Showing posts with label శ్రీరామచంద్రజీ ప్రత్యుత్తరములు. Show all posts
Showing posts with label శ్రీరామచంద్రజీ ప్రత్యుత్తరములు. Show all posts

Wednesday, 14 October 2020

శ్రీరామచంద్రజీ ప్రత్యుత్తరములు

శ్రీరామచంద్రజీ ప్రత్యుత్తరములు

 (దేశవిదేశములలో ప్రజలడిగిన ప్రశ్నలకు శ్రీరామచంద్రజీ వారిచ్చిన జవాబులు)

 

సంకలనము - అనువాదం

పి.సుబ్బరాయుడు

బి.రమేష్ బాబు

కడప.

 

ప్రచురణ

శ్రీరామచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్ట్ ®

3/1289-1; కో-ఆపరేటివ్ కాలనీ, కడప – 516001.


 

పుస్తకములో వాడిన పొడి అక్షరముల వివరణ.

 

ఐ.డబ్ల్యు             : ఇండియా ఇన్ ది వెస్ట్

జి.హెచ్.             : గార్డెన్ ఆఫ్ హార్ట్స్

బి.ఇ.                 : బ్లూసమ్స్ ఇన్ ది ఈస్ట్

ఎస్.ఎమ్.ఇ       : సహజమార్గ్ ఇన్ యూరోప్

ఎల్.ఐ.డి.సి.      : లైట్ ఇన్ ది డార్క్ కాంటినెంట్

టి అండ్ ఎల్      : టియర్స్ అండ్ లాఫ్‌టర్

టి.ఎస్.ఆర్         : దస్ స్పేక్ శ్రీరాంచంద్రాజీ

 

ముందుమాట

 

        మహాత్మాశ్రీరామచంద్రజీమహరాజ్, షాజహాన్‌పూర్ వారు దేశ విదేశాల లోను,  షాజహాన్‌పూర్‌లోను అనేకమంది అభ్యాసులు, పాత్రికేయులు మరియు యితరులు అడిగిన ప్రశ్నలకు వారు చెప్పిన జవాబులు ఈ “శ్రీరామచంద్రజీ ప్రత్యుత్తరములు” అను పుస్తక రూపమున వెలువరించడమైనది.  ఈ ప్రశ్న, జవాబులన్నీ, సహజమార్గ పత్రికలు, ప్రత్యేక సంచికలు, శ్రీ బాబూజీ విదేశీపర్యటన చేసినపుడు విడుదలచేసిన పుస్తకముల నుండి గ్రహించడమైనది.

       

        ఈ మా ప్రయత్నంలో సహాయ సహకారములు సలహాలనిచ్చి ప్రోత్సహించిన శ్రీ టి.వి.శ్రీనివాసరావ్, ఛేర్‌మన్ గారికి మా నమఃసుమాంజలులు.

 

        ఈ ప్రశ్నోత్తరాలు సహజమార్గసాధకుల ప్రగతికి తోడ్పడగలవను ఉద్దేశ్యముతో పుస్తక రూపమున తెచ్చితిమి.  ఏ ఒక్కరికి ఉపయోగపడినా మా ప్రయత్నము నెరవేరినట్లే భావింతుము.  -నమస్తే

 

సంకలనము మరియు తెలుగుసేత: పి.సుబ్బరాయుడు & బి.రమేష్ బాబు.

కడప

ఏప్రిల్ ౩౦, 2015.

 ఒకసారి బాబూజీ మాట్లాడుతూ "ఈ విశ్వంలో ‘నాది’ అనదగ్గదేదియూ లేదు.  నా ఇల్లు, నా భర్త, నా బిడ్డలు ఏవీ శాశ్వతం కావు.  వాటిని కోల్పోయే సమయం ఎప్పుడైనా రావచ్చు.  కనుక ‘నాది’ అనదగ్గది ఒక్కటే, అదే నా గురువర్యులు" అన్నారు.  ఆయన ముఖంలో ఒక మందహాసం, ఒక అరనవ్వు కనిపించి వెనువెంటనే చిరునవ్వు చిందుస్తూ "ఇంకొంత యోచిస్తే ఆ గురువు సైతం ఓ భ్రమే" అన్నారు.  గురువుగారు భౌతికశరీరం ఏదో ఒకనాడు విడువవలసిందే కదా! అని ఆయన అలా అనివుంటారని నేను భావించాను.  కానీ గురువర్యుల మూలసత్తా, ఆ దివ్యశక్తి మాత్రం నిత్యసత్యమే.-శ్రీమతి ల్యూసీ స్చూబర్-డల్లాటోరే -అమెరికా (టిఅండ్‌ఎల్ - 1౦)

 

       మానసికంగా కృంగిపోవడం కేవలం కాలం వృధా చేయడమే.  ధ్యానం పొందడమైతే, కృంగిపోవడం నష్టపోవడమే. (టి అండ్ ఎల్ - 69)

 

 

       


 విషయసూచిక           

     ముందుమాట                                

 1. భగవంతుడు                                   

 2. ఆలోచనలు                                   

 3. సహజమార్గము                               

 4. అద్భుతములు - మహిమలు                   

 5. మంత్రములు                                  

 6. సహజమార్గ విధానము                         

 7. గురువు - ప్రశిక్షకులు                          

 8. ఇతరదేశములలో బాబూజీ                      

 9. ధ్యానము                                      

1౦. నిరంతరస్మరణ                                 

11. శ్రద్ధ                                           

12. ప్రాణాహుతి                                    

13. అహంకారము                                  

14. ప్రత్యేకావతారమూర్తి - అవతారాలు              

15. మానవజీవితం                                  

16. గురుశిష్యుల అనుబంధం                        

17. ప్రేమ                                          

18. భక్తి - ఆత్మార్పణ                              

19. బాబూజీ - లాలాజీ                             

2౦. ఇతరములు                                   

    అనుబంధం                                    

 

మహాత్మా శ్రీరామచంద్రజీ మహరాజ్, షాజహాన్‌పూర్

 

1. భగవంతుడు

 

1. భగవంతుడనగా ఎవరు?

   తననుండి తానే ప్రకటితమైనవాడు (స్వయంభువు)

(బి.ఇ -65)

 

2. భగవంతుడు మనలో ఉన్నాడా?

   భగవంతుడు సమస్త వస్తువులలో ఉన్నాడు.  కానీ నిజమైన ప్రశ్న నీవు భగవంతునిలో ఉన్నావా? అని. (ఐ.డబ్ల్యు - 73)

 

3. భగవంతుని యేమని నిర్వచించాలి బాబూజీ?

   ప్రపంచములోని వర్ణములన్నీ తీసేస్తే మిగిలేదేమిటో, అదీ భగవంతుడు.  కోపములో నీవు భగవంతుని తిట్టవచ్చు. అది నీ చేతనైనంత నీవు చేయవచ్చు. (ఐ.డబ్ల్యు - 73)

 

4. అనేకములైన యిబ్బందులు, కష్టములుగల యీ ప్రపంచాన్ని భగవంతుడెందుకు సృష్టించాడు?

   ఒకవేళ కోట్లాది సంవత్సరాలు శక్తి నిరుపయోగంగా ఉండిపోతే, అది గడ్డకట్టుకపోయి తన్నుతాను కోల్పోతుంది.  ఆ విధంగా భగవంతుడే లేకుండా పోయేవాడు.  కనుక తన్ను తాను సజీవంగా ఉంచుకోవడం కోసం శక్తిని విడుదలచేశాడు.  దాని ఫలితమే యీసృష్టి.

(ఐ.డబ్ల్యు - 18౦)

 5. భగవంతుడు చాలా కౄరుడు. మనం కష్టాల్లో వుండటం చూస్తూ వున్నాడు.  మన కష్టాలను తీర్చడానికేమీ చేయడంలేదు కదా?

   కేంద్రపు క్రింది భాగం నుండి శక్తి దిగివచ్చింది.  తత్ఫలితమే యీసృష్టి.  ఎప్పుడైతే అది కేంద్రాన్ని వదలి బయట పడిందో అప్పుడే యిక్కడ వస్తు సముదాయం రూపుదాల్చడం మొదలయ్యింది.  మన వెంట తెచ్చుకొన్న మనస్సు నిర్మాణాన్ని మొదలుపెట్టి మనమిప్పుడున్న భౌతిక రూపమునకు తెచ్చినది.  మనం మన మనస్సును సక్రమంగా ఉపయోగించలేదు.  దాని ఫలితమే యీ కష్టాలు.  కనుక ఈ కష్టాలకు, బాధలకు మనమే బాధ్యులము.  అందుకే మనిషిలోని శక్తియుక్తులన్నీ సక్రమముగా ఉపయోగించుకోవడమే సాధుత్వమని నేనందుకే చెప్పితిని.  మనస్సు నుండి మంచి, చెడు ఆలోచనలు యెందుకు పుట్టుకొస్తున్నాయి?  ఎందుకంటే మనలోని శక్తి యేమీ చేయకుండా ఊరికే వుండజ్ఆలదు.  కేంద్రం నుండి జ్ఆలువారిన చినుకులు కొంతదూరము ప్రయాణించి పరిసరాల వల్ల మార్పునకు గురయైనవి.  దాని ఫలితమే మనస్సులోని కాసింత మాలిన్యము.  అయినా మనకు కేంద్రశక్తి నుండి సహాయము లభిస్తూనే వుంది.  శరీరంలో విషమున్నదంటే దాని ఫలితము జ్వరము రూపమున వ్యక్తమౌతుంది.  అలా యెందుకౌతుందంటే, మనలో వున్న సత్యవస్తువు అనవసరమైన దానిని బయటికి నెట్టివేస్తుంది.  నేనీ విషయాలన్నీ మీకు చెబుతున్నాను గానీ యివి యెంత వరకు సరైనవో నాకు తెలియదు.  నేను అ, , ఇ. ఈ లు లేని విశ్వవిద్యాలయములో మాత్రమే విద్య నభ్యసించితిని. (ఐ.డబ్ల్యు - 18౦)

 

6. సాక్షాత్కారమనగా యేమి?

   నీవేమిటో నీకు తెలుసు.  కానీ భగవంతుడంటే యేమోతెలియదు. అదెప్పుడు నీకు తెలుస్తుందో లేక భగవంతుడంటే యేమో నీలో నీకే అనుభవంలోనికొస్తే అదే సాక్షాత్కారము. (ఐ.డబ్ల్యు - 1౦2)

 

7. భావోద్వేగము భగవత్ సాక్షాత్కారానికి ఆటంకాన్ని సృష్టిస్తుందా?

   ఇది కూడా మత ప్రాధాన్యత గలిగినట్టి భావన. (జి.హెచ్ - 65)

 

8. భావోద్వేగములు యెప్పుడు వుండనే వున్నవి.  మేమేమి చేయాలి?

   అవి ఎక్కడున్నవి? మీ యింటిలోనా? మరెక్కడైనానా? నాకు అసలు భావోద్వేగమునకు అర్థమే తెలియదు.  కనుక నేను వాటిని గూర్చి యెలా మాట్లాడగలను.  అనుభవపూర్వకమైన భావనలు వాస్తవమైనవి.  భావోద్వేగములు అవాస్తవములు. (జి.హెచ్ - 66)

 

9. సత్యతత్త్వమనగా యేది?

   సత్యతత్త్వము ఆధారరహిత ఆధారము.

    (ఐ.డబ్ల్యు - 69)

 1౦. సంపూర్ణత అంటే యేది?

    సర్వశక్తులు ఉత్పన్నమైయున్నప్పటికి మొత్తము మీద మితస్వభావపుఅధికారము చెల్లుబాటులో వుండుట. (చెల్లియుండియు సైరణ చేయువాడు అనగా శక్తివంతుడై యుండి కూడా సహనము వహించుట) (జి.హెచ్ - 65)

 

11. అప్పుడేపుట్టిన బిడ్డ పరిపూర్ణుడా?

ఆబిడ్డ నిద్రావస్థలో నున్నది.  మీరిప్పుడద్దాని నేమంటారు.    

పరిపూర్ణుడంటారా?  అపరిపూర్ణుడంటారా? (జి.హెచ్ - 65)

 

12. గురువర్యా ఈ "నేను" (అహం) అంటే యేమిటో వివరించండి.  మహర్షుల భావనలో దీని అర్థమేమిటి? భగవంతుడంటే యిదేనా? (అహం బ్రహ్మస్మి అను మహావాక్యమును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న వేసివుండవచ్చును)

    ఇది భగవంతుడు కాదు.  భగవంతునికి భిన్నమైనదిది.  ఇందులో వ్యక్తిగతమైన భావమున్నది.  ఇది అహంకారము యొక్క ఫలితము. (జి.హెచ్ - 65)

 

13. భగవంతుడనిన సర్వమెఱింగిన జ్ఞానియా(ఇంటలెక్ట్)? లేక తెలుసుకోగల (ఇంటలిజెన్స్) సమర్థుడా?

     దైవమనిన తెలిసికొనగల మహోన్నత సమర్థత లేక శూన్యత్వము లేక సున్న.  నీ యోచనకే వదిలివేయ బడింది.  ఏదో ఒక అనుభూతి నీకే కలుగుతుంది. (ఎల్.ఐ.డి.సి - 52)

 14. భగవంతుడెవరు?

     నీకు తెలియనివాడు.  నీవు భగవంతుణ్ణి నిర్వచింపజూస్తే అది అప్పుడే ‘భగవంతుడు’ కాకుండా పోతుంది.  ఆయన యేమై యున్నాడో అదే అయియున్నాడు.  ఆయన యెలా వుండాలో యెల్లవేళల అట్లే వున్నాడు.  ఆయన యెక్కడున్నాడో అక్కడే వున్నాడు.  ఆయన తెలియబడని వాడు, కానీ ఉన్నాడు.    (ఎల్.ఐ.డి.సి - 52)

 

15. కనుక మనకు తెలిసిందేదీ భగవంతుడు కాదుగదా?

     అనువదించటానికది నీ కసాధ్యము, నాకది నచ్చింది.  ఈ విషయాలట్టే ప్రయోజనకారులు కావు.  కేవలమొక సక్రమ విధానమే ఫలప్రదమైనది.  భగవంతుడు భగవంతుడే.  ఆయన యేమై యుండవలెనో అదే అయివున్నాడు. (ఎల్.ఐ.డి.సి - 52)

 

16. కనుక మాటలకర్థం లేదన్న మాట?

     మాటల కర్థమున్నది.  కాని అది దాని పరిథిలోనే యున్నది.  ఒకానొక భారతీయ తత్త్వవేత్త వచించినట్లు, నా వ్రాతలు, నా ఆలోచనలన్నీ కూడా విప్లవాత్మకమైనవి. (ఎల్.ఐ.డి.సి - 52)

 

17. భగవంతుడు "యేమైయుండాలో అదే అయివున్నాడు" అని అనవచ్చుగదా?

     మొత్తానికి మనం పరిపూర్ణ మానవులంగా ఉండాలనుకోవాలి.  అంతేగానీ పరిపూర్ణ దైవంగా ఉండాలని కాదు అనుకోవలసింది. (ఎల్.ఐ.డి.సి - 53)

 

18. వ్యక్తి అభ్యాసంలో లోతుకు వెళ్ళేకొద్దీ భగవంతునిపై ఆధారపడటం తగ్గుతూ గురువుపై ఆధారపడటం యెక్కువౌతూ వుంటుంది.  నిజమేనా?

     ఇది ఆ అభ్యాసి భగవంతుని సామీప్యమునకు వచ్చిన గుర్తు. (ఎల్.ఐ.డి.సి - 56)

 

19. ‘భగవంతుడా’ లేక ‘బయలా’ యేది ముందు?

     బయలు (ఆకాశం). (ఎల్.ఐ.డి.సి - 58)

 

2౦. అలా యెలా నిర్ధారించగలరు?

     బయలు లేకపోతే భగవంతుడెక్కడుండగలడు. (ఎల్.ఐ.డి.సి - 58)

 

21. భగవంతుని నిర్వచించడమెలా?

     అణోరనీయాం మహతో మహత్ - చిన్న వాటిల్లో అన్నిటికన్నా చిన్నది, పెద్ద వాటిల్లో అన్నిటికన్నా పెద్దదే భగవంతుడు. (ఎల్.ఐ.డి.సి - 6౦)

 

22. ఖుదా అంటే యేమి?  ఆయన్ను ఆ పేరుతో నిరంతరం జపిస్తే మంచిదేనా? (ఒక ఇస్లాం నమ్మకస్తుడైన న్యాయశాస్త్ర విద్యార్థి అడిగిన ప్రశ్న)

     ఖుదా’ అన్నది ఒక భావన.  దానర్థం తనకైతనే ప్రకటితమైన వాడు అని.  ‘ఖుద్’ అంటే తనకైతనే అని, ఇక ‘ఆ’ అంటే వచ్చుట అని (అప్‌నా ఆప్ ఆయా).  ‘ఖుద్’ అంటే తన ఆత్మను తానే పిలుచుట అని కూడా అనుకో వచ్చును. ‘ఖుద్’ అంటే తననే మరి ‘ఆ’ అంటే రమ్మని పిలవడం. (ఎల్.ఐ.డి.సి - 61)

 

23. మేము ఇస్లాంలో దైవము సృష్టింపబడలేదంటాము.  ఆయన ఒకడే.  ఆయన యెవరి వల్ల కలిగినవాడు కాడు.  ఆయన అట్లా కలిగింపబడడు అంటారు.  మీరేమంటారు?

     మీరు యెప్పుడు ఒకటే అంటారో రెండవదాని యొక్క భావన ఉండనే వుంటుంది.  మీరు ‘ఖుదా’ లేక దైవము లేక ఈశ్వరుని యొక్క యేకత్వాన్ని గురించి మాట్లాడవచ్చు.  కోట్ల పర్యాయములు ఈ ప్రశ్నలుత్పన్న మౌతుంటాయి కానీ వాటికి సమాధానం మాత్రం చెప్పబడలేదు.

(ఎల్.ఐ.డి.సి - 62)

 

24. శరీరం నుండి ఆత్మ బయటపడి స్వేచ్ఛను పొందగానే, అంటే మరణ సమయంలో భగవంతునితో ఐక్యం సాధించుట సాధ్యమేనా?

     ఇది నీవు చేస్తున్న నిర్ణయం.  భగవదైక్యం జీవిత కాలంలోనే సాధింప వీలౌతుంది.  నీవు యేకత్వం గురించి మాట్లాడేటప్పుడు ద్వందభావన ఉండనే వుంటుంది.  ఉండవలసింది యేకత్వం మాత్రమే.  ద్వందభావన పోయినప్పుడే అది సాధ్యం.  అదే అనంతత్త్వం యొక్క నిర్వచనం. (ఎల్.ఐ.డి.సి - 62)

 

25. చెడు అంటే తగని చోటుంచబడిన దైవమే గదా? 

     మనల్ని మనం మంచి చెడులన్న రెంటికి దూరంగా వుంచుకోవాలి.  దైవత్వం దిగి వస్తే దాని ప్రయోజనం అప్పుడు మీరు పొందుతారు. (ఎల్.ఐ.డి.సి - 67)

 

26. దైవత్వం యొక్క అవసరమేమిటి?

     దైవత్వం అవసరం.  సంపూర్ణంగా అవసరం.  గాంధీజీ దైవభావాన్ని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని తలంచారు.  అది సాధ్యం కాదు.  రెండు తత్త్వాలున్నాయి.  అవి మనస్సును వికసింప జేయడం మరియు సంరక్షించటం. (ఎల్.ఐ.డి.సి - 76)

 

27. మీరు భగవంతునిపై ఆధారపడడమొక్కటే చాలదన్నారు గదా?

     అవును ఆధారపడటము మరియు చక్కని నడవడి వుండాలి.  ఆధారపడడమనేది తప్పక ఉండవలసిన గుణం. (ఎల్.ఐ.డి.సి - 77)

 

28. అది సరిపోతుందా?

     యేదీ సరిపోయిందనలేము. (ఎల్.ఐ.డి.సి - 78)

 

29. ఇతరుల విషయాలపై మనం న్యాయ నిర్ణయం చేయరాదు గదా?

     అందరిలో భగవంతుణ్ణే చూడు.  సద్గుణ సంబంధమైన పనేదైనా సరే, అది సర్వదా మంచిదే. (ఎల్.ఐ.డి.సి - 79)

 

3౦. భగవంతుని విషయమై మనం ప్రకృతిసిద్ధంగా వుండాలి కదా?

     ఆయన (దైవ) మార్గములన్నిటి యందు వ్యక్తి ప్రకృతిసిద్ధంగానే వ్యవహరించాలి.

(ఎల్.ఐ.డి.సి - 79)

 

31. జ్ఞానరాహిత్యమే బంధనలేమి.  అవునా?

        జ్ఞానరాహిత్యమే (సంపూర్ణ అజ్ఞానము) భగవంతుడు.  అక్కడ సర్వం అణగారిన స్థితిలో ఉన్నది. (టి అండ్ ఎల్- 76)

 

32. భగవంతుని ఎలా స్మరణలో నిలుపుకోవాలి?

     ప్రయత్నించు.  ఆయన నిన్ను స్మరించేట్లు చేసుకో.

(బాబూజీ 8౦వ జన్మదిన ప్రత్యేకసంచిక, 1979 - 8౦)

 

33. ఈ విశ్వాన్ని మొత్తం రూపకల్పన చేసిన సర్వజ్ఞుడైన వాని దృక్పదంలో ప్రమాదం సంభవించడం యెలా సాధ్యం? దీన్నెలా వివరిస్తారు?

     మొదట మీరు మీ మనస్సులో భగవంతుని సర్వజ్ఞత్వాన్ని నమ్ముతున్నారా?  అలాగైతేనే మీరనే ప్రమాదం భగవంతుని యేర్పాటులోనిదే అయివుండాలి.  అలాకాక భగవంతునిపై నమ్మకం లేదంటే, కానీ లెమ్ము, అప్పుడు కూడా ప్రతిసంఘటనకు కారణమొకటుందని నమ్మాల్సిందే కదా! (కార్యాకారణ సూత్రం ప్రకారం) (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక, సూరత్ 1982 - 73)

 

34. భగవంతుడంటే?

     బరువులేని బరువు. (సహజమార్గ పత్రిక 11/82 -15)

 

2. ఆలోచనలు

 

1. పరిణత జెందిన ఆలోచన అంటే యేమిటి?

    ఒకే లక్ష్యము, ఒకే గురువు మరియు ఒకే విధానము కలిగి యుండుట. (జి.హెచ్ - 65)

 

2. మనస్సులో ఆలోచనలు యెలా ఉత్పన్నమౌతాయి?

    మనస్సులో ఆలోచనలే లేకపోతే అప్పుడు మనం సంపూర్ణ సమతాస్థితికి చేరితిమని అర్థం.  ఆ స్థితిలో దేహం విఛ్ఛిన్నమైపోతుంది.

    మన మనస్సు పెద్దమనస్సు లేక దివ్యమనస్సు నుండి ఉత్పన్నమైంది.  అందుచేతనే యిది యెంతగా చెడిపోయినా స్వచ్ఛత అందులో వుండనే వుంటుంది.  దీనికీ దివ్యమనస్సుకూ గల సంబంధమురీత్యా యెట్టి మాలిన్యమును దీనిపైకి వచ్చి చేరుటకు ఆ స్వచ్ఛత అంగీకరించదు.  ఈ విధంగా మాలిన్యములు నిరంతరాయంగా బయటికి త్రోసివేయబడుతూనే వుంటాయి.  ఈ విధంగా త్రోసివేయబడిన మాలిన్యములే ఆలోచనల రూపుధరిస్తాయి.  వాటినే మనం అనుభవంలో గమనిస్తున్నాము. (ఐ.డబ్ల్యు - 223)

 

3. ఆలోచనకు మనస్సులో సహజంగా ఉత్పన్నమైన భావన (సహజజ్ఞానము) కు తేడా యేమి?

    వృద్ధిచెందిన భావనాస్థితి ఆలోచన, ఆలోచన పరిమితుల నధిగమిస్తే అది సహజజ్ఞానమౌతుంది. (ఐ.డబ్ల్యు - 142)

 

4. ఆలోచనా రహిత స్థితిలో యేవైనా భావనలుంటాయా?

    అవును. అది ఒక పశువునకున్నటువంటి స్థితి వంటిది.  అది కేవలం శారీరక అవసరములకు మాత్రమే స్పందిస్తుంది.  అస్సలు ఆలోచనే లేకపోవటమన్నది అసంభవము.  ఆ స్థితిలో ప్రాణములు నిలువవు. మొత్తము మీద అవసరమైనది ఆలోచనా తీరులో మార్పు మాత్రమే.  ఒకసారి నా దగ్గరకొక వ్యక్తి వచ్చి నన్ను ఆలోచనా రహితుణ్ణి చెయ్యమని అడిగాడు.  నేనతనితో హాస్యాయుక్తులాడుతూ, చేస్తాను గానీ నాదొక షరతు అన్నాను.  చెప్పమన్నాడు.  ముందు నన్ను నీవు సంపూర్ణంగా ఆలోచనలతో నింపు తర్వాత నిన్ను ఆలోచనారహిత స్థితిలో వుంచుతానన్నాను. (జి.హెచ్ - 63)

 

5. భగవంతునికి సన్నిహితం కావడానికి బాధలవసరమా?

    కాదు. అవసరం కాదు.  అవి నాకు మాత్రమే.  మా గురువర్యులు విపరీతమైన నొప్పితో బాధపడెడివారు.  ఆయనకు కాలేయంలో పుండుపడి చాలా బాధపడేవారు. బాధ విపరీతంగా వున్నప్పుడు ఆయన పాటపాడుకునేవాడు.  ఎందుకలా? అని నేనాయన్నడిగాను.  మనిషికి చాలా బాధగా వుంటే ఉపశమనం కోసం మూలగాలి లేక అట్టిదేదో ఒక శబ్దం చెయ్యాలి.  అందుకే యిలా పాడి శబ్దం చేయవచ్చుగదా అనుకున్నానన్నాడు.  ఆయనోసారి నాతోచెబుతూ యీబాధను నేను ఒక్క క్షణంలో తీసివేసుకొన గలనన్నాడు. కాని ఆయన అలా చేయలేదు.  ఆయన ఆ బాధ భగవంతుడిచ్చినదిగా భావించెను. భగవంతుడా బాధ యెందులకిచ్చెనో యెవరికెఱుక? అందులకేదో కారణముండియే యుండునని ఆయన భావించెను.  ఆయన తన్ను తాను భగవదిచ్ఛకు సమర్పించుకున్న తీరు అటువంటిది. (ఐ.డబ్ల్యు - 198)

 

6. మతమంటే యేమిటి?

    అహేతుకమైన కొన్ని మూఢవిశ్వాసములు ఒక చోటకు చేరిస్తే అదే మతం. (జి.హెచ్ - 66)

 

7. మతానికి, ఆధ్యాత్మికతకు తేడా యేమి?

    అది పీటకు, దానికున్న నునుపుపూతకు ఉన్న తేడావంటిది. (జి.హెచ్ - 65)

 

8. తాత్త్విక విద్య యొక్క విలువ యెట్టిది?

    తత్త్వశాస్త్ర విద్య బాహ్యమైన ఆనందాన్నిస్తుంది.  కానీ నేను ఆంతరంగికమైన ఆనందాన్నిస్తాను.  నేను తాత్త్విక విషయాలు మాట్లాడి బాహ్యానందము కూడా యిస్తాను.  కనుక చూడండీ, నేను బాహ్య మరియు ఆంతరంగిక ఆనందాలను రెండూ ప్రసాదిస్తాను. (ఐ.డబ్ల్యు - 168)

 

9. ఆలోచనకు, అనుకోవడానికి (విష్) తేడా యేమి?

     అనుకోవడమనేది యెప్పుడూ అనుమానాస్పదమే. (ఎల్.ఐ.డి.సి - 41)

 

1౦. కలతలతో కూడిన ఆలోచనల నుండి యెలా బయట పడాలి?

     అలోచన యెప్పుడూ చిన్నదిగానే వుంటుంది.  నీవు యేదో ఆలోచనలో మునిగిపోతే అప్పుడు దాని బాధ్యత గురువు తీసుకొంటారు.  ఒకసారి నన్ను కోర్టులో ఒక విషయాన్ని వ్రాసుకరమ్మన్నారు.  నేను మరచిపోయాను.  కానీ నేను కలం చేతపట్టుకోగానే ఉన్నట్టుండి అది నాకు జ్ఞాపకానికొచ్చేసింది.  అది లీనమవ్వడం విషయమై ఒక ఉదాహరణ.  మీరు ఆలోచనారహిత స్థితిలో ఓ అరగంట ఊపిరి పీల్చకుండ వుండవచ్చును.  మా గురువుగారు ఒక గంటసేపు అలా శ్వాసించకుండా వుండగలనని నాతో చెప్పెను. (ఎల్.ఐ.డి.సి - 58)

 

11. నేను లాలాజీ లేక బాబూజీ చిత్రపటాలను చూచినపుడు నాకు సంభవింప నున్నటువంటి సుఖమో, కష్టమో, దుఃఖమో, సంతోషమో, అది యేదైతే అదే భావం వారి ముఖమండలాలపై కనబడుతుంది.  దీనికేమంటారు?

     ఆలోచన ఆత్మతో అనుసంధానమైతే అది యెప్పుడూ కూడా సరిగ్గానే వుంటుంది.

(ఎల్.ఐ.డి.సి - 64)

 

12. గురువర్యుల యోచన మనస్సులో వుంటే భ్రమకు సంబంధించిన ఆలోచనలు రావుగదా?

     ఆలోచన దైవంతో అనుసంధానమై వుండాలి.  ఆత్మ యొక్క యెఱుక, ఒక బిందువు వద్ద ఆలోచనకందుతుంది.  అప్పుడు నీవు సక్రమమైన ప్రయోజనాన్ని పొందుతావు. (ఎల్.ఐ.డి.సి - 64)

 

13. కనుక మనస్సు చాలా ముఖ్యమైన పరికరమన్నమాట?

     దర్శనాలు రెండు రకాలుగా వుంటాయి.  అవి ఊహాజనితమైనవి మరియు భగవదీయమైనవి.  రెండింటి యందును మనస్సు యొక్క పనితీరే కారణమౌతున్నది. (ఎల్.ఐ.డి.సి - 64)

 

14. భ్రమ అంటే యేమిటి?

