Saturday, 27 April 2024

ఆఒకటికై అన్వేషణ

 

ఆఒకటికై అన్వేషణ

 "యోగము" అంటే అసలైన అర్థం "కలయిక".  రెండువుండి అవి ఒకవిధానంప్రకారం పయనించి ఒకదానితో ఒకటి కలవడమే యోగము. ద్వైతం, అద్వైతంరెండూ తొలుత వుంటేనే యీ యోగము నకు అర్థము సిద్ధిస్తుంది. ఒక్కటైయున్న దానికై సాగే అన్వేషణే యోగముయొక్క సారంశము.

 ప్రకృతిపరిధిలో ఉన్నది, కానున్నది అన్న వాదం ప్రక్కనబెడితేయోగసాధనానుభవమున ఒకటికైసాగే అన్వేషణ ముందుకు సాగుతుంది. లక్ష్యమునకు ఒకపేరిడి, దాని వివరణలివ్వవవచ్చును. కాని ప్రభువు అన్నమాట విషయగ్రహణకు చక్కగా సరిపోతుంది. ప్రభువు అన్నమాటకు భగవంతుడు లేక లక్ష్యము అన్నమాటగా అనువదించుటగాకదాని బదులుగా యిదమిద్దమని చెప్పుట భాషాపరంగా కష్టమగుచున్నది.

ప్రభువు అన్నమాటను గ్రహించి, ఒప్పుకున్నతర్వాత, ఇక ఆయనతో కలయికప్రక్రియ మొదలుపెట్టగనే, ముడి తర్వాత ముడిగా ఆటంకములు కలుగుచున్నవి. అనగా వ్యక్తి ఆశలు మరియు ముందేయేర్పరచుకున్న భావనలు అను అడ్డంకులను అధిగమించి పురోగమించవలసి యున్నది. ముడులనువిప్పి, కేవలం కలయిక మత్రమే గాకుండా, లక్ష్యంలో లీనమగునట్లు జేయు సరియైన మార్గము ప్రేమ మాత్రమే. కానీ ప్రేమ అన్నింటికంటెను బహుమోసకారి. వ్యక్తి ముందుగనే యేరికోరి వాంఛాపరితృప్తికై యేర్పరచుకున్న ప్రేమవలన ఉన్నముడులు మరింతగా బిగుసుకపోయి, ప్రభువుకృపా మహిమకు కూడా సడలనివైపోవును. ప్రేమ సహజరీతిలో ఉత్పన్న మైనదైతే, అది సరళము సులభమునై యుండును. అదే  ప్రయత్నపూర్వకముగా తెచ్చుకొని చూపెడి ప్రేమ సంక్లిష్టముగానూ, సంకుచితముగానూ వుండును.

 ప్రేమమార్గము చాలా యిరుకైనది. అందులో ఇద్దరు ఒకేసారి యిమడరు. నిజమైనప్రేమ ఒకరిని చచ్చేట్లుచేసి, ప్రభువును మాత్రమే సజీవంగానుంచును. వికటప్రేమ ప్రభువును చావనిచ్చి తానొక్కడే ఒంటిగా జీవిస్తాడు. ఒక కర్రయొక్క రెండుకొసలవద్ద ఒకేఒకదానికై అన్వేషణజరుపు యోగప్రక్రియను విషదపరచునవే యీరెండు విధానాలు.

 వాస్తవానికి ప్రేమించడం వ్యకియొక్క ముఖ్యవిధి. కాని ప్రభువే ప్రేమించాలనడం అసంబద్ధం. అయినా ప్రేమ ప్రభువు (గురువు) నుండే మొదలవ్వాలలి మరి. ఈవిషయంలో ప్రభువు (గురువు) స్వేచ్ఛకు, యెన్నికకు ఆటంకము కలుగరాదు. ముఖ్యముగా ఆయనకిష్ట మొచ్చిన రీతిలో, ఆయన యిష్టపడి యెన్నుకున్న వారిపై, ప్రేమ స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. ప్రభువుప్రేమ వర్షముకురిసినట్లు అందరియెడ సమానమే. కాని ప్రభువు యేబరువు బంధనము లేకుండా, సర్వము గ్రహించి గగనమున తేలిపోవు (తేలికయైపొయిన) వానినే యెన్నుకొనును. ఆయనతప్ప మరెవ్వరును ఆయన యెన్నికను అర్థముచేసుకొనజాలరు. గురువుయొక్క హృదయవేదన, పరితాపమునకు యెయ్యదియును సాటిరాదు. అత్యంతోన్నత స్థాయి గురువర్యులనేకులు, తాము విదుదలచేసిన శక్తిని సంపూర్ణముగ గ్రహించగల యోగ్యునికొఱకు తమదేహత్యాగం తరువాత వందల సంవత్సరములు నిరీక్షించ వలసి వచ్చినది.

