Showing posts with label ఋతవాణి. Show all posts
Showing posts with label ఋతవాణి. Show all posts

Thursday, 26 November 2020

ఋతవాణి

 ఋతవాణి



ఉపోద్ఘాతము: 

        శ్రీ రామచంద్రజీ మహరాజ్, షాజహాన్‌పూర్ వారు 30.04.1899 లో ఈ ప్రపంచమున ప్రభవించిరి.  వారు సంపన్న కుటుంబమున జన్మించినప్పటికి నియమబద్దమైన ఆధ్యాత్మిక జీవనము గడుపుతూ సామాన్యమైన రికార్డు కీపరు ఉద్యోగమును న్యాయస్థానమున నిర్వర్తించి సాంసారిక జీవనము గడుపువారికి ఆదర్శముగా నిలచిరి.

 

        వారు తమ గురుదేవులు శ్రీ రామచంద్రజీ (లాలాజీ) ఫతేగఢ్ వారి వద్ద ఆధ్యాత్మిక శిక్షణను పొంది పరమోన్నతస్థితుల నధిగమించి పరిపూర్ణులై దేశికోత్తములుగా వెలుగొంది "సహజమార్గ"మను నూతనాధ్యాత్మిక విధానమును ప్రపంచమున ప్రవేశపెట్టిరి.  ఈ విధానమున ప్రాణాహుతిగా చెప్పబడు భగవదీయ దివ్యశక్తిని సాధకుల హృదయములలో ప్రవేశపెట్టి, వారు త్వరితగతిన ఆధ్యాత్మికస్థితులను సాధించి ఒక జీవిత కాలములోని కొద్ది సమయములోనే మానవసాధ్యమగు మహోన్నత స్థితులను దాటిమానవ జీవితలక్ష్యమగు భగవదైక్యతకు అర్హులగునట్లు జేసిరి.  ఇట్టి అనితరసాధ్యమైన ప్రాణాహుతి ప్రసార విద్య ద్వారా వీరి సహజమార్గ విధానము ఆధ్యాత్మిక చరిత్రలో ఒక నూతనాధ్యాయమును లిఖింపజేసినది.

        వీరు 19.4.1983 లో దేహత్యాగము గావించినప్పటికి వీరి సహజమార్గము మాత్రము వీరి అంతేవాసుల త్యాగ దీక్షల ఫలితముగా ప్రతిభావంతముగా కొనసాగుచున్నది.

        వీరు అభ్యాసుల ఉపయోగార్థమిచ్చిన ఆధ్యాత్మిక విషయ వివరణలు, శిష్యులకు వ్రాసిన ఉత్తరములు, సందేశములు కలిపి ఆంగ్లములో "వాయిస్ రియల్" అను సంకలన గ్రంధమును విడుదలచేసియుండిరి.  అందులో మొదటి భాగమును పూజ్యశ్రీ కుమారస్వామి, హైదరాబాద్ మరియు శ్రీ టి.వి.శ్రీనివాసరావ్, కడప గార్లు తెలుగున కనువదించి మహోపకారము చేసిరి.

         ఇక మిగిలిన రెండవ భాగమును గురుదేవుల కృపవలన నేను తెనుగు జేసితిని.  ఇది గురువుగారు నాకొసగిన వరముగా భావించుచున్నాను.  ఈ బృహత్తర కార్యమున నా ఆధ్యాత్మిక సోదరులు శ్రీ బి. రమేష్ బాబు గారు, శ్రీ ఎస్. మునిసుబ్బరాయుడు గారు నాకు చేదోడువాదోడుగా నిలిచి నా అనువాదమును క్షుణ్ణముగా పరిశీలించి పుస్తక రూపము దాల్చడానికి ఎంతగానో తోడ్పడినారు.  శ్రీ టి.వి.శ్రీనివాసరావ్, ప్రశిక్షకులు మరియు ఛేర్‌మన్, శ్రీ రాంచంద్రజీ మహరాజ్ సేవా ట్రస్టు వారు మాకు అడుగడుగునా సూచనలిస్తూ ప్రోత్సహించి దీవించినారు.  వారికి మా ధన్యవాదములు.  ఈపుస్తకం కేవలం తెలుగు తెలిసిన అభ్యాసులకెంతగానో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాం. నమస్కారములు.


వసంతపంచమి,                              అనువాదకులు

ఫిబ్రవరి 8, 2011,                         పి. సుబ్బరాయుడు,

కడప.                                        (ప్రశిక్షకులు)   

 

 

విషయ సూచిక

 

I. భాగము-1-మా గురుదేవుల ఆధ్యాత్మ విద్యా సంస్థ

        1. తొలి సందేశము

        2. మా గురుదేవుల ఆధ్యాత్మిక సంస్థ

3. దక్షిణ భారతదేశ ప్రజలకు అద్యక్షుల మొదటి సందేశము

        4. సహజమార్గ విధానము

        5. భగవత్ సాక్షాత్కారమునకు సులభ మార్గము

        6. సహజమార్గ ప్రభావము

 

II. భాగము-2-యాచకుని బిక్షాపాత్ర

        1. ఫకీరు సంపద

        2. తేలికగా ప్రయాణించు

        3. స్మరణ

        4. ఆనందము

        5. గమ్యము మరియు మార్గము

        6. సతి

        7. మన నిజస్వభావము

        8. గీత

        9. అనుబంధము మరియు శ్రద్ధ

        10.సాక్షాత్కారస్థితి

        11.దివ్య దృష్టి

        12.హృదయముపై ధ్యానము

13.మనస్సుపై అదుపు

        14.ప్రకృతి కర్మాగారము

15.సహజమార్గము ఒక చైతన్యపూరిత శక్తిమార్గము

        16.గమ్యము-గమనమున లోపములు-

        17.ఆధ్యాత్మిక ప్రగతి

        18.ఆధ్యాత్మిక మార్గమున ప్రగతి

        19.ప్రాణాహుతి ద్వారా ఆధ్యాత్మిక శిక్షణ

        20.ప్రతిభావంతమైన మార్గము

        21.అన్వేషకునకు సూచనలు

        22.సమస్య-పరిష్కారము

        23.దుఃఖము దాని మొదలు మరియు అంతము

        24.స్పందన-శబ్దము మరియు దాని గుఱుతు

        25.వివిధ తరగతుల గురు శిష్యులు

        26.పదార్థ సత్యతత్త్వము

 

III.భాగము-3-అమృత జల్లులు

 

మా గురుదేవుల ఆధ్యాత్మ విద్యాసంస్థ

 

నూతన ఆధ్యాత్మిక జీవమును నింపి, బంధ విముక్తికై పరితపిస్తున్న మానవజాతి సముద్దరణకై ఆయన ప్రతినిధిగా నాకెరిగించిన ఆయన ఆకాంక్షలకనుగుణంగా ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ప్రస్తుత సమయావసరములను తీర్చగల ఒక నూతన విధానమును "సహజమార్గము" అను పేర ప్రవేశపెట్టబడినది.

 

తొలిసందేశము

 

ప్రియ సోదరులారా!

 

        నాజీవితమందలి అధికభాగము సతతస్మరణకే (నిరంతరస్మరణ) నేను సమర్పించితిని.  నేను నా 22వ ఏట మాగురుదేవులైన సమర్థగురు శ్రీరామచంద్రజీ మహరాజ్, ఫతేగఢ్ వారి చరణ సన్నిధిని చేరితిని.  ఆయన తన కృపా, వాత్సల్యముల ఒడిలో చేర్చుకొని నన్నుద్ధరించెను.  నా ఏకైక జీవితలక్ష్యము మరియు అన్వేషణ కేవలము ఆయనయందు భక్తిపూర్వకమైన ఆరాధనయైయుండి అది ఆరంభమునుండి అంతమువరకు (నేనిప్పుడున్న స్థితివరకు) కొనసాగుతునేయున్నది. ఆయననే నేను నా హృదయమున ఆరాధ్యవస్తువుగా గ్రహించితిని. ఆయనను మినహా మరెవ్వరినేగాని అప్పటికీ ఇప్పటికీ నాహృదయమున నుండతావియ్యలేదు.  నా ఈ భావనను భగవంతుడు సదా సంరక్షించుగాక. నేను నాగురుదేవులను తప్ప మరెవరిని మనస్సున ప్రవేశింపనీయలేదు. ఇక ప్రవేశింపనీయను కూడా. ఇది సర్వసాధారణ నియమము. నిజమైన శిష్యుని ప్రధానకర్తవ్యము. విజయసాధనకు ఏకైక ఉపాయము.  హృదయములోని మాలిన్యములను తొలగించి మార్గమునందలి అడ్డంకులను అధిగమించుటకు సహాయపడు ఒకేఒక సాధనము.  ఇది గ్రంధులు విచ్చుకొనజేయు గుణకారి.  నిజానికిది అన్ని సాధనల అసలు సారాంశము. జీవితములో ఒకసారి రుచిచూచినవాడు ఇక ఎన్నడూ దీనిని జీవితములో వదలడు, మరి ఏవైపునకు మొగ్గుచూపడు.  ఇది మనగురుదేవులు మరియు సమర్థులగు ఋషులు పాటించిన అపజయమెరుగని విధానము.  నామటుకు నాకు ఈప్రక్రియ నాహృదయమున దానికై అదే నా సాధారణ దినచర్యలతో పాటు కొనసాగుతూ అది శాశ్వతముగా నా అలవాటుగా మారిపోయింది.  సంక్షిప్తముగా చెప్పవలెనన్న ఇది నాజీవితమునకు మూలాధారము.  ఇప్పుడు నేనున్న ఆధ్యాత్మికోన్నత పరిధి వరకుగల అన్ని స్థాయిలను అధిగమించుటకు ఇది సహాయపడెను. కనుక ఈపద్దతి మాత్రమే అపజయమనునదే లేక సంపూర్ణ గురుసహాయసహకారాలతో మనకు పూచీనిచ్చుచున్న పద్దతియని నేను నాజీవితానుభవమున నిగ్గుదేల్చి రూఢీపరచుచున్నాను. దీనికి సంబంధించిన శక్తివంతమైన లోతైన జీవితానుభవమును మీరందరు పొందవలయునని నాఆకాంక్ష.  ఈ పద్దతి ఆచరించవలయునను ఇచ్ఛగలవారు వివరములకై నన్ను వ్యక్తిగతముగా కలసి అడుగవచ్చును. దీనికి సంబంధించి అనేకస్థాయిలున్నవి.  అభ్యాసి ఒక స్థాయిదాటిన అనంతరం అవతలి స్థాయిని గురించి విచారించవచ్చును. అతడు సాధనకాలమున దాటుచున్న స్థితులను గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ వుండవచ్చును. ఈవిధానము నాకు నాగురుదేవులు వారు జీవించియుండగ నేను పాటించుటకు సూచించిరి. ఈవిషయమున ఒక ముఖ్యాంశమును దృష్టిలో నుంచుకోవలసియున్నది. ఎటువంటి మహానీయుని మార్గదర్శకత్వమున ఈవిధానమును అభ్యాసి అనుసరింపవలెను అన్న విషయమే అది. దీనికుదాహరణగా మాగురుదేవులు ఇప్పటికే మీ ఎదుటనున్నారు.  ఎవరైతే దాదాపుగా తమకుతాము మితము మరియు సమతాస్థితిలో లీనముగావించుకొన్నారో అట్టివారు ఇందులకు సరిగ్గా తగినవారు.

        ఆధ్యాత్మికశాస్త్రాధారభూతమైన ఈ అద్భుత విధానము అభ్యాసికి అత్యంత ప్రయోజనకారి.  నావిషయమున ఈ ప్రక్రియ దానంతటదే ప్రారంభమైనది.  ఈపద్దతిలోని వాస్తవాంశము పరోక్షముగా గురువుగారి మూర్తిపై ధ్యానము చేయుటయైయున్నది. అందువలన ఈ కార్యమునకై గైకొనబడిన మూర్తి మహోన్నత సమర్థత గలిగి గొప్ప నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలుగల ఒకానొకడై వుండుట అత్యావశ్యకము.  అటువంటప్పుడే ఈవిధానము అదేవిధమైన గొప్ప సుగుణాలను అభ్యాసిలో పెంపొందించగలదు. దీనిలోవున్న శాస్త్రసూత్రమేమనగా ఒక అభ్యాసి ధ్యానము చేయునపుడు అతని యోచనలు హృదయములో శూన్యతను ఏర్పరచును.  ఆశూన్యము తాను ధ్యానవస్తువుగ గైకొన్న వారు శక్తితో నిండటం ప్రారంభమౌతుంది. తద్వారా ప్రకృతి సూత్రముతో సమతుల్యత పరిరక్షింపబడుతుంది.  కనుక ఎంతకాలమిది నిలుస్తుందో అంతకాలం శక్తి తనంతటదే ప్రవహించడం జరుగుతూనే వుంటుంది.

 

        మనిషి తనను తాను ఎలా నిలుపుకుంటాడో లేక పడద్రోసుకుంటాడో కాస్తా గమనిద్దాం. ఈ విశ్వము సూక్ష్మాతిసూక్ష్మమైన పరమాణువులతో నిర్మితమైయున్నది.  అవి సాంద్రము మరియు చీకటిగా వున్నప్పటికి మధ్యమధ్యన కాస్తంత వెలుగు కూడా వున్నది.  ఇది పురుషుడు, ప్రకృతి రెండు ప్రక్కప్రక్కనే వున్నాయన్న యోచనను నిర్ధారించుచున్నది.  బుద్ది, వివేక సంపన్నులైన వారు దివ్యత్వమువైపు మొగ్గుతారు. వారు అందు మెరుగైన జ్ఞానమును వారి దృక్పదమున గైకొని ప్రయోజనమును పొందుతారు. ఇకపోతే ప్రాపంచిక వస్తు సముదాయముల ఆకర్షణలకు చిక్కుబడిపోయినవారు చీకటి పరమాణువులతో తమనుతాము బంధితులను గావించుకొని వాటి స్థూలప్రభావముల అనుబంధముతో నిరంతరము ఆలోచించడము ద్వారా జడులైపోతున్నారు. ఆలోచనలవల్ల ముద్రలేర్పడి అవి రానురాను గట్టిపడడంతో పొరలుగా మారిపోతున్నాయి. అవి మాయాప్రభావము కుదురుకొనుటకు సారవంతమైన క్షేత్రమేర్పరుస్తున్నాయి. దీని ప్రభావము శరీరము పైపొరలందలి అణువులపైబడి లోతుకుదిగి మెదడులోని కేంద్రప్రదేశమున ప్రతిబింబించుచున్నది.  ఇట్లు సంస్కారములేర్పడుటకు వీలుకలిగి అవి లోతునకు పాతుకొనిపోయి పరిసరములయందు తగులుకొని మనస్సును మార్చి వాటికి అలవాటుచేసి చెడు అలవాట్లవైపుకు త్రిప్పుటకు సహాయకములుగా మారిపోవుచున్నవి. ఈ విధముగా మనిషి చెడునుండి మరింత చెడుకు దిగజారిపోవును. ఇట్టిస్థితిలో గురువుగారి మహత్తరశక్తి మాత్రమే అతన్ని రక్షించి అతని యొక్క అంతర్గత చీకటిస్థితిని మార్చివైచి కాపాడ గల్గును.

 

        చూపుమాత్రముననే జిజ్ఞాసువునందు తేలికదనమును కలిగించి చీకటివైపునకు త్రిప్పబడియున్న దారినుండి వెనుకకుమరల్చి వెలుగును తనలో ఇముడ్చుకొనునట్లు చేయగల ఆలోచనల రేకెత్తించి చీకటినుండి వెలుగునకు మరల్చగల అద్భుతశక్తి గలిగినవాడు మాత్రమే నిజమైన గురువు.  మనిషి యందు వెలుగువైపు దారి ఆవిధంగా సరళము, సుగమము అయిపోయి, మనిషి అంతర్గత శక్తి కూడా అందుకు సానుకూలత చేకూర్చడం మొదలౌతుంది. ఈవిధంగా అతని సమస్య పరిష్కరింపబడి అతనికి మేలుచేయునవి మాత్రమే గ్రహిస్తూ విరుద్ధశక్తులన్నింటినుండి తప్పింపబడి రక్షింపబడతాడు. మరియొక గుర్తించదగ్గ విషయమేమంటే గురువుగారితో లీనమవ్వడాన్ని అనుకరించడం ద్వారా గ్రహించి అమలుచేస్తే ఇక దాటడానికి వీలుకాని స్థితులే మిగలవు.  ఈ పద్దతినే నేను అవలంబించి ఇప్పుడు నేనున్న స్థితికి చేరుకున్నాను.  భగవంతుడు మీకు అట్టి సమర్థతను ప్రసాదించుగాక.

 

        మన సత్సంగములో నేనొక ప్రక్రియను ప్రవేశపెట్టదలచాను. అది సరిగ్గా రాత్రి 9 గంటలకు ప్రతి అభ్యాసి తాను ఎక్కడున్నాసరే చేస్తున్న పనిని నిలిపివేసి, సోదర సోదరీమణులందరూ ప్రేమ, భక్తి భావములతో నింపబడుచున్నారనీ, వారిలో నిజమైన శ్రద్ధ ప్రవృద్ధమానమగు చున్నదనియు భావించి 15 నిముషములు ధ్యానించాలి.  ఇది అత్యంత ప్రయోజనకారి.  చేసి చూసిన అనుభవమే వారికి సర్వమెఱిగింపగలదు.

 

        గురుదేవులసంస్థ లక్ష్యము (చేసిన బాస) నెరవేరు దినము ప్రాప్తించిన సమయము సంతోషమయము. దాని కొఱకై ప్రతి ఒక్కరూ శ్రమిస్తారు.  కానీ భగవదానుగ్రహసంపన్నుడే విజయుడౌతాడు. గురువుగారి సంస్థ ఎటువంటిదైనా దాని వెనుక ఎంతటి ప్రయోజనమున్నా నా మామూలు జవాబు మాత్రమిదే.  మహోన్నతమైన గురువు ఉత్తమ లోకానికి వెళ్ళునపుడు తనచే దీక్షనొసంగబడిన శిష్యునొకణ్ణి తన తోడివారి మేలుకొరకై తన ఉత్తరాధికారిగా నియమిస్తారు.  అందుకోసం అతడు గురువుగారినుండి ప్రత్యక్షంగా వెలుగును స్వీకరిస్తాడు. నిజానికి అతనిపని అత్యంత కష్టమైనది. అతడు గురువుగారి ఆజ్ఞలేకుండా ఒక అంగుళమైన కదలలేడు. ఒక చుక్క నీరు కూడా త్రాగలేడు. కేవలమొక చిన్న తప్పుకుసైతం అతడు గురువుగారి గొప్ప అసహనానికి గురి కావలసివస్తుంది.

 

        గురువుగారు వారి జీవితకాలములో ఎందుకు ఉత్తరాధికారిని నిర్ణయించి ప్రకటించలేదన్న వివాదాస్పదాంశం ఉత్పన్నమౌతున్నది. అందుకు కారణాలన్నీ ముందుగానే చీటీలో వివరింపబడ్డాయి.  చూడాలనుకుంటే ఎవరైనా వాటిని యధేచ్ఛగా చూడవచ్చు.  దీనితోపాటువున్న ఇతర వాస్తవాలు ప్రజలను సంతృప్తి పరచగలవు. జరిగిన సంఘటనలు సైతం ఈ విషయాన్ని వాటంతటవే వ్యక్తీకరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అన్ని సందర్భాలలో గురువు తన వారసునినామాన్ని శరీరం వదిలేలోగా ప్రకటించేతీరాలన్న నియమేమీలేదు.  అట్టి సందర్భములు కోకొల్లలుగా గలవు. దీనికి ఇంకా ఆధారాలు చూపించవలసిన అవసరం లేదు.  నేను పైతెలిపిన విషయములే సరిపోతాయి.  ఎవరైనా అవసరమని తోచినవారు పరీక్షించి వారికైవారు ధర్మనిర్ణయము చేసుకొనవచ్చును. దీనికి తోడు నా దినచర్య పుస్తకము, అందులో సందర్భానుసారముగా గురువుగారు చేసిన సూచనలు గూడా ఇందుకు తగినంత ఆధారలనందిస్తున్నవి. గురువుగారు నా దినచర్య పుస్తకంలోని విషయాలు ఇతర సహచరులతో మాట్లాడునప్పుడు కూడా తెలిపియున్నారు.  ఆయన ఉటంకించిన ఈవిషయాలు ఇప్పటికే "శ్రీరామ్‌సందేశ్" అను పుస్తకమున కూడా ప్రచురితమయ్యాయి.  ఈ విషయములూ, నా దినచర్య పుస్తకంలో వ్రాసిన 15 ఆగుష్టు 1931 నాటి విషయము (గురువుగారు అనంతములో లీనమైపోయినదినము) గమనిస్తే ఇప్పటి నాస్థితిని బహిర్గతం చేస్తున్నవి.  ఈ విషయాలు వారికి వీలైన విధానమున సమీకరించుకొనుటకు ప్రతిఒక్కరిని నేను నిర్ద్వందముగా స్వాగతిస్తున్నాను.

 

        కానీ దురదృష్టవశాత్తు కొందరు స్వార్థప్రయోజనముకై అనవసరమైన శ్రద్దతో పనిచేసి వాస్తవములను వివిధరీతుల వక్రీకరించి మసిపూయుటకు ప్రయత్నించుచున్నారు.  కనుక నేను ఇందుకు సంబంధించిన సంఘటనల వివరములను మీముందుంచుచున్నాను. ఇప్పటి నాస్థితిని ఏప్రిల్ 1944 ఆఖరు వారం బహిర్గతము చేయబడినది మరియు గురువుగారితో ప్రత్యక్షానుసంధానమేర్పడినది. తదనుగుణంగా 1944 మే 4న ఆయన ప్రత్యక్షసూచనలమేరకు కార్యనిర్వహణకు పూనుకొంటిని. దీనికి సంబంధించిన అన్నివివరములు వ్రాతపూర్వకముగా నున్నవి. ఆనాటినుండి నేను ఆయన సామాన్య సహచరులందరికి ప్రాణాహుతి ప్రసారము చేయుచునేయుంటిని.  తద్వారా వారిలోని దారితప్పిన ఉద్వేగములను (గురువుగారు వివరించినట్లు అది సలుపుచున్న ఉడుకుగడ్డ వంటిది) కట్టడిచేయ యత్నించుచుంటిని.  కానీ దారితప్పిన ఆస్థితిని వారు ఆనందస్థితిగా అర్థముచేసుకొనుచుండిరి.  అట్టే కొంతకాలము నేను నాపని కొనసాగించుచుంటిని. కానీ చింతించవలసినదేమంటే నాపనిని ఆతర్వాత నిలిపి వేయవలసినదిగా ఆదేశింపబడినది.  కారణము, ఇందువల్ల కలుగుచున్న సత్ఫలితములను ఇతరుల గొప్పదనముగా పరిగణింపబడుటే.

 

        ప్రియసోదరులారా! నాకు ఈ విషయమై వ్యక్తిగత ప్రత్యేకోద్దేశ్యము గాని, ధనాపేక్ష, కీర్తిపై ఆశగాని లేవు.  నేను ఆశించేదంతా కేవలం నాగురుదేవులతో బంధమేర్పరచుకొని యున్నవారంతా మేలుపడాలనీ మరియు నాగురుదేవుల పవిత్రోద్దేశ్యము నెరవేరాలని మాత్రమే.  ఇది మనందరి సంతృప్తికి మూలము.

 

        మీకు విస్మయము కలిగించు మరొక విషయమేమంటే నాకు యిప్పటివరకు ఏర్పడివున్న సంబంధ బాంధవ్యాలు నేడులేవు. భగవదాదేశము మేరకు అవన్నీ త్రెంచివేయబడి దాని స్థానములో మరొకటేర్పడినది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అద్దానివరకు ఎదగవలసివున్నది.

 

        కనుక మీరందరు కదలి వలయము పూర్తిచేయుట ఆవశ్యకమైయున్నది. ఈ క్రొత్త బంధమును ఎంతతొందరగా ఏర్పరచుకుంటే అంత మంచిది.  తద్వారా మిమ్ములను సరిదిద్ది మీఅనుబంధమును చక్కబరచుటకు నాకొక అవకాశము కల్పించండి.  ఎందుకంటే ఇది నిర్లక్ష్యముచేస్తే మీరు గురుదేవుని అపారకృపను పొందలేకుండా పోయినవారౌతారు.

 

***

 

మా గురుదేవుల ఆధ్యాత్మ విద్యాసంస్థ

 

నూతన ఆధ్యాత్మిక జీవమును నింపి, బంధ విముక్తికై పరితపిస్తున్న మానవజాతి సముద్దరణకై ఆయన ప్రతినిధిగా నాకెరిగించిన ఆయన ఆకాంక్షలకనుగుణంగా ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ప్రస్తుత సమయావసరములను తీర్చగల ఒక నూతన విధానమును "సహజమార్గము" అను పేర ప్రవేశపెట్టబడినది.

 

తొలిసందేశము

 

ప్రియ సోదరులారా!

 

        నాజీవితమందలి అధికభాగము సతతస్మరణకే (నిరంతరస్మరణ) నేను సమర్పించితిని.  నేను నా 22వ ఏట మాగురుదేవులైన సమర్థగురు శ్రీరామచంద్రజీ మహరాజ్, ఫతేగఢ్ వారి చరణ సన్నిధిని చేరితిని.  ఆయన తన కృపా, వాత్సల్యముల ఒడిలో చేర్చుకొని నన్నుద్ధరించెను.  నా ఏకైక జీవితలక్ష్యము మరియు అన్వేషణ కేవలము ఆయనయందు భక్తిపూర్వకమైన ఆరాధనయైయుండి అది ఆరంభమునుండి అంతమువరకు (నేనిప్పుడున్న స్థితివరకు) కొనసాగుతునేయున్నది. ఆయననే నేను నా హృదయమున ఆరాధ్యవస్తువుగా గ్రహించితిని. ఆయనను మినహా మరెవ్వరినేగాని అప్పటికీ ఇప్పటికీ నాహృదయమున నుండతావియ్యలేదు.  నా ఈ భావనను భగవంతుడు సదా సంరక్షించుగాక. నేను నాగురుదేవులను తప్ప మరెవరిని మనస్సున ప్రవేశింపనీయలేదు. ఇక ప్రవేశింపనీయను కూడా. ఇది సర్వసాధారణ నియమము. నిజమైన శిష్యుని ప్రధానకర్తవ్యము. విజయసాధనకు ఏకైక ఉపాయము.  హృదయములోని మాలిన్యములను తొలగించి మార్గమునందలి అడ్డంకులను అధిగమించుటకు సహాయపడు ఒకేఒక సాధనము.  ఇది గ్రంధులు విచ్చుకొనజేయు గుణకారి.  నిజానికిది అన్ని సాధనల అసలు సారాంశము. జీవితములో ఒకసారి రుచిచూచినవాడు ఇక ఎన్నడూ దీనిని జీవితములో వదలడు, మరి ఏవైపునకు మొగ్గుచూపడు.  ఇది మనగురుదేవులు మరియు సమర్థులగు ఋషులు పాటించిన అపజయమెరుగని విధానము.  నామటుకు నాకు ఈప్రక్రియ నాహృదయమున దానికై అదే నా సాధారణ దినచర్యలతో పాటు కొనసాగుతూ అది శాశ్వతముగా నా అలవాటుగా మారిపోయింది.  సంక్షిప్తముగా చెప్పవలెనన్న ఇది నాజీవితమునకు మూలాధారము.  ఇప్పుడు నేనున్న ఆధ్యాత్మికోన్నత పరిధి వరకుగల అన్ని స్థాయిలను అధిగమించుటకు ఇది సహాయపడెను. కనుక ఈపద్దతి మాత్రమే అపజయమనునదే లేక సంపూర్ణ గురుసహాయసహకారాలతో మనకు పూచీనిచ్చుచున్న పద్దతియని నేను నాజీవితానుభవమున నిగ్గుదేల్చి రూఢీపరచుచున్నాను. దీనికి సంబంధించిన శక్తివంతమైన లోతైన జీవితానుభవమును మీరందరు పొందవలయునని నాఆకాంక్ష.  ఈ పద్దతి ఆచరించవలయునను ఇచ్ఛగలవారు వివరములకై నన్ను వ్యక్తిగతముగా కలసి అడుగవచ్చును. దీనికి సంబంధించి అనేకస్థాయిలున్నవి.  అభ్యాసి ఒక స్థాయిదాటిన అనంతరం అవతలి స్థాయిని గురించి విచారించవచ్చును. అతడు సాధనకాలమున దాటుచున్న స్థితులను గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ వుండవచ్చును. ఈవిధానము నాకు నాగురుదేవులు వారు జీవించియుండగ నేను పాటించుటకు సూచించిరి. ఈవిషయమున ఒక ముఖ్యాంశమును దృష్టిలో నుంచుకోవలసియున్నది. ఎటువంటి మహానీయుని మార్గదర్శకత్వమున ఈవిధానమును అభ్యాసి అనుసరింపవలెను అన్న విషయమే అది.  దీనికుదాహరణగా మాగురుదేవులు ఇప్పటికే మీ ఎదుటనున్నారు.  ఎవరైతే దాదాపుగా తమకుతాము మితము మరియు సమతాస్థితిలో లీనముగావించుకొన్నారో అట్టివారు ఇందులకు సరిగ్గా తగినవారు.

        ఆధ్యాత్మికశాస్త్రాధారభూతమైన ఈ అద్భుత విధానము అభ్యాసికి అత్యంత ప్రయోజనకారి.  నావిషయమున ఈ ప్రక్రియ దానంతటదే ప్రారంభమైనది.  ఈపద్దతిలోని వాస్తవాంశము పరోక్షముగా గురువుగారి మూర్తిపై ధ్యానము చేయుటయైయున్నది. అందువలన ఈ కార్యమునకై గైకొనబడిన మూర్తి మహోన్నత సమర్థత గలిగి గొప్ప నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలుగల ఒకానొకడై వుండుట అత్యావశ్యకము.  అటువంటప్పుడే ఈవిధానము అదేవిధమైన గొప్ప సుగుణాలను అభ్యాసిలో పెంపొందించగలదు. దీనిలోవున్న శాస్త్రసూత్రమేమనగా ఒక అభ్యాసి ధ్యానము చేయునపుడు అతని యోచనలు హృదయములో శూన్యతను ఏర్పరచును.  ఆశూన్యము తాను ధ్యానవస్తువుగ గైకొన్న వారు శక్తితో నిండటం ప్రారంభమౌతుంది. తద్వారా ప్రకృతి సూత్రముతో సమతుల్యత పరిరక్షింపబడుతుంది.  కనుక ఎంతకాలమిది నిలుస్తుందో అంతకాలం శక్తి తనంతటదే ప్రవహించడం జరుగుతూనే వుంటుంది.

 

        మనిషి తనను తాను ఎలా నిలుపుకుంటాడో లేక పడద్రోసుకుంటాడో కాస్తా గమనిద్దాం. ఈ విశ్వము సూక్ష్మాతిసూక్ష్మమైన పరమాణువులతో నిర్మితమైయున్నది.  అవి సాంద్రము మరియు చీకటిగా వున్నప్పటికి మధ్యమధ్యన కాస్తంత వెలుగు కూడా వున్నది.  ఇది పురుషుడు, ప్రకృతి రెండు ప్రక్కప్రక్కనే వున్నాయన్న యోచనను నిర్ధారించుచున్నది.  బుద్ది, వివేక సంపన్నులైన వారు దివ్యత్వమువైపు మొగ్గుతారు. వారు అందు మెరుగైన జ్ఞానమును వారి దృక్పదమున గైకొని ప్రయోజనమును పొందుతారు. ఇకపోతే ప్రాపంచిక వస్తు సముదాయముల ఆకర్షణలకు చిక్కుబడిపోయినవారు చీకటి పరమాణువులతో తమనుతాము బంధితులను గావించుకొని వాటి స్థూలప్రభావముల అనుబంధముతో నిరంతరము ఆలోచించడము ద్వారా జడులైపోతున్నారు. ఆలోచనలవల్ల ముద్రలేర్పడి అవి రానురాను గట్టిపడడంతో పొరలుగా మారిపోతున్నాయి. అవి మాయాప్రభావము కుదురుకొనుటకు సారవంతమైన క్షేత్రమేర్పరుస్తున్నాయి. దీని ప్రభావము శరీరము పైపొరలందలి అణువులపైబడి లోతుకుదిగి మెదడులోని కేంద్రప్రదేశమున ప్రతిబింబించుచున్నది.  ఇట్లు సంస్కారములేర్పడుటకు వీలుకలిగి అవి లోతునకు పాతుకొనిపోయి పరిసరములయందు తగులుకొని మనస్సును మార్చి వాటికి అలవాటుచేసి చెడు అలవాట్లవైపుకు త్రిప్పుటకు సహాయకములుగా మారిపోవుచున్నవి. ఈ విధముగా మనిషి చెడునుండి మరింత చెడుకు దిగజారిపోవును. ఇట్టిస్థితిలో గురువుగారి మహత్తరశక్తి మాత్రమే అతన్ని రక్షించి అతని యొక్క అంతర్గత చీకటిస్థితిని మార్చివైచి కాపాడ గల్గును.

 

        చూపుమాత్రముననే జిజ్ఞాసువునందు తేలికదనమును కలిగించి చీకటివైపునకు త్రిప్పబడియున్న దారినుండి వెనుకకుమరల్చి వెలుగును తనలో ఇముడ్చుకొనునట్లు చేయగల ఆలోచనల రేకెత్తించి చీకటినుండి వెలుగునకు మరల్చగల అద్భుతశక్తి గలిగినవాడు మాత్రమే నిజమైన గురువు.  మనిషి యందు వెలుగువైపు దారి ఆవిధంగా సరళము, సుగమము అయిపోయి, మనిషి అంతర్గత శక్తి కూడా అందుకు సానుకూలత చేకూర్చడం మొదలౌతుంది. ఈవిధంగా అతని సమస్య పరిష్కరింపబడి అతనికి మేలుచేయునవి మాత్రమే గ్రహిస్తూ విరుద్ధశక్తులన్నింటినుండి తప్పింపబడి రక్షింపబడతాడు. మరియొక గుర్తించదగ్గ విషయమేమంటే గురువుగారితో లీనమవ్వడాన్ని అనుకరించడం ద్వారా గ్రహించి అమలుచేస్తే ఇక దాటడానికి వీలుకాని స్థితులే మిగలవు.  ఈ పద్దతినే నేను అవలంబించి ఇప్పుడు నేనున్న స్థితికి చేరుకున్నాను.  భగవంతుడు మీకు అట్టి సమర్థతను ప్రసాదించుగాక.

 

        మన సత్సంగములో నేనొక ప్రక్రియను ప్రవేశపెట్టదలచాను. అది సరిగ్గా రాత్రి 9 గంటలకు ప్రతి అభ్యాసి తాను ఎక్కడున్నాసరే చేస్తున్న పనిని నిలిపివేసి, సోదర సోదరీమణులందరూ ప్రేమ, భక్తి భావములతో నింపబడుచున్నారనీ, వారిలో నిజమైన శ్రద్ధ ప్రవృద్ధమానమగు చున్నదనియు భావించి 15 నిముషములు ధ్యానించాలి.  ఇది అత్యంత ప్రయోజనకారి.  చేసి చూసిన అనుభవమే వారికి సర్వమెఱిగింపగలదు.

 

        గురుదేవులసంస్థ లక్ష్యము (చేసిన బాస) నెరవేరు దినము ప్రాప్తించిన సమయము సంతోషమయము. దాని కొఱకై ప్రతి ఒక్కరూ శ్రమిస్తారు.  కానీ భగవదానుగ్రహసంపన్నుడే విజయుడౌతాడు. గురువుగారి సంస్థ ఎటువంటిదైనా దాని వెనుక ఎంతటి ప్రయోజనమున్నా నా మామూలు జవాబు మాత్రమిదే.  మహోన్నతమైన గురువు ఉత్తమ లోకానికి వెళ్ళునపుడు తనచే దీక్షనొసంగబడిన శిష్యునొకణ్ణి తన తోడివారి మేలుకొరకై తన ఉత్తరాధికారిగా నియమిస్తారు.  అందుకోసం అతడు గురువుగారినుండి ప్రత్యక్షంగా వెలుగును స్వీకరిస్తాడు. నిజానికి అతనిపని అత్యంత కష్టమైనది. అతడు గురువుగారి ఆజ్ఞలేకుండా ఒక అంగుళమైన కదలలేడు. ఒక చుక్క నీరు కూడా త్రాగలేడు. కేవలమొక చిన్న తప్పుకుసైతం అతడు గురువుగారి గొప్ప అసహనానికి గురి కావలసివస్తుంది.

 

        గురువుగారు వారి జీవితకాలములో ఎందుకు ఉత్తరాధికారిని నిర్ణయించి ప్రకటించలేదన్న వివాదాస్పదాంశం ఉత్పన్నమౌతున్నది. అందుకు కారణాలన్నీ ముందుగానే చీటీలో వివరింపబడ్డాయి.  చూడాలనుకుంటే ఎవరైనా వాటిని యధేచ్ఛగా చూడవచ్చు.  దీనితోపాటువున్న ఇతర వాస్తవాలు ప్రజలను సంతృప్తి పరచగలవు. జరిగిన సంఘటనలు సైతం ఈ విషయాన్ని వాటంతటవే వ్యక్తీకరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అన్ని సందర్భాలలో గురువు తన వారసునినామాన్ని శరీరం వదిలేలోగా ప్రకటించేతీరాలన్న నియమేమీలేదు.  అట్టి సందర్భములు కోకొల్లలుగా గలవు. దీనికి ఇంకా ఆధారాలు చూపించవలసిన అవసరం లేదు.  నేను పైతెలిపిన విషయములే సరిపోతాయి.  ఎవరైనా అవసరమని తోచినవారు పరీక్షించి వారికైవారు ధర్మనిర్ణయము చేసుకొనవచ్చును. దీనికి తోడు నా దినచర్య పుస్తకము, అందులో సందర్భానుసారముగా గురువుగారు చేసిన సూచనలు గూడా ఇందుకు తగినంత ఆధారలనందిస్తున్నవి. గురువుగారు నా దినచర్య పుస్తకంలోని విషయాలు ఇతర సహచరులతో మాట్లాడునప్పుడు కూడా తెలిపియున్నారు.  ఆయన ఉటంకించిన ఈవిషయాలు ఇప్పటికే "శ్రీరామ్‌సందేశ్" అను పుస్తకమున కూడా ప్రచురితమయ్యాయి.  ఈ విషయములూ, నా దినచర్య పుస్తకంలో వ్రాసిన 15 ఆగుష్టు 1931 నాటి విషయము (గురువుగారు అనంతములో లీనమైపోయినదినము) గమనిస్తే ఇప్పటి నాస్థితిని బహిర్గతం చేస్తున్నవి.  ఈ విషయాలు వారికి వీలైన విధానమున సమీకరించుకొనుటకు ప్రతిఒక్కరిని నేను నిర్ద్వందముగా స్వాగతిస్తున్నాను.

 

        కానీ దురదృష్టవశాత్తు కొందరు స్వార్థప్రయోజనముకై అనవసరమైన శ్రద్దతో పనిచేసి వాస్తవములను వివిధరీతుల వక్రీకరించి మసిపూయుటకు ప్రయత్నించుచున్నారు.  కనుక నేను ఇందుకు సంబంధించిన సంఘటనల వివరములను మీముందుంచుచున్నాను. ఇప్పటి నాస్థితిని ఏప్రిల్ 1944 ఆఖరు వారం బహిర్గతము చేయబడినది మరియు గురువుగారితో ప్రత్యక్షానుసంధానమేర్పడినది. తదనుగుణంగా 1944 మే 4న ఆయన ప్రత్యక్షసూచనలమేరకు కార్యనిర్వహణకు పూనుకొంటిని. దీనికి సంబంధించిన అన్నివివరములు వ్రాతపూర్వకముగా నున్నవి. ఆనాటినుండి నేను ఆయన సామాన్య సహచరులందరికి ప్రాణాహుతి ప్రసారము చేయుచునేయుంటిని.  తద్వారా వారిలోని దారితప్పిన ఉద్వేగములను (గురువుగారు వివరించినట్లు అది సలుపుచున్న ఉడుకుగడ్డ వంటిది) కట్టడిచేయ యత్నించుచుంటిని.  కానీ దారితప్పిన ఆస్థితిని వారు ఆనందస్థితిగా అర్థముచేసుకొనుచుండిరి.  అట్టే కొంతకాలము నేను నాపని కొనసాగించుచుంటిని. కానీ చింతించవలసినదేమంటే నాపనిని ఆతర్వాత నిలిపి వేయవలసినదిగా ఆదేశింపబడినది.  కారణము, ఇందువల్ల కలుగుచున్న సత్ఫలితములను ఇతరుల గొప్పదనముగా పరిగణింపబడుటే.

 

        ప్రియసోదరులారా! నాకు ఈ విషయమై వ్యక్తిగత ప్రత్యేకోద్దేశ్యము గాని, ధనాపేక్ష, కీర్తిపై ఆశగాని లేవు.  నేను ఆశించేదంతా కేవలం నాగురుదేవులతో బంధమేర్పరచుకొని యున్నవారంతా మేలుపడాలనీ మరియు నాగురుదేవుల పవిత్రోద్దేశ్యము నెరవేరాలని మాత్రమే.  ఇది మనందరి సంతృప్తికి మూలము.

 

        మీకు విస్మయము కలిగించు మరొక విషయమేమంటే నాకు యిప్పటివరకు ఏర్పడివున్న సంబంధ బాంధవ్యాలు నేడులేవు. భగవదాదేశము మేరకు అవన్నీ త్రెంచివేయబడి దాని స్థానములో మరొకటేర్పడినది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అద్దానివరకు ఎదగవలసివున్నది.

 

        కనుక మీరందరు కదలి వలయము పూర్తిచేయుట ఆవశ్యకమైయున్నది. ఈ క్రొత్త బంధమును ఎంతతొందరగా ఏర్పరచుకుంటే అంత మంచిది.  తద్వారా మిమ్ములను సరిదిద్ది మీఅనుబంధమును చక్కబరచుటకు నాకొక అవకాశము కల్పించండి.  ఎందుకంటే ఇది నిర్లక్ష్యముచేస్తే మీరు గురుదేవుని అపారకృపను పొందలేకుండా పోయినవారౌతారు.

 

***


మా గురుదేవుల ఆధ్యాత్మిక సంస్థ

 

        అది పవిత్ర వసంత పంచమి దినము (1873).  ఆ రోజున మహనీయ గురువర్యులదివ్యాత్మ శ్రీరామచంద్రజీ ఫతేగఢ్ (ఉ.ప్ర) వారి రూపమున భువిపై అవతరించెను.  అది ఒక సంతోషభరితమై యొప్పారుచున్న సుదినము. ఆ సంవత్సరం ఆహ్లాద వసంత ఋతువుతో సుందరముగా సమన్వయమై వికసితనవ్యతనావిష్కరిస్తూ ప్రతి హృదయమాస్వాదిస్తున్నది.  ఒక మహదానంద సమయము ఆయనతోపాటే లోకమునకేతెంచి వర్తమాన మానవ క్లేశములను తొలగించివేయు భరోసానిచ్చి మేల్కొలుపు కలిగించగల నూతన ఆధ్యాత్మికశకము ప్రవేశపెట్టబడినది.  ఆధ్యాత్మిక రంగమున ఆయన తెచ్చిన ఈ గొప్ప విప్లవాత్మక పిలుపునకు మనస్సులాకర్షింపబడి హృదయములు సంతోషాతిశయమున ఎగిరి గంతులువైచినవి.  వారు పూర్వపు మహర్షులకు సైతం అందనటువంటి జీవిత సమస్యా పరిష్కారములకు సులువైన మార్గమును చూపిరి.  ఇందులో నాచే చెప్పబడిన వాస్తవములను ఆచరణాత్మక పరిశీలనము ద్వారా మాత్రమే నిగ్గు తేల్చనగును.

 

        ఒక కాలమున భారతదేశము ఆధ్యాత్మికవైభవ విషయమై శిఖరాగ్రస్థాయినందియుండినది.  అది మత, ఆధ్యాత్మిక జగద్గురుపదము తనదేనని ప్రకటించుకొన్నది.  కానీ కాలముగడచుకొలది పతనము మొదలైనది.  రానురాను అంతయు పోగొట్టుకొంటిననుదశకు చేరిపోయినది.  అది ఎంతగా క్రిందకు పడిపోయినదనగా మననుండి తొలుత నేర్చుకొన్నవారే మనకు ఈ దారిన మార్గదర్శకులమని చెప్పుకొను స్థాయికి చేరినది. నిస్సందేహంగా పవిత్రాత్ములు వుండనేవున్నారు.  వారు పరిస్థితిని సరిదిద్ది చక్కబరచాడానికి ప్రయత్నిస్తూనే వున్నారు.  అయినప్పటికిని పతనం మొత్తంమీద కొనసాగుతునే పోయింది.  తుదకు మనం అంతా పోగొట్టుకోవడమే కాకుండా అసలు అటువంటిదొకటుందనే విషయం మొత్తం మరచిపోయాము.  ఇప్పుడొకవేళ మనదృష్టికటువంటిదేదైనా తారసపడితే అది మనకు పూర్తిగా పరాయిదిగా అనిపిస్తున్నది.  అసలు దాన్ని ఏమాత్రం మనదని ఒప్పుకునేట్టు కూడా లేము.  ఏదిఏమైనా ఏనాడో మరుగున పడిపోయిన ఈ ఆధ్యాత్మికశాస్త్ర పద్దతిని తిరిగి లోకమున చురుకుగా అనుసరించునట్లు చేయడమే గాకుండా మన ఆచరణాత్మక అనుభూతి జ్ఞానము మరియు అవగాహనకు వచ్చునట్లు చేయుటకే మహనీయులైన గురువర్యులు ఈలోకమున ప్రభవించిరి.

 

        మానవునిలో ఆధ్యాత్మిక పునఃజీవనమును కలిగించి బాధాపరితప్తఆత్మల బంధవిముక్తి కొరకై మహనీయుడైన గురుదేవులు దివ్యమార్గమున పురాతన యోగపద్దతి ద్వారా జనోద్దరణకావించుటకు అవతరించిరి.  ఈ పద్దతి చాలాపురాతనమైనది.  కాలక్రమేణా విస్మరింపబడి హిందువులు పోగొట్టుకొనిరి.  నిజానికి హైందవఋషులే దీని ఆద్యులు.  ఒక మహోన్నత ఆధ్యాత్మిక సేవనందించుటకే సంస్థ నిలిచియున్నది.  ఇందులో పనిచేయువారు ప్రశిక్షకులతోసహా ఎవరూ కూడా వ్యక్తిగత ఉద్దేశ్యములకు, ధనార్జనకు, కీర్తి ప్రతిష్టలు, పొగడ్తలకు ప్రాకులాడటం లేదు.  నిజానికి ఆధ్యాత్మిక బోధకులైనవారు వారిపనిని విద్యుక్తధర్మముగనే పాటించవలసి యున్నది.  కానీ చాలా కొద్దిమంది మాత్రమే దీనిని పరిగణనలోనికి తీసుకొంటున్నారు.  ఎందుకంటే మనవారు ప్రత్యేక జీవనవిధానమును గాని, చిత్రవేషధారణమునగాని ఇతరుల దృష్టినాకర్షించు తీరుననుండరు.  మాగురువర్యుల శక్తిసామర్థ్యములు బహుశః అవి మాటలకతీతములు.  ఆయన సుగుణముల గణించుటయన్న సూర్యుని ముందు క్రోవ్వొత్తి వెలిగించుటే.  ఇంతెందుకు వాస్తవార్థమున చెప్పవలెనన్న ఆయన "సమర్థగురువు".  ఆయన ప్రామాణిక మానవ జీవిత స్వరూపమును ప్రజల దృక్పథమునకు తెచ్చెను.  బాధా వ్యధ, చిక్కులతో కూడిన సామాన్యజీవనము గడుపువారు సైతము ఆయన నిర్దేశించిన ప్రామాణిక జీవనము గడుపుటయందు సఫలీకృతులగుటకు తిరుగులేని విధానమును చూపెను.  ఆయన చూపినవిధానము మహోన్నతస్థితుల నందుకొనుటకు సహితము అతిసులభము.  పూర్వము అందుకోసమై గృహమునువిడిచి సాంసారిక జీవనమును త్యజించి సన్యాస జీవనము గడపవలసి వచ్చెడిది.  ఆయన ఈ విధానపు సహజ ప్రతిభను వివరించి ఒప్పించుటేగాక ఆమార్గమున వారిని నడిపింపజేసి అత్యున్నత స్థాయికి చేర్చెను.

 

        ఆయన ప్రవేశపెట్టి, వెలుగునకుతెచ్చిన ఈ పద్దతి సులభముగా ఆచరించుటకు వీలైనదే గాకుండా మన ప్రాపంచిక కార్యకలాపములు బాధ్యతలు నిర్వహిస్తూనే మహోన్నత ఆధ్యాత్మిక ప్రగతిని సాధింపవీలుకల్పిస్తున్నది.  ఇదే విధమగు చైతన్య విధానము శ్రీకృష్ణపరమాత్మ కాలమున బహుళ ప్రచారములో నుండెను.  ఈ విధానముననే ఆయన కూడా ఆకాలమున ఆధ్యాత్మిక శిక్షణనిచ్చెను.  కాలక్రమమున ఇది మరపు పొరల వెనుకకు త్రోసివేయబడి పూర్తిగా కానరాకుండాపోయెను.  ప్రస్తుతము ఆ పురాతన పద్దతినే పునరుద్దరించి క్రొత్తవర్ణముతో మహాత్ముడైన మన గురువుగారు వెలుగునకు దెచ్చిరి.  ఆయన నిస్సందేహముగా ఈ కార్యనిర్వహణమునకే ఈ ప్రపంచమున ప్రభవించిరి.  అదృష్టవశాత్తు ఆయనతో కలసిమెలసి తిరుగు మహత్తర అవకాశము కలిగినవారు నిజముగా ధన్యులు.  ఆయన సంపూర్ణముగా లోపరహితుడు.  ఆయనకు సాటి వచ్చువారు లేనేలేరు.  దిగ్భ్రమకు గురియైవున్న మానవులకు ఆయన చేసినమేలు మాటలలో చెప్పనలవి కాదు.  ఆయన తనతో బంధమేర్పరచుకొనియున్న వారందరిలో శూన్యత్వమునుత్పన్నము చేయుటద్వారా వారిలో నూతన జీవమును ప్రవేశింపజేసెను.  అదియే మానవుని సంపూర్ణమానవునిగా మనునట్లు జేయజాలియుండెను.  ఆయన అపజయమెరుగని ఆచరణాత్మకపద్దతిని అత్యున్నత స్థాయినందుకొనుటకై ప్రవేశపెట్టెను.  అట్టి శక్తిసంపన్నులైన మహనీయులు అరుదుగా కనపడిననూ అన్నికాలములలోనూ వుండుటయేగాక ఎప్పుడూ వుంటారుకూడా.  అయితే అట్టివారిని గుర్తించుటే వాస్తవమున కష్టము. ఇది కొంతవరకు వారివారి గత సంస్కారములపై కూడా ఆధారపడి వుంటుంది.  మరొకచిక్కు కూడా వున్నది.  అట్టి మహనీయుడు జీవితములో ఒకవేళ తారసపడినను మనలో చాలామంది ఆయనను నిజముగా అంతటి మహనీయుడేయని మనసారా అంగీకరించరు.  కారణము ఆయన మనకెట్టి చెమక్కులు, ఆకర్షణలు చూపరు.  ఇటువంటివి కేవలము వారు చిక్కువడియున్న మాయావలయముల ప్రభావమే.  అవి ఇటువంటివాటియందే వారిని ఇరికించి పరిమితులకు లోబరచివేసి యుండును.

 

        పూర్వము గురువులు లవలేశమైన ఆధ్యాత్మికతను శిష్యులకు బోధించుటకు, వారిలో దివ్యజ్ఞానము పెంపొందించుకొను యోగ్యత మరియు శక్తియుక్తులు కల్గించుటకు, వారినుండి అనేకమైన వ్యక్తిగత సేవలను రాబట్టుకొనెడివారు.  మనగురుదేవులు సామాన్యమానవుని ఈ అసహాయస్థితిని గుర్తించి కరుణామయుడై దీక్షకు ముందు ఏర్పరచిన అన్నినియమములను తొలగించివేసెను.  ఆయన జీవితాంతము అభ్యాసుల నుండి వ్యక్తిగత సేవలను గ్రహించనేలేదు.  ఇకపోతే తనే వ్యక్తిగతముగా అభ్యాసులకు అవసరమైనప్పుడు సేవలు చేయుటకు సిద్దముగా నుండెను.  అట్లు ఆయన జీవితమంతయు సంపూర్ణమానవసేవకు తన్నుతాను అంకితము చేసుకొనెను.