     మన ఉనికియొక్క తప్పుడు అభిప్రాయమే భ్రమ.  ఆలోచనే మనల్ని వాస్తవమున దైవమును జేర్చు నిచ్చెన.  నీ మనస్సును ధ్యానం ద్వారా అభివృద్ధి చేసుకో.  వివేకం పెంపొందగానే భ్రమను తోసేస్తావు.  మనస్సు బ్రహ్మముతో కలిసినపుడు మూడవదిగా ఆత్మ ఉత్పన్నమౌతుంది.

(ఎల్.ఐ.డి.సి - 69)

 

15. నేను నిరుత్సాహంతో వున్నాను. అనేక పద్ధతులు, గురువులు ఉన్నారు.  వారంతా వారివారి విధానాలలోనికి లాక్కోవాలని చూస్తున్నారు.  వాళ్ళ బోధలు నాకు తెలియవు.  నేనెక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకోవాలో, యెవరిని యెన్నుకోవాలో తెలియడం లేదు.

     దైవమే నన్ను సక్రమ మార్గానికి ఆకర్షితుడనయేట్లు చేయుగాక, అని నీ మనస్సులో ఒక భావన నుత్పన్నం చేసుకో. (ఎల్.ఐ.డి.సి - 72)

 

16. కారణములేని కార్యమేదైనా (ఫలితంలేని పని ఏదైనా) వుంటుందా?

        కార్యకారణ సంబంధం ఎక్కడైనా వుండాల్సిందే.  అయితే కార్యం జరగడానికి అవకాశం (చోటు) వుండాలి, కనుక ఫలించడానికి చోటులేని పక్షంలో కారణమునకు ఏఫలితము వుండదు. (బీదర్ కేంద్రము పుస్తకము - 68)

 

17. జీవితంలో ఒక ధ్యేయముండటమవసరమా?

        ఫుట్‌బాల్ ఆటలోగానీ, హాకీ ఆటలోగానీ ‘గోల్’ ఏర్పాటు తీసేస్తే ఆ ఆటకు అర్థమే వుండదు.  ఇదీ అంతే. (అధ్యాత్మ విద్య 1౦/2౦1౦)

 

18. అన్ని బాధలకు, బంధనములకు గొప్ప ప్రత్యక్ష చికిత్స ఆనందానుభవమే. అది ఇంద్రియ, బుద్ధి సౌఖ్యములన్నింటిని అధిగమించినది.  అంతే కదా?

        ఆనందమే ఒక బంధనము.  బంధనమునకు అసలు కారణం ఆకర్షణ.  అది ఎక్కడ కలిగితే అక్కడ అంతా బంధనమే. మతం ఎక్కడ అంతమైతే అక్కడ ఆధ్యాత్మికత మొదలౌతుంది. ఆధ్యాత్మికత అంతమైతే సత్యతత్త్వం మొదలౌతుంది.  సత్యతత్త్వం అంతమైతే ఆనందం మొదలౌతుంది.  ఆనందం అంతమైతే శూన్యమైయున్న మన గమ్యానికి చేరడం ప్రారంభమౌతుంది. (సహజమార్గ పత్రిక 9,11/1992 - 29)

 

19. మన చెడ్డ (రోత) ఆలోచనలను గురువుగారివిగా అనుకోవడం తప్పు కదా!  అది ఆయనను ఘోరంగా అవమానించడమౌతుంది.  కాదంటారా?

        మంచి తలంపులన్నీ నీవే ననుకుంటావు.  దయచేసి ఆలోచనలేవీ చెడ్డవనుకోవద్దు.  రోత తలంపులు సైతం సంస్కారాలను బయటకు నెట్టివేసే సాధనాలే.  మనస్సును సంపూర్ణంగా శుద్ధిగావించిన తర్వాత సహజసిద్ధంగా ఆలోచనారహిత స్థితి ఏర్పడే వరకూ వేచి వుండాలి.  అంతిమ గమ్యం మన దృష్టి పథంలో లేకపోతే ఒక విధంగా అది మన పురోగమనాన్ని కష్టతరం చేస్తుంది. (సహజమార్గ పత్రిక 9, 11/1992 - 33)

 

2౦. వివేకానందస్వామి, శ్రీరామకృష్ణ పరమహంస వారిని మొదటిసారి కలిసినప్పుడే ఒక విధమైన మార్పు తనలో ప్రారంభమైనట్లు అనుభూతి చెందారు.  కానీ నేను మిమ్ములను కలిసినప్పుడు అటువంటిదేమీ కలగలేదు. ఎందుచేత?

        మంచిది. కారణం స్పష్టం.  నీవు వివేకనందుడంతటి వాడనంటున్నావు.  కానీ నేను రామకృష్ణ పరమహంసను కాను. (సహజమార్గ పత్రిక 9, 11/1992 - 37)

 

21. ఆలోచనలపై మీ అభిప్రాయమేమి?

     ఆలోచనలు గాలిలో తేలే ధూళివంటివి.  అవి శక్తిహీనములు కాబట్టి భవన నిర్మాణము గావింపజ్ఆలవు.  నీవు వాటికి శక్తి నిచ్చినప్పుడే అవి చెదపురుగుపుట్టవలె బలపడుతున్నాయి. (శ్రీరామచంద్ర ఉవాచ - 98-1)

 

3. సహజమార్గము

 

1. రాజయోగమంటే యేమి? మరి సహజమార్గమంటే యేమి?

    మా గురువుగారి అనుభవముపై ఆధారపడి సవరంచబడిన రాజయోగ విధానమే సహజమార్గము. (ఎస్.ఎమ్.ఇ - 6)

 

 

2. మీరిచ్చే సందేశమేమి?

    సర్వత్రా శాంతి నెలకొనాలి.  ఆలోచనలో వైరుధ్య భావనలుండ కూడదు. (ఎస్.ఎమ్.ఇ - 7)

 

3. ఇది సాధించడమెలా?

    ప్రాణాహుతిప్రసారం ద్వారా, మరియు ప్రార్థన ద్వారా సాధించవచ్చు. (ఎస్.ఎమ్.ఇ - 7)

 

4. ప్రాణాహుతి ప్రసారానికి మీవద్ద ప్రత్యేకమైన విధానమేమైనా ఉన్నదా?

    మా గురువర్యుల విధానమే నా విధానం.

    (ఎస్.ఎమ్.ఇ - 7)

 

5. అన్ని పద్ధతులు మంచివేనంటారా?

    సరే అన్నీ మంచివే కావచ్చు.  కానీ నేను పాలు మంచివి అని చెబుతాను.  కానీ కొందరికవి విరేచనాలు కలిగిస్తాయి.  కనుక వారు వాడకుండా వుండాలి. (ఐ.డబ్ల్యు - 73)

 

6. అభ్యాసులు సహజమార్గ విధానాన్ని వదలివెళితే శిక్షపడుతుందా?

    లేదు.  ఏ విధమైన శిక్షా లేదు.  నేను చెప్పేదొక్కటే, కేవలం సహకారమే అవసరం.  ఇక్కడ యేమంత త్యాగం చెయ్యమనడం లేదు. (జి.హెచ్ - 79)

 

 

7. గృహస్థజీవనంలో దీన్ని ఆచరించడానికి వీలౌతుందా?

    అవును. సర్వసామాన్యంగా యిది గృహస్థుల కొఱకే వున్నది.  యితరులూ దీన్ని అనుసరించి ప్రయోజనం పొందవచ్చు. (ఎస్.ఎమ్.ఇ - 8)

 

8. లాలాజీ యీ విధానాన్ని అనుసరించడానికి యేదైనా ప్రత్యేక కారణముందా? ఈ విధానాన్ని అనుసరించటానికి ఆయన జీవితంలో యేదైన బలమైన సంఘటన జరిగి, యీ విధానంతో సంబంధమేర్పరచుకొన్నారా?

    ఈ కాలానికి దీని అవసరమేర్పడింది; కనుకనే మా గురువర్యులు కాలానుగుణంగా చేయవలసిందంతా చేశారు. (ఎస్.ఎమ్.ఇ - 9)

 

9. మొత్తం మీద మీరు ఆఖరుకు చెప్పేది, యీ ప్రాపంచిక జీవనాన్ని వదిలిపెట్టమనే కదా?

    లేదు. (ఎస్.ఎమ్.ఇ 9)

 

1౦. ఈ విధానానికి యెంత సమయం పడుతుంది?

    అది నీ మీదనే ఆధారపడి వుంది. (ఎస్.ఎమ్.ఇ - 1౦)

 

11. నా ఉద్దేశ్యంలో ధ్యానానికి యెంత సమయం కావాలి అని.  అది తెలియజేయండి?

    తొలుత 2౦ నిముషాలతో ప్రారంభించి దాన్ని ఒక గంట వరకు క్రమంగా తీసుక రండి. (ఎస్.ఎమ్.ఇ - 1౦)

 

12. ఈ విధానంలో నిషిద్ధమైనవేమైనా ఉన్నాయా?

    నిషిద్ధమన్నదే నిషిద్ధం. (ఎస్.ఎమ్.ఇ - 1౦)

 

13. ఇక్కడ విశ్వాసముతో రోగనివారణ చేస్తారా?

    లేదు. (ఎస్.ఎమ్.ఇ - 12)

 

14. సహజమార్గాన్ని గూర్చి ఒక్క వాక్యంలో చెప్పండి?

     ఇది సాక్షాత్కారానికి రాజ మార్గం. (సహజమార్గ పత్రిక 11/82 - 9)

 

15. సంక్షిప్తంగా సహజమార్గమంటే యేమిటి?

     నీలో నీవే జీవించు.  అదే సహజమార్గం. (సహజమార్గ పత్రిక 11/82 - 9)

 

16. కేంద్రమండలంలోని ఏడువలయాలను గురించి వివరించండి?

        అవి ఏకీకృతం చేయబడిన (చిక్కబరచబడిన) శక్తి యొక్క సారము.  అది కేంద్ర బిందువు నుండి ఉత్పన్నమైనది.  కేంద్రబిందువు దరికేగుటననునది దాదాపు అసాధ్యము.

(సహజమార్గపత్రిక 1౦/89 - 12)

 

4. అద్భుతములు - మహిమలు

 

1. ఏవైన మహిమలు చూపుతారా?

    జీసస్‌క్రీస్తువారి చరిత్ర మీకు తెలుసు.  వారు జీవితాంతం మహిమలు కనబరచారు. కాని ఆయన ననుసరించిన శిష్యులు కేవలం 12 మందే.  అందునా వారిలో ఒకడు ఆయన జీవితం ముగియడానికి కారకుడయ్యాడు.

    అద్భుతములు చేయవలసిన అవసరమేమీ లేదు. అనతి కాలంలోనే మహిమలు ఉత్పన్నమౌతాయని రాజయోగం చెప్పుచున్నది.  కానీ మనం వాటి కోసం ప్రయత్నించరాదు. మన మార్గంలోని గొప్ప అద్భుతము మనిషిలో కలిగే మార్పే. (ఎస్.ఎమ్.ఇ - 12)

 

2. ఈ మహిమల వల్ల మానవజాతికేమైన ప్రయోజన- ముందా?

    మహిమల వల్ల మానవజాతికి యే ప్రయోజనము లేదు.  అది మరో విధంగా అందుకు భిన్నమైనది.

(ఎస్.ఎమ్.ఇ - 13)

       

3. అద్భుతములు చేసే వారిని గురించి మీరేమనుకుంటారు?

    వారు ఒకప్రపంచం నుండి మరొకప్రపంచంలోకి దూకుతున్నారు. (ఎస్.ఎమ్.ఇ - 12)

 

 

4. మహిమలు చూపే వారికేమైనా ప్రయోజన ముంటుందా?

    ఉంటుంది.  వారు ప్రసిద్ధులౌతారు. (ఎస్.ఎమ్.ఇ - 13)

 

5. వారి వ్యక్తిగత ఘనతను చాటుకోవడం కోసం కొందరు మహిమలు ప్రదర్శిస్తున్నారు.  వారిపై మీ అభిప్రాయమేమి?

    వారిని గురించి నేనేమి చెప్పగలను? వారు చేసే పనికి వారే బాధ్యులు. (ఎస్.ఎమ్.ఇ - 13)

 

5. మంత్రములు

 

1. మంత్రములకున్న శక్తి యెటువంటిది?

    సహజమార్గములో మంత్రజపం చేయమని మనం ప్రోత్సహించడం లేదు. (ఐ.డబ్ల్యు - 151)

 

2. అది సరేగానీ ఆ మంత్రములకేమైనా శక్తి ఉన్నదా?

    నిజమే. చాలా మంది మంత్రములకు శక్తి గలదని మనకు తెలియజేశారు.  కానీ నా దృష్టిలో కేవలం ధ్యానం మాత్రమే నిజమైన గమ్యాన్ని చేరుస్తుంది.  నిజమైన మంత్రయోగమంటే మంత్రము యొక్క అర్థముపై ధ్యానించడమే.  అదే వేదసూత్రము చెబుతున్నది.  అట్లుకాని యెడల అది నిష్ప్రయోజనము.  మంత్రార్థంపై ధ్యానం చేయక నీవు కేవలం మంత్రాన్ని జపిస్తూ వున్నా కొంత ప్రయోజనముండక పోదు.  కానీ అది అల్ప ప్రయోజనమే.  నీవు నీ పేరును మాటిమాటికి జపం చేయవచ్చు.  అదీ మంత్రమే అయిపోతుంది. (ఐ.డబ్ల్యు - 151)

 

3. మంత్రం మీద మీ అభిప్రాయమేమి? మీరేదైన మంత్రముపదేశిస్తారా?

    సామాన్యంగా నేనే మంత్రాన్ని ఉపదేశించను.  కానీ అవసరమనిపిస్తే యిస్తాను.  అయితే ఆఅవసరం యింతవరకు కలుగలేదు.  మంత్రానికి సంబంధించి మీరు పతంజలి సూత్రాలను చదవండి.  బహుఃశా అది 32వ సూత్రం కావచ్చు లేక యింకో సూత్రం కావచ్చు.  వారు చాలా స్పష్టంగా వ్రాశారు.  ఒకవేళ మంత్రోపదేశం తీసుకుంటే దాని భావాన్ని గ్రహించి అర్థం చేసుకొని అనుసరించాలని అందులో వుంది. (బి.ఇ - 66)

 

4. నేను మంత్రం ధ్యానం చేస్తున్నాను.  అది మేలా? లేక మీ విధానం మేలా?

    అదంతా మీ అనుభవంపై ఆధారపడి యున్నది.  మీరు మీ విధానంతో పురోగమిస్తున్నట్లు గమనించినట్లయితే దాన్నే కొనసాగించుకోండి.  అలా కాకపోతే మరోదానికోసం అన్వేషించండి. (ఐ.డబ్ల్యు - 71)

 

5. నేను ప్రాణాహుతి ప్రసారం పొందుతూ ధ్యానం చేసి, శాంతి ననుభవించాను.  అంతకు ముందు నేను ప్రతిదినం కొన్ని గంటలు ఒక మంత్రజపం చేసేవాడిని, అందువల్ల కూడా శాంతిని పొందుతూ వుండే వాడిని.  కానీ ఆ శాంతికి, ఈ శాంతికి చాలా చాలా తేడా వుంది.  ఎందుచేత?

     యాంత్రికంగా మంత్ర జపం చేయడం వల్ల మానసిక శ్రమగలిగి విడిచిన వెంటనే విశ్రాంతి లభిస్తుంది, అదీ ఆ శాంతి.  దీన్ని మంత్రంతోనే కాదు, ఎక్కాలపుస్తకం ఒక పద్దతిగా శ్రమించి చదివినా సాధించవచ్చు.  హృదయం భగవదర్పణజేసి సాధించిన శాంతికి, ఇటువంటి యాంత్రిక మంత్రజప శాంతికి తేడా యే సున్నితమైన అభ్యాసియైనా గమనింపవచ్చును. (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక,సూరత్ 1982 -II)

 

6. సహజమార్గ విధానము

 

1. నేను వేరొక గురువును గత 8 నెలలుగా అనుసరిస్తున్నాను.  ఆయన నాకో మంత్రమిచ్చాడు.  దాన్ని చేసుకుంటూ, మీ పద్ధతి కూడా నేను అనుసరించ వచ్చుm?

    మీకోవిషయం అరమరికలు లేకుండా చెప్పాలనుకుంటున్నాను.  రెండు మార్గాలు యెప్పుడూ వుండటానికి వీల్లేదు.  ఒకటి మరోదానితో జోక్యంచేసుకోవచ్చు.  కొంతకాలం చేస్తున్నది వదలి రెండవది ప్రయత్నించవచ్చు.  అప్పుడు రెండింటిలో యేది మేలో, యేది అనుసరిస్తే మంచిదో మీరే తేల్చుకోవచ్చు.  ప్రజలు గురువును మార్చడానికి యెందుకో అయిష్టంగా వుంటారు, కారణం నాకర్థంకావడం లేదు.  తన ఆధ్యాత్మికాభివృద్ధి కోసం గురువు నెన్నుకుంటారు.  ఆయనొక వేళ నీవాశించింది యివ్వలేని పక్షంలో, నీ వింకొక గురువు నన్వేషీంచుకొన వలసి వస్తుంది.  అయితే ఆ విడిచిపెట్టిన గురువు యెడ గౌరవం గలిగి యుండవలసిందే.  నాకు కావలసినది మీ వద్ద లభించలేదు గనుక నేను మరొకరి నాశ్రయించడానికి వెళుతున్నానని సౌమ్యంగా చెప్పవచ్చును. (బి.ఇ - 65)

 

2. సహజమార్గం యొక్క ప్రత్యేకత ప్రాణాహుతి అని మీరంటున్నారు.  సరిగ్గా అదేమిటో? అదెలా పనిచేస్తుందో తెలియజేయగలరా?

    అది అద్భుతాలు చేస్తుంది.  అయితే మీరు దాన్ని పరీక్షించి చూడవలసి వుంది.  అది భగవదీయశక్తి.  మనల్ని మార్చివేయడాని కుపయోగపడుతుంది.  మనిషిలో మార్పు కలగడమే ప్రాణాహుతి ప్రసార ఫలితము. (ఎస్.ఎమ్.ఇ-13, 14)

 

3. మీ శిష్యులలో సాక్షాత్కారము పొందిన మహాత్ములున్నారా? ఉంటే వారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను.  మహాత్ములందరి దర్శనం చేసుకోవాలన్నది నా ప్రగాఢ వాంఛ.

    మంచిది.  నేనొక మాట మీకు చెప్పాలి.  మా వాళ్ళలో కొద్ది మంది దాదాపు మహోన్నత స్థాయికి చేరుకొన్న వారున్నారు.  మిగతావారు కూడా గమ్యం వైపుకు పురోగమిస్తున్నారు.  వారిని గురించిన వివరాలు మీ కనవసరం.  అది వారి వ్యక్తిగత విషయం.  ఆ విషయమై చర్చ మన కవసరం లేదు. (బి.ఇ - 67)

 

4. మీ సంస్థలోనికి యెక్కువ మంది సభ్యులు రావాలని కోరుకోవడం యెందుకు? ఉండే ఆరేడు మంది సభ్యులు సరిపోరా?

    చూడండి, నేను అనంతం నుండి వచ్చాను.  అనంత బీజం నాలో వుంది.  నేనేపని చేసినా సహజంగా నాతో అనంతముండాలను కుంటాను.  అంతేగాదు నా వెంటనున్న వారు సైతం అనంతం గలిగి ఉండాలనుకుంటాను.  ఒక దొంగ సైతం తనతోపాటి యెక్కువ మంది ఉండాలనుకుంటాడు.  ఇదంతా ఆ ఆనంతము యొక్క ప్రభావమే.  కాని దాని దిశ మాత్రం తప్పుగా నున్నది.  నేను మీ కింకో మాట చెప్పాలి, మనం భగవంతుని పూర్తిశక్తిని ఉపయోగించుకోవాలి గాని, కొద్ది భాగం కాదు.  ‘నేను’ అన్న భావం ఉన్నంత కాలం భగవంతుని పూర్తిశక్తి ఉపయోగించుకోలేము.  కనుక ‘నేను’ వదిలెయ్, పూర్తి శక్తి లభిస్తుంది.  అయితే దీనిపై అదుపు గలిగి ఉపయోగించాలి.  ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. (ఐ.డబ్ల్యు - 1౦7)

 

5. ప్రభూ! తమరు మాకోసం చాలాకాలంగా శ్రమిస్తున్నారు.  మాకున్న అల్పజ్ఞానంచేత యింతో అంతో మేమూ మీకు సహకరిస్తున్నాం.  మనిద్దరి పనిని తగ్గించి ఓ గంటలో ఈ పని ముగించి తక్కువ సమయంలో ఉభయకుశలోపరిగా సమయాన్ని ఆదా చేసుకోలేమా?

    ఈ విషయంలో లాలాజీ చెబుతూ కంటి నుండి ఒక కన్నీటిచుక్క వెలువడేంతలో సంపూర్ణతను సిద్ధింప జేయవచ్చు గానీ శరీరంలోని నాడీమండల వ్యవస్థ విచ్ఛిన్నమౌతుంది.  నేను వెనువెంటనే యేదైనా చెయ్యాలనుకుంటే చేసేయగలను.  అప్పుడు జనులు యేవిధమైన అనుభూతికి లోను గారు.  అందుచేత పొందిన దానిని వారు గుర్తించి విలువనివ్వరు. (జి.హెచ్ - 8౦)

 

6. గురూజీ మీరు ‘సత్యోదయం’ చాలానాళ్ళ క్రితం వ్రాశారు.  అట్లే ‘రాజయోగ ప్రభావం’, ‘దశాదేశముల వ్యాఖ్యానం’ కూడా వ్రాసి చాలా కాలమే గడచింది.  వీటిని మీరు కొన్నాళ్ళ తర్వాతైనా సమీక్షించి, బహుఃశ వాటిలో కాలానికి సరిపోని కొన్ని విషయాలను సవరిస్తారా?

    నేను మీకో విషయం చెబుతున్నాను.  ఈ పుస్తకాలు యీ నాటికొఱకో, ఓ సంవత్సరం కొఱకో లేక ఓ వందేళ్ళ కొఱకో వ్రాయలేదు.  అవి సర్వకాల, సర్వావస్థల కొఱకు వ్రాయబడినవి.  అవి భవిష్యత్‌కాలం కొఱకే వ్రాయబడ్డాయి.  అందుచేతనే అవి సులభంగా వున్నా చాలామంది అర్థం చేసుకోవడానికి యిబ్బంది పడుతున్నారు. (జి.హెచ్ - 247)

 

7. అవి సులభంగా వుంటే అర్థం కాకపోవడమేమిటి?

    ఈ విషయమై నేను వేదాల ఉదాహరణనిస్తాను.  అవి తొలుత ఋషులచేత అక్షరబద్ధం చేసినప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే అవి అర్థమయ్యాయన్నది నా అభిప్రాయం.  కానీ నేడు వాటిని ప్రజలు సులభంగా అర్థం చేసుకో గలుగుతున్నారు.  సహజమార్గపు బోధకూడా యిటువంటిదే.  అవి రాబోవు తరాల కోసం వ్రాయబడినవి.  భావితరాల వారు వాటిని సులభంగా అర్థంచేసుకుంటారు. (జి.హెచ్ - 248)

 

8. కనుక మీరు మీ పుస్తకాలను పునఃసమీక్ష చేయరన్నమాట?

    మీ ప్రశ్నకు జవాబు నేను యిప్పటికే చెప్పానను- కుంటాను. (జి.హెచ్ - 248)

 

9. నేను సర్వం తెలుసుకోవాలనుకుంటున్నాను.  దీన్నెలా సాధించాలి?

        ఒక పర్షియా ద్విపద కవిత్వమున్నది.  అందులో ఆ సాధుపుంగవుడిలా అన్నాడు -

        "ఎన్నియొ నెఱిగితి నెఱిగినవన్ని

        సున్నయటంచు నే సూటిగ గంటి" -

        ఆఖరకు సున్న యే సర్వస్వమని తెలిసిపోయింది.  (బి.ఇ - 68)

 

1౦. మీ పద్ధతి వలన మేమెలా మేలు పొందగలము?

    ఆహారము యొక్క రుచి తింటే తెలుస్తుంది.  ప్రయత్నించండి.  ఈ విధానం వల్ల కలిగే మేలేమిటో మీరే చూడండి. (ఎస్.ఎమ్.ఇ - 11)

 11. ఇతర విధానాలతో సహజమార్గాన్ని పోల్చి చూడటమెలా?

     ఇతర విధానాలు చంటిపిల్లల చేతి ఆటబొమ్మల వంటివి.  సత్-చిత్-ఆనంద్ కూడా పదార్తమయమేనని మాగురువు తెలియజేశారు.  మనం వాటిని అధిగమించి ముందుకు సాగాలి.  నిజమైన ఆవేదన హృదయకుహరం నుండి ఉత్పన్నం కావాలి, అప్పుడే ప్రభువు సాధకుని గడప వద్దకు వస్తాడని మా గురువర్యులు సెలవిచ్చారు. (ఎల్.ఐ.డి.సి - 32)

 

12. ఇంతకు ముందు చేపట్టిన విధానాన్ని వదలకుండా మీ సహజమార్గంలో చేరి యిది కూడా అనుసరించ వచ్చా?

     సహజమార్గానికి భిన్నమైన విధానాన్ని కూడా అనుసరించాలంటే మీరు రెండు విధాల ప్రయత్నించాల్సి వస్తుంది.  సహజ మార్గానికి భిన్నమైనదేదైనా అది గురువుకు భారం కలిగిస్తుంది. (ఎల్.ఐ.డి.సి - 46)

 

13. సహజమార్గంపై మీరు వ్రాసిన పుస్తకములలో యేది గొప్పది?

     నా వ్రాతలన్నీ లాలాజీవే.  అందులో తప్పులేవైనా వుంటే, అవి మాత్రమే నావి. (ఎల్.ఐ.డి.సి - 48)

 

14. మరో పద్ధతి ననుసరిస్తున్న వ్యక్తి మీ విధానంలోనికి వస్తానంటు మీ వద్దకొచ్చారు.  ఎందుకంటారు?

     నాకు ఈ ప్రకృతిపై అధికారమున్నది.  వచ్చినామె యొక్క వాస్తావాన్వేషణే ఆమెను నా గడప వరకు తీసుకొని వచ్చినది.  నీవు కూడా నీ సంస్కారబలం చేతనే యిక్కడికి ఆకర్షించ బడ్డావు.  నీవు అవసరమని భావిస్తున్న వస్తువులపై గల వ్యామోహాన్ని అధిగమించు.  తనంతటదే మితం నీలో స్థాపింపబడుతుంది. (ఎల్.ఐ.డి.సి - 69)

 

15. మనకు కలలేమైన తెలియజేస్తాయా?

        నీవు ఏర్పాటు చేసుకొన్న బాహ్యాంతర జీవనస్థితులే కలలు.  అంతేకాదు, నీ పురాతన సంస్కారముద్రలు సైతం పరోక్షంగా కలలలో కనబడతాయి.  మనం కలలలో కూడా సంస్కార ముద్రలను కడిగేస్తాము. (సహజమార్గ పత్రిక 1/92)

 

16. బసంతోత్సవ సందర్భంలో ప్రత్యేక ధ్యానాలు విధిగా చేయించాలా?

        అవసరం లేదు.  వేరు విషయలతో ప్రొద్దుపోగొట్టుకోకుండా వుంటారని, దానికంటే ధ్యానం మేలుకదా అని ధ్యానం చేయిస్తూంటారు.  అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమంటే వ్యక్తిగతంగా దైవకృపతో తన్నుతాను తన యోచన ద్వారా అనుబంధమేర్పరచుకొని ప్రతి ఒక్క అభ్యాసి వుండాలి.

(సహజమార్గ పత్రిక 7/82 - 21)

 

 

17. ఒకానొక ఆధ్యాత్మిక కేంద్రం గొప్ప స్థితి (ఉదా: విరాట్‌స్థితి) కి సంబంధించిన వాతావరణంలో నిండి వుంటుందా?

        వ్యక్తిగతంగా మనిషి అట్టి స్థితి పొందవచ్చు.  అంతేగాని మొత్తానికి మొత్తం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే ఆస్థితిలో వుండదు. (సహజమార్గ పత్రిక 7/82 - 21)

 

18. విరాట్‌స్థితి చాలా గొప్పదా?

        ఇది బాల్యక్రీడ.  మన ఆధ్యాత్మిక కేంద్రాలలో చాలామంది అంతకంటే గొప్పస్థితిలో ఉన్నారు. (సహజమార్గ పత్రిక 7/82 - 21)

 

 

7. గురువు - ప్రశిక్షకులు

 

1. ఉదాహరణకు మీరొక గురువే కదా?

   నేనలా అనుకోను.  నేను నా సంస్థలో వున్న వారిని సహచరులుగా భావిస్తాను. (ఐ.డబ్ల్యు - 81)

 

2. కానీ చాలా మంది మిమ్మల్ని గురువుగా గౌరవిస్తున్నా రనుకుంటాను, నిజమే కదా?

     సరి. వారు నన్ను సూచిస్తూ యేదో ఒక మాట వాడతారు.  వాళ్ళు నన్నలా పిలవడానికి యిష్టపడుతున్నారు.  కానీ నా కది అంతగా నచ్చిన పదం కాదు. (బహుఃశా బాబూజీ అంటేనే బాగుంటుందని వారి అభిప్రాయం కావచ్చును.) (ఐ.డబ్ల్యు - 81)

 

3. మనిషి ఎంతవరకు అభివృద్ధి చెందాడో మీరు తెలుసుకోగలరా?

     తెలుసుకుంటాను, నా పనికి సంబంధించినంతవరకూ, అవసరమైనదంతా చూడగలను, తెలుసుకోగలను.

(ఐ.డబ్ల్యు - 92)

 

4. నేను నాశరీరాన్ని గురువుదిగా భావించి, నా చర్యలన్నీ ఆయన చేస్తున్నవే అని అనుకోవచ్చు గదా?  ఇది సరిపోతుందా, యింకా బాహ్య కార్యక్రమమేమైనా చేయవలసింది వుందా? గురువు హృదయంలో ఉన్నాడనుకోవడం సరియైనదే కదా?

