Showing posts with label God-Realisation. Show all posts
Showing posts with label God-Realisation. Show all posts

Friday, 1 March 2024

భగవత్‍సాక్షాత్కారము

 

భగవత్‍సాక్షాత్కారము

                                                  ----శ్రీరామచంద్రజీ, షాజహాన్ పూర్ 

ఉన్నదొక్కటే ఆత్మ అనుభావనను కాదని, అనాత్మ లేక, లేనిఉనికి, శున్యము (సున్న) ఉన్నదను వివాదరహిత భావనను స్థిరపరచుకొన్న తవాత, కష్టరమైన  భగవత్‍సాక్షాత్కారమును తగినవిధంగా నిర్వచించు కార్యమును చేపట్టవచ్చును. అనాదిగా భరతదేశమున ప్రముఖంగా భగవత్సాక్షాత్కారమే అత్యంత ముఖ్యధ్యేయంగా (పురుషార్థంగా) ప్రకటింపబడింది. కాని భగవత్‍భావన వలెనే భగవత్‍సాక్షాత్కారము కూడా, హేతువాదదృక్పదము, సద్భావశాస్త్రసమ్మతితో ఆలోచించు మనిషి, ఆమాట అనగానే మర్మములనెడి పొరలలో చిక్కుకొని ఒకనిర్ణయమునకు వచ్చుటకు విసుగుపడుచున్నాడు. అందుకే భగవత్‍సాక్షాత్కారమునకు తగిన నిర్వచనము, అనువగు అన్వయము, సత్యశోధనకు శాస్త్రజ్ఞులకుపయోగపడురీతిన హేతువాదస్థాయి అవగాహనకు, తగినట్లుండవలెనని, నాబుద్ధికి తోచినది.

 సామాన్యముగా మాట్లాడుకొను భాషలో, సాక్షాత్కారము మనస్తత్వ క్రమమగు విజ్ఞానమును సూచించును. ఏదియేమైనా భారతీయయోచనా విధానములో, సాక్షాత్కారమందు, మూడుగానున్న జ్ఞాన, దర్శన, ప్రవేశ లేక అనుభూతికల్గుటయై యున్నవి. వాడుకలో సాధారణంగా మొదటి రెండింటినిమాత్రమే సూచించుచున్నారు. కానీ భారతద్రష్ఠలు సరియైన అర్థమున, భగవత్‍సాక్షాత్కారమన  కేవలము భగవంతుని హేతువాదదృష్ఠ్య అధికారికముగా తెలిసికొనుటేగాక (శూన్యము,సున్నా లేక అనాత్మగా) యధార్థము గ్రహించి, దర్శించి క్రమముగా భగవంతునిలో కలిసిపోయిరి. ఇక మనము భగవంతుని సున్నాగా (పూజ్యముగా) నిర్వచించితిమి. ఇంతకూ అనాత్మను తెలిసికొనుట, అదిగా మారిపోవుట అనగా దేనిని సూచించును? ఆత్మయననేమి? అన్న ప్రశ్నతో ప్రారంభిద్దాం. అపరిపక్వ (మొరటు) అవగాహనతో మామూలుగా ఆత్మను శరీరమనుకొందుము. నవ్య  మనస్తత్వశాస్త్రము ప్రకారము జీవిగా (నిర్మితశరీరము గలదిగా) భావింతుము. ఈదశలో ఒకవిధమగు అవగాహన వుండును. భారతద్రష్ఠల అపరిపక్వ (మొరటు) దృక్పదము ప్రకారము ఆత్మలు  (ప్రాణులు) దేహానుభూతిలోనుండు శక్తితో  ప్రవర్తిల్లుచుండును. అటువంటి వ్యక్తి శారీరక ప్రేరణలకు సుఖదుఃఖములకు దాసుడైయుండును. గతించిపోయిన ప్రముఖులలో, సోక్రటీసు లేదా గాంధీ ఉదాహరణ చూడుడు. వారు తమ్ముతామెఱిగి జీవించిరా? ఒకజీవిగా లేక శరీరముగా కాక అంతకుభిన్నముగా ప్రవర్తించిరా? ఖచ్చితంగా చెప్పాలంటే, స్వభావసిద్ధమైన మరియు  పరిగ్రహించిన ధోరణులతో సంఘటితమైన వ్యవస్థగా వారు దాదాపు స్థిరీకరింపబడి యుండిరి.

