. అవన్నీ నానల్ల పత్రమునకు జమచేయండి, మీరు తెల్లనిపత్రమే స్వీకరించండి.

 గురువర్యుల కార్యము నిరంతరంగా, యేఅడ్డంకులులేకుండా కొనసాగాలి. నాప్రియతములు ఆయన విధానమును పాటించడముద్వారా ఆయన కార్యక్రమములో పాల్గొనండి. ఆయనచూపిన మార్గము సయైనది. అది మాత్రమే మోక్షము, ఆపైపైస్థితులన్నిటిని మీక.నుగ్రహించగలదు         

  (S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అణువదించడమైనది )    

 

 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...