     ఈ విధానాన్ని నేను ప్రోత్సహించడంలేదు.  నా ఉద్దేశ్యంలో గురువు హృదయంలో వున్నట్లు గుర్తించగల స్థితికి వారికైవారే సహజ సిద్ధంగా రావాలి.  ఇది ఒక భావన.  (కేవలం మనం బలవంతంగా అనుకోవడం కాదని బాబూజీ అభిప్రాయం కావచ్చును) (జి.హెచ్ - 123)

 

5. మరి నాదికాదు ఈ దేహం గురువుది, చేసేదంతా నేను కాదు గురువే అని అనుకోమని వ్రాసియున్నారు కదా? ఇది ప్రాధమికంగా సరియైనదే కదా?

     అది మరొక విషయము.  వారికై వారే ఒక ఉపాయాన్ని అన్వేషించి కనుగొని వృద్ధిచేసుకొన్న విశేష పురోగాములైన సాధకుల విషయమిది.  ఇది ప్రారంభకుల కొఱకు కాదు.  ఈ విధానాన్ని బలవంతంగా చేపట్టరాదు.  ఇది దానికై అదే సహజంగా యేర్పడాలి.  అలా కాకపోతే యిదీ ఒక విధమైన విగ్రహారాధనవలె మారిపోతుంది. (జి.హెచ్ - 124)

 

6. గురువు మన అంతరంగంలో వున్నాడని కొంతమందంటారు.  నిజమేనా?

     నేనొక విషయం చెబుతున్నాను.  భగవంతుడే గురువు.  మిగిలిన వాళ్ళందరూ ఆయన నేతృత్వంలో, ఆయన ఆజ్ఞానుసారం వర్తిస్తున్నారు.  వాస్తవం చెప్పాలంటే యెవరైనా తాను గురువునని చెప్పుకుంటే, అతడు యితరులకు ఆధ్యాత్మిక శిక్షణ నొసగుటకు అనర్హుడు.  అట్లు చెప్పుకొనువాడు వాస్తవానికి భగవంతుని స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. (ఐ.డబ్ల్యు - 73)

                      

7. మీరు ప్రశిక్షకులను యెలా యెన్నుకుంటారు?

    మీ యెదురుగా నాలుగైదు వస్తువులుంటే, అందులో ఒకటెలా మీరు యెన్నుకుంటారు? (ఐ.డబ్ల్యు - 93)

 

8. ఓహో! సరే, అలా అందరిలో ఒక్కరికే యెందుకు ప్రాధాన్యతనిస్తారు?

    వారిలో సుగుణాలను గమనిస్తాము.  మంచి గుణాలున్న వ్యక్తికి ప్రాధాన్యతనిస్తాము.  ఒక మనిషిని సుగుణ- వంతునిగా కూడా మార్చుకొనవచ్చును.  (ఐ.డబ్ల్యు - 94)

 9. మీ ఉద్దేశ్యంలో సుగుణాలంటే యేవి?

    సానుభూతి, దానగుణం, సేవాగుణం, సదాలోచన వంటివి సుగుణాలలో కొన్ని. (ఐ.డబ్ల్యు - 94)

 

1౦. గురువే భగవంతుడా?

     మా గురువు భగవంతునిలో ఐక్యమైయున్నాడు. (ఎల్.ఐ.డి.సి - 28)

 

11. పురోగతిని త్వరితం జేయడమెలా?

     అది ప్రశిక్షకుల పని.  వారి పనిని గూర్చి మీరడుగుతున్నారు.  మీరు దానిపై చింతించ వలసిన పనిలేదు.  సంస్కారాలను గూర్చి విడువక చింతిస్తే అవి లోలోతులకు నాటుక పోతాయి.  కనుక వాటిని గురించి చింత వద్దు. (ఎల్.ఐ.డి.సి - 6౦)

 

12. ప్రశిక్షకుడంటే యెవరు? ప్రశిక్షకుడెలా పనిచేస్తాడు?

     ఈ విధానములోని గొప్ప చిత్రమేమంటే, ప్రశిక్షకుడుగా నియమింపబడిన వ్యక్తి నిజానికి ఒకానొక గొప్ప స్థాయికి యెదిగి వుండనప్పటికీ ప్రాణాహుతి శక్తి ప్రసారం ద్వారా అభ్యాసులకు మాత్రం అట్టి గొప్పస్థాయికి సంబంధించిన అనుభూతులను ప్రసాదించగల్గును.  అలా జరగటానికి కారణమేమంటే నిజానికి ప్రశిక్షకుడు కాకుండా గురువర్యులే ప్రాణాహుతిప్రసారవిద్య ద్వారా సర్వము నిర్వహించు చున్నాడు.  అందువలన అతని వ్యక్తిగత విషయ పరిమితులు అభ్యాసిపై యేమాత్రం ప్రభావం చూపవు.  అతడే ప్రాణాహుతి ప్రసారం చేస్తున్నట్లున్నా వాస్తవానికది నేరుగా అనంతము నుండే ప్రసారమౌతున్నది.  ప్రశిక్షకుడు తన యిచ్ఛాశక్తిని తగినంతగా వృద్ధిచేసుకొని ప్రాణాహుతీ ప్రవాహమును అభ్యాసుల వైపునకు మరలించ గలిగి ఉండాలి.  (ధార్వాడ్ ప్రత్యేక సంచిక 1991 - xxi)

 

13. ధ్యానం చేయించే సమయంలో ప్రశిక్షకుడు సంపూర్ణంగా భగవంతునిలో లీనమై ఉండి తీరాలా?

        ఇది సాధ్యము కాదు. ఇది ప్రశిక్షకుని చేతిలో వుండే విషయమే కాదు.  గురువర్యుల ఇచ్ఛ ప్రకారం ఆస్థితి కలుగుతుందే కాని వేరువిధంగా జరగదు. (సహజమార్గ పత్రిక 7/82 - 21)

 

14. గురువుగారి కర్తవ్యమునకు అడ్డంకులేవి?

        నేను చక్కగా నిర్ణయించుకొన్న వస్తువులు చేయు వడ్రంగిని.  కానీ కలప దొరకడం లేదు.  అప్పటికే తయారైయున్న వస్తువులు లభిస్తున్నాయి.  వాటితో నేను చేయదలచుకొన్న కొత్త వస్తువు చేయడం కష్టమౌతున్నది.  ఆ వస్తువులను విరగగొట్టి చేస్తామన్నా అనుకొన్న వస్తువు చేయడం బహుకష్టమౌతున్నది.  కనుక చిన్న చిన్న సర్దుబాట్లతో నేను చేసే వస్తువులతో సరిపెట్టుకొనక తప్పదు. (సహజమార్గ పత్రిక 9, 11/92 - 39)

 

 

8. ఇతరదేశాలలో బాబూజీ

 

1. గురువుగారు తమరు డెన్మార్క్ యెందుకొచ్చారు?

    ఇక్కడున్న సభ్యులకు మంచి పంచడానికి వచ్చాను.  వీళ్ళు కూడా మనుష్యులే గదా! కాకపోతే మాకు కావలసిన మంచి ప్రదేశాలు మాకు భారతదేశంలోనే వున్నాయి.  విషయం మంచిది.  ఇక్కడున్నవారూ మనుష్యులే, వారూ యిందులో పాల్గొనవచ్చు.  కనుక నేను డెన్మార్క్ వచ్చాను. (ఐ.డబ్ల్యు - 84)

 

2. డెన్మార్క్‌ను గురించి మీరేమనుకుంటున్నారు?  అంటే నా ఉద్దేశ్యంలో మిగతా ఐరోపాదేశాలతో పోలిస్తే డెన్మార్క్‌పై మీ అభిప్రాయమేమిటి?

    ప్రజలు సహజసిద్ధాంతాలను అనుసరిస్తే అన్నిదేశాలు మంచివే.  డెన్మార్క్ సహజ ప్రకృతి సిద్ధాంతాలు అనుసరిస్తే డెన్మార్క్ మిగిలిన దేశాలన్నిటికంటే మేలైనదౌతుంది. (ఐ.డబ్ల్యు - 84)

 

3. ఇంగ్లండ్‌లో సహజమార్గం పరిస్థితి యేమిటి?

    నాకు ఇంగ్లాండ్‌లో యేపనీలేదు.  నాకు ఆ దేశంతో సంబంధాలు తెగిపోయాయి. (జి.హెచ్ - 76)

 

4. అందుకు కారణమేమి, గురువు గారు?

    అక్కడ తెలివితో మీతిమీరిన అనుబంధం గలిగిన వారున్నారు. (జి.హెచ్ - 76)

 5. అదెలా తప్పవుతుంది?

    మంచిది. నే చెప్పేదేమంటే, నేను భగవంతునితో అనుబంధం గలిగి యున్నాను.  మీరు తెలివితో సంబంధింపబడి యున్నారు.  స్వభావం మంచిదైతే యెటువంటి విద్వేషాన్నయినా తొలగించివేయవచ్చు.  తెలివితేటల్లో వారు చాలా ఉన్నతులుగానీ ఆధ్యాత్మికంగా దివాలాదీసి యున్నారు. (జి.హెచ్ - 76)

 

6. ఐర్లాండు విషయం యేమిటి? అక్కడ పని ముందుకు సాగుచున్నదా?

    వారికి కావాలని వుంటే పనిచేయవచ్చు.  మీకో విషయం చెబుతున్నాను.  భారతదేశంలో బిడ్డ ఉయ్యాలలో వుండగానే దేవుడున్నాడని తల్లి బోధిస్తుంది.  మరి అక్కడి విషయం యేమని చెప్పను?  మనకు షేక్‌స్పియర్, మిల్టన్ వంటి వారున్నారు.  వారి రచనలతో మన పని జరగదు.  ఒక వ్యక్తి తెలివి గలవాడైయుండి యిందులో దుముకవచ్చును.  అంటే నా ఉద్దేశ్యంలో ఆధ్యాత్మికతతో అని భావం.  ఆ పరిస్థితులలో ఒక శక్తి అతన్ని పైకిలాగుతుంటే, మరొకటి క్రిందికి త్రోయుచుండును.  కనుక వారు తెలివితేటలలో ఉన్నతులు, కానీ ఆధ్యాత్మికతలో వారు యేమీ లేని వారు. (జి.హెచ్ - 76)

 

7. గురువుగారూ మరి దీనికి పరిష్కారమేమిటి?

    సాధన - మనకు సాధనా విధానమున్నది.  అది మనం చేయాలి.  మనం చాలా చదివాం, యేంసాధించాం.  కేవలం జ్ఞానసముపార్జనయే చాలదు.  ఇక సాధన వైపుకు రావల్సి వుంది.  సాధన చేయండి ఫలితాన్ని గమనించండి.

(జి.హెచ్ - 77)

 

8. గురువుగారు ప్యారిస్ వాతావరణం, లండన్ వలెనే బాగులేదా? మాకు చెప్పినవారు ప్యారిస్ చాలా చెడ్డప్రదేశమని చెప్పారు.  నిజంగానే అక్కడి వాతావరణం బాగులేదేమో ననుకుంటున్నాము.  వాస్తవమేమి?

    లేదు. ప్యారిస్ చాలా మంచి ప్రదేశం.  అక్కడ నాకెటువంటి యిబ్బంది కలుగలేదు. నేను గమనించినంతలో లండన్‌అంత చెడ్డ ప్రదేశం మరొకటి లేదు.

(ఐ.డబ్ల్యు - 118)

 

9. గురువుగారూ! అది అంత చెడిపోయివుంటే దాన్ని తమరు శుభ్రపరచలేరా? అలాచేస్తే యెంత అద్భుతంగా వుంటుంది?

    నిజమే.  నేను మీకు చెప్పాను.  ఇప్పటికే నేను శుభ్రపరిచాను.  అది చాలా స్వల్పం.  బహుశః అది 5%  ఉండొచ్చు.  అంతకు మించి నేను చేయలేదు.  ప్రజలు కావాలనుకుంటే వారు కూడా మరీ మరీ అందుకోసం ప్రార్థన చేసితీరాలి. (ఐ.డబ్ల్యు - 118)

 

1౦. ఇక్కడ సూర్యతేజం ఆహ్లాదకరంగా వుంది.  మీరు వసంతకాలంలో వచ్చారు.  మరి భగవత్ చింతన విషయమై మేమేమీ చెయ్యలేం గl?

    మంచిది.  నేనొక విషయం చెబుతాను.  ఈ ప్రపంచాన్ని చెడు ఆలోచనలతోను, తప్పుడు పనులతోను పాడుచేస్తున్నది మనమే.  ప్రతి ఆలోచనా వాతావరణంపై దాని ముద్రలను వదులుతుంది.  ఎవరైనా గుర్తించ గల్గిన వారుంటే, మన ఆలోచనలే మేఘములకు మించి వాతావరణంలో విహరిస్తున్నట్లు గమనించ గలరు.  ఒక జంతు వధ్యశాలకు వెళ్ళినప్పుడు, చర్చి లేక దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు మీ ఆలోచనలోని తేడాని మీకైమీరే గమనించగలరు.  ఆ రెండు ప్రదేశములలో మీరు గమనించింది ఆలోచనలోని తేడానే.  మనం రాక ముందున్న పరిస్థితి కంటే మనం ఈ ప్రపంచాన్ని మరింత స్వచ్ఛపరచి వదలి వెళ్ళాలి.  అదీ మన కర్తవ్యం.  అప్పుడే మనం ప్రకృతికి సహకరించినట్లు లెక్క.  కానీ మనం ప్రకృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాం.  అందుకే ఈ వినాశనం. (ఐ.డబ్ల్యు - 71)

 

11. పాశ్చాత్య నాగరికత యేవిధంగా ముగుస్తుందో - మీ అంతర్‌దృష్టికేమైనా అందింl?

    ఆధారం (పునాది) మార్పుచెందుతుంది.  పునాది మహోన్నత ఆధ్యాత్మికతను సంతరించుకొంటుంది. (ఐ.డబ్ల్యు - 95)

 

12. అదెలా మర్పుచెందుతుంది?

    విధానాన్ని అనుసరించడం ద్వారా.  మంచి ఆలోచనల ద్వారా.  నేను చెబుతున్నాను, ఇదంతా దైవ కార్యం.  ఒక దివ్యహస్తము ఈ పరిణామక్రియను నడుపుచున్నది.  ఓ 1౦ లేక 15 సంవత్సరముల క్రితం పరిస్థితి ఈ విధంగా లేదు.  కానీ యిప్పుడు నేను యిక్కడ గమనిస్తున్నాను.  ఐరోపాలో యేదో మార్పు జరుగుతున్నది.  ప్రజలు వస్తుదృష్టి గల ప్రాపంచిక జీవితంతో విసిగి పోయారు.  కనుక వారు సహజంగానే ఆధ్యాత్మికత ఆధారంగా గల విధానానికి వచ్చితీరతారు.(ఐ.డబ్ల్యు - 95)

 

13. గురువుగారూ మీరు ఢిల్లీ సందేశం (3౦ ఏప్రిల్, 198౦) లో చెబుతూ భారతదేశంలో అంతర్దర్శనం కొఱకు అంతరాత్మనే ఉపయోగిస్తారు.  కానీ పాశ్చాత్యులు వారిని వారే (హేతువాదన) ఉపయోగించుకుంటారన్నారు.  దీన్ని కాస్తా వివరిస్తారా?

     అది వివరణ అవసరమేలేనంత స్పష్టంగానే వుంది కదా! (జి.హెచ్ - 121)

 

14. ఉండొచ్చు కానీ నేనంత వివేకం (తేజస్సు) గలవాడిని కాదు కనుక, అర్థం చేసుకోలేక పోతున్నాను.

     నీలో అంత వివేకములేదు కనుకనే, నీవు తేజస్వివైయున్నావు.  (వేదాంతపరమైన అర్థములు, చర్చలు, లక్ష్యసాధనకనవసరాలని బాబూజీ అభిప్రాయమనుకోవాలి) (జి.హెచ్ - 122)

 

15. ఐరోపాలో దయ్యం (సైతాన్) ఉందంటారు.  అటువంటి దేదైనాఉందంటారా? వాడు భగవంతుని నుండి మన ఆత్మలను తప్పుద్రోవకు మళ్ళించి పతనమొందిస్తాడు.ఔనా?

నాకు అటువంటి వాని చర్యల గురించి తెలియదు.  నీ యోచన సరియైనదో కాదో నాకు తెలియదు, కానీ అటువంటి యోచనలతో నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. (ఎల్.ఐ.డి.సి - 66)

 

16. వాడు దైవము యొక్క వెలుగును దోపిడీచేసి, క్రిందికి దింపి మనిషి కందుబాటులోనికి తెచ్చాడని అంటుంటారు మరి?

     అయితే వాడు గొప్ప శాస్త్రజ్ఞుడై ఉండాలంటాను నేను. (ఎల్.ఐ.డి.సి - 65)

 

17. అతడు దైవములో ఒక భాగమే (పార్ట్) అయివున్నాడంటారు?

     మరి యిప్పుడతడు దైవము యొక్క మూట (పార్శిల్) అన్న మాట. (పార్ట్ & పార్శిల్ = విడదీయరాని ఒక భాగము అను పదం ప్రశ్నోత్తరాలలో కలిసి వచ్చినందుకు బాబూజీతో పాటు అందరూ నవ్వుకొన్నారు.) (ఎల్.ఐ.డి.సి - 66)

 

18. ఆస్ట్రేలియాలో మీ ఆధ్యాత్మిక కేంద్రమున్నదా?

     అక్కడొక మహిళ ఈ కార్యము నిర్వహిస్తున్నది.  కానీ యెక్కువ మంది రావడము లేదు.  కనుక యెవ్వరూ రాకుంటే అంగడి మూసేయమని నేనామెకు చెప్పాను. (ఎల్.ఐ.డి.సి - 74)

 

 19. గురువుకొకరి కావలి యెందుకవసరమౌతున్నది? (ఒక ఆస్ట్రియన్ ప్రశ్న)

     క్రొత్తవారి వల్ల సమయమెంత వృధా అవుతుందో తెలిసి అరికట్టడానికి.  లేదా అవసరంలేని వారితో సమయం వృధా కాకుండా చూడటానికి. (ఎల్.ఐ.డి.సి - 75)

 

2౦. మేము సాయంత్రం చర్చా కార్యక్రమం పెట్టుకోవచ్చా?(జర్మన్ అభ్యాసి ప్రశ్న)

     మీరు యే సమయమైన యెన్నుకోండి, యే రోజైనా పర్వాలేదు.  మీ అందరికి అనుకూలంగా వుంటే సరి. (ఎల్.ఐ.డి.సి - 77)

 

21. ఆదివారం రోజున పనిచేయడం, ధ్యానం చేయడం తప్పు కాదు కదా?

     (పాశ్చాత్యదేశ మతాలు కొన్ని ఆదివారం యేపని చేయకూడదు.  అది విశ్రాంతి దినమని ప్రబోధిస్తాయి కనుక ఈ ప్రశ్న ఉత్పన్నమై యుండవచ్చు)

     యేదినమైనా ఒకటే కాబట్టి ఆదివారం పనిచేయడం తప్పేమీ కాదు.  ఆరాధన కూడా ప్రతిదినం చేయవలసిందే.  ఆదివారమని, మరో ప్రత్యేక దినమని, ధ్యానము చేయకూడని దినాలేవీ లేవు. (ఎల్.ఐ.డి.సి - 87)

 

22. మీరు అమెరికా ఎందుకు విచ్చేశారు?

        ఇప్పుడు మీరు అస్వతంత్రులు.  నేను స్వతంత్రుడను.  మీరు ఆధ్యాత్మికత కావాలనుకుంటే భారతదేశం వైపు చూపు మరల్చాలి.  ఆధ్యాత్మికత కోసం భారతదేశంపై ఆధారపడకుండా చేయడం కోసమే నేనిక్కడకు వచ్చాను.  మనిషికి ఆకలైతే తన గడ్డపైనే కర్బూజాపండును తినవచ్చును.  నేనలా చేయడానికే ఇక్కడకొచ్చాను. (టి అండ్ ఎల్141 - 1)

        మనం చాలా విజ్ఞానాన్ని సముపార్జించుకొనాలి.  కానీ మనం ఆలోచన చేయలేని పెద్ద సోమరులమయ్యాము.  మనం బాగా ఆలోచించాలి.  కేవలం మన బుర్ర (తెలివి) నో, కాలేయాన్నో, కడుపునో కాదు భగవంతునికివ్వవలసింది, హృదయాన్ని సమర్పించాలి. ఇక మిగిలిందంతా దానికై అదే వెన్నంటి వచ్చేస్తుంది.  అది సర్వస్వమైనా, శూన్యమైనా ఏదైనా వచ్చి తీరుతుంది. (టి అండ్ ఎల్144 - 2)

 

9. ధ్యానము.

 

1. మేము మాకు నచ్చిన వస్తువుపై ధ్యానము చేయవచ్చునా? మన పురాతన గ్రంధాలు చాలా వాటిపై చేయవచ్చని చెబుతున్నాయి, ఆకాశము, సముద్రాన్ని కూడా సూచించాయి.  నేను సముద్రముపై ధ్యానం చేయడానికి ప్రాధాన్యతనిస్తాను.  అది అనంతాన్ని చక్కగా సూచిస్తుంది.  నేనలా చేయమంటారా?

    సరి. అది నీవు నిర్ణయించుకోవాలి.  మా గురువులు వృద్ధి చేసిన విధానములో మేము హృదయాంతర్గత వెలుగుపై ధ్యానం చేస్తాము.  అది కూడా ఒక తలంపుగా మాత్రమే.  నీవు మరో దానిపై ధ్యానం చేస్తానంటే, నీవు నీ ధ్యానవస్తువు యొక్క సారాన్ని ఫలితంగా పొందుతావు.  కనుక నీవు సముద్రంపై ధ్యానం చేస్తే ఉప్పు పొందుతావు. (బి.ఇ - 1౦9)

 

2.  మనం హృదయంపైనే యెందుకు ధ్యానం చేయాలి? నా మటుక్కు నాకు తలపై చేస్తే యింకా బాగుంటుందనిపిస్తున్నది. మీరేమంటారు?

     ఇది ఒక పద్ధతి.  మనకు నిర్ణయించి యిచ్చిన పద్ధతి ఇది. (ఐ.డబ్ల్యు - 71)

 

3. ధ్యాన సమయంలో దర్శనమిచ్చే అనుభవాల విషయమేమి?

    అలా దర్శించేవేవీ అవసరమైనవి కావు.  వాస్తవం చెప్పాలంటే అవేవీ మన ఆధ్యాత్మిక ప్రగతిని అంచనా వేసేందుకు పనికిరావు.  వాటికి విలువ లేదు.  అలా ధ్యానంలో దృశ్యమాన మయ్యేటటువంటివి కేవలం నిక్షిప్తం చేయబడిన కర్మానుగత ముద్రలు.  అవి శుద్ధీకరణ సమయంలో పైభాగమునకు తేబడి బయటకు త్రోసివేయబడతాయి.  కనుక మనకు కనబడేంత పైభాగమునకు తేబడిన మన పాత సంస్కారములే అవి.  అట్టి ఆ సంస్కారములు మన ఆలోచనలు, చర్యల వల్ల యేర్పడినవే.  అందువల్ల దృశ్యమానమైన అనుభవములకు ఆధ్యాత్మిక జీవనమున విలువ లేదు. (ఐ.డబ్ల్యు - 156)

 

4. ఒక అభ్యాసి సంవత్సరముల తరబడి ధ్యానము చేస్తూపోగా యీ విధానము సులువౌతూ పోతుందా లేక యీ ఆలోచనలు యిలానే వస్తూనే వుంటాయా?

    అలోచనల తీవ్రత తగ్గుతుంది.  కానీ అది ఒక దినంలో సాధ్యపడదు.  ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ ఒక గంట ధ్యానం చేసే వరకు రా, ఆ తర్వాత ఫలితం గమనించు. (జి.హెచ్ - 78)

 

5. అది చాలా కష్టమైన పని.

    నీవు చేయడం లేదు అందుకే నీకు కష్టమనిపిస్తున్నది.  నేను సులువుగా చేయగలను.  నేనేమీ ప్రత్యేకమైన మనిషిని కాను.  నేను చెయ్యగలుగుతున్నాను అంటే నువ్వు కూడా చేయగలవు. (జి.హెచ్ - 78)

 

6. వెలుగు సంగతేమిటి? మనం వెలుగును చూడాలా?

    సరి. నేను చెప్పేదేమంటే, అది కేవలం ఒక తలంపు.  హృదయంలో వెలుగు ఉన్నది అని అనుకోవాలి.  ఇది ఒక సూచన మాత్రమే. (బి.ఇ - 11౦)

 

7. నేను ధ్యానంలో వెలుగును చూస్తున్నాను.

    నేను మరోచోటెక్కడో వ్రాశాను.  స్వచ్ఛమైన స్థితిలో వెలుగులేదు చీకటీ లేదు.  అది సూర్యోదయ సమయంలో కనబడే వర్ణం.  నారదీయ సూక్తం కూడా యిదే చెబుతున్నది. (బి.ఇ - 111)

 

8. ఎందుచేత కొందరు ధ్యానం చేస్తున్నప్పటికి లోలోతుల్లో శాంతిని పొందలేక పోతున్నారు?

    వారు సక్రమంగా ధ్యానం చేస్తున్నా, ఉన్నది అనుకుంటున్న సత్పదార్తానికి వెనుక ఉన్నారు.

(ఐ.డబ్ల్యు - 124)

 

9. ధ్యానం చురుకుదనంతో కూడుకున్నది కాదు.  అప్పుడు మనం చేస్తున్నదేమీలేదు.  అటువంటప్పుడు ఫలితమెలా లభిస్తుంl?

    మనం హృదయంలో ఈశ్వరీయ ప్రకాశమున్నది అన్న తలంపుతో ధ్యానం చేస్తున్నాం.  అంటే నీవు నీ హృదయంపై క్రీడ సల్పుచున్నావు.  అది దానికై అదే ఒక క్రీడ.  అదీ పనే.  నీవు ధ్యానం చేస్తున్నావని నీకు తెలుసు.  అంటే యేదో చేస్తున్నావనే కదా?  నీవు పనిచేస్తున్న స్థలం హృదయం.  అది ఒకటుంది.  నీవు నీ గమ్యం చేరాలి.  ఈ భావన కూడా వుంది.  అంతర్గతంగా నీవు యేదో ఒక దాని కోసం వేచియున్నావు.  అంటే దానర్థం నీవు జడంగా లేవు.  నీవు పనిలో తీరుబడి లేకుండా వున్నావు.  ఒకేసారి మూడు పనులను చేస్తున్నావు.  కనుక స్తబ్దత చైతన్యంలో మునిగిపోయింది. (ఐ.డబ్ల్యు - 142)

 

1౦. ఆధ్యాత్మిక ప్రగతి కొఱకు బాధ అవసరమా?

    లేదు. అవన్నీ వెనక్కు నెట్టివేయబడ్డాయి.  కానీ నేనొక్క విషయం చెప్పదలచుకొన్నాను.  భారతదేశంలో ఋషులుండే వారు, వారు విశ్వములోని కష్టములన్నీ మాకే కేటాయించమని భగవంతుని యెదుట తమ వినతిపత్రం సమర్పించు కొన్నారు.  నేనిలా అంటున్నందుకు క్షమించండి, ఇప్ప్పుడు నిన్ను నీవు వారితో పోల్చి చూసుకో.

(జి.హెచ్ - 77)

 

11. నేను అధిగమన ధ్యానవిధానం (ట్రాన్సెండెంటల్ మెడిటేషన్) ఒక బిందువు వద్ద మొదలుపెట్టి అవతలి కొసనున్న ‘సున్న’ బిందువునకు పోజూచితిని.  అప్పుడొక బిందువు చేరగానే నా పురోభివృద్ధి నిలిచి పోయినది.  నేను వాస్తవం ఒప్పుకోకపోయి వుంటే అంతకు మించి నేను ముందుకు వెళ్ళివుండే వాడిని కాను గదా?

    నిజమే - ఒక సమర్థ గురువు నీ అడ్డంకిని తొలగించ వలసి యుండెను.  అది గురువు కర్తవ్యము.  నీ గమనం ఆగిపోయిందని తెలియగానే నీవేమి చెయ్యగలవు? నీవు యేమియు చెయ్యలేని స్థితిలో వుంటే, గురువును ప్రార్థించు.  అంతేగాని నీవే గురువై నీవే శిష్యునివై యిద్దరి పనులు ఒకడివే చేయబూనకుము.  ఇది పనిని జఠిలం చేస్తుంది. (ఐ.డబ్ల్యు -17౦)

 

12. ధ్యాన సమయంలో నా శ్వాసక్రియ బాగా తగ్గిపోతున్నది.  కనుక నేను ధ్యానం మానేయాలనుకుంటున్నాను.   ఇలా జరగడం వల్ల ప్రాణవాయువు శరీరంలోనికి ప్రవేశించడం తగ్గిపోతుంది.  దీనివల్ల నా ఆయువు క్షీణిస్తుంది గదా?

    చూడండి మీ శ్వాసక్రియ ధ్యానంలో బాగా తగ్గిపోతున్నదన్నది నిజం.  నీ ఫిర్యాదు సమంజసమైనదే.  నేను నా స్వంత స్థితిని గమనించాను.  ధ్యానంలో చాలా నిముషాలు శ్వాస పూర్తిగానే ఒక్కోసారి నిలిచి పోతున్నది.  ఇది నా స్వానుభవం.  అప్పుడు నేనొక నిర్ణయాని కొచ్చాను.  శరీరంలో యేదో ఒక అవయవముండి తీరాలి.  అది తనకై తానే ప్రాణవాయువు నుత్పత్తి చేసుకుంటూ వుండాలి.  ఇది యెంతవరకు వాస్తవమో నాకు తెలియదు.  కానీ నిజంగా యేదో అవయవమో లేక మరో యేర్పాటో యేదో వుండి అంతర్గతంగా ప్రాణవాయువు నుత్పత్తి చేస్తున్నది.  ఇప్పుడు దానికి సంబంధించిన నిజ నిర్ధారణ దొరికింది.  ఇప్పుడే ఆ సమాచారం నాకందింది. (జి.హెచ్ - 66)

 

13. ఆ అవయవాన్ని గుర్తించేదెలా?

