Monday, 15 April 2024

అభావము - ఆభావాతీతము

 

అభావము - ఆభావాతీతము

మనము భగవంతుడననేమియో, బహుకాలమునుండి యోచించు చుంటిమి. కొందరు భగవంతుదు లేడందురు. ఇది నాస్తికవాదన. భగవంతుడు లేడను వాదన. నేను భగవంతుదు లేడంటే, అది సరియైన దనే నాభావన. ఎందుకంటే దీనివెనుక సత్యతత్త్వము దాగున్నది. మనమెప్పుడు "లేదు" అంటామో, ఉన్నదన్నభావన దానివెనుకే వుంటుంది. అది సత్య తత్త్వభావనౌతుంది. ఒకవేళ "ఉన్నది" అంటే దానివెనుకే "లేదు’ అన్నభావన వుంటుంది. అటువంటప్పుడు లేదనేవారు సరియైన ఆలోచన లోనే వున్నట్లు సాధారణముగా నీవు నిర్ధారణకు వత్తువు. మనం లేదన గానే ఆఆలోచన నుండి అవతలకు దుమికి సత్యతత్త్వన్ని అందుకుంటాము. "లే" మరియు "దు" అను రెండక్షరములు కలిసి అభావాభిప్రాయానికి వత్తుము.లేదు లేక లేడు అన్నపదం ఉత్పన్నంచేసిన ప్రకంపనలతో మనం అభావమైపోతాము. అభావమైపోతే సత్యతత్త్వం మన ముందుంటుంది. అందులో యేవిధమైన స్థితివుండదు. లేడుఅన్న పదప్రకంపనలలో, మనం లీనమైనప్పటికి తత్సంబంధమైన చర్య యొక్క ప్రకంపనల ఆనుభూతి యేమాత్రముండదు. అది అభావస్థాయి యొక్క రెండవస్థితి. మూడవ స్థాయిని నేను వివరింప గలను. కానీ నావివరణ యెంత స్పష్టముగా నున్నను, జనులు దూరముగా పారిపోవుదురు. కనుక చర్చించ దలచుకోలేదు.

 అభావమై పోవుటెట్లు? నేటిగురువుల వలెనేను నాలుగడుగులు ముందుకేసినట్లైన మీకుబాగా అర్థమై యుండెడిది. నేటిగురువులు దీక్షనిచ్చేసమయంలో వారుకొన్ని పాత్రలు వస్త్రములు అధమంలో అధమం ఒకరూపాయి దక్షిణైనా సమర్పించమంటారు. చదువుకున్నవారు యీ కారణంగ ఆగురువులను తిరస్కరిస్తారు. మీకున్నదంతా నాకిచ్చేయండి అని నేనడిగితే, నన్నుమాత్రమెందుకు తిరస్కరించరు? జనులునన్ను గజదొం గ యని అనుకోకుండ వుండగలరా? నన్నునేను సమర్థించుకొనుటకు, నాఆలోచనను కొద్దిగా మార్చుకొని కొన్నిసార్లు "మీరందరు కలసి నన్ను దోచుకపొండి"అంటాను. ఇచ్చిపుచ్చుకోవడం దీపిడీ కాదగదా? నేను మీకున్నది దోచేసి, నావద్ద కలదంతయు అదేవిధంగా మీరూ దోచుకపొండి అనినేనంటే, నామీద నమ్మకం గలవారు యేవిధమైన అడ్డంకి చెప్పరను కుంటాను. ఇప్పుడు కొంత ముందుకెళితే తెలుస్తుంది. నేనుమీకున్నది దోచేసి దానికి బదులుగా మీరునన్ను దోచుకోండి అనడంవల్ల, నష్టానికి యెవరొప్పుకుంటారు? బహుశా యిందులో మీరే నష్టపొతారు. ఎందు కంటె, నేనిప్పటికే మాగురువర్యులచే దోచేయబడ్డాను. అటువంటప్పుడు మీరెవరిని దోచుకున్నారు? అనినన్నడగవచ్చు. ఇప్పటికే మీకర్థమయిందను కుంటాను. మీరునన్ను దోచుకుంటే మీరు చాలామందివ్యక్తుల (నేను దోచుకున్న అనేకుల) సంపదకు అధిపతులౌతారు. కానీ నేను తొలి పందెంలోనే ఓడిపోయాను. దోచుకున్నదంతా నన్నుగెలిచిన ఆయన (దైవాని) దైపోయింది. అటువంటప్పుడు యీ యిచ్చిపుచ్చుకోవడంలో మీకు లభించేదేముంటుంది, శూన్యం,సున్నా.

