Thursday, 21 March 2024

సంసారిక జీవనము - సన్యాసము

 

సంసారిక జీవనము - సన్యాసము

                                                             రచన:-పూజ్యశ్రీ రామచంద్రజీ మహరాజ్ , షాహజాన్ పూర్  

 సంసారికజీవనమునకు సన్యాసమునకు గల విభేదమును గురించినచర్చ బహుపురాతన మైనది. మీకు తెలుసుగదా! మానవజీవిత పరమార్థమును బుద్ధభగవానుడు సాంసారిక జీవితాన్ని త్యజించి సన్యాసియై, అనేకప్రయాసలకు, దురవస్థలకు గురియైనమీదటనే సిద్ధించెనని నాకు చెప్పెను. సాంసారిక జీవితాన్ని త్యజించకనే నాకన్నియు సమకూరెనని, కనుక సన్యసించవలసిన అవసరంలేదని నేనాయనతో చెప్ప సంకల్పించితిని. కానీ బుద్ధభగవానుతంతటి మహనీయునితో ముఖాముఖి నిలచి ఆయనతో మర్యాదగా వ్యవహరించవలసి వచ్చినపుడు, ఆయనను వ్యతిరేకించుటెట్లని ఆలోచనలోపడి, నేను పూజ్యలాలాజీసాహెబ్ వైపునకు తిరిగి బుద్ధభగవానుడు తెలిపిన విషయములను ఆయన దృష్టికితెచ్చితిని. అప్పుడు లాలాజీవారు నన్ను బుద్ధభగవానుడు చెప్పినవిషయములను విను, అంతేగాని వారితో ప్రశ్నోత్తరముల వాగ్వాదమునకు దిగవద్దనెను. అటువంటి అపారమైన ప్రేమకు తార్కాణమైన మాగురుదేవులవంటివారిని నేనెక్కడా కనుగొనలేను గదా!

 నిజానికి రెండువైఖరులూ, సమంజసమైనవే. ఏవేవో ఫిర్యాదులతో నిరంతరం చింతలకు గురిచేయు యింటివారికి, బంధువులకు, ఆప్తులకు యెప్పుడు యెక్కడ యేమిచేయవలెనోయని, ఆంధోళన చెందుదుముగదా! ఆటువంటప్పుడు, యెటువంటి స్వప్రయోజనాన్ని ఆశించక కేవలం కర్తవ్యపరంగా చేయవలసిన పని చేసుకుంటూపోవడమే సరియగువిధానము. ఇంకాచెప్పాలంటే, యేయితర ఆలోచనా మనసునలేకుండ కేవలం యిదినావిధి యనుకొని, దానివలన యేవిధమైన లాభాలోచన లేకుండ కాలంగడప వలసియున్నది. ఈశరీరమున జీవమున్నంతవరకు కుటుంబానికి, ప్రాపంచిక బంధాలకు చిక్కకుండా వుండటం సాధ్యపడదు. అవసరాల కారణంగా, యిదో అదో యేదో ఒకబంధం యేదోఒక సందర్భంలో ఉత్పన్నంకాక తప్పదు. అనేకవిధాలైన గొలుసులు, బంధనములనదగు వేల కథనాలు, యిదిచేయదగును, యిదిచేయదగదు అంటూ జీవనశైలి, నడవడికి సంబంధించినవెన్నో, మనిషిని ప్రభావితం చేస్తూనేవుంటాయి. సాలెగూడువంటి యిట్టి చిక్కులు, సంకటములవల్ల  సరళంగా , నిరాడంబరముగా సాగు ఆధ్యాత్మికత, సహజంగానే కుంటువడుతుంది. మతపరమైన ఆధ్యాత్మికతకు యివన్నీ అడ్డుతగులుతాయి. ఈకారణాలన్నిటివల్ల సహజమార్గముయొక్క సరళత (నిరాడంబరత) కు ఒకముసుగేర్పడినది.