    అది మీ పని.  మీవంటి శాస్త్రజ్ఞులు పరిశోధించి కనుగొనాల్సిన విషయమిది.  ధ్యానం వాస్తవానికి మనిషి ఆయుఃప్రమాణాన్ని పెంచుతుంది.  ఇది నేను కనుగొన్న విషయం. (జి.హెచ్ - 67)

 

14. మనం తాడుపై నడిచేటప్పుడు, పడిపోకుండా సమతూకంగా వుండేట్లు ఏకాగ్రతతో వ్యవహరిస్తాం.  ధ్యానంలో కూడా అంతేకదా?

        అలలు సముద్రం కాదు.  అనేకమైన నీటిబిందువులతో సముద్రమేర్పడింది.  ప్రతి బిందువు తాను సముద్రపు భాగమేనన్న ఎఱుకను వృద్ధి చేసుకోవాలి.  సముద్రం కూడా నీటి బిందువులో వుండనే వుంది. (ఎల్.ఐ.డి.సి - 28)

 15. సంస్కారాలు ధ్యానానికి అడ్డుగా నిలుస్తుంటే యేంచేయాలి? త్వరిత గతిన ఆధ్యాత్మికం అభివృద్ధి చెందటానికి సంస్కారాలను తొలగించు కోవటం యెలా?

     సంస్కారాలను శుష్కింపజేసి, మాడ్చేయవచ్చు. (ఎల్.ఐ.డి.సి - 6౦)

 

16. నేను ధ్యానం చేస్తున్నప్పుడు లాలాజీని దర్శించాను.  కానీ నేను లాలాజీ వారితో బాబూజీ దర్శనం కావాలన్నాను.  ఆ దర్శనమెలా కలుగుతుంది?

     నీలోనికి ఒక శక్తి ప్రవేశపెట్టబడింది.  ఆ స్థాయిలో (నీవున్న స్థాయికి సంబంధించిన) నీ మనస్సుకు వచ్చే యోచనలు ఒక దర్శనానికి కారణమౌతాయి.  అది నీలోనికి ప్రవేశ పెట్టబడిన శక్తి ఆధారంగానే జరుగుతుంది. (ఎల్.ఐ.డి.సి - 64)

       

17. దర్శనమునకు మనస్సే కదా కావలసినది?

     దాన్ని వివరించటానికి మాటలు లేవు.  అది వివరణ కతీతమైనది.  మరణము యొక్క మరణమే సాక్షాత్కారము.  ధ్యానంలో లీనమవ్వడమే లయావస్థ. (ఎల్.ఐ.డి.సి - 65)

 

 18.అప్పుడప్పుడు నాకు ధ్యానంలో పుష్పం కనబడుతున్నది.  అంటే గులాబీ పుష్పము వంటిదన్న మాట.

     ధ్యానంలో యిటువంటివన్నీ బయటికొచ్చేస్తూ వుంటాయి. (ఎల్.ఐ.డి.సి - 65)

 19. మీరు జీవితంలో ధ్యానం నుండి మార్గదర్శకత్వం పొందగలిగారా?

 

     ఏవిధమైన మార్గదర్శకత్వం? ఆధ్యాత్మిక పురోగతి జరుగుతూనే వుంది.  కానీ మనం దాన్ని గ్రహించడానికి సంసిద్ధంగా వుండాలి. (ఎల్.ఐ.డి.సి - 74)

 

2౦. సామూహిక ధ్యానానంతరము మేము మన పుస్తకాల నుండి ఒక పేరాగ్రాఫ్ చదువు కుంటాము. అది సరైనదే కదా?

     దానితోపాటు వివరణ కూడా యివ్వాలి.  అప్పుడందరూ అర్థం చేసుకుంటారు. (ఎల్.ఐ.డి.సి - 76)

 

21. ఆ వివరణ యెవరివ్వాలి?

     మీలో యెవరైనా యివ్వొచ్చు.  ఆరాధనా సమయం లేక ధ్యాన సమయంలో అందరూ సమానమే.  దయార్ద్ర హృదయము, గ్రహించాలనే ఆసక్తి వుండాలి. తొలుత ఆ భావన కలిగి వుండటం ముఖ్యం.  అది సర్వత్రా వ్యాపిస్తుంది. (ఎల్.ఐ.డి.సి - 77)

 

22. ధ్యానమెలా చేయాలి?

     నేను మిమ్మల్ని సహజమార్గ దశనియమముల వ్యాఖ్యానాన్ని చదవమని సలహాయిచ్చాను.  అందులో అన్నీ తెలుపబడ్డాయి. (ఎల్.ఐ.డి.సి - 87)

 

23. ప్రతి చర్యా సంస్కారాన్ని కలిగిస్తుంది.  మరి ధ్యానం కూడా ఒక చర్యే కదా? కనుక అదీ సంస్కారాన్ని ఉత్పన్నం చేస్తుంది కదా?

        కానీ అది పవిత్రసంస్కారాన్ని ఉత్పన్నం చేస్తుంది. దాని భోగాన్ని (అనుభవించడాన్ని) అందరూ ఆకాంక్షిస్తారు. (సహజమార్గ పత్రిక 1/82 - 18)

 

24. అతీంద్రియ స్థితికి, సాధారణ స్థితికి కల తేడాను సాధకుడు ఎలా తెలుసుకుంటాడు?

        సరే - మీకు ఆకలి తీరిందని ఎలా తెలుస్తున్నది చెప్పండి?  మీలోనే ఏదో వున్నది, అది మీ ఆకలి తీరిన విషయం తెలుపుతున్నది.  అతీంద్రియ ఎఱుక అంటే మీరున్న స్థాయి నుండి ఉన్నతంగా ఎదగడమే.  మీకు శుభ్రతకు, అశుభ్రతకు తేడా తెలుస్తుంది.  శుభ్రత హాయిగాను, అశుభ్రత చీకాకుగాను వుంటుంది - ఇదీ అంతే. (సహజమార్గ పత్రిక 1/92 - 21)

 

25. నేను ధ్యానం చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచనలొస్తాయి.  వాటిని బయటకు నెట్టేసి ప్రశాంతంగా వుండాలని ప్రయత్నిస్తాను.  అయినా అవి వస్తూనే వుంటాయి.  ఏమిచేయాలి?

        అవి తమ పాత్రను పోషిస్తున్నాయి.  నీవు నీ పాత్రను పోషించాలి. (సహజమార్గ పత్రిక 9/82 - 2౦)

 

26. శారీరక మరియు ఇంద్రియ వ్యాపారములను ఎలా నియంత్రించాలి? తద్వారా హృదయంపై వాటి ప్రభావం లేకుండా చేసుకొని సంస్కారముల ఉత్పత్తిని ఎలా నిలుపుదల చేసుకోవాలి? ఇంద్రియాలను లోనికి ముడుచుకొని పోయేటట్లు చేసి, ఏవిధంగా వస్తువ్యామోహం నుండి విడుదల పొందాలి?

        పైనతెలిపిన వాటిని నియంత్రించడమనేది ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది.  ప్రాణాహుతి ప్రసారం ద్వారా అట్టి స్థితిని ఉత్పన్నం చేయడం కూడా నాపనిలో ఒక భాగం. అంతేగాకుండా ఇంకొన్ని సూచనలు (విధానాలు) ఉన్నాయి.  వాటిని నీ ఆలోచన ద్వారా ఆహ్వానిస్తే చాలా తొందరగా అట్టిస్థితులు ఉత్పన్నమౌతాయి.  ఇందుకోసం అభ్యాసి నాకు కాస్త సహాయం చేస్తే ఆ పద్దతులను నేను ఉపయోగిస్తాను.  ఈ దీనుని ఆత్మకు, మనస్సును, ఇంద్రియములను క్షణంలో ప్రశాంత పరచే సామర్థ్యమున్నది.  కానీ ఈ పద్దతి కొంత ప్రమాదకరమైనది.  సాహసం చేయాల్సి వస్తుంది.  దీన్ని బాగా పురోగమించిన వారిపైన, అందులోను ప్రత్యేకమైన, అరుదైన వారి విషయంలో మాత్రమే ఉపయోగించాలి. మనిషి వాస్తవికతత్వాన్ని ఈ విధానం ద్వారా ఒక్క క్షణంలో  తిరిగి పోందేట్లు చేయవచ్చును.

        వెయ్యి ‘కాబా’ (ముస్లింల తీర్థయాత్రా స్థలము) ల కన్నా ఒక హృదయమే మెరుగైనది. (సహజమార్గ పత్రిక 1/91 - 21)

 

27. రాజయోగంలో తొలిదశలోనే ధ్యానంతో ప్రారంభించి పురోగమించమన్నారు ఎందుచేత?

      జవాబు చాలా సరళము మరియు సులువైనది.  మనల్ని మనం ఒకే చోట కేంద్రీకరించుకొంటున్నాం.  తద్వారా మన వ్యక్తిగతమనస్సు అటూ యిటూ తిరుగాడుతూవుండే అలవాటును వదలుకుంటుంది.  ఇట్టి నిలకడలేనితనాన్ని అది సంతరించుకొని యున్నది.  ఇప్పుడు దాని అలవాటుని సవరించుకొంటున్నది.  ధ్యానమే ఆధ్యాత్మికతకు పునాది. (అధ్యాత్మవిద్య 7/2౦14 - 8)

 

28. మనం ధ్యానం చేసేటప్పుడు యేం జరుగుతుంది?

             మనం ధ్యానం చేసేటప్పుడు మనకున్న కేంద్రశక్తి క్రియాశీలమై వుంటుంది.  చుట్టుముట్టియున్న మేఘములను యిది చెదరగొడుతుంది.  వాటి శక్తిని చాలా మటుకు ఆరిపోయేట్లు చేస్తుంది.  ప్రత్యక్షంగా అభ్యాసి దీన్ని గమనించ గలడు.  మనస్సు క్రమశిక్షణలోనికి తేబడుతుంది.  సహజసిద్ధంగా క్రమబద్దీకరింపబడుతుంది.  ఇంద్రియాలు అదుపులోనికి రావడం మొదలౌతుంది. (అధ్యాత్మవిద్య 7/2౦14 - 8, 9)

 

29. ధ్యానం చేసుకోవడానికి మనకు గురువు యొక్క ఆవశ్యకత యేమిటి?

     ఎందుకు మనం బడికి వెళ్ళాలి?  ముందు దీనికి సమాధానం చెప్పండి?  వెళ్ళి ఊరికే కూర్చొంటాము - తెలివిలేనివాని వలె ఉండిపోతాము.  అంతేనా? బడి గది యున్నది కానీ ఉపాధ్యాయుడూ ఉండి తీరాలి.  ధ్యానం చేసుకోవడానికి మరిన్ని కారణాలు కూడా వున్నాయి.  అది నిన్ను ప్రశాంతంగా వుంచుతుంది.  యితర చెడు ఆలోచనలనుండి నిన్ను దూరం చేస్తుంది.  అది భగవంతునితో మనకు అనుబంధ మేర్పరుస్తుంది. (అధ్యాత్మవిద్య 7/2౦14 - 12)

 

3౦. గురువుగారు! ధ్యాన సమయంలో మన మెందుకు కొన్ని సమయాల్లో ఎక్కువగా వేడెక్కుతాము?

 

     ఓ! అది సరికాదు.  జనులు అలా అన్వయించి చెప్పారు.  ఆలోచనలు జడత్వంపై పని చేయడంవల్ల కొద్దిపాటి ఉష్ణం విడుదలౌతుంది.  మహనీయులు అలా చెప్పారు.  ఒక రకంగా అది మంచిదే.  కానీ మనం దానికోసం యెదురుచూడడము లేదు.  అలా చేయకూడదు కూడా.  గురువు, అవతలి మండలంలోనికి ఒక త్రోపు తోయడానికి అవసరమని నేను వ్రాసియున్నాను.  నీవు పురోగతి చెందే కొద్దీ సూక్ష్మాతి సూక్ష్మమైన వాతావరణాలలో ప్రవేశింప వలసి వస్తుంది.  అక్కడకు గురువుగారి త్రోపు లేకుండా నీశక్తితో నీవు ప్రవేశింపజ్ఆలవు.  ఇది నేను రోజువారి దినచర్యలో గమనించిన అనుభవము.  సాక్షాత్కారమునకై తృష్ణ చాలా అవసరము.  దీన్నే ఆతురత, విశ్రాంతిలేమి అని అంటారు.  ఒకవేళ సమయానికి నీకు ఆహారం యివ్వలేదనుకోండి, నీవు ఒక గంట వేచి చూచావు, రెండు గంటలు నిరీక్షించావు.  ఆ తర్వాత ఒక విధమైన ఆతృత బయలు దేరుతుంది.  ఆకలి వుంది గనుక ఆతృత గలిగింది.  ఆకలి, ఆతృత అశాంతిగా మారి ఒత్తిడి కలిగించింది.  కనుక భగవంతుని కొఱకు నీవు ఆతృత పడాలి - భగవంతుడంటే వెలుగులేని వెలుతురు. (అధ్యాత్మవిద్య 7/2౦14 - 12,13)

 

31. నాలో మీరు యెలా లయావస్థను ఉత్పన్నం చేస్తారు?

      నేను లయావస్థను ఉత్పన్నం చేయను.  అభ్యాసులు దాన్ని పొందటానికి నేను సహాయపడతాను.   (అధ్యాత్మవిద్య 7/2౦14 - 14)

 

32. ఒక గంటసేపు మేము ధ్యానానికి కూర్చొంటాము.  ఆ తర్వాత దానికి సంబంధించిన ఆలోచన ఉండదు.  ఇది మాకు కొంత కష్టంగా వుంది.  యేం చేయమంటారు?

      మనం మనస్సును చెడగొట్టాము.  దాన్ని మనం సరిచేసుకోవాలి.  ఒక గృహస్థుడు చాలా పనులు చేసుకోవలసి వుంటుంది.  ధ్యానం తర్వాత తన పనిలో తాను మునిగిపోతాడు.  ఇది నీకు ఒక గుణపాఠం నేర్పుతుంది.  నీవు భగవంతునిలో కూడా లీనమవ్వాలి.  భగవత్ సాక్షాత్కారాన్ని ఒక యినుపముక్కలా భావించకు అది నీవు సేవించవలసిన అమృతమని తెలుసుకో.  నీవు శ్రద్ధవహిస్తే అది భారం కాకుండా పోతుంది.  విశేషమైన ప్రయోజనకారిగా వుంటుంది. (అధ్యాత్మవిద్య 7/2౦14 - 14)

 

1౦. నిరంతరస్మరణ

 

1. అతిసులభము మరియు ప్రతిభావంతము (గురితప్పనిది)యైన భగవత్‌సాక్షాత్కార విధానమేది?

     "నిరంతర స్మరణ, అది ఆతృత భావననుత్పన్నము చేయును.  బిందువు బిందువు కలిసి సింధువౌతుంది.  మరుపే స్మరణము." (ఎల్.ఐ.డి.సి - 42)

 

2. బాబూజీ! ప్రపంచంలోని మన ఆధ్యాత్మిక కేంద్రములన్నింటికీ దయతో మీరోక సందేశమివ్వండి!

       నా సహచరులను నేను ప్రస్తుతిస్తున్నాను

       జ్ఞానాతీతమైన దానిపై పురోగమించండి

       సర్వులను ప్రేమించే వానిని మీరు ప్రేమించండి.

       గమ్యం అట్టే దూరంలో లేదు.

       స్మరణయే దానికి సాధనము.

       మీ అందరికి నా దీవెనలు.”

 

(ఈ సందేశం మీద బాబూజీ సంతకం చేసి యిచ్చారు - ప్రతులు వివిధ కేంద్రాలకు పంపించడమైనది)

(ఎల్.ఐ.డి.సి-88)

 

 3. నిరంతరస్మరణ దానికై అదే సహజసిద్ధంగా ఉత్పన్నమౌతుందా లేక దానికోసం సాధకులు ప్రయత్నపూర్వకపనిగా చేపట్టాలా?

    విశేషంగా ప్రేమ వుంటే అది స్వతహాగా సహజంగా ఉత్పన్నమౌతుంది. (జి.హెచ్ - 78)

 

4. నిరంతరస్మరణ నభివృద్ధి చేసుకోవడాని కేదైనా మార్గముందా? ఎలా వృద్ధి చేసుకోవాలి?

    మనం ఒకటంటే ఒకే దానిపైనే మళ్ళీమళ్ళీ ఆలోచననుంచాలి.  ఆ భావన హృదయంలో నిలకడగా వుండాలి.  అది యేదో మంత్రం మాదిరి వల్లించడం కాదు.  నేను సరిగ్గా చెప్పానో లేదో మరి. (జి.హెచ్ - 123)

 

5. పురోభివృద్ధికి సమాధి అవసరమా?

    నేనొక విషయం చెప్పదలచుకొన్నాను.  ప్రతి యొక్కరు సమాధిని పట్టుకొని వ్రేలాడుతున్నారు.  వాస్తవానికి పురోభివృద్ధికి అది అవసరంలేదు.  పురోభివృద్ధి అంటే నా భావనలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి అని అర్థం.  దాని కిదేం అవసరం లేదు.  నే నెప్పుడూ ఒక ఆధారంతోనే మాట్లాడతాను. (జి.హెచ్ - 1౦౦)

 

6. సమాధిని గురించి యేమైనా చెబుతారా?

    సమాధి దానికై అదే యేర్పడుతుంది.  అది చెడు విషయం కాదు.  కానీ ఎప్పుడూ దైవీయ యెఱుకగలిగి యుండాలి.  దాని సహాయంతో మీరు ముందుకు పోవాలి.  దైవీయ యెఱుక లేకపోతే, యేమీ లేనట్లే. (జి.హెచ్ - 1౦1)

 

11. శ్రద్ధ

 

1. శ్రద్ధ యెలా యేర్పడుతుంది? లేక శ్రద్ధను, వ్యక్తిలో యెలా వృద్ధి చేయగలం?

    వాస్తవం చెప్పాలంటే శ్రద్ధ తొలుత అవసరంలేదు.  మనం చేయవలసిందల్లా ఒకరిపై నమ్మకముంచి మొదలు పెట్టడమే.  అప్పుడు నీలో నీవు అభివృద్ధి చెందుచున్నట్లు గమనించినట్లయిన శ్రద్ధ దానికై అదే వృద్ధియౌతుంది.  ఇప్పుడొక విషయం చెబుతాను.  జనులు అంతరాత్మను గురించి చాలా మాట్లాడుతూ వుంటారు.  అంతరాత్మ మనకు మార్గదర్శి కావాలి.  కాని మన యెన్నిక కనుగుణంగా అంతరాత్మ పని చేయాలి.  ఇప్పుడు చెప్పండి అంతరాత్మంటే యేమిటో?  వాస్తవానికి అది మన మనస్సు బుద్ధి, చిత్తము మరియు అహంకారము యొక్క స్థాయిలను సూచిస్తుంది.  అవి సమతకు తేబడి అసలు యోచనతో అవి యెప్పుడు ఐక్యమౌతాయో అప్పుడది నిజమైన అంతరాత్మౌతుంది. (ఐ.డబ్ల్యు - 72)

 

2. శ్రద్ధను గురించి యోచిస్తే అది ఒక వరమా? లేక అది మన సంకల్ప చర్యా?

    రెండూ సరియైన యోచనలే. (జి.హెచ్ - 125)

 

 3. మీరు గమ్యమును చేరుటను గురించి మాట్లాడినపుడు, శ్రద్ధ మరియు ధృఢసంకల్పము అవసరమన్నారు.  మీరు గమ్యం చేరడానికి ఆత్మార్పణం కూడా అవసరమన్నారు.  ఇప్పుడు ధృఢ సంకల్పం మరియు ఆత్మార్పణం ఈ రెండింటిలో యేది ముందు? ఒకదాని తర్వాత ఒకటా లేక అవి రెండూ ఒకేసారి ఉండాలా?

    ఆత్మార్పణం ముఖ్యం.  కాని సంకల్పం ముందు చేయాలి.  నా దృష్టిలో యీ రెండూ ఒకటే.  కానీ వాస్తవం చెప్పాలంటే అవి రెండూ విభిన్న రంగుల్లో వున్నాయి. (జి.హెచ్ - 125)

 

4. ప్రేమ విషయం యేమిటి?  అది అవసరమా? అసలు ప్రేమంటే యేమిటి?

         నిజమే. ప్రేమ అత్యవసరమని నేను చెబుతున్నాను.  గురువు యెడ ప్రేమ లేక భగవంతుని యెడ ప్రేమ తప్పక వుండాలి.  కానీ ఆధ్యాత్మిక పురోగమన దశలో ఒక స్థాయి ప్రాప్తిస్తుంది.  అప్పుడు ప్రేమ కూడా వెలసిపోయి కానరాకుండా పోతుంది. నీ వెందుకు ప్రేమిస్తున్నావో, యేమి కావాలని ఆశించి ప్రేమిస్తున్నవో నీకసలే తెలియకపోతే, అదే ప్రేమ. (బి.ఇ - 11౦)

 

5. పురోగతిని తెలుసుకోవడమెలా?

     నీకు శ్రద్ధలేదు అంటే, నీవు పురోగమించడం లేదని భావించు. (ఎల్.ఐ.డి.సి - 71)

 

 

12. ప్రాణాహుతి

 

1. గురువర్యులతోనే నిరంతరం వున్నామని, యెలా గుర్తించగలము?

     సూచించిన విధానంలో ఆయనతో నిన్ను నీవు అనుసంధించుకో శూన్యం యేర్పడుతుంది.  ఆ శూన్యంలోనికి గురువుగారి ప్రాణాహుతి ప్రసారం చొరబడుతుంది.  నీవెక్కడున్నా యిది జరిగిపోతుంది.  (ఎల్.ఐ.డి.సి - 48)

 

2. గురువు ఒకరికి ఒకస్థాయిలో ప్రాణాహుతి ప్రసారం చేస్తే, నీకు రావలసిన భాగం నీకు లభిస్తుంది.  ఇది లయావస్థ ప్రతిఫలం కదా?

     శరణాగతి ఒక మార్గమే కానీ అదే గమ్యంకాదు.  భగవంతుడు హృదయావసరం తీర్చడానికి వస్తాడు.  అంటే మన మానసిక వాంఛలకు అలభ్యుడు.  అవసరం హృదయం నుండి ఉత్పన్నమౌతున్నది.  వాంఛ (ఇచ్ఛ) మనస్సు నుండి వెలువడుతున్నది. (ఎల్.ఐ.డి.సి - 52)

 

3. దివ్యశక్తి ప్రసారం యెలా జరుగుతుంది? దాని ప్రభావమేమి?

     కొన్నిసార్లు నేను మాటల ద్వారా ప్రసారం చేస్తాను.  మీలో యెవరైనా కేంద్ర మండలం నుండి గానం చేస్తే అది వినాశకర శక్తి నుత్పన్నంజేస్తుంది. (ఎల్.ఐ.డి.సి - 86)

 

 4. ప్రాణాహుతి ప్రసారమనగా నేమి?

    ప్రాణాహుతి ప్రసారమనగా మానవునిలో మార్పు తెచ్చుటకు దైవీయశక్తిని ఉపయోగ పెట్టుట.    (ఐ.డబ్ల్యు - 69)

 

5. ఈ ప్రాణాహుతి మీపై యెలా పనిచేస్తుంది?  దాన్ని గురించి కాస్తా వివరిస్తారా?

    ఇది దివ్యశక్తిని నీలోనికి తీసుక వస్తుంది.  తదనంతరం యిది పని చేస్తుంది.  ఆ విధమైన దివ్యశక్తి నీలోనికి ప్రవహిస్తూ అది పనిచేస్తుంది. (ఐ.డబ్ల్యు - 8౦)

 

6. కానీ అది మీపై యెలా పనిచేస్తుంది?

    మీ ఉద్దేశ్యంలో అది నాపై యెలా పనిచేస్తుందని గదా మీ ప్రశ్న.  సరి నాపై అది పనిచేసి నాలో అది మానసిక సమతుల్యతా స్థితిని నెలకొల్పుతున్నది.  భేదభావస్థితి నశించింది.  ప్రాణాహుతి ప్రభావం యిది. (ఐ.డబ్ల్యు - 81)

 

7. మీరు దాన్ని అనుభవంలో గ్రహిస్తున్నారా?

    అవును.  మనం సున్నిత మనస్కులమైతే, అనుభవంలో గ్రహించ వచ్చు.  ఒకవేళ మీరు దాన్ని అనుభవంలో గ్రహించలేకపోయినా, అది మీలో తెచ్చిన మార్పులనుబట్టి దాని ప్రభావాన్ని అంగీకరించేట్లు చేస్తుంది.       (ఐ.డబ్ల్యు - 81)

 

 

13. అహంకారము

 

1. అహంకారమంటే యేమిటి?

    అహంకారము చెడ్డదేం కాదు.  వాస్తవం చెప్పాలంటే అది ఒక సూచి.  అది ఒక విషయాన్ని సూచిస్తుంది.  ఇప్పుడిక్కడొక మేజా వున్నది.  దాన్ని నేను పైకెత్త గలను.  నేను దాన్ని పైకెత్తడానికి కారణం నాలోని అహంకార శక్తియే.  ఈ మేజాను నేను పైకెత్తగలనని అది చెబుతున్నది.  కనుక అహంకారము చెడ్డదేం కాదు.  కాని దోషమెక్కడుందంటే దాన్ని మనం అహానికున్న తెలివితో అనుబంధించి యీ మేజాను నా శరీరంతో ఎత్తుతున్నా ననుకోవడమే.  అదే తప్పు.  అహానికున్న తెలివిని నేను శరీరంగా భావిస్తున్నాను.  కనుక నిజానికి నేను కలిగి యున్న శక్తి ఆచూకీని తెలుపు ఒక సూచీయే అహంకారము.  నేను అహాన్ని పెగలించి వేయుటకు వ్యతిరేకిని.  ఎందుకంటే దాన్ని నాశనం చేసి యే పని చేయలేము.  అందరు మహాత్ములు, కనీసం భారతీయ మహనీయులందరూ అహాన్ని నిర్మూలించి వ్రేయడం అవసరమని యిప్పటికీ చెబుతున్నారు.  కానీ నేను దీనికి వ్యతిరేకిని. (ఐ.డబ్ల్యు - 169)

 

2. దయచేసి అహంకారాన్ని గురించి యింకాస్తా వివరంగా చెప్పండి.

    అహంకారమంటే యేమిటో నేను మీకు తెలియ జేస్తాను.  మనిషి భగవంతుని కార్యాన్ని నిర్వహిస్తూ తన పనిని భగవంతుని పైకి నెట్టి వేస్తున్నాడు.  వచ్చిన కష్టమంతా అసలిదే.  మనం మన పాత్రను పోషించి, భగవంతుణ్ణి తన పనిని తన పద్ధతిలో చేయనియ్యాలి. (ఐ.డబ్ల్యు - 17౦)

 

3. చెడ్డమనుషులం, చెడ్డ పద్దతులు అంటే యేవి?

    ప్రకృతి విరుద్ధమైన పనులు చేయడం చెడ్డపని.  మనిషిని ఆధ్యాత్మికముగా శారీరకంగా బలవంతులను చేయడం మంచిపని.  మనిషిని మానసికంగా శారీరకంగా బలహీన పరచే పనిని యెన్నుకోవడం తప్పు.      (ఐ.డబ్ల్యు - 15)

 

4. స్వార్థాన్ని మీరు సరిగ్గా యెలా నిర్వచించ గలరు?

    ఇతరుల చేత సేవను పొంది ఆ సేవకు నీ హృదయం కృతజ్ఞత తెలుపకుండా పోతే దాన్ని స్వార్థమనవచ్చును. (ఐ.డబ్ల్యు - 1౦9)

 

5. గురువుగారూ! భయం యొక్క లక్షణమేమి?

    భయమనునది వివేకము యొక్క భ్రమ.  వివేకం సరిగ్గా వుంటే (భ్రమకు లోనుగాకుండా వుంటే) భయ మనునదే లేదు. (ఐ.డబ్ల్యు - 199)

 

6. గురువుగారూ! మీరు భ్రమను మాయగా భావిస్తారా?

     లేదు.  మాయను సామాన్యంగా భ్రమ అనుకుంటారు.  కానీ నేను అంగీకరించను.  నేను భగవంతుని శక్తిని మాయ అనుకుంటాను.  ఈ శక్తి యెలా పని చేస్తుందో తెలియనప్పుడు కలవరపడి మాయ అనుకుంటాము.  కానీ భగవత్ శక్తి యెలా పనిచేస్తుందో మనకు తెలిస్తే అప్పుడు మనం సత్యతత్త్వాన్ని గ్రహించ గలుగుతాం.  కనుక వాస్తవంలో యిదంతా మన అజ్ఞానమే.  మేధావులు జ్ఞానాన్ని అరువు దెచ్చుకొంటారు.  దివ్యమయనీయుడు జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తాడు. (ఐ.డబ్ల్యు - 199)

 

7. నా మూడు ప్రశ్నల జవాబు కోసం మహాత్మునికై నిరీక్షిస్తున్నాను!

        నేను మహాత్ముణ్ణి కాను.  (ఇది అతని మనస్సులో ఉన్న నాల్గవ ప్రశ్న.  ఈ మాట  అనగానే నేనెవరిని? అని మొదటి ప్రశ్న వేశాడు) “నీవేమిటో నీకు తెలిసే వరకు చెప్పేదేమీలేదు.  దీనితో నీ ప్రశ్నలన్నిటికీ ఒకే మాటతో జవాబివ్వబడినవి.”

        సరైన ప్రశ్న జవాబును తన గర్భములో సదా నిండుగా నింపుకొని వుంటుంది.  అతీంద్రియ స్థితి ద్వారా నీవు రహస్యాలను ఛేదించవచ్చును. (ఎల్.ఐ.డి.సి - 55)

 

8. మనమెప్పుడు లీనమవ్వడం మొదలౌతుంది?

        అహం లేనప్పుడే.  కొన్ని సందర్భాలలో స్మరణే మరుపౌతుంది. (టి అండ్ ఎల్ - 62)

 

 

 

9. సంపూర్ణత సాధించినారనడానికి గుర్తులేమీ?