        మా గురుదేవులు నాకు తెలియజేసిన వారి ఆకాంక్ష మేరకు ఆయన వారసునిగా ఒక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి కాలనుగుణ అవసరములను తీర్చగల నూతనవిధానము ప్రవేశపెట్టబడినది. ఈ సంస్థ నూతనముగా ప్రవేశపెట్టిన సహజమార్గపద్దతి ద్వారా మహాత్ముడైన గురుదేవుల ఆదర్శములను వ్యాప్తిచేయుటకు ఉద్దేశింపబడినది.  తద్వారా నిద్రావస్థలోనున్న జనసమూహమును దివ్యచైతన్యము వైపునకు జాగృతపరచి వారిని చక్కబరచి పురోగమనమార్గమున నుంచుట జరుగుచున్నది.  ఈ కార్యనిర్వహణమునకై నేటి కాలమునకు సరిపడని కఠినము, మొండి పట్టుదల, శ్రమతో గూడిన పాత యాంత్రిక ఆచరణ యోగ్యముకాని విధానములను ప్రక్కన నెట్టవలసియున్నది.  దానిస్థానే సరళము, ప్రకృతి సహజమునై యుండి శారీరక, మానసిక దుర్బలులకు అనగా శక్తిహీనత, అసహనము అల్పాయుష్కులగు నేటి మానవులకు సరిపోవు విధానము ప్రవేశపెట్టవలసియున్నది.  అంతేగాక నేటిమానవుని పెరుగుతున్న పనులవత్తిడి మారిన జీవనవిధానము వల్ల వారు పాత కఠిన నియమ నిబంధనల సాధనలు చేయుటకు సమయము సర్దుబాటుకాని పరిస్థితి ఏర్పడినది.

 

        మనిషికోరుకునే సత్యతత్త్వము వాస్తవానికి చాలా సరళము మరియు అతి సాధారణము.  అసలీకారణముననే అది సామాన్యులకవగాహనకు అందకున్నది.  దానిని అవగాహన చేసుకొనవలెనన్న మనంకూడా అంతే సరళము సాధారణముగా మారవలసియున్నది.  దాని కొరకు మనమెన్నుకొన్న విధానము కూడా అంతే సరళము మరియు సహజమునైయుండుట అత్యంతావశ్యకము.

 

        నేను మరోచోటెక్కడో చెప్పినట్లు ప్రకృతిలోని నిష్కాపట్యము మరియు నిరాడంబరతే దానికొక తెరయైనది.  అంటే అంతటిస్థాయిలోని నిరాడంబరతకు మనచూపు పరిణామముచెందితేనెకాని మనం కేవలం అందులోనికి తొంగిచూడ్డానికి కూడా సాధ్యపడదు.  మనపద్దతిలో అట్టి సామర్థ్యము అభ్యాసి సాధన ఫలితంగాను మరియు గురువుగారి ప్రాణాహుతీప్రసారం ద్వారాను వృద్దిచెందడం మొదలౌతుంది.  దీన్ని సూక్ష్మగ్రాహియైన మనుజుడు బాగా అర్థముచేసుకోగలడు. కానీ మరోవిషయమేమంటే అట్టి సామర్థ్యము నిజమైన అర్హులే పొందివుందురనుట నిశ్చయము.  ప్రస్తుతం పతనావస్థలోనున్న మనిషి విషయంలో కొంత వెసలుబాటు కలిగించి, ఎన్నో విషయాలలో అనర్హూలైనప్పటికి అంతర్గతంగా వారిలో ఆత్మసాక్షాత్కారముపైయున్న తృష్ణను మరియు ఆధ్యాత్మిక సాధనలవైపు వారు చూపుతున్న మొగ్గును గణించి వారికి సైతం అవకాశమివ్వబడింది.  అటువంటివారి విషయంలో వారి నడవడిని సరిదిద్దు అంశమును కూడా శిక్షకుడే చేపట్టి తన అంతర్గత ఇచ్ఛాశక్తి ద్వారా వారిలో అవసరమగు ప్రజ్ఞను సైతం రగిల్చి ఉపకరిస్తాడు.

 

        ఈ అంశమును దృష్టిలో నుంచుకొని గురువర్యులు దయతో మానవజాతి కొరకు ఈ అద్భుతవిధానమును నేటి అవసరములకనుగుణంగా తీర్చిదిద్ది ప్రసాదించిరి.  ఈ పద్దతిలోని అత్యంత విశేషాంశమేమనగా సామాన్య ప్రాపంచిక జీవనమును కొనసాగిస్తూ విధులు, బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రాపంచిక మరియు ఆధ్యాత్మికమను రెండు వైపులు సమాన ప్రకాశవంతముగా వృద్దిపొందడమే.  అంటే కేవలం బోధించడం ప్రచారం చేయడమే మన ఉద్దేశ్యముకారాదు.  వాటిని ఆచరణలోనికి తెచ్చుకొని నిజజీవితములో వాటిని ఉపయోగ పెట్టుకొనవలసియున్నది.

 

***


దక్షిణభారతదేశ ప్రజలకు అద్యక్షుల మొదటి సందేశము

 

ప్రియతములారా!

 

        నేనొక సందేశమును మీకొరకు పంపు అవకాశము కలిగినందులకు అంతర్గతముగా నేను మహదానందపడుచున్నాను.  ఇది చాలా చిన్న సందేశమే కావచ్చు కానీ ప్రేమ, ఆప్యాయతలతో నిండి నా హృదయాంతరాళమునుండి అది పొంగి పొరలివచ్చినది.

 

        కనుమరుగైపోయిన సత్యస్థితిననుభూతి చెందుటకు ఆత్మ ఉత్సాహముననురకలేస్తున్నది. ఈ నిరాధృతుడు స్వేచ్చాయుత మార్గమున ముందుకెళ్ళుటకు సహప్రయాణికులకై ఎదురుచూస్తున్నాడు.  నాసహచరులకై ఈ ఉత్సాహము, కోరిక కేవలము వారు క్షేమముగా గమ్యము చేరుటయందు సహాయము చేయుటకే.  ఈయోచన మీకు చూచుటకు తొలుత అన్యముగా తోచవచ్చును. కానీ కాస్తాయోచించి గమ్యమును చేరుటయందలి సమస్యను పరిగణనలోనికి తీసుకొనిచూస్తే, నీవు విధివక్రీకరించి ఎక్కడనుండి దూరముగా విసరివేయబడితివో ఆ నీ స్వగృహము వైపునకు తిరిగి ఓడప్రయాణము చేయుచున్నావన్న నిర్ణయమునకు తప్పక వస్తావు.

 

        ఎప్పుడైతే మనం "విధి వక్రీకరించి" అను మాట వాడుతున్నామో అప్పుడే మన యోచనాదృక్పథంలో ఒక సమతుల్య లోపము ఊహయందు ఆవిష్కృతమౌచున్నది.  ఎంత కాలము మనలో సమతుల్యస్థితి యుండెనో అంతవరకు మనదైన ఈరూపము మనకులేదు.  ఇప్పుడు మనల్నిమనం అట్టే వికసింపజేసుకొని పోగోట్టుకొన్న సమతను తిరిగి పొందవలసియున్నది.

        మనం "తిరిగి సమతను సంతరించుకొనవలె" అనడం ఎంతతేలికగా కనబడుతున్నది.  నిజమే ఇది తేలికైనపనే కానీ సాధించాలనుకొనేసరికి చాలా కష్టమౌతున్నది.  కారణం అసమతుల్యస్థితిలో మనం చిక్కులను సృష్టించుకున్నాము.  మనమెప్పుడూ దారిని కనుగొనడంలోను, జీవిత సమస్యను పరిష్కరించుకొనడంలోనూ మనదేశంలో ప్రబలంగా వున్న కఠినపద్దతులనే ఆశ్రయిస్తున్నాము.  అందుకే నిరుత్సాహము, ఆందోళనకు లోనౌతున్నాము.  వారు నూనెను  క్రొవ్వినపదార్థమునుండి తీస్తారు.  అంటే వస్తువిజ్ఞానముతో ఉబ్బియున్నవారినుండియని అర్థం.  వారి అణువులు ఎంత జడమైనవైనా వాటిని సైతం ప్రకాశింపజేయగల ఉష్ణరహిత ప్రకాశదాయినీసహితుడగు నిరహంకార ఆధ్యాత్మికుని మాత్రము వారు సంప్రదింపయత్నింపరు.  అందువల్లనే ఈపెనుగులాటలో కష్టము మరింత తీవ్రమగుచున్నది.

 

        సులువైనదానిని పొందుటకు సులువైనపద్దతినే అవలంబించ వలయును.  అహేతుకపిడివాదము ఏ మేలూ చేకూర్చదు.  మూలము వరకుగల దారియంతయు సంపూర్ణముగా అవగాహనలోనున్న మార్గదర్శకుని పర్యవేక్షణలో ఆచరణాత్మకమైన కదలికయే నీగమ్యము వైపునకు ప్రయాణము సుగమముచేయును.

        అతి సులభముగా గమ్యమునకు దారిచూపగల మహాత్ములు భారతదేశమందున్నారు.  అయితే అట్టి మార్గదర్శకుని మాత్రము నీకైనీవే ఎన్నుకొనవలసి యున్నది.  అందుకు మార్గదర్శకుడు సేవానిరతుడై స్వలాభాపేక్షారహితుడై యుండుట లక్షణముగా గ్రహింపుము.  గణించ వలసిన మరొక విషయమేమంటే ఎవరు తన అంతర్గత దివ్యశక్తిని నీలో రగిలించి నీకు దివ్యజ్ఞానము నొసగి నీ కష్టకార్యమును సులభతరము చేయ సమర్థుడో అతడే మార్గదర్శిగానుండ నర్హుడు.  అట్టివాడు దొరుకుటే నిస్సందేహముగా నీ జీవితసమస్యకు పరిష్కారము దొరికినదని గుర్తు.  అన్వేషకులైన మీఅందరికి అట్టి మార్గదర్శకుడు లభించుటకై నేను భగవంతుని ప్రార్థింతును.  భగవంతుడు మీకు మేలు చేయుగాక.

 

        మీ ఆధ్యాత్మికోన్నతికొఱకు ప్రస్తుతము నేను మీకొక గురువును ప్రసాదించమని ప్రార్థించుటొక్కటి తప్ప ఇక మిగిలియున్నది అత్యల్పమని నాభావన.  మీరెల్లరు ఆ పగటి వెలుతురును దర్శింతురుగాక.  ఈ సందేశము నా హృదయాంతరాళమునుండి నా ప్రియతములపైనున్న ప్రేమతో పొంగిపొరలి వచ్చినది.

 

***


సహజమార్గ విధానము

 

        నేను ఈ దినం "సహజమార్గము" లేక "స్వతఃసిద్దమైన సాక్షాత్కారమార్గము" అను పేరుగల మనపద్దతియందలి ముఖ్య లక్షణములను మీ ముందుంచుతున్నాను.  అతి సులభముగా సామాన్యమైన మామూలు జీవనమునకు సరిపడునటువంటి సరళము మరియు సహజమునైన రీతిలో ఈవిధానము కొనసాగును.  ఇది కఠినము ప్రయాసయుక్తము అనగా తపన లేక శరీరమును హింసించు పద్దతులను చేపట్టి మనస్సును, ఇంద్రియములను బలవంతమున వశపరచుకొను విధానములను అనుసరింపదు.  సహజమార్గ విధివిధానములు ఎంత నిరాడంబరమైనవనగా ఈ కారణముననే అది అతిప్రయాసయుక్తమైన జన్మజన్మల, తరతరాల, కఠినాతికఠిన తపన ద్వారామాత్రమే సాధ్యమని నమ్మువారికి సరిగా అర్థము కాకుండాపోయినది.  అనేకమైన తికమకలు కలిగించు ఆలోచనలతో నిండియున్న మనస్సుతో విడదీయరాని చిక్కులతో కూడియున్న పద్దతులననుసరించు వారికి కూడా ఇది అవగాహనకురావడం దుర్లభమే.  వాస్తవానికి మనిషి ఆశించు సత్యతత్త్వము ఎంత సరళమంటే ఆసరళతే దానికి ఒక తెరయైపోయినది.  ఒక సులభమైన పనిని సులభమైన మార్గముననే సాధింప వీలగును.  కనుక సరళమైన దానిని సాక్షాత్కారింప జేసుకొనుటకు ఒకసరళమైన పద్దతే విజయముచేకూర్చునను భరోసానివ్వగలదు.

 

        ఒక సూదిని నేలపైనుండి పైకితీయుట వేళ్ళ సహాయమున చాలా సులభము.  కానీ అదే మీరు ఒక పెద్ద బరువునెత్తు యంత్రసహాయమున ప్రయత్నించిన అసాధ్యమేయైపోవును.  సరిగ్గా భగవత్ సాక్షాత్కార విషయము కూడా ఇంతే.  అతి సూక్ష్మమైన భగవత్ సాక్షాత్కార విషయమున సూచించిన తికమక పద్దతులు క్లిష్ట విధానములు నిరుపయోగములు.  అంతేగాక అవి స్వయంకల్పిత చిక్కులలో జీవితాంతం ఇరుక్కునిపోయేట్లు చేస్తాయి.  నిజానికి సాక్షాత్కారమనునది నరములు, కండరముల బిగుంపుతో పోటీకిదిగు క్రీడ కాదు.  శ్రమ, తపన, మొండిపట్టుదల శారీరక హింసతో కూడిన భౌతిక పోరాటమూ కాదు.  ఇది కేవలము అంతర్గతఆత్మ తన సత్యస్థితికి పరిణామము చెందడము మాత్రమే.  తగని విధమున పైపైన ఏర్పడిన వాటినన్నిటిని గణింపక వాటియెడ నిర్లక్ష్యభావనతో వుండుటే సహజమార్గము అనుసరించు విధానము.  ఈ విధానమున అనుసరించు ధ్యానము కేవలము లాంఛనము, యాంత్రికముగా కళ్ళు మూసుకొనుట కాదు.  వారికి ఒక నిర్దిష్టమగు గురి ఒక ప్రయోజనము మరియు ఉద్దేశ్యము వుంటుంది.  ఇందులో రెండు రీతులు ఏర్పడి ఉన్నాయి.  ఒకటి సాధన రెండవది అభ్యాసి మార్గమధ్యములోని చిక్కులు, చీకాకులు తొలగించి పురోగతిని వేగవంతముచేయు ప్రాణాహుతి ప్రసారము చేయగల గురువర్యులఅండ.  పాత సాధనా విధానములో సాధకుడు మాత్రమే తన మార్గములోని చిక్కులు, అడ్డంకులను తొలగించుకొనుటకు శ్రమపడవలసి వచ్చెడిది.  గురువు పని మాత్రము ఏవో కొన్ని యాంత్రికపద్దతులు ఈ పనికై బోధించుటతోనే ముగిసెడిది.  సహజమార్గ విధానమున అట్లుకాదు.  ఎక్కువ బాధ్యత ఇక్కడ గురువుగారి మీదే యున్నది.  అభ్యాసి మనస్సులోని అడ్డంకులను తొలగించి చిక్కులను విడదీసివేయును.  అందులకు ఆయన తన యోగశక్తి ప్రసారము లేక ప్రాణాహుతిని ప్రయోగించును.

        ఈ పురాతన యోగశక్తి ప్రసారము రాజయోగమునకు ముఖ్యాధారము.  కానీ వాస్తవమున దీని తొలి స్థాపకులైన హిందువులు కాలగమనమున దీన్ని సంపూర్ణముగా పోగొట్టుకున్నారు.  ఇప్పుడు మా గురుదేవులు సమర్థగురు శ్రీరామచంద్రజీ మహరాజ్, ఫతేగఢ్ వారు వారి అద్భుత ప్రతిభాప్రయత్నమువల్ల ఎప్పుడో మరుగునపడిపోయిన ఈ విధానమును పునరుద్దరించి వెలుగునకుతెచ్చిరి. ఈ ప్రక్రియలో గురువు తన అంతర్గతశక్తి సహాయమున అభ్యాసిలో అంతర్గతముగా నిక్షిప్తమైవున్నశక్తిని జాగృతపరచి చైతన్యవంతము గావించి దివ్యధారను హృదయము వైపునకు మరలించును.  అభ్యాసి చేయవలసిన ఒకేఒకపని ఏమంటే తన్నుతాను ఎవరిమనస్సు, ఇంద్రియములు క్రమశిక్షణతో, క్రమబద్దీకరింపబడియున్నవో, అట్టి గురువర్యుల శక్తితో బంధమేర్పరచుకొనుటే.  ఇట్టియెడ గురువుగారిశక్తి అభ్యాసి హృదయములోనికి ప్రవహింప మొదలిడి అతని మానసికప్రవృత్తులను సైతము క్రమబద్దము చేయును.  కానీ దీనికీ పూర్వపు చాదస్త గురుత్వ దృక్పథమునకు ఏమాత్రము సంబంధములేదు.  మనసంస్థలో గురుశిష్యులు సామాన్య సోదరభావముతో మెలగి కేవలము సేవా, త్యాగభావముననే ప్రవర్తించెదరు.  కానీ ఇందొక చిక్కున్నది.  ప్రజలు అద్భుతములు, తళుకుబెళుకు మహిమలు ప్రదర్శించు వారినే సాధారణముగా విశ్వసింతురు.  అట్టి సామర్థ్యము సాధనాఫలితముగా సహజంగానే కలుగుతుంది కానీ, అది ఏ విధంగాను యోగసిద్దిగా పరిగణించటానికి వీలులేదు.  అంతేగాక నిజమైన రాజయోగి వీటిని ప్రచారము నిమిత్తము బయటకు ప్రదర్శించుటకు ఇష్టపడడు.  అద్భుతములు రెండు రకములు.  ఒకటి దివ్యతమములు రెండు వస్తువిషయములు.  మొదటిది భగవదీయ ప్రయోజనములకు, తర్వాతది ప్రాపంచిక ప్రయోజనములకు ఉపయోగపడుతుంది.  సూక్ష్మతతో ముందుకు పోవువానిలో మొదటి తరహా అద్భుతములు జాగృతమై అవి తానెదుర్కొంటున్న జీవితసమస్యలను పరిష్కరిస్తాయి.  జడత్వముతో కొనసాగువారు రెండవతరహా అద్భుతములను గడిస్తారు. అవి హృదయాన్ని అమితంగమండించేస్తాయి.  ఏదో విధంగా ఆ తగ్గుస్థాయికి చెందిన స్థితిలో లీనమైతే అతడు మొత్తమొక ముడిగా మారిపోతాడు.  ఒక రకంగా చెప్పాలంటే అంతరంగమొక సుడిగుండమై దానిలో తనే కూరుకుపోతున్నాడు.  ఒక వేళ అదేశక్తిని ఇతరులపై అతడు ప్రయోగిస్తే వారినికూడా ఆ సుడిగుండంలోనికి గుంజేసుకుంటాడు.  మనసంస్థలో దాదాపు అందరిలోను అద్భుతశక్తి వుంది, కాని జాగ్రత్తగా గమనిస్తున్న గురువర్యులు దాన్ని అదుపుచేసి వుంచారు.  లేకపోతే అదుపుతప్పి తప్పుడు ఖాతాలోనికి పడిపోయే ప్రమాదమున్నది.  అతనికీ విషయము తెలియకుండ వున్నది.  కానీ సరియైన అవసరమే కనుక ఏర్పడితే అది అతని మాధ్యమమున పొటమరించి తీరుతుంది.  ఆధ్యాత్మిక సహాయము మరియు అండగానుండుట కొరకు మన గురువు వంటి గురువు అవసరము.  అంతేగానీ గురువులు చిత్రవిచిత్రమైన అద్భుతములు చూపడమో లేక ఆసన ప్రాణాయామానికి సంబంధించి కసరత్తులు చేసిచూపడమో లేక మాయా, జీవుడు, బ్రహ్మము వంటి వేదాంత విషయములపై నేర్పుతో సంభాషించడమో కాదు. వారు వారి అంతర్గతశక్తి నుపయోగించి ఆచరణలో మనకేర్పడిన సమస్యలను పరిష్కరించి మార్గమున అడ్డంకులను తొలగించివేయగలట్టి శక్తిమంతులై యుండవలెను.  అదృష్టవశాత్తు నీవు ఒక మహనీయుని కనుగొని అతని సహవాసప్రభావము నీలో శాంతినిశ్చలతలు నెలకొల్పి నీమానసిక అలజడిని సద్దుమణిగింప జేసినట్లయిన, అతడు తన ఇంద్రియ పరిమితుల నధిగమించినవాడని ఆతని అంతర్గతశక్తితో నీజీవిత సమస్యాపరిష్కారమున తప్పక సహాయపడగలడని అర్థము చేసుకొనవలెను.  ప్రేమ, భక్తి ప్రపత్తులతో ఆయనతో సంబంధమేర్పరచుకొన్నచో నీవు కూడా ఆయనవలె పరిణితి జెంద నారంభింతువు.

        మనసంస్థలో సర్వ సాధారణముగా హృదయముపై ధ్యానము చేయుటనే ఆచరిస్తాము.  ఇదే విధానమునే పతంజలి కూడా ఆచరించమనెను.  దీని మూలసిద్దాంతమును ముందే "రాజయోగప్రభావము" న చర్చించియుంటిని.  అది మరలా ఇక్కడ చర్చించదలచుకోలేదు.  ఈ ప్రక్రియ మనలోని స్థూలత్వాన్ని బయటకు నెట్టివైచి అత్యంతసూక్ష్మతను పొందడానికి ఎంతగానో తోడ్పడుతుంది.  భగవంతుడు సంపూర్ణముగా జడరహితుడని మనమెఱుగుదుము.  కనుక, భగవత్ సాక్షాత్కారమంటే అత్యంత సూక్ష్మస్థితికి  అనగా సాధ్యమైనంత చిట్టచివరిదశకు చేరుకోవడమని అర్థము.  దీన్నే మనం సహజమార్గంలో గమ్యముగా వుంచుకొంటాము.  అభ్యాసి తనచుట్టూ పొరల రూపమున పేరుకుపోయిన స్థూలత్వమునుండి విడిపించుకొనుటకు ఈ పద్దతి సహాయపడును.

 

        సహజమార్గపు పనితీరు సులభమైనప్పటికి తరచు ఇది సామాన్యబుద్దికందనిది.  కారణము అది సంపూర్ణసత్యతత్త్వమునకు అత్యంత సమీపమున అనుసంధింపబడియుండి సూక్ష్మదారులలో ముందుకు సాగుచున్నది.  హృదయమున ఈశ్వరీయప్రకాశముగలదను భావముతో హృదయముపై ధ్యానముచేయుటను ఈ మార్గము నిబంధించియున్నది.  కానీ అభ్యాసిని ఏ రూపము, ఆకారములోను ఆ ప్రకాశమును చూడమని నిర్దేశించుటలేదు.  ఒకవేళ అలాచేసి ప్రకాశమును చూడగలిగిన యెడల అది నిజమైనదికానేరదు.  అది కేవలము అతనిమనస్సు కల్పించి చూపినది మాత్రమే. కనుక అభ్యాసి దానిని కేవల వూహామాత్రముగానే గైకొనమని సూచింపబడినది.  అట్టియెడ అది బహుసూక్ష్మమైనది, కనుక మనం బహుసూక్ష్మమైన దానిమీదనే ధ్యానము చేయుచున్నాము.  ప్రతి మహాత్ముడు దానిని వ్యక్తీకరించుకొనుటకు వెలుగు అనుపదమునే వాడెను.  నాకును అంతకంటే గత్యంతరము లేదు.  ఎందుకంటే ఈ కార్యనిర్వహణమున భావవ్యక్తీకరణకు అదే బాగా అతికిన పదము.  కానీ అది కొన్ని చిక్కులను కల్పించుచున్నది. ఎట్లన్న మనము వెలుగు అనినంతనే దానికి సంబంధించిన మెఱుపు, ప్రకాశము ప్రాధాన్యత సంతరించుకొనును.  దాన్ని మనం తళుకుగా స్వీకరించడం ప్రారంభిస్తాం.  నిజమైన వెలుగు అట్టిభావముతో లేదు.  దాన్ని మనం ప్రకాశరహితవెలుగు అని సూచించవచ్చును. అది అసలు సత్యపదార్థమును సూచించును.  మరింత విశదపరచవలెనన్న అది వెలుగుకాదు చీకటికాదు.  అది రెండింటికి అతీతమైనది.

 

        మనపద్దతిననుసరించు అభ్యాసి కూడా ఒకోసారి వెలుగును నిస్సందేహంగా చూస్తాడు.  కానీ అది కేవలం ఆరంభంమాత్రమే.  పదార్థం శక్తితో ఢీకొన్నప్పుడట్లు జరుగుతుంది.  మరో మాటలో చెప్పాలంటే అది శక్తి పని ప్రారంభించిందనడానికి సంకేతము.  అయినా వెలుగు మన లక్ష్యము కాదు.  కనుక వెలుగు బయటగానీ, లోపలగానీ కనబడటం భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి ప్రాతిపదిక కానేకాదు.

 

        సహజమార్గవిధానమున నిద్రాణమైయున్న కేంద్ర మరియు ఉపకేంద్రశక్తులు సక్రమముగా పనిచేయునట్లు మేల్కొల్పబడును.  ఎప్పుడైతే పైకేంద్రములు మేల్కొల్పబడినవో అవి క్రిందికేంద్రములపై తమ ప్రభావమును చూపమొదలిడును.  పైకేంద్రములు దివ్యత్వముతో బంధమేర్పరచుకొన్నంతనే క్రిందివి పైవానిలో లీనమై పోవును. ఆ విధంగా పైకేంద్రములు క్రిందికేంద్రముల బాధ్యత కూడా స్వీకరించుచున్నవి.  క్రిందికేంద్రములు సైతము శుద్దిగావింపబడడంద్వారా వాటిపై క్రమ్మిన స్థూలత్వమునుండి విడుదల పొందుచున్నవి.  అత్యున్నతఫలితముల నిచ్చునట్టిది మాత్రమే సరియైన మరియు అతి సహజమైన ప్రక్రియ.

 

        ఒక్క విషయమై నేను ప్రత్యేకముగా నొక్కివక్కాణించుచున్నాను.  అది ఏమంటే అభ్యాసి గమ్యమును సాక్షాత్కరింపజేసుకొనుటకు అశాంతిమయ ఆతురత లేక విపరీత ప్రాధాన్యత రేకెత్తించునటువంటి తీవ్రఆకాంక్షను అలవడజేసుకోవడమే.  ఇటువంటి బాధాతప్తత లేక ఆతురత ఎట్లనుకున్నప్పటికిని దానిని ఉత్పన్నము చేసుకొని తద్వారా సులభవిజయమును నిర్ధారించుకొనవలెను. కానీ బాధ, ఆతురత పొందక, శాంతి ప్రశాంతతలకొరకై ఆధ్యాత్మికరంగమున అడుగిడితినని చెప్పువారుందురేమోనని నాభయము.  అది వారి దృక్పథమున సరియైనదే కావచ్చును.  కానీ నా దృక్పథము ప్రకారము మొదటిది తమ దృష్టిని దివ్యత్వముపై నిలిపిన వారికొరకు మరి తర్వాతిది మత్తులోని ఆనందమును ఆస్వాదించు వారికొరకని చెప్పవచ్చును.  తర్వాతిది ఏమైనప్పటికిని సాధించుట అంత కష్టమైనదికాదు కానీ మొదటిది సాధించుట మాత్రము చిన్నపిల్లలాటకాదు.  చాలామందికి శాంతియొక్క రుచి ఏమిటో తెలియును.  ఇక మొదటి దానిరుచిచూతము.  దాని రవంత రుచి కోసము వేయి శాంతి మరియు ప్రశాంతతాస్థితులను వదిలి పెట్టవచ్చును.  ఇది నిజానికి అరుదైన అవతారపురుషులను ఈ ప్రపంచమునకు తేగల్గిన సంపూర్ణ నిర్మాణమునకు ఆధారము.  నిజమైన శాంతిస్థితి వాస్తవమున దురూహ్యము.  అది ఏ వైరుధ్య భావములను అనుమతింపదు.  ఇది శబ్దార్థమునుబట్టి పరిశీలించితే శాంతి కాదు అలజడి కాదు.  కలయిక కాదు ఎడబాటు కాదు.  ఆనందమూ కాదు తద్విరుద్ధము కాదు.  ఇంతకూ దీని కోసమే బాధ రగుల్పజేసుకొంటిమి.  మీరందరూ బాధయొక్క రుచిని ఆస్వాదింతురు గాక.  దీనిని ఉత్పన్నము జేసుకొనుట అట్టే కష్టముకాదు.  దృఢనిశ్చయము, భిన్నముకాని శ్రద్ధ ఈపనికి అవసరములు.  అప్పుడు నీవు వెతుకుతున్నది నీకు అతిసమీపముననే దర్శనమిస్తుంది. బహుశః నీవు వెతుకుతున్నది నిన్నేనేమో.  అందుకు దారిలోని కంప, చెత్తనంతటిని దహించివేయగల మండుతున్న హృదయముండవలెను.

 

***


భగవత్ సాక్షాత్కారమునకు సులభ మార్గము

       

ప్రియతములారా!

 

        మానవులపై అంతరాంతరాళములో నాకు గల అనుబంధము కారణమున నేను నాహృదయానుభూతులను నాలోని అంగములే అయియున్న నాసహచరుల హృదయముల నుండి బుగ్గ (ఊట) పుట్టించి శాంతి, ఆనందములతో ప్రతి హృదయము పొంగిపొరలి వెల్లువగునట్లు చేసితిని.  నా హృదయము మీతో అనుసంధింపబడి అనతికాలంలోనే ఇక్కడేకాదు ఎక్కడున్నా నిరంతర నిశ్శబ్దంతో హృదయముల ప్రభావితముచేయు తరంగములనుత్పాదించగలదు.  కానీ అంతిమ సత్య సాక్షాత్కారము కొరకు జీవించియున్న ప్రతి ఆత్మ ఆధ్యాత్మికావసరములకు తగినట్లు జాగృతమై యుండవలెను.

 

        ఏదో ఒక రూపమున మతసారాంశము ఎల్లవేళల ప్రవహిస్తూనేవున్న దేశమునకు మనము చెందియున్నాము.  భిన్నమైన పద్దతులను మనము జీవితలక్ష్యసాధనకు చేబడుతున్నాము.  నిజమైన జీవిత సారము నందు లీనమగుటకు హృదయము వాస్తవార్థమున దానికై అనుసంధింపబడివుంటే అది సరియైనదే.  మనము ఏ సత్యతత్త్వమునుండి వెలువడితిమో దానితో కలసిపోవుటకే పోషింపబడుతున్నాము. మనము ఆ అనంతతత్త్వసారమును వెంటతెచ్చుకున్నాము.  దానికి మనం దగ్గరగావుండుటకు ప్రయత్నింపవలెను.  తద్వారా అనంతంలో ఐక్యమగుటకు యోచనలకు స్వేచ్చనీయవలెను.  దీన్ని నిర్లక్ష్యంచేస్తే మూలమందున్న ఆ హద్దులెరగని ఆ సత్యతత్త్వమును వదలి ఆలోచనా కార్యకలాపములందే బంధీలైపోవుదుము.  అత్యావశ్యక గుణయుతమగు నిజమైనసారమును గ్రోలుటకు నోరులేనివాడు సర్వసాధారణముగా నివేదించుకొను కీర్తనలు, ప్రార్థనలు కేవలం పొగడ్తలగానే మిగిలిపోతాయి.

 

        ఉత్తమోత్తములైన బోధకులెప్పుడూ అందుబాటులో ఒక పరిష్కారంవున్నా చైతన్యవంతమైన తెగింపులో విభిన్నమైన రీతిలో మహోన్నతస్థితిని సమీపించు యత్నంచేస్తుంటారు.  వాస్తవానికి నీకు అత్యంత సమీపంలోవున్న మార్గమే భగవంతునికి చాల దగ్గరిదారి.  మాపూజ్య గురువర్యులైన సమర్థగురు శ్రీ రామచంద్రజీ మహరాజ్, ఫతేగఢ్ వారు జీవితపరమార్థాన్ని పొందుటకు అతిసులువైన మార్గాన్ని ఏర్పాటుచేసి మానవాళికి అద్భుతమైన సేవలందించారు.  ఆయన పద్దతులు ఎంత సులభమైనవంటే ఆ సులభతయే వాటిని సామాన్యుడు అర్థము చేసుకొనుటకు అడ్డంకియైన తెరగామారినది.  సులభము మరియు సూక్ష్మమైన పద్దతులే సూక్ష్మాతిసూక్ష్మమైన దానిని తెలుసుకొనుటకవసరమగును.  సాక్షాత్కారము అత్యంత కష్టమైన చిక్కులమయమగు కర్తవ్యమని వ్యక్తపరచిరి.  ఇది జనులను నిరుత్సాహపరచి వారిని దానికి దూరమగునట్లు చేసినది.  అటువంటి యోచనలను మనస్సునుండి తొలగించి వేయవలెను.  కారణం మనల్ని ముందుకు నడిపించే సాధనమైన ప్రోత్సాహక ఇచ్ఛను అది బలహీనపరచును.

 

        నా వ్యక్తిగత అనుభవమునాధారము చేసుకొని నేను ఒక సులభమైనప్రక్రియను సూచిస్తున్నాను.  అది అందరూ అతిసులభంగా అనుసరించగల్గుదురు.  ఎవరైనా తన హృదయమును విక్రయించేస్తే అనగా దివ్యగురుదేవులకు కాన్కగా అర్పిస్తే ఇక చేయడానికి ఏమీ మిగిలి యుండదు.  ఇది సహజంగా అనంతసత్యంలో లీనమయ్యేస్థితిని కలిగిస్తుంది.  ఈ సులభము మరియు సరళమునైన పద్దతి కీలెరింగి యనుసరించిన యెడల ప్రక్రియ ఆరంభమునే పరిసమాప్తముగా మార్చివేయును.  ప్రేరణాతరంగములు వాటికవే లోనికి ప్రవేశించ మొదలై వ్యక్తిగతంగా మనిషి ఉనికి మొత్తమును మార్పునకు గురిచేయును.  అత్యంత ప్రియమైన జీవితపరమార్థమును పొందుటకు నీ చిన్నహృదయము దక్క సమర్పించుటకు మరేమి తగియున్నది?

 

        మరొక్క విషయము.  అతి సులువైనరీతిన హృదయసమర్పణం గావించుటకు కావలసినది ఒక చైతన్యవంతమైన ఇచ్ఛ మాత్రమే.  అయితే ఆ ఇచ్ఛా, అంగీకారము ఎంత తేలిక సున్నితముగా వుంటుందో అంత ప్రతిభావంతంగా దాని పనితీరు వుంటుంది.  పరిమాణమున అతి చిన్నదై బీజరూపమున ఎఱుకయొక్క అంతరాంతరాళమున నిక్షిప్తమైవున్న చైతన్యసహితమగు ఇచ్ఛ మొలకెత్తి సంపూర్ణ వృక్షముగా తనకొమ్మలను అన్నివైపులకు సాచి వృద్దిచెందవలసి వుంది.

        ఆఖరుగా ఒకమాట.  ఈ పద్దతిననుసరించడంవల్ల తొలినాటి నుంచే వైరాగ్య భావమును తప్పక పెంపొందిస్తుంది.  ఈప్రయోజనమునకై ఒక సాహసోపేతమైన ప్రారంభము ఆవశ్యకమైయున్నది.  నిజమైన అన్వేషకుడు వెలుగును గమనించి ఆత్మయొక్క పిలుపునకు మేల్కొనుగాక.

 

        సత్యజీవనమునకై సమస్తజీవులందు అంతర్గతజాగృతి కలుగవలెనని నేనుప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను --- తదాస్తు!

(15-12-1957 న ఏడాది ఉత్సవ సందర్భంగా అద్యక్షులు గుల్బర్గా కేంద్రమున ప్రవచించి ఇచ్చిన సందేశము)

 

***
సహజమార్గ ప్రభావము

 

        మనలో చాలామంది ఆతురతలో సాక్షాత్కారము మరియు స్వేచ్ఛ కొరకు అధికాధికముగా ఆశపడుతూవున్నారు.  అది ఒకకర్తవ్యముగా భావిస్తున్నాము.  అయితే కర్తవ్యమను మాటకొస్తే మనల్నిమనం ఒకవిధమగు పరిమితికిలోబడి వుంచుకొంటున్నాము.  ఏమిటా పరిమితి?  అది కేవలమొకసంకుచిత ఆలోచన మరియు జ్ఞానపరిధి.  మన ప్రస్తుత స్థాయినుండిచూస్తే అది మనం అధిగమించలేని స్థితి.  ఇప్పుడున్నది విశాలదృష్టిని సంతరించుకొను నిమిత్తం ముందుకు సాగుటకు సిద్దపడుచున్న పరిమిత స్థానము.  విశాలదృష్టి అంటే సంపూర్ణ సత్యదృష్టియని నాఅర్థము.  అది ముఖ్యముగా దాని కొరకు ప్రయోగించు పద్దతులు, మార్గములపై ఆధారపడియుండును.  ఒకవేళ మనం హద్దులు మరియు బంధనములకు తగుల్కొను పద్దతిలో పడిపోయామంటే మనం ఇక సత్యతత్త్వమునకు, అదే పరిపూర్ణతా దర్శనమునకు దూరముగనే ఉండిపోదుము.

 

        ప్రత్యేకముగా ఒకొక్క మనస్తత్త్వమునకు సరిపడు వేరువేరు పద్దతులుండవచ్చును.  కానీ అవి ముందే తప్పులతడకలై కూడా వుండవచ్చు, లేక కావలసినంత సమర్థతలేనివై వుండవచ్చును.  అవి పిల్లలచేతి ఆటవస్తువులవలె ఆడుకొనుటకూ తాత్కాలికముగా జోకొట్టి ఉపశమింపజేయునవిగాను వుండి మనల్ని భోగలాలసతలకొరకు ప్రాకులాడునట్లుచేయునవియై ఉండవచ్చును.  బహుఃశ వాటిలోని ఆకర్షణలు మనలను ఆ భోగానందానుభవములను సమకూర్చు దారికి చేర్చవచ్చును.  కానీ ఎంతకాలము ఆకర్షణలకు కట్టుబడియుందుమో అంతదనుక పురోభివృద్ది గడ్డకట్టిపోయి ముందుకుసాగదు.  అట్టివానిని సరిగ్గా బావిలోనికప్పతో పోల్చవచ్చును.  అది తన సంకుచిత పరిధినే పూర్తి విశ్వమనుకొనును.  కానీ యిప్పటి మనస్థాయిలోనే లోలోపల అనంతతత్త్వమునకు సంబంధించిన ఉన్నత ఆహ్లాదపు ఎఱుకకు చైతన్యపరచబడితిమేని మనము అనంతతత్త్వములోనికి మరింత ముందుకు వెళుతున్నభావము మనలో మేల్కొల్పబడును.  ప్రతిగింజెత్తు జ్ఞానమునకు కనీసము పదిరెట్లు అధికమైన వివేకము కావలసియున్నదని తెలియజేయబడింది.  అంతమాత్రమైనా వివేకముంటేనే మన గమ్యము మనదృష్టికందుబాటులో వుండి మనము అంతకంతకు చైతన్య పరుపబడి సత్యతత్త్వపు పరిధిలోనికి సాగిపోదుము.  అయితే నేనే నాపురొభివృద్దికి కావలసినంత శక్తిసంపన్నుడను అను భావముతో స్థబ్దతకులోనైపోయిన యెడల చిక్కులుత్పన్నమగును.  అట్టియెడ స్వేచ్ఛాభావము అస్సలు మనస్సున మొలకెత్తదు.  అది నిజంగా మన దురదృష్టకరమైన స్వంతగాథ.  అట్టివారు ఎప్పుడూ  వారి ఆలోచనలకు వారే బలైపోతుంటారు.  వారిఆలోచనలు పొరలమీదపొరలను జమచేసి యోచనలను, ఆచరణను కప్పివేస్తాయి.  చెప్పాలంటే వారినివారు కఠినమైన వైఖరికి మార్చుకొని, వారి పద్దతి తప్ప వారిని ఆ చిక్కులవలనుండి బయటకు తప్పింపగల ఏపద్దతి సూచించినా, వినరుగాకవినరు.

 

        తొలుత దేనితో మొదలిడితిమో అదే సరైనదారిలో మనం పురోగమించుటకు అడ్డమైపోతుంది.  వాస్తవానికి మానవాత్మ పురోగమించటానికి ఏఅభ్యంతరము లేదు.  కారణం మనం తుదకు అనంతంలో ప్రవేశించేతీరాలి.  ఏదోవిధంగా ఏదో ఒకపద్దతిలో మన అంతిమగమ్యాన్ని తొలుతే గుర్తించి చేపట్టిన మార్గముననుసరిస్తేనే సరియైనపంథాలో సాగిపోతుంది.  మనలను వస్తుదృష్టిరహిత పూర్ణతత్త్వపు దర్శనం కలిగించు, సత్పథమున గొంపోగల గురువును ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు. అట్లుగాక సత్యత్త్వపుభావనను గ్రహించక చేపట్టిన పద్దతులు, విధానములు కార్యసాధనమునకు ప్రతిబంధకములై పురోగతిని ఆటంకపరుస్తాయి.  తప్పనిసరి విజయమునకు కావలసిన ఒకేఒక విషయము లక్ష్యసాధన కొఱకు తీవ్రమైన ఆతురత (అశాంతి). అదే సద్గురువును నీవాకిటికడకు తీసుకువస్తుంది.

 

        సత్యతత్త్వములోనికి కనీసము తొంగిచూడవలెనన్న ఆశగల వారికి, నా అభిప్రాయము ప్రకారము సరియైన మార్గము హృదయాంతరాంతరాళమును తాకునదై యుండవలెను.  సామాన్యముగా కార్యసాధనకు అనుసరింపబడు బాహ్య పద్దతులు బొత్తిగా నిరుపయోగములు.  అవి గమ్యము వైపునకు గొంపోవు.

 

        సరైన పద్దతులను కనుగొనవలెనన్నచో మనం ఈసమస్తసృష్టి ఏర్పడుటకు కారణభూతమైన దానిని గుర్తించవలసి యున్నది. ఖచ్చితముగా ఈ కార్యమునకు ఒకానొకశక్తి పనిచేయుచున్నది. అది ఏమిటి?  అది సృష్టి గావింపబడవలెననియేగాక దాని వెనుక వైపున దాని సంరక్షణము, వినాశముకూడా నిక్షిప్తమైయున్న పూర్ణభావగర్భిత సంకల్పమే.  ఆ సంకల్పశక్తియే దిగి మనిషిలోనికి ప్రవేశించి అతని ఉనికిలో ఉనికియైపోయినది.  ఈ శక్తిని అంతర్గతంగా మనం సక్రమంగా సద్వినియోగపరచుకుంటే రహస్యం తేటతెల్లమౌతుంది.  ఆలోచనకూ అదే బలముంది.  కానీ అది అంతరంగంలో మానవుని పరిమితికి లోబడివుంది.  అది నిక్షిప్తశక్తిగావుండి మనం పురోగమించేకొద్ది వృద్దిచెందుతూ వుంటుంది.  అది మన ఉనికికి సంబంధించిన వివిధ పరిధులు, స్థానములను చేరివుంటుంది.  అవన్నీ మనం గమ్యంవైపుకు పయనించే సమయంలో దాటవలసివుంటుంది.  వీటిని బంధాలని అంటాం.  ఇవి సత్యతత్త్వంలోనికి కనీసం తొంగిచూడటానికి కూడా వీలులేకుండా చేసే తెరలుగా వుంటాయి.  కేవలం ఒకశక్తిమంతుడగు సమర్థగురువు మన సహాయార్థం తారసపడినప్పుడు మాత్రమే ఆ తెరలను ఛేదించుకొని ఆ సంపూర్ణసత్యతత్త్వమునకు మనదారి సులభముగాను మరియు అనువుగాను చేసుకొనగల్గుదుము.  తొలిస్థాయిలో చక్రములు, కేంద్రములు, ఉపకేంద్రములు కూడా మనప్రగతిని అడ్డుకుంటాయి.  మనం వాటిని దాటుకొని సత్యత్త్వపు అన్వేషణలో ముందుకు సాగవలసి వుంటుంది.  మన తప్పుడు యోచనలు, ఆచరణల ప్రభావంవల్ల కూడా కొన్ని చిక్కులు ఉత్పన్నమౌతాయి.  వాటిని మనం శుద్దీకరణప్రక్రియ ద్వారా తొలగించుకోవలసి వుంటుంది.

 

        ఒక్కముక్కలో చెప్పాలంటే ఎవరైతే దారిమొత్తము తను ప్రయాణించి తనలో భగవదీయశక్తులను ఉత్పన్నము చేసుకున్నారో అట్టి గురువర్యుల సహాయము అత్యంత విలువైనది.  అప్పుడు మాత్రమే దైవీయశక్తి దివ్యకేంద్రములనుండి అభ్యాసిలోనికి ప్రవహించడం మొదలౌతుంది.  ఈ సూక్ష్మశక్తి మహాశక్తివంతమై ఉత్తమ స్థాయిలలో ఒకవేళ అభ్యాసి పైకిప్రాకటానికి ప్రయత్నించినా అతడు ఈశక్తివంతమైన ప్రవాహధాటికి క్రిందికి నెట్టబడతాడు.  అటువంటి సమయాలలో గురువుగారి చైతన్యశక్తి అతన్ని అడ్డగిస్తున్న ప్రవాహశక్తిని ఎదిరించి పైకిలాగి సత్యతత్త్వము అతని దృష్టిపథమున నిలుచునట్లు చేస్తుంది.

 

        అయినప్పటికిని అభ్యాసికి కూడా ఒక్కింత అత్యావశ్యక కర్తవ్యమున్నది.  ప్రప్రధమంగా అతనికి గురువుగారిపైన సంపూర్ణ విశ్వాసము గలిగి అతడు ప్రతివిషయములోను సంపూర్ణ సహకారము నివ్వవలయును.  అటువంటప్పుడు అతడు నేరుగా దినదినాభివృద్ది చెందుతూ తనలోతాను మార్పుచెందినట్లు, పరిణతి చెందినట్లు గ్రహించును.  క్రిందిస్థాయి నుండి జాగృతమైన ఎఱుకగలిగి పరిణతి జెందుతూ అతని ప్రయాణము ఉన్నతోన్నతస్థాయి ఎఱుక ద్వారా ముందుకు కొనసాగును.  మామూలుగా ఈ ఎఱుక మూడు స్థాయిలలో వుంటుందని చెప్పబడింది.  అవి ఎఱుక, అంతర్గతఎఱుక, అతీంద్రియఎఱుక.  ఇవికూడా పెద్ద విభాగములే.  ఒక్కొక్కదానిక్రింద ఇంకా చాలా స్థాయిలున్నవి.  క్రిందిస్థాయి ఎఱుకయొక్క కార్యకలాపముల ప్రభావము అంతర్గతచైతన్యమానసముపై స్థానమేర్పరచుకొని వాని విధివ్రాతగా ఏర్పడును.  మొదటగా చేపట్టవలసిన అంశమేమనగా సరియైన యోచన, ఆచరణద్వారా క్రిందిఎఱుకను సరిదిద్దవలెను. తద్వారా తనకుతానే శక్తిగా మారిపోయి, అంతర్గత మానసమును కాంతివంతమైన స్థితికి గొనితెచ్చును.  అది, తదనంతరము అతీంద్రియస్థితికి చేర్చును.  ఈ అతీంద్రియస్థితి అను పదమును అంతరంతరంగస్థితియని మారిస్తే దీని తదనంతరచర్యలు అర్థము చేసుకోవడం సులువౌతుంది. ఎట్లో గురువుగారి కృపవల్ల ఇంతవరకువస్తే, వేరొక సంగతి మనకొరకు తెరచుకుంటుంది. ఇంతకంటే ఉన్నతమైనస్థితులు మనదృష్టికి రావడం కోసం ఈ స్థితిలో మనం ఒకవిధంగా లీనమవ్వాలి.  ఉన్నతం అన్న పదం ఆస్థితియొక్క ప్రత్యేకతను తెలుపుతుంది.  అదే అర్థంలో అది మనం నిర్ధారించుకొనియున్న ఆధ్యాత్మికస్థాయి మరియు పరిధులకు అన్వయిస్తుంది.  సంక్షిప్తంగా చెప్పాలంటే అనేకములైన చైతన్యస్థితులను ఒకదాని తర్వాత ఒకటిగా మనలను దాటించుతూ త్రిమూర్తిత్వమునకు ఆవలికి ఇంకాచెప్పాలంటే సత్యతత్త్వాన్ని సైతం అధిగమించి ముందుకు తీసుకెళుతుంది.  అప్పుడు స్వేచ్ఛాస్థితి ప్రారంభమౌతుంది అయితే ఇదంతా బాగా శ్రమతోగూడిన ప్రయాణానంతరమే.  ఎప్పుడైతే  స్వేచ్ఛ ఉదయిస్తుందో అంతటితో ప్రయాణపు అలసట మాయమౌతుంది.  మనం ఇక దాని భారాన్ని మరచిపోతాము.

 

        అయినా ప్రయాణమింకను పూర్తికాలేదు.  ఎక్కడ సాక్ష్త్కారము తన నిజస్వరూపాన్ని దాలుస్తుందో ఆ మూలందాకా మనం మున్ముందుకు సాగుతాం.  రంగుల దృశ్యములు తొలగిపోయి ఆ పూర్ణత్వపు నిజతత్త్వం మనముందు నిలుస్తుంది.  అయినా మన ప్రయాణమేమో ఇంకా పూర్తికాలేదు.  వివరణకందనిదేదో ఇంకా వుండనేవుంది.  మన ప్రయాణం అంతంకావచ్చినా స్వేచ్ఛాభావన ఇంకావుంది.  అది ఎంతదాకావుందో అంతదాకా ఇంకా బంధమున్నట్లే.  ఒక్క భగవంతుని సహాయమే మనల్ని తనతో ముందుకు తీసుకెళ్ళుతుంది.  కానీ మనం ఎప్పుడు సంపూర్ణమైన మఱుపు స్థితిలోనికెళతామో అప్పుడే అది సాధ్యం.  ఈ అర్థంతోనే నేను ప్రజలకు "మిమ్మల్ని మీరు తెలుసుకోవడంకంటే మిమ్మల్ని మీరు మరచిపోండి" అని ఉద్భోదించటానికి ఇష్టపడతాను.

 

        నిజమైన ఆత్మార్పణస్థితిలోనే సద్భక్తుడు గురుని కృపయను సూర్యరశ్మిలో చలి కాచుకుంటూ తన్నుతాను ఆ భగవంతుని, ఆ గురువర్యుని ఇచ్ఛకు సంపూర్ణముగా సమర్పించుకుంటాడు.  అదీ గురుశిష్యుల బాంధవ్యము.  అదే కడవరకు కొనసాగవలసి యున్నది.  కారణం ఆ బాంధవ్యమే తుదకు అత్యంతోన్నతమైన అతీంద్రియస్థితివరకు మనలను చేరుస్తుంది.  మన నిజమైన ఉనికియొక్క యోగ్యత అక్కడ మాత్రమే వ్యక్తమౌతుంది.  ఇంకా స్వేచ్ఛ అన్న భావము తగులుకొనివుంటే లేదా అట్టి భావము మరే విధంగావున్నా అతని సంకెళ్ళు ఇంకా విప్పబడలేదనే అర్థము.  స్వేచ్ఛకు సంబంధించిన ఎఱుక కుడా వదలిపోతే అప్పుడతను అద్భుతభావనలో తన్నుతాను కోల్పోతాడు.  అక్కడ సత్యతత్త్వపు భావన కూడా వుండదు. అతను అనంతతత్త్వములో అడుగిడినట్లు కూడా తలంచడు.  ఆస్థితిని ఏమని వర్ణింతుము? తాము మొత్తం అందులో ఐక్యమైపోతిమా లేక ఆఅనంతమే మొత్తం తమలో గ్రుమ్మరింపబడెనా?  ఎట్లయిననూ వర్ణించవచ్చును.  ఎప్పుడు సర్వం కరిగిపోతుందో అప్పుడు తానెక్కడా కనబడడు.  బ్రహ్మంలో లీనమవడం ప్రారంభమౌతుంది.  అయినా మనం మానవులకై నిర్ణయింపబడిన తుది స్థాయినందుకోవడానికి ముందుకు చొచ్చుకొని వెళుతూనే వుంటాము.

        సహజమార్గము తప్ప మరొక సాధనకాని పూజా విధానముకానీ అట్టి మహోన్నత ఫలితములను అతి తక్కువ సమయములో, అదీ మానవజీవిత కాలములోని కొంత కాలములోనే సుసాధ్యము గావింపలేవని నేను ప్రస్ఫుటముగా మనసులోని భావమును నొక్కివక్కాణిస్తున్నాను.  అదీ సహజమార్గము యొక్క స్థాయి.