 ప్రభువు (గురువు) ప్రేమద్వార ఉన్నముడులన్ని విప్పబడి, ఆయనలో లీనమగుట సంభవమై, యోగము లేక ఒక్కటికై అన్వేషణతో సహా సమస్తస్థితుల నధిగమించి, మరింతగా పురోగమింతురు. ప్రభువు (గురువు) ప్రస్తుతం సమాన్యజనం ఆరాధించు దేవునివలె వివిధరూపాలలో విడివిడిగానుండగా, విడివిడిగావున్న ఆమొత్తం ఒక పాత్రలో యిమిడిపోయి ఒక్కటైనరీతి, తగినట్లుగామారి సరియగువిధానమున ప్రభువు (గురువు) ప్రేమకు పాత్రు (యోగ్యు)లౌదురు. స్వార్థమెరుగని నిశ్చితబుద్ధితో ఒకేఒక్కదానినే (ఏకంసత్ నే  ) నమ్మియున్నట్లైన, అదే సరియైన దారి నేర్పరచి, జీవన్ముక్త (బ్రతికియుండియు మరణించిన వానివలెనుండు) స్థితికి చేర్చి, అన్వేషణను సఫల మొనర్చి, మన‍ఉనికియైన ఒకటిని ఒక్కటైయున్న దైవము (ఏకంసత్) వైపుకుత్రిప్పిమున్ముందుకు నడిపి, యీఒకటి ఆఒకటితో ఐక్యమొనర్చును.             

  (డా:శ్రీవాత్సవ గారి Divine Messages అను పుస్తకము లో ఆంగ్లములో ప్రచురించిన Search for One అను పాఠమునకిది తెలుగు అనువాదము)               

 

 

Sunday, 21 April 2024

ఇది-అది

 

ఇది-అది

వాస్తవానికి మనశరీరము , ప్రాపంచికవస్తు సముదాతము, యిదంతా "ఇది" యని,ఆత్మ ,సత్యతత్త్వ సారాశమును "ఆది" యని అనవచ్చును. ఈ"అది", "ఇది"చేతకప్పబడుతూ, ఒకపద్దతిప్రకారం ఒకటితో మొదలై పెక్కుపొరలుగా చుట్టివేస్తూ వెనక్కు నెట్టబడుతూ, ఇప్పటి పరిస్థికి వచ్చినది. నిజమైనప్రయాణం ,"అది"గా వున్న టువంటిది తనచుట్టూ చుట్టుకపోయిన "ఇది" యనెడిపొరలను ఒకటొకటిగా ఛేదించుకుంటూ, తిరిగి తన తొల్లింటి "అది" స్థితికి చేరడమే. అక్కడున్నది మనదైన, మన కనుకూలమైన స్వదేశనుభవమే. ఈఅనేకత్వం నుండి యేకత్వమునకు వచ్చుప్రయాణం సామాన్యముగా బహుదూరం. అయితే యీప్రయాణదూరం తగ్గిపోవా లంటే మహోన్నతుడైన గురువుపై పూర్తిగా ఆధారపడటమొక్కటే మార్గము. ఈదూరభారాలు, పెరగడం తగ్గడ మనేది యెంతకష్టమో అంతేసులభం. ఈ సమస్యకు పరిష్కారం, సత్యతత్త్వమైన ,కేంద్రము లేక మూలముతో అనుబంధమేర్పరచుకోవడమే. ఈఅనుబంధం ద్వైతభావం లేకుండ "ఇది" "అది" కి కూడా అతీతమైయుండాలి. తొలిప్రయాణం, మన సంపద ధనం ఆస్తిపాస్తులరూపంలోనున్న స్థూలపొరలతో చుట్టివేయబడియున్న అసలు సున్నా లేక శూన్యస్థితిని ప్రభువుకు నివేదించి తిరుగుప్రయాణానికి సిద్ధమవ్వటమే. అదే మనముందున్న లక్ష్యం. తొలుత అది దూరప్రయాణం. తర్వాత అదికష్టతరం. అదెలాగంటే, సూదిబెజ్జమునుండి ఒంటెను దాటించడమంత కష్టం. 

సున్నా (శూన్యం) ఒకటి కావడానికి జరిగిన ప్రయాణం విస్తరించిన వస్తుప్రపంచపు శాస్త్రవిజ్ఞానంవంటిది. అదే తిరుగుప్రయాణం,  ఒకటి సున్నా (శూన్యం) అవ్వడం, ఆధ్యాత్మిక విపులత్వానికి దర్పణం పడుతున్నది. ఈ "ఇది" "అది" కావల యేమున్నదో ఉన్నది (అనిమాత్రమే చెప్పగలుగుదుము). శూన్యమన్నది మానవుని మేధస్సు కందనిదైయున్నది.  మన ఉనికిలో యీ"ఇది" "అది" అనునవి మనజ్ఞానపరిమితికి ఒకహద్దు. "ఇది" కి సంబంధించి నేటివిజ్ఞానశాస్త్రము చాలానే ఆవిష్కరించినది. కానీ "అది" పరిపూర్ణమైనప్పటికి ,దాని అన్వేషణ అసంపూర్ణముగనే మిగిలిపోయినది. 