     చాలా సులభం.  నీవు ‘నేను’ అన్నపదం వాడతావు.  కానీ ఆ పదం యెవర్ని ఉద్దేశించి వాడావో నీకు తెలియదు, దానికి సంబంధించిన భావన కూడా నీకుండదు. (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక, సూరత్ 1982 - 89)

 

1౦. అహం భావమంటే?

     బరువులేని పదార్థం. (సహజమార్గ పత్రిక-11/82-15)

 

14. ప్రత్యేకావతారమూర్తి-అవతారాలు.

 

1. మీరు భగవదీయ ప్రత్యేకావతార మూర్తిని గురించి వ్రాశారు.  అతడిప్పుడున్నాడు గనుక మోక్షం (విడుదల) చాలా తేలికన్నారు.  మీ ఉద్దేశ్యంలో ఆ ప్రత్యేకావతార మూర్తి అంటే యేమిటి?

     అతడు పావన మూర్తి.  అతన్ని పావన మూర్తియని పిలుస్తారు. (జి.హెచ్ - 122)

       

2. ఆయన మానవ శరీరధారుడైన అవతారమా?

     అవును. అతడట్టివాడనే నేనూ చెబుతున్నాను. (జి.హెచ్ - 122)

 

 

 

3. ఆయన అవతారమే నంటారా?

     మహాత్ములు అకారణంగా ఊరకే జన్మింపరు.  వారి కోసం ప్రపంచం ఆతృతతో వారి నుండి ఒక మహత్కార్యాన్నాశించి నిరీక్షిస్తున్నప్పుడు వారు జన్మిస్తారు. (జి.హెచ్ - 122)

 

4. యేది ఆ ప్రత్యేక అవతారము?

     సరి. అది రహస్యం. (జి.హెచ్ - 79)

 

5. అయితే ఆయనిప్పుడు అవతరించాడు కదా?  నేను తెలుసుకోవచ్చునా?

     ఆ ప్రత్యేకావతార పురుషుణ్ణి యెలా గుర్తించాలో నేను ముందే వ్రాశాను.  మీరెందుకు ప్రయత్నించరు?  మీకేదైనా కావలను కుంటే దానికోసం ప్రయత్నించి కనుగొంటారు. (జి.హెచ్ - 122)

 

6. పూర్వపు అవతారాలు చేసిన పనిని గూర్చి కాస్తా విశ్లేషించండి.

     రామచంద్ర ప్రభువు, అంటే అవతారపురుషుడు సంఘమున ధర్మమునకు, సదాచారమునకు పునాదులు వేసెను.  ఈ పునాదులపైననే సాధనలో భక్తిని శ్రీకృష్ణపరమాత్మ ప్రవేశ పెట్టెను.  అంటే ప్రతి అవతారము ముందుటి అవతారము చేసిన పనిపై తన పని కొనసాగించెను.  ఇదీ పద్ధతి.  ఈ ప్రకారం చూస్తే ముందుటి అవతారములకన్న తర్వాత వచ్చిన అవతారములు గొప్పవి.  ఈ విధంగా చూస్తే సాధారణంగా రామచంద్రుని కన్నా కృష్ణుడే గొప్పవాడుగా పరిగణించ వలసి వస్తుంది.

      కానీ మరో దృక్పదంతో చూస్తే ఈ హెచ్చుతగ్గుల పరిగణన తప్పు.  ఒక్కో అవతారం ఒక్కో సమయంలో కాలాన్ననుసరించి కార్యనిర్వహణకు దిగి వస్తుంది.  అందువల్ల యెక్కువ, తక్కువల ప్రసక్తే లేదు.  కేవలం అవసరం మాత్రమే పెద్దదో, చిన్నదో అయి వుంటుంది కాని అవతారాలు కాదు. (ఫేస్ టు ఫేస్ - 77)

 

7. మీకింకా యేమైనా అవతారాలు మిగిలి ఉన్నాయా?

     సరి. ఈ విషయమై నేను సమాధానమివ్వలేను.  ఎవరు ఒక అవతారాన్ని అంగీకరించడానికి యిష్టపడరో వారే మీకు సమాధాన మివ్వ గలరు. (ఐ.డబ్ల్యు - 92)

 

8. పరివేషము (ముఖము చుట్టూగల కాంతి వలయము) గురించి వివరించండి?

     శరీరమునకు ఈ పరివేషము లోభాగంలో వుంటుంది, బయట కాదు.  మనిషిలో యీ పరివేషము మూడు రంగుల్లో వుంటుంది.  అవి ఎఱుపు, నలుపు మరొకటి, దాన్ని దివ్య ప్రకాశవంత మనవచ్చును.  నలుపు చాలా చెడ్డది.  అది దూర్తవర్తనము, దుశ్శీలత మొదలగు వాటిని సూచిస్తుంది.  ఎఱుపు అసహనాన్ని, కోపాన్ని సూచిస్తుంది.  ప్రకాశమానమైన వెలుగు ఆధ్యాత్మికతను సూచిస్తుంది.  ఈ వర్ణము ముఖమండలం చుట్టు చెంపల మీదుగా కనిపిస్తుంది.  ఈ పరివేష పరిశీలనము చేయడమెలాగంటే, మనిషిలోనికి, అతని స్థితి లోతులలోనికి వెళితే అక్కడ అంతర్గతంగానున్న వాస్తవ పరివేషం యెఱుక పడుతుంది. (ఐ.డబ్ల్యు - 36)

 

9. నేను ఈ రంగులను ముఖము యొక్క చర్మపు పొరలలో మాత్రమే చూచితిని.

     నీవు చెప్పేది సరియైనదే, అవి అగుపడేటప్పుడు అక్కడే కనబడతాయి. (ఐ.డబ్ల్యు - 37)

 

1౦. నేను నీలవర్ణం తరచు చూచాను.  గురువులు చెప్పినట్లు యీ నీలం లేదు కదా! దీనికి వివరణ దయచేసి యివ్వండి.

     హృదయ మండలంలోని ఒక్కో కేంద్రం ఒక్కో వర్ణంలో వుంటుంది.  అభ్యాసి స్థితిని గమనించేటప్పుడు ఒకానొక కేంద్రం యొక్క వర్ణం కనిపించి వుండవచ్చు.  దాన్నే పరివేషపు వర్ణంగా పొరబడి యుండవచ్చును.    (ఐ.డబ్ల్యు - 37)

 

11. మీరెవరో వివరించ గలరా? ఇది అర్థ రహితమైన ప్రశ్న కావచ్చు.  అయినా అడుగుతున్నాను.

     నేను యేమై యుండాలో అలా వున్నవాడిని. (ఐ.డబ్ల్యు-81)

 

 

12. అది సరే కానీ మరికాస్తా ఎక్కువ చెప్పగలరా?

     ఎక్కువగా, మరింత ఎక్కువగా మరియు తక్కువగా మరింత తక్కువగా అన్న వాటికి యేలాంటి విలువ లేదు. (ఐ.డబ్ల్యు - 81)

 

13. జీసస్ ప్రభువు కూడా ఒక అవతారమేనా?

        ఇటువంటి ప్రశ్నలకు ప్రత్యుత్తరమీయవలసిన పనిలేదు. (ఎల్.ఐ.డి.సి - 28)

 

14. మహనీయులు భూమిపై యెప్పుడు అవతరిస్తారు?

     మహనీయులు అకారణముగా ఉన్నట్టుండి జన్మింపరు.  వారి కొఱకు ప్రపంచము ఆత్రుతతో ఆశతో యెదురు చూచుచున్నప్పుడే వారుద్భవింతురు. (ఎల్.ఐ.డి.సి - 42)

 

15. మాహాత్ముణ్ణి గుర్తించే విధానమేది?

     కొన్ని శతాబ్దాల క్రితం వ్రాయబడి చెన్నైలో లభించిన ఒక పవిత్ర హస్తసాముద్రిక శాస్త్రంలో "యిక రాబోవు ప్రత్యేక మహాత్ముడు రామచంద్ర" అని వ్రాయబడి యున్నది. (ఎల్.ఐ.డి.సి - 48)

 

16. అవతార మూర్తులు ప్రకృతి కార్యనిర్వహణకై ఎంత కాలమున ఒకసారి వస్తుంటారు?

     ప్రపంచంలో ఇక్కడో, అక్కడో, ఎక్కడో ఓచోట ఎప్పుడూ ఒకరుండనే వుంటారు.  సమర్థగురు శ్రీ లాలాజీ వారి ప్రార్థన ఫలితంగా ఈ ఏర్పాటు జరిగింది.  ఇట్టి సామాన్య విశ్వాసానికి భిన్నంగా ఒక అవతారమూర్తి 1౦౦౦-15౦౦ సంవత్సరాల కొకరుగా ఉద్భవిస్తారు.  కాని ఎప్పుడూ ఒక అవతారమూర్తి మాత్రం ఉంటారు. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 15)

 

15. మానవజీవితం

 

1. తమరు ప్రపంచాన్ని యెలా నిర్వచిస్తారు?

     ఈ ప్రపంచం సత్యతత్త్వం యొక్క అతిశయోక్తియని చెబుతాను.(ఐ.డబ్ల్యు - 63)

 

2. విశ్వప్రేమనెలా సాధించాలి?

     వాస్తవాంశ మేమంటే ప్రేమనంతా భగవంతునికే బదలాయించాలి.  ఒకదాని ధ్యాస అన్నిటిపై ధ్యాసను తెస్తుంది.  నేను నిన్ను ప్రేమిస్తున్నా నంటే నీ బిడ్డలను కూడా ప్రేమిస్తున్నట్లే.  ఒక సంఘము విశ్వప్రేమను గత 4౦ సంవత్సరములనుండి ప్రబోధిస్తున్నది.  అయినా ప్రయోజనమేమీ లేదు.  ఎందుచేత? ద్వేషముండటము చేత.  ద్వేషము హృదయములో వుండటము చేత, ద్వేషాన్ని తొలగించు ప్రేమ దానికై అదే వృద్ధి చెందుతుంది.  కనుక దానిపై మీరు పనిచేయకండి, కాని దాని మూలంపై పని చేయండి. (ఐ.డబ్ల్యు - 17౦)

 

3. మానవ జీవితము యే ప్రయోజనము కొఱకు, యేమాశించి మనిషి బ్రతుక వలెను?

     భగవత్‌సాక్షాత్కారము కొఱకే లేక దైవీయమైయున్న తన తత్త్వమును నెఱుంగుట కొఱకే మానవ జీవితమున్నది. (ఐ.డబ్ల్యు - 74)

 

4. జీవితమంటే?

     జీవితమంటే చాలా నిర్వచనాలే వున్నాయ్.  నా నిర్వచనం చెబుతాను, జీవితంలో జీవించడమే నిజమైన జీవితము. (ఎస్.ఎమ్.ఇ - 53)

 

5. ‘విడుదల’, స్వాతంత్ర్యము పొందివుండటమనే పదాల అర్థమేమి?

     విడుదల.  నీవు యీ విడుదల నుండి విడుదల పొందితే అదే నిజమైన విడుదల. (ఐ.డబ్ల్యు - 83)

 

6. విడుదల నుండే విడుదలా?

     అవును, అదే నిజమైన స్వాతంత్ర్యం. అది నీవు విడుదల అను భావము నుండి విడుదల పొందినప్పుడే సంభవం. (ఐ.డబ్ల్యు - 84)

 

7. మనిషి యొక్క నీతి అంటే యేమిటి?

     మహోన్నతమైన వాటిని గురించి యోచించడమే మనిషి నీతి.  దాన్ని గురించి యోచిస్తే దాన్ని నీవు కూడా పొందుతావు.  దానికోసం ప్రయత్నించు.  ప్రపంచ దేశాల నాగరికతంతా ఓ 1౦ సంవత్సరాలలో మెరుగుపడాలని నేననుకుంటున్నాను.  మనిషి యొక్క గొప్ప మూర్ఖత్వ- మేమిటో చెప్పగలరా? నేను చెబుతాను.  మనమెప్పుడూ గతాన్ని పట్టుకొని వేలాడుతుంటాం.  భవిష్యత్తును నిర్మించడం విస్మరిస్తాం.  అదే మన గొప్ప మూర్ఖత్వం. (ఐ.డబ్ల్యు - 15౦)

 

8. సంకల్పము మరియు వాంఛ వేరు వేరా?

     వాంఛ తన స్థానంలో అది పనికిరానిది.  అయితే దానిని చక్కగా మలచుకుంటే మంచిదే.  మనం వాంఛను తప్పు మార్గంలో వాడుకుంటున్నాం.  వాంఛాఫలసిద్ధికి ఉపయోగించే విధానమే సంకల్పము. (ఐ.డబ్ల్యు - 151)

 

9. వివేకమంటే యేమిటి?

     భగవత్ శక్తిని సద్వినియోగ పరచుకోవడమే వివేకము. (ఐ.డబ్ల్యు - 168)

 

 1౦. వాస్తవ జీవిత లక్ష్యమును గురించి మరింత తెలియజేయండి గురూజీ?

     లక్ష్యంలో నన్ను నేను కోల్పోయాను. (జి.హెచ్ - 1౦3)

 

11. సన్యాసం మీద అభిప్రాయం తెలపండి గురూజీ.

     సన్యాసం అవసరంలేనిది. (ఐ.డబ్ల్యు - 91)

 

 

12. ఎందుచేత?

     ఎందుకంటే వారు సన్యసించి అడవికి వెళ్ళి తరచూ వారి కుటుంబాన్ని, బిడ్డలను యింకా యిటువంటి వెన్నిటినో ఆలోచిస్తుంటారు.  అటువంటప్పుడు అక్కడికెందుకెళ్ళాలి.  ఆకర్షణలకు లోనుగాకుండా, జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా యిక్కడే ఉండిపోవచ్చు కదా? పారిపోవాల్సిన అవసరం లేదు.  భగవంతుడు మనకు చౌకగా దొరుకుతున్నప్పుడు యీ అగచాట్లెందుకు. (ఐ.డబ్ల్యు - 91)

 

13. గురూజీ మాంసాహారం గురించి యేమంటారు?

     నేను మీతో సహకరించే జవాబు చెబుతున్నాను.  మీరు యిటువంటివి మానుకునే వరకు అనుమతిస్తాను.  (జి.హెచ్ - 65)

 

14. మేము మాంసం తింటే మీకు పని ఎక్కువౌతుంది కదా?

     అది నాకు సంబంధించినది.  మీకు సంబంధించినది మీరు చేయండి.  నాకు సంబంధించిన పని నేను చేస్తాను. (మాంసం మానుకునే పని మీరు చేయండి, దాన్ని మాన్పించే పని నేను చేస్తానని యిందులో అర్థం యిమిడి వుంది) (జి.హెచ్ - 65)

 

15. నేనొక తప్పుడు పనులు చేసే సంస్థలో పనిచేస్తున్నాను.  నే నుండే ప్రతి చోటా చుట్టూ తప్పుడు మనుషులే వున్నారు.  నేనెలా యీ ఆధ్యాత్మిక సాధన చెయ్యగలను?

     ఇవి వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగతంగానే  సమస్యలను పరిష్కరించాలి.  ఉన్నతోన్నతమైన వాటిపై మనస్సుంచి వాటిపై శ్రద్ధ చూపు.  క్రింది స్థాయి (నీచ) సమస్యలు వాటికై అవే సర్దుబాటు అవుతాయి.  నీ యిచ్ఛాశక్తితో మహోన్నతమైన దానిని సాధించుటకు యత్నించు.  తగ్గుస్థాయి చిక్కులు రాలిపోతాయి. (ఎస్.ఎమ్.ఇ - 2౦)

 

16. ప్రాపంచిక విషయ వాంఛలుగల వారితోనే నా వ్యాసంగమంతా వుంటున్నది.  నా యోచనలు ఉత్తమమైన వాటికి మరలడం లేదు.  దీనికి పరిష్కారమేమిటి?  నేను నా కార్యాలయంలోని స్నేహితులను మొదలైన వారిని వదిలేయాలా?

     సాధు లక్షణములు గలవారితో సహవాసము నెరుపుము. (ఎస్.ఎమ్.ఇ - 22)

 

17. అట్టి సాధులక్షణలక్షితుల సహవాసం నాకు దొరకదు, యేంచేయాలి?

     వ్యక్తిత్వరహిత వ్యక్తితో సంబంధమేర్పరచుకో. (ఎస్.ఎమ్.ఇ - 22)

 

18. అది భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యం కదా?

     అయితే అందుకోసం ప్రార్థించు.  నీ ప్రశ్నకు నీవే సమాధానమిచ్చావు. (ఎస్.ఎమ్.ఇ - 22)

 

19. నేనున్న ప్రదేశంలో దయ్యాలున్నాయని జనులంటున్నారు.  నాకు భయమేస్తున్నది. యేంచేయాలి?

     దయ్యాలున్నాయన్న విషయాన్నే వదిలేయ్,  ఖాతరు చేయకు.  నీకిక భయముండదు. (ఎస్.ఎమ్.ఇ - 1౦1)

 

2౦. గురువుగారూ, అణువు యొక్క న్యూక్లియస్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వుంటాయని మీకు తెలుసు గదా? అవే అంతిమమని మీ అభిప్రాయమా?

     సరి.  మీకొక విషయం చెబుతాను.  ఈ అణువులు బహిరంతరాలలో అంటే మూలంలోను, పరిధిలోనూ కూడా సూక్ష్మమైనవైనప్పుడే అవి దైవమౌతాయి. (ఐ.డబ్ల్యు-168)

 

21. సాధుత్వమనగా యేమి?

     ఉత్తమ పురుషలక్షణము.  అందులో వినయం కూడా మిళితమైవుంది. (ఎల్.ఐ.డి.సి - 29)

 

22. ఒక్కో సమయంలో నేను నిరాశ నిస్పృహలో కుంచించుకుపోతుంటాను.  దాన్ని నేను ఆణకువగా మార్పుచేయ యత్నిస్తాను.  మీరేమంటారు?

     ఆ విధంగా మీరు కాలం వృధా చేయకండి.  మీరు మానసిక వ్యధవల్ల నష్టపోతున్నారు.  దాని బదులు మీరు ధ్యానం చేస్తే మేలుపడతారు.  చింతాక్రాంతులు కావడానికి బదులు ధ్యానంలో నిమగ్నం కండి.  దీర్ఘంగా చింతలో కూరుకుపోతే తత్సంబంధిత ముద్రలు మరింత లోతుగా యేర్పడతాయి. (ఎల్.ఐ.డి.సి - 3౦)

 23. జీవిత గమ్యమేమి?

     సంపూర్ణ మానవత్వంగల మనిషిగా విలసిల్లడమే.  అదే గమ్యము. (ఎల్.ఐ.డి.సి - 61)

 

24. నా స్నేహితురాలైన ఒక అభ్యాసి ఆత్మహత్య చేసుకోవాలన్నంతగా కుంగి పోతుంది.  పరిష్కారమేమి?

     నేనామెను పలకరించి మీ ఆరోగ్యం బాగానే వుంది గదా! అన్నానంతే, అంతా చక్కబడిపోయింది.  అదే సాధించవలసిన ప్రయోజనాన్ని సాధించేస్తుంది.

(ఎల్.ఐ.డి.సి - 65)

 

25. సత్యతత్త్వమును సమీపించడమెలా?

     మన కుటుంబ జీవనంలో మనం ఒకర్నొకరం ప్రేమించు కోవడం నేర్చుకుంటాం.  అదే సత్యతత్త్వం విషయంలో ఒక శిక్షణా రంగము. (ఎల్.ఐ.డి.సి - 71)

 

 26. పసిబిడ్డలలో శిక్షణ ఎప్పుడు మొదలౌతుంది?

     తల్లి గర్భములో ప్రవేశించిన నాటి నుండే ప్రారంభమౌతుంది.  అందుచేతనే గర్భవతియైన మహిళ శ్రద్ధగా ధ్యానము చేయ వలసి వుంటుంది.  బిడ్డయొక్క సూక్ష్మ శరీరము తండ్రి మరియు తల్లి యొక్క సంస్కారములు కూడా సంతరించుకొని యుండును.  అయినా బిడ్డ స్వభావాన్ని కాల క్రమంలో మార్పుజేయవచ్చును. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 14)

 

16. గురుశిష్యుల అనుబంధం.

 

1. నిజమైన అభ్యాసి యొక్క గుర్తులేవి?

     నిజాయితీ మరియు విధేయత. (ఎల్.ఐ.డి.సి - 3౦)

 

2. నేను గురువుగారి ప్రక్కనే కూర్చొనివున్నప్పుడు, ఆయన మనుషులంతా ఆయన అధీనంలోనే వున్నట్లు అనుభవంలోనికి వచ్చి గమనించాను. ఇది నిజమేకదా?

     నిజమే.  అది నీ అనుభవం.  అది స్వచ్ఛమైనది, సత్యము కూడా.  కానీ యెవరు నమ్ముతారు? సర్వం గురువే, గురువే సర్వస్వం - మనం నకారాత్మకంగా (కాదు, పోదు, అవదు అనే) యోచన చేయకూడదు.  అది గురువుగారికి శ్రమ కలిగిస్తుంది.  ఎందుకంటే మన ఆలోచనాతీరును మార్చడానికి మనపై ఆయన పనిచేయాల్సి వస్తుంది. (ఎల్.ఐ.డి.సి - 31)

 

 3. ఆత్మయొక్క నామమేమి?

     నేను ఒకేఒక్క గురువునే నమ్మియున్నాను. (ఎల్.ఐ.డి.సి - 43)

 

4. గురువర్యా మీరు మాకు ప్రార్థననిచ్చారు.  అందులో "మమ్ముల నాస్థాయి వరకు చేర్చ గలవారు మీరొక్కరు మాత్రమే" నని వున్నది.  ఇప్పుడు మేము "మా స్థాయిని మా అవస్థను" మీరు గమనించేట్లు ప్రార్థించ వచ్చునా?

     ప్రార్థన అదే. (ప్రార్థనలో మార్పు అవసరమేలేదని దీనర్థం కావచ్చు) (ఎల్.ఐ.డి.సి - 49)

 

5. మీరు నాకేదైన దివ్యజ్ఞానాన్నిస్తారా? తద్వారా నేను సర్వమెరింగి ప్రవర్తిస్తాను.

     నీవు దాని కోసమే వెతుక్కుంటున్నావు.  అట్టివాడు దొరికినప్పుడు అతన్ననుసరించు.  నీకై నీవు వెదకడమే నీకున్న మార్గం.  నిన్ను నేను సమాధాన పరచలేను.  నాకేమీ తెలియదంటున్నావు.  అటువంటప్పుడు ఆయనకు (నమ్మినవానికి) విధేయుడవై ఆయన చెప్పినట్లు చెయ్యి.  నీకు నమ్మకం లేకపోతే నమ్మవద్దు.  కానీ ప్రత్యాక్షానుభవాన్ని పొందు.  అందుకొఱకు నీకు సకారాత్మక దృక్పదం తప్పక అవసరమై యున్నది.  నీ స్వంత అనుభవం ప్రకారమే వెళ్ళు.  దానిపైనే నిర్ణయం తీసుకో.  నీకు సంతృప్తినివ్వని దానిని వదిలేసెయ్.  గురువును విశ్వసించి ఆ తర్వాత అతన్ని అనుసరించమని నేను నీకు చెబుతున్నాను.  గురువు లేకుండా నీవేమీ పొందలేవు. (నీకు నేను యిప్పటి వరకు చెప్పింది నీ అనుభవానికి వచ్చే వుంటుంది.)

(ఎల్.ఐ.డి.సి - 73)

 

6. నన్ను నేను చక్కదిద్దుకొని ఆ తర్వాత గురువువద్ద కెళ్ళాలి.  ఔనా?

     ఈ పద్దతి అంతకంటే ఆవలికి నిన్ను చేర్చడాని కుద్దేశింపబడినది.  నీవు ఆకలి గొన్నప్పుడు ఆహారం అందించ బడుతుంది.  దానికి తగిన అర్హత లేకపోయినా, వున్నా పర్వాలేదు.  కేవలం రెండు స్థితులలో మాత్రమే మీస్వశక్తి అవసరమౌతుంది.  నేను చేసిన బోధ పూర్వమెవ్వరూ చేసి యుండలేదు. (ఎల్.ఐ.డి.సి - 81)

 

7. బాబూజీ మీరు లాలాజీని మీవైపునకు త్రిప్పుకొన్నారా? లేక లాలాజీ గారే మిమ్మల్ని తన వైపునకాకర్షించారా?  తెలియజేయండి.

     ఇది కొంత నా జీవితానికి సంబంధించిన విషయం మరి.  నేను ఎప్పుడూ పూజ, ఆరాధన వైపు మక్కువ జూపేవాడిని.  నా 6వ యేట మా తల్లి పూజచేస్తూ వుంటే నేనూ పూజచేస్తానమ్మా అనేవాడిని.  అలా శివునికి నీళ్ళతోనూ, మారేడు దళాలతోనూ పూజచేయడం ప్రారంభించాను.  మా అమ్మ నాకు గంథం పూసేది.  ఇలా 5,6 సార్లు జరిగింది.  ఆ తర్వాత నేను వదిలేశాను.  నా హృదయం అట్టి పూజలకొప్పుకోలేదు.  నా 8వ యేట నుండి నాలో భగవదన్వేషణ మొదలైంది.  అప్పట్లో 6౦, 7౦ యేండ్ల వయస్సున్న మా అత్తగారుండేవారు.  వారు స్వామీజీలను తరచు సందర్శిస్తూ వుండే వారు.  ఆమె విధవ.  నన్ను స్వామీజీల వద్దకు వెంటబెట్టుకొని వెళ్ళేది.  బహుశః ఆ స్వామీజీ మంచివారే కావచ్చు.  కొన్నిసార్లు వారు గొప్ప సాధుపుంగవులై వుండి తీరాలనిపించేది.  2, 3 సార్లలా జరిగింది.  ఆ తర్వాత నాలో నేనే ఆలోచించాను.  ఒకవేళ నేను చెప్పిన విషయం తప్పైతే?  నేను ఒకర్ని పరిపూర్ణుడంటాను, కాని అతడు అలా కాకపోతే నేను తప్పు మాట్లాడినట్లవుతుంది.  అందుకని వారి వద్దకు వెళ్ళడం మానేశాను.  ఆ తర్వాత ఒక అర్చకుని, నేనేంచేయాలో చెప్పండని అడిగాను.  ఆయన చెప్పినట్లు గాయత్రి మంత్ర జపాన్ని చేసుకొన్నాను.

 

     ఇవన్నీ పూజ కాదు, ఆరాధన కానే కాదని నా హృదయం నాకు చెబుతూనే వుంది.  ఇందుకేదో ఒక పద్ధతి వుండి వుండాలి అనుకున్నాను.  అందుకోసం నేనెవ్వరి దగ్గరకు వెళ్ళలేదు.  నేనెవరి వద్దకైనా వెళితే ఆయన నాకు గురువైపోతారు గదా! అనుకున్నాను.  నేను చేసేటివన్నీ వదిలేసి ఒక గురువును ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాను.  నా ప్రార్థనలో నాకు లభించే గురువు అద్వితీయుడై యుండాలని ఆశించాను.  ఆ తర్వాత 12 సంవత్సరాలకు నాకు గురువు లభించాడు.  అప్పటి వరకు నేను గాయత్రీ జపము ప్రాణాయామం చేసుకొంటూ నా మిత్రులకు సైతం వాటిని చేసుకోండని ప్రోత్సహించితిని.  నేను అవి చేసుకొంటూ ఆనందపడే వాడిని.

 

        నా 14వ యేట నాకొక అంతర్గత దివ్య భావన గలిగింది.  అది నాకు ఒక నిజమైన మహనీయుడు గురువుగా లభిస్తాడని తెలియజేసినట్లయింది.  ఒకటి, రెండు సార్లు భావంలో నాకు ఆయన దర్శనం కూడా అయింది.  నేను ఆయన్ను మొదటిసారి కలుసుకొన్నప్పుడు, ఈయన కోసమే నేను అన్వేషిస్తున్నది.  ఈయనే నాగురువని గుర్తించ గలిగాను.  నాలో యేదో అనిర్వచనీయమైన దొకటుండి యీ భావన కలిగించింది.  కనుకనే నేను వెంటనే ఆయన పాదములపై బడ్డాను.  మా గురువర్యులు కూడా నన్ను గుర్తించి నన్ను దరిచేర్చుకొనుట కుత్సాహపడెను.  నా ఆధ్యాత్మిక వారసుడు, ఉత్తరాధికారి యెవరా! యని ఆలోచించ మొదలిడగానే నీ రూపమే నాకు గోచరించిందని ఆయన నాతో చెప్పెను.  అదే నీవు నా ఉత్తరాధికారివని తెలుపు సంకేతమనెను.  అందుకే నేను నా పనిని ప్రారంభించి ప్రాణాహుతి ప్రసారమును 3, 4 సంవత్సరముల నుండి ప్రసారము చేయుచుంటినని తెలియజేసెను.  నేను చేయుచున్న జపమో, ప్రాణాయామమో కాదు నాకు మేలు చేయుచుండినది, అసలు పనిచేసినది ఈయన గదా! యని అప్పుడు నాకర్థమైనది.  ఆయన్ను నేను కలుసుకున్నప్పటి నా పరిస్థితి అది.  ఆయన నాతో అలా ముందునుండే అనుబంధ మేర్పరచుకొని యుండెను.

 

        వారంలో 3 రోజులు నిరంతరాయంగా నేను ప్రాణాహుతిప్రసారాన్ని పొందుచుంటిని.  చాలా తీవ్రమైన ప్రసారం కూడా జరుగు చుండెడిది.  కొన్ని సమయాలలో దాన్ని నేను భరించలేక పోవుచుంటిని.  మా గురువర్యులెప్పుడూ నన్ను గమనించుచునే యుండిరి.  నేను గ్రహించగల్గినంత మేరకే నాకు ప్రాణాహుతినిచ్చి, యెక్కువైనది వెనక్కు తీసుకొని నా గ్రాహకశక్తి వృద్ధియైనంతనే తిరిగి ప్రసారము చేసెడివారు.