 నేటి మనస్తత్త్వశాస్త్రరీత్యా, వారుతమ గుణగణము లేక వ్యక్తిత్వపు స్థాయిలో జీవించిరేగాని, సంఘటిత దేహి (దేహములోని ఆత్మ) గా కాదు. ఈస్థాయిలో వ్యక్తి  (దేహధ్యాస గల వ్యక్తి) మానసికధ్యాస (ఆత్మయొక్క ఎఱుక) వైపునకు మరలును. నవ్యమనస్తత్త్వశాస్త్ర ప్రకారము దానిని వ్యక్తిత్త్వధ్యాసగా గుర్తింపవచును. ప్రతిమనిషి జీవిగా మొదలై దాదాపు వ్యక్తిత్త్వముగల ఆత్మగా పరిణతిజెందుతాడు. ఇట్టి పరిణతిజెందిన నిర్దుష్ట ఉదాహరణలుగా సోక్రటీసు, గాంధీలను జూపవచ్చును. ఇట్టి నిర్దుష్ట ఉదాహరణలైన వ్యక్తులను, రెండు స్థాయిలలో జూడనగును. మొదటిస్థాయి అట్టడుగునగల వ్యక్తి, ఒక పశువుగాను లేక అప్పుడేపుట్టిన బిడ్డస్థాయిలో నుండును. రెండవ అత్యుత్తమ కడపటిస్థాయిలో, ఉదాహరణలుగా ఒక సజీవ సోక్రటీసు, గాంధీ, రాణాప్రతాప్ కనపడతారు. వారు అనాత్మగా, మరింతస్పష్టంగా చెప్పాలంటే అతిస్వల్పస్థాయి నిజాత్మగా గోచరిస్తారు. రెండవస్థాయి వరకు ఎదిగిరావడమంటే, ఒకసున్నిత లేక అతిస్వల్ప నిజాత్మసాక్షాత్కారము పొందుటే యగును. ఒకవిధంగా చెప్పాలంటే తొలిస్థాయిలోనుండిన అపరిపక్వ (మొరటు) ఆత్మభావవిచ్ఛేదన వల్లనే  యిది సాధ్యమగును. 

సున్నితత్వపు దశలు

సవివర విశ్లేషణ చేయదలచి, నేనీ రెండుదశలను మాత్రమే ఎన్నుకొంటిని. అవికూడా అనుభవమునకు దగ్గరగానుండుటచేత, యిట్టే చెప్పదలచితిని.  అంతేగాక సాంఘికజంతువైన ప్రతిమానవుని అవగాహనకు యివి అనువుగానున్నవి.  కానీ నిజానికి  ఆత్మయొక్క అతిసున్నితస్థాయిలు గణింపవీలులేనన్ని యున్నవి. సరిగ్గారెండవదశ మొదలవ్వగానే దేహస్మృతి తగ్గిపోయి, కేవలమొక జీవినన్నధ్యాసగానో, లేక ఆత్మచేతి పరికరముగానో  ఎఱుకగలిగి యుండునునేగాని, తనే ఆత్మనన్నధ్యాస వుండదు. అట్లే యింకాస్త ముందుకు వెళితే ఆధ్యాసకూడా  తగ్గిపోయి, మనస్సు మరియు వ్యక్తిత్వధ్యాస గలిగి వుండును . అప్పుడుకూడా తను ఆత్మగాకాక, ఆత్మనావరించి యున్న పలుచనిపొరగా భావించుకొంటాడు. ఈస్థాయిలో దేహస్పందనలైన సుఖదుఃఖములు, స్వతహాగాకలిగిన మరియు పరిగ్రహించిన గుణగణ ప్రవర్తనలన్ని  క్షీణదశకుచేరుకొని మన ప్రభువులస్థాయినుండి మన దాసులస్థాయికి పడిపోతాయి. 