 

***

 

యాచకుని బిక్షాపాత్ర

 

        "సాధకుడు వాస్తవమునకొక యాచకుడే కానీ అతడు మహా దివ్యసంపన్నుడైన గురువర్యుని వాకిలికడ మాత్రమే బిక్ష నర్థించును.  అతడు తన బిక్షాపాత్రను చేతబట్టుకొని ఆయన ద్వారముకడ నిలుచున్నాడేకానీ ఏమియాచించుటకరుదెంచినాడో కూడా తెలియని ఎఱుక తప్పిన స్థితిలోనున్నాడు.  యాచకుడు, యజమాని ఇద్దరూ అక్కడే ఉన్నారు.  వారిద్దరి మధ్యన ఒకేఒక తేడా వున్నది.  అది యాచకుని చేతిలో బిక్షపాత్ర వుండుట మాత్రమే.  అతడు కడదాక తనస్థితిని అట్టే నిలుపుకొనియున్నాడు."

 

ఫకీరు సంపద

 

        సాధువుచెంత ఏసంపదకలదు.  బాహ్యముగా అతనివద్దగల ప్రాపంచిక వస్తుసముదాయమునుబట్టి చూస్తే అతడొక యాచకునికంటే మేలుగా లేడు.  నిజమే అతడు యాచకుడే.  అయితే అతడు కేవలం మహాత్ముడైన దివ్యప్రభువు గడప దగ్గర మాత్రమే యాచిస్తాడు.  అతడు తన బిక్షాపాత్రను చేతబట్టుకొని ఆయన ద్వారముకడ నిలబడియున్నాడు కానీ తాను ఏమి యాచించదలచాడో కూడా తెలియని ఎఱుకదప్పిన స్థితిలో వున్నాడు.  ఆరీతియాచకుడతడు.

 

        అతడెట్టి మానసిక స్థితియందున్నాడో లోతుగా పరిశీలిద్దాం.  అతడు ప్రభువుచెంతకు దానము పరిగ్రహించుటకే యాచకుడై వచ్చిచేరినాడు.  కానీ అతడు ఎంతగా ఎఱుక దప్పియున్నాడనగా అసలతడు తన బిక్షాపాత్ర నింపుకోవడానికి అక్కడికి చేరుకున్నానన్న సంగతికూడా అతనికి జ్ఞాపకములేదు.  బిక్షాపాత్ర ముందుకు చాచియున్నాడు కానీ దేహీయన్న పలుకు కూడా లేదు.  అంతేగాదు అతడు తానెవరి ముందు నిలుచున్నాడో కూడా అతనికి తెలియడం లేదు.  అక్కడి వైభవమును వికాసవంతము చేయు కొసమెఱుపు కూడా అంతరించిన ఆప్రదేశమునకతడంతగా తన్నుతాను మరచిపోయి పిచ్చిగా లోపలకు నెట్టుకొనివచ్చి చేరినాడు.  బిక్షాపాత్రను పట్టుకొనియున్న చేతులు మాత్రము పైకెత్తియున్నాడు. అంతే. అతడంతగా తన్నుతాను మరచియున్నాడు.

 

        అట్టి యాచకుడు ఆ మహాప్రభుని గొప్పదానముతో శ్రీమంతుడగునని మీరు తలంతురా? ఆమహాప్రభువు అట్టి నిజమైన యాచకునికి యివ్వకుండా ఏమైనా తనవద్ద వుంచుకొనునా? నిశ్చయముగా వుంచుకొనడు.  అప్పుడక్కడి పరిస్థితేమిటి? ప్రభువు అతనికేమిచ్చినా, అతడు తానేమి పొందినా తెలుసుకునే స్థితిలో లేడు.  అసలతడు ఇప్పుడు తన మారినస్థితిని కూడా గమనించు ఎఱుకలోలేడు.  అక్కడ యాచకుడు, యజమాని ఇద్దరూ వున్నారు.  వారి మధ్యనవున్నతేడా ఒక్కటే.  అది యాచకుని చేతిలో బిక్షాపాత్ర వుండడమే.  అతడు తన ఈస్థితిని తుదివరకు అట్టే నిలుపుకుంటాడు. ప్రభువూ, యాచకుడూ ఇద్దరూ తమ్ముతాము కోల్పోయారు.  అతడు పొందనిదంటూ ఏమీ మిగిలిలేదు.  అప్పుడు ఆ యాచకుని స్థితి ఎలా వుంటుంది?  అతడు శాశ్వతముగా సంతృప్తిచెందినస్థితిలో వుంటాడు. ఆస్థితికి గొప్ప చక్రవర్తుల సిరిసంపదలు సైతం సరిపోలవు.  ప్రభువు తన సర్వస్వం ఇచ్చేశాడు.  యాచకుడు అదంతా పొందినాడు.  అతనిముందు మహారాజాధిరాజులు మరియు మహోన్నతస్థాయికి చెందిన సాధువులు సైతం తలవంచితీరుతారు.  అయితే మనిషి అటువంటి యాచకుడు కావాలి మరి.  అతనికున్న దానితో పోల్చడానికి ఏదీ నిలువదు.  బిక్షాపాత్రమును తన హృదయముగా గ్రహించిన ఎడల ఇదియంతయు అర్థముచేసుకొనుట సులభము.

 

***

 

 

తేలికగా ప్రయాణించు

 

        "తేలికగా (తక్కువ సామానుతో) ప్రయాణించు" అన్నది సాధారణంగా రైల్వేశాఖవారు ప్రయాణికులకు ఇచ్చు సూచన.  వారు ఈ సూచనను తోటి ప్రయాణికులకు చాలా సౌకర్యముగానుండునను దృష్టితో చేసిరి. అదే విధంగా ఈ సూచన భగవత్ సాక్షాత్కారమునకై పయనించు యాత్రికులకూ వర్తిస్తుంది.  మీకు తెలుసు మనం మన దారిలో సంస్కారముల రూపంలో తలకు మించిన బరువుగల మనసామాన్లు మోస్తూ ముందుకు వెళుతున్నాం.  ఇక అనువైనప్రయాణం కోసం మనం వీటిని వదిలించుకోవాలి.  ఈ పని రెండు విధాలుగా చేసుకొనవచ్చు.  మొదటిది మన బరువైన సామాన్లు రైలు సంరక్షకుల అధీనములోనికి చేర్చివైచుట.  అదే విధంగా మన ఆధ్యాత్మికయాత్రలో మన బరువుసామాగ్రిని గురువుకు అప్పజెప్పి బరువునుండి విడుదల పోందవలెను.  అది మరొక విధంగా శరణాగతిని సూచించును.  మనం మనకు సంబంధించిన బరువులను గురువర్యులకప్పజెప్పగనే ఆ బరువుబాధ్యతనుండి స్వేచ్ఛపొందుదుము.  ఇక రెండవ విధానము వాటిని అనుభవించుట ద్వారా కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ పొవాలి.  అయితే యిది ఆలస్యము మరియు విసుగు పుట్టించు ప్రక్రియ. అంతేగాక చాలా కష్టమైనది కూడా.  ఏదోవిధంగా మొత్తానికి మనం మరింతగా తేలికైపోవాలి.  మీరందరు ఈ విషయాన్ని గణనలోనికి తీసుకొని తదనుగుణంగా వర్తించాలి.  కాలము ఎప్పుడూ మీకోసం తిరిగిరాదు.  కనుక వీలైనంతగా దాన్ని మనం సద్వినియోగంచేసుకోవాలి.  మహోన్నత గురుదేవుల నిజమైన అనుచరునిగా నేను మీకివ్వగలిగినది కేవలం ఒక చిన్న ఊతముతో (సహాయముతో) పాటు శుభాకాంక్షలు మాత్రమే.  అంటే మీరు మీకున్నదంతా నాకిచ్చి సాంసారిక జీవనం విడిచి వెళ్ళండని అర్థముకాదు.  అయితే ప్రతిది మహనీయులైన గురుదేవులు నీకప్పజెప్పబడిన కార్యముగా భావించి చేసుకుంటూ పోవడమే.  అదే నిజమైన జీవితము.  అవి ఆధ్యాత్మికమైనా, ప్రాపంచికమైనదైనా ఏవైననుగానీ అన్ని సమస్యలకు ఇదొక్కటే పరిష్కార మార్గము.

 

        అందుకొఱకై అందరూ వారి చేతనైనంతగా ప్రయత్నించవలెనని నాఆకాంక్ష.  మీరు నాజీవితకాలములో సాధించినవన్నియు నాయనంతరము గొప్పవిలువైనవౌతాయని నేను నమ్మకముగా చెబుతున్నాను.  కానీ ఇప్పుడు నీవు నిర్లక్ష్యముచేసి తర్వాత నేనీశరీరము వదలిన వెనుకనైనా నాతో సంబంధమేర్పరచుకొని పురోగమింతునులెమ్మని అనుకుంటే, అది నీకు చాలా కష్టమౌతుంది.  శలభము మండుతున్న అగ్నిగుండములోపడి ఆత్మాహుతి చేసుకోగలదు.  కానీ చల్లారిపోయినగుండంలో కూడా ఆత్మాహుతి గావించుకొను శలభములు అరుదు.  అది దాదాపు అసాధ్యము.  అయినా దానికి కొన్ని మినహాయింపులున్నాయి.  కానీ అవి అరుదైనవి.  నిజానికి చాలాఅరుదైనవి.  కనుక ఆరిపోయిన మంటలో దహింపజేసుకొనుటయు సాధ్యమే, ఆచరణీయమేనను స్థాయికి ఎదగడమా లేక మండుటయన్న ప్రసక్తే ఉత్పన్నముగాని ఈ సమయములోనే మహోన్నతస్థితిని సాధించటమా అన్నది మనమెన్నుకొని పరిష్కరించవలసి యున్నది.  కానీ ఇది భగవంతునికృప మరియు వ్యక్తిగత సాహసోపేతమైన ప్రయత్నముపై ఆధారపడియున్నది.

 

***

 

 

స్మరణ

 

        వ్యక్తి తన ధ్యాసను ఆటువైపు మరలిస్తే చాలు, సాక్షాత్కారము చాలాసులభమని నేను మరొకచోటెక్కడో తెలిపియుంటిని.  అంటే దాని లోతైనముద్ర (యోచన) అతని హృదయమున వుండవలెనని దానర్థము.  అది ఎంతలోతుకు నాటుకొనిపోతే అంత సులభము, అంతత్వరితముగా విజయమందుకొందువని భావము.  అంతపని చేసేస్తే ఇక చేయవలసినదట్టే మిగిలియుండదు.  ఈ లోతైనముద్రలు పొందడమంటే వ్యక్తి తానాశించినదంతా గ్రహించేసినట్లే.  అట్టి సందర్భములో భగవదీయధ్యాస నిరంతరం జీవముతో హృదయమున వుండి అతని శ్రద్ధ ఎల్లవేళల ఆవైపునకే త్రిప్పబడి వుంటుంది.  ఇదే నిరంతరస్మరణకు సరియగు అర్థము.  ఇప్పుడు ఈ యోచన పూర్ణత్వంలో లీనమైన సహచరుని భావముతో అనుసంధించి ఫలితము నీకైనీవే నిర్ణయించి చూడు అది పరోక్షంగా పూర్ణత్వంతో కూడియున్నదో లేదో తెలిసిపోతుంది.  వాస్తవాంశమేమనగా ఇట్టి విషయమున వ్యక్తిత్వపు తలంపు కేవలము నామమాత్రమే.  ఎంతలోతుగా నీయోచన నిమగ్నమైయుంటుందో అంతఎక్కువగా పొరలు (సూక్ష్మతరమైనవి) ఒక్కొక్కటిగా ఛేదించబడుతూ ఆఖరుది అసలైనది మాత్రము దృష్టిలో నిలబడి వుంటుంది.  ఇప్పుడు మూలము అతని దృష్టిలో వున్నది గనుక అతడు సాక్షాత్తు భగవదీయకృపావిశేషమున అనుగ్రహింపబడినాడు.

 

        ఇప్పుడు ఆ అనంతస్థితి ఉనికి దృష్టిపథంలో వున్నది.  అంటే సర్వసాధారణంగా దానివైపే ఎడతెరిపిలేకుండా చూస్తూవుంటే, దానినుండి వెలువడే అయస్కాంతశక్తి ప్రభావమున తుదకు పూర్తిగా అతని చూపు మూసివేయబడుతుంది.  స్థితిరహితత్త్వము, అంటే సత్యతత్త్వమూలగుణం స్థాపితం కావడం మొదలౌతుంది.  రెండింటి మధ్య పరస్పరప్రేమ ఎప్పుడుంటుందంటే మధ్యనున్న తేడాకు కారణమే లేకుండా పోయి అదేఇది ఇదేఅదియన్న భావన అక్కడ వృద్ధి చెందినప్పుడే.  కానీ నీవు ఇంకాఇంకా ముందుకు వెళతావు.  అదేఇదియన్న (తేడాలేని) భావన వృద్ధియౌతూనే పోతుంది.  నీవు దాని ప్రభావముతో నింపబడతావు. ఆయన మహాత్మ్యము నీవెన్నుదన్నుగా వుంటుంది.  కానీ కేవలం స్మరణ తప్ప మరేమి ఇప్పుడుండదు.  ఆ అదేఇదియన్న (తేడాలేని) భావన స్మరణతో వృద్ధికావడంవల్ల ఆయనకై ఆయనే నీస్మృతిపథంలో లీనమైనట్లు కనబడటం మొదలౌతుంది.  ఈ భావన శాశ్వతమైతే కబీరుదాసు వివరించిన స్థితి ప్రవేశపెడుతుంది.  అది ఏమంటే "మేరా రామ్ ముజే భజే తబ్ పావూం విశ్రామ్."  దానర్థం "ప్రభువు నాస్మరణలో సతమతమౌతూ వుండినప్పుడే నా మనసుకు ప్రశాంతత కలుగుతుంది".

 

        ఇది భక్తియొక్క మహోత్కృష్టస్థితి.  ఈ స్థితిలో ప్రేమికుడే ప్రేయసిగా మారిపోతాడు.  ఇది ఎప్పుడయి తీరుతుందంటే గురువు మరియు శిష్యుడు నిజమైన భావనతో ఒకరికొకరు సత్సంబంధమేర్పరచుకున్నప్పుడు మాత్రము తప్పనిసరిగా ఔతుంది.  వాస్తవాంశమే మనగా స్మరణ సృష్టి ప్రారంభమునాడు ఉత్పన్నమైన తరంగములతో అతిసమీప సంబంధముగలిగి వుంది.  ఆ తరంగములే సృష్టిగావింపబడి మార్పు సంతరించుకొన్న నేటి ఈప్రపంచస్థితికి  ఆధారము.  ఆ సృష్ట్యాది స్మరణా (తరంగములు) స్థితిలో లీనమవ్వడం అందరివలన అయ్యే పని కాదు.  కేవలం ఒక అరుదైన మహాపురుషుడే అందుకు సమర్థుడు.  అంటే అందుకోసం ఇతరులు ప్రయత్నించ కూడదని కాదు.

 

        సృష్ట్యాది తరంగములను నేను స్మరణగా చెప్పడం ఆశ్చర్యం కలిగించవచ్చు.  అట్లెందుకు అనవలసివచ్చిందంటే ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన ఊహ మొదట మనస్సున ఉత్పన్నమౌతుంది.  ఆతర్వాత అదే ఆలోచనగా వృద్ధియౌతుంది.  అంతర్గతంగావున్న భగవదిచ్ఛ సృష్టి మొదలవ్వడానికి దానికై అదే ఆలోచనల రూపంలో తరంగాలు వృద్ధి చెందాయి.  ఆలోచన మరియు స్మరణ అతి సన్నిహిత లక్షణములు గలవియై యున్నవి. స్మరణలో ఒక విధమైన స్వల్ప స్పందన ఇమిడి వుంది.  అది ఆలోచనలో అంతర్గతమై మాత్రమే వుంది. స్పందన శక్తినిపెంచి శరీరమంతటిలో తరంగములను ఉధృతం చేస్తుంది.  ఈ స్పందనాకవచమునధిగమిస్తే స్మరణయొక్క మూలబిందువును చేరుకుంటాము.  దాన్నే ఆధారమనుకొనవచ్చును.  దాని ఆవలిస్థాయి చెప్పనలవి కానిది.  బహుఃశ దీని అనుభవము ఒక విధంగా అత్యంత సున్నితమని వ్యక్తీకరింపవచ్చును.  నా సహచరులు ఆ సున్నితస్థితిని పొందగల్గు సామర్థ్యమును కానుకగా నందుకొనెదరుగాక.  ఇదే విధమైన స్మరణ మరియు తరంగములు తర్వాతి ప్రతిస్థానములోను వుంటాయి కానీ వాటి సాంద్రతలోని తేడావలన వాటి మధ్య భేదముంటుంది.  వాటిని నిర్వచించడం చాలా కష్టము.

 

        "అహం బ్రహ్మాస్మి" స్థితిని అరచి వినిపిస్తున్నారు.  ఎల్లవేళల దాన్ని ఉటంకిస్తూ వాదప్రతివాదనలు భిన్నవర్గాల భక్తులు చేస్తూనే వుంటారు.  వాస్తవానికి ఈ స్థితిని అనుభవాత్మక దృక్పథంతో గమనిస్తే మూడు దశలున్నాయి.  వాటిని వరుస క్రమంలో అనుభవానికి తెచ్చుకుంటారు. మొదటి దశలో "నేను బ్రహ్మను" అని అనిపిస్తుంది.  రెండవదశలో "అంతా బ్రహ్మము" అనిపిస్తుంది.  ఇక మూడవదశలో "అంతా బ్రహ్మము నుండే" అనిపిస్తుంది.  మొదటిది వ్యక్తిగతమై వుంటుంది.  మూడవది విశ్వజనీనమైనది. రెండవది కేవలం మధ్యస్థమైనది.  అది తుదకు విశ్వజనీనతకు మరలిస్తుంది.  గొప్ప పేరొందిన ప్రపంచ మహనీయులు మొదటిస్థితిని దాటి ఆవలికి పోలేదు.  అయితే భారతీయ మహనీయులలో చాలా మంది చాలాదూరమే వెళ్ళారు.  ఈ స్థితులన్నీ ప్రతి బిందువు వద్ద వున్నాయి అయితే వాటి సూక్ష్మతలో మాత్రము తేడా వుంటుంది.  ప్రతి అభ్యాసి ఈస్థితులను తన సాధనా క్రమములో ఎఱుకలో గమనించక పోయినప్పటికినీ వాటిని అధిగమించి వెళుతునే వున్నాడు.

 

        భగవంతుడు సాదాసీదాగా సరళంగా అన్నిటికి భిన్నంగా (అంటే స్థూలమునకు వేరుగానని చెప్పనవసరం లేకుండా) వున్నాడు.  కనుక మనంతకు మనం స్థూలత్వాన్ని జడత్వాన్ని తప్పనిసరిగా వదిలించుకొని ఆయన్ను పొందవలసి వున్నది.  జడత్వము మన ఆలోచనలు, చర్యలు మరియు పరిసరముల వల్లనే ఏర్పడుచున్నది.  కనుకనే మన ఆలోచనలు క్రమబద్దంకావాలి.  వ్యక్తిగత మనస్సు పూర్తిగా క్రమశిక్షణతో వుండి, తనపై పేరుకుపోయిన బరువును నిర్మూలించివేయాలి.  మనం వీలైనంత తేలికగా తయారవ్వాలి.  అందువల్ల గురువర్యుల ఒకేఒక్క శ్వాస మనల్ని సాధ్యమైనంత ఉన్నతోన్నతమైన ఎత్తుకు ఊదేయాలి.

 

        మనసంస్థలో సత్యతత్త్వము మొదటి ఛాలనముతోనే అభ్యాసిలోనికి చొప్పించబడుతుంది.  అది బీజమువలె పనిచేసి తర్వాతి ఎదుగుదలకు సహాయబడుతుంది. గురువర్యుల చూపుల రక్షణలో, అది వ్యతిరేక పరిస్థితులవల్ల రేగిన వేడిమినుండి కాపాడబడుతూ వృద్ధి చెందుతూపోతుంది. అయితే అది నీవు నిరంతరస్మరణతో పోషిస్తూ వున్నంతసేపు నీకు రక్షణగా వుంటుంది.  ఆధ్యాత్మికతలో ఇదొక్కటే వేగవంతమైన పురోభివృద్ధికి నిశ్చయముగా దోహదకారి.

 

        మనము వేగవంతమైన అడుగులతో ముందుకు సాగుతూ ఒక్కక్షణము కూడా విశ్రమించకుండా గమ్యము చేరువకు సాగిపోవాలి.  మనకు సరియైనదారి దొరికినప్పుడు దాన్ని మనం గట్టిగా పట్టుకొని ఎట్టిపరిస్థితులలోను వదలకూడదు.  ఇతరములైన అన్ని స్థూలపద్దతులు, యాంత్రికవిధానములు వదిలిపెట్టాలి.  మనం ఎప్పుడు రోజురోజుకు తేలికైపోతుంటామో అప్పుడు మనం సక్రమంగా తేలికైన, సూక్ష్మమైన దానివైపు పయనిస్తున్నామని నిర్ధారించుకొనవచ్చును.

 

        భగవత్కృప అలభ్యమన్న నిరాశకు మనమెప్పుడూ లోనుకాకూడదు.  భగవంతుడే మహోన్నతమైన ప్రభువు.  ఆయన ఇచ్ఛయే సర్వకాల సర్వావస్థలయందు అమలుకాబడుతూ వుంటుంది.  మనల్నిమనం దివాలాతీసిన వాళ్ళంగా భావిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులు, అలజడులను లెక్కచేయకుండా ఎప్పుడూ పూజలతోను భక్తితోను తనమునకలైయుండాలి.  మనం ఎప్పుడుకూడా మొరిగే కుక్కలను ఖాతరుచేయకుండా, అంటే అంతర్గత అలజడుల కారణంగా మన పూజ సక్రమంగా కొనసాగించలేమన్న హృదయ దౌర్భల్యమునకు గురికాకుండా నుండవలెను.  కుక్కలను గట్టిగా అదలించిన మొరగడం మానవు.  కుక్కలు మొరుగుతూనే వుంటాయి కానీ ఏనుగు వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా వెళుతూనే వుంటుంది.   వీలైతే కుక్కలు నీ పూజను అడ్డుకొనకుండా, మొరగకుండా వాటికి శిక్షణనివ్వడం మంచిది.  అందుకు మనం సరికాని అలవాట్లను చక్కదిద్దే చక్కని పద్దతులనవలంబించాలి.  అందుకొఱకు నీవు వాటిపై బాహ్య బలప్రయోగంచేసి వాటి అరుపును అదుపు చేయాలని చూస్తే అవి మరింత కౄరంగాను ప్రమాదకరంగాను మారే అవకాశముంది.  కనుక వాటి అరుపు నీకు ఆటంకం కాదని వాటికి చూపించగలగాలి.  అట్టి స్థితి వచ్చిందీ అంటే వాటిఅరుపు దానికదే సద్దుమణుగుతుంది.  ఈ శ్రద్ధ ముందే తీసుకొనివుంటే వాటి అరుపు ఇంత దూరం వచ్చివుండేది కాదు.  సంక్షిప్తంగా చెప్పాలంటే వాటికి సరియైన శిక్షణనిచ్చి వాటినిఅవే సరియైన దారిలోనికి మరియు క్రమశిక్షణలోనికి వచ్చునట్లు చేసుకోవాలి.  అందుకోసం వున్న ఒకే మార్గమేమంటే మనల్నిమనం ఉద్దరించుకొని పైస్థితికి వస్తే దాని ప్రభావం వలన అవి కూడా మన అంతర్గతమానసిక స్థితితో ప్రభావితమౌతాయి.  ఆధ్యాత్మిక ప్రగతి జంతువులను సైతం ప్రభావితం చేయగలుగుతుందన్న మాట.  ఇట్టి వాస్తవ ప్రయోజనం దీర్ఘకాల ధ్యానం తర్వాత సిద్ధిస్తుంది.

 

        కుక్కల మొరుగు, క్రమబద్దముగాని మనస్సు, ఇంద్రియముల చర్యలను సూచిస్తుంది.  అవి ధ్యానము మరియు స్మరణ ద్వారా సులభముగా చక్కదిద్దబడతాయి.

 

***


ఆనందము

 

        సాధారణముగా మనస్సువాలకం రెండురకాలుగా వుంటుంది.  మొదటిది ప్రపంచంవైపు లేక భిన్నత్వం వైపునకుంటుంది.  ఇక మిగిలినది పూర్ణత్వం లేక ఏకత్వం వైపునకుంటుంది.  వీటి మధ్య సర్దుబాటు ఉండితీరాలి.  అతిగా ఏవైపుకు శ్రద్ధ చూపినా అది లోపమే.  అక్కడే ఒక ప్రాపంచికజీవి నిజమైన సాధువు (అంటే మానసిక అధోఃవృత్తులను ఉత్తమ ప్రవృత్తికి ఇచ్ఛామాత్రమున మార్చగలవాడు) తో విభేదిస్తాడు.  అటువంటి సామర్థ్యము సామాన్యుని వశమందులేదు.  ఐక్యతాస్థితిలో సంపూర్ణముగా ప్రవేశించిన సాధువు తన అడుగులను వెనుకకు తీసుకొని ప్రాపంచిక భిన్నత్వంలోనికి మరలగలడు.  మరొక మాటలో చెప్పాలంటే సంపూర్ణంగా ఐక్యతాస్థితిలో లీనమైపోవడం సిద్దిస్తే ఇక తీసివేయాల్సినదంటూ ఏమీ మిగిలి వుండదు.  కనుక ఒక్క వెనకడుగు, అదీ కేంద్రస్థాన విషయంలో మహాత్ముడు వేయాల్సివస్తుంది.  ఆ కేంద్రస్థాన పరిధిలో ఉనికిస్థాయి తదనంతర వృద్దిపొంది, రూపము మరియు ఆకారం ధరిస్తుంది.  అంటే నిజమైన లయావస్థ స్థానంలో ఐక్యత లేక లీనమవ్వడమన్నమాట సరిగ్గా అతకదు.  వాస్తవానికక్కడ ఐక్యత కూడా వుండదు.  ఇక సరియైన మాటల్లో వ్యక్తపరచాలంటే "అది అదిగానే వుంది" అనాలి.  కానీ ఆస్థితిలో ఆనందమూలేదు, ఆకర్షణలేదు, సంతోషములేదు.  అది స్థాయిరహితస్థితి.  ఈస్థాయికి పైకి లాగబడినవాడు స్థబ్దుడైపోతాడు.  ఎందుచేతనంటే అతడు ఉత్సాహముకాని, సంతోషముకాని కడకు ఆనందముకాని అనుభవించు స్థితిలో వుండడు.  అదే నిజమైన ఆనందము.  దానినే ఎవరైనా ఆశించాలి.  కానీ అటువంటప్పుడు శాస్త్రాలలో వర్ణించిన (ఆనంద నిలయం) దానితో ఇది సరిపోలదు.  అది నిజమైన ఆనందమును తప్పుగా ఊహించడం మాత్రమే అవుతుంది.  నిజమైన ఆనందము ఏవిధంగాను ఉల్లాసము లేక సంతోష భావనలతో అనుసంధింపబడిలేదు.  ఇప్పుడొకవేళ ఎవరినైనా మధ్యలోనున్న ఇతరస్థితులననుభవింప జేయకుండా నేరుగా ఈ స్థితికే తెస్తే అతనిలో ఆత్మస్థైర్యముగాని, పట్టుగాని వుండదు.

 

        ఉన్నత స్థానములందుకొనేకొద్దీ భావనాశక్తి కూడా నశిస్తుంది.  తేడా గుర్తించగలగడం పోతుంది.  జ్ఞానరాహిత్యం తెలియకుండానే వృద్దిపొందుతుంది.  వాస్తవానికి నేను ఈకారణం చేతనే ప్రాధమిక శిక్షణనిచ్చుటకు అస్సలు సరిపోనిస్థితికి వచ్చితిని. ప్రాధమిక దశలోవున్న వారు నావద్దకు శిక్షణ నిమిత్తం వస్తే, వారు కొంత నాస్థితికి సంబంధించినట్టిదిగాని లేక నాస్థితివంటి స్థితినిగాని పొందుతారు.  అది ఖచ్చితంగా వారికి రుచించనే రుచించదు.  కారణం అది వారి ఇష్టమునకు సరిపడదు. వారిని కొంతవరకు ఉత్సాహపరిచేది, మనోహరంగా వుంచేది, ఆనందంగా వుంచేది వారు అభిలషిస్తారు.  ఇది వారి ఇంద్రియములు గ్రహించ వీలుగానిదిగాన వారికి నచ్చదు.  గ్రద్ద, మానవుని షడ్రసోపేతమైన భోజనమునకంటే, ఒక క్రుళ్ళిపోయిన మాంసపు ముక్కనే ఇష్టపడుతుంది.  నేను ఒకవేళ నాస్థాయికంటే క్రిందిస్థాయినుండి ప్రాణాహుతిని ప్రసారంచేస్తే నేను బరువుగా శ్వాసపీల్చుకొను (శ్వాస ఆడని) అవస్థ తటస్తిస్తుంది.  కారణం నాకు ఆస్థితి అలవాటు లేనిదగుటే.  అయినప్పటికిని నేను కొంతవరకు దిగివచ్చి అవసరమైనప్పుడు ప్రాణాహుతి ప్రసారం చేస్తుంటాను.  కానీ అది కూడా కేవలం ఒకటి రెండు నిముషములు మాత్రమే.

 

***

 

 

గమ్యము మరియు మార్గము

 

        ఈ ప్రపంచములోని మన కార్యకలాపముల వలన భగవదీయక్షేత్ర వాతావరణమునందు ఎట్టి ప్రభావము చూపుతున్నదో మనకు సరిగా అర్థము కావడములేదు.  హృదయాంతర్గత భావనలతో కలసి మనచేతలు ఆకాశమండలమున ముద్రలనుత్పన్నము చేయుచున్నవి.  అవి మానవ మనస్సుపై ప్రభావము చూపుతున్నవి.  ఆకాశశక్తి వలన అవి మరింత శక్తివంతములై మానవ హృదయములను ఢీకొన్నప్పుడు వాటి కలయిక ప్రభావమున ఆలోచలపై ఆలోచనలు ఉత్పన్నంకావడం మొదలౌతుంది.  ఈవిధంగా మనం జన్మించినదాదిగా ఆకాశమండలాన్ని పాడుచేయడం జరుగుతున్నది.  అందువల్లనే మనం ఆలోచన లేకుండా ఒక్క క్షణంకూడా వుండలేని పరిస్థితి ఏర్పడింది.  కానీ ఆకాశమండలం దాటిన వారు మాత్రం నిస్సందేహంగా దాదాపు ఆలోచనారహితంగా మారగలరు.  ఎవరైతే వారిపనిని వారు అది ఏపనైనా కర్తవ్యపరంగా చేసుకుంటూ ఏవిధమైన భారము లేక ముద్రలు హృదయముపై పడకుండా ప్రవర్తిస్తుంటారో వారు తమను తాము చెడగొట్టుకోకుండా కాపాడుకోవడమే గాకుండా ఆకాశమండలాన్ని కూడా మలినపరచరు.  అందుచేతనే శ్రీకృష్ణపరమాత్మ కర్తవ్యతాపరమైన కర్మ సిద్దాంతాన్ని గుర్తింపజేసి నొక్కి వక్కాణించెను.  మనం మొదటినుంచి ఆకాశమండలాన్ని మలిన పరుస్తూనేవున్నాం.  మహాశక్తియగు ప్రకృతి ఎల్లవేళలా ఈ సమస్తాన్ని  శుభ్రపరుస్తూనే ఉన్నది.  ఒక్కోసారి మలినం భారీగా పేరుకుపోతే ప్రత్యేకావతారమనదగు మహనీయుని ఆ పనికై క్రిందికి దింపుతూ వుంటుంది.  భోగ (అనుభవించడం) వాతావరణం సంపూర్ణంగా సృష్టించడంవల్ల మానవులలో బాధలు, వ్యధలు కలుగుతాయి.  ప్రత్యేక పద్దతులు కూడా ఈ పనికోసం  చేపట్టడం జరుగుతుంది.  అవి యుద్దాలు, రోగాలు మరియు దైవీయ విపత్తుల రూపంలో సంభవిస్తాయి.  ఆనాడు శ్రీకృష్ణపరమాత్మ దిగివచ్చి పని పూర్తిచేసిన విధంగా నేడుకూడా అట్టిపనిని నిర్వర్తించడానికి ఒక మహత్తరశక్తి లోకమున అవతరించి తనపని తాను చేసుకుంటూ వెళుతున్నది.

 

        ప్రజలు తమకున్న ఎడతెరిపిలేని స్వంత పనులవలన పూజ మరియు ఉపాసన చేపట్టుటకు తీరికలేదని తరచు చెప్పుచుందురు.  కానీ ఎడతెరిపిలేకుండా పనివత్తిడి ఎక్కువ వున్నవాడికే ఎక్కువ తీరిక వుంటుందన్నది సాధారణంగా వాడుకలోనున్న నానుడి.  నా మనస్సుకు అనిపిస్తున్నదేమంటే ఒక మనిషికున్న మొత్తం సమయంలో పనిచేసే సమయంకన్నా ఎక్కువ సమయమే అతని అధీనములో మిగిలి వుంటుంది.  సేవా, త్యాగములను ఈరెండు సాధనములే ఆధ్యాత్మిక దేవాలయ నిర్మాణమునకు ప్రముఖమైనవి.  ప్రేమ దానికి ఆధారపీఠము (పునాది).  స్వార్థరహితమైన ఏపని చేసినను అది సహాయకారియే.  సేవయందు పూజాభావము ఇమిడియున్నది. మనము ప్రాపంచిక రోజువారీ పనులలో ఎంత తీరిక లేకుండా వుంటామో అదే విధంగా సేవాత్యాగముల విషయములలోనూ వుండాలి.  దీనికి అతిసులభమైన పద్దతి ఏమంటే చేసే ప్రతిపని భగవంతుని ఆజ్ఞానుసారమే చేస్తున్నట్లు భావించి దానిని తన కర్తవ్యంగా చేసుకుంటూ పోవడమే.  ఈ ప్రపంచములో మనకున్న ప్రతీదీ ఆ భగవంతుని దగ్గరనుండి ప్రాప్తించిందే.  మనతోటి వారందరూ కూడా ఆయనసృష్టే.  ఆయనే అన్నిటికి ప్రభువు.  మనమందరం ఆయన బిడ్డలం.  అందులో కొందరిని మన ప్రత్యేక సంరక్షణలో వుంచినాడంతే.  ఈ మార్గంలో మనం తగులుకోగూడని బంధనా భావములనుండి విడుదల పొందుతాము.  ఈ విధమైన భావన లోతుగా వేరుదన్నితే తనవారికి చేసిన సేవకూడా కేవలం కర్తవ్యనిర్వహణే అయిపోయి అదేసమయంలో ఆమహాప్రభుని స్మరణలో కూడా కాలం గడిపినట్లవుతుంది.  ఇది తుదకు నిరంతరస్మరణగా వృద్ధిచెందుతూ పోతుంది.

        మహనీయుడైన గురుదేవుని భావన నిరంతరం మనస్సులో వుండి శ్రద్ధ, భక్తి భావముతో ఆశిస్తే జీవితలక్ష్యమును సులువుగా పొందవచ్చును.  భక్తి ద్వారా మనకు, గురువుగారికి మధ్య మనం ఒక అనుబంధమేర్పరచుకుంటాము. అదే మనం ముందుకు వెళ్ళటానికి బాట అవుతుంది.  మనం మొత్తానికి చేయవలసిందేమంటే ఆ బాటను శుభ్రంగాను మరియు ముళ్ళు, పొదలవంటి అడ్డంకులు దారిలో లేకుండానూ చేసుకోవాలి. గమ్యముపై ఎనలేని ఆకాంక్ష మరియు భక్తి యొక్క తీవ్రత దారిని శుభ్రంగా వుంచుటకు సహాయపడతాయి.  ఎప్పుడైతే దారి శుభ్రపడుతుందో, అప్పుడు దారిపై హృదయం ఒక త్రోపును కలుగచేస్తుంది.  అడ్డంకులు ముఖ్యంగా మనస్సుపై దాడిచేస్తున్న విరుద్ధభావాల చేరికే.  ధ్యాన ప్రభావం వలన కలిగిన ఒక తాత్కాలిక ఓదార్పు, మార్గంలో ఒక ముందడుగే.  వ్యక్తి ఈ విధంగా ముందుకు కదులుతూ వుంటే అతని అనుభవంలో ఆ విరుద్ధ భావనలు మాయమైపోవడం గమనిస్తాడు.  అదే శాశ్వతస్థితిగా పరిణతి చెందుతే భగవత్ సామీప్య భావన ప్రబలమౌతుంది.

 

        అనేకమైన మార్గములు భగవత్ సాక్షాత్కార సాధనకు నియమింపబడి వున్నాయి.  ఒక్కొక్కటి ఒక్కోరకం అభిరుచి, మనస్తత్త్వంగల మనుషులకు అనుకూలంగా వుంటాయి.  తగ్గుస్థాయికి చెందినవారు అనగా తమ మనస్సులో ధ్యానం చేయుటకు ఇష్టపడనివారు, వారి అంతర్గత జడత్వం కారణంగా స్థూలవస్తువులను గ్రహించి బొమ్మలను సర్వేశ్వరునిగా భావించి పూజలు నిర్వహిస్తారు.  కానీ దురదృష్టవశాత్తు వారు  ఆబొమ్మనే దేవుడని అనుకుంటారు. అంతకు మించిన ఉన్నత ఉనికిని విస్మరిస్తారు.  వారిలో కొంత అభివృద్ది చెందితిమనుకొను వారు ఆబొమ్మలనే మనస్సులో వూహించుకొని సర్వసామాన్యమైన యాంత్రిక పూజలన్నీ అనగా పుష్పములు సమర్పించటం, గంధం పూయటం, ధూపం వేయటం అన్నీ ఊహల్లోనే చేస్తారు.  దీన్ని వారు "మానసిక పూజ" అని పిలుస్తారు.  ఇది వారు ఉన్నతమైన స్థితిగా భావిస్తారు.  వాస్తవం గమనిస్తే వీరు ముందు చర్చించిన విగ్రహారాధకులకంటే ఏమాత్రం మేలైన వారు కాదు.  ఈ రెండు పద్దతుల ఫలితమూ సరిగ్గా ఒక్కటే.  తుదకు వారు రాయి వలె స్థూలత్వం చెందుతారు.

 

***

 

 

 

 

 

 

 

 


సతి

 

        సీతాపూర్ జిల్లాలో ఈ మధ్య జరిగిన "సతి" సంఘటన నాలో ఒక ఆలోచనను రేకెత్తించి దాని మీద లోతుగా యోచించునట్లు చేసినది.  ఆ సమయంలో ఆమె మానసికస్థితి ఎట్లుంటుందో కనుగొనాలనిపించింది. మనకు కనబడుతున్న ఆధారం ప్రకారం తీవ్రమైనప్రేమ ఆమె భర్తపై ఆమెకున్నది.  అది ఎంత తీవ్రమంటే ఆమెభర్త ఎడబాటును సహించనే సహించలేనట్టిది.  కనుక చనిపోయిన భర్తతోపాటు తన్నుతాను అదే చితిలో దహించివేసుకొనుటకు సిద్దపడింది.  ఆమెకు తన భర్తపైవున్న ప్రేమతో నాప్రభువైన, నాగురుదేవునిపై నాకున్న ప్రేమను పోలిస్తే నాకు ఏదో తేడా వున్నట్లనిపించింది.  నాకు అర్థమైనంతలో ఆమెచర్య, భర్త చనిపోయినా కలిసేవుండాలన్న తీవ్రఆకాంక్ష ఆమెలో కనబడుతున్నది.  నిజంగా సతి ఉద్దేశ్యము భర్తతో శాశ్వత సంబంధం కలిగివుండటమే అయితే, నే నామెను నిజమైన భక్తుడు అంటే గురువు శరీరం వదిలిన తర్వాతగూడా ఆయనతో సంబంధం కొనసాగించునట్టి వానితో సరిగ్గా పోల్చవచ్చుననుకుంటాను.  అట్టి పరమ భక్తాగ్రేసరుడు సతితో సమానము కాదా?

 

        ఇప్పుడు ప్రకృతి, పురుష సిద్దాంతరీత్యా ప్రకృతిలోని ధన, ఋణ శక్తులను గూర్చి కాస్తఆలోచిద్దాం.  ఒక స్త్రీ ఆడుదిగా ప్రకృతికి లేక ఋణశక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నది.  మనుష్యుడు మగవాడుగా పురుష లేక ధనశక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  ఒక శిష్యుడు ధనశక్తిగా భావిస్తున్న గురువు ధ్యాసలో లీనమయ్యాడు.  అందుకు అతడు తప్పనిసరిగా తననుతాను ఋణశక్తిగా మార్చుకోవాలి.  ఈ రెండు పదాలను గణిత శాస్త్రరీత్యా గ్రహిస్తే మొదటిది క్రింది లేక సున్నానుండి పైకి వెళ్ళుటను సూచిస్తుంది.  ఇక తర్వాతిది క్రిందకు వెళ్ళుటను సూచిస్తుంది.  ప్రస్తుత మానవునిస్థితి క్రిందికి పైకి కానటువంటి ప్రారంభస్థితి.  శూన్యస్థితి (సున్నా) అంటే క్రిందికిపోవడం లేక వదిలివేయడం.  మరోమాటలో చెప్పాలంటే పేదయై పోవడం మరియు కనబడుతున్నదంతా, అంటే ప్రాపంచిక వస్తుతత్త్వం నశించి దిక్కులేనివాడవ్వడం. ఇది సత్యతత్త్వం అని భావిస్తున్న దానివైపు పురోగమించడంగా లెక్కింపబడదా?  అట్లయితే దానర్థం శూన్యత్వంవైపుకు వెళ్ళుతున్నవాడు క్రమేణా ధనశక్తిగా పరిణామం చెందుతాడు.  అంటే ఒక స్త్రీ (లేక సతి) పురుషుడుగా పరిణామం చెందాడనే నిర్ధారణకు వచ్చినట్లే.  ఖచ్ఛితమైన ఆధ్యాత్మిక భావనలో ధనశక్తి పురుషత్వానికి సంబంధించనిదిగా సూచింపబడుతుంది.  అటువంటప్పుడు అది స్త్రీత్వానికి సరిసమానమని అనుకోవాలి. కానీ అది అదికూడా కాదు.  కారణం స్త్రీత్వం శూన్యంతో అనుసంధించబడి తనకైతాను ఋణశక్తియై పోయింది.  దాంతో అతడు స్త్రీ కూడా కాదు. మరి ఇంకేమిటి?  దాని అసలర్థంలో అది ధనశక్తి కాదు ఋణశక్తి కాదు.  అది రెండింటికీ అతీతం. దాన్ని నేను ఈ క్రిందివిధంగా వ్యక్తీకరించ ప్రయత్నించాను.

 

బిందువు సముద్రంలో కలిస్తే

 అది తనకుతాను సముద్రంగా మారిపోతుంl.”

 

        ఆధ్యాత్మికతకు సంబధించి ప్రేమయొక్క తుదిదశ అది.  ఎవరైనా తన్నుతాను ఆడమగకాని వానితో గట్టిగా బంధమేర్పరచుకుంటే వారుకూడా తుదకు అట్లే మారిపోతారు.  ఇప్పుడు సతి తన భర్త పురుషుడన్న భావన మరియు అతనిపై ఆమెకున్న ఘాటు ప్రేమ కలసి కరుడుగట్టి ఆమెచేసిన నిర్ణయానికే ఆమెను పరిమితంచేస్తాయి.  అలా ఆమె స్వేచ్ఛను బడయకుండా అడ్డుకుంటాయి.  ఇదేవిధంగా ఒక శిష్యుడు గురువుయొక్క ఆ ధన మరియు అఋణ భావనపై మనస్సు పెట్టక అంతిమ లక్ష్యమును ఎన్నటికిని సాధించలేడు.

        సతి మానవనిర్మాణమున కలిసియున్న (పంచ) భూతములపై అధికారాన్ని (గొప్ప ఉద్వేగపూరితస్థితిలో వుంటుంది గనుక ఆమె) పొందుతుందని నానమ్మకము.  కారణం ఆమెఆలోచన శరీరంమీదే తదేకంగా గురిపెట్టి అవతలికి రాలేకుండా వుండటమే.  కానీ ఆమెభర్త ఉన్నతస్థాయినందుకున్న వాడైయున్నచో ఆమె సహజంగానే అతని స్థాయివరకు పైకి లాగబడి వుండేది.  ఇది నాదృక్పథము.  దీన్ని గురించి శాస్త్రాలేమి చెబుతున్నాయో నాకు తెలియదు.  నాకొద్దినేను పూర్తిగా నమ్మి సమాధానపడిన విషయమేమంటే గురువు తన్నుతాను ఉద్దరించుకుని ఆధ్యాత్మికోన్నత శిఖరస్థాయికి చేరని వాడైతే శిష్యుడు అవసరమగు స్థాయికి క్రిందనే వుండిపోతాడు.  అతడు నేరుగా మహోన్నతమైనదానితో (భగవంతునితో) సంబంధమేర్పరచుకొన్ననే తప్ప ఇంకనూ ముందుకు వెళ్ళుట కుదరదు.  అందుచేతనే గావచ్చు భగవంతునితో నేరుగా సంబంధమేర్పరచుకొనుటకు ప్రాధాన్యతనిచ్చిరి.

 

        ఏది ఏమైనా సతి స్త్రీ, ఉత్తమప్రేమ, భక్తి, భర్తకొరకు త్యాగము కలిగి వున్నప్పటికి ఆమె మోక్షము వరకు చేరుకోక పోవటం చూస్తుంటే  ఆశ్చర్యమేస్తుంది.   నా ఉద్దేశ్యంలో అందుకుగల ఒకే ఒక కారణం ఆమె సహజంగా అతన్ని భర్తగా మరియు జీవితానికి ఆధారమైన ఒక మానవమాత్రునిగానే గ్రహించింది. అట్లుగాక ఆమెభర్త తన భౌతికౌనికికతీతంగా  వుండినవాడైతే ఆమె యాదృచ్ఛికంగానే  అధమ భావనలకతీతంగా వున్న ఉన్నతస్థితినందుకొని వుండేది.  కానీ ఇట్టివి అరుదుగానే వుంటాయి. కనుక ఒకరకంగా చూస్తే ఆమె మోక్షస్థితిని పొందనందుకు ఆమె భర్తే బాధ్యుడు.

 

        నేను శూన్యస్థితిని గూర్చి ఎందుకంత నొక్కి చెప్పుతున్నానంటే, అదిలేక మన ముడులు విప్పబడి అభ్యున్నతిని పొందుట సాధ్యము కాదు.  గోధుమగింజలలో ప్రతి ఒక్క గింజకు దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది.  అదే పిండి ఆడించెస్తే ఆస్వంతప్రత్యేకత, దాని పొరలు నలిగిపోవడంతోటే పోతుంది.  శూన్యత్వమనేది వాస్తవానికి ఈ స్థూలరూపము లేక ధనరాశి దశకు సహకరించిన శక్తిని తొలగించివేయుటే. అదేవిధంగా ఎంతకాలం మనిషి తన స్వంత వ్యక్తిత్వస్థూలస్థితిని నిలుపుకుంటాడో అంతదనుక అతని ప్రత్యేక వ్యక్తిత్వం గోధుమగింజవలె లెక్కింపబడుతూ వుంటుంది.  గోధుమగింజ  పిండి అవడంతో లేక ఋణదశకు రావడంతో సున్నితంగాను సూక్ష్మంగాను మారి గింజగానుండిన ప్రత్యేకతను కోల్పోయింది.  ఈ ప్రక్రియలో దానిలోని స్థూలకణాలు విచ్ఛిన్నము చేయబడి బంధనాలు పగులగొట్టబడ్డాయి. మరోమాటలో చెప్పాలంటే ధనరాశిత్వముపోయి ఒక సమతాస్థితి ప్రవేశపెట్టబడింది.  అది సత్యముతో సన్నిహిత సంబంధమేర్పరచింది.  అప్పుడాతడు ధనరాశికాడు ఋణరాశీ కాడు.  రెండింటికి అతీతుడు.  నాగురుదేవులను నేను ఎప్పుడూ ఏ ఇతర భావనతోను గాకుండా ఆభావనతోనే గ్రహించాను.  ఆయన వెలుగే అందరిలో అంటే మిత్ర శత్రు హృదయాలలో సమంగా ప్రకాశిస్తున్నట్లనుభూతి చెందాను.  తత్ఫలితంగా తుదకు నా ఆత్మే అన్నింటిలోను ఉన్నట్లనుభూతి చెందడం ప్రారంభించాను.  ఒక కుక్కకూడా నాకు సన్నిహితమైనదిగానే అనిపించింది.  ప్రతి తేడా అంతరించిపోయింది.  ఒక బంగారుముద్ద మట్టిముద్దా విలువలో నాకు ఒకటిగానే కనిపించాయి.  ఒకదానితో మరొకటి పోల్చిచూసే తత్త్వం దాదాపు అంతరించింది.  చూడగా బంధుత్వ బంధనాలన్నీ కత్తిరించివేయబడి నట్లయినది. నేను నాబంధువులలో ఎవరినీకూడా ఆప్యాయతా భావంతో చూడలేదు.  మాతండ్రి, తల్లి, సోదరులు మరియు బిడ్డలు అందరూ నాకు ఎంతమటుకుండాలో అంతంతమాత్రంగానే కనిపించారు.  ఇది సామాన్యంగా సాధించనలవిగాని స్థితే.  అయినా సహజమార్గ సాధనద్వారా సులభంగా సాధించుటకు వీలౌతుంది.  ఈస్థితి దానికైఅదే కొంతపురోభివృద్ది గడించగానే పొటమరిస్తుంది.  వాస్తవానికిది వైరాగ్యదశలో కూడా చాలా పురోభివృద్ది చెందిన తర్వాత కలుగుదశ.  ప్రస్తుతం నా సహచరులు అనగా నావద్ద నాతోపాటు శిక్షణ పొందుతున్న వారిని నేనొకవేళ వారిని నాశిష్యులనుకుంటే, మాగురువర్యుల కృపావిశేషంచేత అద్భుతరీతిలో కత్తిరించివేయబడ్డ బంధుత్వ బంధనాలు మరలా తగిలించుకొని నన్ను నేను అష్టకష్టాలపాలు చేసుకోవడమే అవుతుంది.  వారు నాశిష్యులన్న భావన నాఅంతరంగంలో ఏర్పడితే నేనే గురువునన్న ఊహను రేకెత్తిస్తుంది.  కనుక అటువంటప్పుడు నాచేతయివ్వబడిన శిక్షణ ఎప్పుడూ స్వచ్ఛముగా వుండదు.  మరియు  అహంకారభావనా రహితముగా కూడా వుండదు.  అంతేగాక నాస్థాయిని కించపరచి లేక అగౌరవపరచే పనిచేస్తే నాలోని కోపావేశమును ప్రేరేపించినట్లగును.  మహాత్ముడగు మా గురుదేవులు ఈ నీచదుర్గుణమును మనసంస్థ నుండి శాశ్వతముగా దూరమొనరించుగాక.  ఇప్పుడు నేనెవ్వరినీ నాశిష్యులుగా భావించడం లేదు గనుక వారు నాయెడల ధిక్కారముగా మెలగినారనుకొనుటకు ఆస్కారమే లేదు.  దీన్ని నీవు హృదయనేత్రముతో పరిశీలిస్తే అది ఉనికిరహితత్వ భావనను పెంపొందిస్తున్నట్లు నీవు గమనింపగలవు.  ఈ విధంగా మనం కడకు అందుకోవలసినదేదైతోవుందో దాని సాధన తొలుదొల్తనుండే చేపట్టినట్లయింది.

 

***


మన నిజస్వభావము

 

        మనిషిలో ప్రాణప్రదమైనశక్తి మనస్సు లేక మతి.  అది ఇదమిద్దముగాని అనేకవిధములుగా తెలుపబడింది.  కానీ అది అన్ని ఆలోచనలను, ఉద్వేగములను, స్పందనలను అదుపు చేస్తుందనిమాత్రం అందరూ సర్వసామాన్యంగా అంగీకరించిన విషయము.  అది సామాన్యంగా అదుపుతప్పి ఎక్కువగా చెడువైపు మరలి యుండుటవలన అది ఉనికిలోని నిజస్వభావానికి వ్యతిరేకమని నిందించడం జరుగుతున్నది. కానీ అది దాని నిజస్వభావము కాదు. కానీ అది తప్పుడుశిక్షణవలన అలా అయినది.  వాస్తవమునకు క్రమపరచబడిన మరియు సమస్థితికి తేబడిన మనస్సు మాత్రమే మన జీవనసమస్యను పరిష్కరించదగిన ఏకైకసాధనము.