 

        ఒకసారి నా చేతిని హస్తరేఖాసాముద్రికునకు చూపించితిని.  అతడు రేఖలను పరిశీలించి నీ చేతి రేఖలలో ఆధ్యాత్మికతకు సంబంధించిన గుర్తులున్నవి.  అవి సూచించిన ప్రకారం గత జన్మ కర్మఫలముల నెఱుగు ఆంతరంగిక అజ్ఞాతశక్తి నీకు గలదు.  దాని ద్వారా మనుజులను సరిదిద్దగల సామర్థ్యము నీకున్నది.  ఈ విద్యలో నీకు సాటి వచ్చువారే వుండరని నొక్కి చెప్పెను.

 

        నేను జ్యోతిషవిద్య నభ్యసించాలను కొన్నాను, కానీ మొదలు పెట్టలేదు.  నా బంధువులలో కొందరు ఆ విద్య నెఱిగియుండి, నాకూ నేర్పగలిగి యుండిరి.  అప్పుడు నాకో ఆలోచన తట్టినది.  ఒకవేళ నేను జాతకం చూడగలిగితే, అది చూచి యితరులకు చెప్పవచ్చు.  అందులో ఆంతరంగిక ఆత్మశక్తి వుండదు.  ఆ దశలో నేను చూచి చెప్పే జాతకం సరికానేరదు.  కనుక ఆ ప్రయత్నం నేను వదలి వైచితిని.  నా హృదయంలో యేదో వుండి నన్ను సత్యతత్త్వము వైపునకు ప్రేరేపించుచుండెను.

 

        నేను 2, 3 నిముషములు మాత్రమే ధ్యానం చేసే వాడిని, మహా అయితే 5 నిముషములు చేసే వాడిని, కానీ నేను ఎల్లవేళల మా గురువర్యుల ధ్యాసలో మునిగి వుండే వాడిని.  మా గురువర్యులు ఆజ్ఞాపించి గంటసేపు ధ్యానం చేయమన్నప్పుడు మాత్రం అట్లే చేసేవాడిని.  కాని నాకది విసుగ్గా వుండేది.  కానీ ఆయన ధ్యాస నుండి మాత్రం విడివడి వుండే వాడిని కాదు.  నేను నా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన విషయాలను దినచర్య పుస్తకంలో వ్రాస్తూ గురువు గారికి చూపిస్తూ వుండే వాడిని.  వాటిపై ఆయన అభిప్రాయాములు తెలుపడమే గాకుండా నా దినచర్య పుస్తక రచనపై నన్నే విశ్లేషించమనే వారు.  నేను చాలా సున్నితంగా నా దినచర్య వ్రాతలలోని నా స్థితులను విశ్లేషించునపుడు, మా గురువర్యులు నన్ను అభినందించి, నీ విశ్లేషణ సరియైనదని చెప్పేవారు.  నేను నా నిశిత, సున్నిత పరిశీలనము వల్ల అలసిపోయే వాడిని.  మా గురువర్యులు పరిశీలించి యిలా చెప్పేవారు, "రామచంద్ర వ్రాసే అనుభవాలు గమనిస్తే అలా మరొకరెవరూ వ్రాయలేరు.  అలా వ్రాసి నేను చూడగలిగే అవకాశం నాకు మరొకరు కల్పించలేక పోయారు." ఇదీ వారికి నాపై గల విశ్వాసము. త్వరితగతిన అభివృద్ధి సాధించవలెనన్న ఆతృత తప్పనిసరి.  అట్టి తీవ్రవాంఛ వుండి తీరాలి.  ఇదే అతి ముఖ్యము.

 

        ఒకసారి నేను లాలాజీకి ఇలా తెలియజేశాను "నేను ఆతృతలో విశ్రాంతరహిత స్థితిలో నున్నాను.  మీ శిష్యుడనే కాకుండా వుండి వుంటే ఆ వ్యధకు తాళలేక ఆత్మహత్య చేసుకొని యుండే వాడిని." అందుకు సమాధానంగా మార్గదర్శకత్వం లభిస్తూ వుండింది.  అదంతా ఆయన కర్తవ్యంగా సాగింది.  ఆ ఆతృత మీలో కలగకుంటే కనీసం కృత్రిమంగానైనా పొందయత్నించండి.  అలా చేస్తే అదే కొంత కాలానికి నిజమై పోతుంది.  నేనొక వ్యక్తికి 3౦ దినములు ప్రాణాహుతి ప్రసారం చేస్తే అందులో కనీసం 25 దినములు నాకు మా గురువర్యుల నుండి మార్గదర్శకత్వం లభిస్తూ వుంటుందని మీకు నేను తెలియజేస్తున్నాను.

 

        కనుక నేను, ఆయన లేకుండా ముందుకు అడుగేయలేను.  మా గురువర్యులను విడిచి బ్రతుకలేను.  కాని నేను లేకుండా ఆయన తనను తాను ప్రకటించుకొన లేడు.  కనుక రెండూ వున్నాయ్.  గురువును గురించి చెప్పాలంటే యిట్టి మాటల ద్వారానే చెప్పవలసి వస్తుంది. (గురువుగారి హైదరాబాద్ పర్యటన 1971 జూన్ 13నుండి16)

 

8. మానవ చరిత్రలోనే యిది ప్రథమం కావచ్చు.  శిష్యుడు గురువు లేకుండా బ్రతకలేడు, గురువు శిష్యుడు లేకుండా ప్రకటితం కాడు.  బాబూజీ! దీనికి సమంగా ఉదహరించదగ్గ వారి చరిత్రలేవైనా వున్నాయా?

        నేను ఎక్కువ చదువుకోలేదు.  కనుక నేను చెప్పజ్ఆలను.  నేను ఆయనలో వున్నాను.  ఆయన నాలో ఉన్నాడు అని నేను చెబుతున్నాను.  నాకు నా గురువుకు మధ్య ఒక్క క్షణమాత్రం  యెడబాటు కూడా లేదు.  ఆయన చింతన లేకుండా ఒక్క క్షణం యెడబాటు కలిగినా నేను జీవించలేను.  మరణమే దాని పర్యవసానమౌతుంది.  ఇది అతిశయోక్తి కాదు.  నేను మీకు రహస్యం విప్పేయడం జరిగింది. (గురువుగారి హైదరాబాద్ పర్యటన 1971 జూన్ 13నుండి16)

 

9. తన గురువుపై వ్యక్తికెటువంటి విశ్వాసముండాలి?

     అది హృదయంలో వుండాలి.  గురువుగారిలో ఎటువంటి లోపాన్ని అతడు చూడనంతగా వుండాలి.  లాలాజీ వారిలో నేనెటువంటి దౌర్భల్యమూ నెన్నడూ చూడలేదు. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 14)

 

1౦. మీకు గురువున్నారా? లేక యిదంతా మీ స్వంత జ్ఞానమేనా?

     ఇదంతా నా గురువు కొఱకే, అంతా ఆయననుండే పొందుతున్నాను.  అంతా ఆయనకే సమర్పితము. (ఎల్.ఐ.డి.సి - 74)

 

 

 

17. ప్రేమ

 

1. నేను అసలైన అభ్యాసిగా వుండాలని చాలా ప్రయత్నం చేశాను.  కాని యేదో ఒక అవరోధం కలుగుతూనే వుంది.  కేవలం ప్రేమ ద్వారా మాత్రమే సత్యతత్త్వం యే అడ్డంకి లేకుండా పనిచేస్తుంది కదా?   

     జవాబు మీరే చెప్పేశారు.  (ఎల్.ఐ.డి.సి - 29)

 

2. గురువుగారి యొక్క ప్రేమను మనం చూరగొనాలి.  మనం ఆయన్ను ప్రేమించడం మొదలుపెడితే మన వద్దకు రావాలనే ఆతృత ఆయనలో మొదలౌతుంది, ఇదీ నాకర్థమైన విషయం.  ఇది వాస్తవమే కదా?

     మంచిది.  నీకావిధమైన భావన వుంటే సాక్షాత్కారమేకాదు అన్నీ నీకు లభ్యమైనట్లే.     (ఎల్.ఐ.డి.సి - 29)

 

3. అంతిమ స్థానాన్ని పొందడం యెలా? ఏ విధానం సరైనది?

     శరణాగతి, సహకారము, సమర్పణ మరియు సత్యతత్త్వము మొదలైన వాటిని నేను గణించను.  నేను కేవలం గురువుగారిపై గల విశ్వాసము మరియు ప్రేమను మాత్రమే చూడాలనుకుంటాను.  ఆ విధంగా కొంతకాలం గురువును ప్రేమిస్తే మీ గురువు మీలో మిళితమై (కరిగి) పోతారు.  ఇదే సరైన విధానము. (ఎల్.ఐ.డి.సి - 47)

 

4. ఎల్లప్పుడూ ప్రేమనుగూర్చిన తలంపు గలిగివుంటే చాలు గదా?

     సత్యతత్త్వం ప్రవేశించటానికి నిన్ను నీవు తెరచి వుంచుకోవడమే ప్రేమ. (ఎల్.ఐ.డి.సి - 54)

 

5. ప్రేమను గురించి ఆలోచించవచ్చా?

     మీరు యెలా ఆలోచిస్తారో అలానే తయారవుతారు. (ఎల్.ఐ.డి.సి - 54)

 

6. మీరొకసారి చెప్పారు, ప్రేమ ఒకసారి మాత్రమే వికసించే పువ్వని, మరి అది ముడుచుకపోతే యిక వికసించే అవకాశమే లేదు గదా?

     అది పూస్తుంది, వికసించి అలానే వుండిపోతుంది (అది సాధకుడు చేపట్టిన విధానంపై ఆధారపడి వుంటుంది). (ఎల్.ఐ.డి.సి - 54)

 

7. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు, మీరు సంతోషంగా వుండాలంటే నేనింకా యింకా ప్రయత్నించాలనిపిస్తుంది.

     మరో మహాత్ముడు సంతోషమనేది మనలోనే వుంది అన్నాడు. (ఎల్.ఐ.డి.సి - 68)

 

8. నేను నీవద్ద వున్నపుడు నాకేడుపొస్తుంది. ఎందుకు?

        ఎందుకంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు.

      (టి అండ్ ఎల్- 26)

 

9. ప్రేమంటే ఏమిటి?

        దైవం కొఱకు పరితపించుటే ప్రేమ - అన్నారు సోక్రటీస్.  మరొకటి దొరకగానే వున్నదాన్ని వదిలి వెళ్ళేది ప్రేమ కాదు - అన్నారు షేక్స్పియర్.  ఆయనింకా వివరిస్తూ వికసించిన పుష్పంలో గల జీవమే ప్రేమ, ఆ జీవం పుష్పం వాడిన తర్వాత తిరిగి రానేరాదు.(టి అండ్ ఎల్- 62)

 

1౦. ప్రేమ ఎక్కడికీ వెళ్ళిపోదుగదా?  ప్రేమ నిలకడ గలది కదా?

        అవును.  ప్రేమ ఉత్పన్నమై శాశ్వతంగా వుండి తీరుతుంది.  సత్యతత్త్వం కొఱకు ఏర్పడిన తపనే ప్రేమ.  సత్యతత్త్వం ప్రవేశించడానికై నిన్ను నీవు తెరచివుంచుకోవడమే ప్రేమ.  ఇంకా చెప్పాలంటే దైవత్వమే ప్రేమ. (టి అండ్ ఎల్- 62)

 

11. భగవంతుడెవరిని ప్రేమిస్తాడో వారే ఆయనతో మమేకం కావాలనుకొంటారు.  అంతేకదా?

        మీకు అలాంటి భావనే గనుక వుంటే మీరు సాక్షాత్కారము, పరిపూర్ణత ఇంకా కావలసినవన్నీ పొందవచ్చును. (టి అండ్ ఎల్ - 69)

 

12. భగవంతుడు మనలను ప్రేమించాలంటే మనం ఆయన వలెనే ప్రవర్తించాలి.  భగవంతుడు సర్వవ్యాపి కనుక అంతటా అందరినీ ప్రేమించాలి.  అట్టి వానినే భగవంతుడు ప్రేమిస్తాడు.

        ఇది మీరిచ్చు సలహా కదా! (టి అండ్ ఎల్ - 69)

 

 13. అవును బాబూజీ.

        సరియైన ఆలోచన.  భగవంతుడున్నాడు.  కానీ నాకు శక్తి యున్నది. (టి అండ్ ఎల్ - 69)

 

14. నిజమైన అభ్యాసి యొక్క లక్షణములేవి?

        సత్యసంధత మరియు విధేయత - మీరావిధంగా ప్రేమిస్తే గురువు మీలో కరిగిపోతారు. (టి అండ్ ఎల్ - 69)

 

15. మహాశక్తి సంపన్నుడైన గురువును నీవైపుకు మరల్చు కోవడమెలా?

     ఆయనే నిన్ను ప్రేమించేటంత మిక్కుటముగా ఆయన్ను నీవు ప్రేమించు.  ఆయనకు వినబడి వచ్చి నీకోసం తలుపు తీసేటంత గట్టిగా ఆయన తలుపు తట్టు.  అప్పుడు నీపని పూర్తవుతుంది.  ప్రేమే పరమ రహస్యం. (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక, సూరత్ 1982)

       

16. మన విధానంలో ప్రేమ యొక్క ప్రత్యేకత యేమి?

     ప్రేమతో సర్వం సాధించవచ్చును.  ప్రేమతో పోల్చి చూస్తే, ధ్యానము మొదలైన యితర సాధనల ప్రాధాన్యత అత్యంత తక్కువ. (సహజమార్గ పత్రిక 2/1989 - 8)

 

17. అసలు ప్రేమంటే ఏమిటి?

        నీవెందుకు ప్రేమిస్తున్నావో, ఏమి కావాలని ఆశించి ప్రేమిస్తున్నావో నీకసలే తెలియకపోతే, అదే ప్రేమ. (నాగర్జునసాగర్ 17.11.1972 పుట 4)

 

18. భక్తి - ఆత్మార్పణ

 

1. అర్పణగావించుకొను మార్గమేది?

     మహోన్నతమైన దానిని పొందడానికి సంసిద్దులం కావడమే సమర్పణం.  ఆ స్థాయి వరకు ఆయనే మిమ్ములను తీర్చి దుద్దుతారు. (ఎల్.ఐ.డి.సి - 47)

 

2. శరణాగతిని గురించి కొంత వివరించండి?

     ఈ శరణాగతిలో మూడు ముఖ్యాంశాలున్నాయి. (1) ఆత్మ సమర్పణము (2) తన భారాన్ని సమర్పించి రక్షణ పొందడము, ఇక (3) ఫలితాన్ని సమర్పించడము. (సహజమార్గ పత్రిక 2/1989 - 16)

 

3. ఆత్మార్పణమున భక్తి ఒక ముఖ్యాంశము.  అవునా?

        సందేహం లేదు.  భక్తి, ఆత్మార్పణ సన్నిహితంగా కలుపబడి ఉన్నాయి.  కానీ కొన్ని సమయాలలో సాధకుడు భక్తి పారవశ్యములోని ఆనందమునకు ఆకర్షితుడై పోతున్నాడు.  ఇది స్వార్థపూరిత భక్తి.  దీనికి, వాస్తవమైన ఆత్మార్పణకు సంబంధం లేదు.  ఈ విధమైన భక్తి, బంధనమునకు కారణమౌతుంది, కనుక జాగ్రత్తగా వుండాలి.  ఏది ఏమైనప్పటికి సత్యతత్త్వము యెడ భక్తి లేక అందులో సంపూర్ణ ఐక్యము పొందినవాని యెడ భక్తి ఎప్పుడూ వృధా పోవు. (సహజమార్గపత్రిక 9,11/1992-39)

 

 

19. బాబూజీ - లాలాజీ

 

1. మీరిప్పుడు చేస్తున్న యీ పనిని యెలా మొదలుపెట్టారు?

     మా గురువర్యులు యిది చేయమని ఆజ్ఞాపించారు.  నేను మొదలు పెట్టాను. (ఐ.డబ్ల్యు - 86)

 2. మీ గురువుగారితో మీ మూలాలెలా యేర్పడ్డయి?  ప్రారంభమెలా జరిగింది?  అంటే మీరు ఆయన్ను కలిశారా?

     అది ఒక ఆకస్మిక సంఘటన.  నాకొక సద్గురువు కావాలని మనసులో వుండేది.  అందుకొఱకు నేను ప్రార్థించే వాడిని.  అట్లే నేను నాగురువును పొందగలిగాను. (ఐ.డబ్ల్యు - 86)

 

3. మీరాయన్ను యెప్పుడు కలుసుకున్నారు?

     సుమారు 45 సంవత్సరాల క్రితమనుకొంటాను ( ఇది ప్రశ్నవేసిన నాటి మాట) (బాబూజీ తన 22వ యేట లాలాజీని కలుసుకొన్నారు)  (ఐ.డబ్ల్యు - 87)

 

4. ఆయన మీకేమి నేర్పారు?

     ఇప్పుడు మీ వద్ద యేమి చెప్పి, యేమి చేస్తున్నానో అదే ఆయన నాకు నేర్పారు. (ఐ.డబ్ల్యు - 87)

 

5. మీ గురువులాలాజీని యెలా కలుసుకున్నారో చెప్పగలరా?

     అది ఒక ఆకస్మిక సంఘటన.  నేనాయన్ను గురించి కేవలం వినియున్నాను.  అంతేగాని ఆయన్ను గురించి నా కంతగా తెలియదు.  ఇతరులు చెప్పిన దాన్ని బట్టి నేనాయన వద్దకెళ్ళాను.  ఆయన ప్రాణాహుతి ప్రసారం నాకు నచ్చింది.  అది నాపై చాలా బాగా పనిచేసింది.  నా అనుభవమే నాకివన్నీ నేర్పింది. (ఎస్.ఎమ్.ఇ - 17)

 

6. లాలాజీ వారు మరలా జన్మించారా?

     లేదు. అది జరగదు. (ఎస్.ఎమ్.ఇ - 53)

 7. మీకు మీ గురువర్యులతో సంబంధమున్నదా?

     సంబంధం యెల్లవేళలా వుంది. (ఐ.డబ్ల్యు - 94)

 

8. ఎలా?

     ఎలా వుండాలో అలా. (ఐ.డబ్ల్యు - 94)

 

9. మీరు ఆధ్యాత్మిక గురువులు.  ఐనా మీరు పొగత్రాగుతున్నారే?

     నిజమే నేను పొగత్రాగుతాను.  మీరెందుకు బాధపడడం?  నేను విషం తీసుకోవచ్చు కానీ నేను మీకు అమృతం యిస్తున్నాను.  మీరు గ్రహించాలి.(ఐ.డబ్ల్యు- 1౦)

 

1౦. మిమ్మల్ని పట్టుకెళ్ళి కారాగారంలో వేసేస్తే యేంచేస్తారు?

     సరి.  నీకో విషయం చెప్పాలి.  నీవు నీ ఆలోచనను ముందు సరిదిద్దుకోవాలి.  నీవు మంచిగా యోచించ గలిగి యుండి యెందుకిలా చెడు ఆలోచన చేస్తున్నావు. (ఐ.డబ్ల్యు - 1౦)

 

11. మీరు యింటి నుండి దూరంగా వచ్చేశారు.  ఇంటి ధ్యాస మిమ్మల్ని బాధించదా?

     నేనెక్కడుంటే అదే నా యిల్లు. (ఐ.డబ్ల్యు - 11)

 

12. మీరులేని లోటుతో పిల్లలు యిబ్బంది పడుతుంటారేమో గదా? మరి మీ పిల్లల విషయమేమంటారు?

     నేనక్కడ లేనప్పుడు వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి.  అది వారి సమస్య, మరి వారే పరిష్కరించుకుంటారు. (ఐ.డబ్ల్యు - 11)

 

13. పూర్వజన్మలో మీరు యేమై యున్నారు?

     నేనేదో చెబుతాను.  దానికి ఋజువుండదు కదా? (ఎస్.ఎమ్.ఇ - 52)

 

14. నాకు ఋజువుతో పనిలేదు.  మీరు చెప్పింది నేనంగీకరిస్తాను.  చెప్పంf.

     నేనొక వైశ్య కుటుంబంలో పుట్టి యుంటిని.  అప్పుడు చాలా బీదవాడను.  నాకు పొడవైన సన్నని భార్య, ఐదుమంది బిడ్డలుండే వారు.  నేనో చిన్న వ్యాపారం చేసుకుంటూ వుండే వాడిని.  చూడూ ఆ వైశ్య మనస్తత్వం యింకా ఈ జన్మలో కూడా నాలో అట్లే వుంది.   (ఎస్.ఎమ్.ఇ - 53)

 

 15. మీరీ జన్మకు తప్పనిసరై బలవంతం మీద వచ్చారా? లేక మీ యిష్టం మీద వచ్చారా?

     మధ్య మార్గం.  రెండింటి మధ్య. (ఎస్.ఎమ్.ఇ - 53)

 

16. గురువుగారు మీరు సంతోషంగా వున్నారా?

     వాస్తవం చెప్పాలంటే, నేనెప్పుడూ సంతోష ప్రభావాన్ని పరీక్షించలేదు.  నేను సర్వదా సంతోషంగా వున్నా అది నా జ్ఞాపకానికి రాదు.  యేదేమైనా నేను సంతోషమంటే యేమిటో నిర్వచించగలను.  ఎవడు సర్వావస్థలలో సంతోషంగా ఉంటాడో వాడే సంతోషవంతుడు.  కానీ ఒక విషయం మీకు చెప్పాలి.  సంతోషము, ప్రశాంతత కంటే భారమైనది.  బాధ భగవంతునికి సన్నిహితమైనదని నేను తలంచెదను.  అది నా భావన.  ఒక వేళ నా భావన తప్పైనా కావచ్చును.  కానీ చూడండి, కొన్ని సమయాలలో నేను పెద్ద బాధలో వున్నప్పుడు హా, హా అంటూ మూలుగుతాను, కానీ అందులో కూడా ఒక చిత్రమైన సంతోషానుభూతి వుంది. (ఐ.డబ్ల్యు - 197)

 

2౦. ఇతరములు

 

1. కుండలిని సంగతేమిటి? మీ యోగ విధానంలో ఈ కుండలిని పాత్ర యెంతమాత్రమున్నది?

    కుండలినీ శక్తిని మేల్కొలిపితే ఆ శక్తి ఉత్తమ లోకముల పనికి ఉపయోగపడుతుంది.  అందరికి ఆ పని అప్పజెప్పబడదు.  కనుక యిది ప్రతిఒక్కరికి అవసరమైనది కాదు.  ఆ పని యే ఒకరిద్దరికో మాత్రమే అప్పజెప్పబడుతుందంతే.  ఇది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అసలే ఉపయోగపడునది కాదు. (బి.ఇ - 67)

 

2. మహామహితాత్ముడని యెవరినంటారు?

     ఎవరు సమతాస్థితిలో వుంటారో వారే మహామహితాత్ములు. (ఎల్.ఐ.డి.సి - 42)

 3. నేను గీతను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, తెలియజేస్తారా?

     గీత మహాద్భుత గ్రంథం కావచ్చును.  కాని అందులో వున్న దానిని పొందడమెలా? (ఎల్.ఐ.డి.సి - 42)

 

4. సాక్షాత్కారమును మనిషి ఎప్పుడు పొందుతాడు?

     ఎప్పుడు సర్వమూ కోల్పోతాడో అప్పుడు సాక్షాత్కారము స్రవిస్తుంది. (ఎల్.ఐ.డి.సి - 43)

 

5. మీరు మాకు ప్రసాదించిన స్థితిని మేమెలా నిలుపుకోవాలి?

     మీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని శ్రద్ధతో చేసుకపోవడం ద్వారా. (ఎల్.ఐ.డి.సి - 43)

 

6. సహకరిస్తున్నానా లేదా?   విషయం యెలా తెలుసుకొని విశ్లేషించుకోవాలి?

     సహకరిస్తున్నానని యెఱుకతో నిర్ధారించుకొని తెలిసి సహకరించడం సహకారమే కాదు. (ఎల్.ఐ.డి.సి - 47)

 

7. భగవత్‌సాక్షాత్కార మార్గంలో వ్యక్తి కష్టాల పాలెందుకవుతాడు?

     కష్టాలు మానవుల కొఱకే కేటాయించబడ్డాయి.  పశువుల కోసం కాదు. (ఎల్.ఐ.డి.సి - 51)

 

 

8. పురోగతి నడ్డుకొంటూ అనేక బాధలు కలుగుతుంటే, యేంచేయాలి?

     ప్రార్థించాలి. (ఎల్.ఐ.డి.సి - 56)

    

9. తర్కించడానికి, కనుగొనడానికి, దర్శించడానికి తేడా యేమిటి?

     తర్కంలో అనుమానమున్నది.  కనుగొనడంలో నీ స్వంత విషయానికి ప్రాధాన్యతనిచ్చి ముందుంచే ప్రయత్నమున్నది.  దర్శనమంటేనే దైవ దర్శనం.  అక్కడ నిన్ను నీవు సమర్పించు కోవడం జరుగుతుంది.

(ఎల్.ఐ.డి.సి - 56)

 

1౦. ఆరాధన మరియు శాంతియుతమైన పూజకు తేడా యేమి?  వాటి ఫలితమేమి? (ప్రశ్నే సరిలేదనిపిస్తుంది.  అయినా గురువుగారి జవాబు గమనించండి)

     నీవు యింతకు ముందు నుండి చేస్తున్న జడమైన ఆరాధన మానడం వల్ల నీలో అలజడి, కలత కలుగుతాయి.  కానీ నీవు పూజ చేయడం తప్పిపోతే ఇక్కడ శాంతి లభిస్తుంది.  ఉన్నతోన్నతమైన స్థితిలో నీకు ధ్యానం తప్పిపోయినా నీలోనికి ప్రవహించు దివ్యధార 24 గంటలూ యెడతెరపి లేకుండా ప్రవహిస్తూనే వుంటుంది.

(ఎల్.ఐ.డి.సి - 57)

 

11. నిన్న మీరు నాపై చాలా కోపంతో ఉన్నట్లనిపించింది?

     ఇవన్నీ భౌతిక విషయాలు, మీరు మీ దృక్పదాన్ని (దర్శించే విధానాన్ని) మార్చుకోవాలి. (ఎల్.ఐ.డి.సి - 65)

 12. నేను కాగితం పైనున్న మీ ఛాయాచిత్రాన్ని తీసుకొన్నాను.  కానీ మీ స్వరూపాన్ని మనస్సులో ముద్రించుకోగలనా?

     అందుకొఱకు మీకై మీరే శిక్షణనిచ్చుకోండి. (ఎల్.ఐ.డి.సి - 65)

 

13. సత్యతత్త్వం దర్శనం ద్వారా దానికై అదే అర్థమౌతుందా? లేక అది అనుభవ రూపంలో కూడా వ్యక్తమౌతుందా?

     అది యే విధంగానైనా జరగవచ్చు.  (ఎల్.ఐ.డి.సి-66)

 

14. ఒకానొక సమయంలో ఒక దురాలోచన వస్తున్నదని తెలియగానే, అది మన యింద్రియాలలో స్థానమేర్పరచుకొనక ముందే దాన్ని త్రోసేయాలి.  అదీ మనం చేయవలసిన పని.  అంతే గదా?

     మీరిప్పుడు తత్త్వజ్ఞులౌతున్నారు.  చెడు విషయాలను మీరు సైతాన్ అంటున్నారు.  కానీ సైతానన్నదేదీ ఉనికిలోనే లేదు. (ఎల్.ఐ.డి.సి - 66)

 

15. ఎఱుక గల్గిన మనస్సుకు, అతీంద్రియ మనస్సుకు తేడా యేమి?

     అన్నీ మూలశక్తి నుండే కొనిరాబడినవి.  ఇది ఒక కుటుంబం.  ఆత్మ, పరమాత్మ (అంతిమం) రెండూ ఒకటే.  ఒక్కొక్కటి ఒక్కోరకంగా తన పనిని తాను అవసరాల కనుగుణంగా చేసుక పోతుంది. (ఎల్.ఐ.డి.సి - 69)

 16. కర్మ అనగా నేమి?

     వివిధకేంద్రములు తమతమ కార్యములు నిర్వహిస్తూ వుండటమే కర్మ.  మోక్షము మానవుని జన్మహక్కు. (ఎల్.ఐ.డి.సి - 7౦)

 

17. పరిష్కారము (సాల్వేషన్) నకు, స్వేచ్ఛ (లిబరేషన్) కు గల తేడా యేమి?

     పరిష్కారము మన గమ్యము కాదు.  నీవు స్వేచ్ఛను పొందితే భగవంతుడు సైతం నిన్ను క్రిందికి పంపలేడు. (ఎల్.ఐ.డి.సి - 7౦)

 

18. హృదయంలో ఒక కృత్రిమ అవయవం అమర్చబడింది.  అట్టి కృత్రిమ అవయవంతో దైవాన్ని చేరవచ్చునా?

     అది కేవలం ఒక వస్తువు.  దానికీ ఆధ్యాత్మికతకూ సంబంధమే లేదు.  ఆత్మ యొక్క బంధన విముక్తికి అనారోగ్యము ప్రతిబంధకం కానే కాదు. (ఎల్.ఐ.డి.సి - 7౦)

       

19. నేను చెడ్డవానినైతే యెలా పురోగమిస్తాను?

     నిన్ను నీవు మంచి వానిగా తీర్చి దిద్దుకోవడం నీ విధి.  నీలో దోషమున్నది అని అనుకొన్నప్పుడు అలాంటి దోషాన్ని తొలగించుకొనే ప్రయత్నం చేయడం నీబాధ్యత.

(ఎల్.ఐ.డి.సి - 71)

 

 2౦. సంఘం వలన సంక్రమించే చెడు ప్రభావ విషయంలో యేంచేయాలి?