 "ఇది" "అది"ని సైతమధిగమించి అవిభాజ్యమైన 'ఏకంసత్”లో లీనమై పోవుటకు (మానసాధ్యమైన మహోన్నతస్థితికి జేరి మహాప్రళయ కాలమున కేంద్రములో అతిసహజంగా సులభముగా ఆత్మ తన ఉనికిని కోల్పోయి లీనమగుటకు) నిరీక్షిస్తున్న స్థితికి జేర్చుటలో దోహదకారియై సహజమార్గ విధానమున్నది. ఈవిధానము సంపూర్ణమైన వెలుగులోనికివచ్చుటకు ప్రతియొక్కరి సహాయసహకారములవసరమై యున్నవి. "ఇది" "అది" కి మధ్య సమతనుసాధించడమే ప్రతియొక్కరి వ్యక్తిగత సంస్యలపరిష్కారము నకు గల యేకైక మార్గము. సంస్థసక్రమ పూరోగతికిగాని ఉన్నత మానవత్వ విలువలకుగానీ మూలమదియే. ఇదే సహజమార్గ సందేశము.

 వందలాది మానవత్వపు సంస్కృతీవిలువల పరిరక్షించు ఆశయమును, నెర వేర్చు హామీతో దేశకాలపరిమితుల కతీతముగా హద్దులు, అవరోధముల నధిగమించి, సహజమార్గవిధానము వచ్చినది. సహజమార్గ ఆవిష్కర్త (శ్రీ రామచంద్ర, షాజహాన్ పూర్ వారి ) కృప, వ్యక్తిత్వపుపరిధులను దాటి, నిత్య సత్య మూలకారణమై, ప్రతియొక్కరికీ అందుబాటులో యుండుటేగాక ఆ మహనీయుని ప్రేమించువారికీ, ఆయనను గుర్తించి, ఆయనపై ఆధార పడినవారి కందరికీ సర్వకాలసర్వావస్థలలో సన్నిహితుడై (వారి హృదయములలో వెలుగై) వారి జీవితలక్ష్యమును నెరవేర్చుటకు సంసిద్ధులై    ఉంటారు.

 (డా:శ్రీవాత్సవ గారి Divine Messages అను పుస్తకము లో ఆంగ్లములో ప్రచురించిన This And That అను పాఠమునకిది తెలుగు అనువాదము)               

 

Thursday, 18 April 2024

దేహత్యాగానంతర ఆధ్యాత్మికశిక్షణ

 

దేహత్యాగానంతర ఆధ్యాత్మికశిక్షణ

 ప్రతియొక్కరు విహారయాత్రలో ప్రకృతిఅందాలను చూడటానికి యిష్టపడ తారు. అందులోనూ వసంతఋతు శోభ, పూదోటలు చూచి ఆనందిస్తారు. శాంతస్వభావులు అలాచూస్తూ ప్రశాంతంగా ప్రకృతిలో తిరిగివస్తారు. చపలచిత్తంగలవారు సంగీతవద్యాలను జోరుగావాయించి వింటూ కాలంగడిపేసి విహారయత్ర ముగిసిం దనుకుంటారు. ప్రియుని (భగవంతుని) ద్యాసలో పూర్తిగా మునిగిపోయినవారు విహరయాత్రను మరోవిధంగ తిలకిస్తారు. ప్రేయసికి యీ అరుపులు గందరగోళముతో పనేముంటుంది? ప్రియుని (భగవంతుని) స్థానంనుండి తీసుకొనిరాబడిన చిరుగాలితెమ్మెరలే అతనికానందదాయకమౌతాయి. వారి మజిలీ మనవినోదం ముగిసి ఆ వినోదపుమోహాన్నధిగమించిన తర్వాతే వస్తుంది.

 ఒక కుటుంబపెద్ద జబ్బుపడితే, అతనిధ్యాస పిల్లలబాగోగులపై యెక్కువగా వుంటుంది. అందుకుకారణం బహుశా అతనిజబ్బుయొక్క బాధ, ఆజబ్బు వలన కలిగిన దిగులు కావచ్చును. ఇతరఆలోచనలు అతన్ని బాధించక పొవచ్చును. ఇకపోతే తనచుట్టూ సన్నిహితంగ తిరుగుచున్న, తనబిడ్డలతో బంధమేర్పడి యుండవచ్చును. బిడ్డలు తనయెదుటనే కనబడుతున్నందున వారియెడ మరింత మమకారం కలిగియుండవచ్చును. ఇదే మరణ సమయమున మనిషికి బంధనమైపోవును. అత్యాశ (ధనంపై) అత్యంత హేయమైనది. అది పాపాలన్నింటికి తల్లివంటిదని నాభావన. ఆవ్యామోహం చాలాగట్టిబంధనమునకు దారితీయుచున్నది. నేను చెప్పదలచుకున్న దేమంటే, బాధ (నొప్పి) పడుతున్న సమయంలో యేదో అత్యవసర ప్రత్యేక సందర్భములలోతప్ప మిగతా సమయములలో ఆధ్యాత్మికకార్యము సహజంగా జరుగదు. ఆధ్యాత్మికకుటుంబముపై యెక్కువగా దృష్టి మరలుతుంది. ఎందుచేతనంటే, నావిషయంలో నేను అభ్యాసుల ఆలోచన, స్మరణతో వెంటనే ప్రభావిత మౌతాను. సాధారణంగా నాఆధ్యాత్మిక కార్యనిర్వహణలో నాసంబంధీకుల స్వరం సరిగ్గావినబడదు. అటువంటప్పుడు నేనే స్వప్రయత్నంతో వారిని జ్ఞాపకంచేసుకుంటూ వుంటాను. దీనర్థమేమంటే, నాజబ్బువల్ల సోదరీసోదరులంతా మేలు పొందుతారు. అయినప్పటికీ జనులు మాత్రం నేను ఆరోగ్యంగా వుండాలనీ, శారీరకబాధలేవీ లేకుండా వుండాలనీ ఆశిస్తారు. నేను అనారోగ్యంతో బాధపడుటవల్ల వారి ఆధ్యాత్మికప్రగతి వేగవమ్తమౌతుందని పాపమాదీనజనులకు తెలియదు.     