 బుద్ధునితర్వాత ఒక విధానము వెలుగులోనికికొచ్చింది.  నిజానికది, అంతకు ముందునుండే వుండినది, కానీ అంతగా వ్యాప్తిచెదిందియుండలేదు. అదే ప్రేమ విధానము. అందులో మీవైయున్నవన్నీ వున్నవి. ప్రభువునెడ ప్రేమగా అవి సమర్పింపబడియున్నవి. ఒక పర్షియా కవిత్వంలో యీ విధంగా చెప్పబడింది. "నీహృదయం మరొకరి చేతిలోపెట్టి, యేమైనదోయని అయోమయంలో పడిపోయినట్లున్నది" ఇలా జరిగితే అన్నిబంధాలు ఆమహాప్రభునకే తగులుకొని వుంటాయి. ఆయన ఉనికే ముఖ్యమై వుంటుంది. ఆయనపైనే అందరు ఆధారపడివుంటారు. ఇదే జరిగితే యికపై చేయవలసినదేమియూ వుండదు. కఠినమైన తపన అహాన్నిపెంచే అద్భుతశక్తుల నుత్పన్నం చేస్తాయి.  ఆర్జించిన ఉత్తమ పవిత్రతలను సహితం నష్టపరచి మోక్షసాధన కవరోధాలౌతాయి.

 ప్రేమమార్గమేర్పడినప్పటినుండి, ఆత్మనుమరచిపోయి, భక్తిలోయలో ప్రయాణముసాగుటుంది . అదే ఆధ్యాత్మికప్రారంభబిందువునకు చేర్చు అతిసులభమైన మార్గము. అంటే అదే విముక్త సోపానము లేక మోక్షస్థితి. ఒక పర్షియాకవి చెప్పినట్లు, వంగివంగి సాగిలబడిచేయు మ్రొక్కులు అన్నింటియెడ విముఖత జూపు మొండివానివైతే, తన ఉనికినిమరచి ప్రార్థనామయ స్థితిలోనికెళ్ళుటన్నది ప్రేమస్వరూపుల మార్గము.

 వ్యక్తి ఉనికి ప్రభువులో లీనమైపోతే, కుటుంబజీవనము, ప్రాపంచిక బాధ్యతలన్ని మరొకరిచేతి కప్పజెప్పబడి ప్రాపంచిక ఉనికియొక్క ప్రణాళికమొత్తం ఒకవిచిత్ర మార్పును సంతరించు కుంటుంది. ఇక్కడ సంసారికజీవనము, సన్యాసమునకున్న ద్వైతభావము రూపుమాసిపోతుంది . ప్రియునితో కలయిక యేర్పడి బంధనములు తెగిపోయి, మరోరంగు సంతరించుకుంటుంది. అన్నిరకముల శ్రమలు, సంకటములు, చింతలు, ఆత్రుతలన్ని మోక్షమువైపునకు దారితీయు స్వచ్ఛమైన రూపధారణదిశగా వృద్ధిచెందుతాయి. ఇదంతా సులభము సరళమై యున్నప్పటికి వివరించుటకు విషదీకరించిచెప్పుటకు మాత్రము దుర్లభముగా నుండును. ప్రేమికుడనని చెప్పుకోవడం, పశువులు చేలోమేసినంత సులభం. కానీ నిజమైన  ప్రేమ చాలా అరుదు. ప్రేమలోవ్యక్తి తన‍ఉనికినితాను కోల్పోతాడు. అంతేకాదు ప్రేమను కూడా మరచిపోతాడు. అనుకరించడంద్వారా నిజమైనప్రేమను పొందవచ్చుననుటకు సందేహంలేదు. కానీ అనుకరణద్వారా పొందిన ప్రేమకు నిజంగా ఉత్పన్నమైన ప్రేమకు తేడా ఉండనేవుంటుంది.    