 జీవులందరికి "పూజ" జీవితంలో ఒకభాగం. అంతేగాదు, అది వారివిధి. వారు ఆస్థాయి దాటి, అటువంటిదే మరొక విధి (కర్తవ్యం) నిర్వహింపవలసి వస్తే, అంటే మరోమాటలోచెప్పాలంటే, సాధారణంగ ప్రకృతి యేదోఒక పనిలో జీవులను (మనుషులను) నిమగ్నంచేస్తుంది. ప్రపంచం తగుస్థాయికి చేరుకున్నట్లైతే, ప్రకృతి నిస్తేజ మౌతుంది. ఆత్మచలనము వలన చైతన్యము నిత్యమై సంరక్షింపబడుతూ సమత కొనసాగింపబడుతుంది. మనిషి ప్రకృతివలెనే, ప్రకృతితోపాటే నిస్తేజమైతే, అప్పుడతడు జనులకొఱకు చైతన్యాన్ని ఉత్పన్నంచేస్తాడు. అతడు ప్రకృతి యొక్క యంత్రమై పనిచేస్తాడు. ప్రకృతిలో అతడు, తగుస్థానంలో యిమిడిపోతాడు. ప్రకృతిశక్తి కొంతవరకు యిట్టి యంత్రములపై (ప్రకృతి కార్య నివాహకులపై) పనిచేస్తుంది, ఆశక్తి, వ్యక్తి సంపాదించిన స్థాయి కనుగుణంగా వుంటుంది. ఆస్థాయి అతని కెక్కడనుండి సంప్రాప్తమైనది, యెలా ఉత్పన్నమైనది? ఈస్థాయి అతని సక్రమ కార్యనిర్వహణకనుగుణంగా లభిస్తుంది. అతని అలవాట్లలోని మితత్వము (సమన్వయము) వలన కలుగుతుంది. మళ్ళీయిది ప్రకృతి నియమముల సక్రమానుసరణవల్ల కొనసాగుతుంది. ఎవరైతే ప్రకృతి నియమాలను చక్కగా పాటిస్తారో, వారికి ప్రబలమైన సహాయ మందుతుంది. ఈప్రకృతినియమాలు యెచట యేర్పడతాయో ఆ హద్దు వరకు చేరిన తర్వాత కేంద్రమునుండి తగినంత సహాయం అందుతుంది. ప్రకృతినియమాలను చక్కగా అనుసరించితేనే, అతడు ధర్మబద్ధంగా యేర్పరుపబడియున్న ఒకరేఖ  ఆధారంగా కాస్తా అటూయిటూ పైకిక్రిందికి అతడు కదులుతూవుంటాడు.   

 కనుక మనమందరం ప్రకృతికి సమాంతరంగా పయనించవలసి వుంటుంది. తద్వార ప్రకృతిసహాయం పొందగలుగుదుము. లేదా పురోగతి కొఱకు మనం అనుసరిస్తున్న మార్గంలో ప్రకృతి సహాయం పొందియున్న మహ నీయుని సహాయం పొందవలసి యున్నది.

   నీవు తెలియజేసినదాన్నిబట్టి గమనిస్తే, నీవునా యెడబాటును సహించలేక పోతున్నట్లు తెలియుచున్నది. బహుశా నీవునా శరీరానికిమాత్రమే దూర మయ్యావు. నీ అంతర్గతంగా లోలోతులకువెళ్ళి గమనిస్తే అంతటా నేనే కనబడతాను. కాస్త ఆలోచిస్తే నీహృదయమందే నన్ను నీవు దర్శింపగలవు. ఇప్పటి నీజీవితంలో సరైన జీవనవిధాననికి కట్టుబడితేచాలు నీవిపరీత స్వప్రాంతచింత వదలిపోతుంది. అలాకాకపోతే, నేను సదా నీవెంటనున్నా నన్న తలంపుతో నీవు కొనసాగితే, చాలావరకు నీసమస్య తొలగిపోతుంది. నేను దక్షిణ భారతానికి పయనమై వెళ్ళినరోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. అప్పుడు మాగురువర్యులు యెల్లవేళలా నాతో మాట్లాడుతున్న నాసహచరుల వలె నాలోనే వున్నాడన్న తలంపుతో వుండిపోయాను. ఆయన బాహ్య రూపాన్ని చూడలేకపోయినా నేనొక అంధునివలె నున్నాననిపించింది. అంధుడు తనసహచరుని రూపంచూడలేడుగాని, అతడు తన సహచరునితో పరస్పరం మాట్లాడుకుంటూ సమయం గడపగలడు. నీవు పరిపూర్ణస్థాయికి యింకనూ చేరలేదు గనుక కనీసం నేను నీదగ్గరేవున్నానన్న భావనతోనైనా వుండు. భగవంతుడు నీకనుకూలుడై యుండుగాక! నీకు ఆధ్యాత్మిక పురోగతి కలుగజేసి, ప్రస్తుతం నేనున్న స్థితినిసైతం అధిగమించి మున్ముందుకునీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుగాక.

 (శ్రీరాంచంద్రజీ వారు ఒక అభ్యాసికి వ్రాసిన లేఖయొక్క సారాంశమిది. డా:శ్రీవాత్సవగారి "డివైన్ మెసేజెస్" అను పుస్తకమునుండి గ్రహింప బడినది)  

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...