               నాబాధ యిబ్బంది వలన, నాసహచరులుపొందే, యీ ప్రయొజనమేగాకుండా నేనుయీ భౌతికదేహం వదలివెళ్ళుటవల్ల కలిగే ప్రయోజనం మరింత మిక్కుటంగా వుంటుంది. అంతేగాక దేహత్యగం చేసినవారికి సహితం యిది ప్రయోజనకరమే. శరీరం వదలిన తర్వాతనే నిజానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఎందుకంటే, శరీరంతోవున్నప్పుడు వుండే కొన్నిఆటంకాలు శరీరంతోపాటే తొలగిపోయి యే హద్దులూలేకుండా కార్యనిర్వహణ సాగిపోతుంది.

 కబీరుమహనీయుడు యిలా ప్రకటించాడు. "ప్రపంచం మరణభయంతో వ్యధజెందుచున్నది. కానీ నాకుమాత్రం అది ఆహ్లాదదాయకం. నేను మరణించటంతో నాకు బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది"

 మనసంస్థకు గల ప్రత్యేకసదుపాయమేమంటే , సశరీరియైయున్నప్పుడు కూడా సంపూర్ణ ప్రయోజనం కలిగించుటే. ఇది మనగురువర్యుల అపూర్వ ఆవిష్కరణ. అయినప్పటికీ అంతటిమహోన్నతస్థాయి నందుకొన్న వారిపై ప్రాణాహుతిప్రసార సమయములో కొంతవరకు హద్దులు విధించబడ్డాయి. అందువల్ల దైవీయశక్తి ప్రసారము సంపూర్ణస్థాయిలో అభ్యసిలోనికి దూసుకొనిపోయి అతనినరములు విచ్ఛిన్నముగాకుండా కాపాడు కోవటం జరుగుతుంది. అట్టిమహోన్నతాస్థాయి నాకనుగ్రహింపబడినప్పుడు, నానుండి ప్రవహించు ప్రాణాహుతిని అభ్యాసులు అరనిముషముకూడా భరింపజాలరు. నాపైగల సౌజన్యమువలన లాలాజీవారు నాకలాంటి హద్దులేవీ విధించలేదు. అయితే నేను ఆస్థితిలో యెవరికీ శిక్షణనిచ్చుటకు వీలుపడలేదు. అప్పు డాయనను ప్రార్థించాను. ఆయన కొన్ని హద్దులేర్పరచి, ఆహద్దులనుసైతం నేనుకోరితే తొలగించ బడతా యన్నారు. అలాఆయన విధించిన హద్దులను తొలగించమని కోరే అవసరం నాకెప్పుడూ కలుగలేదు.

 శరీరంవీడినతర్వత గురువునుండి దీక్షపొందిన శిష్యులు తండ్రిఆస్తిని బిడ్డలు పొందినట్లు వారివారి వాటాను వారు పొందుతారు. అంతే గాకుండా, ప్రేమాతిశయంతో గురువులో లీనమైయున్నవారు అందుకు తగినట్లు యెక్కువవాటా పొందుతారు. గురువు శరీరంవదలిన తర్వాత కూడా యేశిష్యులైతే ధారతెగిపోకుండా తమఆలోచనలో గురువును నిలుపుకొనివుంటారో, వారు గురువునుండి ప్రయోజనం పొందుతూనే వుంటారు. లీనమైపోవడం, అనేకప్రయోజనాలను సమకూరుస్తుంది. అందుకు కారణం, అతని అహం పూర్తిగా నిర్మూలింపబడి వుంటుంది. అతడాశించిందే (దైవమే) అతనిలో విరాజమనమై వుంటుంది. అభ్యాసి తను యెంతగా గురువులో లీనమైయుంటాడో, అంతగా అతడు ప్రయోజనం పొందుతాడు. అందుకేనేను ప్రతియొక్కరినీ లీనమవ్వమని పదేపదే ప్రోత్సహిస్తూవుంటాను. కానీ జనులు మాకు తిరుబడిలేదని చెబుతూ, ఆవైపునకే తిరుగలేకున్నారు. ప్రతియొక్కరూ నేనే నాశక్తితో వారిపనులన్నీ చేసిపెట్టాలంటారు. కానీ వాస్తవంచెప్పాలంటే, అది అభ్యసి కర్తవ్యము. లినమవ్వడమటుంచి, వారికోసం యెంతోకొంత చేస్తూనేవుంటాను. మొగమాటంతో త్రోసిపుచ్చలేక కూడ కొంతచేయవలసి వస్తున్నది. మొత్తంమీద గమనిస్తే, వారిలో పనికిమాలిన ఆలోచనలు వారిచుట్టూ పేర్చుకొని వున్నట్లు నేను కనుగొన్నాను. నేను వారిని శుభ్రపరుస్తూవుంటే, వారు తిరిగీ మలినాలను రుద్దుకుంటూవుంటే, నాశ్రమకు ఫలితమే మున్నది? వారు వారి క్రమమైనసాధనతో ముందుకుసాగుతూవుంటే నేను ప్రసాదించే వెలుగును అడ్డుకునే అవాంఛనీయ మబ్బునైనను కనీసం వారు తొలగించుకుంటారు.