 ఎంతచిత్రమిది? నామూడవకుమార్తెగానో నాల్గవకుమారునిగానో మారిపోయామంటూ మనుషులు నన్ను వారిష్టప్రకారం నడవాలంటారు. అయితేవారు, నాస్వంతబిడ్డలు నన్ను వారిష్టప్రకారంనడవాలని ఒత్తిడితెస్తే మాత్రం వారిని (నబిడ్డలను) తప్పుపడతారు. అంటే నన్నువారు తండ్రిగాస్వీకరించి  వారి దురాశను వ్యామోహాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తూ, అది వారి భక్తిప్రేమలకు నిదర్శనమంటూ నాబిడ్డాలతో బంధుత్వాన్ని నెరపుతారు. కానీ నాబిడ్డలు వారితండ్రినైన నావద్ద దురాశ వ్యామోహంతో కోరికలు  నెరవేర్చులోవాలని చూస్తేమాత్రం, అదివారి (నాబిడ్డల) అయోగ్యతగా పరిగణించి తప్పుపడతారు. దీనర్థం బిడ్డలదోషాలను పట్టించుకోకుండా వారిని నిర్లక్ష్యము చేయమనికాదుగానీ, భక్తిప్రేమల ముసుగులో చూపుతున్న వంచననుమాత్రం, నిర్మూలించవలసియున్నది. ప్రపంచములోనున్న యిట్టి మేధావుల పద్దతిని, వారితీరును అద్భుతమనాలి.

 ప్రపంచములోని జనుల ప్రాపంచికవాంఛలు నెరవేరడానికి ఆధ్యాత్మికముగూడా ఒకమార్గమైయున్నది. వారిదృక్పదంలో  నిజమైన ఆధ్యాత్మికత కలదంటే, ప్రాపంచిక విషయాలన్నింటిలో విజయముసిద్ధించి, ప్రాపంచికవాంఛలన్నీ నెరవేరాలి. వారు ప్రభువునుండి అన్నిటిని దబాయించి హక్కుగా పొందా లనుకుంటారు. ధనము, గౌరవము, కుటుంబము బిడ్డలక్షేమము, స్నేహితులసహాయము, పొగడ్తలు, బంధుత్వాలు, హోదాలు, జ్ఞానము, నైపుణ్యము, కీర్తి, సంరక్షణ, ప్రాతినిధ్యం మొదలగునవన్నీ సమకూర్చేతీరాలంటారు. నిజమైన ఆధ్యాత్మికత, దైవకృప ఆశించువారు అరుదుగా వుంటారు. వారు తమహృదయాన్ని ప్రభువొక్కనికే సమర్పిస్తారు. వారికి కోరవలసిందేమియు వుండదు. వారికి లభించినదేదైనను, అది వారికి, కష్టనష్టదాయకమైనదైనను సరే, వారుదానిని ప్రభువుప్రసాదమని సమ్మతితో స్వీకరిస్తారు. అట్టివారు పొందలేనిదంటూ యేదీవుండదు. కడకువారు పొందినదేమైనా వుందంటే , దానికోసం పైనచెప్పిన సంపదలన్నీ వారు విసరిపారేస్తారు .  

 ప్రాపంచికత మరియు దైవీయత ఒకదానికొకటి సమాంతరముగా సాగుట, అను నాసిద్ధాంతమును ధనవంతులు, మరియు పరస్పరం యిచ్చుట తీసుకొనుట (లావదేవీల) లో నిష్ణాతులైన వ్యాపారస్తులు గూడా సమర్థిస్తారు. వారికర్థమైనదేమంటే ఇది నూటికినూరుశాతం లాభదాయకం. ఐదువేళ్ళూ వెన్నలోవుండటం" అనే నానుడికి సరిపోతుంది. ఇదే నానుడికి రెండవభాగం తమాషాగావున్నా వారిఆలోననకు సరిగ్గానే సరిపోతుంది.  అది "తలతీసి పళ్ళెరంలో వుంచినా, ఐదువేళ్ళు మాత్రం వెన్నలోనే వుండాలి" యిక్కడ ఐదువేళ్ళు మాత్రం వెన్నలో వుండటమే ముఖ్యం. తలపోయినా పరవాలేదు. అంటే ఎటుచూసినా లాభమే ముఖ్యమన్నమాట. అయితే కబీరుమహనీయుడు చక్కగా యిలా చెప్పారు"నీతలకు బదులుగా భవంతుడు లభిస్తే , అదిచాలా చౌకబేరమే" అన్నారు. కానీ ప్రాపంచికం దైవీయం సమాంతరంగా సాగే సిద్ధాంతం అందుబాటులో వున్నప్పుడు, ఈకష్టం యెవరు కావాలని కోరుకుంటారు. నేనుకూడా యితరమైనా వాటికంటే దీన్నే సమర్థిస్తాను. ఇతరములైనవి దీనికంటే గొప్పపరిష్కారము చూపునవి, సమంజసమైనవి కావచ్చును. వాటి అపరిపక్వత లెక్కలుచూసుకొనేతత్వంగలవారికి ఒప్పుదలగా వుండవచ్చును.  వారువారి హృదయాలను భవంతునివైపు మరల్చినామని, దివ్యత్వముపొంనామని భావిచియుండవచ్చును. దానితోపాటే సంపద, హోదా, గౌరవము కూడా పొందియుండవచ్చును. కానీ యెవైనా తమ అధీనమునకు తెచ్చుకోవడము, జారిపోకుండా నిరోధించడమునకు గలసంబంధము, తేడా తెలిసికొనగల వివేకము వారికుండదు.