 ఈస్థాయికిజెందిన ఉచ్చస్థితిలో స్థానమేర్పరచుకున్న వ్యక్తి తనలో స్వతహాగానున్న  మరియు పరిగ్రహించిన గుణగణములకతీతుడై వాటి ప్రభావములకు లొంగిపోడు. అనగా వాటి ప్రభావ మతనిపై వుండదు. భారతద్రష్టల సాంకేతికభాషననుసరించి, అతడు స్వేచ్ఛ (మోక్షము) పొందెననవచ్చును.  అతడు తనస్వాభావిక మరియు అలవరచుకున్న గుణములను తొలగించుకొనియుండును. ఇది సామాన్యుల కనుభవమునకు వచ్చు విషయముకాదు.  మరొకరకంగా చెప్పాలంటే కలలుకూడారాని గాఢనిద్రావస్థకు దగ్గరగానుండు స్థితియిది. దీనినే నిర్వికల్పసమాధియని యోగాభ్యాసకులు పిలుతురు. ఈస్థితి స్వల్పకాలము మాత్రమే అనుభూతమగును. ఈస్థితిలో శాశ్వతముగా నుండెడి వ్యక్తి, ఆత్మయొక్క మరింత సున్నితస్థితిని సాక్షాత్కరించుకొని యుండును. తొలిదశలోనుండువ్యక్తి దృష్టిలో, యితడు (అనాత్మ) దైవమునకు మరింతచేరువైనవాడై యుండును. 

    శాస్త్రీయ స్ఫూర్తి

ఇక మూడవస్థాయిని గూర్చి విచారింతము. ఇది కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణమున చివరిమజిలీకాదు. ఇంకనూ అసంఖ్యాకములైన దశలను దాటి వెళ్ళవలసి యున్నది. ఆదశలను హేతువాదదృక్పదముతో వివరించుటకు వీలుపడదు. అట్లని అవి అవాస్తవ కల్పితములని కాదుగాని, అవి హేతువాదమునకందనివని మాత్రము సూటిగా చెప్పవచ్చును. కుతూహలముతో శాస్త్రీయదృక్పదము రీత్యా ఎవరైనా యీఅనాత్మ (దైవము) ను వివరింపదలచుకుంటే, వారు యీస్థాయి సాక్షాత్కారానుభవమును నేరుగా పొందుటకు సిద్ధమై రావలసినదిగా ఆహ్వానము పలుకుచున్నాను. అనుభవముపొందిన మీదట వారీ స్థాయి వివరములను తర్కము మరియు సాంప్రదాయశాస్త్రరీత్యా వెల్లడిచేయ ప్రయత్నించవచ్చును.

 ఈసందర్భములో ఎవరైనా ఒక సహేతుక ప్రశ్నవేయవచ్చును. వాస్తవంగా చెప్పాలంటే, యీస్థాయిలోని స్థితులు ఆత్మయొక్క సున్నితము, మరింతసున్నితమునైన సాక్షాత్త్కారమే. ఇంతకూ సంపూర్ణమైన అనాత్మ (దైవము) అనేదేమైనా వుందా? ఉంటే ఆత్మకెప్పటికైనా సాక్షాత్కారం సాధ్యామౌతుందా? పూర్తిగా ఆత్మ అనాత్మగా (దైవంగా) మారిపోతుందా? సందేహమక్కరలేదు. తర్కించిచూస్తే అనాత్మలో ఆత్మ ఇమిడియున్నది. మనమొకసారి ఆత్మ వున్నదన్న సత్యాన్ని, అంటే ఆత్మయొక్క ఉనికిని అంగీకరించి నట్లైతే, అనాత్మనుసైతం లేదనలేము. అసలు ఆత్మభావనే అనాత్మభావనగా మారిపోతుంది. ఇక రెండవప్రశ్నకు వద్దాం. నిజంచెప్పాలంటే అనాత్మ, క్రమేణ తరిగిపోయిన ఆత్మే.

