Sunday, 17 March 2024

గురుదేవుల ఆశయం

 

గురుదేవుల ఆశయం

                                                                              రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్  

 మీరందరు కలసి నా ఉనికిని విజయవంతం చేయాలని నేను ఆశిస్తున్నాను. లేదా మనమందరం కలసి నా ఉనికిని విజయవంతంచేద్దాం. మీరు వైభవోపేతులైతే, ఇది జరిగితీరుతుంది. అంటే మీరు వెలిగిపోవాలని నా‍ఉద్దేశ్యం. ఆధ్యాత్మిక భైరాగుల వైభవం వారు ధరించు ప్రత్యేకదుస్తులవల్ల సమకూరదు. వారి హృదయవివర్ణమువల్ల కలుగుతుంది. ఈవివర్ణత యెలాకలుగుతుంది? వర్ణములన్నీ కలసిపోయినట్లైన కలుగుతుంది. అది మనకెలా తెలుస్తుంది? అది సమతాస్థితి నెలకొనడంవల్ల తెలుస్తుంది. సమతాస్థితి యెలా నెలకొంటుంది? అది వినయము వృద్ధిచెందుటవల్ల నెలకొంటుంది. వినయమెలా వృద్ధిచెందుతుంది? అది శరణాగతివల్ల వృద్ధిచెందుతుంది. శరణాగతి యెలా వృద్ధిచెందుతుంది? ఆత్మత్యాగం (సమర్పణ) వల్ల లభిస్తుంది. 

 ఉత్తమోత్తమ శరణాగతి అనునది ఆత్మసమర్పణవల్ల ప్రాప్తిస్తుంది. భగవంతుడు లేదా యేదైనాఒక ఆదర్శమును మహోన్నతమైనదిగా గైకొనడంవల్ల అది ప్రారంభమౌతుంది. ఇక్కడ నేను ప్రాధమిక విషయాన్ని చెబుతున్నాను. ఆతర్వాత తమనుతాము అద్దానికి సమర్పించుకుంటారు. అదెలాగంటే, స్నానముచేయించువాని చేతిలోని శవంలాగ. అతడు యిష్టంవచ్చినట్లా శవాన్ని పైకెత్తి, కాళ్ళూ చేతులు అటూయిటూ త్రిప్పి స్నానంచేయిస్తాడు. ఆశవం  యేయిబ్బంది, అడ్డంకి కలిగించదు. ఇటువంటిదే మరొక ఉదాహరణను రామానుజులవారు, వారి వేదాంతగ్రంథమున తెలిపినారు. అదేమంటె,         పిల్లిపిల్లను తల్లి తననోటిలోని పళ్ళసందున యిరికించుకొని ఒకచోటినుండి మరోచోటికి తీసుకపోతుంది. పిల్ల కదలకుండా తల్లికి సహకరిస్తుంది. అహంకారాన్ని బ్రద్దలుకొట్టగల ఔషాదాన్ని నన్నివ్వమంటే, సర్వదోషహారిణి, అతిమధురము సర్వాంగములకు తగినది, పైతెలిపినఊదాహరణ మాత్రమే, అంటే స్నానంచేయించువాని చేతిలోని శవంవలె నుండుటే. నా ఆలోచనలో యింతకంటే మంచి ప్రక్రియ కానరాదు.

 ఒకమహాత్ముని మహత్తు హృదయంలో స్థిరపడితే అహంకారం నిర్మూలింపబడుతుంది. ఇందులో ఒకమర్మంకూడా దాగివుంది.ఒంటె పర్వతంచెంత నిలబడగానే దాని అల్పత్వం తెలిసొచ్చింది అన్నది ఒకనానుడి. ఏమిటా మర్మం? ఒకచిన్న విషయం. మనదృష్టి నట్టే ఆకర్షించింది. అది మనమనస్సు లోనేవుండి, మనలను మరొకరితోపోల్చి అంచనావేస్తుంది. అలా పోల్చుకొని యితరునికంటే తను అల్పుడనని గ్రహిస్తుంది. ఆవిధంగా మన అహంకారం పైన మనం మొదటిదెబ్బ కొట్టినవారమౌతాము. హృదయంనుండి యీ పోల్చిచూడడమనేదే తొలగిస్తే, పురోభివృద్ది అనేభావన హృదయందాటి ముందుకు కదలుతుంది. ఈపోల్చిచూడడ మనే గుణమే, మనమేమవ్వవలసివున్నదో యెఱుకపరుస్తుంది.

