Thursday, 18 April 2024

దేహత్యాగానంతర ఆధ్యాత్మికశిక్షణ

 

దేహత్యాగానంతర ఆధ్యాత్మికశిక్షణ

 ప్రతియొక్కరు విహారయాత్రలో ప్రకృతిఅందాలను చూడటానికి యిష్టపడ తారు. అందులోనూ వసంతఋతు శోభ, పూదోటలు చూచి ఆనందిస్తారు. శాంతస్వభావులు అలాచూస్తూ ప్రశాంతంగా ప్రకృతిలో తిరిగివస్తారు. చపలచిత్తంగలవారు సంగీతవద్యాలను జోరుగావాయించి వింటూ కాలంగడిపేసి విహారయత్ర ముగిసిం దనుకుంటారు. ప్రియుని (భగవంతుని) ద్యాసలో పూర్తిగా మునిగిపోయినవారు విహరయాత్రను మరోవిధంగ తిలకిస్తారు. ప్రేయసికి యీ అరుపులు గందరగోళముతో పనేముంటుంది? ప్రియుని (భగవంతుని) స్థానంనుండి తీసుకొనిరాబడిన చిరుగాలితెమ్మెరలే అతనికానందదాయకమౌతాయి. వారి మజిలీ మనవినోదం ముగిసి ఆ వినోదపుమోహాన్నధిగమించిన తర్వాతే వస్తుంది.

 ఒక కుటుంబపెద్ద జబ్బుపడితే, అతనిధ్యాస పిల్లలబాగోగులపై యెక్కువగా వుంటుంది. అందుకుకారణం బహుశా అతనిజబ్బుయొక్క బాధ, ఆజబ్బు వలన కలిగిన దిగులు కావచ్చును. ఇతరఆలోచనలు అతన్ని బాధించక పొవచ్చును. ఇకపోతే తనచుట్టూ సన్నిహితంగ తిరుగుచున్న, తనబిడ్డలతో బంధమేర్పడి యుండవచ్చును. బిడ్డలు తనయెదుటనే కనబడుతున్నందున వారియెడ మరింత మమకారం కలిగియుండవచ్చును. ఇదే మరణ సమయమున మనిషికి బంధనమైపోవును. అత్యాశ (ధనంపై) అత్యంత హేయమైనది. అది పాపాలన్నింటికి తల్లివంటిదని నాభావన. ఆవ్యామోహం చాలాగట్టిబంధనమునకు దారితీయుచున్నది. నేను చెప్పదలచుకున్న దేమంటే, బాధ (నొప్పి) పడుతున్న సమయంలో యేదో అత్యవసర ప్రత్యేక సందర్భములలోతప్ప మిగతా సమయములలో ఆధ్యాత్మికకార్యము సహజంగా జరుగదు. ఆధ్యాత్మికకుటుంబముపై యెక్కువగా దృష్టి మరలుతుంది. ఎందుచేతనంటే, నావిషయంలో నేను అభ్యాసుల ఆలోచన, స్మరణతో వెంటనే ప్రభావిత మౌతాను. సాధారణంగా నాఆధ్యాత్మిక కార్యనిర్వహణలో నాసంబంధీకుల స్వరం సరిగ్గావినబడదు. అటువంటప్పుడు నేనే స్వప్రయత్నంతో వారిని జ్ఞాపకంచేసుకుంటూ వుంటాను. దీనర్థమేమంటే, నాజబ్బువల్ల సోదరీసోదరులంతా మేలు పొందుతారు. అయినప్పటికీ జనులు మాత్రం నేను ఆరోగ్యంగా వుండాలనీ, శారీరకబాధలేవీ లేకుండా వుండాలనీ ఆశిస్తారు. నేను అనారోగ్యంతో బాధపడుటవల్ల వారి ఆధ్యాత్మికప్రగతి వేగవమ్తమౌతుందని పాపమాదీనజనులకు తెలియదు.     