     మొదట నీవు సాక్షాత్కార విషయమై యేంచేయాలో దానికై అన్వేషించు.  తర్వాత గురువును వెతుక్కో.  అందుకొఱకు నేను 12 సంవత్సరాలు ప్రార్థించాను.  ఎవరి సామీప్యంలో మీ చింత శాంతిస్తుందో అతడే గురువుగా తగిన వాడని గుర్తించు.  నీవు గమనించకపోయినా అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు.  నీవూ తొలుత ఆయన్ను ప్రేమించు.  ఈ విధమైన పరీస్థితిని నీ ధ్యానసమయంలో నీలో ఉత్పన్నం చేసుకో.  ఇదే నీ సమస్యా పరిష్కారానికి చాలా సహాయకారి. (ఎల్.ఐ.డి.సి - 71)

 

21. కానీ సంఘంలోని వ్యక్తులు, పరిసరాలు మమ్మల్ని వెనక్కు లాగుతాయి కదా?

     నీవు నిర్లక్ష్యానికి గురయ్యే చోటికి వెళ్ళవద్దు.  అది నీవు ఒక మహావస్తు ప్రాప్తికి త్యాగంచేసే అతి చిన్న వస్తువు.  సరైన గురువును పొందటానికి ప్రయత్నించు.  అందుకొఱకు ప్రార్థించు.  నిజమైన అన్వేషకునకు, దివ్యతేజస్సు అతని వద్దే వుంటుంది.  గురువు అతని వద్దకే వస్తాడు.  అతడు యెక్కడికో వెళ్ళవలసిన అవసరం ఉండదు. (ఎల్.ఐ.డి.సి - 71)

 

22. నేను అందరిలాంటి వ్యక్తిని కాను. నాకు అ, ఆ లు కూడా తెలియవ.

     నీవు దైవాన్ని అనుసరించు.  నన్ను అనుసరించు.  ఇక్కడ నన్ను అంటే ప్రస్తుతానికి నేనే అని అర్థం కాదు. (ఎల్.ఐ.డి.సి - 73)

 23. కొన్ని కేంద్రాలలో సభ్యుల్లో సౌభ్రాతృత్వము లోపించి వుంది.  మీరేమంటారు?

     నిజమే.  అది యే స్థాయిలో వుంది? (అది యేమంత ప్రమాదకర స్థాయిలో లేదని దీనిఅర్థం) (ఎల్.ఐ.డి.సి - 76)

 

24. దానికి సంబంధించి యేం చేయాలి?

     మానసిక ప్రవృత్తులన్నీ దాని (దైవం) వైపు మరలించేయగల స్థితిని వృద్ధి చేయాలి.  ఇది అతీంద్రియత నుండి వెలుబడేట్లు చేయాలి, అంటే హృదయాంతరాళం నుండి బయట పడేట్లు చేయాలి. (ఎల్.ఐ.డి.సి - 76)

 

25. ఒకరు మరొకర్ని బాధిస్తే, యెందుకు చెడ్డగా భావిస్తాము?

     అది అతనిలో కలిగిన యెదుటివారి బాధ యొక్క ప్రతిక్రియ. ఇతరులను బాధపెట్టడం మానుకోవాలి.  అది దైవాజ్ఞ.  ఇతరులను బాధించ కుండటమే గొప్ప మతము.  ఎవరైనా పొరబాటున మీద కాలుపెడితే కుట్టే కందిరీగలా మనం మారకూడదు.  మనం ఆత్మ రక్షణ చేసుకొనే పని చేయాలి గాని ఆక్రమించి బాధ కలిగించే పనికి పూనుకోరాదు.  ఒక వేళ యింట్లో దొంగలు పడితే యేంచేస్తాం?  ఎదుర్కొంటాం.  స్వవిషయమై ఆత్మరక్షణ సరైనదే. (ఎల్.ఐ.డి.సి - 78)

 

26. ఆత్మస్థైర్యం, దైవంపై విశ్వాసం, యివి తుపాకికన్నా బలమైన ఆయుధాలు కదా?

     అలా వ్రాయబడి వుండటం మీరు చదివి వుంటారు.  అయినా సందర్భానుసారంగా నీవు వ్యవహరించాలి.  శంకరాచార్యులు ఇలా చెప్పారు -  "సాక్షాత్కారానికి, పుస్తకాలు ఉపయోగపడవు.  సాక్షాత్కారమైన తర్వాత యిక పుస్తకాలు నిరుపయోగము."  అయినా జనులు యింకనూ చదివి సాధిస్తున్నందుకు అభినందిస్తున్నాను. చదవండి ఆనందించండి.  చేయండి అనుభవించండి.(ఎల్.ఐ.డి.సి-79)

 

27. శరీరం నుండి ఆత్మ విడివడడాన్ని యెవరు నిర్ణయిస్తారు?

     అది ప్రకృతి. (ఎల్.ఐ.డి.సి - 86)

 

28. ఆత్మ నిర్ణయించుకొని శరీరాన్ని వదలలేదా?

     ప్రారంభమున్నది అంటే అంతంకూడా వున్నట్టే.  శక్తిమంతులైనవారు ఆపని చేయగలరు.  మరణానికి ముందు ఆత్మ శరీరాన్ని యిక వదిలేస్తున్నదని నిర్ణయమౌతుంది.  పుట్టినప్పుడే ఆ నిర్ణయం జరిగిపోదు. (ఎల్.ఐ.డి.సి - 86)

 

29. సంశయాల విషయమై యేంచేయాలి?

     అంతఃశుద్ధీకరణ అత్యంత ముఖ్యం. (ఎల్.ఐ.డి.సి-86)

 3౦. సామాన్యంగా మనిషి మరణించగానే యేంజరుగుతుంది?

     తిరిగి భూమిపై జన్మించడానికి అనువైన శరీర నిర్మాణానికి అవసరమైన అణుసముదాయాన్ని సమకూర్చుకోవడం మొదలు పెడుతుంది. (ఎల్.ఐ.డి.సి-86)     

 31. జీవి మరణానంతరం స్వర్గానికి వెళతాడా లేక నరకానికా?

     నాకు స్వర్గంపై అనుమానమున్నది. (ఎల్.ఐ.డి.సి - 87)

 

32. ఎందుచేత విద్యావంతులు, తెలివైన వారు సైతం గురువులమవ్వాలని ప్రలోభానికి లోనౌతుంటారు?

     ఇలా జరగడానికి కారణం వారికి భగవత్- సాక్షాత్కారము యెడ నిజమైన తీవ్ర ఆకాంక్ష లేకపోవడమే.  ప్రజలు సహితం మనిషికిగల అసాధారణ లక్షణముల వైపుకు మొగ్గుచూపుతారు.  ఉదాహరణకవి వారి విద్య, వాక్పటిమ, దుస్తులు మరియు మంచి శరీర సౌష్టవము కూడా కావచ్చును. (సహజమార్గ పత్రిక 7/91 - 2౦)

 

33. నిరాకారుడైన భగవంతుడు సర్వవ్యాపి గనుక విగ్రహంలోకూడా వున్నాడనుకుంటే తప్పుకాదు గదా?

     బంకమట్టితో చేసిన బొమ్మను, బంకమట్టీ అనవచ్చు కానీ కేవలం బంకమట్టిని పట్టుకొని దాన్ని బొమ్మ అనలేము.  దీనికి మరింత వివరణ కావాలంటే, స్వామీ వివేకానంద చెప్పిన మాట చెబుతాను గమనించండి. "విగ్రహము నందు భగవంతుడున్నాడని భావించి దర్శించ వచ్చును.  కానీ ఆ విగ్రహమే భగవంతుడని భావించడం తగదు."  (సహజమార్గ పత్రిక 7/91 - 2౦)

 

34. ఆయన భాషలోనే మనం మాట్లాడాలి, లేకపోతే ఆయనకర్థం కాదు.  ఒక ఆంగ్లేయుడు, ఆంగ్లం తెలియని డచ్‌వానితో ఆంగ్లంలో మాట్లాడితే వాడెలా అర్థం చేసుకోగలడు?  కనుక మీరు భగవంతునితో ఎలా (ఏ భాషలో) మాట్లాడగలరు?

        ఆయన (భగవంతుని) భాష యోచనతో కలిసిన స్పందన. స్పందన అంతర్గతంగా వున్న యోచన.  కనుక నీవు తలతో (తెలివితో) మాట్లాడితో అది భగవంతునికి తెలియదు.  కనుక అక్కడ హృదయం కూడా వుండి తీరాలి.  హృదయం, మనస్సు రెండూ కలిసి ముందుకు సాగాలి.  అప్పుడు నీవు ఆయనతో సంభాషించ గలవు.  (టి అండ్ ఎల్-35-2)     

................. మన దేహ నిర్మాణంలో ఒక బిందువున్నది.  అది వృద్ధియైతే నీకిక భాషలన్నీ అర్థమౌతాయి

(టి అండ్ ఎల్ - 36-2).

 

35. భగవత్‌కృప అనగానేమి?

        మనస్సు యొక్క తియ్యదనమే కృప.

(టి అండ్ ఎల్ - 62)

 

36. మనోవికారము (passion) అనగానేమి?

        మన వైఖరి లోని ఉద్వేగానుభవమే మనోవికారము. (టి అండ్ ఎల్ - 62)

 

37. మాయను వెనక్కు నెట్టివేసిన తర్వాత మనం విషయ పరిజ్ఞానం ఏవిధంగా కలిగి వుంటాము?

        మాయ’ అన్న ఆలోచనే మరచిపొండి.  దాని పనినది చేసుకోనివ్వండి.  నీవాలోచించాల్సింది నిన్ను మరియు దైవాన్ని గురించి మాత్రమే. (టి అండ్ ఎల్ - 62)

 

38. ఈ విశ్వమంతా భగవంతునిలో లయమైపోయిన తర్వాత మరలా మరోసారి సృష్టి జరుగుతుందా?

        వద్దు - ఈ సృష్టి యొక్క అంతాన్ని గూర్చి మాత్రం యోచించు.  విధేయతంటే ఏమో నీకు తెలుసు.  మనస్సు చాలా చిత్రాలు చేస్తుంది.  కనుక మనస్సేమి చేయాలో నిశ్చయించుకో.  అంతేకానీ డొంకతిరుగుడు మార్గం వద్దు. (టి అండ్ ఎల్ - 62)

 

39. పాపమనగా నేమి?

        అస్తవ్యస్తంగా అమర్చిన విషయాలే పాపము.     (టి అండ్ ఎల్ - 62-2)

 

4౦. మిమ్మల్ని మరింత సంతోషపెట్టాలంటే మేమేమి చేయాలి?

        సంతోషం హృదయాంతర్గతం. (టి అండ్ ఎల్ - 69)

 

41. ఒక వ్యక్తి ఇతరులను బాధపెట్టిన తర్వాత అతని ప్రవర్తన ఏవిధంగా వుండాలి?

        తనలోతానై వుండాలి.  అది ఒక విధమైన అంతర్గతం. (టి అండ్ ఎల్ - 69)

 

42. ఇతరులను బాధించడం ఎలాగైనా మనం పూర్తిగా మానుకోవాలి కదా?

        మధ్యస్థం.  మితభావం పాటించాలి.  ఇతరులను బాధించకుండా వుండటమనేది దైవ నిర్దేశం.  పరులను బాధించకుండుటే గొప్ప మతం.  నేను కందిరీగ వంటివానిని కాను.  ఎవరైనా దానిపై కాలు పెడితే అది కుడుతుంది.  నన్నెవరైనా తొక్కితే నేను నలిగిపోయి మరణిస్తాను.

        మీరు మధ్యం సేవించి గంతులేసి ఆనందపడవచ్చు.  పవిత్ర ప్రదేశాలను తగులపెట్టవచ్చు.  కానీ హృదయ భావనలను పరితపింపచేసి నొప్పించవద్దు.  నిన్ను నీవు రక్షించుకోవచ్చు కానీ ఇతరులపై దాడిచేయడం తప్పు.  నిన్ను చిక్కులపాలు చేస్తే ఆత్మరక్షణకు పూనుకోవడం సబబే - ఇతరులలో భగవంతుణ్ణి మాత్రమే దర్శించు.

(టి అండ్ ఎల్ - 69)

 

43. గురువర్యా! మా ఉన్నతి కొఱకు మాకో ప్రార్థన నిచ్చారు.  మరి గురువర్యుల క్షేమం కోసం మేమెటువంటి ప్రార్థన చేయాలి?

        అదే ప్రార్థనే. (టి అండ్ ఎల్ - 71, 72)

 

44. ఒక్కోసారి మనం ఇతరుల గురించి ఏదో అనేస్తాం.  ఆ సందర్భంలో అదే నిజమనుకుంటాం.  కానీ అది ఆ తర్వాత మన తప్పుగా తేలుతుంది.  అందులకు మనం వివరణ యిచ్చుకోవడం వల్ల తప్పు సరిదిద్దుకోనూ వచ్చు, సరిదిద్దుకోలేకనూ పోవచ్చు.  కానీ హృదయాంతరాళంలో ఒదిగి పశ్చాత్తాప భావనతో వుంటాం.  మీరేమంటారు?

        నీవు వాస్తవం గ్రహిస్తే నేను పరిశుభ్రపరిచేస్తాను.  ఆ తప్పు మీరు తిరిగి చేయకండి.  (టి అండ్ ఎల్-1౦5-2)

 

45. సిగ్గు (బిడియం) అనగా నేమి?

        అది నిర్హేతుకమైన మానసిక భావన.

(టి అండ్ ఎల్ - 147-2)

 

46. ఆధ్యాత్మికంగా ఉన్నత దశలో ఉన్నవారిలో లోపాలెందుకుంటాయి?

     1. అభ్యాసిలో సహకారం లోపించడం.

     2. ఆధ్యాత్మిక ప్రగతితోబాటు, మనస్సులో తను గొప్పవాడినన్న భావం వుండటం.

     3. ఆధ్యాత్మిక పురోగతి పొందికూడా శరణాగతి, ఆత్మసమర్పణకు బదులు తన ప్రాధాన్యత భావంలో వుండటం.

 

     నేను సంస్థలోని సభ్యులను సోదరులని సంబోధిస్తాను.  కానీ ఆ మాట సరిగ్గా సరిపోలేదని భావిస్తాను.  అందుకు బదులుగా వారిని "నా హృదయమా" లేక "నా ఆత్మస్వరూపులారా" అని పిలిస్తే బాగుంటుం దనిపిస్తుంది.  అలా జాగ్రత్త వహించి వాళ్ళను నేను యెందుకు పిలువలేక పోతున్నానో నా కవగతం కావడం లేదు.  నేనొక వేళ వాళ్ళు నన్నంతగా ప్రేమించడం లేదని అందామా? అంటే అదీ సరిగాదు.  వాళ్ళు నేను చూస్తుండగా చాలా లోతుగా నన్ను ప్రేమిస్తున్నారు.  అయితే మరెక్కడున్నది లోపం? వారి స్వరం నన్ను సమీపించి నాహృదయాన్ని తాకడం లేదని నా నమ్మకం.  ఈ విషయమై మీకై మీరే ఆలోచించండి.  ఒక నిర్ణయానికి మీరే రండి. (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక, సూరత్ 1982 - 72)

 

47. ఈ విధానము యొక్క హేతుబద్ధత అతనికి తెలిసివచ్చే వరకు, అభ్యాసి యేవిధంగా ప్రవర్తించవలెను?

     ఇవి తగినవి, యివి తగనివి అని పెద్దలు చెప్పే మాటలు పిల్లలకు అసంబద్దములుగా అనిపిస్తాయి.  నిజానికి అవి వారి మేలుకోసమే చెప్పబడినవి.  అయితే వాటి యొక్క హేతుబద్దతను వారే పెద్దవారయ్యే టప్పటికి స్వతహాగా తెలుసుకొనగలరు. (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక, సూరత్ 1982 - 89)

 

48. నిజమైన ఆనందమనగా యేమి?

     అనందం కోసం ఆతృత పోయిన స్థితి. (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక, సూరత్ 1982 - 89)

 

49. అభ్యాసి తన్ను తాను యెలా తీర్చిదిద్దుకోవాలి?

     మనసులో నుంచుకోవలసిన అతి ముఖ్యాంశము, నీతిగల క్రమశిక్షణాయుత జీవితము.  ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించవలెను.  తనకు గాని తన ఆధ్యాత్మిక సంస్థకుగాని చెడ్డపేరు దెచ్చు పనిని యెప్పుడూ చేయకూడదు.  అతని జీవన విధానమూ, యితరులతో వ్యవహరించు తీరు చాలా నిరాడంబరముగాను, నిరహంకారముగాను, హృదయ మార్ధవముతో తొణకిసలాడుతూ వుండి, యితరులలో ప్రేమ, ఆప్యాయత కలిగించునట్లుండాలి.  ఇది తనయందు కూడా సంతృప్తి మరియు ప్రశాంతత కల్గించునదై యుండాలి. (ధార్వాడ్ ప్రత్యేక సంచిక 1991 - XXI)

 

5౦. మరి జబ్బుమనిషి ధ్యానం చేసుకోవాలా లేదా?

     వద్దు. మనిషి బాధపడుచున్నప్పుడు అతని మెదడుకు మరింత శ్రమ కలిగించరాదు.  అందువల్ల అధికమైన అలసట కలుగుతుంది. (సహజమార్గ పత్రిక - 9/82)

 

51. ఆత్మ అనగా నేమి?

     రెండు వస్తువుల కలయికతో మూడవది పుడుతుంది.  అట్లే యోచన దైవశక్తి (స్పిరిట్) తో కలియడంతో ఉత్పన్నమైనదే ఆత్మ. (సహజమార్గ పత్రిక 11/82 - 9)

 

52. మరి యోగమంటే?

     ఆధ్యాత్మిక పథంలో అది చేతికర్ర. (సహజమార్గ పత్రిక 11/82 -9)

 

 53. లయమంటే?

     అభావమైపోవడం. (సహజమార్గ పత్రిక 11/82 - 9)

  

54. వ్యాధిగ్రస్తుడు అంతఃశుద్ధీకరణ చేసుకోవచ్చా?

     తప్పక చేసుకోవాలి. (సహజమార్గ పత్రిక 11/82 - 1)

 

55. ఆధ్యాత్మిక మార్గంలో శక్తులు యెప్పుడు లభిస్తాయి?

     ఎవరైతే ప్రశాంతము మరియు సమగ్రమునైన మానసిక స్థితిలో వుంటారో, వారికి శక్తి యివ్వబడుతుంది.  దురదృష్టకరమైన పరిస్థితి యేమంటే వాస్తవస్థితి మొదలౌతునే సాధకులు, సాధన చేయటం వదిలేస్తున్నారు. (సహజమార్గ పత్రిక 2/1989 - 8)

       

56. సాంసారిక జీవనంలో భార్యాభర్తలెలా మెలగాలి?

     భార్యను తన సహాయకురాలిగా చూచుకోవాలి.  తనకు తాను సంసార శకటానికి గల రెండు చక్రాలలో ఒక చక్రంగా భావించాలి. (సహజమార్గ పత్రిక 2/1989 - 8)

 

57. ఆధ్యాత్మికతకు పనికిరానిదేది?

     సందేహము యిచ్ఛాశక్తికి విషము.  మనస్సుకు నిరాశ, నిస్పృహ విషము.  సోమరితనము జడత్వాన్ని కలిగిస్తుంది.  ఖాతరు చేయక పోవడం పురోగతికి విషము గనుక యెలాగైనా అట్టి గుణాన్ని వదిలించుకోవాలి. (సహజమార్గ పత్రిక 2/1989 - 16)

 

 58. వ్యక్తి జీవితంలో ‘సమాధి’ ఆవశ్యకత ఏమి?

     వ్యక్తి పురోభివృద్ధికి ‘సమాధి’ అవసరం లేదు.  విముక్త మానసిక స్థితి అవసరము.  ప్రతి ఒక్కరు ‘సమాధి’ని ఆశిస్తారు.  మనం భగవంతుని వాంఛించాలి.  ప్రజలు సమాధి కావాలని కోరుకోవడానికి కారణం అది ఇంద్రియ తృప్తినిస్తుంది గనుకనే.  అక్కడ ఇంద్రియ సౌఖ్యమున్నది. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 14)

 

59. కామ, క్రోధ, లోభ మరియు మోహముల ప్రాధాన్యమేమి?

     కామ, క్రోధములు భగవంతుని సృష్టి కనుక పూర్తిగా మనిషి జీవితము నుండి నిర్మూలింపబడవు.  కానీ వాటిని అనుకూలముగా మార్పుజేసుకొనవచ్చును.  ఇవి మానవుని మేధస్సున కుపయోగపడు గుణములు.  లోభ, మోహములు మానవ సృష్టే గనుక సంపూర్ణముగా నిర్మూలింప వచ్చును. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 15)

 

6౦. ఏ వ్యక్తినైనా సంపూర్ణ సమస్థితికి కొనిరావచ్చునా?

     ఏ వ్యక్తిలో గాని సంపూర్ణ సమస్థితి నెలకొనుట అసంభవము.  దాదాపు సమస్థితికి చేరుకున్నాడన్నంత మాట అనవచ్చును.  ఎందుకంటే ఈ సృష్టే సమస్థితి తప్పడం వల్ల ఏర్పడింది. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 14)

 

61. బలహీనుడెందుకు బాధపడుతుంటాడు?

     ఎందుకంటే  వారు వారి ఇచ్ఛాశక్తికి భగవంతుని రంగు పులమరు.  ప్రభువు యొక్క ఇచ్ఛాశక్తికి సామాన్యుని ఇచ్ఛాశక్తికి పెద్ద తేడా యేమీ లేదు.  ఉన్నతేడా ఒక్కటే.  సామాన్యుడు తన ఇచ్ఛాశక్తిని తగిన రీతిలో ఉపయోగించుకొనడంతే.  నేనెప్పుడూ ఒక మాట చెబుతుంటాను. ‘నేను చేయగలననే ఎప్పుడూ అనండి.  నా వల్లకాదని ఎప్పుడూ అనకండి’ ఇదే నే చెప్పేమాట. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 15)

 

62. ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి?

     కారాగారంలో ఒక దొంగ పనిచేస్తుంటాడు.  కానీ అతడు తాను దోషినన్న భావనతో వుంటాడు.  అదే కారాగారంలో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తుంటారు, కానీ వారు స్వతంత్రులమనే భావిస్తారు.  ఇదంతా మనిషి మనోవ్యవహారాన్ని బట్టి అతనీ ప్రపంచంలో జీవించడం జరుగుతుంది. (వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక, కలకత్తా 199౦ - 15)

 

63. మీ సమూహంలో యెవరైనా ఈ కుండలిని మేల్కొల్పబడిన లేక జ్ఆగృతమైన వారున్నారా?

    మీకో విషయం చెప్పాలి.  ఒక వేళ ఒక వ్యక్తిలో యితర కేంద్రములన్నీ గురుకృపవల్ల జ్ఆగృతం చేయబడితే, యీ ఒక్క కుండలినిశక్తిని మాత్రం యెందుకు వదిలేస్తారు చెప్పండి?  కనుక అటువంటి సందర్భాల్లో యిది కూడా చేసేస్తారు. ఓస్పెన్‌స్కై యీ కూండలిని గూర్చి యేమి వ్రాశారో మీరు చదివారా?  ఆయన దీన్ని కుండ అను పేరుగల ఘర్షణ తగ్గించుటకు మధ్యన వాడుకొను కుషన్‌వంటి సాధనమన్నారు.  (రెండు రైలు పెట్టెల మధ్య వాడు స్ప్రింగ్ వంటిది) అంటే ఒత్తిడి తగ్గించు సాధనమన్నమాట.  ఆయన ఉద్దేశ్యంలో అది మన పురోగమన వేగాన్ని అదుపుచేస్తున్నదన్నమాట.  దీన్ని గురించి మీరే ఆలోచించండి.  మీరు నాకంటే బాగా చదువుకొన్న వారు. (బి.ఇ - 68)

 

64. బాబూజీ, మోసగాడిని గురించి మీ అభిప్రాయమేమి?

     నేను యే మోసగాడిని నిందించను.  కానీ నన్నెవరైనా మొసగిస్తే అతడు కనీసం ఒక మేలైనా తనకోసం తాను చేసుకొన్నట్లే. (బాబూజీ 83వ జన్మదిన ప్రత్యేకసంచిక, సూరత్ 1982 - 88)

 

--o0o--


అనుబంధము

 

1. గురుదేవుల వివరణలు

 

(మార్చి 1971లో ఒక సాయంత్రం శ్రీరామచంద్రజీ మహరాజ్ వారు డిల్లీలో యిచ్చిన కొన్ని వివరణలు)

 

1) సహజమార్గములో అంతిమ లక్ష్యమేమి?

   అంతిమ సత్యం లేక సంపూర్ణ విముక్తి.

 

2) ఇతర పద్దతులలోగూడా ఇదే కదా ధ్యేయం?

   భగవంతుడు, నిరామయ సత్యం లేక అంతిమ ఎఱుక అని దీన్ని మనం వివరిస్తాం.  భగవంతునిలో వుండుటఅని, లీనమవ్వడమని, లయించడమని, ఏకమవ్వడమని అనవచ్చు.  భగవంతునిలో ఏకమైపోవడమంటే సరిపోతుంది.  బ్రహ్మములో లీనమవ్వడమనుట మరింత మెరుగైన వివరణ.

 

3) భగవంతుడు "సత్యము" నకు పర్యాయపదమా?

   ఔను.

 

4) విముక్తుడైన వ్యక్తియొక్క మరణానంతరం ఏమౌతుందని మమ్మడుగుతున్నారు.  మీ జవాబేమి?

   ఆ అడిగేవారు చచ్చి ఈ సమస్యను పరిష్కరించు- కోవలసిందే.

 

5) ఆధ్యాత్మిక సాధనలో శిష్యుని పాత్ర ఏమి? గురుని పాత్ర ఎటువంటిది?

   అభ్యాసి తన్ను తాను సమర్పించుకోవాలి.  గురువు శరణాగతినొందాలి. (నవ్వులు) అభ్యాసికి గురువు శరణగతి పొందాలి.  అదే గురువు అనుసరించవలసిన అత్యుత్తమ విధానము.  మనము గురువు వైపునకు మొగ్గుచూపు వాలకము కలిగి వుండాలి.  అదే అభ్యాసి పాత్ర.  గురువు పాత్ర శరణాగతి. అయితే గీత, మరియు అనేకమంది జ్ఞానులు సహితం భగవంతుని శరణు పొందమని చెప్పి యుండవచ్చును.  మీరా పద్దతి నవలంభించడం చాలా కష్టం.  శరణాగతి అభ్యాసముయొక్క ఫలితము.  మరి నేరుగా శరణాగతి అంటే అహంకారము వృద్ధిచెందుతుంది.

 

        "నేను భగవంతుని శరణుజొచ్చాను" అంటే ఏమిటి?  శరణాగతి లోపించి "నేను" మాత్రమే మిగులుతుంది.  భగవంతుని లేక గురుని శరణుజొచ్చాననడానికి గురుతేమి?  అప్పుడతడు సర్వ మానవాళికి శరణుచొచ్చితినన్న భావనకు రావాలి.  సర్వ మానవాళికి శరణుజొచ్చినవాడే ఉత్తమోత్తమమైన గురువు.  అదీ గురువు యొక్క శరణాగతి.  ఇక మీ వాలకము గురువు వైపునకుండడమే.  అదే మీ విధి.  ఇంతటితో మీ సందేహం నివృత్తైందనుకుంటాను.

        మీతో మరొక్క మాట చెప్పాలనుకుంటున్నాను.  మనస్సును క్రమబద్ధీకరించుట సాధకుని పని కాదు.  అది బోధకుని కర్తవ్యము.  మీరొక మహాత్ముని దగ్గరకెళతారు. ఆయన, మీరీ సాధన చేయండి, ఈ జపం చేయండి అని ఏవేవో చెబుతారు.  కానీ మీకు వాటి వలన ఎటువంటి ఫలితమూ కనిపించదు.  అక్కడ మనస్సు క్రమబద్ధీకరించబడలేదు.  మీరేమో రోజుకో సాధన జమ చేసుకుంటూ వెళతారు.  సమస్య మాత్రం అపరిష్కృతంగానే వుండిపోతుంది.

 

6) ఈ పద్దతిలో ప్రశిక్షకుడు లేక గురువు ఒక సకారాత్మక పాత్ర పోషించవలసి వుంది. వారు అభ్యాసిని మార్చవలసి వుంటుంది లేక తీర్చిదిద్దవలసి వుంటుంది.  అలా అనుకోవచ్చా?

   అవును. అది అతని కర్తవ్యము.  కేవలం మీరు ఇంకా బాగా సాధన చేయండి, అనడమే అతని కర్తవ్యమనిపించుకోదు.  అతడు అభ్యాసి విషయమై బాధ్యత వహించి ఉన్నతికి తీసుకురావాలి.  అనేక సాధనలు అభ్యాసిపై రుద్ది విసిగించు గురువులతో నేనీకభవించను.  సరళమైన పద్దతులు గ్రహించాలి.  మనస్సుపై అధిక బరువును మోపితే అది మొద్దుబారిపోతుంది.  వారు యిది చేయండి, అది చేయండి అని అనేస్తారు.  మీ మనస్సేమో తీరుబడి లేనిదైపోతుంది.  మీ సమయమంతా ఎప్పుడూ ఈ పనికే సరిపోతుంది.  అలాంటప్పుడు  మీ మెదడేమైపోతుంది.  మీరు గ్రహించే శక్తిని కోల్పోతారు.  మెదడు మొద్దుబారుతుంది.  వివిధములైన సాధనలంటే మనస్సును చితకగొట్టడమే.  నీవు మనస్సును నలిపేస్తావు.  అది ఏమాత్రం మంచిదికాదు.

 

 

7) ఇతర సాధనలను పద్దతులను వదిలేయమంటారా?

   ఇది అత్యంత అవసరం.  ఎందుకంటే ఇంతకు ముందేర్పరచుకొన్న దారులను విధ్వంసమొనర్చి మరొక దారిని నీవు సంసిద్దము చేసుకుంటున్నావు.  యోచనా ప్రవాహాన్ని అనేక దారుల్లోకి మళ్ళిస్తే నీ గమ్యం వైపునకు నీవు పూర్తివేగంతో మున్ముందుకు సాగలేవు.  ఒకే గమ్యం, ఒకే గురువు, ఒకే ఇచ్ఛా కలిగివుండు.

 

 

8) అభ్యాసి తాను పురోగమిస్తున్నానన్న విషయం ఎలా నిర్ధారించుకుంటాడు?

