ఆయనకొఱకు తపన ఆవేదన
సహజమార్గదర్శన మను పుస్తకమున పూజ్యబాబూజీ మహరాజ్ యిలా సెలవిచ్చారు. "సృష్టిజరుగుట అవసరమైనపుడు, భగవంతుడు ఉనికిలోనికి వచ్చెను. భగవంతుడు సృష్టిచేయవలునను యోచనచేయగనే, కేంద్రము లేక భూమాచుట్టూ నిగూఢమైయున్న చైతన్యము, కుదుపువలన, దైవీయశక్తి విశ్వనిర్మాణమునకై విడుదలైనది. కేంద్రమునుండి వేరుపడిన కారణమున వ్యధగలిగి, ఆవ్యధ మనిషిని తన మూలమును గూర్చి జ్ఞాపకము చేసుకొనుటకు దారితీసినది.
కనుక, సృష్టి దాని పరిణామక్రమములో తన ఉత్పత్తికి కారణమైన మూలమువైపునకు తిరిగి వెళ్ళుట, మనిషి ఆత్మయొక్క సహజత్వమైయున్నది. సంస్కారములచేత చుట్టబడిన పట్టుపురుగుప్యూపా వలెనున్నఆత్మ, మూలము లేక కేంద్రమునకు తిరిగివెళ్ళుటకు హృదయములో ఆతృత కలిగియున్నది.
లోతైనవిషయములు గల బాబూజీవారి దశాదేశములవ్యాఖ్యానము అను పుస్తకమున, మొదటిఆదేశము తొమ్మిదవ ప్యారాలో యిలా వ్రాశారు. "మనిషి తను అంతర్గతముగా తన ఉత్పత్తిస్థానమునకు తిరిగి వెళ్ళవలెనను ఆకాంక్ష రేకెత్తుటకు కారణము, అతడు తనవంతుగా గైకొన్న ఆ సత్యసారము శక్తివంతమై, ఆవైపునకది ఆకర్షించుటే. సృష్టికికారణమై, ఉనికిలోనికి వచ్చిన ఆచైతన్యములో అతని వంతు భాగం అతనిలో (మనిషిలో) ప్రవేశించినది. మనిషిలో ఆ నిశ్చలస్థితికి తిరిగివెళ్ళవలెనను ఆలోచన వచ్చినంతనే, తనలోనికి ప్రవేశించి అంతర్గతముగా నిద్రాణమైయున్న శక్తి ఉత్తేజితమై, తనశక్తికొలది తిరుగుప్రయాణమునకు ప్రయత్నించినది.
దివ్యశక్తిమూలంనుండి ఆవిర్భవించిన మానవమనస్సు తనమూలమునకు తిరిగివెళ్ళుటకు ఆవేదనతోను, ఆతృతతోనూ తహతహలాడుచున్నది. అది అందులకు తగు విధానము, పద్దతికై అన్వేషించుచున్నది. అభ్యసి తన లక్ష్యముసాధించుటకు (అన్వేషణ ఫలించుటకు) గురువు అతని హృదయలోనాటిన బీజరూప సత్యసత్వమును భక్తి ప్రేమలతో సక్రమముగా చేయు ధ్యానముద్వారా, పొంగివచ్చిన నిరంతరస్మరణ యనెడు జలమునందించి, బీజరూపమున తనలో నిక్షిప్తమైయున్న గురుశక్తిని పోషించును. నిశ్చితమైన ఇచ్ఛాశక్తి, నిజమైన మానవ జీవితగమ్యమును చేరవలెనను ఆతృతగలిగి ఆమహాప్రభువగు గురువర్యుల దీవెన, దయ ప్రాప్తమైనయెడల మానవుని తిరుగుప్రయాణము సుగమమమగును.
మనిషి కోరికలగు దాసుడై, ప్రాపంచికవస్తుసముపార్జనలో వ్యధ లకులోనై మానవజన్మ కలిగినందులకు నిజమైన లక్ష్యసాధన కొఱకు పాటుబడుటను విస్మరించినాడు.