 నేనుడంకాబజాయించి చెబుతున్నాను, సర్వంత్యాగం చేయడంద్వారానే సర్వం సాధించవచ్చును. మహత్తరమైన విలువగల ఆధ్యాత్మిక విధానము, స్వంతమునకు సంపాదించుకోవడము గౌరవమైన హోదా పొందడము, ఆధ్యాత్మికతకు విరుద్ధముకాదుగాని, వ్యామోహము, దురాశ మాత్రము ఆధ్యాత్మిక పురోగమనానికి ప్రాణాంతకమైన విషమువంటివి. సర్మద్ అనే సూఫీభక్తుడు చెబుతూ "దీపపుపురుగు యొక్క హృదయవేదన దురాశగల జోరీగ అదృష్టముకాబోదు" అన్నారు. ఖ్వాజాఫకురుద్దీన్‍అత్తర్ అనే ఇరాన్‍కవి ఉదాహరణకూడా  బహుళఖ్యాతి వహించినది. ధర్మదాస్ తనసర్వస్వాన్ని వదులుకున్న తర్వాతనే, కబీర్‍దాసు ఉత్తరాధికారి కాగలిగాడు. నన్నునేను త్యాగంచేసుకున్న తర్వాతనే లాలాజిపేరు శాశ్వతం చేయగలిగాను. అదికూడా దయతోనాకు వారిచ్చిన  తిరుగులేని కానుక. కొందరు, వారు  అనుబంధం లాలాజీగారితో నాకంటే మిక్కుంటంగా అనుబంధం వుండినదని భ్రమపడి వారు నా ఆరోగ్యం బాగుండాలని ఆయనను అర్థించామని చెప్పుకునేవారు. ఇది యెలాగుందంటే "శిషులు చెక్కెరగా మారారు, కానీ వారి గురువుమాత్రం బెల్లంగానే వుండిపోయారు" అన్నట్లున్నది. ఇది నా అదృష్టము. ఏమనిచెప్పేది? నాకేమీ తెలియదన్న విషయం నాకర్థమైంది. ఏది చేయాలో, యేదిజరిగిందో  అదంతా ఆయన దయవల్లేనే జరిగింది. నేనేమి యివ్వాలో, యివ్వడానికేముందో, అంతాకూడా ఆయనపైనే ఆధారపడివుంది. నాఅదృష్టంపై యేడ్వడమెందుకు? వాస్తవం గమనిస్తే  సింహాలు గుంపులు గుంపులుగా వుండవు. హంసలు వరుసలు వసరులుగా రావు. మాణిక్యాలు గోనెసంచులలో నింపుకొని తేరు. సాధుపుంగవులుకూడా గుంపులుగా ఉద్భవవించరు, ఇంతగా నొక్కివక్కాణించటం, తొలుత చెప్పిన విషయం, తర్వాతచెప్పిన విషయం కంటే గొప్పదనిచెప్పుటకు కాదు. ఏదియేమైనాకాని, సూర్యోదయంతో దశదిశలలకు వెలుగులు ప్రసరించాల్సిందే.  అంతేగాని ప్రతివెలుగు సూర్యకిరణాల  కెరటాలవలె వెలుగులు వెదజల్లలేవు.          

(S.P శ్రీవాత్సవగారి డివైన్ మెసేజెస్ అను పుస్తకమునుండి గ్రహించి, ఆంగ్లమునుండి తెలుగునకు అణువదించడమైనది )    

 

 

 

 

No comments:

Post a Comment

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...