   నేనొక విషయం చెబుతున్నాను.  బిడ్డకు వయసొస్తూ ఎదుగుతుంది.  ఆ బిడ్డకు తాను ఎదుగుతున్నట్లు తెలుస్తుందా?  ఎప్పుడైతే సంపూర్ణంగా ఎదిగి పెద్దవాడౌతాడో అప్పుడు తాను ఎదిగి మనిషినయ్యా ననుకుంటాడు.  కనుక కొంత ఎదిగి పెద్దవాడైన తర్వాతే అతని స్థితి నతడు తెలుసుకో గలుగుతాడు.

 

9) కానీ మనం పురోగతి చెందనప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది కదా?

   అవును.  అది మనకు తెలుస్తుంది.  ఆకలిగా వున్నప్పుడు మనమేమీ తినలేదని చెప్పగలుగుతాము.

 

1౦) ఇటువంటప్పుడు మనమెటువంటి సకారాత్మక చర్యలు చేపట్టి పురోగతిని సాధించాలి లేక పురోగతిని తెలుసుకోవాలి?

    నిరంతర స్మరణ.  అయినా ధ్యానం వుండనే వుంది.  కానీ నిరంతరస్మరణలో అన్నీ ఇమిడి వున్నాయి.  ఒక విషయం నీ స్మరణలో వుందీ అంటే అది నిన్ను నేరుగా గమ్యంవైపుకు మరలిస్తుంది.  ఒకే గమ్యం వైపుకు నీవు మరలింపబడి వున్నప్పుడు శూన్యం ఏర్పడి అందులోనికి శక్తి జొరబడుతుంది.  శక్తి దిగిరావడానికి మార్గమేర్పడుతుంది.

 

11) నిరంతర స్మరణ వృద్ధి కావడానికి ధ్యానమే కదా మార్గము?

    ధ్యానం అత్యంతావశ్యకం.  అది చాలా సహాయకారి.  అంతే కాదు అది మనలో శ్రద్ధను పెంపొందిస్తుంది.

 

12) మీరు నిరంతర స్మరణ అంటే అది దేని స్మరణ?

    భగవంతుని స్మరణ.

 

13) భగవంతుడంటేనే తెలియదు కదా!  మరి ఎలా భగవంతుని స్మరించగలం?

    మనిషికొక భావన దేనిపైన వున్నా అది వున్నట్లే.  ఎవరోఒకరు నీయందు భగవంతుడున్నాడన్న భావన కలిగిస్తారు.  తదనంతరం నీలో దానిపై ఇచ్ఛ ఉత్పన్నమౌతుంది.  ఒక భావన నీలో వుంటే నీకై నీవే ఇచ్ఛను అంకురింప జేసుకుంటావు.  ఆపని నీవు చేయలేదంటే అది నీ తప్పే సుమా!

 

14) జీర్ణీంచుకొను సామర్థ్యాన్నెలా పెంపొందించుకోవాలి? అది కూడా నిరంతర స్మరణతోనే లభిస్తుందా?

    సరే.  నీవు ఎక్కువ తీసుకున్నా అదీ అరిగిపోతుంది.  కానీ అది బద్దగింపునకు దారితీయవచ్చు.  అయినా అదీ కాస్సేపటికి కరిగిపోతుందిలే.

        సామర్థ్యమంటే ఆతృత. (ఖురాన్ లో దీన్ని హిల్ మన్ మజ్ఈద్ అంటారు) తే! ఇంకా ఇంకా తే! ఇంకా ఇంకా తే!

 

 

15) ఏమిటది?

    అదే కృప.  అనుగ్రహం.

 

 

16) సహజమార్గమనుసరించే వారికి రెండువైపుల అంటే ఆధ్యాత్మికంగానూ, ప్రాపంచికంగాను అభివృద్ధి వుంటుందని, బాబూజీ తమరు మున్నొకసారి సెలవిచ్చారు.  ప్రాపంచిక విషయాలలోకూడా అభివృద్ధి చెందుతారా?

 

    చెందొచ్చు, చెందకపోవచ్చు.  ఆ విషయంపై మన గమనం లేదు.  భౌతిక సంపద కూడా వృద్ధి చెందుతుంది.  కానీ ఈ విషయమై మేమెటువంటి వాగ్ధానమివ్వడం లేదు.

 

 17) మా మిత్రుడొకడు మన విధానం ప్రకారం "ఆత్మ" అనగా ఏమిటో తెలుసుకోగోరుతున్నాడు.  చెబుతారా?

    అది సత్ యొక్క మెరుపు.  అదీ అదే మూలము నుండి బయలుపడుతున్నది.

 

 18) శరీరం నశిస్తే ఆ మెరుపేమై పోతుంది?

    అది తన మూలాన్ని చేరుకుంటుంది.  అదే మోక్షము (విడుదల). మీరు నా అభిప్రాయాన్ని చెప్పమంటే అది బ్రహ్మము నందు లయావస్థయని, దివ్యత్వములో లీనమవ్వడమని, అదే మన లక్ష్యమని చెబుతాను.

 

19) అంతఃశుద్ధీకరణ నాకు విశదపడలేదు. అరగంటా శుద్ధి చేస్తూనే వుండాలా?

    అరగంటో, నలభై అయిదు నిముషాలో, గంటో చెయ్యి.  జనులు చేస్తున్నారు, వాళ్ళెలా చేస్తున్నారో నీవు ఆలాగే చెయ్యి.

 

2౦) అందులో ఏదైనా పొరబాటుంటుందా?

    కొందరు హృదయంపై ధ్యానం చేస్తూ జడత్వమంతా వెళ్ళిపోతున్నదనుకుంటారు.  అలా వారు జడత్వంపైనే ధ్యానం చేస్తున్నారు.  నేను చెబుతూనే వున్నా.  బయటకి తీసెయండి.  ఆవిరి, పొగ రూపంలో తుడిచి బయటకు నెట్టెయండిఅని.  అలా చేయండి.

 

21) అంతఃశుద్ధీకరణ చేసుకునేటప్పుడు ప్రార్థన మళ్ళీ మళ్ళీ చేయవచ్చా?

    వద్దు.  వ్రాయబడివున్నట్లు మాత్రమే చేయండి.

 

22) చాలామంది, జపం చేసినట్లు ప్రార్థన మళ్ళీ మళ్ళీ చేయాలంటు వుంటారు.  అది సరియేనా?

    అది తప్పు.  ధ్యానం ప్రారంభించే ముందు ఒకసారి ప్రార్థన చేస్తే చాలు, ఆతర్వాత ఆ విషయం అంతటితో వదిలివేయాలి.  లేకపోతే ధ్యానంలోని రుచి నాస్వాధించలేవు.  మంత్రం వలె మళ్ళీ మళ్ళీ ప్రార్థ చేయడం సరికాదు.

 

23) అంతఃశుద్ధీకరణానంతరం శుద్ధీకరణ బిందువులైన ‘ఎ’ ‘బి’ లపై ధ్యానం చేయడం అవసరమా?

    మీరు నేను చెప్పినట్లు చేయండి.  ఆ బిందువుపైన, ఈ బిందువుపైన అంటూ మీ మనస్సుకు అనవసరమైన శ్రమను, బరువును నేను కలిగించ దలచుకోలేదు.

 

24) చదవడానికి, గురువర్యుల మార్గదర్శకత్వంలో పనిచేయడానికి చాలా తేడా వుంది. అవునా?

    అవును.  దక్షిణ భారతదేశంలో  ప్రతి ఒక్కరూ జపమంటే ఎక్కువ యిష్టపడతారు.  జపం మంచిదే కావచ్చు.  కానీ ధ్యానానికి సరిరాదు.  వారు దాన్ని తప్పుగా చేస్తున్నారు.  సాధికారమైన గ్రంధ పఠనము కూడా చేయరాదు.  అర్థంపై ధ్యానించవలెనని యోగసూత్రములలో వ్రాయబడివుంది.  కానీ ఎవరూ పాటించడంలేదు.  ఎమౌతున్నది?  అది స్థూలత్వాన్నుత్పాదిస్తున్నది.  చర్విత చరణమై పోతున్నది.

 

(శ్రీబాబూజీ గారి 81వ జన్మదిన (డిల్లీ) 3౦.4.198౦ సావనీర్ నుండి గ్రహించినది)

 

--o0o--

 

2. పితౄణము

(బాబూజీ గారితో డా|| ఆత్మారామ్‌జజోడియా, ముంబయి వారి చర్చ)

 

        మీరెవరితోనైనా స్థూలపూజలెందుకు చేస్తారని ఆడిగితే వారు పూజలెలా స్థూలమౌతాయి? అని మిమ్మల్ని యెదురు ప్రశ్నిస్తారు.  ప్రతి పూజా దానికంటే సూక్ష్మమైనదానితో పోలిస్తే స్థూలమైనదే.  ఏదో ఒక ఉద్దేశ్యము లేక కోరిక లేనట్టిదై ఆత్మతో, ఆత్మ కొఱకు చేసే ఆరాధన సూక్ష్మాతిసూక్ష్మమనుకొనవచ్చును.  భగవత్- సాక్షాత్కారమే దృష్టిపథంలో వుండి స్వార్థము పరమార్థముతో లీనమవ్వడమే యిది.  కనుక తద్భిన్నములైన పూజలన్నీ స్థూలములే.  ఇట్టి పూజలు సర్వంసహావ్యాపితమైన మాయతోను, అనేక విషయ సంబంధమైన సిద్ధులతోను కూడినట్టి ప్రాపంచిక లాభములు పొందుట కొఱకు యేర్పరుపబడి యుండును.  కానీ ఆత్మ పరమాత్మలో లీనమవ్వడం మాత్రం సూక్ష్మమైన ఆరాధనల వల్లనే వీలౌతుంది.  అది ఒక సమర్థ గురువర్యుని ద్వారా మాత్రమే సాధ్యము.  కేవల స్వప్రయత్నమున యిది సాధ్యమగునది కాదు.

 

        విశ్వాన్నంతా చూస్తున్న కళ్ళు తమను తాము చూడలేవు, స్థౌల్యారాధకుని పరిస్థితీ యిట్టిదే.  యెందుకు చేస్తున్నామో, వాటి అర్థము, పరమార్థమేమిటో తెలియకుండానే నేను అనేక విధాలైన పూజలు చేసేవాడిని.  వాటిలో విగ్రహారాధన, ఆలయదర్శనం, స్తోత్రపాఠాలు వల్లించడం, కీర్తనలు, భజనలు పాడటం, వ్రతాలు, దానధర్మాలు చేయడం వంటివెన్నో వున్నాయి.  వరుసగా వ్రాస్తే పెద్దపట్టికే  తయారవుతుంది.  అయితే వీటన్నింటిలో ఒకేఒక ప్రత్యేకత యేమంటే, వీటిని నేనే స్వతహాగా చేసుకొనే వాడిని, పురోహితుల, పూజారుల సహాయంతో చేసేవాడిని కాను.  ఇవన్నీ నేనేదో విశ్వాసంతో చేసేవాడిని కాదు గానీ నిజానికి వాటిని హృదయపూర్వకంగాను, ఒక ఆనందదాయకమైన వాటిగాను తలంచి చేసేవాడిని.  అందుకే అవి అలా సాగిపోతూ వుండినవి.

 

        మొత్తముమీద నా గురుదేవుల పాదసన్నిధిలో నన్ను కాళ్ళు, చేతులు బంధించి తెచ్చి పడవేసినట్లయినది.  అక్కడికి రావాలన్న దృఢనిశ్చయమేదీ నాలో లేదు.  కనుక నేను యేవిధమైన ఆశతోను వచ్చి చేరలేదు.  కానీ ఓ రెండుమాసముల లోపే యెండుటాకుల వలె అనేక విషయాలు నానుండి రాలిపోవడం మొదలైంది.  వాటిలో చాలా విషయాలు నాకు యిష్టమైనవే కావడం గమనించాను.  కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయమేమంటే అలా అవి వదలిపోవడం నాకు చిత్రమనిపించలేదు, సరికదా అదంతా సాధారణంగా జరిగిపోయింది.  బహుఃశా గురువర్యుల పని యెప్పుడోమొదలై యిప్పుడు వాటి ప్రభావం బయట పడుతున్నట్లున్నది.

        వరుసగా జరిగిపోతున్న యిన్నింటి మధ్య ఒక విషయం గట్టిగా తగుల్కొని నన్ను పీడిస్తున్నది.  నాకు తెలియనియేదో ప్రగాఢ వాంఛ నేను దానిని విడువడానికి వీలుకాకుండా చేస్తున్నదనుకుంటాను.  ఇంతో అంతో సంస్కృతము నేను నేర్చుకొన్నప్పటి నుండి యిదమిద్దమని యెరుగని కర్మకాండననుసరించి తర్పణము వదలడము, శ్రాద్ధము పెట్టడమనే ప్రక్రియకు గట్టిగా కట్టుబడిపోయాను.  ఇదిగాక మిగిలిన ఆరాధనలన్నీ నా స్వప్రయోజనమునకు చేస్తున్నాననీ, యిది మాత్రం నాకు మూలమై యీ ప్రపంచంలో నా యిప్పటి జన్మకారణమైన వారికోసం చేస్తున్నానని తలచేవాడిని.  అందుచేతనే నేను దీన్ని ఒక పవిత్ర విధిగా భావించడం వల్ల ప్రయత్నించి కూడా దీన్ని నేను వదలలేకపోయాను.  పరమపదించిన వారి యెడల యిది ఒక ఋణంగా నేను తలచి దీన్ని విస్మరించడానికి వీలులేనిదిగా భావించాను.

 

        గురువుగారొక అవకాశాన్ని కల్పించారు.  ఆయనన్ని అవకాశాలూ కల్పిస్తారు, కానీ మన మందదృష్టి వల్ల వాటిని ఆలస్యంగా గ్రహిస్తున్నాం.  కొన్ని వారాలు నేనాయన చరణకమలముల చెంత వుండటం తటస్థించింది.  మా అన్నగారి ప్రోద్బలం చేత నాకు సంబంధించిన కొన్ని యిబ్బందులు ఆయన ముందుంచడం జరిగింది.  నన్ను నేను సమర్థించుకోవడానికి పూజ్య లాలాజీ ఒకానొకచోట యీ తర్పణం గురించి పేర్కొన్నట్లు ఆచరించినట్లు ఉన్నదని కూడా జ్ఞాపకం చేశాను.  బాబూజీ నా అణుకువ మాటున ఉన్న మూఢత్వాన్ని గమనించి చిరునవ్వుతో యిలా పలికారు "నిజమే లాలాజీ వారు ఒకసారి యీ ప్రక్రియ ననుసరించటం నేను చూశాను.  కానీ నేను కాస్తా లోతుగా పరిశీలిస్తే, నేను గమనించిందేమిటో తెలుసా? ఆయన చేయుచున్నదాని సారాంశాన్నంతా ప్రసారంజేస్తున్నారు.  నేడటువంటి పనిని మనమెవరమైనా చేయగలమా? అదటుంచి నీవు చేస్తున్నదేమిటో విశదంగా చెప్పు" అన్నారు.  నేనప్పుడు తర్పణము, శ్రాద్ధము మరియు వాటి వివరములతోసహా నేను చేస్తుండినదంతా వివరించి చెప్పాను.  "చూడండి ఒకానొకప్పుడిదంతా మన ఋషులచేత చక్కగా ప్రవృద్ధమానము చేయబడిన శాస్త్ర విషయమై వుండినది.  ఇప్పుడిది కొందరికి మాత్రమే తెలుసు.  శాస్త్రీయంగా యిప్పటికీ కొందరు నిర్వహింపగల వారున్నారు.  బ్రాహ్మణులకు అన్నదానము, వస్త్రదానము, ఇంకా మరికొన్ని వారికి సమర్పించడము వంటివి కేవలము సాంఘికపరమైన ఆచారాలను సూచిస్తాయి.  అవి పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.  అది నీవు వీలైనంత చక్కగా పాటించవచ్చు.  నీ శక్తిమేరకు ఒక మంచి పనికి ధర్మం చేయవచ్చు" అన్నారు.  అప్పుడు నేను బాబుజీని కొన్ని ప్రశ్నలడిగి సమాధానాలు పొందాను.  అవి యిలా ఉన్నాయి.

 

ప్రశ్న: కానీ బాబూజీ యీ విధానాలు శరీరం విడచిన

      ఆత్మలకు యే విధంగా ఉపకరిస్తాయి.

బాబూజీ: ఇది మంచి చర్యయే.  ఇది నీకు పుణ్యాన్ని

        ఆర్జించి పెడుతుంది, అంతకు మించి మరేమి లేదు.

ప్రశ్న: కానీ బాబూజీ యిది నేను పుణ్యంకోసం చేయడం

      లేదు.  నేను నా పిత్రాదులకు మేలు జరగాలని

      చేస్తున్నాను.

బాబూజీ: ఈ కర్మకాండకూ, నీవనుకొన్నదానికి యే

       సంబంధము లేదు.

ప్రశ్న: అయితే మరి నేనేమి చేయాలంటారు?  వారి యెడల

      నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చలేక పోతున్నందుకు

      మనస్తాపం జెందుతున్నాను.

బాబూజీ: మనఃపూర్వకంగా వారికొరకు నీవు ప్రార్థించవచ్చు.

         అయితే ఒక విషయం బాగా జ్ఞాపకముంచుకో,

         మనసంస్థలోని అభ్యాసి మనఃపూర్వకంగా,

         శ్రద్ధాసక్తులతో చేసిన ప్రార్థన చాలా

         ప్రతిభావంతంగా వుంటుంది.

ప్రశ్న: అయితే తమరు మా పెద్దల శ్రాద్ధతిథినాడు నన్ను

      వారి కొఱకు ప్రార్థించమని సూచిస్తున్నారా?

బాబూజీ: ప్రార్థనకు ఏ రోజైనా మంచిదే.  అది సరే మరి

          వారి కొఱకు నీవు ఏమని ప్రార్థిస్థావు?

జవాబు: వారి విముక్తి (స్వేచ్ఛ) కొఱకు ప్రార్థిస్తాను.

బాబూజీ: మీ తండ్రి ఎప్పుడు మరణించారు?

జవాబు: సుమారు 22 సంవత్సరాల క్రితం.

బాబూజీ: ఆయన విముక్తుడైగాని లేక తిరిగి జన్మించిగాని

         వుండాలి. ఒప్పుకుంటావు గదా?

జవాబు: ఒప్పుకుంటాను బాబూజీ.

 

 

బాబూజీ: ఒకవేళ అతను మరుజన్మ ఎత్తివుంటే, ఏదో ఒక

          కుటుంబంలో యిప్పటికి యువకుడుగా

          ఉంటాడు.  నీ గురువు నిన్ను అనుగ్రహించి, నీ

          ప్రార్థనను నిజంచేస్తే, ఆ యువకుడు తక్షణం

          మరణిస్తాడు.  ఇది ప్రకృతి కార్యంలో నీ

          అనవసరపు జోక్యమౌతుంది.  కాదా?  అంతే

          గాదు, అతని ప్రస్తుత కుటుంబ సభ్యుల

          గతేమిటి?

దానికి జవాబుగా నా నోట మాట పెగల్లేదు.

 

        గురువుగారు మందహాసవదనుడై యిలా అన్నాడు - "చూడు యిదంతా చాలా చిత్రమైన చిక్కు వ్యవహారము.  తొలుత నీ స్వేచ్ఛ కొఱకు అన్ని ప్రయత్నాలు చెయ్యి.  సమర్థ గురువర్యుల కృప ద్వారా దాన్ని పొందితినన్న నిశ్చితాభిప్రాయమునకురా!  మిగిలిన విషయాలన్నీ భగవంతునికి వదలివేయి.  ఆయన పని ఆయనకు తెలుసు.  అది కూడా ఎలా, ఎప్పుడు చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తాడు.  నేను మళ్ళీఒకసారి చెబుతున్నాను, శ్రద్ధాసక్తితో, హృదయపూర్వకముగా మన సంస్థలోని అభ్యాసి చేసిన ప్రార్థన యెన్నడూ వృధా కాదు."  "అందరి కొఱకు ప్రార్థించు కానీ తొలుత నీ కొఱకు నీవు ప్రార్థించు. నీవు నీ లక్ష్యమును ముందు అందుకొని ఆ తర్వాత నీ వనుకొన్నది చేయుము.  ఆ స్థాయిలో నీ ప్రార్థన మరింత ప్రతిభావంతంగా వుంటుంది."

 

        ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మా తండ్రిగారి తర్వాతి శ్రాద్ధతిధి నేను మరచిపోయాను.  ఇక అప్పటి నుండి ఆ కర్మకాండ నేను చేయనేలేదు.

 

(14-౦9-1986న బెంగుళూరు వ్యవస్థాపక దినోత్సవ ప్రత్యేక సంచిక నుండి గ్రహింపబడి, ఆంగ్లము నుండి తెనుగున కనువదింప బడినది)

--o0o--

 

3. తుదిపలుకులు

         ప్రియ సోదరీ సోదరులారా! మన ప్రియతమ గురువర్యులు అనేకచోట్ల జిజ్ఞాసులు అడిగిన సర్వసామాన్య ప్రశ్నలకు తగిన సమాధానములిచ్చి వారి అనుదిన అభ్యాసమునకు తోడ్పడునట్లు చేసిరి.  వాటిని ఈచిన్న పుస్తకమున సంకలన పరచి మీకందించే అవకాశం కలగడం మా భాగ్యంగా భావిస్తున్నాము.

         సందర్భాలను అనుకూలంగా మలచుకొని బాబూజీ ఇంకా ఎన్నో వివరణలిచ్చారు.  సహజమార్గులకేమైన వరం ప్రసాదింపబడిందా? అంటే ఆయన తెలియజేస్తూ, “ప్రతి సత్సంగసభ్యుని అవసరాల కొఱకు తినడానికింత ఆహారము, కట్టుకోవడానికి గుడ్డ, ఇంకొంత అతని జీవితావసరాలకు యివ్వబడింది” అన్నారు.   ఈ వరం శ్రీకృష్ణపరమాత్మ బాబూజీకి ప్రసాదించారని వారే సెలవిచ్చారు.

         ఒకసారి ఒకతను బాబూజీకి ఉత్తరం వ్రాస్తూ ముందు నాకు భగవత్‌దర్శనం కానివ్వండి తర్వాత పూజ మొదలు పెడతానన్నాడు.  అందుకు జవాబిస్తు బాబూజీ, అయ్యా! మీరు అన్ని ప్రయత్నాలకు తుదినున్న దాన్ని మొదటనే మీ అనుభవానికి రావాలంటున్నారు.  అది ఎలా వుందంటే ఒక విద్యార్థి మొదట నాకు షేక్‌స్పియరు, మిల్టను రచనలు అర్థము కానివ్వండి, ఆ తర్వాత ఎ,బి,సి,డి లు నేర్చుకునే ప్రయత్నం చేస్తానన్నట్లుంది.  అసలు నీవు అందుకోవలసిన లక్ష్యమే నీ ఎదురుగా కనబడుతుంటే ఇక నిన్నెవరు అందుకోసం పూజచేయమనే సాహసం చేస్తారు చెప్పండి, అని ప్రత్యుత్తర మిచ్చారు బాబూజీ.

         మానవజీవితంలో వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నప్పుడు జవాబిస్తున్నప్పుడు మన సాధనలో సరైన పద్దతికి ఎప్పుడు వస్తాము? అని అడుగగా ఆయన జవాబిస్తూ "ఎప్పుడూ అంటే ఎప్పుడు నీవు పద్దతిని మరచిపోతావో అప్పుడు" అన్నారు.  అలాగే ధర్మ కార్యాలెలా చేయాలి అని అడుగగా "రేపే మరణిస్తున్నానని తలంచి ధర్మకార్యాలు చేయాలి.  అట్లే ఒక యిల్లు కడుతున్నావనుకో అప్పుడు మాత్రం నేను ఈ ఇంట్లో శాశ్వతంగా వుండబోతున్నానని తలంచి నిర్మించుకోవాలి" అన్నారు.

 

        ఇంకోసారి బాబూజీ వివరిస్తూ గురుదేవునిలో లీనమై పోవాలన్న కోరిక కోరిక క్రిందికి రాదన్నారు.  అది కర్తవ్యమన్నారు.  ఒక్కోసారి గురుదేవుల సమక్షంలో, లీనమవ్వడమనే ఆ కోరిక గూడా అభ్యాసిలో వుండదన్నారు.  అదంతా కేవలం ఆలోచనా పరిధిలోనిదే పొమ్మన్నారు.

 

        వైరాగ్య విషయమై మాట్లాడుతూ బాబూజీ అలా వైరాగ్యం పొందడానికి కోర్కెల నుండి తప్పించుకొనే ఎట్టి ప్రయత్నమైనా అది కేవలం సమయం వృధా కావడమేనంటూ, నిజమైన వైరాగ్యం సహజంగా మనలో నెలకొనాలన్నారు.

 

        నిజమైన ప్రేమను గురించి మాట్లాడుతూ - ప్రేమ రెండు విధములు.  నేరుగా భగవంతునితో ప్రేమ మరియు మరొక మాధ్యమం ద్వారా ప్రేమ.  మాధ్యమం (గురువు) ద్వారా వెళ్ళడం వల్లనే ప్రేమ వల్ల ప్రయోజన మున్నదని బాబూజీ తెలిపారు.

 

        నిజమైన ప్రేమంటే తాను ప్రభువు చేత ప్రేమింపబడుతున్నా ననిగాని, తాను ప్రభువును ప్రేమిస్తున్నా ననిగాని తెలియనటువంటిదేనని బాబూజీ తెలిపారు.

 

        డాంబికమునకు దూరంగా వుంటూ, వీలైనంత వరకు నాట్యములు, చలన చిత్రములు మొదలైన వాటి యొక్క వలలో చిక్కుకొనరాదని మనలను బాబూజీ హెచ్చరించారు.

 

        ఇంకా చెబుతూ, ఇంద్రియ వాంఛలు నాభి ప్రాంతములో నిక్షిప్తమై వుంటాయి.  కనుక ఆ బిందువు వద్ద ఒత్తిడి కలుగజేయరాదనిన్నీ, అలాచేస్తే వాటికి శక్తి పొంగి పొరలుతుందని హెచ్చరించారు.

 

               ఏదో ఒక విధంగా కామాన్ని (కోర్కెను) నాశనం చేస్తే మేధస్సు సంపూర్ణంగా నిర్మూలింప బడుతుంది.  ఎందుకంటే మేధకు సంబంధించిన కేంద్రమునకు అతి దగ్గరగా కామకేంద్రం అనుసంధించబడి యున్నది.  ఒక వేళ క్రోధాన్ని నాశనంచేస్తే మానవుడు అటు భగవంతుని వైపుగానీ ఇటు ప్రాపంచిక విషయాలవైపుకు గానీ కదలలేడు.  వాస్తవానికి మనిషిలో కార్యోన్ముఖుని చేయు శక్తి క్రోధంలోనే వున్నది.  కనుక జీవునకిది అవసరంగా వుండవలసినదై యున్నదని బాబూజీ వివరించారు.

 

        ఆత్మసాక్షాత్కార స్థితి నిజానికి భావవ్యక్తీకరణకు అందనిదై మూగబోయి వున్నది.  కాంతిని బయటగానీ లోపలగానీ భావించడము లేక గమనించడము ఆత్మ సాక్షాత్కారమని అస్సలే అనలేము.  మనం అంతిమంగా చేరుకోవలసిన వెలుగు, చీకటుల కావలి స్థానమదని బాబూజీ విశదపరిచారు.

 

        ఇంకా ఆయన వివరిస్తూ బాధ నుండి, దుఃఖము నుండి విడుదల పొందుటే మానవుని తాపత్రయమై వుంది.  స్వాతంత్ర్యానికి దారి కారాగారం నుండే వేయబడి వుంది అని ఒకసారి మహాత్మా గాంధీ అన్నారట.  మనం ప్రపంచాన్నే కారాగారంగా భావిస్తే పైవాక్యం ఆధ్యాత్మికపరంగా కూడా సరిగ్గా సరిపోతుంది.  తీవ్ర నిరాశా నిస్పృహల్లో జనులు తమ జీవితాన్నంతం చేసుకోవాలనుకుంటారు.  కానీ అటువంటి సందర్భాలలో మరణానికి సమాంతరమైన జీవితాన్ని ప్రసాదించమని భగవంతుని వేడుకొనుట అత్యంత శ్రేయస్కరమని బాబూజీ తన అభిప్రాయాన్ని వెలువరించారు.

 

        ఇంత సూక్ష్మమైనది ప్రతిభావంతమైనది అయిన సహజమార్గంలో వ్యక్తులను (అన్వేషకులను) చేర్చుకొనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు బాబూజీ! మీరు అభ్యాసులుగా ఎవరినైనా చేర్చుకొనే ముందు వారి యోగ్యతను పరీక్షిస్తారా? అని అడుగగా అందుకాయన "నేనెవరి యోగ్యతను పరీక్షించడం లేదు.  కానీ నా దగ్గరికొచ్చిన వారి పరీక్షలకు నేనే గురౌతున్నాను.  సహజమార్గ మెన్నుకొనువారికుండవలసిన అర్హత అంగీకారమే.  ఈ పద్దతి ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందాలనే దృఢనిశ్చయ ముంటే చాలు, తర్వాత అన్ని అర్హతలు అవే సహజసిద్ధంగా సమకూరుతాయి" అన్నారు.

 

--o0o--

 

 నేను హాస్యానికి ఏదో అనేస్తాను.  కానీ అందులో కూడా ఒక పరమార్థం ఎప్పుడూ వుండనే వుంటుంది.  (టి అండ్ ఎల్ - 17౦)

 

       హృదయమండల ప్రయాణం పూర్తయిన తర్వాత సరికొత్త ప్రయాణం మొదలౌతుంది.  ప్రేమ నీకు మార్గదర్శి అవుతుంది.  శూన్యస్థితి అనునది ప్రత్యేకమైనది.  దానిని గూర్చి మీరు మరీ మరీ ప్రయత్నించి అర్థం చేసుకోవాలనుకుంటారు.  కానీ దాన్ని మీరు అర్థం చేసుకోలేరు - అందుకు కారణం అక్కడ ఆకర్షణ బంధం లేదు. (టి అండ్ ఎల్ - 76-2)      

 

 

 

 

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...