               నాబాధ యిబ్బంది వలన, నాసహచరులుపొందే, యీ ప్రయొజనమేగాకుండా నేనుయీ భౌతికదేహం వదలివెళ్ళుటవల్ల కలిగే ప్రయోజనం మరింత మిక్కుటంగా వుంటుంది. అంతేగాక దేహత్యగం చేసినవారికి సహితం యిది ప్రయోజనకరమే. శరీరం వదలిన తర్వాతనే నిజానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఎందుకంటే, శరీరంతోవున్నప్పుడు వుండే కొన్నిఆటంకాలు శరీరంతోపాటే తొలగిపోయి యే హద్దులూలేకుండా కార్యనిర్వహణ సాగిపోతుంది.

 కబీరుమహనీయుడు యిలా ప్రకటించాడు. "ప్రపంచం మరణభయంతో వ్యధజెందుచున్నది. కానీ నాకుమాత్రం అది ఆహ్లాదదాయకం. నేను మరణించటంతో నాకు బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది"

 మనసంస్థకు గల ప్రత్యేకసదుపాయమేమంటే , సశరీరియైయున్నప్పుడు కూడా సంపూర్ణ ప్రయోజనం కలిగించుటే. ఇది మనగురువర్యుల అపూర్వ ఆవిష్కరణ. అయినప్పటికీ అంతటిమహోన్నతస్థాయి నందుకొన్న వారిపై ప్రాణాహుతిప్రసార సమయములో కొంతవరకు హద్దులు విధించబడ్డాయి. అందువల్ల దైవీయశక్తి ప్రసారము సంపూర్ణస్థాయిలో అభ్యసిలోనికి దూసుకొనిపోయి అతనినరములు విచ్ఛిన్నముగాకుండా కాపాడు కోవటం జరుగుతుంది. అట్టిమహోన్నతాస్థాయి నాకనుగ్రహింపబడినప్పుడు, నానుండి ప్రవహించు ప్రాణాహుతిని అభ్యాసులు అరనిముషముకూడా భరింపజాలరు. నాపైగల సౌజన్యమువలన లాలాజీవారు నాకలాంటి హద్దులేవీ విధించలేదు. అయితే నేను ఆస్థితిలో యెవరికీ శిక్షణనిచ్చుటకు వీలుపడలేదు. అప్పు డాయనను ప్రార్థించాను. ఆయన కొన్ని హద్దులేర్పరచి, ఆహద్దులనుసైతం నేనుకోరితే తొలగించ బడతా యన్నారు. అలాఆయన విధించిన హద్దులను తొలగించమని కోరే అవసరం నాకెప్పుడూ కలుగలేదు.

 శరీరంవీడినతర్వత గురువునుండి దీక్షపొందిన శిష్యులు తండ్రిఆస్తిని బిడ్డలు పొందినట్లు వారివారి వాటాను వారు పొందుతారు. అంతే గాకుండా, ప్రేమాతిశయంతో గురువులో లీనమైయున్నవారు అందుకు తగినట్లు యెక్కువవాటా పొందుతారు. గురువు శరీరంవదలిన తర్వాత కూడా యేశిష్యులైతే ధారతెగిపోకుండా తమఆలోచనలో గురువును నిలుపుకొనివుంటారో, వారు గురువునుండి ప్రయోజనం పొందుతూనే వుంటారు. లీనమైపోవడం, అనేకప్రయోజనాలను సమకూరుస్తుంది. అందుకు కారణం, అతని అహం పూర్తిగా నిర్మూలింపబడి వుంటుంది. అతడాశించిందే (దైవమే) అతనిలో విరాజమనమై వుంటుంది. అభ్యాసి తను యెంతగా గురువులో లీనమైయుంటాడో, అంతగా అతడు ప్రయోజనం పొందుతాడు. అందుకేనేను ప్రతియొక్కరినీ లీనమవ్వమని పదేపదే ప్రోత్సహిస్తూవుంటాను. కానీ జనులు మాకు తిరుబడిలేదని చెబుతూ, ఆవైపునకే తిరుగలేకున్నారు. ప్రతియొక్కరూ నేనే నాశక్తితో వారిపనులన్నీ చేసిపెట్టాలంటారు. కానీ వాస్తవంచెప్పాలంటే, అది అభ్యసి కర్తవ్యము. లినమవ్వడమటుంచి, వారికోసం యెంతోకొంత చేస్తూనేవుంటాను. మొగమాటంతో త్రోసిపుచ్చలేక కూడ కొంతచేయవలసి వస్తున్నది. మొత్తంమీద గమనిస్తే, వారిలో పనికిమాలిన ఆలోచనలు వారిచుట్టూ పేర్చుకొని వున్నట్లు నేను కనుగొన్నాను. నేను వారిని శుభ్రపరుస్తూవుంటే, వారు తిరిగీ మలినాలను రుద్దుకుంటూవుంటే, నాశ్రమకు ఫలితమే మున్నది? వారు వారి క్రమమైనసాధనతో ముందుకుసాగుతూవుంటే నేను ప్రసాదించే వెలుగును అడ్డుకునే అవాంఛనీయ మబ్బునైనను కనీసం వారు తొలగించుకుంటారు.