 శిక్షకుడు శరీరం వదలినతర్వాత శిష్యునకుకలుగు ప్రయోజనం మరొక టున్నది. అదేమంటే, శిష్యుడు స్వచ్ఛమైన దైవీయప్రసారన్ని పొందుతాడు. శిక్షకుడుసైతం అటువంటి స్వచ్ఛమైన దైవీయప్రసారం చేస్తున్నట్లు శరీరం విడచిన తర్వాతనే గమనించగలడు. ఈవిషయంలో ఒకటిరెండు అంశాలు ఇంకనూ చెప్పవలసినవున్నవి, గానీ అవి మాటల కందని అంశములు. నేను నాకథనే చెబుతాను వినండి. మా గురువర్యులు శరీరంవదలినతర్వాత యిప్పుడు నేనున్న స్థితికి తీసుకొని వచ్చుటకు 12 సంవత్సరముల దీర్ఘ కాలము పట్టినది. అప్పటికీ ఆయన సందేశమిస్తూ, నేను యింకనూ కొంత సమయం తీసుకుందా మనుకున్నాను. కానీ యింకఆలస్యం చేస్తే, నీవు యెవ్వరికీ శిక్షణయివ్వలేని దశకు చేరుకుంటావని తెలిసి తొందరపడవలసి వచ్చిందన్నారు. నాకు తెలిసినంత వరకూ చెబుతున్నాను. అసలువిషయమే  మంటే, నేను శూన్యానికే శూన్యమైన స్థితిలోనికి పోవడం అప్పుడు ప్రారంభ మైంది. అందువల్ల నేను అనుభవరీత్యా శూన్యమైపొతున్నాను. ఇకనేను ఆస్థితిదాటి అవతలిస్థితిలోనికి ప్రవేశిస్తే, శూన్యానికేశూన్యస్థితినిసైతం మరచిపోయేట్లై, భౌతికశరీరంలోని ప్రాణంజారిపోయేది (ప్రాణం పోయేది).

 నాఅనారోగ్యము మరియు దేహత్యగమువల్ల నాసహచరులకు కలిగే ప్రయోజనం మరొకటున్నది. అదికుడా చెప్పేస్తే యీ విషయం పూర్తవు తుంది .

 ఒకగురువు యీ ప్రపంచం విడచి వెళ్ళిన 150 సంవత్సరములకు తన ఉత్తరాధికారిని నియమించినట్లు నేను కనుగొన్నాను (మైనే దేఖా కి ఎక్ గురు నే అపనీ దునియాసే జానేకె డేడ్‍సౌవర్ష్ బాద్ అపనే ప్రతినిధి కాయం కియా)

 నా అనారోగ్యము మరియు దేహత్యాగానంతరము నాసహచరులకు కలుగు అనేక ప్రయోజనములతోపాటు మరొకటికూడా చెప్పదలచు కున్నాను. శిక్షకుడు మహోన్నతశక్తిమంతుడైనప్పుడు, అతని ఉత్తరాధి కారుని నియమించవలసి యున్నది. అయితే తన భౌతికదేహత్యాగ సమయానికి తనశిష్యులలో తగినవాడొక్కడూ లేనట్లైన, అతడువేచి యుండక తప్పదు. గురువు తను యీప్రపంచము విడచివెళ్ళిన తరువాతనే తన ఉత్తరధికారిని నియమించిన సంఘటనలూ నేను గమనించాను. వివేకానందస్వామి వారి మహాసమాధి తరువాత తనప్రతినిధిని నియమించడానికి చాలాకాలమే పట్టింది. తను తగినవాడకున్న వ్యక్తి తనసంస్థలో దొరకనప్పుడు, మరోసంస్థతో సంబంధమేర్పరచుకొని అక్కడనుండి తనప్రతినిధినెన్నుకోవలసి వచ్చింది. వాస్తవానికి నియమింపబడ్డ ప్రతినిధి, గురువు (నిజమైన గురువు) జీవితములో సంపాదించిన శక్తినంతటినీ గ్రహించగలిగిన సమర్థుడైయుండాలి. ఒకవేళ అట్టివాడు సమయానికి లభించని పక్షంలో గురువు ఆశక్తినంతటిని ఒకచోట భద్రపరచివుంచుతాడు. ఇప్పుడు దీనర్థమేమంటే, శిష్యులు తమగురువు జీవించివుండగనే, సమర్థులై వుంటే వారిలో ఒకరిని గురువు తనప్రతినిధిగా యెన్నుకుంటారు. నావిషయానికొస్తే నేను నాదినచర్య పుస్తకంలో, నన్నుగురించి వ్రాసిపెట్టాను. లాలాజీవారు మహాసమాధియైన తరువాత ఒకేసారి నా బాహ్యాంతరాలలో సంపూర్ణశక్తి నిండిపోతున్నట్లు అనుభూతిచెందాను. అదినాకు బదిలీచేయబడిన శక్తియని గ్రహించాను. ఆతర్వాతనే మాగురువర్యుల దేహత్యాగవార్త నాకందింది. ఆశక్తిని నేను భరించడంలో నా నాడీమండలవ్యవస్ఠ చెదిరిపోయింది. తీవ్రమైన అనారోగ్యంతరువాత నానరములన్నీ సర్దుకొని కొంత శాంతించిన తరువాత ఆశక్తి నాలోయిమిడిపోయింది. ఆయన సంపాదించినశక్తి మొత్తం నాలోవున్నది. నేనేదైతో సంపాదించానో అదికూడా నాలోవున్నది. మాగురువర్యులనుండి గ్రహించినదానికి నేనెటువంటి చేర్పులు తీసివేతలు చేయలేదు. ఇప్పుడు నాతదనంతరం యిదంతా మరోచోటికి బదిలీ చేయ వలసి యున్నది. ఈపనిచేయుటకు నేనెంతో ఆతృతతోవు న్నాను.  అయితే ఒక్క అభ్యాసికూడా సంపూర్ణముగా యీశక్తిని భరించగల స్థితిలోలేడు. కారణం వారు ఆస్థితివరకు వచ్చుటకు ప్రయత్నమే చేయుటలేదు. బహుశా నేనుకూడా సంవత్సరములతరబడి యోగ్యునికొఱకు నిరీక్షించవలసి యుండునేమో!