ఆధ్యాత్మిక
ప్రయాణము
తీవ్రమైన ఆకాంక్ష లేక ఆతృతతో లీనమవ్వడం, వ్యాప్తిజెందడం మరియు తననుతాను శూన్యునిజేసుకోవడమన్నది, పురోగమనానికి నిదర్శనము. సహజమార్గవిధానాన్ని సక్రమంగాపాటించడం, ముఖ్యంగా ఆత్మపై యేర్పడిన ముద్రలను (సంస్కారములను) అంతఃశుద్ధీకరణద్వారా తొలగించుకోవడం వల్ల ఆమహాప్రభువు (గురువు)నకు శరణుజొచ్చి, మనస్వస్థానమునకు (భూమకు) తిరిగివెళ్ళుటకు తగు అర్హతనుబొందును.
అభ్యాసి గురువును ధ్యేయంగా నిశ్చయించుకొని (తూహీ హమారీ జిందగీకా మక్సద్ హై) ఆయనపైనే ధ్యాసవుంచినట్లైన, బాబూజీ మనగమ్యము మనకు జ్ఞాపకముండేట్లు చేస్తారు. బాబూజీ వివరించినట్లు అంతరంగమున సృష్టికర్తతో తిరిగి ఐక్యమగుట కొఱకు ఆత్మపడు వ్యధ, ఆతృత కంటే, అనంతమువైపుసాగు ఆధ్యాత్మికప్రయాణములో కలుగు ప్రశాంతత, ఆనందము యేమంత గొప్పకాదు.
మన స్వప్రయత్నమున వేలజన్మలకైనను మన
నిజస్థానమునకు తిరిగివెళ్ళుట సాధ్యముకాదు. మన బాబూజీవంటి సద్గురువు, మనము అంతిమసత్యముతో ఐక్యమగునట్లు చేయగలరు. ఆ అంతిమసత్యమే సమస్తమునకు
మూలము.
మన అదృష్టవశమున దివ్యత్వము మానవరూపమున
శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్‍పూర్‍గా అవతరించినది. ఆయన అవతరణతో మొదటిసారిగా
ఆధ్యాత్మికచరిత్రలో వ్యక్తికి సహజంగా సులువుగా
జీవితసమస్యాపరిష్కారము లభ్యమైనది.
కర్ణాటకలోని రాయచూర్ నివాసియైన పూజ్యశ్రీ
రాఘవేంద్రరావ్ (ఆప్యాయతతో ఆయనను అప్పాజీ యని పిలుచుకొందుము) ఆయనొకసారి చెబుతూ,
"నిర్వచింపబడిన ఆధ్యాత్మికసాధనలన్నింటిలో
స్థిమితముకోల్పోయిన ఆతృతస్థితి మహోన్నతమైనది"
అన్నారు.
ఉర్దూకవిత
1961 వ సంవత్సరం జనవరి 30 న బాబూజీ, అప్పాజీకి వ్రాసిన ఉత్తరంలో యిలా వున్నది. "నీవు చాలా అందమైనవాక్యం వ్రాశావు. నీవు నాచెంత లేకపోయినప్పటికిని నాదర్శనంకోసం తహతహలాడు చున్నావు. ఇది సత్యతత్త్వసామ్రాజ్యమందు నీవందుకున్న మహోన్నతస్థితిని సూచించుచున్నది. దీనినొక ఉర్దూకవితలో, యిలా యిమడ్చబడింది. "రహే తలాబ్ మే ఐసే ఖుద్ రఫ్‍తా హోరహేహై మంజిల్ పహుంచ్‍కర్ మంజిల్ డూండ్‍తేహై" అనగా నేనెంతగా లీనమై మైమరచిపోయానంటే, నేను నాగమ్యం చేరుకొనికూడా యింకా గమ్యంకోసం వెతుకుతూనే వున్నాను.
దేవవాణి పుట 188 లో పూజ్యబాబూజీ యిలా
చెప్పారు. "బాధ లేక ఆతృత, సత్యతత్త్వం వైపునకు దృష్టిమరల్చిన వారి కొఱకైతే, సత్యతత్త్వపుమత్తు నాకాంక్షించు వారికొఱకు శాంతి ప్రశాంతత వున్నవి"
అన్నారు. మొదటిది పొందుటంత కష్టమూగాదు, రెండవది సాధించుటంత సులువూగాదు. ఇప్పుడొక్కింత ఆలోచించండి. వ్యధ
శాంతికన్నా వెయ్యిరెట్లు విలువైనది. నిజానికి బాధ (వ్యధ) అరుదైన మహనీయుల
నీలోకమునకు దెచ్చిన నిర్మాణమునకాధారమై యున్నది.