 నేనీవిషయం వాతావరణంలోని గాలిని ఉదాహరణగా తీసుకొని వివరిస్తాను. భూమి ఉపరితలంపైన గాలిపొర బరువుగాను, దట్టంగానువుంటుంది. భూతలంనుండి పైకివెళ్ళేకొద్దీ గాలి పలుచబడుతూ తేలికౌతూ పోతుంది. అయితే గాలిస్థితి, గాలిలేనిస్థితిగా మారిపోతుందా? హేతుబద్ధంగా ఆలోచిస్తే అది అసాధ్యం. ఆత్మ, అనాత్మకు అతిదగ్గరగా వుంటుందేగాని, పూర్తిఅనాత్మ కాజాలదు. అనాత్మముందున్న యీ "పూర్తిగా" అన్నపదమే, ఆత్మ, అనాత్మను యెన్నటికి చేరుకోలేదన్న విషయం ద్రువపరుస్తున్నది. నేనీవిషయాన్ని మరోవిధంగా విషదపరచదానికి గణితశాస్త్ర ఉదాహరణ నిస్తాను.

అంతిమసత్యము

ఒకనాస్తికునిదృక్పదంతో ప్రారంభిద్దాం. నేను దైవాన్ని సున్నాగానూ, ఆత్మను ఒకటిగానూ తీసుకుంటున్నాను. ఆత్మను (ఒకటిని) క్రమేణ దశాంశస్థానముల పరంగా తగ్గించుకుంటూపోతే, అది రానురానూ సున్నా లేక అనాత్మ లేక దైవంస్థానాన్ని సమీపిస్తుంది.(అంటే 0.1, 0.01, 0.001, 0.0001... అలాగా) కానీ దశాంశబిందువు తర్వాత యెన్నిసున్నాలు చేర్చినాసరే, అదిపూర్తిగా సున్నాస్థాయికి తగ్గించబడదు. అయినా యిది తర్కమురీత్యా వాదన. అంతిమసత్యం యిటువంటి  తర్క హేతువాదమున కతీతమైనది. కనుక రెండవప్రశ్నకు సయైనసమాధానం చెప్పడం సాధ్యముగాదు గానీ, అది ఆర్జించవలసిన జ్ఞానమైయున్నది. కుతూహలముగలిగిన సత్యశోధకులు ధైర్యముగా తమంతతాముగా సాధనమున తెలుసుకోవచ్చును.

బుద్ధభగవానుడు, యిటువంటి ప్రశ్నలడిగినపుడు యేమియు మాట్లాడక మౌనమువహించెను. అంతమాతమున ఆయనకీ విషయము తెలియదనికాదు, సరియైన స్థాయికిచేరి, నేరుగా అనుభవ జ్ఞానమున అర్థముచేసుకోవలసినదేగాని, నిమ్నస్థాయిలో జ్ఞానవర్గీకరణతర్కమున వివరించ ప్రయత్నించిన, అది యెంతచక్కగా చెప్పినప్పటికీ  గందరగోళముగనే వుండును. మరింతప్రయత్నించిన, అది విఫలప్రయత్నమై హాస్యాస్పదమగును.

 ఇక విషయము సమగ్రపరతుము. నేరుగా మనకు ఆత్మ (నేను) తెలియును. తారతమ్యవిచారణమున అనాత్మయున్నదనియు మనము సమ్మతింతుము. కానీ దైవమును సకారాత్మకముగా మరొకదానితో పోల్చిచూచు ప్రశ్న ఉత్పన్నమైనపుడు మాత్రము, మనకు దైవముతో పోల్చిచూచుటకేదియు కానరాదు. కనుకనే వేదములు నకారాత్మకముగా ఇదికాదు, ఇదికాదు (నేతి,నేతి) అనియే వివరించినవి.  వ్యక్తి తనస్థాయిలో ఎఱుకగలిగి గ్రహించుశక్తిగలిగి యున్నాడు. దైవమును సాక్షాత్కరింపజేసి కొనగలడుకూడా. అంతేగాని దానిని యింత, యిది, యిదమిద్దమని కొలిచి చెప్పజాలడు. సత్యతత్త్వములోనికి చొచ్చుకొనివెళ్ళిన వ్యక్తి మాత్రమే, సకారాత్మకముగా పోలికతో దైవమును విషదీకరింపగలడు

(ఆధ్యాత్మజ్ఞాన్ (అక్టోబర్-డిశాంబర్) 2023 నుండి గ్రహించి తెలుగున కనువదించడమైనది)

 

          

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...