 గురువు సంపాదించినదంతయూ, అతని ప్రతినిధిలోనికి ప్రవేసించును. అతనిద్వార దీక్షగైకొన్న అభ్యాసు లందరికీ వారివారివాటా వారికి సంప్రాప్త మౌతుంది. ప్రతినిధి శక్తియొక్క నిలువ స్థానం (నిధి) అయివుంటూ, తన గురువుతో తప్పనిసరిగా అనుబంధం కలిగియుంటాడు. ఆవిధంగా అత్యవసరమై గురువుగారితో అనుబంధింపబడియుండి, గురువుగారి ఆజ్ఞలను పాటిస్తూ, గురుకార్యమును నిర్వర్తిస్తూ వుంటాడు. ఇతరులు కూడా గురువుగారిఆజ్ఞలను పాటిస్తూవుంటారు. ఇతరశిష్యులు తగినంత అభివృద్ధి సాధించినట్లైన, వారుకూడా గురువునుండి సూచనలు పొందుతూ వుంటారు. ప్రతినిధిసాధించిన స్థాయిని యితరసహచరులుసైతం అందు కుంటారు. ఉన్నతేడాఅంతా, ప్రతినిధి గురువర్యులశక్తికి కేంద్రమై యుండి, గురువర్యులే ప్రతినిధిలో ఐక్యమై వుంటారు.             

   గురువర్యుల భౌతికశరీరం వీడినతర్వాత కలుగు ప్రయోజనాలు తెలియ జేసితిని. గురుపదవిని గురించి ప్రజలేమనుకుంటున్నారు యెలాఅర్థంచేసు కుంటున్నారో దేవుడెరుగు. నిజమైన గురువుయొక్క ఉనికి మైనపు వొత్తివలె దహించుకపోతూ, అందరికి వెలుగునిచ్చుట వంటిది. వెలుగువల్ల ప్రయోజనంపొందేవారు వారి స్వప్రయోజనమే చూసుకుంటారు. ఎక్కడ యెప్పుడు యెవరు ఆవెలుగుకాధారమై కాలుతున్న వత్తియొక్క సంరక్షణా బాధ్యత నిర్ణయిస్తారు. నావిషయంలో నిర్ణయం, నేను మొదటిసారి మా గురువును కలవకమునుపే తీసుకొనబడింది. యీవిషయానికి సంబందించిన జ్ఞానం బయల్పడనీ బయల్పడకపోనీ, ఎప్పుడు యెవరికి యీబాధ్యత అప్పజెప్పబడిందో ఆభగవంతునకెరుక. ఆధ్యాత్మికరంగ సాంప్రదాయం యిలాగే వుంటుంది. తనుదహించుకపోతూ, వెలుగులు విరజిమ్మడంగాక ఆదీపానికి వేరేపనేముంటుంది? ఆరిపోయిన మంటలో పడి ఆత్మాహుతిచేసుకోగల శలభమువంటివారు చాలా చాలా అరుదుగా వుంటారు. నావిషయానికొస్తే, నేను మాగురువు దయతో చూపిన మార్గంలో పయనించుచున్నప్పుడు, ఆధారపడటానికి ఆయనొక్కరే నాకు కనిపించారు. ఆతర్వాత జనులు రావడంమొదలై యాత్ర మున్ముందుకు సాగిపోయింది.

 లాలాజీ వాత్సల్యానికి అవధులేలేవు. ఆయన చాలాముందుగానే నా ప్రతినిధిని నియమించారు. లాలాజీ చేపట్టిన కార్యములన్నింటిలో నాకు పూర్తిస్వాతంత్ర్యమున్నా, యిప్పటివరకు నాప్రతినిధి (ఉత్తరధికారి) యెవరో నాకు లియదు. నాఉత్తరాధికారి యొక్క ఉత్తరాధికారిని నన్ను తయారు చేయమని సెలవిచ్చారు. లాలాజీవంటి సాటిలేని గురువు లభించడం యెవరి కైనా అది అదృష్టమే. నేనందుకే ఆయనంతటి మహోన్నత శిక్షకులు గా తయారవ్వాలని పదేపదే చెబుతుంటాను. ఈవిషయంలో నన్ను ఉదాహరణగా గైకొనడం మీకు అత్యంత ఉపయోగకరంగా వుంటుంది.