 

        మనస్సుయొక్క మూలస్థానాన్ని గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. దీని అతిసూక్ష్మమైన ఉనికిని సృష్ట్యారంభంలో కలిగిన క్షోభ లేక కుదుపునుండి దాని నిజస్థితిని గుర్తించనగును. ఆ తొలిదశలో ఏమూలసత్తా పనిచేసి సృష్టిని ఉనికిలోనికి తెచ్చిందో ఆమూలసత్తాకు మనస్సు అతిసన్నిహితంగా వుండినది.  నేను ఈ విషయమును "రాజయోగప్రభావము" లో విశదీకరించి యున్నాను.  అది ఇలావుంది--

 

        "మానవ మనస్సుయొక్క మూలమునకు సంబంధించిన సిద్దాంతమును గురించి ఈ పుస్తకములో విశదీకరించిన విషయములు సమంజసమైన యోచనల ఆధారముగ వ్రాయబడినవి.  మొదటి క్షోభ భగవంతుని అంతర్గత ఇచ్ఛానుసారము చైతన్యవంతము చేయబడినది.  అదే ఇప్పటి ఉనికికి కారణమైనది.  క్షోభ అంతర్గత శక్తులలో కదలికనుదెచ్చి ప్రతి ఉనికిలోను ముఖ్యమైన చైతన్య రూపమున సృష్టి మరియు జీవత్వమును ప్రారంభించినది.  మనిషిలో అది మనస్సుగా తెలియచేయబడినది.  దాని మూలమున తొలి క్షోభవంటి అంతర్గత ఇచ్ఛాశక్తియే పనిచేయుచున్నది.  ఆవిధంగా మానవ మనస్సు మూలసత్తాకు లేక తొలిక్షోభకు చాలా దగ్గరి పోలికగలిగి యుండటమేగాక దానిలోని ఒక అంగమే అయివుంది.  అందువలన రెండిటి పనితీరు ఇంచుమించు సమానము."

 

        మనస్సు లేక మతి, ప్రపంచమీతీరున వస్తురూపము దాల్చుటకు కారణభూతమైన ఒకానొక అంగముగా పనిచేసెను.  క్షోభ లేక కుదుపే ఆపరిపూర్ణమునకు ఆనుకొనియున్న మనస్సు.  మతములందు తెలిపినట్లు దాని ఫలితమే సృష్టి.  సృష్టి జరుగవలెనన్న భావన దానితో చేర్చబడి యుండినది. కానీ రెండు వ్యతిరిక్తతలు ఎప్పుడూ కలిసే వెళుతుంటాయి.  ఉద్దరణ మరియు పతనము రెండూ ఒకేసారి పనిచేస్తాయి.  ఎక్కడ ఉత్పాదక ఎదుగుదలవుంటుందో  అక్కడే వ్యతిరేక ప్రవృత్తిని నశింపచేసే క్రియ అంతర్గతంగా జరుగుతునే వుంటుంది.  అది సహజంగా రెండువిధములైన శక్తిగా పరణతి చెందివుంది. ఒకటి వస్తువులను ఉనికిలోనికి తెస్తుంది.  అది ధనశక్తి ఇక మిగిలినది ఋణశక్తి.  మనం మనఉనికిని కలిగింపచేసుకొని తిరుగు ప్రయాణం ద్వారా మూలము చేరాలంటే తప్పనిసరిగా మనల్ని మనం ఋణశక్తిగా మార్చుకోవాలి. అందుకదొక్కటే మార్గము.

 

        ప్రకృతిలో ప్రతి పదార్థము గుండ్రముగా వుండటము ఆశ్చర్యకరము.  అందువల్లే ఒక వలయంగా ఏర్పడి శక్తి ప్రవహించుటకనుకూలమైనది.  ధనశక్తి తిరుగుతూ ఋణశక్తి వెంట కదిలి భగవత్ సంకల్పము మేరకు ఏర్పడిన ఉష్ణమాధ్యమమున ఉత్పాదక ఎదుగుదల సాధ్యమైనది.  అతీంద్రియస్థితిలో నాకు దృగ్గోచరమైన ప్రకారం ఈసృష్టిప్రక్రియకు  దాదాపు నూటాఇరవైవేల సంవత్సరాలు పట్టినది.  అలా సృష్టి జరుగునపుడు ఏర్పడిన కదలికవల్ల ఉష్ణముత్పన్నమై రూపములు, ఆకారములుగా మార్పుజెందుటకు ఆధారమైనది.  ఇది మనలోకూడా వుంది.  అదే మన సంపూర్ణ నిర్మాణమునకాధారము.  ఏదోవిధంగా  ఈఉష్ణమును సమస్థితికి కొనివచ్చినట్లైన అది దాదాపు మూలశక్తిని పోలివుంటుంది.  మనలను ఈ ఎఱుకగలస్థితికి  గొనివచ్చిన అంతర్గతఅగ్నిని ఉధృతము చేయవలయునన్న భావనను కొందరు మతగురువులు ప్రవేశ పెట్టిరి.  అది తప్పుడు భావన.  వాస్తవమునకు ఉష్ణము లేక అగ్ని చల్లార్చబడవలయును.  తద్వారా దాని ఉత్పదకత ప్రభావమును నిర్మూలింప వచ్చును.

 

        కాలముయొక్క మూలమును సృష్టి రూపుదాల్చిన నాటివరకు కూడా గుర్తింపవచ్చును.  క్షోభ చైతన్య వంతమగుటకు పట్టిన సమయమే కాలము.  అది తన పూర్ణస్థితిలో శక్తియై యుండెను.  సమర్థులైన యోగులు దానిని సద్వినియోగ పరచుకొనగలిగి యుండిరి.  పూర్వకాలపు యోగులకు దీని విషయము తెలియదనిచెప్పుట తప్పు.  వారు తెలిసినట్లు బయటకు కనపడరు కానీ నిర్మాణ కార్యములందు అవసరమని తోచినపుడంతా దీనిని ఉపయోగపెట్టిరి.  అది వారు సాధించిన చాలాగొప్పస్థితి.  ఈ స్థితిని సాధించినవారికి ఆకాశము (భూమా) పై కూడా అధికారము కలిగియుందురు.  శ్రీ అరవిందులవారు చాలాగొప్పగా వచించిన దైవీయమనస్సు (అధిమానస శక్తి) వాస్తవానికి భగవత్‌శక్తి ప్రత్యేకావతార రూపమున భూమండలముపైనుండగా ఎప్పుడూ వుండనే వుంటుంది.  నిజానికి ప్రపంచ తత్త్వమును సమూలాగ్రముగా మార్చుటకు కావలసినది ఆ అధిమానసము కాదుగాని ఒక బలమైన శక్తి మాత్రమవసరము.  అది సూక్ష్మాతిసూక్ష్మము గనుక చాలా శక్తివంతమై వుంటుంది.  దీన్నే వారు అధిమానసమని అంటే అనవచ్చును.  అది అత్యంతగొప్ప నిక్షిప్తశక్తి.  అది సత్వరజస్తమో గుణములకంటే కూడా చాలా ఉన్నతమైనది.  అంతకంటే ఉన్నతమున ఇంకనూ గొప్ప శక్తియున్నది. కేవలము మహాశక్తివంతుడైన యోగ్యయోగియై ప్రకృతి కార్యనిర్వహణమునకై వచ్చినవాడు మాత్రమే దీనిని ఉపయోగించ గల్గును. నా ఉద్దేశ్యములో భగవదీయ శక్తులను ఉపయోగించు సమర్థతలేని వాడు దివ్యత్వము లోనికి కనీసము తొంగిచూడనుకూడా తొంగిచూడలేడని తెలియనగును.

 

        సృష్టిచేయుటకై దిగివచ్చిన ఆచైతన్యశక్తి సంపూర్ణస్థితిలోవున్నది.  మన వ్యక్తిగత మనస్సు దాని ఆఖరికొసయై యున్నది.  ప్రస్తుతం ఒకవేళ మనం ఆరెండింటి మధ్య సమన్వయం కుదర్చగలిగితే మనం ఒక మహోన్నత స్థాయినందుకుంటాము.  దాని తర్వాత యిక మిగిలి వుండేది సంపూర్ణత్వమే (భగవంతుడే).  ఒక ఉన్నతస్థాయికి చెందిన నా సహచరుని పైఅనుభవము పరిశీలించు నిమిత్తము తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఒక అరనిముషము మాత్రము ఆస్థితికి పంపిచూశాను.  అదికూడా అతని మనస్సులోని అధమవృత్తులు మూలమువైపునకు వెళ్ళనిచ్చినంత వరకే పరిమితం చేసినాను. అయినప్పటికి తత్ఫలితముగా అతని హృదయము బరువెక్కి బాధపడజొచ్చాడు.  అతన్ని నేను క్రమపరచడానికి ఒకటిన్నరమాసము ప్రయాసపడవలసి వచ్చినది.  మనిషి ఉనికిలోనికి ఇష్టతతో ప్రవేశించినశక్తి ఆకాశము ద్వారా పయనించి మార్పును కలిగిస్తూనే వుంది.  ఎందుకంటే అది దిగివచ్చినది చైతన్య పరచడానికే.  అది అన్ని చైతన్యశక్తులు సామాన్యంగా చేసినట్లే ఒక కేంద్రాన్ని ఏర్పరచింది.  ఈ కేంద్రమే చిత్తసరస్సుగా గుర్తించబడింది.  అది తనకవసరమైన వాటినన్నిటిని సృష్టించుకుంటూ క్రిందికి దిగివచ్చింది. సృష్టిప్రక్రియకు సహాయమందించిన కారణమే, వలసినవి సమకూర్చుకొనుట ప్రారంభించినది.  చిత్తసరస్సులో ఉన్నవన్నీ క్రిందికే వాలివుంటూ పైకిమరలే వాలకమే అచ్చట కానరాదు.  అక్కడ తనస్వశక్తి లేక గురువుశక్తి పూనికతో సాధకములుగా పనిచేస్తే తప్ప పైకిమరలవు.  అలా సమకూరి దానిపై బలప్రయోగం జరిగితే పైకి ప్రాకేప్రక్రియ ఊపందుకుంటుంది.

              

        ఇప్పుడు మానవ ఉనికిలోనికి ప్రవేశించిన కుదుపు స్వల్ప తరంగములను సృష్టించి ఒక నవ్యశక్తికి కారణభూతమైనది.  ఆశక్తి విశుద్దిచక్రము (కంఠమున కలది) లోనికి అణువులద్వారా దిగి వెళుతుంది.  ఈ చక్రము తరచు భిన్ననామముతో తెలియపరచబడుతున్నది.  ఇది పిండ మరియు బ్రహ్మాండ ప్రదేశముల కూడలిస్థానము.  ఇదే మాయకు మూలస్థానము.  ఇక్కడ అమితమైనశక్తి స్థావరమేర్పరచుకొని వుంటుంది.  ఈ ప్రదేశమును ఆలోచన స్పృశించినప్పుడే మనిషికి కలలు వస్తాయి.  అగ్ని కేంద్రము దీనికి బహు సమీపములోనే వుంటుంది.  పురాతన ఆరురాగాలలో ఒకటైన దీపక్‌రాగాన్ని ఈ కేంద్రము నుండి ఆలాపిస్తే ఆరిపోయినదీపాలు తిరిగి వెలుగుతాయి.  ఎప్పుడైతే యిది ఆస్థానం నుండి హృదయానికి దిగివస్తుందో అప్పుడే దానివెంట మాయాస్థితిని కూడా కొనివస్తుంది.  అయినప్పటికి దీనికి పైస్థాయిన వున్నస్థితులను కూడా అంతర్గతంగా ఇది కలిగి వుంటుంది.  ఇది ఇప్పుడు మూడు శాఖలుగా విడిపోతుంది.  మధ్యది కాస్తా క్రిందికి జరిగి "ఎ" బిందువుగల ప్రదేశములో ఒకముడి (గ్రంధి) గా ఏర్పడుతుంది.  మిగిలిన రెండూ కుడి ఎడమలకు వెళతాయి.  ఎడమవైపు అది హృదయపు క్రింది ప్రదేశంలో ప్రవేశిస్తుంది.  ఒకవేళ అద్భుతములుచేయు సామర్థ్యము ఉత్పన్నము చేసుకోవాలనుకుంటే అట్టివాడు తన్నుతాను మాయాస్థితిచే దట్టించబడిన ఆ భాగపుశక్తితో బంధమేర్పరచుకొనవలెను.  నేనొక విషయమును ప్రకటిస్తున్నాను. అదేమంటే కేవలం ధ్యానమొక్కటే అద్భుతములనుత్పన్నముచేయు సామర్థ్యము కలిగియున్నది.  కానీ ఆధ్యానము దైవీయ లేక భగవత్‌ప్రాప్తికి సంబంధము లేనిదై యుండవలెను.  ఇది ఒక చిన్న సూచన మాత్రమే.  దీని నింకనూ విశదపరచదలచను.  భాగవత పురాణము కూడా అద్భుతములు కలిగించు ధ్యాన పద్దతులను తెలిపియున్నది.  కానీ అది శ్రీవిష్ణుదేవుని ఈమాటలతో సమన్వయ పరుస్తున్నది.  "ఎవరు నన్ను భక్తితో పొందాలనుకుంటారో వారు నన్ను పొందడముతో పాటూ అద్భుతశక్తులు కూడా పొందుతారు".  ఇది పచ్చినిజము. అగ్ని, గాలి మరియు యితర భూతములు ఎలా ఉత్పన్నమై ఉనికిలోనికి వచ్చినవో ఆ విషయములు నేను చర్చించదలచుకోలేదు.  కారణం ఈ విషయాలు ఇప్పటికే మన మత గ్రంధాలు చాల చాల చర్చించాయి.

 

        ఇప్పుడు మనల్ని క్రిందికి దించిన శక్తిమాధ్యమం ద్వారానే మన గమనాన్ని పైకి నెట్టే ప్రయత్నంచేయాలి.  ఇది అభ్యాసికి చాలా కష్టతరమైన పనియౌతున్నది.  కనుక మనం మరో మార్గాన్ని ఎన్నుకోవలసి వస్తున్నది.  అది మొదట ప్రక్కనున్న రెండవ సంఖ్య బిందువు వైపుకు కదిలి అక్కడనుండి  3, 4, మరియు 5వ సంఖ్య బిందువుల వైపునకు అదేవరుసలో పురోగమించాలి.  ఈ పద్దతిలో మనము బిందువుల క్రిందవున్న ఉపశక్తులను ఉపయోగపెట్టుకొని ఈ కార్యసాఫల్యమునకు మరింత ధృఢతరం కావలసియున్నది.  విశుద్ధచక్ర పరిధి దాటిన తర్వాత మనం శక్తితోనింపబడి వుండటం వలన మరియు దివ్యత్వము గావింపబడు ప్రక్రియ మొదలైయుండి యుండుటవలన మనదారి చక్కగా నేరుగా ఏర్పరపబడివుంటుంది.  దివ్యత్వం చెందడం అంటే నా అర్థంలో ఇంద్రియములన్నీ, శక్తియుక్తులన్నీ సమన్వయం చేయబడి తమ నిజస్థితికి తేబడి సత్యతత్త్వంలో లీనమవ్వడమే.  దివ్యత్వంజెందడంలో తుదిస్థితి మనకు ప్రాప్తించాలంటే దేహములోని ప్రతి అణువు సత్యస్థితి అంటే తుదిస్థితితో మనం సంపూర్ణంగా ఐక్యమైపోవాలి.

 

***


గీత

 

        సరళము, నిరహంకార స్వభావముగల మనస్సు కాలముతోపాటు మార్పుచెందుతూ రంగులను సంతరించుకొని వాటి ప్రభావమును మనలోని బహిరంతరములందంటను వ్యాపింపజేసింది.  మనం ఆలోచనలోనికిగాని, చేతలలోనికిగానీ ఏదితెచ్చినా అది అన్నివైపుల రంగులమయమై వ్యక్తమౌతున్నది.  అట్టి లక్షణములుగల వాతావరణము మరియు పరిసరములతో అధికాధికముగా తగుల్కొని యుండుటవలన మనలో భారము మరియు స్థూలత్వము వుత్పన్నమైనది.  సూక్ష్మత్వం నశించినది.  మన దృష్టికి వచ్చిన ప్రతిది అదేభావాన్ని తెలుపుతున్నది. ఇది కేవలం మన జ్ఞానానికి ముసుగువేసి వుంచడమే గాకుండా మన హృదయం మేధస్సును కూడా తదనుగుణంగా ప్రభావితం జేసింది. ఇదేరకమైన మానసిక ధోరణి విద్యావంతుల మేధావుల రచనల్లో కూడా ప్రతిఫలించింది.

 

        సంపూర్ణ విషయగ్రహణమునకు వ్యక్తి తగిన అనుభవ పూర్వక మానసికస్థితి ముందుగా కలిగియుండి ఆతర్వాత ఇతరులకు వివరించుటకు పూనుకోవలెను.  ఇట్టి విషయ వివరణమే మన పవిత్ర గీతాశాస్త్రము.  గీతపై అనేక వ్యాఖ్యానములు ఇప్పటికే వున్నవి.  ఇంకా ఎన్నో వ్యాఖ్యానములు లిఖింపబడి జమచేయబడుతూనే వున్నవి.  ప్రతీవారు తమతమ సమర్థింపు పాండిత్యపు స్థాయికనుగుణముగా రచించి వారిస్థాయి పాఠకులకొరకందించిరి. ఇందు వారుపడిన భౌతిక (శారీరక, మానసిక) శ్రమ కొంతవరకు అభినందనీయమేయైనను, ఇంతవరకు అసలుప్రయోజనము మాత్రము సిద్దింపనేలేదు. మొగమాటము లేకుండా చెప్పాలంటే ఈ వ్యాఖ్యానములన్నీ అసలుసిసలైన స్వచ్ఛమైన గ్రంధవిషయాలను వారి పొరబాటు అభిప్రాయముల వలన మసకపరచి గ్రంధములను మరింత జఠిలము చేసివేసిరి.  మరోమాటలో చెప్పాలంటే మరిన్ని చిక్కులపైచిక్కులు కల్పించి హద్దూపద్దూ లేకుండా మనమే హెచ్చించుకుంటూ పోయాము.

 

        భగవంతుని పూజలందు కూడా ఇదేవిధానము అవలంబింపబడింది. భగవంతుని అచ్చం మనిషిమాదిరే ఉన్నాడనుకొన్నారు.  కాకపోతే  భగవంతుడు గొప్పగనుక గొప్పకుతగ్గట్టు పరిధిపెంచి ఊహించారు.  కానీ నేనీవిషయం జోలికిప్పుడు పోకుండా ప్రస్తుత విషయానికి తగినట్లు సర్దుకుని వివరిస్తాను.

 

        ఆనాటి సమయానుకూలంగా అవసరానికి తగినట్లు శ్రీకృష్ణపరమాత్మ గీతలో అర్జునునకు వివరిస్తూ, సత్యాన్ని ఆవిష్కరించారు.  అది కారణంగా మనం పరమాత్మకు బహుదా ఋణగ్రస్తులమయ్యాం.  మన ఉద్దరణకు ఆయన ఎన్నో విషయాలు బోధించారు.  అవన్నీ మనకు కాలక్రమేణా దారిచూపే వెలుగయ్యాయి.  అది కేవలం ఒక మహత్తర చర్చ మాత్రమే కాదు.  భగవన్మార్గములో పయనించే జిజ్ఞాసులకందరికి అవసరమైన సత్యావిష్కరణములు.  అవి సాధకుడు తన పురోగమనావసరమున పొందు వివిధ స్థితులతో ప్రత్యక్ష సంబంధము గలిగి యుండినవి.  సరైన సాధన ఫలితంగా పొందబడు స్థితులకు సంబంధించిన ప్రత్యాక్షానుభూతుల వివరణమే అది.  ఉద్దరింపబడిన మహాత్ములు ఈనాటికి ప్రపంచములో వున్నారు.  వారు మహోన్నత స్థితుల అనుభూతులనొక్కింత మన దృష్టికి తేగల సమర్థులై యున్నారు.  అంతేకాక వారు వారి అంతర్గతశక్తినుపయోగించి ఉన్నత ఆధ్యాత్మికస్థితులను మీయందు వారు తక్షణమే ఉత్పన్నము చేయగలరు కూడా.

 

        ప్రస్తుతం మనం చూస్తున్న గీతాపాఠము మొత్తము చెప్పుటకు ఎంత సమయము శ్రీకృష్ణపరమాత్మకు పట్టియుండునో యోచింతము.  ఇరు సైన్యములు ఎదురెదురుగా రణక్షేత్రములో మొహరించి వున్నాయి.  రణభేరీ ధ్వనులు యుద్దప్రారంభ సమయమును సూచిస్తూ మారుమ్రోగి పోతున్నాయి.  అట్టి సన్నివేశంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు అవసరమగు బోధనాపాఠము చెప్పుటకు ఏమాత్రమూ సమయము ఆయన కనుకూలముగా నుండును?  కనీసము వల్లించడానికైనా కొన్ని గంటలు పట్టును కదా.  మరి ఆ క్లిష్ట సమయములో ఎలా సాధ్యమైనది? పరిస్థితులదృష్ట్యా ఇందుకాయన కొన్ని నిముషములకు మించి సమయము తీసుకొనియుండరు.  వాస్తవమేమంటే శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా అర్జునునకు కొన్ని నిముషములలోనే ప్రాణాహుతి ప్రసారము గావించి సమయానుకూల ప్రయోజనము పొందుటకవసరమగు మానసికస్థితులను ప్రసాదించెను.   నిజానికవి అభ్యాసి ఆధ్యాత్మిక మార్గమున పురోగమిస్తూ పొందుస్థితులు. ఈప్రక్రియ  అర్జునుని తక్షణమే ఆధ్యాత్మికోన్నత స్థితులకు గొనివచ్చి ఆతని హృదయములోని కూడని బంధనములనుండి  బయటకు లాగివేసెను.  అంతటి శక్తిగల మహనీయుడుంటే ఈనాడైనా అట్టి పని సుసాధ్యమే.  కానీ మనం సర్వసామాన్యంగా చూస్తున్నదేమంటే జీవితాంతం ప్రజలు గీత వింటున్నారు.  పారాయణం చేస్తూనే యున్నారు కానీ దాని ప్రభావం మాత్రం వారు అనుభూతి చెందడం లేదు.  సంవత్సరాల తరబడి గీత వింటున్నా ఏఒక్కరు కూడా అర్జునినివలె వెనక్కు మరలి కార్యోన్ముఖులు కాలేదు.  కారణం గీత ఇతరుల కొరకు పారాయణం చేసే వారిలో ప్రాణాహుతి ప్రసారముద్వారా అందులోని సత్యమును శ్రోతల హృదయములకు చేర్చగల సమర్థులుకారు. అందువలననే ఏస్పందనా శ్రోతలలో కలగడం లేదు.  ఆ ప్రయోజనం పొందటానికి బోధించేవాడు గీతలో తెలిపిన ఆధ్యాత్మిక స్థితులను అనుభవపూర్వకముగా అధిగమించియుండాలి.  అతడు శక్తివంతమైన ఇచ్ఛాబలము, ఆధ్యాత్మికశక్తి గలిగి తనమాటలయొక్క తరంగములు శ్రోతల హృదయముల వరకు వెళ్ళి ప్రాణాహుతి ప్రసారప్రక్రియద్వారా వారిని ప్రభావితము చేయగలిగి వుండాలి.  అప్పుడు మాత్రమే బోధనవలన శ్రోతలకు ఉపయోగముంటుంది.

 

        గీతలో చేసిన బోధన ప్రకారం మనకు బోధకులు మరియు గొప్పస్థాయికి చెందిన పేరుమోసిన ప్రవచకులూ ఎప్పుడూ చెప్పేదేమిటంటే మనిషి ఎప్పుడు కూడ తాను ఏపని చేసినా ఆపనికి తాను నిజానికి కర్తనుకానని భావించాలి.   కానీ అదే సమయంలో గమనించదగ్గ వాస్తవాంశమేమంటే కేవలం చదవటం లేక వినడం వలన ఏ ప్రయోజనం వుండదు.  దానిని సాధించటానికి కావలసిన పద్దతిని అనుభవపూర్వకంగా చేపడితేనే ప్రయోజనముంటుంది.  కానీ మనం అట్టిపద్దతికి సంబంధించి ఎప్పుడూ అంధకారంలోనే వున్నాము. ఎక్కడా ఏకొద్ది వివరణాంశమూ వారిచర్చలో ప్రసక్తికేరాదు. తత్ఫలితంగా వినువారు తప్పుడునిర్ణయానికి వచ్చి తరచూ "నేను కర్తను గాను" అని మాటిమాటికి అనుకుంటూ వుంటే అంతేచాలు అనుకుంటారు.  నిజానికి అసలైనదొక అంతర్గత మానసికస్థితి. ఆస్థితిలో సాధకుని భౌతికచర్యలు హృదయముపై ఎట్టిముద్రలు కలిగించలేవు. అదేసమయంలో అతడు తానుచేస్తున్నానన్న భావన కూడా కలిగివుండే అవకాశమే లేదు.  ఎప్పుడు ముద్రలు ఏర్పడవో సంస్కారములు ఏర్పడవు. అట్టియెడ అనుభవించు (భోగించు) టన్నది వుత్పన్నమే కాదు.  ఈ విధంగా సంస్కారములేర్పడుటన్నది నిలిచి పోతుంది.  ఇది ఆధ్యాత్మిక మార్గమునందున్న వారికి అత్యంతావశ్యకము. వాస్తవానికి అర్జునునకు ప్రసారం చేసిన అసలుస్థితి ఇది.  దాని ప్రభావమున అతడొక్కసారిగా ఉన్నతోన్నత స్థితులకు సంబంధించిన ఎఱుకలోనికి వచ్చెను. అర్జునుడు ప్రాణాహుతి ప్రసారంద్వారా పొందిన స్థితులను సంక్షిప్తముగా వివరించు నిమిత్తం వాగ్రూపమున వెలువడినవి కేవలం ఏడు శ్లోకాలే.

 

        ఆత్మస్థితి గురించి గీతలో వర్ణించినదంతయు అదే విషయముపై యిచ్చిన మరింత వివరణమే.  అనుభవ పూర్వకముగా ఆస్థితినందుకున్న తర్వాత వ్యక్తి దానినే అంతటా గమనిస్తాడు. అదే వాస్తవమున సాక్షాత్కారస్థితి.  నిష్కామకర్మ లేక ఫలితమాశించని కర్తవ్యనిర్వహణ గూర్చి గీత చాలా గట్టిగా నొక్కివక్కాణించినది.  ఇట్టి మాటలు ఎప్పుడూ కేవలం వల్లిస్తూవుంటే ఆట్టిస్థితి లోలోన వుత్పన్నం కాదు.  సాధించుటకు కావలసిన పద్దతి ఆచరణ చేపట్టితేనే కాని అది మనలో పొడసూపదు.  ఇది వాస్తవానికొక విధమైన లయావస్థ. ఇది (లీనస్థితి) పొందకుండా అర్జునునకు చూపించిన విరాట్ స్వరూపమును దర్శింప సాధ్యము కాదు.  దీనికి తోడు తగిన సామర్థ్యము మరియు గొప్ప అంతర్‌దృష్టి అభ్యాసి పరమై యుండుట ఈ కార్యమునకత్యంతావశ్యకములు. విరాట్ దర్శనమైనంతనే అర్జునుడు సైతం ఆ భయానక దృశ్యమును చూడశక్యము గాకున్నదని ఎలుగెత్తి వేడుకొనెను.  కారణం అతనికి ప్రాణాహుతి ప్రసారము గావించిన లయావస్థ కేవలం విరాట్‌దేశమునకు సంబంధించినది మాత్రమే.  కానీ అతడు దర్శించినది పూర్తి శక్తివంతమైన బ్రహ్మాండమండలము.  ఇది విరాట్‌దశకు చాలా దూరపు మండలమునకు సంబంధించినది.  నిజానికి ఆ పరిధినుండే సర్వము వస్తు ప్రపంచములోనికి దిగివస్తుంది.  సంపూర్ణ మహాభారత యుద్దనమూనా అంతా అక్కడే ఆకాశములో సూక్ష్మరూపములో ఏర్పడివుంది.  ఈ జ్ఞానదృష్టినే శ్రీకృష్ణుడు అర్జునునకు ఆస్థాయి వరకు పైకిలాగి ప్రసాదించినాడు.  కొందరు ప్రజలు వున్నదున్నట్లు ఈ నిజాన్ని ఒప్పుకొనుటకు ఇష్టపడరు.  అందుకు వారి సాకులు వారికుండనే వుంటాయి.  కానీ వారికిదే మాటయిస్తున్నాను. దీనికి సంబంధించిన అనుభవపూర్వక నిదర్శనం మామూలుగా వుండాలంటే సరే.  అది కూడా నేటికీ సాధ్యమే మరియు స్వతహాగా అనుభవయోగ్యమే.  అయితే అటువంటి అనుభవములను మన ఎఱుకలోనికి తేగల సమర్థుడుండాలి.  అదేసమయంలో ఆటువంటి మహోన్నతస్థితి వరకు పైకెత్తబడినప్పటికి అచ్చట నిలబడగల సాధకుడు వుండాలి.

 

        గీత కర్తవ్యముయొక్క ప్రాధాన్యతను నొక్కివక్కాణిస్తున్నది.  అది ప్రపంచపు సాంఘిక కట్టుబాట్లకెంతో ఆధారభూతమైనది.  ఇది "రాజయోగ" పరిధిలోనిదే అయివున్నది.  అంతేగాక సంస్కారముల నిలుపుదలకు ఇది అత్యంతసహాయకారి.  ఈస్థితి ఇంద్రియవ్యాపారములన్నీ సద్దుమణిగిన తర్వాత మొదలౌతుంది. ఈవిషయంలో కేవలం చెప్పడం వినడం నిరర్థకం.  ఇది కేవలం ఆచరించడం కోసమే.  మరి అందులకు విశాల హృదయం అవసరం.  ఇదేమంత సులభంగా ఒక నిర్ధారిత సమయంలో సాధింపదగినది కాదు. గట్టి పట్టుదలతో కూడిన పరిశ్రమ, దానికి తగిన చక్కని పద్దతి ఎంతైనా అవసరం. ప్రజలు, నేను చెప్పేవాటిని పెడచెవినపెట్టే అవకాశమున్నది.  కానీ కాలప్రభావమున అనేక చిక్కులతో కప్పివేయబడియున్న సత్యతత్త్వము పొరలను తొలగించుకోనున్నది.  ప్రజలప్పుడు దాని నిజమైన ప్రాధాన్యతను గొప్పతనాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఆ సమయమతి త్వరలో ఆసన్నమగుగాక ---- తదాస్తు!

 

        గుడ్డినమ్మకానికి మేలూ, కీడూ రెండూ వున్నాయి.  ఎన్నుకున్న మార్గదర్శి నిజంగానే గొప్పశక్తిమంతుడై మహోన్నత ఆధ్యాత్మికస్థాయి సాధించినవాడై వుంటే మనకది చాలాచాలా ప్రయోజనకరము.  అట్లుగాక దురదృష్టవశమున నీకైనీవే అయోగ్యునితో బంధమేర్పరచుకొని అతని తెలివైన ప్రసంగములచేత అద్భుత ప్రదర్శనములచేత కట్టుబడిపోతే మాత్రము అతనియందు నీవుంచిన గుడ్డినమ్మకము నిన్ను తప్పుద్రోవ పట్టించి భ్రమ మరియు వంచనకు గురిచేస్తుంది.  ఇట్టి విషయములలో నీవతన్ని గుడ్డిగా అనుసరించి యుండుటచేత అతని లోపములు కూడా నీదృష్టిలోనికి రావు.  అందువలన వచ్చుఫలితము, నీవు గమ్యమును చేరుటలో విఫలమవ్వడమే.  కనుక ప్రతిఒక్కరు ఎవరినైనా నమ్మేముందు ఒకటికి రెండుసార్లు మళ్ళీమళ్ళీ ఆలోచించాలి.  నా ఉద్దేశ్యములో మనం నమ్మదలచుకొన్నవ్యక్తి మనలను ఆధ్యాత్మిక మార్గములో సమర్థవంతంగా నడిపించగలడా లేదా అని నిర్ధారించుటకు అతనితో కొన్నాళ్ళు కలిసిమెలసివుండి అతని సాన్నిహిత్యము మన మానసిక ప్రవృత్తులను శాంతపరచెనా లేక అలాగే కొనసాగుచుండెనా అన్నవిషయము గమనించి నిర్ధారణ చేసుకొనవలెను.  అతని సాన్నిహిత్యము, మనము తుదకు పొందవలసినస్థితిని కలిగించగల్గునా లేదా అన్నది, మనము చక్కగా గమనించి అర్థము చేసుకొనవలెను. పతనావస్తలో వున్న నేటికాలమున అట్టి మార్గదర్శకులు లేక గురువులు నిస్సందేహంగ అరుదుగా లభిస్తారు.  వారిలోకూడా మహోన్నత స్థితులపై అధికారము గలవారు మరీ అరుదు.  అశాంతి అలజడి నేటి కాలపు లక్షణమైయున్నది.  అందుకు ఈ కాలపు నాగరికత కూడా ఒక ముఖ్యకారణము.  ఈ పరిస్థితులనుండి బయటపడుటకు మరింత సమయము, కఠినపరిశ్రమ అవసరము.  ఈ విషమ పరిస్థితులను తొలగించుకొనుటకు గురువుగారిపై నిజమైన ప్రేమ, భక్తి భావములు అత్యావశ్యకములు.  అవి మాత్రమే అన్నివిధములా అపజయమెరుగని సాధనములు.  ఇదే తప్పనిసరిగా మనకు విజయమును కూర్చు ఏకైకమార్గము.

 

***


అనుబంధము మరియు శ్రద్ధ

 

        సీత వద్ద ఒక చిలుక వుండెను.  దానినామె అమితముగా ప్రేమించుచుండెను.  అది చనిపోయెను.  సీత తండ్రి జనకమహారాజు సీతను అమితముగా ప్రేమించుచుండెను.  ఆకారణమున ఆయన కూడా చిలుక మరణమునకు చింతించెను. ఇది కొందరినొక నిర్ధారణకుకొనివచ్చెను.  అదేమనగా గొప్ప జ్ఞానియైన జనకమహారాజు తగనిరీతిన ఒక పెంపుడు చిలుకకు బంధీయయ్యెనని.  వారి సమర్థన ఎట్లున్నను నేను మాత్రము ఒకరి దుఃఖమునకు స్పందించనివాడు మానవత్వము లేనివాడందును.  మరో మాటలో చెప్పాలంటే అట్టివాడు మనిషే కాదందును. కనుక నేను జ్ఞానులమని తమ్ముతాము ప్రతిపాదించుకొని, తల్లి, తండ్రి, సోదరులను లేక కొడుకులను శత్రువులని బోధించు వారితో నేను ఏకీభవించను.  ఆ సిద్దాంతమును నేనుగా ఎప్పుడూ ఎట్టి పరిస్థితులలోను అనుసరించుటకొప్పుకోను.  వారి దృక్పథమెట్టిదైననూ కానిమ్ము. వారు తుదకు వారి పవిత్రోద్దేశ్యమును సర్వనాశనమొనర్చు బంధనములలో చిక్కుకొని పోవునట్లు వారు ప్రవచించుచున్నారని నేను భావింతును.  ద్వేషము, వికర్షణను ప్రోత్సహింపజేయు ఆచరణలు (పద్దతులు) చేపట్టడమంటే ఆధ్యాత్మిక ప్రయోజనములకు విఘాతము కలిగించినట్లేలెక్క.

        మన ప్రయత్నములో అత్యావశ్యకమైనది, మాయ, మోహము లేక భౌతికబంధనములను భావములను స్వాధీనమునందుంచుకొనుట.  కానీ ద్వేషము లేక వికర్షణ ప్రేమకు పూర్తి వ్యతిరేకములు.  అనుబంధం కూడా అదే వర్గమునకు చెందినదే.  కాకపోతే అది సరిగ్గా అదే వస్తువు యొక్క అవతలికొస.  కనుక అనుబంధమునకు బదులు దానికి వ్యతిరేకమైన వికర్షణ లేక ద్వేషమును ప్రోత్సహించుట కేవలమసంగతము.  అలాచేయడం వలన మాయా మోహభావమునుండి ఎన్నటికీ విడివడలేము.  ఇందులకు అసలుసిసలైన ప్రత్యామ్నాయము "కర్తవ్యము".  అది ఆకర్షణ, వికర్షణలకు రెండింటికి అతీతమైనది.  కనుక తండ్రిని తండ్రిగా, తల్లిని తల్లిగా మరి కొడుకును కొడుకుగా ఆదరిస్తూ వారియెడల తన కర్తవ్యమును నిర్వహిస్తూ వుంటే అందులో ఏతప్పూ లేదు.  అప్పుడతడు రెండు భావముల నుండి స్వేచ్ఛను పొందివుంటాడు.  వాస్తవానికి వుండవలసిన పద్దతి అదే.

 

        జనులు మరీ ప్రాధమికదశను సాధించడంతోనే విర్రవీగుతూ అంతా తమకే తెలుసునన్న అహంకారముతో వుంటూ తిరిగి వారు గర్వము, క్రౌర్యము తగని వంటూ సభలలో పెద్దపెద్ద ప్రసంగాలు చేస్తారు.  అందుకు వారి అనుభవరహిత కేవల పుస్తకపరిజ్ఞానమే కారణము కావచ్చును.  సామాన్యంగా ఆధ్యాత్మికరంగమున ఏ అనుభవజ్ఞానము లేకుండానే బోధించుటకుపక్రమించే వారున్నారు.  అట్టివారు ఈ దుష్టత్వానికి లోనౌతారు. అహంకారమనే గొలుసుకు గర్వము, క్రౌర్యమనునవి మరో వలయమై (రింగు) తగులుకుంటుంది.  ఈ జడమైన చెడు నుండి తప్పించుకొని రక్షణపొందుటకు వ్యక్తి మనసంస్థలో నియమించిన ప్రార్థనను మనఃస్పూర్తిగా చేసి తననుతాను భగవంతునితో నేరుగా అనుబంధించుకొనవలెను.  ఎవరైనా కనీసం ఈ ప్రాధమిక సిద్దాంతమును కూడా అనుసరించి ఆచరించడానికి శ్రద్ధ చూపకపోతే అతడు కేవలం పొద్దుపోగొట్టుకొనుటకై వినోదార్థం ఈ మార్గమునకు వచ్చినట్లు నేను భావింతును.

        దృఢనిశ్చయము, మొక్కవోని ధైర్యము మగవాడనువానికి వుండవలసిన అత్యావశ్యక లక్షణములు.  అంతిమ విజయమునకు కావలసినవవే. అయినప్పటికీ ఈ విషయమున నా సలహాను మామూలుగా పెడచెవిన బెట్టుచున్నారు.  బహుఃశ నాకు పాండిత్య ప్రకర్ష లేకపోవడం వలనగావచ్చు.  సామాన్యంగా ప్రజలు నేర్పరియైన వారియందు దీనినే గౌరవిస్తారు.  చదువు మరియు విజ్ఞానమునకు వాటివాటి ప్రాధాన్యత వాటికున్నది. అది కలిగినవారిని ప్రజలు గొప్పగా గౌరవిస్తారు.  నాకూ వారియెడ గౌరవభావమున్నది.  అందుచేతనే నేను వారి ఘనతను అన్నివిధాల మన్నించి వారితో వినయంగా మెలుగుతాను.  కానీ నావిషయానికొస్తే నేనెప్పుడూ జ్ఞానంకోసం ప్రాకులాడలేదు. ఉన్నదున్నట్లు మాట్లాడితే నేను ఏరకంగానూ జ్ఞానము లేనివాణ్ణి కాను.  నేను దాన్ని సంపూర్ణంగా పొందివున్నాను. ఎలాగంటే మహనీయుడైన మాగురుదేవులు నాకు సర్వము ప్రసారము చేసినారు.  అందులో జ్ఞానమూ చేరియున్నది.  ఆ కారణమున నేను అన్నివిధములైన జ్ఞానములు సంపూర్తిగా కలిగియున్నానన్న భావనతో వున్నాను.  అందులో అతి తక్కువనుండి మహాజ్ఞానము వరకు అన్నీ నావశమందున్నాయి.  కానీ వాటిని బయటకు వివరించుటకు తగినపదజాలము విషయములో నేను వెనుకబడి వుండవచ్చును.  కానీ ఇది నా మానసిక లక్షణమైన మెత్తదనము మరియు నాస్వభావము.  ఇది నేను నాగురువుగారి నుండి గ్రహించాను.  అది నన్ను ఇలా తెరవెనుక వుంచేస్తున్నది.  వాస్తవానికి పుస్తకములనుండి మత గ్రంధముల నుండి ఏరితెచ్చుకొన్నది నిజార్థములో జ్ఞానము కానేకాదు.  అది కేవలము ఇతరుల అనుభవముతో తెచ్చిపెట్టుకొన్న పాండిత్యము.  అది కేవలం మేధస్సుచేత పట్టుబడినది. అది ఆచరణాత్మకముగా సాధించిన ప్రత్యక్షజ్ఞానము కాదు. అనగా హృదయము చేత గడింపబడినదికాదు.  ఇదంతా నిజమైన జ్ఞానసంపాదనకు యత్నించు నిజమైన సాధకులకు మార్గదర్శక కాంతిగా వుపయోగపడు గాక! జ్ఞానసముపార్జన కొరకు తపన పడుటకుమారు నేను ఎప్పుడూ ఆయన కొరకు, అదే మాగురుదేవుల కొరకే తాపత్రయపడుచుంటిని.  ఆయన లోపరహిత జ్ఞానమునకు, సంపూర్ణతకు నిధి.  ఈ కారణముననే సత్యతత్త్వము నుండి ఎప్పుడూ నాఆలోచన, నాపలుకులు విడిబడి వుండలేదు.  నా గురుదేవునిపై ప్రేమ నాలో నెలకొని వృద్ధిచెందుతూ పరాకాష్టకు చేరినవి.  ఇట్టి అనుభవము పొందుటకు రగులుతున్న తీవ్రవాంఛతో నేనీరంగమున ప్రవేశించి, పరిపూర్ణత నందుకొంటిని.


సాక్షాత్కారస్థితి

 

        చాలా సంస్థలున్నాయి.  అవన్నీ కూడా చాలా మంచివిగా మరియు అత్యంత ప్రతిభావంతమైనవిగా ప్రకటించుకొన్నవి.  అన్నీ  నిస్సందేహంగా సాక్షాత్కారమే గమ్యంగా చెప్పుకుంటున్నాయి.  కానీ ఇక్కడ మనం కాసేపుఆగాలి వాటిని హృదయనేత్రముతో తూచి చూడాలి.  నేను హృదయమనే మాటను వాడుతున్నాను. ఎందుకంటే అదే జీవకేంద్రము (న్యూక్లియస్) ఏవైపునకు దానిని మరలిస్తే అక్కడ అది తరంగ కదలికనుత్పన్నం చేస్తుంది.  మనస్సు కార్యనిర్వహణమునకిది వేదిక.  ఇదే మనలో విచక్షణాజ్ఞానము నభివృద్ది చేయు సాధనము.  సూక్ష్మశక్తులీప్రదేశమున పనిచేసి భగవదీయశక్తిని క్రిందకుదించును. ఎదో ఒక విధంగా మనయోచనను దానితో అనుసంధించ గలిగితే లేక దానిని శిక్షణద్వారా సరియైన దానినే వడియగట్టి సత్యతత్త్వము వైపు మరల్చునట్లు చేయగలిగితే సమస్య పరిష్కారమౌతుంది.  కానీ సాక్షాత్కారమనగా ఏమిటో మన దృక్పథంలో స్పష్టముగా తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఇది అసాధ్యమౌతుంది.  ప్రతి మతవాది, ప్రతి శాస్త్రపరిశోధకుడు సూక్ష్మశక్తియే పనిచేయుచున్నదని అభిప్రాయపడిరి.  నీతప్పుడు ఆలోచనల వలన చుట్టూ పేరుకుపోయిన స్థూలత్వం వదిలించుకుంటే నీవు దానిని సులభంగా తెలుసుకొనవచ్చు.  నీచలనము సూక్ష్మతవైపునకుంటే అది సరియైన పద్దతియని నీవిప్పుడు సులభంగా ఊహించవచ్చు.  అట్లుగాక అదినిన్ను జడత్వంతో ఉబ్బిపోయేట్లు చేస్తే అది కేవలం తప్పుడు పద్దతే కాదు, అది నిన్ను క్రిందికి లాగివేస్తుంది.  సాక్షాత్కారం మరీమరీ దూరమైపోతుంది.

        అద్భుతాలు కలుగుతాయి.  వాటిని రెండు తరగతులుగా విభజించవచ్చు.  మొదటివి భగవత్సంబంధమైనవి మిగిలినవి వస్తుసంబంధమైనవి.  మొదటి వాటి ప్రయోజనమెప్పుడూ దైవీయము.  తర్వాతది ప్రాపంచికము.  మొదటి తరహా అద్భుతములు సూక్ష్మమార్గమున వెళ్ళువానిలో ఉత్పన్నమౌతాయి.  అవి తానెదుర్కొను జీవిత సమస్యలను పరిష్కరిస్తాయి. అవతలివి స్థూలమార్గములో వెళ్ళువానిలో ఉత్పన్నమౌతాయి.  అవి హృదయాన్ని మరింత బరువెక్కిస్తాయి.  ఏదోవిధంగా క్రిందితరగతికి చెందిన స్థితులలో లీనమైతే మొత్తంగా అతడొక ముడిగా (అలా అనుకోవచ్చు) తయారౌతాడు.  దానితోపాటు తనకైతానే మునిగిపోవడానికి లోలోపల ఒక సుడిగుండాన్ని ఏర్పాటు చేసుకుంటాడు.  అట్టివాడు తనశక్తిని ఇతరులపై ప్రయోగిస్తే వారు కూడా ఆ సుడిగుండంలోకే లాగబడతారు.  నేను స్పష్టంగా చెబుతున్నదేమంటే సూక్ష్మతరహా మహిమలు భగవదీయ కార్యములకై నియమింపబడిన వారియందు వుత్పన్నమౌతాయి.

 

        గురువుగారిపైన ఏమాత్రం సంకోచంలేని విశ్వాసమున్న మనసంస్థలోని అభ్యాసికి సూక్ష్మమైన మహిమలు కలుగకుండా వుండవు.  కానీ గురువుగారి హస్తము వారిని నియంత్రించియుంచి వారిని కుడిఎడమలకు సైతం తొంగిచూచుఅవకాశం లేకుండాచేసి వారు దారితప్పకుండా జాగ్రత్త వహిస్తున్నారు.  వాటికి సంబంధించిన ఎఱుకే వారికుండదు.  కానీ భగవదీయకార్యము అతనికి కేటాయింపబడి ఆపనికి అవసరమైతే అతని పరివేషపుఛాయ జాగృతమై మహిమలను ప్రదర్శిస్తుంది.  కానీ అవి దైవీయలక్షణములతోనే భాసిస్తాయి.  ఇంతకు మించి ఈ విషయముపై ఇక నేను చర్చించ దలచుకోలేదు.  చాలించేముందొక మాట.  ఒక మనిషిని సరియైనమార్గంలో పెట్టడమే ఒకానొక గొప్పమహిమ.

 

        సహజమార్గ విధానము చాలా సులువు మరియు అతిసహజమైనదైనప్పటికిని సామాన్య ఊహకందరానిది.  ఎందుకంటే అది సత్యతత్త్వమునకు తగులుకొనియుండి సూక్ష్మదారులవెంట పురోగమించుచున్నది.  ఇది ఈశ్వరీయప్రకాశముపై మనస్సుంచి హృదయముపై ధ్యానమును చేయమంటున్నది.  విద్యుత్కాంతి లేక వెన్నెలవంటి ఏదేని రూపము లేక ఆకారములో వెలుగును దర్శించమని అభ్యాసికి సూచించడము లేదు.  అట్లుచేస్తే అతడు చూసేది కేవలం అతని మనస్సు కల్పించిన వెలుగేకానీ నిజమైనది కాదు.  అభ్యాసిని కేవలమొక ఊహామాత్రముగా అంతర్గతంగా ఈశ్వరీయభావన కలిగియుండమని సలహా యివ్వబడినది.  అప్పుడది సూక్ష్మమౌతుంది.  తత్ఫలితంగా మనం సూక్ష్మమైన దానిపైనే ధ్యానంచేసి సూక్ష్మమైనదాన్నే పొందుతాము.  ప్రతి మహనీయుడు ప్రకాశమన్న పదమునే ఉపయోగించాడు.  వ్యక్తీకరించుటకు అన్నిటికంటే అదే మేలైనదిగా వున్నందున నేనునూ దానినే వాడుకొనక తప్పలేదు.  అయినా అది కొంత చిక్కును కలిగిస్తుంది.  కారణం ఎప్పుడు మనం వెలుగు అంటామో అప్పుడే దాని తళుకు మన దృక్పథంలో ప్రాముఖ్యత వహించి మనం దాన్ని మెఱుపుగా గ్రహించడం మొదలు పెడతాం.  నిజమైన ఆవెలుగులో అట్టి ఊహేలేదు.  అది కేవలం నిజపదార్థమునే సూచిస్తుంది.  లేక అత్యంత సముచితంగా పిలవాలంటే "పదార్థరహిత పదార్థం" అనాలి.  మన పద్దతిలో అభ్యాసి నిస్సందేహంగా కొన్నిసార్లు వెలుగును చూస్తాడు.  కానీ మెఱుపుతో కూడిన వెలుగు కేవలం తొలిదశలో పదార్థము శక్తితో ఢీకొన్నప్పుడు మాత్రమే చూస్తాడు.  మరోమాటలో చెప్పాలంటే శక్తి పనిచేయడం ప్రారంభించిందనటానికి అది ఒక నిదర్శనము.  నిజమైన వెలుగు (ఈశ్వరీయ ప్రకాశం) నేను "రాజయోగ ప్రభావం" అను పుస్తకములో చర్చించినట్లుగా సూర్యోదయపు వర్ణంలోను లేక లేతఛాయామాత్రపు వర్ణరహితత్వంగాను వుంటుంది.

 

        ఈపద్దతిలో ఎక్కువ ప్రాధాన్యత స్థూలత్వనిర్మూలనకే యివ్వబడింది.  తద్వారా ఆత్మనావరించుకొనియున్న మబ్బుతెరలు తొలగించబడతాయి.  సంస్థలోని ప్రశిక్షకుల అతిముఖ్యమైన కర్తవ్యము ఇదే.  అంతకంటే ముందు అభ్యాసి తనకైతాను చేసుకోవలసిన ముఖ్యమైనపని ఏమంటే తనకు ఈపనికై నిర్దేశించిన మార్గమును శ్రద్ధతో అనుసరించుట.  నేను హృదయంపై ఎందుకు ధ్యానించవలెను అను అంశమును ఇక్కడ ప్రస్తావించదలచలేదు.  ఎందుకంటే ఆవిషయమై ఇంతకుముందే మరోచోటెక్కడో  విపులంగా చర్చించడం జరిగింది.

 

        చాలామంది విద్యావంతులైన సాధుపురుషులు సాక్షాత్కారస్థితిని గూర్చి అనేకమైన వింతవింత నిర్వచనములనిచ్చిరి.  కానీ నామటుకునాకు అది నిర్వచింప వీలుకానిదనియు నిర్వచించిన యెడల అది సాక్షత్కారమే కాదని అనిపించుచున్నది.  అది నిజానికి ఒక మూగస్థితి.  అది వ్యక్తీకరింపనలవి కానిది.  అంతర్ బహిరములందు మఱుపును అనుభూతిచెందటం గమనించటం సాక్షాత్కారం కానేకాదు.  నాతొలినాళ్ళ సాధనాకాలంలో నేను తరచు వెలుగును దర్శించి మరియు అనుభూతి చెందినాను.  కానీ అది గమ్యము కాదు గనుక మాగురుదేవుల కనుచూపుల రక్షణలో మున్ముందుకు, వెలుగు నుండి మసకవెలుగునకు (మన సంస్థ కోసం డా.కే.సీ.వరదాచారి చక్కగా తెలిపినట్లు) పయనించితిని.  మనము పురోగమించుచున్నది మెఱిసిపోతున్న వెలుగు వైపునకు కాదు.  మనసంస్థ గుర్తులో వున్నట్లు మన గమ్యము చీకటీ కాదు, వెలుగూ కాదు.  మరి అది ఏమైయున్నది?  అది మాటల కతీతమై యున్నది.