 శిక్షకుడు శరీరం వదలినతర్వాత శిష్యునకుకలుగు ప్రయోజనం మరొక టున్నది. అదేమంటే, శిష్యుడు స్వచ్ఛమైన దైవీయప్రసారన్ని పొందుతాడు. శిక్షకుడుసైతం అటువంటి స్వచ్ఛమైన దైవీయప్రసారం చేస్తున్నట్లు శరీరం విడచిన తర్వాతనే గమనించగలడు. ఈవిషయంలో ఒకటిరెండు అంశాలు ఇంకనూ చెప్పవలసినవున్నవి, గానీ అవి మాటల కందని అంశములు. నేను నాకథనే చెబుతాను వినండి. మా గురువర్యులు శరీరంవదలినతర్వాత యిప్పుడు నేనున్న స్థితికి తీసుకొని వచ్చుటకు 12 సంవత్సరముల దీర్ఘ కాలము పట్టినది. అప్పటికీ ఆయన సందేశమిస్తూ, నేను యింకనూ కొంత సమయం తీసుకుందా మనుకున్నాను. కానీ యింకఆలస్యం చేస్తే, నీవు యెవ్వరికీ శిక్షణయివ్వలేని దశకు చేరుకుంటావని తెలిసి తొందరపడవలసి వచ్చిందన్నారు. నాకు తెలిసినంత వరకూ చెబుతున్నాను. అసలువిషయమే  మంటే, నేను శూన్యానికే శూన్యమైన స్థితిలోనికి పోవడం అప్పుడు ప్రారంభ మైంది. అందువల్ల నేను అనుభవరీత్యా శూన్యమైపొతున్నాను. ఇకనేను ఆస్థితిదాటి అవతలిస్థితిలోనికి ప్రవేశిస్తే, శూన్యానికేశూన్యస్థితినిసైతం మరచిపోయేట్లై, భౌతికశరీరంలోని ప్రాణంజారిపోయేది (ప్రాణం పోయేది).

 నాఅనారోగ్యము మరియు దేహత్యగమువల్ల నాసహచరులకు కలిగే ప్రయోజనం మరొకటున్నది. అదికుడా చెప్పేస్తే యీ విషయం పూర్తవు తుంది .

 ఒకగురువు యీ ప్రపంచం విడచి వెళ్ళిన 150 సంవత్సరములకు తన ఉత్తరాధికారిని నియమించినట్లు నేను కనుగొన్నాను (మైనే దేఖా కి ఎక్ గురు నే అపనీ దునియాసే జానేకె డేడ్‍సౌవర్ష్ బాద్ అపనే ప్రతినిధి కాయం కియా)