 (ఇది ప్రచురించని బాబూజీ ఉత్తరాలనుండి గ్రహించి ఆంగ్లంలో డా:సూర్యప్రసాద్ శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకములో ముద్రించబడినది)     

Monday, 15 April 2024

అభావము - ఆభావాతీతము

 

అభావము - ఆభావాతీతము

మనము భగవంతుడననేమియో, బహుకాలమునుండి యోచించు చుంటిమి. కొందరు భగవంతుదు లేడందురు. ఇది నాస్తికవాదన. భగవంతుడు లేడను వాదన. నేను భగవంతుదు లేడంటే, అది సరియైన దనే నాభావన. ఎందుకంటే దీనివెనుక సత్యతత్త్వము దాగున్నది. మనమెప్పుడు "లేదు" అంటామో, ఉన్నదన్నభావన దానివెనుకే వుంటుంది. అది సత్య తత్త్వభావనౌతుంది. ఒకవేళ "ఉన్నది" అంటే దానివెనుకే "లేదు’ అన్నభావన వుంటుంది. అటువంటప్పుడు లేదనేవారు సరియైన ఆలోచన లోనే వున్నట్లు సాధారణముగా నీవు నిర్ధారణకు వత్తువు. మనం లేదన గానే ఆఆలోచన నుండి అవతలకు దుమికి సత్యతత్త్వన్ని అందుకుంటాము. "లే" మరియు "దు" అను రెండక్షరములు కలిసి అభావాభిప్రాయానికి వత్తుము.లేదు లేక లేడు అన్నపదం ఉత్పన్నంచేసిన ప్రకంపనలతో మనం అభావమైపోతాము. అభావమైపోతే సత్యతత్త్వం మన ముందుంటుంది. అందులో యేవిధమైన స్థితివుండదు. లేడుఅన్న పదప్రకంపనలలో, మనం లీనమైనప్పటికి తత్సంబంధమైన చర్య యొక్క ప్రకంపనల ఆనుభూతి యేమాత్రముండదు. అది అభావస్థాయి యొక్క రెండవస్థితి. మూడవ స్థాయిని నేను వివరింప గలను. కానీ నావివరణ యెంత స్పష్టముగా నున్నను, జనులు దూరముగా పారిపోవుదురు. కనుక చర్చించ దలచుకోలేదు.

 అభావమై పోవుటెట్లు? నేటిగురువుల వలెనేను నాలుగడుగులు ముందుకేసినట్లైన మీకుబాగా అర్థమై యుండెడిది. నేటిగురువులు దీక్షనిచ్చేసమయంలో వారుకొన్ని పాత్రలు వస్త్రములు అధమంలో అధమం ఒకరూపాయి దక్షిణైనా సమర్పించమంటారు. చదువుకున్నవారు యీ కారణంగ ఆగురువులను తిరస్కరిస్తారు. మీకున్నదంతా నాకిచ్చేయండి అని నేనడిగితే, నన్నుమాత్రమెందుకు తిరస్కరించరు? జనులునన్ను గజదొం గ యని అనుకోకుండ వుండగలరా? నన్నునేను సమర్థించుకొనుటకు, నాఆలోచనను కొద్దిగా మార్చుకొని కొన్నిసార్లు "మీరందరు కలసి నన్ను దోచుకపొండి"అంటాను. ఇచ్చిపుచ్చుకోవడం దీపిడీ కాదగదా? నేను మీకున్నది దోచేసి, నావద్ద కలదంతయు అదేవిధంగా మీరూ దోచుకపొండి అనినేనంటే, నామీద నమ్మకం గలవారు యేవిధమైన అడ్డంకి చెప్పరను కుంటాను. ఇప్పుడు కొంత ముందుకెళితే తెలుస్తుంది. నేనుమీకున్నది దోచేసి దానికి బదులుగా మీరునన్ను దోచుకోండి అనడంవల్ల, నష్టానికి యెవరొప్పుకుంటారు? బహుశా యిందులో మీరే నష్టపొతారు. ఎందు కంటె, నేనిప్పటికే మాగురువర్యులచే దోచేయబడ్డాను. అటువంటప్పుడు మీరెవరిని దోచుకున్నారు? అనినన్నడగవచ్చు. ఇప్పటికే మీకర్థమయిందను కుంటాను. మీరునన్ను దోచుకుంటే మీరు చాలామందివ్యక్తుల (నేను దోచుకున్న అనేకుల) సంపదకు అధిపతులౌతారు. కానీ నేను తొలి పందెంలోనే ఓడిపోయాను. దోచుకున్నదంతా నన్నుగెలిచిన ఆయన (దైవాని) దైపోయింది. అటువంటప్పుడు యీ యిచ్చిపుచ్చుకోవడంలో మీకు లభించేదేముంటుంది, శూన్యం,సున్నా.