 

        ఎఱుకతో మానవ హృదయము, సత్యతత్త్వమును పొందుటకే లోలోపల తీవ్రపరితాపము జెందుచున్నది.  మనకు తెలియనిదాని నందుకొనుటకు మనమెక్కిపోవలసిన నిచ్చెన ఇది.  ఈ ఆవేదన, ఆతురత సంతృప్తమైతే మనం మనకే తెలియనివారమైపోతాము.  ఆ విధంగా మనం ఒక మరుపుస్థితిలోనికి ప్రవేశిస్తాము.  అక్కడ నిన్నునీవు పూర్తిగా మరచిపోతావు.  నీ శరీరధ్యాస, ఆత్మధ్యాస మొత్తం  ఏమీ అక్కడ వుండదు.  ఉనికికి సంబంధించిన హృదయముపైని ముద్రలన్నీ కడిగి వేయబడతాయి.  అక్కడ తానెవరో ఇతరులెవరో కూడా ఊహించలేము.  మైత్రీబంధం త్రెంచి వేయబడుతుంది.  తనకు ఇతరులతో సంబంధమున్నట్లే అనిపించదు.  సంక్షిప్తంగా చెప్పాలంటే అతడు తనఉనికినే  కోల్పోతాడు.  అతడు పనులు చేస్తాడు కాని అందుకు సంబంధించిన ముద్రలాతనిపై పడవు. సంస్కారములంటడం నిలిచిపోతుంది.  అతడు వాటి ప్రభావం నుండి విడుదల పొందుతాడు.  ఆవిధంగా అతడు గీతలో శ్రీకృష్ణపరమాత్మ చేత అద్భుతముగా వివరింపబడిన నిష్కామకర్మయోగస్థితిని పొందుతాడు.  ఈ స్థాయిలో వ్యక్తి దాదాపు సమస్థితికి అంటే సృష్టి మొదలవ్వక ముందుటిస్థితికి వస్తాడు.  అతని హృదయము ప్రశాంతముగాను, మనస్సు క్రమబద్దముగాను వుండును.  అతడు బ్రహ్మమునందు సంపూర్తిగా మునిగిపోయి అందుండి ఒక్క క్షణము కూడా విడివడి వుండుటకిష్టపడడు.  కనుక ఇప్పుడతడు భగవంతునిపైగానీ, తనపైగాని ధ్యానము చేయలేడు.  ఒక వేళ అట్టిప్రయత్నము చేసి కాసేపు ధ్యానముచేసినా అతనికూపిరాడని స్థితి వచ్చేస్తుంది.  కారణం అతడు సాంద్రహీనమైన పరిధిలో ఈదులాడుచున్నాడు.  ఈ స్థితిలో వారు ఆత్మసాక్షాత్కారమైనదని యందురు.  కానీ ఆ అభిప్రాయము తప్పు.  కారణం అక్కడ తానెవరో తెలుస్తున్నది.  కనుకనే వారు దానినిగూర్చి నొక్కి చెప్పుతున్నారు.  అసలక్కడ ఏమిజరుగుతుందంటే శరీరములోని కణములన్నీ శక్తిగా పరివర్తనజెంది తదనంతరం దాని తుదిస్థితికి మారిపోతాయి.  అక్కడ మజాలేదు. ఆకర్షణలేదు. ఆనందం (ప్రపంచ భావనలో వున్నది) లేదు.  అది రుచిలేనిరుచి.  మార్పులేని స్థిరమైన స్థితి. దాన్ని సరిగ్గా వివరించాలంటే "సాంగ్-ఎ-బెనమక్" - ఉప్పదనం నిర్మూలింపబడిన ఉప్పురాతి తునక అనాలి.

 

        సాక్షాత్కారస్థితినందుకొన్న తర్వాత వ్యక్తి ఆధ్యాత్మిక రంగములో తిరుగులేని ఇచ్ఛాశక్తిని పెంపొందించుకుంటాడు.  అతడు ఒక మరపుగలిగిన స్థితిలో వుండి కూడా ప్రపంచములోని శాస్త్రములన్నీ (కొన్ని పరిధులకు లోబడిన భావముతో) అతనికి తెలిసే వుంటాయి.  భగవంతుడు సర్వజ్ఞుడు.  భగవంతునిలో ఐక్యమైనవారు కూడా అన్నీ తెలిసిన వారే (అయితే మానవ పరిధులకు లోబడి).  గురుదేవుల వల్ల అన్ని పరిధులు విచ్ఛిన్నం చేయబడినా నేను మనిషినేనన్న భావన పూర్తిగా పోదు.  ఈకాస్త స్పందన అంతంవరకు కొనసాగుతుంది లేకపోతే అతడు శరీరాన్ని వెంటనే వదిలేస్తాడు.  ఆస్థితిలో అతడు పైవైపునకు, క్రిందివైపునకు అవసరాన్ని బట్టి చూడగలుగుతాడు.  కనుక అంతులేనిదాన్ని పొందటానికి అంతులేనిదృష్టి కలిగి వుండటం అత్యావశ్యకం.  అందుకు చేపట్టవలసిన పద్దతి కూడా సరియైనదే అయివుండాలి.

 

        సహజమార్గ పద్ధతిలో కేంద్రముల మరియు ఉపకేంద్రముల అంతర్గతశక్తి జాగృతం చేయబడి అవి సక్రమంగా పనిచేయునట్లు చేస్తుంది.  ఉన్నత కేంద్రములు జాగృతమైతే వాటి ప్రభావము క్రిందికేంద్రములపై కూడా పడుతుంది. పైకేంద్రములు భగవంతునితో అనుసంధానమైతే క్రిందివి పైవాటితో లీనమైపోతాయి.

 

        ఆవిధంగా ఉన్నతకేంద్రములు అధఃకేంద్రములను కూడా తమ పరిధిలోనికి గ్రహిస్తాయి. అధఃకేంద్రములు సైతం పరిశుద్ధీకరింపబడి వాటిచుట్టూ చుట్టబడియున్న స్థూలపుపొరలను ఛేదించుకొని బయటపడతాయి.  అదే సహజపద్దతి.  సహజమార్గపద్దతిలో అనుసరించు విధానముతోగాక మరే ఇతరపద్దతుల వల్ల ఇట్టి ఫలితములు సిద్ధింపబడవు.  సంస్థలోని ప్రతి ప్రశిక్షకుడు గురువుగారిపైన అచంచల విశ్వాసము గలిగియుండుటవలన, అభ్యాసి తగిన అర్హతను సాధించినవాడైతే అతనిలో ఇట్టి ఫలితములను క్షణములలోనుత్పన్నము చేయగలడు.

 

        ఈ స్థాయిలో ఎన్నెన్నో వివిధములైన స్థితులను ఒకటి తర్వాత ఒకటిగా మార్గమధ్యమున సాధిస్తాము.  కానీ అక్కడున్నస్థితులను అభ్యాసి తనస్వశక్తితో అధిగమించటానికి ప్రయత్నించినపుడు అచ్చటి భగవదీయశక్తి ప్రవాహమునకు తాళలేక తక్షణమే క్రిందకు జారిపోతాడు.  అప్పుడు సమర్థుడగు గురుదేవులశక్తి మాత్రమే అతన్ని పతనావస్థ నుండి తప్పించి గట్టేక్కిస్తుంది.  చాలా ఉన్నతమైన స్థితులలో శక్తి మరింత బలంగా వుంటుంది. ఎందుకంటే భగవదీయశక్తి అక్కడ మరీ సూక్ష్మంగా వుంటుంది.  సూక్ష్మాతిసూక్ష్మశక్తి సహజంగా చాలా బలంగా వుంటుంది.

 

        నేను విధ్యాధికులను ఎంతగానో గౌరవించినప్పటికిని సాధారణంగా వారు సాక్షాత్కారాన్ని గురించి దాని స్థితిని గురించి వారి అభిప్రాయాలను వారి విద్యావిశేషముతో తెలియజేస్తుంటారు.  కానీ వారి స్వానుభవముపై ఆధారపడి మాత్రంకాదు.  నిజానికి స్వానుభవమే విశ్వసించదగ్గది.  ఆకారణంగా సాక్షాత్కారము ఈనాటి కళగా మారిపోయిందని తెలియజేయుటకు నేను చింతిస్తున్నాను.  సత్యతత్త్వము లోతుకు ఇంకిపోయింది.  దాని పైపొరమాత్రము కళాకారులు వారివారిమనోభీష్టము, చాతుర్యము కొద్దీ రంగులు వేసుకొనుటకు మిగిలివుంది.  పర్యవసానమేమంటే ప్రజలు వారి ఏకాగ్రతను ఆ పైపైరంగులపై మరల్చి అందులోనికే చొచ్చుకొనిపోతున్నారు.  అది ఆధ్యాత్మికముగాదు.  సత్యము కాదు.  వాస్తవార్థమున సాక్షాత్కారము పొంది తద్వారా తనలో దైవీయ జ్ఞానజాగృతి గలిగి యున్ననేతప్ప ఈ విషయమును స్పృశించేహక్కు ఏ వ్యక్తికి లేదని నేను విశ్వసిస్తున్నాను.

***


దివ్య దృష్టి

 

        ప్రతిఒక్కరికి మనిషికున్న రెండుకళ్ళను గురించి తెలుసు.  కానీ శాస్త్రజ్ఞులు నొసట కన్నువలెనున్న గ్రంధి ఒకటున్నదనిన్నూ, అది దివ్యదృష్టికి సంబంధించియుండి మూడవకన్నుగా పిలువబడుతున్నదనిన్నూ చెబుతున్నారు.  మానవ భౌతికశరీరమును ఛేదించి సేకరించినవిషయములు దీనికి సంబంధించి సమగ్రమైన నిజనిర్ధారణ చేయలేదు.  దీనికి సంబంధించిన వాస్తవజ్ఞానమును యోగము ద్వారానే సంపాదించ వీలగును.  గొప్ప మహర్షియైన పతంజలి తనగ్రంధమున సంయమన పద్దతి గురించి వ్రాస్తూ, అది యోగి కలిగియున్న అత్యంత శక్తివంతమైన ఆయుధముగా పేర్కొనెను.  ఈ సమగ్ర ఆధ్యాత్మికశక్తి సహాయమున ఒకయోగి సమస్త వస్తుజ్ఞానమును శరీరగతస్థితిని తెలుసుకొనవచ్చును.  శరీరములోని అవయవముల పనితీరునంతటిని అతడు చూడగలడు.  శరీరములోని ఏభాగపు పూర్తి చిత్రమైనా అతని దృష్టికిలోబడే వుంటుంది.  మరియు అతడు ఏశక్తిని ప్రయోగించాలనుకుంటే ఆశక్తిని ఏప్రదేశమునందైనా ప్రయోగించగలడు.  ఏవార్తయినా, ఏవిషయమైనా అది ఎంత స్వల్పమైనదైనా అతని దృష్టినుండి తప్పించుకొనజాలదు.  చూసేపద్దతి ఇట్లా వుంటుంది --- ఏప్రదేశము యొక్క జ్ఞానము కావాలనుకుంటాడో దాన్ని యోగి తన ఇచ్ఛాశక్తితో బయటికి తీసి దాని పూర్తిగుణమును వాతావరణమంతా వెదజల్లుతాడు.  అప్పుడు దాన్ని దగ్గరగా సమగ్రంగా గమనిస్తాడు.  ఈ పద్దతిలో అతడు తానుచూడదలచుకొన్న పూర్తిచిత్రమును సంపాదిస్తాడు.  దీనికతనికి చాలా సమయమే పడుతుంది.  ఏదేమైనా చూడడం దాని గుణగణాలను అర్థంచేసుకోవడానికి కొంత సమయం పట్టనేపడుతుంది.

 

        యోగముద్వారా స్వతహాగా పరిశీలించి అనుభవము ద్వారా గ్రహించిన ఈ దివ్యనేత్ర సమాచారమును ఇప్పుడు పాఠకుల ఎదుట ఆవిష్కరిస్తున్నాను. బ్రహ్మనేత్రము అని పిలవబడుతున్న ఈ గ్రంధిలో మూడురంగులు గమనించితిని.  ముందరిభాగము ప్రకాశవంతమైయుండి ఇసుక రేణువులున్నట్లుండును.  ఈ బయటి భాగము తెలివియొక్క పీఠము.  దీనివెనుకనున్న మధ్యభాగము ముదురు ఊదారంగులో వుండును.  చివరిదైన వెనుకభాగము ఎఱ్ఱటి రంగులో వుండును.  ఇది భగవదీయజ్ఞానమునకు స్థానము.  యోగసాధనలో ముందున్న ఈ ప్రకాశవంతమైన భాగము మొదటగా తెరువబడుతుంది.  ఒకవ్యక్తి ఇందులోనికి పూర్తిప్రవేశం చేసిన తర్వాత మధ్యభాగము తెరుచుకోవడం మొదలుపెడుతుంది.  అప్పుడది ప్రకాశవంతం చేయబడుతుంది.  ఆ ప్రకాశంలో కూడా ఆ ముదురు ఊదారంగు తప్పనిసరిగా వుండనే వుంటుంది.  ఆఖరున వెనుకభాగం ప్రకాశవంతం కాబడే సమయంకూడా వస్తుంది.  అదికూడా పూర్తిగా ప్రకాశవంతమై పోతుంది.  ఈ స్థితులన్నీ పొందిన యోగిని గొప్ప సమర్థవంతుడైన యోగిగా గుర్తించవచ్చును.  ఇంకా ముందుకుపోతే ఈ రెండు రంగులు మాయమై కేవలం ప్రకాశంగల ఒకే ఒక్క స్థితి మాత్రం నిలిచి వుంటుంది.  ఈ ప్రదేశము శుక్రగ్రహమునకు అనుసంధించబడి వుంటుంది.  ఎవరైతే ఈస్థానంపై ఆధిపత్యం సంపాదిస్తారో వారికి శుక్రగ్రహంపైకూడా పూర్తీ ఆధిపత్యం లభిస్తుంది.  ఈ గ్రంధికి వెన్నుబాముకు సంబంధంలేదు, కానీ ఇది హృదయపు కుడివైపునకు సంబంధింపబడి వుంది.  ఈ ప్రదేశము పూర్తిగా తెరువబడి దీని అధీనములో వున్న చక్రములన్నీ శుద్దిగాబడిన తర్వాత దైవీయజ్ఞానము అప్పుడు పనిచేయడం ప్రారంభమౌతుంది.  అందుకే యోగశాస్త్రములో ఈ ప్రదేశమును జ్ఞానపీఠముగా పేర్కొంటారు.  ఈ ప్రదేశానికి కాస్తంత దూరంలో మరో కేంద్రమున్నది.  అది చైతన్యవంతమైతే అంతర్గత విషయపరిజ్ఞానం చాలా చురుగ్గా ఉంటుంది.  అంటే వాతావరణంలో కలిసియున్న మంచి చెడు ఆలోచనలను పసిగట్టగలడు మరియు వాటి వివరములు తెలుసుకొనగలడు.  ఈ ప్రదేశము ఇతరుల అంతర్గత ఆధ్యాత్మిక స్థితులను తెలుసుకొనుటకు కూడా సహాయపడును.  అది మట్టిరంగులో వుండును.  ఈ ప్రదేశమును చేరగనే తెలివితేటల ఉపయోగము నిలిచిపోయి ఆధ్యాత్మికరంగము మొదలగును.  ఆస్థితితో ఐక్యము కాగానే ఆ మట్టిరంగు కూడా మాయమై అదికూడా ప్రకాశావంతమగును.  దీని తర్వాత గల గ్రంధికి రంగులేదు.  ఆ వర్ణం ఎక్కువ తెలుపులో కాస్త బూడిదరంగు కలిసినట్లుంటుంది.  మరో మాటలో చెప్పాలంటే అది తెలుపుకాదు నలుపుకాదు.  దీని సహాయంతో మొదట బ్రహ్మాండమండలంలో సూక్ష్మంగా రూపుదాల్చి తర్వాత ఈ భూమండలంలో ఏర్పడే ఉపద్రవాలను తెలుసుకొనవచ్చును.  పూర్తిగా ఈస్థితిపై అధికారం పొందిన తర్వాతనే ఇది సాధ్యమౌతుంది.

 

        మూడవకన్ను అంటూ ఒకటుంది.  అది ఎటువంటిదంటే దాన్నిగనుక తెరిస్తే అది మొత్తం ప్రపంచాన్ని ఒకక్షణంలో సర్వనాశనం చేస్తుంది.  ఇది ముందుచెప్పియున్న గ్రంథులలో ఏ ఒక్కదానితోను అనుబంధించిలేదు.  ఈ వినాశకర నేత్రము సామాన్యంగా మహాదేవుడైన శివునికి వుంటుంది.  ఇది వాస్తవానికి తల వెనుకభాగమున ముచ్చెనగుంత ప్రాంతంలో వుంది.  నేను దీనిని గూర్చి నా "రాజయోగప్రభావము" అను గ్రంథమున విపులముగా చర్చించితిని.  ఈ వినాశనకర నేత్రమును శ్రీకృష్ణపరమాత్మ 18 రోజులూ మహాభారత యుద్ధ కాలమున రెప్పవాల్చకుండా తెరిచియే యుంచెను.  ఇది మహోపద్రవములను సంభవింపజేయుటకుపయోగించెడి సాధనము.

 

***


హృదయముపై ధ్యానము

 

        వస్తు ప్రాధాన్యతగల నేటితరమున ఆధ్యాత్మికత వేరొక మలుపునకు తిరిగినది.  ప్రయోగాత్మక విలువలు వాస్తవమైన వాటికంటే ఎప్పుడూ ముందే వుంటాయి.  నేడు  నిజమైన సాధువును అతని అంతర్గతస్థితినిబట్టిగాక అతని బాహ్యస్వరూపమునుబట్టి నిర్ణయించుచున్నారు.  పురాతన ఆధ్యాత్మిక శిక్షణాపద్దతులను ప్రక్కన పెట్టేయడం జరిగింది.  అందుకు కారణం అంతర్గత స్థాయిని కనుగొను ప్రయోగములు చాలా అరుదుగా లభిస్తుండటమే.  కనుక పాఠకులకు తొలుత సక్రమమైన జీవితము గడుపుటకు అవసరమగు విధానములను వివరించుట ఆవశ్యకమైనది.  అందుకే కొంతైనా వ్రాసి శిక్షణావిధానము ఏ అంశములపై యుండవలెనో పాఠకుల అవగాహనకు వచ్చునట్లు చేయవలసిన అవసరమేర్పడినది.  ఒక వరుసలో నాఅనుభవమును ఆధారము చేసుకొని నాపుస్తకములు వ్రాయబడినవి.  అనవసరమైన విమర్శలకు తావియ్యకుండుటకై కేవలము ప్రాధమికాంశములను మాత్రమే చర్చించితిని.  అందులో తెలిపినవన్నీ నేను చేపట్టిన కార్యములకు సరిగ్గ అనుగుణమైన పాళ్ళలో వున్నవి.

 

        సామాన్యముగా నేను ధ్యానమును హృదయముపై అనగా గుండెకొట్టుకొనుటను గమనించినచోట చేయమని సలహానిత్తును.  హృదయస్థానము  వ్యాపించియున్న మొత్తము స్థలముయొక్క దృశ్యమును గూర్చి ఇప్పుడు చెప్పదలచుకోలేదు. ఎందుకంటే అభ్యాసి నేను తెలిపిన ప్రకారం హృదయమంటే ఎక్కడో తెలుసుకొని ధ్యానం చేయగలగాలి.  , బి  బిందువులు కూడా ధ్యానం చేయడానికి నిర్దేశించబడినవే అయినా అవన్నీ ప్రాధమిక దశలో అనవసరమైనవి.  నీళ్ళుత్రాగి దప్పిక తీర్చుకొనవలెను గాని దప్పికకు కారణభూతమైన విషయమును గూర్చి లోతుగా యోచించుటవల్ల దప్పిక తీరదు.  హృదయమును నేను రెండు భాగములుగా విడగొట్టినాను.  వాటి వివరములపై చర్చ అనవసరము.  అవి అభ్యాసము ద్వారా ప్రత్యక్షముగా అర్థము కాగలవు.  అయితే సంస్థ ప్రశిక్షకులకోసం తేటతెల్లంచేయబడింది.  ఎందుకంటే వారు వాటితో పనిచేయవలసి వుంది.  ఎన్నో ప్రకృతిశక్తులు హృదయములో నిక్షిప్తమై ఉన్నాయి.  అవన్నీ రహస్యములు.  అవి తెలియజేయకూడదు.  కారణం, సంపాదించిన శక్తి దుర్వినియోగపరచే అవకాశమున్నది.

 

        మన పురోగమన సమయమున మనము "సత్యోదయమున" చూపిన వలయములను దాటుచూ పోవలయును.  మొత్తము విశ్వమంతయు ప్రతి అణువునందూ వున్నట్లు ఈ వలయముల నధిగమించు సమయమున కనుగొన వచ్చును.  అయితే సరియైన అవగాహనకు రావడనికి మరింత సమయము, అనుభవము అవసరమౌతాయి.  కనుక మనం సద్వస్తువును దర్శించాలి.  అంతేగానీ అదిచూపే వినోదములను గాదు.  పటములో చూపిన హృదయపు పైమండలము, క్రిందిమండలములు అర్థము చేసుకొనుటకు చూపిన ఊహామాత్రములే. హృదయము క్రిందిస్థాయిలో లోనికివెనుదిరిగి పతన మార్గములో పడిపోతుంది.  అది ఒక సమస్య.  అది అంత సులభంగా అర్థంకాదు.  నేను ఈ రహస్యములను విడగొట్టిచెప్పాలన్నా మాటలు దొరకడం దుర్లభమౌతున్నది. అయితే దాని దిశను మార్చి జీవితంలో మార్పును తేవచ్చునని చెప్పవచ్చును.  అప్పుడు హృదయము మానసిక చెడు కార్యకలాపముల వేదిక కాకుండా ప్రకృతి కార్యరంగమౌతుంది.  ప్రతిదీ సత్యతత్త్వమౌతుంది.  హృదయము యొక్క స్థానము భౌతికముగా అక్కడే వుండినప్పటికి అదికూడా మారుతుంది.  అధమ మండలము (ఎల్) ఉన్నత మండలము (యు) గా మారిపోతుంది. ఎల్ అనేదే యు గా మార్చబడుతుందనడము ఎక్కువ సంధిగ్ధంగా వుందని అనవచ్చు గానీ, దానిని విశదీకరించడానికి నిశ్శబ్దమనుమాటే ఇప్పటికి సరి.  నేను మిమ్ములను పుస్తకము మళ్ళీమళ్ళీ పరిశిలించవలసినదిగా అర్థిస్తున్నాను. అలాచేస్తే మీప్రశ్నలకన్నింటికి సమాధానం లభిస్తుంది.  నాకు చాలా బాగానచ్చిన దృక్పథం మీముందుంచుతున్నాను. అదేమంటే ఎట్లా ఈ ప్రపంచ మేర్పడింది? అని లోతుగా ఆలోచించడంకంటే ఉన్నదాని విశేషాలను చూచి దీనిని నిర్మించిన వాని గొప్పతనాన్ని శ్లాఘించడమే ఉత్తమము.  ఈ ప్రక్రియే సృష్టి ఎలాజరిగిందో కూడా ఎఱుక పరుస్తుంది.  అయితే ఎప్పుడు? అంటే, ఎప్పుడు నీవు ఆ అసలు ఉనికిని సత్యస్థితిలో తెలుసుకొన్నప్పుడే.  నీవు వరుసబెట్టి చెట్టుయొక్క ఆకులు లెక్కబెడుతూబోతే నీవు లెక్కించినవి కాసేపటికి మరిచిపోయే అవకాశమున్నది.  ఈ పద్దతి నిన్ను ఆచెట్టు ఫలాలను రుచిచూడనియ్యదు.  నీవు ఆకులను విశ్లేషించాలంటే ముందుగా ఆ చెట్టుకుకాసిన ఫలాలను విశ్లేషించు.  అదెలా విశ్లేషించగలం?  అంటే ఈ నాటి నూతన ప్రయోగశాలలో పరీక్షించి విశ్లేషించాలి.  పాత పద్దతి ప్రకారమైతే తిని జీర్ణించుకొని దాని ఫలితాన్ని అనుభవించడమే.  కనుక నీవు అగస్త్యమునివలె సముద్రపానం చేయగల సమర్థతను వృద్ధి చేసుకోవాలి.  చిన్నచిన్న ఏటినీళ్ళు త్రాగుతూవుంటే నీకు ఆయువు, సమయము సముద్రపానం చేయడానికి సరిపోదు.  తుదకు నీవు సముద్రతీరం వరకు కూడా రాలేవు.      ప్రతి ఒక్కరికి నేనిచ్చు సలహా ఇదే ---

నిన్నువెతికే వానికోసం వెదుకు. అంతేగాని నిన్ను నిర్లక్ష్యము చేయయత్నించు వారికొరకై వెతకకు.

 

***

 

 

మనస్సుపై అదుపు

 

        భారతదేశము ఆధ్యాత్మికపుస్వగృహము.  కనుకనే ఊహించడము (ఆలోచించడము) అన్ని సమయములలో చైతన్యవంతమైవుంది.  ఈ సమయములో మానవుని అంతర్గతశక్తులు ఆధ్యాత్మికరంగంపై లోతైన మార్గముననుసరించి వెళుతున్నవి.  ఆధ్యాత్మికత ఆధారంగా మానవ నిర్మాణము మొత్తము రూపుదాల్చటానికి ఈ ప్రపంచమునకు తనవంతు వాటా తనకున్నది.  నేడున్న ఒక ఉత్సాహకరమైన అంశము అందరూ శాంతి మార్గమునకై వెదుకుచుండడమే.  మిక్కుటమైన సంపద కలిగి వున్నప్పటికి ప్రపంచములోని కొన్నిప్రాంతములలో శాంతి కొరవడియే వున్నది.  బాహ్య పద్ధతులన్నీ శాంతిని సాధించుటలో విఫలమైపోయినవి.  మనము శాంతికై అంతరంగము వైపుకు మరలకపోతే రవ్వంతకూడా అది మనకు లభింపదు.  వివిధములైన పద్దతులు శాంతిసాధనకొరకు అవలంభింపబడుచున్నవి.  ఎవరెవరి మానసిక పరిస్థితుల కనుగుణంగా వారివారి మార్గముల ననుసరిస్తున్నారు.

 

        నేటి బోధకులు చాలా మంది శిష్యుల మానసికస్థితుల నదుపుచేయుభారమును స్వీకరింపరైరి.  అది అభ్యాసికి ఒక సమస్యయై అతడు చిక్కులను అధిగమించు శక్తిలేని వాడయ్యెను.  ఈ సందర్భములలో బోధకుడు తను చేయగలిగినదేమియు లేదని తలంచుచున్నాడు.  మరోవిధంగ చెప్పాలంటే బోధకునిపైనున్న బాధ్యత శిష్యులపైకే నెట్టివేయబడినది.

 

        యోగమార్గము భక్తి గలిగిన వారిలో వెనువెంటనే ఫలితములను తేగలదు.  ఎందుకంటే భక్తి అనే సాధనం ద్వారా తక్షణమే ప్రియునితో అనుబంధమేర్పడిపోతుంది.  ప్రియుని చింతన వుండటంవలన అది లోతైన ఎఱుకలోనికి వెళ్ళడానికి సహాయపడుతుంది.  బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైన గురువు, తాను గడించిన అంతర్గతశక్తితో మనలను ఉత్సాహపరచగలిగిన సమర్థుడు, ఏదో విధంగా లభించినట్లయిన మనకష్టము గట్టెక్కినట్లే.  ఇక మనం వెంటనే సత్యస్థితిలోనికి తొంగిచూడగలుగుతాము.  ఎన్నో పేర్లతో ఎన్నో యోగమార్గములుండవచ్చు.  నేను, సరిచేయబడిన యోగపద్దతినొకదానిని సహజమార్గమని పేరిడి ప్రవేశపెట్టితిని.

 

        అభ్యాసిని "హృదయములో ఈశ్వరీయ ప్రకాశముమున్నది" అను భావనతో హృదయముపై ధ్యానమును చేయమందుము.  గురువుగారు మల (స్థౌల్యము) విక్షేప (తత్తరపాటు) మరియు ఆవరణ (పొరలు) లను తొలగించి దేహమును శుద్ధిగావించును.  అందువలన అది అభ్యాసి ఆధ్యాత్మికజీవనమునకంతయు గొప్ప సహాయకారిగా వుండును.

 

        మనము మూలసత్తానుండి క్రిందికి జారివచ్చితిమి.  మనము తిరిగి వెళ్ళవలెనన్న వివిధ చక్రములు లేక గ్రంథులను దాటుతూ పైకి అధిరోహించవలసి యుండును.  ఇక్కడ నేను సహజమార్గ పద్ధతిలోని విశేషములను చర్చించడములేదు. కానీ కొన్ని అవసరమైన విషయములను తమ్ముతాము ఉద్ధరించుకొననెంచిన వారికోసం చర్చిస్తాను.  సహజమార్గ విధానమున శిక్షణ కారణశరీరము అనగా సంస్కారములు బీజరూపముననుండు స్థానమునుండి ప్రారంభమగును.  మనము అభ్యాసి ఆలోచనలను నిలుపుదలచేయము.  కానీ మనము నరముల ప్రతి కేంద్రమును మరియు చిత్తసరస్సును శుభ్రపరచజూతుము.  మనము అలలుత్పన్నమగు చిత్తసరస్సుయొక్క అట్టడుగుభాగమును శుద్ధిచేయుదుము.  ఏదోవిధంగా ఆ అలలను నిలుపుదల చేయగలిగినచో అవి పైకెగయుటకు ఆధారభూతమైయున్న పదార్థము యధాతదంగ వుంటుంది.  ఇచ్ఛాశక్తి వలన ఆలోచనాతరంగములను ఆపవచ్చును.  కానీ ఆ ఆలోచనాతరంగములను రేపిన పదార్థము మాత్రము అలానే వుండిపోతుంది.  అది గనుక నిర్మూలింపబడకపోతే బంధవిముక్తి అసాధ్యము.  మనము సహజసిద్ధమైన మార్గమున పురోగమించి అట్టడుగుననున్న ఆ స్థితిని తొలగించవలెను.  మన సహచరులు కూడా ఆలోచనల తాకిడిని గురించి ఫిర్యాదు చేస్తుంటారు.  కానీ అదే సమయంలో ఆలోచనలు అంతగా ఇబ్బంది పెట్టడంలేదని సంతోషిస్తున్నారు.

 

        మనము పవిత్ర గ్రంథములలో తెలిపియున్నట్లు, మోక్షమును పూర్వసంస్కారముల వలయముల నుండి విడివడితేనే పొందగలము.  ప్రస్తుత సంస్కారములను అదుపుచేసుకొని ఇక సంస్కారములు ఏర్పడకుండా కట్టుదిట్టము గావించుకొనవలెను.  ఇది యోచించదగ్గ ఒక ఆధ్యాత్మికస్థితి.  సహజమార్గము ద్వారా అంతర్గత ఎఱుకలోనికి వెళ్ళి దీనిని సులభముగా సాధింప వచ్చును.

 

        మనస్సు ఉత్పన్నము చేసిన ఆలోచనలు పాతసంస్కారములను బయటికితెచ్చి అనుభవము (భోగ్) నకు రానివ్వడంలో చాలా సహాయము చేయును.  ఈ యోగాభ్యాసము ద్వారా సంస్కారములన్నీ అనుభవమునకై విడుదలైతే గొప్పచిక్కులలో పడిపోతామనీ, జబ్బులతో బాధపడతామనీ, ఆపదలు సంభవిస్తాయని, కొందరు ప్రజలు భయపడతారు.  వారిభయము సరియైనది కావచ్చునేమో.  అటువంటి సంఘటనలే ఏర్పడితే ఇక ఆ విషయమై గురువుగారుండీ ప్రయోజనంలేనట్లేగదా అనిపించవచ్చు.  కానీ అభ్యాసి తనకైతాను వాటి తీవ్రత తగ్గించుకునే ప్రయత్నంచేస్తాడు.  గురువుగారి శక్తి కూడా అభ్యాసి ప్రయత్నానికి తోడై వాటిని బాగా మాడ్చేయడానికి సహాయపడుతుంది.  ఈ పద్ధతి పాఠకులకు కొత్తదిగా, అన్యమైనదిగా అనిపించవచ్చు కానీ ఇది పురాతనపద్దతే, కానీ ఇంతవరకు మరుగున పడియుండినది.  సంస్కారానుభవము (భోగ్) అభ్యాసి ఊహించినంత తీవ్రతరమైనదేమి కాదు.  అయినప్పటికి చాలా సంస్కారములు వాటికైఅవే నెట్టుకొని అనుభవమునకు వచ్చేస్తుంటాయి.  శుద్దీకరణమంటే వీటన్నిటిని నిర్మూలించడమే.  శుద్దీకరణ ద్వారా ఆశించిన ఫలితములు వెనువెంటనే సిద్ధించి మనము తేలికదనాన్ని పొందుతాము.  దినదినానికి సూక్ష్మత జెందుతూ అత్యంత తేలికైన (సూక్ష్మమైన) దానితో ఐక్యమైపోతాము.

 

***


ప్రకృతి కర్మాగారము

 

        భగవంతుని చైతన్య స్వరూపమే ప్రపంచము.  ఇందులో సర్వత్రా ఆయన శక్తి పనిచేయుచున్నది. ఇది ఒక పెద్ద ప్రకృతి కర్మాగారము, పనికి కావలసిన అన్ని పరికరములతో సంసిద్దము చేయబడియున్నది.  యంత్రములన్నీ నడుస్తూ వుండటానికి కావలసినశక్తి కేంద్రము నుండి ప్రవహిస్తూవున్నది.  ఒక్కో విధమైన పనికి ఒక్కో రకమైన యంత్రము ప్రత్యేకింపబడియున్నది.  శక్తి దొరలి వస్తున్నదికానీ దానికేవిధమైన ప్రత్యేక ఉద్దేశ్యము, ప్రయోజనము, అవసరములయొక్క ఎఱుక లేకుండానే, ఆఖరుకు నిర్దేశించిన ఫలితములను సర్వసాధారణంగా సిద్ధింపజేస్తున్నది.  అది అనుకోని సంఘటనలు, అడ్డంకులు లేక ఇతరత్రా బాహ్యకారణముల వలనగాని యంత్ర భాగములు సక్రమముగా పనిచేయక పోవడమువల్ల ఏర్పడే ఆపదలనుగానీ ఖాతరు చేయకుండా ప్రవహిస్తూనే వున్నది.  యంత్రములు సమర్థవంతముగా పనిచేయవలెనన్న దాని భాగములన్నీ సక్రమంగా అమర్చబడి వుండాలి.  అవి ఏవికూడా వదులుగాను, లోపభూయిష్ఠముగాను వుండకూడదు.  ఇవన్నీ గమనించుటకు తగిన హోదాలలో ఉద్యోగులుంటారు.  వారు మేస్త్రీలు, పర్యవేక్షకులు మొదలైన వారు.  వారిపని యంత్రములోని వివిధ భాగములన్నీ సక్రమముగా అమరివుండునట్లు చూచుకోవటం.  ఈ యంత్రముల పనితీరు గమనించువారెవరై వుంటారు?  వారు దేవుళ్ళు, దేవతలు అయివుంటారని అనుకోవచ్చు.  కానీ కానేకాదు.  దేవుళ్ళు దేవతలు యంత్రములోని విభాగములవలె ప్రకృతిలోని వివిధశక్తులు.  వారు దేనితోను సంబంధము లేకుండా వారిపని వారు మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.  అంతకు మించి వారు ఒక్కఅంగుళం కూడా అవతలికి పోలేరు.  నిజానికి యంత్రాన్ని సక్రమంగా పనిచేసేట్లు తొలినుండి గమనించేవాడు "మనిషి".  ఇతడే ప్రకృతియంత్రాలను సక్రమముగా నడచునట్లు చేసేవాడు.  ఇతడే యంత్రభాగాల అమరికను సరిచూచుకొని పరిరక్షిస్తుంటాడు.  ఇది కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు.  కానీ ఇదే సందేహాతీతమైన నిజము.

 

        మనిషి ప్రకృతిచేతి పనిముట్టు.  అతనికి గొప్పశక్తి వుంది.  ఆశక్తిని సద్వినియోగ పరచు సాధనములు అతనికున్నాయి.  అట్టి అద్భుతసాధనమే మనస్సు. అది మనిషికి మాత్రమే వున్నటువంటిది.  మనచేత పూజలందుకొనుచున్నారనుకుంటున్న దేవతలకు కూడా ఈ మనస్సు లేదు.  పశువులకు వున్నదనుకుంటున్నాం గానీ దాని లక్షణం వేరు.  మనిషితో పోలిస్తే దానికి జీవము, చైతన్యము వున్నా మొద్దుబారిన స్థితిలో వుంటుంది.  సృష్టి ప్రకటితమగుటకు భగవంతుని ఇచ్ఛానుగుణంగా ఏర్పడిన మొదటి క్షోభయే మనస్సుకు మూలము.  మనస్సు యొక్క నిజతత్వమిట్లుండగా మహాత్ములుగా పిలువబడుతున్న మోసగాళ్ళు, మనస్సును కఠినమైన వాక్కులతో దారుణంగా నిందిస్తూ అది మానవునికి బద్ధశత్రువని చాటుతున్నారు.   వారు దాని నిజమైన విలువ, యోగ్యతను గుర్తించలేకున్నారు.

 

        వాస్తవమునకు ఇదొక్కటే చైతన్యమును గలిగించు సాధనము.  క్షోభ రూపమున దిగివచ్చిన దివ్యశక్తి ఇదే. పరిమిత రూపంలో వుండి ఈ చిన్ని మానవుని సృష్ఠిని ప్రకటించినది ఈశక్తియే.  ప్రతిదాని మూలమున నిక్షిప్తమై యుండి కదిలించుచున్నది ఈ శక్తియే.  సరి, ఈ శక్తి ఎవరిది?  భగవంతునిదా లేక మనిషిదా? దీనికి జవాబు అతి సులభము.  అది ఖచ్చితముగా మనిషిదే.  ఎందుకటే భగవంతునికి మనస్సేలేదు.  ఒకవేళ వుండివుంటే ఆయనకు సహితం సంస్కారాల ప్రభావం చుట్టుకొని వుండేది.  కనుక మానవ మనస్సే మూలము నుండి పనిచేస్తున్నది.  ఇప్పుడు మానవుని మనస్సును గురించి ఎక్కువగా చెడే వింటున్నాము.  అయితే అదంతా నేటిపతనావస్థను దృష్టిలో వుంచుకొని చెప్పినదే.  వాస్తవానికి మనస్సును దాని నిజస్థితి పూర్తిగా నశించిపోయినంత హీనస్థితికి మనమేతెచ్చితిమి.  అందువలన అది నిరంతరం చిక్కులు కలిగించే స్థానమైనది.  కనుక అది ప్రకృతి యంత్రములను సరిగా పనిచేయుటకు సహాయముచేయక అడ్డుపడుటకు, ఆటంకపరచుటకు ఉపయోగపడుచున్నది.  కనుక సామాన్యముగా సమస్త చెడుగునకు కారణభూతమని అనుకుంటున్న మనస్సును సరిగా ఉపయోగ పెట్టుకున్నట్లయితే దానిని బాగుపరిచేది కూడా అదేనన్న నిర్ణయానికి వస్తాము.

 

        ప్రపంచము అత్యంత పతనావస్తకు పడిపోయినప్పుడు ప్రత్యేకవ్యక్తులు సాధువుల రూపములోను, ప్రవక్తల రూపములోను, అవతారముల రూపములోను దిగివచ్చి తప్పుదారి పట్టిన మానవమనస్సు ప్రభావమున చెడగొట్టబడిన స్థితి నుండి రక్షిస్తారని యావత్ప్రపంచం నమ్ముచున్నది.  కనుక ప్రకృతికార్యము మానవరూపమున కనబడు ఒక మానవాతీత పురుషపుంగవుని మాధ్యముననే నెరవేర్చబడవలెను.  ఎందుకంటే అతడు మనస్సు కలిగియున్నాడు.  ఆ మనస్సు మాత్రమే దేనినైనను చైతన్యపరచు సాధనము.  కాని అతను కలిగియున్న మనస్సు మహోన్నత సంపూర్ణస్థితిలోవుండి క్షోభ రూపములోనున్న దివ్యశక్తితో సన్నిహిత సంబంధము కలిగియుండును.

 

        వాస్తవమునకు మనస్సు మరియు మాయ అను ఈరెండింటి మీదనే ప్రకృతి యంత్రముల పనితీరు ఆధారపడి యున్నది.  కానీ వాటిని చాలా స్థూలాతిస్థూల చెడువస్తువులుగా నూతన మతవాదులు చిత్రీకరించిరి.  ఈ రెండే మనల్ని దివ్యత్వము వరకు చేర్చు ప్రధానాంశములని వారికి తెలియదు.  వాస్తవమున మానవ ఉనికికి ఒక కొస మనస్సు మరొక కొస మాయయై వున్నవి.  రెండింటిని కలిపితే ఒక పెద్ద పడవయై సత్యతత్త్వమను సముద్రపు ఒడ్డునకు చేర్చును.  సముద్రమంటూ నేనన్న మాటలకు ప్రజలు ఆశ్చర్యపడవచ్చును.  ఎందుకంటే ఇంతవరకు ప్రతిఒక్కరూ సత్యతత్త్వమునందు శాశ్వతంగా లీనమవ్వడం గురించే ఆలోచింపజేశారు.  ఈ విషయం గురించి తగినంతగా మతగ్రంథాలలో కూడా తేటపరచలేదు.  తన ప్రయాణ సమయమున దాటవలసిన మండలములలో ఒకానొకటిగా సత్యతత్త్వమును పేర్కొనవచ్చును.  ఆవలివైపున దిగిన తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళవలసివుంది.  ఎంతవరకు?  ఇంత అని ఎవరూ నిర్ణయించలేరు.  ఒడ్డు అన్న పదమే ఒకవిశాల భూభాగమునకు ఒక వైపు హద్దుగీతయేయని మనస్సుకు తోచుచున్నది.  దీని పరిధి ఎంత అన్నది ఊహాతీతమైన విషయము.  ఇంతవరకు మనము సముద్రయానమే చేయుచుంటిమి.  పడవలో వుండగా ప్రయాణము చాలా హాయిగా వున్నది.  ఉదయపు చల్లని వాయువులు, స్వచ్ఛజలములవల్ల గలుగు నూతనోత్సాహపు, ఈ ప్రయాణమును అందరూ కావాలని కోరుకుంటారు.  ఇది వారికి సంతృప్తిని మనోల్లాసమును మరొకవిధంగా చెప్పాలంటే ఒకరకమైన మనఃశ్శాంతిని యిచ్చింది.  అదే ఆనందమని అర్థమైంది.

 

        ఇప్పుడు మనం భీతిగొల్పుచున్న ఒడ్డున దిగాము.  జలముల తాజదనం పోయింది.  శీతల పవనములు వీచడంలేదు.  అలల ఊయలలూపుల ఆహ్లాదంలేదు.  మజాలేదు, ఆకర్షణలేదు, సంతోషానుభవంలేదు.  కేవలం పనికిరాని ఏమీలేని బీడుగా వుంది.  అదికూడా ఆనంద మూలమే. అది మరొక రకమైనది.  పూర్వపుదానికి దీనికి తేడా తెలియడం కోసం దీనిని నేను సంపూర్ణానందము అందును.  ఇది స్థిరమై, పరిణామరహితమై, సత్యమై, ఉత్తానపతనములు లేనిదై వుంటుంది.

 

        ఈ అనంత వ్యాపితమునందు పురోగమిస్తూ అనతికాలంలోనే మనుష్యుని ఉత్పత్తిస్థానమునకు చేరుకుంటాము.  అది అవతారపురుషులకు సహితము సాధింపనలవికానిది.  అప్పుడు నిజమైన ఆనందము తేటతెల్లము గావింపబడుతుంది.  ఇది మాటలకందదు కాబట్టి ఏవిధంగాను వ్యక్తపరచలేము.  దీన్ని సాక్షాత్కరించుకొని అనుభవపూర్వకముగా ఆనందించవలెను.  ఈదశకు చేరినవాడు తన్నుతాను కోల్పోయినట్లు భావిస్తాడు.  ఇదంతా ప్రకృతిరహస్యము గనుక ప్రకృతితో లీనమైన వారికే తెలియజేయబడతాయి.

 

        ఇప్పుడీదారిలో అతనికందుబాటులో వున్న సదుపాయములనన్నిటిని సద్వినియోగ పరచుకుంటూ పురోగమిస్తాడు.  అతడు సేవకై సమర్పితమైన మనస్సు, ఇంద్రియములు కలిగి వుంటాడు.  భక్తి వైపునకు సేవ అనునది దాటుడురాయిగా పరిగణింపవచ్చును.  అయితే ఇదే సరిపోదు.  సేవ భౌతికశరీరము, ఇంద్రియములయొక్క కార్యకలాపము.  దీని వెనుక మనస్సు ఆధారముగా వుండనేవున్నది.  దానియందు కూడా ఇదేభావన వుండితీరాలి.  శరీరముయొక్క చర్యలన్నీ మనస్సుయొక్క చైతన్యముపైనే ఆధారపడియుండునని చెప్పవచ్చును.  కనుక శరీరము సేవలో నిమగ్నమైవుంటే మనస్సుకూడా దానితోనే వుండి వుండాలి.  అది నాభావన కాదు.  ప్రేమ, సానుభూతిభావముతో స్పందింపబడితే ఆ కార్యము చక్కగా వుంటుంది.  కాకపోతే అది పేరుకుమాత్రమే సేవయై ఏదోస్వార్థపర చింతనతో కూడి వుంటుందని నాతలంపు.  అట్టియెడ ఫలితము కుడా భిన్నంగానే వుంటుంది మన ప్రధానోద్దేశ్యము భక్తిని వృద్ధిచేయుట, అందుకు సేవ ఒక సాధనము.  మన వుద్దేశ్యము నీతినిజాయితి గలిగినదైతేనే మనము నిజమైనసేవ చేయగలుగుతాము.  దీనిలో కర్తవ్యతాభావము మరియు ప్రేమ కలిగియుండి ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ వుంటాయి.

 

        కొందరున్నారు.  వారు సేవాకార్యక్రమములలో చురుకుగా పాల్గొనకపోయినప్పటికి వారి హృదయములలో యితరులయెడ మృదుభావన వుంటుంది.  అదీ కొంతవరకు మేలే.  అట్టివారిని ఒంటికాలితో నడుస్తున్న వారనవచ్చును.  ఈ విషయము మహోన్నతాత్మలను అనగా దివ్యత్వముతో దృఢమైన బంధమేర్పరచుకొని భగవంతునితప్ప మరే యితర యోచనను హృదయములోనికి ప్రవేశింపనియ్యని వారినిగూర్చి కాదు నేను ప్రస్తావించుచున్నది.  అట్టి ఆత్మలు అరుదు.  నిజంగా చాలాఅరుదు.  వారు కర్తవ్యరూపమున చేయని దంటూ ఏమీ మిగిలి లేదు.  వారి హృదయపు తీవ్రప్రేమ కారణమున వారు ఇతరములను గమనించుస్థితిలో కూడా వుండరు.  వారు ఇదిచేయవలె, ఇదిచేయరాదు అనెడి నిర్ణయముచేయుస్థితిలో కూడా వుండరు.  కానీ అంతటి అంతిమస్థితినందుకొనియున్నవారు కూడా వెనుకకు తిరగక తప్పదు.  కానీ అది మరొకవిధంగా వుంటుంది.  అప్పుడు వారి సేవలు జ్ఞానపుటెఱుకకతీతంగా వుంటాయి.  సేవాభావము సహితము వారి మనోపరిధికావల వుంటుంది.  అయినా చర్యలన్నీ యాదృచ్ఛికంగా వాటికైఅవే, తక్షణమే ఏవిధమైన ఎఱుక కల్గిన యోచన, ప్రయత్నము లేకుండగానే జరిగిపోతుంటాయి.

 

        అట్టి మహోన్నతస్థాయి నందుకొనవలెనన్న హృదయపు అట్టడుగు స్థానమున ధ్వనించిన శబ్దము తప్పక వినబడునట్లు చేసుకొన వలయును.  ఇది సాధించడం ఎలా?  సులభమైన జవాబున్నది.  వీలైనంత దగ్గరి స్థానాన్ని పొందడమే.  అదెలాసాధ్యం?  అందుకు సాధన మరియు అభ్యాసము తప్ప వేరుమార్గము లేదు.  ఒకే ఒక్క ప్రతిభావంతమైన మార్గము నిన్నునీవు అభ్యాసమునందు  దృఢముగా అనుసంధించుకొనే అనంతముతో బంధమేర్పరచుకో లేక మరోవిధమేమంటే అనంతముతో బంధమేర్పరచుకొని పూర్ణత్వము సాధించిన వానితో బంధమేర్పరచుకో.  అలా నీకైనీవు సంబంధమేర్పరచుకున్నావు అంటే ఆ మహనీయుడు నిన్ను ఆయన హృదయానికి ప్రేమతో హత్తుకొని లోనికిగైకొన్నాడని అర్థం.  నీవు లోనికి జొచ్చుకొని పోవుటకుచేయు ప్రయత్నమంతా నీవు అంతిమసత్యము వైపునకు పురోగమించడమే.  "శరణాగతి"  అన్నపదమునకు అర్థమిదియే. సంపూర్ణత్వ సాధనకు ఇదే తిరుగులేని విధానము.  ఎంతకాలము నీవొక పనిని చేస్తూ, నేను చేస్తున్నాననే ఎఱుకలోనే వుంటావో అది సరియైన పద్దతి కాదు.  నీవు శరణాగతి స్థాయికి దూరమైయున్నావు.  కారణం అహంకారభావమక్కడ వుంది.  శరణాగతి ఎఱుకగల అహంకారభావన నుండి విడివడి వుండాలి.  అక్కడ ప్రతీది దానికై అదే అవసరాని కనుగుణంగా ఏవిధమైన ముందువెనకల ఆలోచన లేకుండా జరిగిపోతుంటాయి.

 

        అయితే యిక్కడ గొప్ప ముందు జాగ్రత్త తీసుకోవలసి వస్తుంది.  అర్హతలేని వనికి లేక అంతిమసత్యము వరకు చేరనివానికి ఆత్మార్పణ గావిస్తే మనం అంతిమ ప్రయోజనమందుకొనుటలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.  అదే సమయంలో అతడు నిజంగా అంతటివాడో కాదో నిర్ణయించడం కూడా కష్టమే అవుతుంది.  అది మన సంస్కారాల ఫలితంపై ఆధారపడిన అదృష్టమే అవుతుంది.  ప్రార్థన ఈవిషయంలో కొంత మేలుచేస్తుంది.  ప్రార్థన ద్వారా మాత్రమే ప్రకృతి తరంగాలలో స్పందనలను నీవు ఉత్పన్నము చేయగల్గుదువు.  దాని ప్రతి చర్య యాదృచ్ఛికమై పరిష్కారము దానికై అదే లభిస్తుంది.

 

***


సహజ మార్గము -- ఒక చైతన్య పూరిత శక్తి మార్గము

 

        ప్రక్రృతి రహస్యములను ఛేదించుటలో మానవుడు చూపిన గట్టిపట్టుదలతో కూడిన ప్రయత్నము విజ్ఞానపుటెల్లలను విశాల మొనర్చివైచినవి.  అందుచేత అతడు ప్రకృతిలో చూచిన ప్రతిదానిలోనికి చొచ్చుకొనిపోయి అన్వేషించుట కొనసాగించెను.  మనము దేనికోసమైన వెదుకుతన్నామంటే అందులో మనం ఆలోచించడానికి ఎదోఒకటుంటుంది.  ఇంకా ముందుకుపోతే రహస్యం వెనుక రహస్యమున్నట్లు కనుగొంటాం.  మన ఆలోచన మరింత పరిణత చెందితే అది అన్నింటి వెనుక ఏమున్నదో అక్కడికి దారితీస్తుంది.  మన పూర్వీకులు ఎప్పుడందులోనికి తొంగి చూచారో అప్పుడు వారు చక్కగా వెళ్ళి ఈప్రపంచమునకు మూలకారణాన్ని మనిషికి భగవంతునికిగల సంబంధాన్ని మరియు ప్రకృతిని వ్యక్తీకరిస్తున్న జంగమస్థావర విలువలను కనుగొన్నారు.  మనం దానిలోనికి వాస్తవంగా తొంగిచూస్తే అందులో నిర్మాణాత్మక మరియు వినాశనాత్మక శక్తులు అణువులరూపంలోను కణాలరూపంలోను అగుపిస్తాయి.  శక్తిరేఖలుకూడా అక్కడున్నాయి.  ధన ఋణ కణాలు తమ ఉనికిని విశద పరుస్తున్నాయి.  మన యోగిపుంగవులు ఈ నిగూఢమైన శక్తులనన్నిటిని గమనించి వాటిని నిర్మాణాత్మక కార్యములందుపయోగించుటకు ప్రమాణ పూర్వకముగా నిర్ణయించుకొనిరి.  వారు ప్రతిదానిని దాటుకుంటూ వెళ్ళివెళ్ళి కొన్ని కదలికలు ఈ విశ్వస్థితికి కారణమను విషయమును కనుగొనగల్గిరి.  మనము ఇంతదనుక వెళ్ళగలిగితే, కేంద్రము మరియు దాని మండలము, వాటి ఉనికికి సంబంధించిన జ్ఞానమును ప్రసాదిస్తున్నట్లు తెలియుచున్నది.  ఇప్పుడింకా ముందుకు వెళదాం.  అక్కడ దాని పైన క్రింద ఏమున్నది?  మనం ప్రతీదీ కేంద్రము వైపునకే మొగ్గుతున్నట్లు కనిపిస్తున్నది.  మరి కేంద్రము దానికైఅదే దాని పరిధులకు వ్యాపిస్తున్నట్లున్నది.  మన ఈ సాహసోపేతమైన చర్య తర్వాత మన ఉనికికి గల ప్రాధాన్యతను అంచనా వేసుకొనిచూస్తే మనచుట్టూవున్న మహోన్నతశక్తి యొక్క సహకారమును గమనించడం జరిగింది.  ఈ మనఆలోచనా ప్రవాహశక్తియే ప్రస్తుతము ప్రదర్శింబడుతున్న ముఖ్య విషయము వైపునకు, మన ధ్యాసను మరల్చినది.  క్రమేణ మానవ శరీరములోని కదలికల చర్యలను తెలుసుకోగలిగితిమి.  మార్గము తెరువబడి కేంద్రమండలము వరకు పురోగమింపవీలైనది.