 నా అనారోగ్యము మరియు దేహత్యాగానంతరము నాసహచరులకు కలుగు అనేక ప్రయోజనములతోపాటు మరొకటికూడా చెప్పదలచు కున్నాను. శిక్షకుడు మహోన్నతశక్తిమంతుడైనప్పుడు, అతని ఉత్తరాధి కారుని నియమించవలసి యున్నది. అయితే తన భౌతికదేహత్యాగ సమయానికి తనశిష్యులలో తగినవాడొక్కడూ లేనట్లైన, అతడువేచి యుండక తప్పదు. గురువు తను యీప్రపంచము విడచివెళ్ళిన తరువాతనే తన ఉత్తరధికారిని నియమించిన సంఘటనలూ నేను గమనించాను. వివేకానందస్వామి వారి మహాసమాధి తరువాత తనప్రతినిధిని నియమించడానికి చాలాకాలమే పట్టింది. తను తగినవాడకున్న వ్యక్తి తనసంస్థలో దొరకనప్పుడు, మరోసంస్థతో సంబంధమేర్పరచుకొని అక్కడనుండి తనప్రతినిధినెన్నుకోవలసి వచ్చింది. వాస్తవానికి నియమింపబడ్డ ప్రతినిధి, గురువు (నిజమైన గురువు) జీవితములో సంపాదించిన శక్తినంతటినీ గ్రహించగలిగిన సమర్థుడైయుండాలి. ఒకవేళ అట్టివాడు సమయానికి లభించని పక్షంలో గురువు ఆశక్తినంతటిని ఒకచోట భద్రపరచివుంచుతాడు. ఇప్పుడు దీనర్థమేమంటే, శిష్యులు తమగురువు జీవించివుండగనే, సమర్థులై వుంటే వారిలో ఒకరిని గురువు తనప్రతినిధిగా యెన్నుకుంటారు. నావిషయానికొస్తే నేను నాదినచర్య పుస్తకంలో, నన్నుగురించి వ్రాసిపెట్టాను. లాలాజీవారు మహాసమాధియైన తరువాత ఒకేసారి నా బాహ్యాంతరాలలో సంపూర్ణశక్తి నిండిపోతున్నట్లు అనుభూతిచెందాను. అదినాకు బదిలీచేయబడిన శక్తియని గ్రహించాను. ఆతర్వాతనే మాగురువర్యుల దేహత్యాగవార్త నాకందింది. ఆశక్తిని నేను భరించడంలో నా నాడీమండలవ్యవస్ఠ చెదిరిపోయింది. తీవ్రమైన అనారోగ్యంతరువాత నానరములన్నీ సర్దుకొని కొంత శాంతించిన తరువాత ఆశక్తి నాలోయిమిడిపోయింది. ఆయన సంపాదించినశక్తి మొత్తం నాలోవున్నది. నేనేదైతో సంపాదించానో అదికూడా నాలోవున్నది. మాగురువర్యులనుండి గ్రహించినదానికి నేనెటువంటి చేర్పులు తీసివేతలు చేయలేదు. ఇప్పుడు నాతదనంతరం యిదంతా మరోచోటికి బదిలీ చేయ వలసి యున్నది. ఈపనిచేయుటకు నేనెంతో ఆతృతతోవు న్నాను.  అయితే ఒక్క అభ్యాసికూడా సంపూర్ణముగా యీశక్తిని భరించగల స్థితిలోలేడు. కారణం వారు ఆస్థితివరకు వచ్చుటకు ప్రయత్నమే చేయుటలేదు. బహుశా నేనుకూడా సంవత్సరములతరబడి యోగ్యునికొఱకు నిరీక్షించవలసి యుండునేమో!