 ఎప్పుడైతే మనమేమవ్వాలో అనే ఆలోచన మనలో వేరుదన్నుతుందో, అప్పుడే మనస్సులో అది  మొలకెత్తడం ప్రారంభమై, మనం దాన్ని సాధించాలనే ప్రయత్నం మొదలెడుతాము. అప్పుడే కొంతవరకు మన ఆదర్శముతో మనకు సంబంధమేర్పడుతుంది. ఈహృదయానుబంధం అనగా ఆదర్శంపై ప్రేమ వేరుదన్నడం మొదలై మన ఆలోచన ఆవైపునకు మరలి మనలో నిరంతరస్మరణరగిలి వెనువెంటనే ఒకకొలిక్కి వస్తుంది. నిరంతరస్మరణ కొనసాగడం దృడమౌతుండడంతో దాని వేడి, విద్యుత్తు మనలను ప్రభువుకు పరిచయంచేస్తుంది. అలా ప్రభువుతోగలిగిన పరిచయంవల్ల త్వరితంగా ఆధార అక్షాగ్రమునకుజేరి మనలో నెలకొంటుంది. సహజమైన మార్గంలో మున్ముందుకు కదిలితే, యిదంతా యెంత సహజంగా, సరళంగా వున్నదో అర్థమౌతుంది. ఇంత ప్రయోజనకరమైన మివ్వన్నీ నాకు తెలిసి మీదరికి చేరుస్తున్నాను. ఇదంతా జరగడం మీచేతుల్లోనేవుంది. ప్రభునుండిసహాయం, అనగా భగవంతునిసహాయం, ఆయన అక్షాగ్రాలు నీలోపలా బయటయేర్పడియుండి, నీకు సహాయపడుతూనే వున్నాడు. 

   నీమాట ఆకొసకుచేరి అక్కడనుండి దివ్యధార నీవరకుచేర్చే సాంకేతికవిద్య యిదే. లేకపోతే సోదరా! గంపక్రింద బంధింపబడియున్న ఆడచిలుక యెంత అరచిగీపెట్టినా యెవరు వినిపించు కుంటారు చెప్పు? అరచిగీపెట్టేవారి స్వరంవినడానికి, వారినిచూడటానికి, దైవమునకు చెవులు కళ్ళులేవు. అన్నింటికి దైవమునకున్న సాధనమొక్కటే. సోదరా! ఆఖరుకు మనంకూడా అదేకొసకు చేరవలసియున్నది. మనంకూడా ఆమాదిరే (దైవం మాదిరే) అవ్వాలంటే మనచెవులు కళ్ళు పనిచేయకుండా పోవాలిసిందే మరి. అదే భగవత్సాక్షాత్కారము. ఇదివిని నీవుగానీ లేక ఇతరులెవరైనాగాని యేదోఒక సాధనంతో మీచెవులు కళ్ళు పొడిచేసుకుంటా రేమోనని నేను భయపడుచున్నాను.

 మీరు విషయం అర్థంచేసుకున్నారని భావిస్తున్నాను. మన మహోన్నతగమ్యం (చేరవలసిన ఆదర్శం) వలె మనంమారాలి. అది ద్రువాగ్రాలమధ్య దైవప్రేమప్రవాహంచేరి నిండినప్పుడే సాధ్యమౌతుంది. నిరంతరస్మరణమనే విద్యుత్‍ప్రవాహం హృదయాతరాళమునకు,మన గమ్యము (ఆదర్శము)నకు మధ్య  అనుసంధానముగా యేర్పడ వలసియున్నది. అతిముఖ్యావసరం నెరవేరు అదృష్టం కలిగితే, ఆస్థితి, సరిగ్గా ఒకకవి వర్ణించినట్లీ విధంగా వుంటుంది. “ఏజ్ఞానేంద్రియాల అవసరంలేకుండానే విజయాలు అరచేతికందుతాయి” అదెలాగంటే, ఆత్మ, మనంచేరస్వలసిన ఆదర్శం (గమ్యం) సహజంగా ఒకేతీరుగ ఒకటైవుంటాయి. భగవంతుడు మీకు దీన్నిపొందగలిగే ధ్యైర్యమనుగ్రహించుగాక! అందుకనువగు సహాయం భగవంతుడు మీకందించుగాక!

 ఈఆద్యాత్మికసాధన ఆద్యంతం బంగారమునకు సువాసన కలిగినట్లవ్వాలి. అలాకావాలంటే అదృష్టవశాత్తు, ఆదర్శం లేక మహోన్నతగమ్యం, ఒకమానవరూపంలో లభిస్తే, అదికూడా  మాగురువర్యులైన పూజ్యశ్రీ లాలాజి వారైతే సుసాద్యమౌతుంది. ఈఅదృష్టంకోసం హృదయంద్రవించి కన్నీటిపర్యంతమైన ప్రార్థనామయ పిలుపు కావాలి. లేదంటే యేవిదమైన ఆంక్షలకు లొంగని ఆమహాప్రభుని దయ, ఆయన తీయటియిచ్చపై అది ఆధారపడి వుంటుంది. వ్యక్తిగతంగా చేయాల్సిందేదైనా వుందంటే, అద్దానినిగురించి కబీరుమహనీయుడీ విధంగా సెలవిచ్చారు "ఆయన్ను పొందిన వారందరూ కన్నీటితోనే పొందారు" అనగా అతడు మనకంటికెలా కనబడినా, అమాయకత, కన్నీటిపర్యంతమైన దీనత, బాధాతప్తహృదయము అతనికుండాలి. ఇక ఆయన దయవిషయానికొస్తే, అది యిలా చక్కగా వివరింపబడింది.

 "దయామయుడైన భగవంతుడు, ఆయనకైఆయనే యీమహత్‍ప్రాప్తి మనకనుగ్రహించునేగాని, యేవ్యక్తి భుజబలం వల్ల యిది సాధ్యమగునది కాదు. 

  నాకుప్రాప్తించిన యీఅదృష్టము మీకందరికీ ఆమహాప్రభువనుగ్రహించుగాక. తదాస్తు!

  (S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అణువదించడమైనది )    

 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...