 

        నా ఉద్దేశ్యములో మన జీవితసమస్యను ఎలాగోలా పరిష్కరించ గలిగామంటే రహస్యాన్ని విప్పినట్టే లెక్క.  మనల్నిమనం తేటతెల్లం చేసుకోగలిగామంటే ఈ విశ్వానికి మానవుడు సంగ్రహరూపమని అర్థమౌతుంది.  మన పురోగతిలో ఈజ్ఞానము తోడైన తర్వాత మనము మనలోని కేంద్రములను, వాటికదలికలను, వాటిపనిని మరియు మానవ మనోదేహధర్మాలను పరిశీలించడం మొదలు పెట్టాము.  మనలోని శక్తిని వినాశమునకు కూడా వాడవచ్చును కానీ పూర్వీకులు తీసుకున్న పవిత్ర ప్రమాణాలకు విలువనిచ్చి అట్టి పనిని పూర్తిగా వదలి వేసితిమి.  శక్తిని మానవునిలో మార్పు తెచ్చుటకు వినియోగించితిమి.  నిర్మాణాత్మక పార్శ్వమున నిజముగా తొంగిచూచితిమేని ప్రక్కప్రక్కనే వినాశకరశక్తులు కూడా అగుపిస్తాయి.  మధ్యస్థశక్తులు కూడా అక్కడే వున్నాయి.  వీటన్నిటిని శాస్త్రజ్ఞులు ఇంకనూ పరిశోధించి వెలువరించలేదు.  వాటితో మనకు సంబంధము లేదు గనుక వదలి వేతుము.  మనము నిర్మాణాత్మక పార్శ్వమునకు వత్తుము.  మనలో ఈ ఉద్దేశ్యము పెట్టుకొని అంతర్గతముగా దృష్టి సారించితిమేని ఉన్నత కేంద్రములు మన కేంద్రములపై శక్తిని ప్రసరింపజేస్తున్నట్లు కనుగొందుము.  కానీ మన చెడు ఆలోచనలు, చేష్టల వలన ఆ ప్రభావము మనలోనికి అసలే రావడములేదు.  ఒక దట్టమైన స్థూలపుపొర కేంద్రములపై చుట్టుకొని లోనికి దేనిని పోనివ్వడము లేదు.  మానవ శరీరములో అనేకమైన కేంద్రములున్నవి.  వాటి పని రెండు విధాల అనగా ఆధ్యాత్మికంగాను, ప్రాపంచికంగాను వుంటుంది.  మానవజాతి కంతటికిని మేలు సమకూర్చుటకొరకు వీటన్నిటిని తెలుసుకొనవలసి వున్నది.  అందుకు పరిశోధనలు అవసరము.  మానవజాతి అభివృద్ధి కొరకు నేరుగా తమ శక్తినుపయోగించి పనిచేయలేని బలహీనులు మాట్లాడే విషయముగా కొట్టిపారేస్తారు.  ఆ విధంగ ఆధ్యాత్మికతపై మనలో చాలా మంది దాడిచేసి నేటి నాగరికతను ఉదాహరణగా చూపిస్తున్నారు. వారు అపరిమిత అంగలతో ప్రాపంచిక వస్తువిషయముల వైపుకు సాగి తమనుతాము మాత్రము పరిమితులను చేసుకొన్నారు. ఎందుకంటే వారు పరిమితులకు లోబడిన వాటికై మాత్రమే ప్రయత్నిస్తారు.  ఆ తర్వాత వారు చతికిల బడిపోతారు.  ఉండవలసిన ఆశయమేమంటే పరిమితమైనదాని నుండి అపరిమితమైనదాని వైపుకు సాగించేట్లుండాలి.  పరిమితమైనవన్నీ అపరిమితమైన దానిలో లీనమయ్యేట్టు చేయడమే మన ఉద్దేశ్యమై వుండాలి.  మరో మాటలో చెప్పాలంటే పరిమితత్త్వమే మొదట మెరుస్తూ వుంటుంది.  అక్కడనుండే ఆధారము వైపునకు సాగిపోవాలి. మరి పరిమితత్త్వమంటే ఏమిటి?  మనలోని కేంద్రము అపరిమితమును అవగాహన చేసుకునే సామర్థ్యము కోల్పోయింది.  సహజమార్గ పద్దతి ఈ పరిస్థితులనెదుర్కొని నిలబడుతుంది.  పరిమిత స్థితి కనుగుణంగా మనకర్తవ్యపాలన సుసాధ్యం చేస్తుంది.  తదనంతరం అపరిమితం వైపునకు పురోగమింప జేస్తుంది.  ఇది మనకర్తవ్యమును మనకు అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తుచేస్తుంది.  కనుక మనం రెండింటిని (పరిమితాపరిమితములు) సరిజేసుకోవాలి.  అంటే మనం రెండు రెక్కలతో విహరించాలి.  కేవలం పరిమితములకే మనం ప్రయత్నిస్తే మనం దుర్బలమైన ఆధారంతో కదులుతాము.  మనము పరిమితములతోనే అపరిమితంకోసం ప్రయత్నించాలి.  ఇందుకొఱకు శక్తివంతమైన పద్దతులననుసరించాలి.  మరి ఆ పద్దతులు ఏమైవుంటాయి?  అపరిమితత్త్వగుణము తొలుదొల్త నుండి ప్రవేశ పెట్టగల పద్దతులు మాత్రమే అవి.  ఈ వాక్యముపై కాస్తా లోతుగా ఆలోచించగలిగిన పాఠకులుంటే వారికి నేను సర్వదా కృతజ్ఞుడను.

 

        సత్యతత్త్వగుణాన్ని ఎవరు తమ కేంద్రములలో ఇముడ్చుకోగలుగుతారో వారి వల్లనే ఇది ప్రవేశపెట్టబడుతుంది.  శక్తిని, భక్తిని ఎలా ఉత్తమ కేంద్రాలనుండి అధమ కేంద్రాలకు తీసుకురావాలో దాని ప్రభావాన్ని అభ్యాసిలోనికి ఎలా అందించి వారు అదే గుణాలను సంతరించుకొనేట్లు చేయాలో ఎవరికి తెలుసు? ఇందుకొరకు ఒక బలమైన చైతన్యశక్తియుత హస్తము ఎప్పుడూ అవసరం.  మన కేంద్రములలో పేరుకపోయిన స్థూలత్వం నిర్మూలించనంత వరకు, మనము చేర్చిపెట్టిన స్థూలత్వము చిక్కుముళ్ళ కారణంగా ఉత్తమ కేంద్రముల కృప లేక ప్రభావము మనకు అత్యంత దూరమైపోతుంది.  మన సహజ మార్గము కేంద్రముల శుద్ధీకరణ పద్దతిని ప్రోత్సహిస్తుంది.  మరియు గురువుగారే ఈ పనిని ప్రాణాహుతి ప్రసారంద్వారా నిర్వహిస్తారు.  ఎంతకాలము అభ్యాసి నేరుగా దైవకృపను పొందలేడో, అంతకాలం గురువు తనకు నేరుగా లభిస్తున్న దైవకృపను అభ్యాసికి మరలిస్తాడు.

 

        నేను ఇంతకు మునుపే ప్రకృతి శక్తుల గురించి మరియు శక్తి రేఖల గురించి తెలిపియున్నాను.  అవన్నీ తగిన రీతిలో మనిషి పరిణామమునకు సద్వినియోగపడతాయి.  ఈశ్వరీయ ప్రకాశము హృదయంలో వున్నది అను భావనతో హృదయముపై ధ్యానముచేస్తూ పురోగమిస్తాము.  అలా చేయడం వలన క్రమేణా మనం ఉద్ధరింపబడతాము.  ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే మనం అంతర్గత ఎఱుకలోనికి లోతుగా మునుగుతాము.  తత్ఫలితంగా అభ్యాసి విశాలతను అనుభవించడం ప్రారంభిస్తాడు.  ఇది మొదటి దశ.  అంటే మనం అనంతతత్త్వపు బీజాన్ని నిక్షిప్తం చేశాము.  మరో మాటలో చెప్పాలంటే మన దృక్పథం నుండి జారిపోయిన విషయాన్ని తిరిగి దారికి తెచ్చాము.

 

        ఇప్పుడు రెండవదశ దృష్టిపథంలో తెరచుకుంటుంది.  అన్ని జీవపదార్థాలలో భగవంతుడున్నట్లు అనుభూతి చెందుతాడు.  ఇక మనం అనుభూతి చెందే మూడవవిషయం ప్రతీదీ పరిణామం చెందుతునే వుండటం.  ఈ అనుభూతి మారి మనిషి ప్రతిదీ భగవంతుని నుండి వెలువడిందని మరియు భగవంతుడే ఇలా రూపుదాల్చాడని భావిస్తాడు.  ఇక నాల్గవదశ అంతిమంగా మనం పొందవలసిన శూన్యత్వదశ.  మనం ప్రతిఅణువులోను, వస్తువులోను ఒక రీతిని గమనిస్తున్నాం.  పద్దతి సరియైనదై మార్గదర్శి పరిపూర్ణుడైతే ప్రతివ్యక్తి ఈ దశలను దాటుతూ వెళ్ళవలసిందే.  మనం తర్వాతి మండలానికి వెళ్ళగానే ఈ స్థితులసాంద్రత కొంత తగ్గి వుంటుంది.  అలా బ్రహ్మాండ మండలం చేరే వరకు జరుగుతూనే వుంటుంది.  అక్కడ కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది కానీ వాటి వర్ణపు సున్నితత్త్వం ద్వారా తేడా అర్థమౌతుంది.  గురువు పరిపూర్ణుడు కాకపోతే అక్కడి శక్తులలో లీనమయ్యే ప్రమాదమున్నది.  కారణం వాటికి ఆధ్యాత్మికతకు సంబంధంలేదు.  గురువు యొక్క పని అంతిమ హద్దు చేరేవరకు మున్ముందుకు సాగుతూనే వుంటుంది.  నేను అభ్యాసి మరియు గురువుయొక్క కర్తవ్యమును గురించి చర్చించితిని.  మానవ జాతి ఉత్తమ స్థితులందుకొనుటకు హృదయ కేంద్రము ద్వారా పనిచేసి మనస్సు ఇంద్రియముల క్రమబద్దీకరించుటకు గురువుచేపట్టిన పద్దతి యొక్క పనితీరును గురించి ఇక్కడ నేను చర్చించలేదు.  అభ్యాసిపాత్ర గురువుగారికి సంపూర్ణ విధేయుడై యుండుటే.  అంటే నావుద్దేశ్యము గురువుగారిపై శ్రద్ధ లేక కనీసము నమ్మకముతోను తనపైతనకుగల ఆత్మవిశ్వాసముతోను గురువుగారి సూచనలను ఆచరణలో పెట్టవలయును.  మనము అంతిమ హద్దువరకు చేరినట్టి ఉన్నత గురువర్యుని కొఱకు వెతకవలసి వున్నది.  అట్టి గురువు దొరుకుట చాలా కష్టమే.  ఉపనిషత్తులలోని సూక్తుల ప్రకారం చూస్తే సరియైన శిష్యుడు దొరకడం కూడా అంతే కష్ఠము.  అయితే భగవత్ సాక్షాత్కారము కొఱకు రగులుతున్న తీవ్ర వాంఛ గనుక వుంటే ఆ ప్రభువే అన్వేషకుని గడప వద్దకు చేరుకుంటాడు.  నమ్మకము అపనమ్మకము అనునవి రెండు.  ఈరెండూ అవసరమే.  కానీ మనం సామాన్యంగా నమ్మకూడని చోట నమ్మకం చూపిస్తాం.  నమ్మవలసిన చోట నమ్మకుండా పోతాం.

 

        ఆఖరుగా నేనొక్క విషయాన్ని గూర్చి గట్టిగా చెబుతున్నాను. భగవత్ సాక్షాత్కారము, దాని కొఱకు పరితపించేవాడికి ఏమంత కష్టతరంకాదు.  పరితాపముంటే తక్కువ సమయంలోనే సాధింపనగు సరియగు మార్గములోనికి వస్తాడు.  నిజమైన పరితాపము వ్యక్తిని నిరంతరం అశాంతికి గురిచేస్తుంది.  అతడు తన నిజమైన గమ్యము కొఱకు మాత్రమే పనిచేస్తాడు.  అయితే మనలో చాలా మందిమి భగవంతుని పూజించి మామూలుగా ప్రార్థన చేస్తాము.  అది కేవలం మన ఇంద్రియములకు ప్రీతి కలిగించటానికే చేస్తుంటాము.  ఈ పరిధిలో మానసికోల్లాసము, ఇంద్రియోల్లాసము యిలా ఎన్నో ఉల్లాసాలలో చిక్కుకొని పోతాము.  ఇవి సాక్షాత్కారానికై ఏర్పడినటువంటి జీవితములోనికి తొంగి చూచుటకు కూడా మనలను వీలుపడనీయవు.

 

***


గమ్యము --- గమనమున లోపములు

 

        ప్రపంచము కదులుతూనే వుంటుంది.  ప్రతి ఒక్కరూ ముందో వెనుకో వెళ్ళవలసిన వారే కానీ కొందరు బరువులతోను మరికొందరు ఏ బరువు లేకుండాను పోతారు.  చాలా మంది సంపదను వదిలి వెళతారు.  ఈ కారణంగానే వాళ్ళ వారసుల జ్ఞాపకంలో వారు తాజాగా వుంటారు.  కానీ స్వచ్ఛమైన ఆధ్యాత్మికత గల వ్యక్తియొక్క సంపాదన మరో విధంగా వుంటుంది.  ఏమీ పొందకుండానే అతడు సంపన్నుడై పోతాడు.  నా ఉద్దేశ్యంలో పొందని వాడంటే లేనివాడుగామారి వున్నవానిని వెతకడం.  తాను ఒంటరియై అతణ్ణి (భగవంతుణ్ణి)  వెతకడమే.  అతనికి సదుపాయాలపై, భోగముపై, విజయములపై, ప్రాపంచిక సుఖములపై ఏమాత్రం ఆసక్తి లేదు.  వీటి బంధముల నుండి అతని జీవిత కాలంలోనే స్వేచ్ఛను పొందినాడు.  నా వుద్దేశ్యంలో పొందినవాడు అంటే అతనితోపాటే దారి బత్తెం తీసుకొని వెళ్ళువాడు.  బత్తెం అంటే గడించిన నిజమైన ఆధ్యాత్మికసారము.  అతడు తన ఆధ్యాత్మిక సంపదను సామాన్య కుటుంబీకుని వలెనే తన ఆధ్యాత్మిక వారసులకు వదలి వెళతాడు.  వారు కూడా వారి శక్త్యానుసారము వారి వాటా వారు పొందుతారు.  మిగిలినది అర్హతగల వాడు దిగివచ్చి గ్రహిస్తాడు.  అది ఆధ్యాత్మికదీక్ష పొందిన (అక్షరం తీసుకొన్నవారు) వారిని చేరుతుంది.  ఎందుకంటే చట్టరీత్యా ఆధ్యాత్మిక బిడ్డలే దానికి అర్హులు.  ఏదిఏమైనా కొంత భాగం గురువుపై ప్రత్యేకమైన ప్రేమ గలిగి లయావస్థకు చేరిన వారికి చెందుతుంది.  అది సరియైనదే. ఆధ్యాత్మికత విషయంలో వాటా అర్హులకే చెందుతుంది.  అందుకే నేను మాటిమాటికి దాన్ని పొందే అర్హత సాధించండని ప్రోత్సహిస్తుంటాను.  అందుకు ప్రేమ, విధేయత ఈరెండూ అవసరం.  ఈ రెండూ కూడా ఒకదానిపై మరొకటి ఆధారపడి వుంటాయి.

 

        ఏదిఏమైనా దీక్ష తీసుకోవడం నిజానికి చాల అవసరం.  ఇది జరగకుండా పోవడనికి వీలులేదు.  ఉన్నతోన్నత స్థితుల నందుకొనుటకు ముఖ్యావసరమై ఇది సహాయపడుతుంది.  ఎవరైనా మహోన్నతస్థితిని దీక్షగైకొనకుండా పొందారు అంటే అది వేరువిషయం.  అప్పుడు కూడా అట్టివాడు ఒక గొప్ప కానుకను పొందనట్లే.  దీక్ష ఇచ్చాడు అంటే అతడు తండ్రి పిల్లల యెడ ఎలా బాధ్యుడో అలా తప్పనిసరిగా బాధ్యుడౌతాడు.  పిల్లవాడు ఎంత మొండివాడైనా తండ్రి మాత్రం తన బిడ్డడుగానే ఆదరించక తప్పదు.  తండ్రీ బిడ్డల బాంధవ్యం పాటించకా తప్పదు.  నిజమే ఆధ్యాత్మికతలో కొన్ని ప్రత్యేకావసరములలో గురువు తన వారసుడైన ఒకానొకనితో తెగదెంపులు చేసుకోవలసి కూడా రావచ్చును.  కానీ ఇట్టి పరిస్థితులు గత్యంతరము లేనప్పుడు మాత్రమే ఏర్పడును.  అదికూడా గురువుగారే ఇటువంటివి నిర్ణయిస్తారు.  ఈ దీక్షనొసగు సిద్ధాంత మెట్లుంటుందంటే, అన్వేషకునియందు విశ్వాసము పరిపక్వత జెంది ప్రేమలో లోతునకు మునిగినప్పుడే దీక్షనియ్యవలెను.

 

        ఇప్పుడిక మన సముదాయములనుగూర్చి వినుడు.  కొంతమంది పూజ, మర్యాదను పాటించుటకు చేస్తారు.  మరికొందరు దాన్ని ఒక ఆచారంగా పాటిస్తారు.  అదైనా వుంది, భగవంతునికి ధన్యవాదములు.  కొందరు పెద్దమనుషులు ఎప్పుడో ఒకసారి పూజకు కూర్చొని సక్రమంగా దినదినం  పూజకు కూర్చునే అలవాటును నన్నే కలిగించమంటారు.  అదీ సరే, పరవాలేదు.  మరికొందరైతే మరీ దారుణం వారు ఎంతదూరం వెళతారంటే,  భగవంతుని బదులు నేనే వారి కష్టాలు, బాధలు తీర్చలేదని నిందిస్తారు.  ఎవరికీ సరైన శ్రద్ధ వున్నట్లు కనబడదు.  ఒకవేళ వున్నా వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  వారికి ఇష్టముగాని ఆతురతగాని లేవు.  ఒకసారి మాగురుదేవులు లాలాజీవారు ఓ పెద్దాయనకు ఇట్లావ్రాశారు - "నాకు సింహాలు కావాలి, గొర్రెలు కాదు".  ఇంకో పెద్దాయనకు నోటిమాటగా చెబుతూ -- "నేను గొర్రెలను కూడా మర్యాదకోసం చేర్చుకున్నా" నన్నరు.  అదీ ఆయన అనుభవం.  ఈమాట జ్ఞాపకం చేసుకుంటే ఎవరి మీద ఏ ఫిర్యాదు వుండదు.  చూడటానికి అంతా నాతప్పేనేమోననిపిస్తుంది.  అటువంటప్పుడు అందర్నీ భరించవలసి వస్తుంది.  నేను పద్దతులనుగూర్చి యోచించినాను.  కొంతవెలుగు ఇప్పుడు వస్తున్నట్లు లేక భవిష్యత్తులో రాబోతున్నట్లు యోచనకల్గడం నామట్టుకునాలో ఒక విధమైన కృతజ్ఞతా భావముత్పన్న మగుచున్నది.  రాబోతున్నట్లనిపించడం కూడా ఏమీ లేకపోవడంకంటే మేలే కదా. ఎంతోకొంత పని జరుగుతుంది.  ఏమైననేమి మనఉద్దేశ్యము మంచిది.  ఈ క్రింది సంఘటననుబట్టి నా హృదయస్థితి ఎలా వుండేదో మీరు ఊహించవచ్చు.  నిన్నటిదినం కార్యాలయం నుండి వచ్చేటప్పుడు, బాట ప్రక్కన ఒక కోతి గాయం కారణంగా పడిపోయి ఊపిరి విడిచేస్థితిలో వుండటం చూశాను.  నామనస్సు చలించింది.  ఏమీ చేయలేకపోయాను.  నేనొక నిముషం అక్కడే నిలబడి దాని స్థితి భవిష్యత్తులో మెఱుగుపడాలని ప్రణాహుతి ప్రసారం చేశాను. నేనంతకంటే ఏమీ చేయలేక పోయాను.

 

        అఖరి ఉత్తరం చాల కఠినంగా వ్రాశాను.  అది మళ్ళీమళ్ళీ నామనస్సుకు తడుతునేవున్నది.  కానీ నేను అలావ్రాయడానికి బలవంతంచేయబడ్డాను.  నాలుకలో కఠినత్వం లేకపోతే కలంలోనైనా వుంటుంది కదా.  ఎందుకంటే దాంట్లో ఉక్కుముక్క వుంటుంది.  కనుక నీవు దైవీయప్రేమధారను దీంట్లోని కఠినతవలన నీపైనీవే కఠినత వహించి ప్రసరింపజేయి.  బహుఃశ ఈ కఠినత కొంత సత్ఫలితాన్నిస్తుందేమో.  మొత్తంమీద భగవదిచ్ఛలేకపోతే దాసుడు ఆయనవైపుకు ఆకర్షింపబడడు.  ఆయన దర్శనం సాధ్యమయ్యేదికాదు.  ఇప్పుడొక ప్రశ్న ఉత్పన్నమౌతున్నది.  అసలు భగవంతుడెందుకు తన్నుతాను ఇబ్బందిపెట్టుకొని దాసుని తనవైపుకు ఆకర్షించుకుంటాడు?  ఎందుకంటే ప్రభువుకేదైనా ఇందులో స్వార్థముంటే ఆయన మనమాదిరే ఒక సామాన్య సంసారిగా వ్యవహరించాడనే అనుకోవాలి.  కానీ దీనితోపాటు మరొక వాస్తవముంది.  మనఉద్దేశ్యం ఆయన్ను చేరాలనేదే, అయితే మనం అందుకు అవసరమైన పద్ధతులనే చేపడతాం. దీన్నే అభ్యాసం అంటాం.  ఎప్పుడైతే ఆయన్ను చేరాలనే తీవ్రవాంఛ ఉత్పన్నమౌతుందో అప్పుడే ఒకవిధమైన స్పందన ఆయనలోను కలుగజేయబడుతుంది.  కానీ సోదరా! అప్పుడు ఎవరు దీన్ని ఉత్పన్నం చేస్తారు?  ఎవరికి తీరిక వుంది?  మనము మనభ్రమలో పడి దాంట్లోనే సుఖాలనుభవిస్తున్నాము.  ఇక్కడ మాత్రము బాధ కూడా సుఖమే.  అంటే దానర్థం మనం సాధువులయిపోయామని కాదు.

 

        సామాన్యంగా మాట్లాడాలంటే ప్రతిఒక్కరూ వారివారి ఆలోచనల పిచ్చిలో పడిపోయారు.  నేను బాధనుసుఖమన్నాను, ఎందుకంటే ప్రజలు ఎట్టి వ్యధనైనా భరిస్తారు. కానీ అందుండి తమకైతాము బయటికి అడుగు వేయడానికిమాత్రం ఇష్టపడరు.  కారణం మనం వంటగది విడిచి బయటికి అడుగువేసిన తక్షణం వంటగది పాడైపోతుందనుకుంటాం.  ఒక అడుగు వంటగదిలోను మరొకటి బయట వుంది.  వంటగది ఏమాత్రం పాడుగాకుండా మనం రెండడుగులూ బయటికి వేసి బయట పడాలని కనీసం ఆలోచన కూడా చేయడం లేదు.

 

***


ఆధ్యాత్మిక ప్రగతి

 

        మాయాతెరలను చింపివేయగల మహనీయులనెందరినో ఈ ప్రపంచమున మీరు చూడవచ్చును.  కానీ అహంకారపు పొరలను తీసివేయగల వారు మీకు ఒక్కరును కానరారు.  జీవితాంతము వెతికినను ఇదిమాత్రము అసాధ్యముగనే మిగిలిపోవును.  అదే అదొక్కటే మానవునకు దైవమునకు మధ్య వ్రేలాడుచున్నది.  అభ్యాసులు ఆపొర సమీపమునకు వచ్చుసరికి వారికివారే సంపూర్ణులమనిచెప్పుకొందురు.  అదీ నిజమే.  కానీ వేలసంవత్సరముల అనంతరముగానీ ఆపొరలను చించివేయగల మహనీయుడు ఉద్భవించడు.  ఆ పరమాత్మ అలలు నిరాటంకంగా ప్రవహించాలంటే ఈ పొరను దాటుకొని వెళ్ళవలసి వుంది.  ఇట్టి సమర్థతగలవ్యక్తి లభించడం చాల కష్టతరమైనపని.  ఈగీతికతో నెవరి దగ్గరికైనా వెళితే అది ఒక అజ్ఞానిమాటగా గోచరిస్తుంది.  కారణం నాలోనే లోపాలను అతడు చూస్తాడు.  అట్టిస్థితిని పొందుటకు నీ మార్గదర్శకం కోసం నేను నీకు వ్రాస్తున్నాను.  నేను మీకందరకు ఆ విధంగా కర్తవ్యతాబద్ధుడనై చెబుతున్నాను.  ఒక వేళ నేను ఆస్థాయివరకు అర్హత సాధించని వాడనైనా సరే.  మీరు ఆస్థాయిని అందుకోవాలని ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా నా హృదయమున్నది.  కానీ మీరుకానీ మరెవరైనాకానీ మీ సోమరితనము, మజ్జు నుండి బయటపడకుంటే  అటువంటి దాన్ని ఎలా పొందగలరు?  మహోన్నత స్థితిని పొందాలనే ఆశయంవుంటే దారికాంటకమైన వాటిని వదిలివేయాలి.  వ్యక్తి అనవసరమైన వాటిని వదలకుండా వున్నాడు అంటే అతడు ఇంకా ఏ సిద్ధాంతాన్నీ ఏర్పరచుకోలేదన్నమాట.  రెండు విషయాలు ఒకేచోట మనజాలవు.  ఇప్పుడు నేను నీఅంశమునకొస్తున్నాను.  నేనెన్నాళ్ళు బ్రతుకుతానో? చాన్నాళ్ళా, కొద్దిరోజులా చెప్పలేను.  ఈ మధ్యకాలంలో నీవుకానీ ఇతరులుకానీ సమయం వృధాచేసుకొంటే అంతకంటే గొప్పతప్పిదం మరొకటుండదు.  నామాదిరే మీకు శిక్షణనిచ్చుటకు ఎవరో ఒకరుండవచ్చు, కానీ నేను మీపురోభివృద్ధిని నాకళ్ళారా చూడాలనుకుంటున్నాను.

 

        ఒక వ్యక్తి తన సిద్ధాంతపరమైన ధ్యేయాన్ని ముందుంచుకుంటే (నా వుద్దేశ్యంలో భగవత్సంబంధమైనది) వాస్తవార్థంలో అది సంభవించే అవకాశము లేదు.  కారణం అతడు తనకర్తవ్యపాలనను నిర్లక్ష్యము చేస్తున్నాడు.  నీవు ఏర్పాటు చేసుకొన్న అడ్డంకులున్నాయి.  వాటిని తొలగించుకోవాలంటే నీఇచ్ఛకు కాస్తా శ్రమ కలిగించాలి.  నేను నీబలహీనతలు నీకు తెలియజేయాలంటే జంకుగా వుంటుంది.  అయినా నీ బలహీనతలు నీకు బాగా తెలుసు.  నీవు పవిత్రమైన సాక్షాత్కారవిషయమై ఆలోచనపెడితే యివన్నీ నిన్నువదలి వెళ్ళిపోతాయి.  నేను కూడా ఈ విషయంలో నీకు సహాయంగా వుంటాను.  అయితే నీకై నీవు కూడా ముందుకు చొచ్చుకొనివచ్చి  కాస్తా స్వేచ్ఛవైపుకు సాగాలి.  జనులు సామాన్యంగా వారి పాత అలవాట్లను విడువరు.  కారణం వారు వాటికి బాగా అలవాటుపడి పోయారు.  బయటపడాలంటే కొంత శ్రమపడాలి.  అది కష్టమనుకుంటారు.  సరే నేనొప్పుకుంటాను.  వాటిని తొలగించుకునే ప్రయత్నంవద్దు.  కానీ అదే సమయంలో ప్రయత్నించి నిజమైన జీవితలక్ష్యము పొందే పద్దతి చేపట్టు.  నీవు నిజంగా మొదలెడితే నాకు తెలియజేయి.  నీకడుగడుగునా మేలు కలిగేటట్లు నేను చూసుకుంటాను.  నీమీద కూడా నేను ఆశలు పెంచుకున్నానని నీకు కూడా తెలుసు.  మరి నీవు వృద్ధిలోకి రాకుంటే నాకు బాధకలగదా?

 

        నీవు ఆధ్యాత్మిక ప్రగతి కొఱకు మండుతున్న వాంఛలతో ఉన్నావని వ్రాశావు.  నేను నమ్ముతున్నాను.  మండుచున్న కట్టెకు మూడు లక్షణాలుంటాయి.  ఒక లక్షణం దానినుండి పొగ వస్తుంది.  రెండవ స్థితి అగ్గినిప్పులొస్తాయి.  ఇక మూడవది మంటయొక్క సత్వము.  నిశితంగా చూడగలిగితే కనబడుతుంది.  దాని వర్ణము విద్యుత్తువంటిది.  అన్నాన్ని అది వెనువెంటనే వండేస్తుంది. ఇది దానికున్న చమురుపదార్థం వలన జరుగుతుంది.  మిగిలిన ఆ పొగ, నిప్పు, కట్టెలోని తడి, గట్టితనం వలన వరుసగా వస్తాయి.  వంట కట్టెలు సృష్టించిన విద్యుత్ మెఱుపు వంటి మండుచున్న వాంఛ నీలోవుంటే నీవు ఆధ్యాత్మికరంగంలో ఎగిరి దుమికి ముందుకురికి వుండేవాడివి.  పొగ, ఘనత్వము నుండి విద్యుత్తు వేరుపడి వుంటుంది.  మరి అది ఎలా పనిచేస్తుంది?  విద్యుత్తు వలెవుండు, ఆతర్వాత మండు.  అప్పుడు కోరిన ఫలితం సిద్ధిస్తుంది.  నిన్ను నీవు తడినుండి ఘనత్వం నుండి బయటపడేసుకుంటే అప్పుడు నీవు విద్యుత్ వెలుగురవ్వవౌతావు.  ఆతడి ఏమిటి? ఆ ఘనత్వమేమిటి?  అది నీ వ్యక్తిగత జీవితానుభవమే నీకు సమాధానమిస్తుంది.  ఈ ప్రశ్న నన్నడిగితే తేమ ఘనపదార్థంతో కలిసి నిన్ను చాలా వరకు చీకటిమయం చేస్తుందని చెబుతాను.  సూక్ష్మతకు విరుద్ధంగా పనిచేసే ప్రకృతిచర్యలు వాంఛలుగా వెలుగుతూ బయట పడతాయి. మనిషికి జీవితలక్ష్యమును పొందవలెనను కోరిక తప్పక వుండవలెను. జనులు నన్ను విమర్శించకుండా వుండుట కొఱకే ఇవి నీకు వ్రాస్తున్నాను.  జీవితలక్ష్యము సాధించుపనిలోనికి మరలితే కోరిక సహజంగా వెళ్ళిపోతుంది.  కానీ ఈ విషయం మాత్రము చాలా దూరంగా వుంది.  నీవున్న స్థితిలో దాని యోచన వద్దు.  భగవంతుని ఇచ్ఛ వలననే మనిషికి బహుమతి లభిస్తుంది.  అభ్యాసికి చమురు ఏది? భక్తి. నిరంతర స్మరణ భక్తిని పెంపొందిస్తుంది.  అదేగింజనుండే చమురు గ్రహింపబడుతుంది.  ఇతర సభ్యుల విషయానికొస్తే వారిలో చాలామంది సోమరులు.  వారు దానికి బాగ అలవాటు పడిపోయారు.  వారి మేలుకొఱకు వారు సమయాన్ని వినియోగిస్తారు కానీ అది చాలా తక్కువ.  కానిమ్ము ఫరవాలేదు.  కానీ వారి సోదరులుగా మన కర్తవ్యమేమి?  మనం వారిని ఎప్పుడూ ఒకే తండ్రి బిడ్డలముగా గౌరవించాలి.  మనలో ఎవరైనా కర్తవ్యపరంగా ఏదైనా ఆశిస్తున్నారా?  అట్టివారిని విస్మరించడంలో అర్థమేలేదు.  నేను ఆధ్యాత్మిక సోదరులకు వారు అనుసరించాల్సిన విషయములు పరోక్షంగా చెబుతుంటాను.  మా గురుదేవులవలె గాక నేను ఒక్క ధ్యానం విషయంలో తప్ప మిగతా విషయాలలో బలవంతం చేయను.  కానీ అది కూడా వారు తాము తప్పక చేయవలసిన పనిగా గుర్తించడంలేదని నేను చెప్పకతప్పడం లేదు.  వారిని నేను ఎందుకు నిర్భందించడం లేదు?  ఎందుకంటే ఒక వేళ ఇదికూడదు అని నేను వారిని ఆదేశించినా వారు వినకపోతే అది వారు చేసిన పాపమౌతుంది.  దీని అసలు భావంపై సున్నితంగా యోచిస్తే ఈ విషయమర్థమౌతుంది.  వారు ఏవిధంగాను ఎట్టి పాపము మూటగట్టుకోవడం నేను వాంఛించను.  అభ్యాసులు నేను ఏభావంతో చెప్పినానో అర్థం చేసుకుంటారు.  కానీ ఆచరించడం మాత్రం చేయరు.  ఒక్క విషయం గమనిద్దాం.  మాంసాహారం కఠినంగా మనసంస్థలో నిషేధించే ఒక నిర్ణయాన్ని ప్రకటించి మా గురుదేవుల ఆజ్ఞగా తప్పనిసరిచేస్తే అది ఎవ్వరూ పాటించకుండా పోతే, అది ఏవిధంగానూ ఆధ్యాత్మికంగా మేలుచేయదు.  ఆరోగ్యకరమైన శరీరముగల వారికి మాంసాహారం నిషేధించాల్సిందే, ఏదో బలహీనుల విషయంలో అదీ కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం అనుమతింపవచ్చునంతే.  జనులు సామాన్యంగా రుచికోసం ఇది తింటారు.  అలా తినడం ఆధ్యాత్మిక ప్రగతికి చాలా హానికరం.  వాస్తవానికి తగని రీతిలో తగులుకొని వుండటం, అది అనుకూలంగాకానీ ప్రతికూలంగాకానీ ఎటైనా అది ఆధ్యాత్మికతకు విషము.

 

***


ఆధ్యాత్మిక మార్గమున ప్రగతి

 

1

 

        ఒకవ్యక్తి ఆధ్యాత్మిక జీవనమున ప్రవేశించినాడు.  అతన్ని "ఎ" అని అందాం.  అతడు ఎలా ప్రవేశిస్తాడు?  అతడు ఒకానొక మహనీయుని గొప్పతనాన్ని వినివచ్చి చేరినాడు.  "ఎ" అను వాడు "బి" ని గొప్ప మహనీయుడుగా తనకు దారినేర్పరచువాడుగా కనుగొన్నాడు.  ఇక అతడు "బి" ని ప్రేమించడం మొదలు పెట్టాడు.  కొన్నాళ్ళకు అతని ప్రేమ గొప్పగా అతిగొప్పగా వృద్ధి చెందింది.  అంటే అతడు "బి" ని ప్రకృతికతీతమైన మహానుభావునిగా నిర్ధారించుకున్నాడు.  ప్రేమ పెరుగుతూపోతే అతని తలంపులో ఆ వ్యక్తిని విడవకుండా ఒక గౌరవభావంతో వుంచుకుంటాడు.  ఇట్లా వున్న సమయంలో "ఎ", "బి" ని భగవంతునిగా చూసుకుంటాడు.  అతని మనస్సులో తీవ్రమైన ప్రేమ జనించి ఆయన రూపాన్ని హృదయంలో పదిల పరచుకుంటాడు.  ఒక్క క్షణం కూడా ఆయన తలంపు మదిలో లేకుండా వుండటానికి ఇష్టపడడు. ఆ మహనీయుని కొఱకు హృదయంలో ఒక ఆతురుత గలిగి యుంటాడు.  మరో మాటలో చెప్పాలంటే అతన్నే ఆదర్శంగా హృదయంలో నిక్షిప్తం చేసుకుంటాడు.  అతన్ని బాధించు విషయమేమంటే "బి" పెద్దవాడైకూడా చిన్నబిడ్డవలె తమాషా ఆటలాడతాడు.  తల్లి కొంగుచాటునే దాక్కొని ఆమెతో తనను వెతికి పట్టుకోమంటాడు.  ఒక వేళ తల్లికి ఆ కొంగు (వస్త్రము) లేకపోతే బిడ్డ ఎక్కడదాక్కుంటాడు?  "ఎ" "బి" పై ధ్యానం చేస్తున్నాడు.  తెర దానికైఅదే ఏర్పడి రూపు కనబడనట్లయింది.  ఈ తెర ఎక్కడ నుండి వచ్చింది?  అది అతని ఆలోచనా తెరే.  అది తనను తన మహా ప్రభునకు అంటే-- పరమాత్మకు దూరంగా వుంచింది.

 

        తను ఆ తెరల చాటున వుండి గురువును చూడలేక పోయాడు.  అయినా  విసుగు జెందనవసరం లేదు.  ఎందుకు?  ఎందుకంటే "బి" గా పిలవబడుతున్న అతని గురువు ఆ తెరలోనే వున్నాడు.  అతనిలోనే ఒక రూపంలో గాకుంటే మరోరూపంలో వున్నాడు.  ఒకవేళ తనగురువును ఆ రూపంలోనే చూడకున్నా కలవరపడ నవసరం లేదు.  విశాల దృక్పథంతో గమనిస్తే ఆయన అంతటా వున్నాడు.  ఆయన్ని అంతటా అతడు చూడలేక పోతున్నాడంటే ఏకాగ్రతకోసమని ఆయన్ను ఆరూపానికే పరిమితుణ్ణి చేస్తున్నాడన్న మాట.  అతడు తన గురువు తనహృదయములోనే ఆసీనుడై యున్నాడని భావిస్తే ఇక ఆయన ప్రత్యక్షంగా వున్నాడన్న సంగతి తెలిసిపోయింది.  అంటే అతని గురువు హృదయాంతరాళంలో స్థిరమై యున్నాడని అతని కర్థమైంది.  చాలా చిత్రంగా వుంది.  గురువును తానున్న చోటే వుంచుకొని వెతుకుతున్నాడన్న మాట.  ఒక వేళ గురువు గారిని తన హృదయఫలకంపై కూర్చోనుండమని ప్రార్థిస్తే, దాన్ని మన్నించి తన ప్రార్థనకు జవాబుగా ఆయన తనమాటల్లోనే యిలా అన్నారు.  "నేను మార్పు చెందుతానే కానీ మరణించను" అని.  ఈ భావన సంపూర్ణంగా సరియైనదని చెప్పవచ్చును.  భావన అలానే వుండిపోవాలి, రూపు మారవచ్చు.  అది లెక్కలోనికి రాదు.

 

        ఇప్పుడు శిష్యుడు సంతృప్తి జెందినాడు.  గురువును గురించి యోచిస్తాడు.  ఆయన ఉన్నాడన్న భావన హృదయంలో స్థిరంగా వుంది.  ఇది చాలని నేననుకుంటాను.  ఈ విషయంలో ఒక తత్త్వమిమిడి యున్నది.  ఒక పక్షిని మొదటిసారిగా పట్టి పంజరంలో వుంచితే అది పంజరానికి అలవాటు పడనిది గనుక ఎగరడానికి ప్రయత్నిస్తూ రెక్కలు కొట్టుకుంటుంది.  నీవు అనంతుని నీ హృదయపంజరంలో వుంచావు.  ఆ అనంతుడు, నీకర్థం కావడం కోసం, పక్షి అనుకుంటే, అది నీతోకలసి ఎగరడానికి ప్రారంభిస్తుంది.  ఆ సమయంలో నీవు దానిరూపము చూడాలనుకుంటావు.  అది కేవలం ఎగరడం ప్రారంభించక మునుపు మాత్రమే వీలౌతుంది.  మీరిద్దరు కలిసే పంజరంతో ఎగురుతుంటారు. నీవు, ఆయన ఒకటే అయిపోయారు.  విషయం యిలా వుంటుంది.  నా ఉద్దేశ్యంలో నీపయనం మొదలైంది అంటే నీవద్దనున్న అన్నిటితోపాటే పైకెగిరి పోతున్నావన్న మాట.

 

2

 

        "ఎ" సమస్తము తన గురువుకు సమర్పించి పని ప్రారంభించాడు అంటే సుదూర భవిష్యత్తంతా ఎంత క్షేమకరమో ఆలోచించు.  అతడు సర్వం తన గురువుగారికొఱకే చేస్తాడు.  అంతెందుకు అతడు చేసే పనంతా తన గురువే స్వయంగా చేస్తున్నాడని భావిస్తాడు.  అతనలా భావించక తప్పదు ఎందుకంటే ఇద్దరూ కలిసే ఎగిరిపోతున్నారు గదా! వాస్తవానికి "ఎ" తన ఊహకు ప్రాణం పోశాడు.  గ్రహించిన వస్తువుకు చైతన్యం కలిగించాడు.  ఇప్పుడు ఇద్దరికి జీవమున్నది.  అదే ఉదయం నుండే అతడు తన పని ప్రారంభిస్తాడు.  అతడు తన ప్రతిదిన స్నానముతోసహా తన గురువే ఇదంతా చేస్తున్నాడని నిర్వహిస్తాడు.  ఉదయపు అల్పాహారం తనగురువే సేవిస్తున్నాడనే తింటాడు.  కార్యాలయానికి వెళ్ళి అక్కడి వ్యవహారమంతా తనగురువే నడుపుతున్నాడని నడిపిస్తాడు.  మరో మాటలో చెప్పాలంటే అంతా తనగురువు తనకోసమే చేసుకుంటున్నాడని భావిస్తాడు.  ఇక ఇంటికి తిరిగి వస్తున్నాడు.  దారిలో ఒక ఆకర్షణీయమైన నృత్యం కనబడింది.  అతని కళ్ళు సామాన్యంగానే జరుగుతున్న దృశ్యంపై పడ్డాయి.  తనని తాను అదుపు చేసుకోలేకపోతే ఏమాలోచిస్తాడు?  నేనుకాదు ఆ నృత్యము చూస్తున్నది.  నాకున్న ఆ కనులే నా గురువుగారి కన్నులు అనుకొని అవే ఈ దృశ్యాన్ని తిలకిస్తున్నాయని భావిస్తే అది ఎంత మేలు చేస్తుందనుకున్నావు?  ఒక్కసారిగా ఆ నృత్యం మీదుండే కుతూహలం పోతుంది.  ఎందుకంటే నీగురువుశక్తి ప్రవహించడం వెంటనే ప్రారంభిస్తుంది.  నీవు తక్షణం జాగ్రత్తపడి ఆ కుతూహలం నుండి విడుదల పొందుతావు.  కార్యాలయపు వ్యవహారములు ముగించి ఇప్పుడిక ఇంటికి వచ్చావు.  చాలా గంటల తర్వాత నీవు ఇంటికి రావడంతో నీపిల్లలు నిన్ను చూడగానే చాలా సంతోష పడతారు.  నీవు వారిసంతోషం చూసి అలాగే స్పందించి నీవూ సంతోష పడిపోతావు.  దాందేముంది, అది సర్వసామాన్యమే.  అప్పుడు నీవేమి చేస్తావు?  నీఆలోచన వారివైపు మళ్ళింది.  నీవు పవిత్రఆలోచన నుండి కాస్తా ప్రక్కకు తాత్కాలికంగా జరిగావు.  అప్పుడు నీలోని నీగురువే ఈ విధంగా ఆనందిస్తున్నాడని భావిస్తే సరి.  ఈ పద్ధతి అన్నిటిని సరిజేసి పూర్తిగావిస్తుంది.  విషయ వాసనల ప్రభావం ఇప్పుడేమాత్రం నీపైలేదు.  నీవు నీఆలోచనల నుండి దూరమై పోయావు.  ఇప్పుడు ఇంకో వ్యవహారం వచ్చిపడింది.  మిత్రులొచ్చారు.  పిచ్ఛాపాటి మొదలెట్టారు.  నీవు అందులోకి జారుకున్నావు.  ఇది రోజూ మామూలే.  అప్పుడు నీవుకాదు నీగురువే వారితో సంభాషిస్తున్నాడనుకో. నేను చెబుతున్నాను.  ఇదే అత్యుత్తమ ఆచరణము.  ఈ విధంగానే నిన్నునీవు రోజూవారి కార్యక్రమాలలో నీ ఎదుటనున్న పనులన్నిటిలో సర్దుబాటు చేసుకోవచ్చును.  నీవు నడుస్తున్నప్పుడు ఏముంది, అప్పుడుకూడా నీ గురువునే తలచుకో.  కానీ చూడూ రెండుపనులు (పని, గురువు చింతన) ఒకేసారి చేసుకుంటూ పోతుంటే ఎంతబాగుంటుందో.  నీవు గురువును గూర్చి చింతనచేస్తున్నావు.  అదే సమయంలో నాగురువుగారే నడుస్తున్నారన్న భావనతోనూ వున్నావు.  ఇది చేస్తున్నావంటే దానర్థం నీవు ద్విగుణికృతశక్తితో వెళుతున్నావన్నమాట.  అదే విధంగా నీవు ధ్యానం చేసేటప్పుడు నీగురువే స్వతహాగా తనరూపం మీదనే ధ్యానం చేసుకుంటున్నాడని తలంచుము.

 

        ఈ పద్ధతిని నీవు అలవాటుగా మార్చుకుంటే ఏవిధమైన ప్రభావం దీర్ఘకాలంగా నీమీద వుంటుందో గమనించు.  నీవు ఇక సంస్కారములను చేర్చుకోవు.  అంటే రాబోవు కాలంలో నీవు భోగించటానికి (అనుభవించటానికి) కారణమయ్యే సంస్కారముల ఉత్పత్తి నిలిచి పోతుంది.  అదే మోక్షానికి దారి.  కానీ మన గురి దానికంటే పైనున్నది.  తర్వాత వచ్చే తుదిలేని మరుజన్మలవలయం నుండి విడుదల కావలయును.  ఈ పద్ధతి తుదకు మిమ్ములను ఉనికిరహితత్వం వైపుకు నడిపిస్తుంది.  ఇలాచెయ్యండి ఫలితాన్ని అనుభవించండి.  ఫలితం అతిత్వరగా సిద్ధిస్తుంది.

 

***


ప్రాణాహుతి ద్వారా ఆధ్యాత్మిక శిక్షణ

 

        మా గురుదేవుల కృపవలన, సామాన్య ప్రజానీకమునకు తెలియనటువంటి ఒక గొప్ప రహస్యము లేక విచిత్రమును నేను వివరింప ప్రయత్నింతును.  శ్రీకృష్ణపరమాత్మ, స్వామి వివేకానంద లేక మా గురుదేవుల వంటి గొప్ప మహనీయులు మానవుని జీవనవిధానమునే మార్చివేయుట ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయము.  అది ఎలా చేయగలరు?

 

        కొంత మంది నాస్తికులు, ఇది కేవలం వారు మారాలని వారికైవారే నిశ్చయించుకొన్నందువలన సంభవమౌతున్నదనీ, కానీ ఏదో పేరు కోసం ప్రభువని, గురువని ఒక మిష చూపుతారంతేనంటారు వారు.  ఒక వేళ శ్రీకృష్ణపరమాత్మకు అట్టి శక్తే వుండివుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించడానికి దుర్యోధనుని మనస్సు ఎందుకు మార్చలేదు? ఎవడో వ్యర్థుని గురువుగా లేక ఒక ప్రాణంలేని వస్తువును గురువుగా స్వీకరించి గొప్ప సాధుమహనీయులుగా మారిన ఎన్నో కథలను వారు ఉదహరిస్తారు.  కానీ ఇది సత్యమును గ్రహించు యత్నమునకట్టే అడ్డుపడదు.  ఎందుకంటే భగవంతుని మార్గములు చిత్రాతిచిత్రములు.  కొందరు వారివారి ఆలోచనలతో భ్రాంతి చెందెదరు.  మరికొందరు భగవత్కృపచే ప్రకాశింపబడుదురు.

 

        ఒక వేళ, శ్రీకృష్ణపరమాత్మకు ఎవరినుండి ప్రకాశం లభించింది అని నన్నుప్రశ్నిస్తే, ఆయన స్వయంప్రకాశవంతుడు అని నేను జవాబు చెబుతాను.  అయితే ప్రశ్నించువాడు పొరబడి తనుకూడా స్వయంప్రకాశవంతుడినే, ప్రతి ఒక్కరూ అంతేనంటే మాత్రం ఇక ఆప్రశ్నలక్కడే సమాప్తి.  హృదయ పరితాపమునకు తర్కవాదములు ప్రత్యామ్నాయములు కాజాలవు.  ఒకవేళ తర్కము ఒక ఇరుకు, చీకటి సందులో ఇరుక్కొని, జవాబు చెప్పలేక క్షయమైనా హృదయము సంతృప్తిచెందదు. హృదయ సంతృప్తికి తర్కమే సమాధానము కాదు.

 

        ప్రాణాహుతి ఇచ్ఛాశక్తి వలన ప్రయోగింపబడుతుంది.  అది అన్నివేళల ప్రతిభావంతంగానే వుంటుంది.  ఒక వేళ ఆధ్యాత్మిక శిక్షకుడు తన ఇచ్ఛాశక్తిని ప్రయోగించి శిక్షణ పొందుతున్నవాని మనస్సును తీర్చిదిద్దితే అది ప్రతిభావంతమైన, మహనీయమైన ఫలితములను గొనితెస్తుంది.  గురువృత్తిని స్వీకరించిన చాలామంది స్వామీజీలు కాషాయంకట్టిన మరుక్షణం నుంచి, తమ శిష్యులు శ్రద్ధగా వింటారు కానీ ఆచరణలోమాత్రం కుక్కతోక వంకర అన్నట్లు ఏమాత్రం మారరు అని శిష్యులపై అపవాదు వేస్తుంటారు.  కారణం మాత్రం సుస్పష్టం.  స్వామీజీయైనా తనఇచ్ఛాశక్తిని ప్రయోగించకుండా వుండివుండాలి లేక ఆయన దగ్గర అట్టిశక్తి లేకుండానైనా వుండాలి.  బోధకులు చాలా శ్రమతో కూడిన మెదడును బరువెక్కించే ప్రక్రియలన్నీ శిష్యులపై రుద్ది వారి ఖర్మకు వారిని వదిలేస్తారు.  ఇటు బోధకునికీ ఆ ప్రక్రియల పర్యవసానం తెలియదు.  అటు శిష్యులూ వారి వివేకాన్ని ఉపయోగించే ఆసక్తి చూపరు.  ఇక పొందెడి లాభము అంతర్గతస్థౌల్యత, బుద్ధి మాంద్యత మరియు శిష్యుల స్వేచ్ఛాభంగము.  ఇక గురువుల విషయమైతే డబ్బు గుంజడము, నీతి బాహ్యమైన పనులకు పాల్పడడము.  వారు కేవలం బోధించడమే తమ హక్కుగా భావిస్తూ శిష్యులయెడ వారి కర్తవ్యము బాధ్యత ఏమీ లేనట్లు ప్రవర్తిస్తారు.