 గురువు సంపాదించినదంతయూ, అతని ప్రతినిధిలోనికి ప్రవేసించును. అతనిద్వార దీక్షగైకొన్న అభ్యాసు లందరికీ వారివారివాటా వారికి సంప్రాప్త మౌతుంది. ప్రతినిధి శక్తియొక్క నిలువ స్థానం (నిధి) అయివుంటూ, తన గురువుతో తప్పనిసరిగా అనుబంధం కలిగియుంటాడు. ఆవిధంగా అత్యవసరమై గురువుగారితో అనుబంధింపబడియుండి, గురువుగారి ఆజ్ఞలను పాటిస్తూ, గురుకార్యమును నిర్వర్తిస్తూ వుంటాడు. ఇతరులు కూడా గురువుగారిఆజ్ఞలను పాటిస్తూవుంటారు. ఇతరశిష్యులు తగినంత అభివృద్ధి సాధించినట్లైన, వారుకూడా గురువునుండి సూచనలు పొందుతూ వుంటారు. ప్రతినిధిసాధించిన స్థాయిని యితరసహచరులుసైతం అందు కుంటారు. ఉన్నతేడాఅంతా, ప్రతినిధి గురువర్యులశక్తికి కేంద్రమై యుండి, గురువర్యులే ప్రతినిధిలో ఐక్యమై వుంటారు.             

   గురువర్యుల భౌతికశరీరం వీడినతర్వాత కలుగు ప్రయోజనాలు తెలియ జేసితిని. గురుపదవిని గురించి ప్రజలేమనుకుంటున్నారు యెలాఅర్థంచేసు కుంటున్నారో దేవుడెరుగు. నిజమైన గురువుయొక్క ఉనికి మైనపు వొత్తివలె దహించుకపోతూ, అందరికి వెలుగునిచ్చుట వంటిది. వెలుగువల్ల ప్రయోజనంపొందేవారు వారి స్వప్రయోజనమే చూసుకుంటారు. ఎక్కడ యెప్పుడు యెవరు ఆవెలుగుకాధారమై కాలుతున్న వత్తియొక్క సంరక్షణా బాధ్యత నిర్ణయిస్తారు. నావిషయంలో నిర్ణయం, నేను మొదటిసారి మా గురువును కలవకమునుపే తీసుకొనబడింది. యీవిషయానికి సంబందించిన జ్ఞానం బయల్పడనీ బయల్పడకపోనీ, ఎప్పుడు యెవరికి యీబాధ్యత అప్పజెప్పబడిందో ఆభగవంతునకెరుక. ఆధ్యాత్మికరంగ సాంప్రదాయం యిలాగే వుంటుంది. తనుదహించుకపోతూ, వెలుగులు విరజిమ్మడంగాక ఆదీపానికి వేరేపనేముంటుంది? ఆరిపోయిన మంటలో పడి ఆత్మాహుతిచేసుకోగల శలభమువంటివారు చాలా చాలా అరుదుగా వుంటారు. నావిషయానికొస్తే, నేను మాగురువు దయతో చూపిన మార్గంలో పయనించుచున్నప్పుడు, ఆధారపడటానికి ఆయనొక్కరే నాకు కనిపించారు. ఆతర్వాత జనులు రావడంమొదలై యాత్ర మున్ముందుకు సాగిపోయింది.

 లాలాజీ వాత్సల్యానికి అవధులేలేవు. ఆయన చాలాముందుగానే నా ప్రతినిధిని నియమించారు. లాలాజీ చేపట్టిన కార్యములన్నింటిలో నాకు పూర్తిస్వాతంత్ర్యమున్నా, యిప్పటివరకు నాప్రతినిధి (ఉత్తరధికారి) యెవరో నాకు లియదు. నాఉత్తరాధికారి యొక్క ఉత్తరాధికారిని నన్ను తయారు చేయమని సెలవిచ్చారు. లాలాజీవంటి సాటిలేని గురువు లభించడం యెవరి కైనా అది అదృష్టమే. నేనందుకే ఆయనంతటి మహోన్నత శిక్షకులు గా తయారవ్వాలని పదేపదే చెబుతుంటాను. ఈవిషయంలో నన్ను ఉదాహరణగా గైకొనడం మీకు అత్యంత ఉపయోగకరంగా వుంటుంది.

 (ఇది ప్రచురించని బాబూజీ ఉత్తరాలనుండి గ్రహించి ఆంగ్లంలో డా:సూర్యప్రసాద్ శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకములో ముద్రించబడినది)     

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...