 జీవులందరికి "పూజ" జీవితంలో ఒకభాగం. అంతేగాదు, అది వారివిధి. వారు ఆస్థాయి దాటి, అటువంటిదే మరొక విధి (కర్తవ్యం) నిర్వహింపవలసి వస్తే, అంటే మరోమాటలోచెప్పాలంటే, సాధారణంగ ప్రకృతి యేదోఒక పనిలో జీవులను (మనుషులను) నిమగ్నంచేస్తుంది. ప్రపంచం తగుస్థాయికి చేరుకున్నట్లైతే, ప్రకృతి నిస్తేజ మౌతుంది. ఆత్మచలనము వలన చైతన్యము నిత్యమై సంరక్షింపబడుతూ సమత కొనసాగింపబడుతుంది. మనిషి ప్రకృతివలెనే, ప్రకృతితోపాటే నిస్తేజమైతే, అప్పుడతడు జనులకొఱకు చైతన్యాన్ని ఉత్పన్నంచేస్తాడు. అతడు ప్రకృతి యొక్క యంత్రమై పనిచేస్తాడు. ప్రకృతిలో అతడు, తగుస్థానంలో యిమిడిపోతాడు. ప్రకృతిశక్తి కొంతవరకు యిట్టి యంత్రములపై (ప్రకృతి కార్య నివాహకులపై) పనిచేస్తుంది, ఆశక్తి, వ్యక్తి సంపాదించిన స్థాయి కనుగుణంగా వుంటుంది. ఆస్థాయి అతని కెక్కడనుండి సంప్రాప్తమైనది, యెలా ఉత్పన్నమైనది? ఈస్థాయి అతని సక్రమ కార్యనిర్వహణకనుగుణంగా లభిస్తుంది. అతని అలవాట్లలోని మితత్వము (సమన్వయము) వలన కలుగుతుంది. మళ్ళీయిది ప్రకృతి నియమముల సక్రమానుసరణవల్ల కొనసాగుతుంది. ఎవరైతే ప్రకృతి నియమాలను చక్కగా పాటిస్తారో, వారికి ప్రబలమైన సహాయ మందుతుంది. ఈప్రకృతినియమాలు యెచట యేర్పడతాయో ఆ హద్దు వరకు చేరిన తర్వాత కేంద్రమునుండి తగినంత సహాయం అందుతుంది. ప్రకృతినియమాలను చక్కగా అనుసరించితేనే, అతడు ధర్మబద్ధంగా యేర్పరుపబడియున్న ఒకరేఖ  ఆధారంగా కాస్తా అటూయిటూ పైకిక్రిందికి అతడు కదులుతూవుంటాడు.   

 కనుక మనమందరం ప్రకృతికి సమాంతరంగా పయనించవలసి వుంటుంది. తద్వార ప్రకృతిసహాయం పొందగలుగుదుము. లేదా పురోగతి కొఱకు మనం అనుసరిస్తున్న మార్గంలో ప్రకృతి సహాయం పొందియున్న మహ నీయుని సహాయం పొందవలసి యున్నది.

   నీవు తెలియజేసినదాన్నిబట్టి గమనిస్తే, నీవునా యెడబాటును సహించలేక పోతున్నట్లు తెలియుచున్నది. బహుశా నీవునా శరీరానికిమాత్రమే దూర మయ్యావు. నీ అంతర్గతంగా లోలోతులకువెళ్ళి గమనిస్తే అంతటా నేనే కనబడతాను. కాస్త ఆలోచిస్తే నీహృదయమందే నన్ను నీవు దర్శింపగలవు. ఇప్పటి నీజీవితంలో సరైన జీవనవిధాననికి కట్టుబడితేచాలు నీవిపరీత స్వప్రాంతచింత వదలిపోతుంది. అలాకాకపోతే, నేను సదా నీవెంటనున్నా నన్న తలంపుతో నీవు కొనసాగితే, చాలావరకు నీసమస్య తొలగిపోతుంది. నేను దక్షిణ భారతానికి పయనమై వెళ్ళినరోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. అప్పుడు మాగురువర్యులు యెల్లవేళలా నాతో మాట్లాడుతున్న నాసహచరుల వలె నాలోనే వున్నాడన్న తలంపుతో వుండిపోయాను. ఆయన బాహ్య రూపాన్ని చూడలేకపోయినా నేనొక అంధునివలె నున్నాననిపించింది. అంధుడు తనసహచరుని రూపంచూడలేడుగాని, అతడు తన సహచరునితో పరస్పరం మాట్లాడుకుంటూ సమయం గడపగలడు. నీవు పరిపూర్ణస్థాయికి యింకనూ చేరలేదు గనుక కనీసం నేను నీదగ్గరేవున్నానన్న భావనతోనైనా వుండు. భగవంతుడు నీకనుకూలుడై యుండుగాక! నీకు ఆధ్యాత్మిక పురోగతి కలుగజేసి, ప్రస్తుతం నేనున్న స్థితినిసైతం అధిగమించి మున్ముందుకునీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుగాక.

 (శ్రీరాంచంద్రజీ వారు ఒక అభ్యాసికి వ్రాసిన లేఖయొక్క సారాంశమిది. డా:శ్రీవాత్సవగారి "డివైన్ మెసేజెస్" అను పుస్తకమునుండి గ్రహింప బడినది)  

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...