 

        సమర్థుడైన శిక్షకుడు తన యోగశక్తి (ప్రాణాహుతి) ప్రయోగించి సాధకుని మానసిక అధఃప్రవృత్తులను బలహీన పరుస్తాడు మరియు ఈశ్వరీయ ప్రకాశమును బీజరూపమున అభ్యాసి హృదయాంతరాళమున స్థాపితం చేస్తాడు.  ఈ ప్రక్రియలో, అనంత దివ్యశక్తి వెనుకనుండి ప్రోద్బలమిస్తుండగా శిక్షకుడు తన ఇచ్ఛాశక్తిని ప్రయోగిస్తాడు.  అతనికి ఇదంతా ఎఱుకలో వుండే తన ఇచ్ఛాశక్తియను దర్పణము ద్వారా సాధకుని హృదయమునకు మరల్చుతాడు.  తొలినాళ్ళలో సాధకునకు ఏమీ అనిపించక పోవచ్చు.  కారణం అప్పుడతడు కేవలం ఇంద్రియముల ద్వారా కలిగే అనుభూతులకు మాత్రమే అలవాటు పడివుంటాడు.  భగవదీయశక్తి ఇంద్రియాతీతము.  కొంతకాలం తర్వాత యోగశక్తి ధారాప్రభావాన్ని గ్రహిస్తాడు.  అది కూడా ముఖ్యావయముల పనితీరునందు కలిగిన సూక్ష్మపరిణామముల రూపమునను మరియు మానసిక ప్రవృత్తుల మార్పు రూపమునను గమనిస్తాడు.

 

        ఇదే విధమైన సిద్ధాంతము, ఒక ముతక, మోటు పద్దతిలో తంత్ర విద్య (మెస్మరిజం) మరియు వశీకరణ విద్య (హిప్నోటిజం) లలోను కనిపిస్తాయి.  కానీ వాటిఫలితాలు ప్రాణహుతికి విరుద్ధములై వుంటాయి.  ఈ తగ్గుస్థాయి కళలో వశీకరణ చేయునతడు తన ఇచ్ఛాశక్తికి వెనుక ఒక ప్రాపంచిక స్థౌల్యశక్తిని జోడించుకొని ప్రయోగిస్తాడు.  అందువలన వశీకరణకు లోనైన వ్యక్తి మనస్సు బలహీనపడుతుంది.  ఆ కారణంగా అతడు ఆ వశీకరణ వశము నుండి బయట పడినంతనే తనకై తాను మజ్జుగా వున్నట్లు హృదయము బరువెక్కినట్లు అనుభూతి చెందుతాడు.  వశీకరణ విద్య ప్రయోగించేవాని శక్తినిబట్టి, వశీకరణకు లోనయ్యేవాని లొంగుబాటునుబట్టి ఒక జబ్బు నయం చేయబడవచ్చు లేదా ఒక ప్రత్యేక మానసిక ప్రవృత్తిని కొంతవరకు అదుపుజేయవచ్చును.  కానీ వీటి ప్రభావము అట్టే కాలముండదు.  ఇట్టి వశీకరణ విద్యలు తీవ్ర మానసిక శారీరక శ్రమతో గూడిన ప్రక్రియలతో స్థౌల్యవస్తువులు, మనస్సులో చిత్రీకరించుకొన్న రూపములపై ఏకాగ్రత వహించడంవలన సాధించుకుంటారు.  ఈ సాధనలు తరచూ మానసిక వైకల్యములు, పిచ్చి ఒక్కోసారి శారీరక అంగ వైకల్యములను గూడా కలిగిస్తాయి.  ఈ సాధనలలో విపరీత దీర్ఘ పరిశ్రమ ద్వారా విజయము సాధించినప్పటికి ఫలితములు మహాఅయితే కొంత స్థౌల్యశక్తిని గడించి అది అణగారిపోవునంత వరకు కొన్నికోరికలను సంతృప్తి పరచవచ్చును.

 

ఇప్పటికి పాఠకుడు ప్రాణాహుతి ఒక స్వచ్ఛమైన మనస్సు మాధ్యమమున పనిచేయు దైవీయ శక్తియను పూర్ణనిర్ణయమునకు వచ్చియుండవచ్చును.  మనస్సు ఎలా శుద్ధీకరింపబడుతుంది?  అది ఎలా దైవీయశక్తితో అనుసంధింప బడుతుంది?  వీటికి సులభమైన జవాబు, భగవంతునితో శాశ్వతముగా ఆలోచన అనుసంధింప బడినప్పుడు అని చెప్పవచ్చును.  అయితే ఆ ఆలోచన ఎలా శాశ్వతంగా భగవంతునితో అనుసంధించుకోవాలి?  అంటే, అందుకు చాలా జవాబులు ఇదివరకే ఇవ్వబడ్డాయి.  కానీ నాహృదయాంతరాళము నుండి పెల్లుబికి వచ్చుచున్న రహస్యమిది.  విను, అది మా గురువర్యులే, ఇదంతా చేస్తాడు, చేసియున్నాడు, చేస్తూ వున్నాడు కూడా.  నేను నాగురుదేవుని దర్శించగానే నా హృదయం ఇట్టి వెలుగుతో నింపబడింది.  నా ప్రభువుగా, గురువుగా మరియు నా ఆత్మగా ఆయన్ను నేను నిరంతరం స్మరించడం మొదలు పెట్టాను.  నిజమైన దైవాన్వేషకులందరూ ఆయనను కనుగొందురుగాక! ----- తథాస్తు.

 

***

 

 

 

 

 

 

 

ప్రతిభావంతమైన మార్గము

 

        "మీమాంస" యందు తెలిపిన ఆచారములను శంకరాచార్యులవారు వారి వేదాంత తత్త్వశాస్త్రమున ఖండించిరి.  కానీ ఆ దృక్పథములకు నాకూ ఏ సంబంధము లేదు.  ఆచారములు సాత్విక వృత్తులను ప్రోత్సహించుటలో కొంతవరకు సహాయపడుననుట నిర్వివాదాంశము.  అవి ఆధ్యాత్మికతను సమాయత్తపరచు ఆధారములను సమకూర్చును.  అట్టి ఎడ వాటిని అనుసరించుటకు నాకు అభ్యంతరము లేదు.  అయితే అవి భగవత్ సాక్షాత్కారమునకు సహకారముగావుండు విధమున చేపట్ట బడవలసి యుండును.

 

        దేవతలను పూజింట హిందువులలో సర్వసాధారణమై ఎక్కువగా ప్రబలియున్నది.  అది ప్రాపంచిక లాభములను పొందుటకు, బిడ్డల క్షేమమునకు ఆచరించబడుతున్నది.  స్త్రీలు బిడ్డలకు జన్మనిచ్చుట చేతను, పెంచి పెద్దచేయుట చేతను వారి ఆప్యాయతా బంధము బలమైనది.  తత్కారణమున స్త్రీలు ఈ ఆచారమును గట్టిగా పాటించుచున్నారు.  కానిమ్ము వారి పాత్రను వారు పోషింపనియ్యండి.  మరి మన పాత్రను మనం పోషిద్దాం.

 

        నేను జపమునకు అనుకూలుడను కాదు.  అది పూర్తిగా బాహ్యమైనది.  కొన్ని సందర్భములలో నేనూ జపమును ప్రోత్సహింతును కానీ అవి వేరు విధములైనవి. ఇవి అభ్యాసి స్వతహాగా తన అభివృద్ధిని కాంక్షించి చేయుటకు నిజమైన సాధనములు.  కానీ మన సంస్థలో ఈ శ్రమ గురువుగారు వహిస్తున్నారు.  ఆయన ప్రాణాహుతి ప్రసారము ద్వారా ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి పోషిస్తున్నారు. ఇప్పుడు భక్తి ప్రేమలతో సాధ్యమైనంత మేర గురువు నుండి అభ్యాసి రాబట్టుకోవడంపై ఆధారపడి వున్నది.  భక్తి, శరణాగతి ఎంత మిక్కుటముగావుంటే అంత అధికంగా శక్తి అతనిలోనికి ధాటిగా ప్రవహిస్తుంది.

 

        ఇప్పుడు భగవంతుని నామము మళ్ళీమళ్ళీ వల్లిస్తూ వుండటం వలన మోక్షము కలియుగంలో తప్పక సిద్ధిస్తుందని కొందరు సాధువులు చెబుతున్నారు.  భగవంతుని నామోచ్ఛరణము వలన ఉత్పన్నమైన తరంగములలో లీనమైననేతప్ప ఆశించిన ఫలితము పొందలేరన్నది నా నమ్మకము.  కొన్ని మతగ్రంధములు భగవన్నామము వరుసగా 24 గంటలు జపిస్తే దర్శనమౌతుందని చెబుతున్నాయి.  మా తల్లిగారు చాలాకాలం క్రిందట చాలా శ్రద్ధగా అదేవిధంగా చేసినది కానీ ఏమీ జరుగలేదు.  భగవంతుడు దర్శనమిస్తాడు అని చెప్పబడుతున్న జనుల నమ్మికకు సంబంధించిన సిద్ధాంతము కూడా సాక్షాత్కారముపై నాకుగల అనుభవము దృష్ట్యా నమ్మశక్యంగా లేదు.  కొన్ని సందర్భాలలో నేను కూడా ఆలోచనను భగవంతుని గుణమైన సర్వ వ్యాపకత్వంపై వుంచి మానసిక రామజపం చేయమని సలహా యిస్తుంటాను.  ఈ ప్రక్రియ నిరంతరస్మరణ స్థితి పొందటానికి కూడా సహాయ పడుతుంది.  ఖచ్చితంగా చెప్పాలంటే మనం దేన్నీ వల్లించడం లేదు, కానీ భగవంతుని చిత్రాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఆయన గుణగణములపై ఆలోచననుంచుతాము.  మనము పదార్థరహిత పూర్ణత్వమును చేరవలసి వుంది.  అందుకొరకు గురువుగారి రూపాన్ని మనముందుంచుకోవాలి.  అది కూడా ఆ గురువు మహోన్నత శక్తిసామర్థ్యములు గలవాడుగా ఒప్పుకొనబడి సంపూర్ణముగా భగవంతునిలో, మా పూజ్య ఆధ్యాత్మిక జనకునివలె లీనమై యుండవలెను.  పతంజలి కూడా దీన్నే 32వ సూత్రములో సమర్థించి యున్నాడు.  ఈ పద్దతిలో మనం దాటుకొను నాల్గుస్థాయిలను నేను "రాజయోగ ప్రభావం" లో విశదీకరించి యున్నాను.  ఆఖరుస్థాయి అహంకారాన్ని దాదాపు అంతంచేస్తుంది.  అది తిరుగులేని ప్రక్రియ.  నేను మొత్తము నా ఆధ్యాత్మికయానంలో దీనినే అనుసరించాను.  ఒకవేళ అట్టి గురువు లభించినట్లయితే ఆయన రూపంపై ధ్యానించ వచ్చును.  లేని ఎడల నేరుగా భగవధ్యాన విధానమునే అనుసరించడం ఉత్తమం.

 

        ఆఖరుగా నేనుచెప్పు మరొక్కమాట ఏమంటే.  మీకు సాక్షాత్కారము కొరకు తపన గనుక వుంటే ప్రకృతి వలె సాధ్యమైనంత నిరాడంబరంగా వుంటూ అట్టి సరళమైన పద్దతిలోనే చంటిబిడ్డను లాలించుటకు చంటిబిడ్డవలెనే మెలిగినట్లు ప్రవర్తించండి.

 

        మనము సాంసారిక జీవనం గడుపుతూ దేనిమీదా ప్రత్యేకమైన అభిమానం లేకుండా ప్రతి పని కర్తవ్యతాపరంగా చేసుకుంటూ నిర్వ్యామోహభావంతో గడచిపోవాలి.  సాంసారిక జీవితాన్ని సక్రమంగా మలచుకుంటే అదేం దూషించదగినదేమి కానేకాదు.  ఒక వేళ నీవు ఒక పని చేయడానికి బలవంతపెట్టబడ్డావనుకుందాం.  అది నీవు నీ స్వార్థం కోసం కాక ఆపని పనికోసమే చేశావంటే దాన్ని నేను నిర్వ్యామోహచర్యగా, నీ మనస్సుపై ఎట్టిముద్రలు వేయని పనిగా పేర్కొంటాను.  మనము మన పనులనన్నిటిని, అవి భార్యా బిడ్డలకు సంబంధించినవైనా భగవంతుని ఆజ్ఞానుసారం చేస్తున్నట్లు భావించాలి.   ఈ విధానంలో మనచర్యలన్నీ ఆఖరుకు పూజగా మారిపోతాయి.  నీ యోచనను భగవంతునితో అనుసంధానము గావించుకొనుటకు ఇది చాలా సులువైనపద్దతి.

 

***

 

 

 

 

అన్వేషకునకు సూచనలు

 

        కేవలము ప్రశ్నలు, జవాబులు మాత్రమే మానవుని అంతర్గతరహస్యములను బయల్పరచజాలవు.  ఇది నిజంగా తెలియడానికి సన్నిహిత సంబంధము (సత్సంగము) మరియు ఆచరణము (అభ్యాసము) అవసరము.  నేను నిర్మోగమాటంగా ఏ పుస్తకాలు చదువలేదని ఒప్పుకుంటున్నాను.  అందుకు అది అంత ముఖ్యమని కూడా తలంచలేదు.  నేను సత్యతత్త్వంపైనే గురిపెట్టుకున్నాను.  అదే వుండవలసిన ఒకేఒక వస్తువని తలంచి ఇక పుస్తకపఠనాన్ని విద్యావేత్తలకు పండితుల కొఱకు వదిలివేశాను.  నేను ఏమిచెప్పినా ఏమివ్రాసినా సాక్షాత్కార మార్గమున నా అనుభవముల ఆధారంగానే తెలియజేసితిని.  శంకరాచార్యులు, రామానుజాచార్యులు లేక ఇతర పెద్దలు వారికి వారుగా ఏమి చెప్పిరో, వాటికీ నా భావములకు ఎట్టి సంబంధము లేదు.  ప్రస్తుతము నేనప్పుడప్పుడు చదువుతున్న మాట వాస్తవము.  కానీ అది మానసికోల్లాసము కొరకు చదువుతాను.  సాధ్యమైనంత జ్ఞాపకంలో పెట్టుకొని భావవ్యక్తీకరణ సౌలభ్యం కొఱకు  ఉపయోగించు కుంటాను.  అట్టిదొకటి శంకరాచార్యుల వివేక చూడామణి చదివి జ్ఞాపకముంచుకున్నాను.  దాని అర్థమేమంటే

 

        "గ్రంధములు భగవత్ సాక్షాత్కారమున మనకు సహాయము చేయలేవు.  మరి సాక్షాత్కారమయిన పిదప పుస్తకములు నిరుపయోగములు".

       

        మనము ఒక పద్దతినాచరించుటకు ప్రారంభించి మన అంతిమ గమ్యమునకై ఆరాట పడుతూవుంటే మన అన్వేషణకు సహాయపడే వారికి కట్టుబడి వుంటాం.  తదనంతరం మనం సర్వం భగవదాధీనం అన్నఊహకు వచ్చేస్తాం.  తదనుగుణంగా దానితో సంబంధమేర్పరచుకొని వుంటాం.  అది క్రమేణా సన్నిహితత్వాన్ని, సంబంధాన్ని పెంపొందిస్తుంది.  అది నిజార్థంలో లయావస్థ లేక లీనమై పోవడానికి ప్రారంభదశ.  అందుకోసంమనంప్రేమ,భక్తి మరి ఇంకెన్నో మనకుపయోగపడునటువంటి వాటిని పాటిస్తాం.  మన స్వేచ్ఛాయుతమైన ఇచ్ఛ వ్యాప్తమై మన పరిమిత పరిధి వరకు వెళుతుంది.  భగవదేచ్ఛ వ్యాప్తమై అపరిమిత పరిధి మొత్తం ప్రాకుతుంది.  మన పరిమితులు బంధాలు విచ్ఛిన్నం గావించుకుంటేనే తప్ప మన ఇచ్ఛ, భవదిచ్ఛ సమానమని బహిరంగ ప్రకటన చేయలేం.  ఇదే మన నిజమైన అన్వేషణ.  ఇది మనం సత్యతత్త్వంతో లీనమవ్వడానికి చేస్తాం.  ఈ విషయము మరొక పుస్తకం "అనంతంవైపు" లో చర్చించబడింది.  అందులో వ్యక్తి తన స్వంత ఉనికిని పోగొట్టుకొన్న తర్వాత ఎలా అచ్చం బ్రహ్మము మాదిరే మారిపోతాడో వివరించాను.  భగవదేచ్ఛకు, మానవేచ్ఛకు గల సంబంధం గమనిస్తే ఎలా వుంటుందంటే, ఎప్పుడైతే మనం మొదటి (భగవదేచ్ఛ) దాన్ని గమనిస్తామో అప్పుడు ఉత్తమ వస్తువు అధమ వస్తువును ఆకర్షించడం మొదలు పెడుతుంది.  ఆయనతో మనం ఏకం కాగానే అంటే మన పరిమితులను విచ్చిన్నం చేసి పూర్ణత్వంతో కలిస్తే మనం అద్వైత స్థితిలో జీవించడం మొదలెడతాం.  కానీ మనం తొలుత ద్వైతంతో ప్రారంభిస్తాం.  ముందుకు పయనించి తుదకు సహజంగానే అద్వైతం సిద్ధింపజేసుకుంటాం.

        అందరూ భగవంతుని వైపు అప్రయత్నంగానె పురోగమిస్తారా లేక భవదేచ్ఛ ప్రకారమా అని ప్రశ్నించావు.  ప్రతి నదీ స్వతహాగానే తన స్వంతఉనికిని సంపూర్ణంగా పోగొట్టుకొని సముద్రంలో కలిసిపోతుంది.  ఇప్పుడిక నీప్రశ్న అంతరించి వుంటుంది.  సముద్రము వచ్చి నదిలో కలవదు.  అదేవిధంగా  మనం మూలంవైపు కదులుతాం.  ఒక సమయం వస్తుంది  అప్పుడందరూ అందులో కలిసిపోతారు.  అదే మహాప్రళయ కాలము.  మన సాధనంతా దారిదూరం తగ్గించుకోవడానికే.  అందువలన అప్పటివరకు కలిగే ఎన్నోజన్మల క్లేశముల నుండి తప్పించుకోవడానికే.

        కేంద్రము చుట్టూతిరిగే కదలిక వలన సృష్టి ప్రారంభ సమయమున ప్రకృతి ఉనికిలోనికి వచ్చింది.  కదలిక శక్తిని ఉత్పన్నం చేసింది.  అదే తర్వాత సృష్టికి కారణమయ్యింది.  ప్రకృతి తన ఉనికిని మహాప్రళయంలో కోల్పోతుంది.  ఇక ఏ మిశ్రమ వస్తువైనా ఇంకా మిగిలింది అంటే మహాప్రళయం వాస్తవానికి సంభవించలేదనే అనాలి.  ఆతర్వాత ఒక్కటే మిగిలి వుంటుంది.  దాన్ని మనం సున్నా లేక ఆధారంఅని అర్థం చేసుకోవడానికి అనుకోవచ్చు.  ప్రకృతి గాని విశ్వంగానీ ఆధారం లేనిది నిలబడ జాలదు.  ఏదైనా ఉనికిలో వుండాలంటే దాని వెనుక ఒక ఆధారముండాలి.  ఆ వెనుకనున్న ఆధారమే భగవంతుడు లేక బ్రహ్మము.  నిలబడడానికి ఆధారము లేకపోతే ఉనికికి అర్థమే లేదు.  ప్రారబ్ధకర్మ గురించి చెప్పాలంటే నేను ఆలోచించి దృష్టిపథంలో గమనించినట్లు శరీరము లేక మనస్సుయొక్క ప్రతిచర్య ఏదో ఒక ఫలితాన్ని కలుగ జేస్తుంది.  ఆ ఫలితాన్ని భోగించటానికి (అనుభవించటానికి) విడుదలయ్యే ముందు ఒక గిడ్డంగిలో నిక్షిప్తం చేయబడి వుంటుంది.  అదే ప్రారబ్ధకర్మ.  మన గత ముద్రలన్నీ (సంస్కారములన్నీ) నిర్మూలింపబడినప్పుడే మోక్షమునందుకోగలము. ఏమైనా అది ఒక కఠినమైన కార్యమే.  రాజయోగంలో అభ్యాసము మరియు మంచి మార్గదర్శకత్వమున అది భోగింపజేయుటకు దాదాపు కాల్చివేయబడిన స్థితిలో బయల్పడును.  భోగప్రక్రియ కూడా ఆధ్యాత్మిక అవసరము తీర్చగల సమర్థుడైన గురువు సహాయపడితే వాటిని కలలలో కూడా భోగింపచేయగలడు.  అలా నిద్రలో కూడా చాలా సంస్కారాలు అనుభవింపబడతాయి.  కేవలం మనం తెరల్ని తొలగించుకోవాలి.  అందుకు భక్తి ప్రక్రియను చేపట్టాలి.  నీవు నిజమైన జీవనసుధను గ్రోలాలనుకుంటే నీ అదృష్టపు ఒడుదుడుకులను లెక్క చేయకుండా నిస్సందేహ వైఖరితో రంగములోనికి దిగు.  అదే మన జీవితమునకు అత్యావశ్యకమైనది కానీ దానధర్మముల వంటివి కావు.  నిజమైన త్యాగము ఉద్యోగము, కార్యాలయము వలదని అడవికి పోవడం కాదు.  నిన్ను నీవు పోగోట్టుకోవడమే.  నిజమైన అన్వేషకునిలో ఇవి అవసరము.

 

        నీవు నిర్వికల్ప సమాధిని గూర్చి అడిగావు.  అది ఒక యోగము ద్వారా పొందవలసిన మంచిస్థితే.  కానీ అది నీసమస్యకు పరిష్కారము కాదు.  అది నిన్ను మోక్షస్థితి వరకు తీసుకెళుతుంది, కానీ సాయుజ్యస్థితి వేరుగా వుంది.  "సత్యోదయంలో" తెలిపినట్లు నీవు సూక్ష్మాతిసూక్ష్మంగా మారి భగవంతుని సమీపిస్తే అప్పుడు నీవు సాయుజ్యప్రాప్తికి అర్హుడవుగా తలంపవచ్చును.  మన అభ్యాసములో అందుకోసమే మనం తపన పడతాము.

 

        ఒక వేళ నీవు నిర్వికల్ప సమాధిని పొందినా కల్పన ఏదో ఒక రూపంలో వుండనే వుంటుంది.  నీవు పొందిన అచేతనం అలానే నిరంతరంగా కొనసాగడం కుదరదు.  ఎందుకంటే నీవు నీ కర్తవ్యాలను కూడా నిర్వహించాల్సి వుంది.  ఒక వేళ నీవు వాటిని ఖాతరు చేయలేదనుకున్నా కనీసం నీ శరీరాన్నయినా కాపాడుకోవడం (అది మన పవిత్ర ధర్మం) అవసరమై వుంటుంది.  అది నీవు పూర్ణత్వం సాధించడానికి తప్పనిసరి సాధనం.  అదేస్థితి నిరంతరంగా కొనసాగితే శరీరరక్షణ చూచుకోలేం.  నిజమైన సమాధిస్థితిలో మనం సరళము, స్వచ్ఛము అయిన సత్యతత్త్వంతో సంబంధము అనుక్షణం కలిగివుండి నీవు నీ పనులతో మొత్తం సమయం గడుపుతున్నా ఏమీ ఇబ్బంది లేదు.  ఇదే సహజ సమాధిగా పిలవబడుతున్నది.  ఇది ఒకానొక గొప్పస్థితి.  నిర్వాణ స్థాయికి మూలాధారము.  ఇది మాటలతో వర్ణింప వీలుకానిది.  కానీ ప్రపంచంలోనే వుండి సాక్షాత్కారింప జేసుకొనవచ్చును.  దీనిని సాధించడం పేర్కొనినంత సులభంకాదు.  కబీరు మహనీయుడు ఈ స్థితిని గొప్పగా స్తుతించెను.  దీన్ని పొందటం నిజంగా గొప్పవిషయమే.

        ఇంకోవిషయం నీకు చెప్పవలసి వుంది.  సరియైన అభ్యాసం కొఱకు ఒక నిష్ణాతుని అన్వేషించు.  అట్టివాడు దొరికితే అతనికి నిన్నునీవు సమర్పించుకో.  నేను నీకు చెప్పవలసిందంతా చెప్పేశాను.  ఇక నీవు సరియైన అన్వేషకుని పాత్ర పోషించి గమ్యము చేరుటకు తగు సహాయమందించు పద్దతులను చేపట్టుము.  మనము గమ్యము సమీపిస్తున్నామనడానికి మూడు గుర్తులున్నాయి.  అవి దివ్యమైన చర్య, దివ్యమైన వివేకము మరియు దివ్యమైన ఆలోచనలు.  వీటిని నీలో వృద్ధిపరచుకొన యత్నించు.  అందుకొఱకు యోగశక్తి ప్రసారము (ప్రాణాహుతి) పై ఆధారపడిన ఒక సులభమైన పద్దతి వుంది.  అది దారిలో అభ్యాసికి చాలా సహాయము చేసి మేలు చేకూరుస్తుంది.  దీని ప్రభావము కొంతకాలము ఈపద్దతి ఆచరించిన వారికి బాగా అర్థమౌతుంది.  మనం సులువైన పద్దతులను అనుసరిస్తాం,  ఎందుకంటే మనం సులువైన దానిని పొందాల్సి వుంది కాబట్టి.  ఈ భావము హృదయంలో లోతుగా నాటుకుంటే తప్పక ఫలితం అందుబాటులోనికి వస్తుంది.  ఇంకా ఏమైన నీవు నన్నడగవలసినది వున్నదా?  ఇంకొక్కటుందనుకుంటాను.  అది ఎలా సంపూర్ణతను సాధించాలి? అని.  అంతేగదా!  నేను నిర్మొగమాటంగా చెబుతున్నాను, సమర్థుడైన గురువు లభిస్తే యిదేమంత కష్టమైన విషయం కానేకాదు. అటువంటి వానిని ఇప్పుడన్వేషించు.  ఇది నాస్నేహపూర్వకమైన సలహా.  నీవు అతన్ని పొందగానే నిన్నునీవు సంపూర్ణంగా అతనికి సమర్పించుకో.  అతని సాన్నిహిత్యం నీకు చాలా ఎఱుక పరుస్తుంది.  అదే అతన్ని తెలుసుకునే పద్దతిగా ఉపకరిస్తుంది.  నీకు ఒక్కవాక్యంలో జవాబు చెబితే సరిపోయేదానికి ఇంత చెప్పి నీ విలువైన సమయాన్ని హరించాను.  ఆ ఒక్క వాక్యమేమంటే -"నీలోనే అన్వేషించు.  ఆయన్ను నీలోనే కనుగోంటావు. గురువు వుంటాడు.  కానీ ఎప్పుడు? ఎప్పుడు నీవక్కడుండవో -- అప్పుడు".

***


సమస్య -- పరిష్కారము

 

        ఆత్మ ఎప్పుడైతే శరీరమనే వస్త్రము ధరించినదో అప్పుడే దాని భిన్న రూపము ముసుగు రూపమున కన్పడినది.  అంటే ఇదంతా ఒక తాడుగా తయారయింది.  దానిలో చాలా ముడులు కూడా ఏర్పడివున్నాయి.  ప్రియసోదరా! ఆత్మతో పాటు దాని భిన్నరూపమును కూడా మొదటనే మార్పుచేశాము.  అగ్నిలో నీరు పడితే మంట రెండింతలుగా పైకెగుస్తుంది.  ఇక దానిలోనికి గాలి ప్రవేశిస్తే అది మరింత భగ్గుమంటుంది.  జ్వాల కూడా తగ్గట్టుగా ఎక్కువౌతుంది.  ఏమిటీ జ్వాల?  ఇది ఆత్మశక్తిపై కలిగిన వివిధ ప్రకృతిచర్యలే.  ఇప్పుడు వీటిలో అంటే భూమి, గాలి, నీరు మరియు అగ్ని యొక్క ప్రమేయం ప్రకటితమైంది.  వాటి దృష్టి ఎప్పుడూ సత్యతత్త్వము వైపు వెళ్ళలేదు.  కాస్తా ఊహించండి.  వాటిని తప్పుగా ఉపయోగించడం వలన ఏమైంది?  తెర వెనుకనున్న సత్యపదార్థపు చర్యలు దృష్టిలోనికి రాకుండా పోయాయా? వినాశనానికి కారణభూతమైన చర్యలెందుకు చేపట్టబడ్డాయో అర్థంకావటంలేదా?  సత్యపదార్థ ఇచ్ఛాశక్తితో (ప్రపంచసృష్టికి కారణమైన) ఆత్మశక్తి కలిసి ప్రపంచసృష్టికి కారణమైనది.  ఇప్పుడు వివిధత్వపు ఆలోచన (అది సృష్టి మూలము) ఏకత్వమునకు భిన్నమైనది.  ఒకరకంగా ఈ రెండూ ఒకదానికొకటి ఎదురై నిల్చినవి.  మరో మాటలో చెప్పాలంటే ఈ ఇతరవిషయము, అంటే ఆత్మశక్తి, చర్యకు ప్రతిఫలంగా ఏర్పడినది, అది అసలుదానికన్నా స్థౌల్యమైనది. కానీ రెండూ చాలా దగ్గరగాచేరి కలిసిపోయి ఆలోచనను చైతన్యవంతము చేసినవి.  అదే విశ్వము సృష్టింపవలెనను ఆలోచన.  అదేవిధంగా వాటిచర్యలు కూడా మండుతున్న అగ్నిలో నీరుపడిన దానితో సమానమాయెను.

        ఆత్మ ప్రకృతినుండి వెలికి తీయబడినది.  అందులో వివిధత్వపుఎఱుక కూడా వున్నది.  ఈ ఎఱుక ఆత్మయొక్క ఇచ్ఛాప్రవృత్తి ఫలితము.  దాని వలననే వస్తువులు రూపు దాల్చినవి.  ఇప్పుడు మన ఇచ్ఛాశక్తి ప్రభావమున వస్తువులను చేసి వాటికి మన ఎఱుకతో ఆలోచన ద్వారా శక్తినిచ్చితిమి.  ఇంతకు ముందేమున్నది?  ఆత్మకు భిన్నమైనదేదో యుండినది.  ఆత్మయొక్క లక్షణము శాంతి.  శరీర లక్షణము ఆత్మకు భిన్నమైనది.  శాంతికి భిన్నమైనది.  కానీ దానికి కర్తలం మనమే.  ఇదంతా మనపనే.  పైన తెలిపినట్లు కర్మ వలన ఉత్పన్నమై రగుల్కొనిన అగ్నే అశాంతి, అలజడి మరియు బాధ.  ఎప్పుడు మనం సమర్థులమై వాటికి నీళ్ళు గట్టడం మానేస్తామో అప్పుడు వాటికి నీళ్ళుగట్టని మొక్కల గతిపడుతుంది.  ఇప్పుడదెలా సాధ్యం.  ఇప్పుడు ప్రాపంచిక వస్తువులవైపునకున్న మనస్సును వెనుకకు మరలిస్తే, అనగా శరీరం నుండి ఆత్మకు మరలిస్తే మన ప్రతిచర్యల వలన ఏర్పడిన చిక్కులు క్రమేణా కనుమరుగౌతాయి.  మన దృష్టిని ఆత్మవైపుకు మరలిస్తే కలిగే ప్రయోజనము శ్రేష్ఠము.  క్రమేణా శుద్ధీకరణ జరిగితే రగిలిన అగ్ని చల్లబడిపోతుంది.  ఆత్మవైపు మరలిన ఎఱుక ముందుకు కదిలి తన పూర్వస్థితికి చేరుకుంటుంది.

 

        సృష్టి ఉనికిలోనికి వచ్చింది.  ఎఱుక ఉత్పన్నమైన వెనువెంటనే వ్యక్తి బలహీనమైన రోగికి శక్తివర్థక ఔషధమిచ్చినట్లయినాడు. దాని కారణంగా అతడు వస్తుప్రపంచంతో మరింత జోక్యము పెంచుకున్నాడు.  ఈ జోక్యము మళ్ళీ అతన్ని మరణశయ్యకు పంపింది.  శక్తివర్థక ఔషధం ఇవ్వడంలో తప్పులేదు.  కానీ దానిశక్తిని ఉపయోగించడంలోనే తప్పున్నది.  బాధయొక్క తీవ్రత ఔషధముయొక్క అవసరాన్ని ముఖ్యముగా సూచిస్తుంది.  నేనింకో మాట చెప్పదలచుకున్నాను.  జబ్బేలేకపోతే ఆదిలోవున్న ఆరోగ్యాన్ని గూర్చి ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోరు.  రోగి మాత్రమే ఆరోగ్యాన్ని గొప్పగా గుర్తిస్తాడు.  దీని నుండి విడుదల పొందిన తర్వాత మాత్రమే ఆరోగ్యపు లక్షణాలు ఏర్పడుతాయి.

 

        చిక్కులనబడే వాటికి లేక సత్యతత్త్వానికి భిన్నమైన వాటికి శక్తి ఎలాకలుగుతుందని నీవు అడుగుతున్నావు.  ఎఱుకశక్తి లేక చైతన్యశక్తి వాటిని శక్తివంతము చేస్తున్నది.  శక్తి మనం వాటిపై వుంచే శ్రద్దకు అనుగుణంగా పెరుగుతుంది.  ఇలా క్రమేణా ఆశక్తి అధికమై మనల్ని అనగా మన ఆలోచనలను విపరీతమైనశక్తితో నింపుతుంది.  భక్తి లేక ఆరాధన విషయం కూడా యింతే.  మనం ధ్యాసను అసలువిషయం (సత్యతత్త్వం) వైపు భగవంతుని వైపు మరలిస్తే, భగవంతుడే శక్తి గనుక భక్తిలో కూడా శక్తి చేరుతుంది.  అప్పుడీ భగవత్‌శక్తిగా పిలువబడే ఆశక్తి క్రిందకు దిగివస్తుంది.  అవాంఛనీయమైన విషయాలు వాటికై అవే బలహీనమైపోతాయి.  ఎందుకంటే ఇవన్నీ మన అధీనములో వుండడంవలన మనమే వాటికి శక్తినిచ్చాము.  మరి ఆ విషయం భగవదాధీనం గనుక అది అక్కడనుండి శక్తిని గ్రహిస్తుంది.  దీని తాత్పర్యమేమి?  నిజమైన అర్థంలో మనధ్యాస భగవంతునిపైకి మరలిస్తే మిగిలినవన్నీ తుదకు వెలిసిపోతాయి.  ఫలితం శ్రీకృష్ణపరమాత్మ వివరించిన స్థితి కలుగుతుంది.  ఏమిటా స్థితి?  మనిషి తను కర్తవ్యరహితుడై పోతాడు.  ఇదే స్థితి వృద్ధిచెంది ఉన్నతస్థాయికిచేరితే ముద్రలు లేక సంస్కారాలు ఏర్పడటం  ఆగిపోతుంది.  ఒకవేళ వ్యక్తి ఈ స్థితిలోనికడుగిడి మున్ముందుకు అలాగే వెళితే అప్పుడేమౌతుంది?  అందులో ఒకఅంశం మానవుడు జీవితకాలంలోనే విమోచనం పొందడం.  దాన్నే "జీవనమోక్షగతి" అంటాం.  ఈపదాన్ని జనులు చాల విధాలుగా విశ్లేషించ యత్నిస్తుంటారు.  కానీ ప్రియసోదరా! అది చాలా తేలికైన, సులువైన విషయం.  ఇంత మాత్రం సాధించడమే అయితే నిస్సంశయంగా తప్పక సులభంగా లభిస్తుంది.  ఒక సులభవిషయం ఎప్పుడైనా సహజసిద్ధంగా సులువుగా సాధించ వచ్చును.

 

        ఇది చాలా సులువైన విషయము.  ప్రయత్నిస్తే జనం తండోపతండాలుగా దీన్ని సాధించుకోవచ్చును.  ఈ స్థితిని సాధించే పద్దతిని సామాన్యజనపదులు కూడా దానికి సంబంధిచిన దారీతెన్నూ తెలియకపోయినా (ఈ విషయంలో) సర్వమెరిగినవారి సహాయముతో కనీసం ప్రయత్నం కూడా చేయకపోయినా తమకు తోచిన రీతిలో వ్యాఖ్యానిస్తుంటారు.  వారు ఈ విధానాలను ఊరికే క్రొత్తగా ఉపన్యాసాలిచ్చేవారినుండి గ్రహిస్తారు.  వేదికలెక్కి నోటికి వచ్చిందంతా చెప్పి ఉపన్యాసాలిచ్చేవారి మాటలకు ప్రజలు చలించిపోతారు.  కానీ నిజమైన విషయం అమాయకహృదయులై ప్రకృతిని అధీనమందుంచుకొన్న వారి యందున్నదని చెప్పవలెను.  అరుదుగా ఇటువంటివి ప్రజలు కనుగొంటారు.  ఎందుచేత?  కారణం వారు సులభమైనదాన్ని సులభమార్గంలో పొందటానికి ప్రయత్నించరు.  దేవతలకు సైతం దక్కని నిజజీవితామృతమును ప్రజలు చవిచూచే సుదినము తొందరలోనే వచ్చునుగాక.  ప్రజలు వారివారి గాథలపై ప్రొద్దుపుచ్చడంతోనే సరిపోయింది.  ఒంటరిగా కాసేపుకూర్చొని భగవంతుని గురించి చింతించరు.  కనీసం మీకష్టాలను గురించి చింతించునంత సమయమైనా భగవంతుని గూర్చి యోచించండి.  అయితే ఏమౌతుంది?  జడమైన ప్రాపంచిక విషయాలను గ్రహించినంత సులువుగానే నీదైవమును నీవు సాక్షాత్కరింప జేసుకొనగలవు.

 

***


దుఃఖము దానిఆరంభము మరియు అంతము

 

        ఈ ప్రపంచమున జన్మించిన ప్రతివాడు దుఃఖములను చవిచూడక తప్పినదికాదు.  వ్యక్తి దీనినుండి తప్పించుకొనలేడు.  అందుకే మనం వీటినుండి బయటపడుటకు తపస్సుకు వెళతాము.  ఋషులు ఇందుకొఱకు తమను తాము నియోగించుకున్నారు.  ఈ విషయమై తమనితాము స్వచ్ఛమైన భగవదీయ ఆలోచనలలో నిమగ్నము చేసుకొనుటతప్ప వేరు నివారణమార్గము లేదు.  నదినుండి నీరు కాల్వలద్వారా ప్రక్కలకు పారి నదిని బలహీన పరచినట్లు మన ఆలోచనలు ప్రధానప్రవాహమును చిలువలుపలువలు గావించుచున్నవి.  నది నుండి పెక్కు కాలువలు ప్రక్కకు త్రవ్వినట్లయిన, నది ఉధృతముగా పారదు.  మన పరిస్థితి అలానే అయిపోయింది.  మన ఊహలకు, ఆలోచనలకు రెక్కలొచ్చి నట్లనిపిస్తున్నది.  అందుకే ప్రధాన ప్రవాహమును బలహీనపరచినవి.  మన ధ్యానసమయంలో వీటన్నిటిని సమగ్రపరచి తెచ్చి ఒక ప్రవాహముగా చేయుదుము.  మన ఆలోచనకు కూడా అదేశక్తి వుంటుంది.  దానికి పెక్కు ప్రక్కకాలువలు త్రవ్వితిమి.  మనం అనుసరించు విధానములో మనం విశాలమైన పరిధిలో అంతరాంతరాళములకు వెళ్ళుదుము.  మూలమువైపు ప్రవహిస్తున్న శక్తి వీటిని గ్రహించి అన్ని మూలలకు వెదజల్లుతూ పవిత్రయోచనాశక్తి వైపుకు వెళ్ళుతున్నది.  దాని ఫలితముగా పైపై చిలువలుపలువల పారుదలలు అనంతశక్తి వైపు ప్రవహించుచున్న ప్రధానశక్తితో వచ్చి కలుస్తాయి.  ఆ అనంతశక్తే మన అసలులక్ష్యము, మనం చేరవలసిన అంతిమ గమ్యము.

        బంధముతో పుట్టినదంతయు వ్యధయే.  బాధలు, సంతోషములు రెండూ వ్యధకే తోడ్పడతాయి. "మనషి అస్సలు పుట్టియుండకపోతే  ఈ వ్యధామయ స్థితే కలిగియుండదు.  పుట్టుకకు కారణభూతమైన పరిస్థితి ఆపనికై ఆయత్తపరచిన ఇచ్ఛాశక్తి యత్నమే.  ఈ యత్నమునకు కారణము మానసికముగా తగులుకొనియుండుట లేక ప్రాపంచిక విషయములపై ఇష్టత, ఆసక్తి కలిగి యుండుటయే.  ఇలా తగుల్కొని యుండుటకు కారణం ఆనందాన్నందించు వస్తువులు, ప్రదేశములు మరియు నాదములు మొదలగు వానికొఱకు ఆరాటము, ప్రాకులాట వుండుటే.  మన వాంఛకు కారణము వస్తువుల యొక్క ముందుటి ఆనందానుభవమే.  ఇంద్రియానుభవములు ఒక వస్తువుపై ఇంద్రియములుతగుల్కున్నప్పుడు మాత్రమే కలుగుతాయి.  జ్ఞానేంద్రియములైన మన పంచేంద్రియములు మరియు మనస్సు లేకపోతే ఇక తగుల్కోవడం అనేది వుండదు.  ఈ ఆరు తమ ఉనికిని నిలుపుకొనుటకు శరీర, మానస నిర్మాణముపై ఆధారపడి వుంటాయి.  ఈ ఏర్పాటే అవగాహనాపూర్ణమానవుని ఉనికిలోనికి తెస్తున్నది.  ఈ ఏర్పాటు నశించివుంటే లేక ఎఱుకలోనికి రాకుండావుండి వుంటే తల్లి గర్భంలోనికివెళ్ళి అది వృద్ధిచెంది యుండదు.  కానీ తల్లి గర్భములోని పిండములోనికి దిగివచ్చిన ఈ ఎఱుక మాత్రము ముందుండిన ఉనికికి (పూర్వజన్మకు) సంబంధించిన ముద్రల (సంస్కారముల) ఫలితమే.  అవిద్య వలననే మనం మరుజన్మకు కారణమైన ముద్రలను వేసుకుంటున్నాము.  సంపూర్ణమైన సక్రమ అవగాహన వుండివుంటే మరుజన్మకు కారణమగు ఏకర్మలూ మనం చేసియుండము", అని బుద్ధభగవానుడు సెలవిచ్చెను.

 

        గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ భావనలను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను.  మన గమ్యము వైపునకు పూర్తిశక్తితో మనోధైర్యముతో ముందుకు పురోగమిస్తే ఈ ప్రపంచము రెండవ ఆలోచనయైయుండెడిది.  పరిపక్వత సిద్ధించేదాకా ధ్యానప్రక్రియను కొనసాగించు.  ఇది ధ్యానము యొక్క ఆఖరుదశ.  మనం సద్వస్తువుతో ఏకమైపోతే దాని వెన్నంటి వస్తున్నవన్నీ మనం గమనించలేనంతగా చీకటిలో కనుమరుగైపోతాయి.  ఇంకోమాటలో చెప్పాలంటే ఈ విషయంలో మనం అంధులమై సత్యపదార్థముపైనున్న మనచూపు వృద్ధిచెందుతూ ముందుకు వెళ్ళి మనల్నిమనం పూర్తిగా పోగొట్టుకున్న స్థాయికి చేర్చబడతాము.  ఈస్థాయినందుకోగానే మనం మోక్షస్థితిలో వున్నట్లు తెలుసుకుంటాము.  ఈస్థితి గనుక పరిపక్వత చెందితే ఇక అదే అన్నివ్యధలకు అంతము.  బాధలేదు, దుఃఖము లేదు, సంతోషములేదు మరియు సౌఖ్యములేదు.  ఈ శరీర యంత్రము ఇక మనపై ముద్రలు (సంస్కారములు) పడకుండా పనిచేస్తుంది.  మరోమాటలో చెప్పాలంటే శరీరము దానికైఅదే కర్తవ్యానుగుణంగా పనిచేస్తుంది.  అదే అన్నింటికి అంతము.  అక్కడ ఇక సంస్కారములేర్పడుట జరుగదు.  ఈ స్థానంలోనే మనం సహజసిద్ధంగా సంపూర్ణంగా మనకైమనమే ఆత్మార్పణ గావించుకుంటాము.  ఇదే భగవద్గీత సారాంశము (తత్త్వము).  ఈ స్థితి కొఱకు దేవతలు సైతం ఆరాటపడతారు.  ఇది మానవుల కొఱకే కేటాయించబడింది.  ప్రియమిత్రమా!  నీవు దీనికొఱకు తపన పడవా?  మనమందరం ఈ కొసను చేరుటకే శ్రమించాలి.  ఇది మనమూహించినంత కష్టముకాదు.  నా మట్టుకిది మిగత వాటివలెనే సులువైనది.  పవిత్రయోచనలలో లీనమై పోవడం వలన మనమీగమ్యమునందుకోగలము.

 

***


స్పందన - శబ్దము మరియు దాని గుఱుతు

 

        క్రిందికి దిగివచ్చిన లేక అవతరించినదంతా వ్యాప్తమైనది.  ఏది చూచినా ఏది భావించినా ఆస్థితి నిండునీటిపాత్రలా గోచరించింది.  ఆపాత్ర నిండి పొర్లిపోయినదంతా ఆస్థలం మొత్తం వ్యాపిస్తుంది.  మన ఋషులు ఈ పొంగిపొర్లిన దానిని సంగ్రహించారు.  ఇది కాలంయొక్క ప్రారంభం గనుక వారిధ్యాసంతా, దానిపైనే వుంచారు.  అప్పటివరకు వాళ్ళలో ఏ సంస్కార ముద్రలూ లేవు.  అది ఎలాప్రజ్వరిల్లిందో అలాగే వారి ఎఱుకలోనికి వచ్చింది.  కొందరి ధ్యాస ఓ పెద్ద పరిధిలో రూపుదాల్చిన జడపదార్థంపై కూడా పడింది.  మరి కొందరి చూపు అల్పమైన ఉధృతిగల ప్రవాహంపై పడింది.  ఆ జడపదార్థమేమిటి?  అది ప్రతిఒక్కరి అవసరాలకు ఉపయోగ పడేది.  కనుక వారు వాటిలోనికి వెళ్ళి, సూక్ష్మమైన వాటిని సూక్ష్మద్రష్టలకు వదిలేశారు.  ఏమైనా అగ్ని, నీరు మరియు గాలి యొక్క అవసరం వుండనే వుంది.  వారి వేగానికి తగ్గట్టుగా వారు ఒక కాలం నుండి మరో కాలం వరకు పనిచేసితీరాలి.  ద్రష్టలు వాటిని (అగ్ని, నీరు, గాలి) మాత్రమే చేపట్టారు.  వాటి అంతర్గతస్థితిలో ఒక మలుపు తిప్పారు.  చిక్కని ప్రవాహపు ప్రభావముగల చోటే వారు వాటికి ఒక చలనాన్ని కలిగించారు.  అలా వారు అగ్ని, వాయువు మొదలగు వాటికి స్పందన నిచ్చారు.  కావలసినంత ఆ చిక్కని ప్రవాహపు ప్రభావాన్ని దానితో సంబంధంవున్న అదేప్రదేశంనుండి గ్రహించి అగ్ని వాయువు మొదలైన భూతములకు స్పందన కలిగించారు.  నా ఉద్దేశ్యములో, ఆ స్పందన మొదట జీవశక్తియుతమైన భూతముల (అగ్ని,భూమి,నీరు,గాలి వంటివి) కు చేరినది.  అందుకే ఆ మంత్రములు మాత్రమే మొదట వ్రాయబడినవి.  వాటి వలననే అనేక ఫలితములు కలిగినవి.  అవి మనప్రాణాన్ని కాపాడి రక్షించినవి.  ఆ పని కూడా ఒక ముఖావశ్యకమైనదే.

 

        భూతములు (అగ్ని, వాయువు, నీరు మొదలైనవి) ఆవరించిన తర్వాత అట్లే చాలాకాలం గతించిన పిమ్మట, ఆలోచన వాటిపైనే అలాగే కొనసాగడం వలన అక్కడే అతుక్కుపోయినట్లనిపించింది.  తర్వాత వారు అసలు ప్రవాహశక్తిపై లోతుగా యోచించడం మొదలు పెట్టారు.  ఆ అసలు ప్రవాహకశక్తే ఆధ్యాత్మికత.  దాని పర్యవసానమే ఉపనిషత్తులు.  ఇదంతా వారి సక్రమయోచనా ఫలితమే.  పరిణామ విధానము దీనిలోనే పరిరక్షింపబడుతున్నదనియు మరియు ఇదే, మేధోమధనము యొక్క చరిత్రయైనదని వీటిని గమనించి నీవిప్పుడు నిర్ధారించలేవా?

 

        పైన తెలిపినదంతా కేవలం ఉపోద్ఘాతమే.  ఒక విద్యావిహీనుని వివరణలే.  అతని మనస్సులో నెమరువేసుకొన్నవే (అతని పరిపక్వ ఆలోచనల అడుగున పేరుకున్న పదార్థము).  ఇప్పుడు నేను ప్రధాన విషయానికొస్తున్నాను.

 

        వేదమనునది ఒక స్థితి.  అది విశ్వసృష్టికి పూర్వమే ఉన్నది.  భగవంతుడు ఆ స్థితియొక్క ఆనందమును మీ కనుగ్రహించు గాక.  నీవు దానిని పొందవచ్చును.  అందువలన విశ్వసృష్టి రూపుదాల్చిన నాటినుండి వేదములు ఉనికిలోనికి వచ్చినవి.  అవి పుస్తక రూపమునకు మార్చబడినవి.  అందువలన స్థితులకు దుస్తులు తొడిగినట్లయినది.  మరి అప్పుడున్నదేమి?  ఆ మథన స్థితి మరియు అణుసృష్టి.  మథన ప్రక్రియ ఫలితమే అణునిర్మాణమునకు కారణభూతమైనది.  మరో మాటలో చెప్పాలంటే ఈ మథనము యొక్క ఫలితముగా ఏర్పడిన దానితో ఇది సంధింపబడినది.  ఇప్పుడు ఫలితమేమైననేమి అది అనేక ఇతర రూపములు పొందినది.  దాని మానసిక పరిస్థితి మాత్రము పుట్టుకస్థానము (మూలము) నందే వున్నది.  ఆస్థితి ఎట్టిదైనప్పటికి అది శాస్త్రీయమేనని తప్పక చెప్పవలెను.  ఎందుకంటే ప్రాణవాయువు, ఉదజని వాయువు కలిస్తే నీరు ఏర్పడక పోయే సమస్య లేదుకదా!  ఏది ఎప్పుడు ఎవరు ప్రయోగం చేసినా ఒకే ఫలితాన్ని యిస్తుందో దాన్ని మాత్రమే నేను శాస్త్రమని పిలుస్తాను.  ఇప్ప్పుడు దాని ఫలితమేమైన నేమి?  దాని అసలుస్థితిపై దృష్టిపడినంతనే అది తన పుట్టుకకు మూలమైన పరిజ్ఞానమును కలిగిస్తున్నది.