నేను
బాధ,
తీవ్రవాంఛ, ఆతృత లేక అశాంతిని హృదయపూర్వకముగా
కోరుకొంటిని. వాటి కొఱకు నా వేయిజీవితములను సైతము త్యాగముచేయగలను. నా స్వరూపమంతయు ఆ విధానముననే నిర్మితమైనది. ఈకారణముననే, మీఅందరిలోనూ యిట్టిబాధ ఉత్పన్నముకావలెనని నేను ఆతృతతో యెదురుచూచుచుందును.
అదే నాకు సంతృప్తినిచ్చు విషయము.
ఈవిషయమున నన్ను సంతృప్తిపరచుట
మీకర్తవ్యముకాదా! నాయెడల రవ్వంతైనా భక్తిప్రపత్తులున్న వ్యక్తి సహజంగా నాకు శాంతి, ఓదార్పు కలిగించుపని చేయుటకు పూనుకుంటాడు. అదేగదా! నాజీవితపరిశ్రమ,
నా తీవ్రఆకాంక్ష. శాంతికంటే యీ తీవ్ర ఆతృత (అశాంతి) యొక్క శోభ
(ఆకర్షణ) చాలా గొప్పదని నిశ్చితమగా మీకు నొక్కివక్కానిస్తున్నాను.
ఇది తీపిలేని బహుతియ్యనిబాధ. ఒకసారి మీరు
దీనిని రుచిచూస్తే చాలు ఒక్కక్షణమైనా అదిలేకుండా వుండలేరు. ఈస్థితిని వదలుకొనుటకంటే ప్రాణత్యాగమే మేలని
తలంతురు. ఇది ధ్యానమున కావలనున్న స్థితి. ఈస్థితికి గొంపోవుటకు నిరంతరస్మరణ
ఒకవాహనముగా పనిచేయును.
ఇది ప్రగాఢవిశ్వాసముతోగూడిన భక్తి ప్రేమల
ఫలితము.
సదా సంబంధము గలిగియుండుట
ఇది తీవ్రమైన వాంఛతో ఆతృతతో ఆరాటముతో, విశ్వేశునికొఱకు పడుతపన. నిరంతరం సజీవముగా మండుతున్న అగ్ని. ఆయనతప్ప మిగిలినదేదియు జ్ఞాపకములేని వాడుగా మారిపోవుట. ఆయనతోనే సంబంధమేర్పరచుకొని విడువకుండుట.
ప్రియసోదరీ సోదరులారా! దివ్యదీవెన వల్ల మనము, బాబూజీ మహరాజ్ వారి పవిత్రపాదముల చెంత చేరితిమి. ఒక నిముషమైననూ
వృధాపరచుకొనక యీసదవకాశమును సద్వినియోగ పరచుకొందుము గాక! సహాయపడుటకు మన గురువర్యులు
సదా మనకందుబాటులో నున్నారు. ఆయన దయానంద సాగరము. మనహృదయములలో నిత్యము సత్యమునై
యున్నారు. ఆయనకోసం మనము ఆతృతతో వుండటంకన్నా మేలైన విషయమేమున్నది? ఆయనకృప మనలనందరిని ఆహ్వానిస్తూ, ఆయన హృదయంలో
జీవించమంటున్నది. ఆయన జీవితమే ప్రశస్తజీవితం. ఆయనకొఱకు ఆతృత (తొందర) పడండి. బాబూజీ
ఉత్తరం అప్పాజీకి వ్రాస్తూ, ఒక అద్భుతవాక్యాన్ని ఉదహరించారు.
ఆవాక్యంతో నా యీప్రసంగాన్ని ముగిస్తాను.
"జో దర్డ్ అస్నా, దిల్
వహీహై కైసేకి ముహబ్బత్‍కి ఖాబిల్
వహీహై"
అంటే "బాధకలవాటుపడిన హృదయమే
ప్రేమించుటకర్హమైనది".---పుట 172
(2-12-2023 న సోలాపూర్ ఫౌండేషన్ డేలో ఆంగ్లములో యిచ్చిన ఉపన్యాసము.
ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ పత్రికనుండి గ్రహించడమైనది)
No comments:
Post a Comment