        వేదఋషులు ఈ ప్రవాహముల మథనమున ఉత్పన్నమైన మందస్వరమును ఆధారము చేసుకొని, ఆ స్వరము ఎవరిది అని అన్వేషణ చేయసాగిరి.  కనుక నేను విన్నంతలో మొదటి కొన్ని భాగములు చదివి తెలుసుకున్నంతలో ఈ శబ్దమునే ఉపయోగించుకొనిరి.  మరో మాటలో చెప్పాలంటే ఇదే సత్పదార్థమును తెలియజేయు సాధనము.  ఎప్పుడైతే దారి ఏర్పడిందో అందుండి సత్పదార్థము వ్యక్తమైనది.  దానితో మొత్తము విషయము మరోమలుపు తిరిగినది.  అంటే ఆధ్యాత్మిక ప్రయోజనమునకై మరో అధ్యాయము తెరువబడి ఆలోచనా విహారము మరింత ఉధృతిని సంతరించుకొన్నది.  శబ్దము ద్వారా సత్యతత్త్వపు జాడ అగుపడగనే ఋషులు మరింత లోతుకు వెళ్ళుటకు సమాయత్తపడిరి.  లోతుకు మునిగి వారు సత్యతత్త్వమునకు అనుసంధించబడిన తాడు ఆవలి కొసను చేజిక్కించుకొనిరి.  అప్పుడు వారికి మొదటి పాఠమైన "ఏకోహం బహుష్యం" (ఒకటే అనేకమైనది) లోని మనోభావము అర్థమైనది.  కానీ ఇది సద్వస్తువుయొక్క ప్రాపంచికత్వము మాత్రమే.  అనగా అది క్రిందితరగతి యోచన.  ఆలోచన మరింత ముందుకు దుమికి తాడు పైభాగమును పట్టుకున్నారు.  దీనిని ప్రవాహముల కదలికల ప్రతిధ్వనిగా గుర్తించి, ఇంకనూ ముందు ఏదో ఉన్నదని గ్రహించారు.  అన్వేషణ కొనసాగి "ఏకోహం బహుష్యం" అను యోచనను మించిపోయి, తత్సంబంధిత ప్రాపంచికత్వమును ఇప్పుడు వదలివేశారు.  మరో మాటలో చెప్పాలంటే తొలుత మన దృక్పదమున నుండిన సత్పదార్థపు స్థౌల్య రూపము మరుగుజొచ్చి మన ప్రయాణం మున్ముందుకు వెళ్ళినది.  అప్పుడేమైనది?  ఎంతో కొంత ద్వైతభావము సందేహము రేకెత్తించుచు ఆత్మను ప్రభావితము చేయుచున్నదంతయు బయటకు ఉబికి వచ్చి లోతుగా ఆలోచింపజేసినది.  అలా లోతుగా అంతర్గతముగా ఆలోచించుట వలన ఇదంతా కేవలం మానవ స్వభావమని మనల్ని మనమే పర్యావలోకనం చేసుకోవడం వలన కలుగుతున్నదన్న విషయం ఆలోచన కందింది.  ఎప్పుడైతే ఇదంతా అర్థమయిందో అప్పుడే మనలో నిక్షిప్తమైవున్న సద్వస్తువునకు మన తత్త్వము మరియు ఆలోచన సంబంధమేర్పరచుకొన్నది.  అంటే ఆలోచన ఆ ప్రవాహములోనే ఈదులాడుచున్నట్లయినది.  ఇంకా ముందుకు పోతే ఈ మథనం వలన ఏర్పడినదంతా సత్యతత్త్వం కాదని అది దానిపై పేరుకొనియున్న మీగడ వంటిదని అర్థమౌతుంది.  అడుగులు ముందుకువైచి మరింత ముందుకు వెళితే పైతెలిపినదాని మధ్య భాగమునకు వెళతాము.  ఇంకా వెళితే ఆనందపు పరిమళం ఆఘ్రాణించడం మొదలుపెడతాం.  ఇప్పుడొక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు.  అదేమిటంటే ఆలోచన అందులోనే ఐక్యమైపోయివుంటే మరి అది ఎలా మన అనుభవంలోకి వస్తుంది అని.  మన ఆలోచన గ్రహించిన అణువులన్నిటిలో ఆ మీగడ యొక్క ఘనస్వరూపమున్నదనుటే దీనికి జవాబు.  ఆనందస్థితి వస్తుంది.  అక్కడ కాసేపు వుంటాం కూడా.  దానిని మనం అనుభవిస్తాం.  దీనికోసమే మనం ఇన్నాళ్ళూ వెతుకుతున్నాం అనే నిర్ధారణకు వస్తాం.  కొందరు అక్కడే నిలిచి పోతారు.  మరికొందరు ఈసచ్చిదానంద స్థితిని దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతారు.  అలా వెళ్ళగా వెళ్ళగా వారిలో అద్వైతస్థితి ఆవరించి నిలువరింపబడతారు.  దీని తర్వాత ఇక వేదాలు పలుక జాలవు.  ఎందుకంటే అవి ఈ స్థితిని అనిర్వచనీయమని తెలిపి "నేతి" "నేతి" (ఇది కాదు, ఇది కాదు) అని ప్రకటించేశాయి.

 

        ఇప్పుడు శాస్త్రరీత్యా కూడా ప్రశ్న ఉత్పన్నమౌతుంది.  నేను కొంతవరకు జవాబు చెప్పితిననుకుంటున్నాను.  కానీ మీరు ఇంకా ప్రశ్నిస్తే మనం దారిలో వున్నామనీ, సత్యతత్త్వాన్ని అనుసరిస్తూ పురోగమిస్తున్నామనీ చెప్పవలసి వస్తుంది.  మన దృష్టిలో సత్యతత్త్వం మాత్రమే వున్నదని ఖచ్ఛితంగా చెప్పవచ్చును.  ఏమైననేమి మనకై మనం అలా అయిపోయాము.  సత్యజ్ఞానానికి మనం నిలయమయ్యాము.  లేదంటే సత్య జ్ఞానమే మనమయ్యాము.  గణితశాస్త్ర గుర్తులకంటే కూడా మనం మరింత సత్యమయ్యామని "ఎ" చేసిన వ్యాఖ్య నిజమే కానీ అప్పటికి మనం దానిలో ఐక్యమైపోయి ప్రతిదీ మన దృష్టిపథంలోనికి వచ్చి నిజమౌతూ వుండాలి.  ఎవరు ఈమార్గంలో వెళ్ళినా ఇదే వారి దృష్టికి వస్తుంది.  నీవు ఇందులో కవిత్వాంశమున్నదని అది విపరీతము చేసి చెప్పబడినదనీ అనుకొనవచ్చును.  అవును, ప్రియసోదరా! ఇది నీ ఆలోచనతో పరిసరములను నిర్మించి ఏరి పట్టుకొని సత్పదార్థమును చూపుటకు సహాయపడును.  దీనిద్వారా పని సాధించుకొనుటకు నేను కూడా దీన్ని సమ్మతిస్తాను.  ఉదాహరణకు నేనొక కవిత వ్రాస్తాను.  "ప్రేమికుడు బలహీనముగా నున్నాడు, ప్రేయసి చాలా సున్నితముగా నున్నది.  తెర మరొకరెవరైనా తొలగించెదరు గాక".  ఇప్పుడు నీవు దీని అర్థమేమని లోతుగా ఆలోచిస్తే ప్రియుడు, ప్రేయసి ఇద్దరూ చేష్టలుడిగి యున్నారనీ, అదే సత్య స్థితియని నిరూపింపబడుతుంది.  అంటే ఆ సత్యతత్త్వస్థితి ఆ విధంగా వ్యక్తీకరింపబడింది.

 

        మన సిద్దాంతమేమంటే మనిషి పుట్టినప్పుడు నిర్మలుడు, సంపూర్ణుడు.  అందువలన ఈ ముడులన్నీ మానవుని వల్లనే ఏర్పడినవని తేలినది.  ఇవి మూలమును దృష్టిపథము నందుంచుకొనుటకు ఆటంకములైనవనియు తెలియుచున్నది.  అతని చర్యలు అతని అంతరంగమున ఒక ప్రపంచమునేర్పరచినవి.  కారణం పనిమంతుడు మనలను శుద్ధముగా, పులుగడిగిన ముత్యములవలె పంపినాడు.  అదీ అతని పనితనము యొక్క గొప్పదనము.  ఈ దుమ్ము, ధూళి మనపై పేరుకొని యుండుటకు మనమే కారకులము.  సంస్కారములను ఏర్పరచుకొని ఒకదానిపై ఒకటిగా పొరలను చుట్టుకొనజేసి, పట్టుపురుగుచుట్టూ దారము మిక్కుటముగా చుట్టుకొని, వుండవలె మారినట్లు మనమే మారిపోతిమి.  సత్యతత్త్వ సముద్రము నుండి బయటికి వచ్చినపుడు మనము ఆపాదమస్తకం సత్యతత్త్వమే అయివుంటిమి.  మన తొలిస్థితి అలావున్నందువలననే మనం ఏ ఆటంకం లేకుండా నేరుగా దాన్ని చూడగల్గితిమి.  దానికి సంబంధించిన జ్ఞానముండినది.  దాని స్వరూపము వేదమని నిర్ధారించ గలిగితిమి.  సంస్కృతభాష అతి సహజమైనదిగా చెప్పబడుచున్నది.  దానికి కారణము అది ప్రారంభమై యుండుటే.  ఒకరికొకరు తెలియజేయుటకు అర్థము జేసుకొనుటకు వారు నాలుకను వారి అనుభవము వ్యక్తీకరింప జేసినట్లు కదల్చిరి.  సంస్కృత అక్షరములపై లోతుగా యోచించి అధ్యయనంచేస్తే సహజముగా ఉత్పన్నమైన శబ్దతరంగపు ఉత్తానపతనములు (ఎత్తు పల్లములు) గమనింప వచ్చును.  ఆ భాషలో వారి అనుభవమునకు వచ్చిన ప్రతి తరంగమును వ్యక్తీకరించిరి.  దాన్ని వారు సంస్కృతం (దైవీయం) అని పిలిచిరి.  దైవ సందేశము వారికి ఏఒక్క ప్రత్యేకభాషలోను అందలేదు.  నేటికీ దైవ సందేశములు అందుతాయి.  కానీ ఎవరు తమ తొల్లింటిస్థితిని తిరిగి పొందగలిగారో, ఎవరు మూలశక్తితో సంబంధమేర్పరుచున్నారో వారికి మాత్రమే సరిగ్గా అందుతాయి.  అవి ఎప్పుడు కూడా వారికి తెలిసియున్న భాషలోనే అందుతాయి. అది మనస్సుకు తడుతుంది, అప్పుడతడు జాగృతుడై తను నేర్చుకొన్న పదజాలముతో గ్రహిస్తాడు.  ఇట్టి దైవసందేశములు చాలా మట్టుకు కవితల రూపంలో వస్తాయని వివేకానందస్వాములవారు వ్రాసియున్నారు.  అది అలా అందరిలో జరగకపోవచ్చు.  కనీసం వ్యక్తి తన పరిసరముల ప్రభావమునకులోనై సత్యతత్త్వమును పోగొట్టుకొనకుండా వుంటేనేగాని ఇది సంభవము కాదు.  పరిసరములంటే నాఉద్దేశ్యంలో సత్పదార్థము నంటిపెట్టుకొని యుండినవి.  అంటే నిప్పునంటిపెట్టుకొనియున్న పొగ నిప్పును సూచించుచు నిప్పుదే అయినట్లుండును

***


వివిధ తరగతుల గురు శిష్యులు

 

        ఈ పతనావస్థకు హేతువేమి? ఈ ఆకర్షణకు ఏ రంగు కారణము? మానవ మనస్సులో ఉత్పన్నమైన ఈ ఉద్వేగమునకు కారణమేమైయుండును?  మన చూపులు ఎందుకు అటూ ఇటూ మరలి వివిధ బాటలు దారులుగా చీలిపోతున్నాయి?  ఏమిటిదంతా? ఎవరు దీనికంతటికి బాధ్యులు?  ఎవరు ఇటువంటి వాతావరణాన్ని సృష్టించారు?  భగవంతుడా లేక మనిషి తనకైతనేనా?  ఎవరు దీనిపై ఒకటిపై ఒకటిగా పొరలు చుడుతున్నారు?  అన్న ప్రశ్నలు నన్ను ఒక్కోసారి లోతుగా ఆలోచింపజేస్తుంటాయి.

 

        వీటికి జవాబు, భగవంతుడు మనల్ని స్వేచ్ఛ అంటే నిజమైనస్వేచ్ఛ  పొందటానికని సృష్టించాడు.  కాని కాలక్రమంలో అంతా తారుమారై మరోదారి పట్టింది.  మన మనస్సు అసలుస్వేచ్ఛను వదలి ఇంద్రియములవైపు తిరిగింది.  అందుకు ప్రోత్సాహకములైన సంతోషములే మనకు కలిగాయి.  ఇంద్రియములవైపు మొగ్గుచూపిన వారు వాటిలోనే లీనమైపోయారు.  ఒక వేళ వారు వాటినుండి బయటపడినా వారు ఇంద్రియముల సంతృప్తి పరచు మరియు ప్రోత్సహించువాటినే పెంపకంజేసుకున్నారు.  అంతకుమించి పైకెదగలేక పోయారు.  వాళ్ళకైవాళ్ళు ఏర్పాటు చేసుకొని వృద్ధి చేసుకుంటున్న కేంద్రాల స్థాపకులు ప్రజలకు తారసపడి వారికి నచ్చినట్టి విషయములేచెప్పి కావలసిన ఆదాయమును వారు రాబట్టుకొనుచున్నారు.  అది ఎలా జరిగుతుంది?  ఇది ఇంద్రియములవలన కలుగు సంతోషములతో తృప్తిజెందు వారితో కలియడం వలన జరుగుతుంది.  కానీ వారు ఆకాశం వైపు అన్నిటిని మించి చూస్తున్నట్లు నటిస్తారు.  వారే మన మహాత్ములు.  నీవు, నేను వారుతెరచిన కేంద్రములను రద్దుచేయాలనుకుంటాము.  అయితే వారుకూడా అందుకు సిద్ధమే కానీ వారు స్థాపించిన ఆ కేంద్రము దివ్యకేంద్రముగా పరిణితి చెందితే అంతపనీ చేస్తారు.  నా ఈమాటలు కఠినంగా అనిపించవచ్చు కానీ నేను ఇలా వ్రాయవలసి వస్తున్నది.  "గొర్రెపోతు వృషణములు తోడేలు చేత చిక్కినవి.  గొర్రెల కాపర్లు తలోదిక్కుకు పారిపోయారు".  ఇప్పుడీ పరిస్థితులలో ఇంతకూ కారణమైన ఆ పెద్దమనుష్యులు మన మధ్యలోనే వుండడమేగాదు, వారిలో కొందర్ని మనం గురువులుగా మన్నిస్తున్నాం.  ఇంతకూ గురువులు ఇదిగో ఈవిధంగా వుంటారు.

 

  1. గురు సిఫ్లీ --------- అధమ గురువులు

  2. గురు కితాబీ----పుస్తకములు వాటిపరిజ్ఞానపు గురువులు

  3. గురు అస్లీ ----------- పుట్టుకతో గురువులు

  4. గురు ఫజ్లీ --------- ఉత్తమ గురువులు

  5. గురు అస్లీఫజ్లీ--పుట్టుకతోనే అత్యుత్తమతరగతి గురువులు.

 

        మనల్ని దయ్యాలను, భూతాలను పూజించమని చెబుతూ కొన్నిమహిమలు గలిగి వుండేవారు అధమ గురువులు.  పుస్తకములను ప్రామాణికముగా చూపి ఇతరులను సాధన చేయమని చెప్పువారు పుస్తక గురువులు.  వారు సాధన వలన కలుగు ప్రయోజనమునకు బాధ్యత వహించరు.  ఆ సాధనలు ఎట్టిస్థితులలో ఎలా మేలుకలుగజేస్తాయో నిరూపించుట కూడా వీరి వలన కాదు.  పుట్టు గురువులు ప్రక్రియలను బోధిస్తూ పోతుంటారు.  అందువలన ఒకానొక రంగములో సాధకుడు పరిపూర్ణుడు కావచ్చు.  అది కూడా వారు సుడిగుండంలాంటి వాటిలో చిక్కుకోనప్పుడు మాత్రమే జరుగుతుంది.  ఒకవేళ వారు అలాంటి వాటిలో చిక్కుకుపొతే ఈ గురువులు వారిని బయటికి తీయగల సమర్థులుకారు.  ఉత్తమవర్గ గురువులను నేను ఫజ్లీ అన్నాను.  వారు భగవంతుని దయకు పాత్రులు.  వారు ఆ దయను ఇతరులను బాగుపరచడానికి ఉపయోగించగల శక్తిమంతులు.  వీరుకాక మరో తరగతి గురువులున్నారు.  వారిని అస్లీఫజ్లీ అంటారు.  వారిని కనుగొనడం కష్టం.  ఈ గురువులు అత్యున్నత స్థాయికి చెందియుండి, మూలస్థితిని అందుకొనియుంటారు.  వారెల్లప్పుడూ మూలాన్నే ఆశ్రయించి వుంటారు.  కనుక సొదరా! మనం అటువంటి గురువుకోసం వెతకాలి.  అట్టి గురువు లభించనప్పుడు ఫజ్లీ తరగతి గురువుతో సరిపెట్టుకోవాలి.  పుస్తక గురువులతో ఎన్నోరకముల అనుమానాలకు ఆస్కార మేర్పడుతుంది.  అతని నడవడి సరియైనదికాకపోయే అవకాశం కూడా వుంది.  కానీ ఫజ్లీ, అస్లీఫజ్లీ గురువులలో అట్టి సమస్యే ఉత్పన్నం కాదు.  జనులు నమ్మడానికి మనస్కరించకపోతే వారికి మనం పలుమారు మళ్ళీమళ్ళీ చెప్పినా ప్రయోజనముండదు.  ఈ విషయంలో కబీరు మహాశయుడిలా అంటారు --- "మొత్తం కుటుంబం - కుటుంబం గుడ్డివాళ్ళయితే నేనిక ఎవరిని నమ్మించేది?"

 

        అస్లీ గురువును (పుట్టుగురువు) గురించి చెప్పాలంటే ఆయన సత్యస్థితిలో ఆటుపోట్ల నుండి విడుదలపొంది వున్నప్పటికి ఆయన అంతర్గత స్థితితో ఇతరులను ప్రోత్సాహపరచగల శక్తిమంతుడుకాడు.  అయితే ఫజ్లీ గురువు ఇది చేయ సమర్థుడు.  ఈయన భగవదానుగ్రహమును అభ్యాసిలోనికి ప్రవేశ పెట్టగలడు.  ఈ ప్రక్రియ  రెండువిధములు.  సహజసిద్ధంగా దైవకృప తనలోనికి ప్రవహిస్తూ వుంటే తనభాగమును సైతం తాను ఇతరులకు పంచిపెట్టగలడు.  అయితే ఆ దివ్యప్రవాహము మొదలుకాక మునుపు తానేమి చేయలేడు.  తనఎఱుకలో వుంచుకొని తను అవసరమని తోచినపుడు ఆ దివ్యధారను తన ఇచ్ఛానుసారము ఉపయోగించు వారునూ వుందురు.  మన సహజమార్గ విధానములో ప్రతి ప్రశిక్షకుడు అట్టి ఎఱుకగలిగిన ప్రాణాహుతిప్రసారణా సమర్థులే.  ఈ విధానమే అట్టి శక్తియుతమైనది.  అటువంటప్పుడు  అస్లీఫజ్లీ గురువుల గూర్చి ఏమని చెప్పగలము?  ఆయన ఒక కనురెప్ప కదలిక మాత్రమున తాననుకున్న పనిని పూర్తి చేయగలడు.  అట్టి మహనీయులు అరుదుగా కనబడుదురు.

 

       ఇప్పుడిక శిష్యులలోని రకములు కూడా చెబుతాను విను.

 

(1) స్వార్థపరుడు  (2) ఫజ్లీ  (3)అహలీ  (4) భక్తుడు

(5) మురాద్

 

        స్వార్థపరులైన శిష్యులు వారికి కావలసినవి పొందటానికి యత్నిస్తారు.  ఇటువంటి శిష్యుడు  శ్రీ "అ" అనే మహాత్ముడు, భగవత్ భక్తుడు ఉన్నాడని విన్నంతనే పరుగెత్తుకెళ్ళి ఆయనను కలిసి తనకు ప్రాపంచిక లాభములు సమకూర్చగలడేమోనని పరిశీలిస్తాడు.  ఇటువంటి ప్రాపంచిక లాభాపేక్షకులు ఏ విధమైన కార్యములు నిర్వర్తింపరు.  వారు సత్సంగంలో చేరి వారి స్వార్థపూరిత ప్రయోజనములు పొందాలనుకుంటారు.  పొగడ్తలతో పనులు సరిజేసుకోవాలని చూస్తారు.  తదనంతరం అక్కడనుండి మెల్లగ జారుకుంటారు.  ఒక వేళ వారిపని సానుకూలం కాకున్నా వారు అక్కడినుండి వెనక్కు వెళ్ళిపోతారు.  వారి విషయంలో ప్రేమానుబంధాల ప్రసక్తే ఉత్పన్నం కాదు.

 

        ఫజ్లీ తరగతి శిష్యులు ఆనందకర వాతావరణంలో వారు మానసికంగా సంతోషంలో వున్నప్పుడు, అప్పుడప్పుడు ధ్యానంలో కూర్చొంటారు.  వారికి హృదయములో భగవదానురక్తి అసలేవుండదు.  ఇక అహలీ శిష్యులు ఉన్నతస్థాయి పూజలకు సంబంధించిన సంస్కారములతో వుంటారు.  వారు పూజలు చేస్తారు.  ఆ పూజలనే కొనసాగించాలనుకొంటారు.  వాళ్ళలో కొందరు అభివృద్ధిచెంది భక్తుల స్థాయికి చేరుకుంటారు.  కొందరు మొదటినుండి భక్తుని స్థితిలోనే మెలగుతారు.  భక్తుడంటే గురువును మిక్కుటముగా ప్రేమించువాడే.  అతడు ఎల్లప్పుడూ తననుతాను అంతర్గతంగా గురువుతో అనుబంధించుకుంటాడు.  ఈ తరహా మనుష్యులు శిష్యునిలో వుండదగిన సద్గుణములన్నీ కలిగి వుంటారు.  ఇటువంటి వారిలో అరుదుగా ఏ ఒకరో ఇద్దరో "మురాద్" స్థితిని పొందగల్గుతారు.  మురాద్ శిష్యుడు తన గురువు ప్రేమకు ఆస్పదుడౌతాడు.  మరో మాటలో చెప్పాలంటే గురువుయొక్క ధ్యాస ఇతనిపై కేంద్రీకృతమై వుంటుంది.  ఇతడు ప్రేమింపబడువాడుగా వుంటాడు.  ఇట్టివారు అరుదుగా కనబడతారు.  ఈ రోజుల్లో మురాద్‌లు లేరు, ఉత్తమ గురువులూ అరుదే.  పూజ్య లాలాజీ వారు నాకు ఒకానొక ఉత్తరంద్వారా వ్రాస్తూ, ఈ రోజుల్లో రోమకూపములున్న సంఖ్యలో వ్యర్థులు (మురీద్‌లు) కనిపిస్తారు.  కానీ "మురాద్" లు మాత్రము చాలా అరుదుగా వుంటారని తెలియజేశారు.

 

***


పదార్థ సత్యతత్త్వము

 

        ప్రియ సోదరా! నీవు పదార్థముయొక్క వాస్తవికతను అర్థము చేసుకోలేక పోతున్నానన్న వాస్తవాన్ని నాకు వ్రాశావు.  ఒక వేళ చెక్కెరబొమ్మలోనికి ప్రాణాన్ని నింపితే అది దాని వాస్తవికతను అర్థము చేసుకోగలదా? లేదు.  దీని అర్థమేమంటే సుధీర్ఘంగా వస్తుదృష్టితో జీవించి జీవించి మన స్వవస్తువును అంటే సత్యతత్త్వమును పోగొట్టుకున్నాము.  ఇదొక్కటే ఆటంకము.  ప్రకృతి నిజానికి భక్తునకేమీ రహస్యంగా వుంచదలచుకోలేదు.  రహస్యములు అనునవన్నీ  చిక్కులైయున్నవి.  చిక్కులెక్కడున్నా అవన్నీ మాయగాక మరేమీగావు.  ప్రకృతి తెరచిన పుస్తకము.  కానీ మనచూపులను ఎంతగా అపసవ్యంగా చేసుకొన్నామంటే అవి ఇక మన చూపులకాననంత దశకు దెచ్చుకున్నాము.  ప్రియ సోదరా! మొరటుగా చెప్పాలంటే  మన నైపుణ్యము తలక్రిందులు అయింది.  వాస్తవికతకు ఎదురుగా నిలబడినప్పుడే అది బహిర్గతమౌతుంది.  అంటే మనం వస్తువును గురించి యోచిస్తే దాని సత్వం వైపుకు కూడా ప్రాకగలము.  అప్పుడీరెండింటిని అంచనా వేసి సత్యతత్త్వపు ఊహ చేయగలుగుతాము.  ఇప్పుడు నేను నిన్ను మినహాయించి శాస్త్రజ్ఞుల అంతరంగాన్ని బహిర్గతం చేయాల్సివుంది. జనం నాతో చెప్పడమే గాక నాయోచనకూ అది తట్టింది.  అదేమంటే శాస్త్రజ్ఞులు గొప్పగా ప్రయత్నించి మానవుని పదార్థశక్తికి బానిసగా చేయగలిగారు.  ప్రకృతిపై అధికారముగలదని చెప్పు యోగము ద్వారా ఇంకా ఏఏవాటిపై గురిపెట్టగలము?  కానీ, ప్రియ సోదరా! సామాన్య సర్కస్‌వాళ్ళు కూడా పులివంటి కౄరజంతువును అదుపులోనికి తెచ్చుకొని వాటితో అద్భుతలఘువులు చేయించుచున్నారు.  కొన్ని వశీకరణ శక్తులతో శాస్త్రవిషయములను కూడా అధిగమించ వచ్చును.  కానీ కౄరస్వభావమును ఏ ద్రావకము ద్వారా కూడా అదుపుచేయడం కుదరదు.  అందువలన ఈ సర్కస్ కళాకారుడు శాస్త్రజ్ఞునికన్నా ఎంతో గొప్పవాడు.  ప్రియసోదరా! ఇదంతా మానవ మేధయొక్క అభివృద్ధిద్వారా సుసాధ్యము.  మేధ పదార్థసత్వశక్తిని అదుపు చేయగల శక్తివంతము.  కానీ ఆధ్యాత్మికమేధయొక్క పని లేక దాని పురోగతి అంతకంటే భిన్నమైనది.  ఇక్కడ పదార్థశక్తి పని చేయజాలదు.  దీనియందు దైవజ్ఞానమున్నది మరి దానియందు మానవజ్ఞానమే యున్నది.

 

        మానవుడు ప్రకృతి సిద్ధమైనతాత్త్వికుడు అన్న నీయోచన సరియైనది.  అందుకు తగిన నిదర్శనములున్నవి.  బిడ్డ జన్మించి కాస్త చూపు సారించగనే ఒక విధమగు అద్భుతవిషయము గోచరిస్తుంది.  అది సమస్త పదార్థ మరియు ఆధ్యాత్మికసారము.  కొందరు ఫలాలను ఆరగిస్తూ సంతోషిస్తారు.మరికొందరు చెట్ల సంఖ్యను లెక్కపెట్టుకుంటూ కూర్చొంటారు.  కానీ వీటికన్నిటికి ఆధారభూతమైనది మాత్రము అద్భుతము.  శాస్త్రజ్ఞుడు పదార్థపు గందరగోళంలో నిమగ్నమౌతాడు.  ఆధ్యాత్మికాన్వేషకుడు అది వదలి అన్ని ఛాయలకు ఆధారభూతమైన ఛాయను చేరుతాడు.  తెల్లపాషాణము యొక్క గుణము తెలుసుకొంటే చాలు,అదికలిసియున్నపదార్థలన్నీ విషమయములని నిర్థారించేస్తాము. మరోవిధంగా చెప్పాలంటే దానిలోకలిసే పదార్థలన్నీ విషాలౌతాయనవచ్చు.  ఈ ఒక్కవిషమే మిగతా పదార్థాలు విషంకావడానికి ఉపయోగపడుతున్నది.  ఎందుకంటే ఈ తెల్లపాషాణము యొక్క ప్రతి కణములో ఇమిడియున్న విషలక్షణము దానితో కలిసిన ఇతరపదార్థమును విషమయము గావిస్తున్నది.  శక్తి ఈ విధంగానే పదార్థంలో పనిచేయుచున్నది.  ఈ ఉదాహరణ చాలు, "అన్నిటితో కలిసిన" మరియు "అన్నిటితో విడివడిన" స్థితిలో సత్త్వమెలావుంటుందీ? అన్న నీ ప్రశ్నను సమాధాన పరుస్తుంది.  ఆధ్యాత్మికపురోగమనంలో అభ్యాసి పదార్థమేలేని మహాప్రళయానంతర స్థితిని పొందుతాడు.  ఎందుకంటే ఇంకా పదార్థముందంటే అది మహాప్రళయమనడం అర్థరహితమౌతుంది.  నేను పదార్థమును శాశ్వతమైనదిగా గణించను.  ఆత్మఒక్కటే నిత్యము.  ఒకవేళ అదే అన్నిటికీ కారణమైతే, అది తప్ప మరేదీలేని కాలమొకటి వుంటుంది.  కనుక పదార్థము విశ్వసృష్టి తరుణమున ఏర్పడినదని నిరూపింపబడినది.  ఏమీటీ పదార్థము?  మథన ప్రక్రియలోని కదలికలతో జడపదార్థము రూపుదాల్చింది.  ప్రతీదీ గుండ్రముగా ఏర్పడుతున్నదనడంలో ఎంతో ప్రశస్తమైన తాత్వికత ఇమిడియున్నది.  కారణమేమంటే ఆ మహానిర్మాణ నిపుణుడు (భగవంతుడు) విశ్వ సృష్టి చేయాలని సంకల్పించి శక్తిని వినియోగపెట్టెను.  ఆ శక్తియొక్క చలనము గుండ్రముగా తిరిగి వలయము పూర్తిచేసి శక్తి పనిచేయడం మొదలయ్యింది.  నీవు ప్రాణాహుతి ప్రసారం చేయునపుడుకూడా అది వలయాకారములోనే ప్రవహించి అభ్యాసిని ప్రభావితం చేస్తుంది.  అందుకే మనం ధ్యానానికి కూర్చోనేటప్పుడు కూడా వలయాకారంగా కూర్చొంటే, అది కూడా కొంత మనకు సహాయకారిగా వుంటుంది.  చర్యయొక్క తీవ్రత వలన ఈ శక్తి గాఢమై స్థౌల్యముగా పిలువబడుతుంది.  ఇప్పుడు నీవు అభ్యాసిలోని ఈ స్థౌల్యతను తొలగించి అభ్యాసి ఆపాదమస్తకము సత్త్వముగా మారునట్లు చేయవలసియున్నది.  షామ్స యె తబ్రేజ్ శిష్యుడూ, రాజూ మరియు సాధుపుంగవుడు అయిన మౌలనా రూమీ ఇలా అన్నాడు--

"అతడు తనకైతాను స్వతంత్రుడు మరియు

అతడు తనచేతనే తాను బంధితుడు కూడా."

               ఇది ఏకత్వపు ఉనికికి సరియైన వివరణ.  ఇది నేను నమ్మజాలను.  ఏకరూపమునకు మార్పుజెందుటను నేను నమ్మువాడను.  అయినప్పటికి శక్తి వేరొకమలుపు గైకొన్నదన్న సత్యముపై తగిన వెలుగు ప్రసరింపజేయబడినది.

        పదార్థతత్త్వము లేక ఆత్మతత్త్వముపై సంపూర్ణాధికారము పొందుటకు ఒక ప్రక్రియ వుండవలెనని వ్రాసితిని.  ఒక కర్మాగారము పనిచేయుచున్నప్పుడు శక్తి ఒక యంత్రము నుండి వెలువడి అన్ని భాగములను తిరిగేట్లు చేస్తుంది.  ఇప్పుడు నీవొకచక్రమును చేతపట్టుకొని యంత్రాన్ని నిలపాలని ప్రయత్నిస్తే నీ చేయి తునాతునకలై పోతుంది.  ఆవిధంగా నీవు యంత్రాన్ని అదుపు చేయలేవు. నీవు యంత్రాన్ని నిలపాలంటే దానిలోనికి ప్రవహిస్తున్న శక్తిమూలాన్ని అదుపు చేయాలి. అప్పుడు యంత్రం ఆగిపోతుంది.  ఇప్పుడు దీనివలన మనకర్థమైనదేమంటే, పదార్థతత్త్వాన్ని అదుపు చేయాలంటే ఆధ్యాత్మికత్వంపై (ఎఱుకపై) అదుపుగలిగి వుండాలి.  మనందరం చేస్తున్నదదే.  నీకు ఆధ్యాత్మికతపై అదుపు సాధించే ప్రక్రియ ఇప్పటికే తెలుసు అందుకొఱకు సాధన మరియు సత్సంగము అత్యంతావశ్యకములు.  ఐనప్పటికీ నేనొక విషయం చెబుతాను.  ఆధ్యాత్మికతపై అదుపు సంపాదించడానికి నీవు ఆధ్యాత్మికతకు కారణభూతమైన దానిలోనికి (ఎఱుకలోనికి) ప్రవేశించాలి.  మరి ఇప్పుడదెట్లు సాధించాలి?  మనం దానివైపు మరలాలి.  దాని స్వచ్ఛత తాజాతనంలో మార్పురావాలి.  మనపరిసరాలు మారిపోవాలి మరియు సహజత్వం నెలకొనాలి.  అప్పుడు నీవేది సంకల్పిస్తే అది జరిగిపోతుంది.  ప్రియసోదరా! తేలుతూ ముందుకు పద.  మూలాన్ని తప్పక చేరుకుంటావు.  లేక దానిపై నీకుండే అభిలాష తీవ్రతరమైతే ఇకనేముంది మొత్తం నది ఉప్పొంగి నిన్ను ముంచెత్తుతుంది.  ఆతర్వాత ఏ అభ్యాసము యొక్క అవసరమూ వుండనే వుండదు.

        ఇప్పుడు నీప్రశ్నకు జవాబు చెప్పడం ద్వారా నీకు కాస్తా ఆనందాన్ని కూడ కలిగిస్తాను.

        "నేను పదార్థతత్త్వసత్యాన్ని ఇంకా అర్థం చేసుకోలేక పోతున్నాను" అన్నావు.  నీయొక్క నిజతత్త్వాన్ని నీవు అర్థము చేసుకుంటే పదార్థతత్త్వ సత్యాన్నీ అర్థం చేసుకోగలుగుతావు.  అప్పుడు నీవు పదార్థన్ని సైతం కదిలించగలవు.

***


 

అమృత జల్లులు

 

        తన్నుతాను గొప్ప వివేకవంతుడను అనుకొనుట నిస్సందేహముగా ఒక అవివేకము.  అట్లే తన్ను తాను ఏమి తెలియని అజ్ఞానిని, అత్యంత బలహీనుడను అనుకొనుట మరీ అవివేకము.   ప్రతి ఒక్కరు ఎట్టి విభేదము లేకుండా పాటింపనగు భగవదాజ్ఞలను మనము అంకిత భావముతో యధావిధిగా అనుసరించ వలెను. తద్వారా ప్రభునిస్మరణలో నుండ యత్నించ వలెను.  మనిషి నిర్వర్తింపవలసిన సామాన్యవిధుల విశేషాంశము లన్నియు ఇందే ఇమిడి యున్నవి.”

 

అమృత జల్లులు

 

1.  జనులు ఏకాగ్రతలోనికి వెళ్ళడానికి యిష్టపడతారు.  కారణం అది వారి ఇంద్రియములకు ప్రీతికరంగా వుంటుంది.  కానీ నిజానికి ఇది ఆధ్యాత్మికాన్వేషణకు అట్టే సహాయకారి కాదు.  ఏకాగ్రత నేరుగా ఆలొచనలను  అదిమి వేయుటను సూచిస్తుంది.  మన దృష్టిలో ఆకర్షణ, వశీకరణ విద్యల అవసరం స్ఫురిస్తేనే ఇట్టిఆలోచన కలుగుతుంది.  కారణం అక్కడ మాత్రమే ఈ ఆలోచనా పరమైన భౌతికశక్తి యధేచ్చగా వినియోగింప బడుతుంది. అందువలన ఏవిధమైన ఆధ్యాత్మికావసరము నెరవేర్చబడదు. అయితే యిది ఒక వస్తువుయొక్క ప్రకృతిని, నైజమును మాత్రము విశ్లేషిస్తుంది.  కానీ దేన్నీ సాధించటానికి (పొందటానికి)  మాత్రమిది పనికిరాదు.  కనుక భగవత్ప్రాప్తికిది ఉపయోగపడు సాధనము కాదు.  అంతేగాక ఇది మనిషిని సత్పదార్థానికి దూరంగా వుండేటట్లు చేస్తూ వుంటుంది కూడా. ధ్యానమునకు ఆధారము స్వచ్చమైన ఆధ్యాత్మికత.  కానీ ఏకాగ్రతకు మాత్రము అహమే ఆధారం.  నీవు ఏకాగ్రతతోవున్నావు అంటే అక్కడ "నీవు" ఖచ్చితంగా వున్నావు.  కానీ నీవు ధ్యానం చేస్తున్నావంటే ఏదో ఉన్నతోన్నతమైన దాని కోసం ఎదురు చూస్తున్నావు. అంటే "నేను" అన్న భావానికి లోనుగాకుండా వున్నట్లే.

 

2.  వ్యక్తిగత ప్రళయము మాత్రమే సంపూర్ణ విజయము సాధించుటకు ఏకైక మార్గము.  ఎవరైనను ఈ మార్గమునకు కట్టుబడి పయనించక తప్పదు.  అందుకు భక్తి, ప్రేమలు బహుఃశ ముఖ్యాంశములు గావచ్చును.  తన అహంకారమును తాను కరిగిపోయేటట్లు చేసుకొన్నవాడు,  పవిత్రోద్దేశము గలిగినదై ఉండదగినదనదగు అసలుసిసలైన వాస్తవజీవితమనే దివ్యమైన ఉనికిని అధిరోహిస్తాడు.  ఈ పని గురువు జీవించి యున్న కాలంలో అయితే చాలా సులభంగా జరుగుతుంది.  కారణం ఆయన శక్తి ఆకాలమంతా ప్రవహిస్తూ ఉంటుంది.  వారు చెప్పినట్లు ఆతర్వాత ప్రతీ దీపపుపురుగు ఆరిపోయినఅగ్నిలోతన్ను తాను దహించుకొనే సమర్థత గలిగిఉండదు.

 

సూచన: అగ్ని ఆరిపోవుటన్నది సామాన్యమైన గురువుల విషయము.  మహాత్మా శ్రీ రామచంద్రజీ వంటి ప్రత్యేకావతారమనదగిన గురువుల విషయమున కాదు.  అట్టి మహనీయుల దివ్య శక్తి ప్రసారము వారు శరీరము విడచిన వేలాది సంవత్సరములవరకు కూడా శ్రద్దాభక్తులు, ప్రేమ కలిగిన సాధకులకు అందుతూనే వుంటుంది.  వారి ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడుతూనే వుంటుంది.  ఇది స్వామీవివేకానంద వంటి మహనీయులు సైతం నొక్కివక్కాణించిన విషయము.

 

3.  హృదయమండలము తర్వాత మనోమండలము ఉన్నది.  అది "అహం" యొక్క స్థానము.  ఈ మండలము అధిగమించిన తర్వాత అహం సరిచేయబడిన స్థాయిని పొందుతుంది.  ముందుకు పయనిస్తూ కేంద్రమండలములో ప్రవేశిస్తాం.  అక్కడ అహం మార్పుచెంది ఒక గుర్తుగా మిగిలి వుంటుంది.  ప్రారంభంలో అహం స్థూలంగా వుంటుంది.  ఒకదాని తర్వాత ఒకటిగా వలయములు దాటుకుంటూ వెళ్ళేకొలది అహం కరిగిపోతూ కరిగిపోతూ సూక్ష్మాతిసూక్ష్మస్థితికి చేరుకుంటుంది.  ఆఖరుకది అంతరించిపోయిందేమోనన్న నామమాత్రపు స్థితిలో వుంటుంది.

 4.  ధ్యాన విషయంలో స్త్రీలు ఒకే సమయమునకు కట్టుబడియుండుట సాధ్యము కాకపోవచ్చును.  వారు వివిధములైన విధులు నిర్వర్తింప వలసి యుండుటయే దీనికి కారణము.  కనుక వారి విషయమున ఇట్టి నిబంధన సడలింపబడినది.  వారి తీరికవేళలను ఈ పనికై ఉపయోగపెట్టుకొనవచ్చును. దీనికి తోడు వారు తాము చేయుచున్న ఇంటి పనులన్నియు భగవదాజ్ఞానుసారమే చేయుచున్నామన్న తలంపుతో చేసుకుంటూ పోతే గడచిన సమయమంతయు పూజగానే మారిపోతుంది.  అదే పనిగా పూజ చేయకపోయినా వారు వారి ఎరుకలేకుండానే పూజలో వున్నట్లవుతుంది.

 

5.  చదువు మెదడును వ్యాకోచింపజేయడము మాత్రమే చేస్తుంది.  మనోవికాసమునకు తోడ్పడు అత్యంతప్రాధాన్యమైన విషయము మన సంస్కృతి.  అది మన ఆలోచనల మరియు చర్యల పొకడల నన్నింటిని క్రమ పరచును.  హృదయ గ్రంథమును నిశితముగా పరిశీలింపక కేవలం గ్రంథములను వరుసబెట్టి చదువుకుంటూ పోవడంవల్ల ఏమంత ప్రయోజనముండదు. నేనట్టే గొప్ప చదువరిని కాను, గనుక చదువు యొక్క నిజమైన అర్థమును గ్రహించుటలో నేను పొరబడి యుండవచ్చునేమో!  జ్ఞానరహితస్థితియందు నేనుద్భవించాను.  నేను మరింతగా అదేస్థితిలో వుంటున్నాను.  ఎందుచేతనంటే నేను చదవాలన్న తలంపుతో నాహృదయగ్రంథం విప్పగనే అందులో నాకు ఒకేఒక్క పదం కనబడింది.  ఆపదం "అజ్ఞానం" (జ్ఞానశూన్యం).

 

6.  "జ్ఞానమొక సుగుణం.  దాని భావము వాంఛారహిత స్థితిని సూచించును" అన్నది సోక్రటీస్ ఉవాచ.  ఆయన సిద్ధాంతం ప్రకారం అదీ విద్యయొక్క సారాంశం.  గొప్ప విద్య నభ్యసించడం ద్వారా ఎవరైనా ఆస్థాయికి ఎదిగితే ఆవిద్య సార్థకమైనట్లేనని నేను భావిస్తాను.  అది ఒక ఆధ్యాత్మిక స్థితి.  అది సాధించడం ఎలా?  అందుకు సులభమైన మార్గం సతతస్మరణమే (నిరంతర స్మరణ). దీనికి "తెగిపోని ఆలోచనా స్రవంతి" అను మాటలను కలుపుకుంటే సరి.  విధానము సంపూర్ణముగా అర్థమౌతుంది.

 

7.  నీకు చిన్నచిన్న విషయాలకు సైతం చిరాకు కల్గుతుంటుందని వ్రాశావు. ఈ దుర్గుణంనుండి బయటపడే విధానాల గురించి నీవు అనేక పుస్తకాలలో చాలానే చదివి వుంటావు. అయినా దీన్నుండి బయటపడలేక పోయానంటున్నావు.  మరి నీ చదువు వల్ల ఏమిటి ప్రయోజనం?  ఈ విషయమై శ్రీరామకృష్ణపరమహంస వారి వివరణ చూద్దాం.  ఆయన ప్రాధమిక విద్యనభ్యసిస్తున్న సమయంలో "ఎల్లప్పుడు సత్యమునే వచింపుము" అను పాఠమును ఒక రోజున ఆయనకు చెప్పి నేర్చుకొనిరమ్మనిరి.  ఆ తర్వాత ఆయనను ఎప్పుడు ఉపాధ్యాయుడడిగినను ఇంకా నేర్చుకొనలేదనే జవాబు చెప్పుచుండెను.  కొంతకాలం తర్వాత ఆపాఠము నేర్చుకొంటినని ఉపాధ్యాయునకు తెలిపెను.  ఇంత చిన్నవాక్యము నేర్చుకొనుటకు ఇంత దీర్ఘకాలము పట్టినదా?  కారణమేమని ఆశ్చర్యపడుచూ ఉపాధ్యాయుడడిగెను.  అప్పుడు బాలుడైన రామకృష్ణుడు అయ్యా! యిన్నిదినములకుగానీ నేను ఆవాక్యమును నిజజీవితమున అమలు జరిపి ఆచరణయోగ్యము గావించుకొనుటకు వీలుపడలేదని సవినయముగా తెలియజేసెను.

 

 8.  నేటివిద్య పాశ్చాత్య ఆలోచనా విధానపు గాఢవర్ణాచ్ఛాదనతో అవసరములు అత్యావశ్యకములై విపరీతముగా మారి అసాధారణ స్థితికి కారణ భూతమగుచున్నది.  మనుషులు వస్తుసముపార్జనకై మానసికముగా, శారీరకముగా తీవ్రమైన మనస్తాపమునకు లోనౌతున్నారు.  అదే వారి జీవితపరమార్థముగా మారిపోవుచున్నది.  అవి అందక అపజయములకు లోనైనప్పుడు విపరీతమైన అసంతృప్తికిలోనై మానసికఅశాంతితో సతమతమౌతున్నారు.  వారి కోపమునకు అసలు కారణము వక్రమైన వారి మానసిక స్వభావమే.  వారి మొండివైఖరి వారి విచక్షణాజ్ఞానమును మరగు పరచుచున్నది.  మంచి చెడ్డల మధ్యగల తేడాను గుర్తించు  జ్ఞానం యిందు మూలముగా నశించింది.  అందుచేత అతడు తన దృక్పథమునకే గట్టిగా కట్టుబడిపోయి యితరుల అభిప్రాయములకు ఏమాత్రము విలువనిచ్చే పరిస్థితిలో వుండడు.  ఇది ఆధ్యాత్మిక మార్గమున ఖచ్ఛితముగా ఒక పెద్దఅడ్డంకి.  ఆధ్యాత్మిక మార్గమున పయనించువాడు మానసికముగా అత్యంత తేలికదనము ఉత్సాహము గలిగి యుండుట ఆవశ్యకము.  తర్వాత ఏమౌతుందొనన్న ఆలోచనా భారము అతనిలోనుండరాదు.  వాస్తవమున బలమైన సంకల్పము యొక్క రహస్యమిదే.  ఈదినమున నేను దీనిని బహిర్గతము చేసితిని.  ఇట్టి సందర్భములలో అంతర్గతముగా స్థిరపడిన ప్రతిఆలోచనా "చర్యగా" పరిణమించి తీరుతుంది.  ఈ స్థితిలో శాశ్వతత్వం పొందడమంటే ఒకానొక మహత్తత్వాన్ని సాధించినట్లే.

 

9. మీరు సంతోషంగా వుండాలని నాఆకాంక్ష.  కానీ సంతోషము మనకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించుటలోనే యిమిడి యున్నది.  భగవద్గీత ఈ విషయమును నొక్కివక్కాణించుచున్నది.  వాస్తవమునకు యిదే ఆధ్యాత్మికత యొక్క ప్రాణము, ఆత్మయునైయున్నది.  తనకు కేటాయింపబడిన విధుల నిర్వహణలో ఎదురుకానున్న కష్టములను, దుఃఖములను ఎదుర్కొనుటకు సర్వదా ధైర్యముతో సంసిద్దుడుగా నుండ వలెను.  మనలను వెంబడించి వచ్చుచున్న జన్మజన్మల వ్యధలతో పోలిస్తే ఇదేమంత గొప్పకాదు.  ఇది ఒక చిన్న త్యాగము మాత్రమే.  మీకు నేను విధించే నిబంధన ఒకటే ఒకటి.  అది దైవముయెడల ప్రపంచముయెడల సక్రమ విధి నిర్వహణము.  అదియే చాలును.  అది మిమ్ములను ఈ జీవిత కాలములోనే బంధవిముక్తులను గావించును.

 

1౦. తప్పు తనయందే ఉన్నదని భావించి యితరుల చీవాట్లు, చీదరింపులను ప్రశాంతచిత్తముతో గ్రహిస్తూ ఓర్పు సహనమును అలవరచు కొనవలెను. మహోన్నత లక్ష్యసాధనకు ఇదేమంత గొప్పత్యాగము కాదు.  నాదృక్పథములు మీకు సమంజసమని తోచినట్లయిన దయచేసి వాటిని అనుసరించుటకు ప్రయత్నించండి.  ఇది మీకు మరింత ప్రశాంతతను ప్రసాదిస్తుంది.  ఇందులకు నీవు అశక్తుడవుగా భావించినట్లయిన దీనత్వముతోగూడిన హృదయముతో ప్రార్థనకుపక్రమించుము.  ఇట్లు చేసి చూడుము.  నీవు కోపము నుండి బయటపడగల్గితివో లేదో తెలిసిపోవును.

 

11. జనులు ఏపని చేసినా అది ఒక ఆకర్షక మనోల్లాసదాయకమై యుండవలెననుకుంటారు. అది ఒకానొక విషయంగా లభిస్తుందని కూడా అనుకుంటారు.  అదే విధమైన ఒకానొక పైమెరుగే మనిషిని భగవంతుని వైపు ఆకర్షిస్తుంది.  అందుకే పూజలోను ఆకర్షణకే ప్రముఖస్థానం. అట్లే భక్తిలోనూ, వైరాగ్యంలోనూ అంతేకాదు ప్రశాంతత, ఆనందంలోనూ అదే.  వారి ప్రయత్నమంతా మనోల్లాసమునకేగాని అసలు విషయమునకు కాదు.  ఇట్టి పైమెరుగుల పనులన్నీ సరదాకాలక్షేపమునకేగాని వాస్తవోద్దేశ్యమునకు మాత్రం సంబంధమే వుండదు.  భగవత్సాక్షాత్కారమునందు ఏవిధమైన బాహ్యాకర్షణలు లేవు.  అనుభూతులు లేవు.  ప్రశాంతతకు సంబంధించిగాని, ఆనందమునకు సంబంధించిగాని ఎరుకే లేదు.  అంతేగాదు సాక్షాత్కారానుభూతి కూడా లేదు.  అది నిశ్చలము నిరంతరము మరియు మార్పులేనట్టిస్థితి.

 

12. ప్రపంచము అవాస్తవము.  అది కలవంటిదని చెప్పబడుచున్నది.  మేధావులైన పెద్దలు అట్లు భావింపవలసినదిగా ఉద్భొదిస్తున్నారు.  కానీ కలలో మునిగి వున్నంతకాలం అది అవాస్తవమని ఎవరికీ అనిపించదు. అదే విధంగా మనం ఈ కలవంటి ప్రపంచంలో వున్నంత కాలం అది అవాస్తవమని అనిపించదు.  కల మనకు అవాస్తవమన్న విషయం మేలుకొన్న తర్వాతే తెలుస్తున్నది.  మరోమాటలో చెప్పాలంటే ఆస్థితి ముగిసేవరకు అది కలగా మనకు తోచదు.  అదే విధంగా మనం కూడా భౌతిక పరమైన ఎరుక పరిధిని దాటి ఆవలికి వెళ్ళినప్పుడే ఈ ప్రపంచం అవాస్తవమన్న విషయం తెలిసికో గలుగుతాము.  ఇది కేవలం అనుకోవడం, ఊహించడం లేక మాటిమాటికి ఈప్రపంచం అవాస్తవం, మాయ, భ్రమ అని వల్లిస్తూ వుండటంవల్ల కలిగే స్థితికాదు.  ఇట్టి స్థితి కలుగుటకు తగిన విధానము నవలంభించవలసి వున్నది.

 

13. ఒకానొక ఆధ్యాత్మిక స్థాయిలో అభ్యాసి పొందినస్థితి ఒక్కొక్కప్పుడు అంతకంటే పైస్థాయిలో కూడా ప్రతిబింబిస్తుంది. గురుకృపవల్ల ఈ ఫలితంతో వారు ఒకానొక స్థాయికి జాగృతమైనట్లు భావిస్తారు.  ఇట్టి సందర్భములో అభ్యాసి ఆస్థాయిని చేరుకున్నానని భావిస్తున్నాడని మాత్రమే అర్థం చేసుకోవలసి వుంటుంది.  కనుక అభ్యాసియొక్క ప్రగతి స్థితులు రెండువిధాలుగా వుంటాయి.  మా గురువర్యులు ఉర్దూలో తెలిపినట్లు ఒకటి "అక్సి" లేక ప్రతిబింబస్థితి.  ఇక మిగిలినది "కస్బీ" లేక పొందిన స్థితి.

 

14. ఇంకా శిక్షణ పూర్తిగాక ముందే కొంత బాధ్యతను భగవంతుడే వహించడాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాను. అభ్యాసి పూర్తి బాధ్యత భగవత్పరంకాగానే గురువు చేయవలసిన పనిపూర్తయినట్లే. అయినా ప్రకృతి కార్యము సజావుగా సాగుటకు అవసరాన్ని బట్టి శుద్దీకరణ కార్యము మాత్రము కొనసాగించ వలసివుంటుంది.  అభ్యాసి కేంద్రమండలము ప్రవేశింపగానే భవంతుని అధీనములోనికి వస్తాడు.  అందరి విషయము ఇట్లే వుంటుంది.  నా అతీంద్రియస్థితి ఈవిషయాన్ని తెలియజేస్తున్నది.

 

15. మానవత్వము భగవత్తత్వముతో ప్రభావితమై పోయినప్పటికిని మానవత్వము నశింపదు.  అది సామాన్యస్థితిలో వుండనే వుంటుంది.  కనుక భగవంతునితో అత్యంత సాన్నిహిత్యస్థితిని సాధించిన వారిలో నైనా ఈ మానవత్వపు సహజ లక్షణములు ఇంకా మిగిలే వుంటాయి.

 

16. పై (మూలము) నుండి మనము గ్రహించిన శక్తిని ఆజ్ఞాచక్రం పంపిణీ చేస్తుంది. ఆజ్ఞాచక్రంపై ధ్యానంచేసేవారు అనిశ్చితమును అనుభవిస్తారు.  నిశ్చల ప్రశాంతత వుండదు.  అటువంటి ధ్యానసాధనానుభవం నాకులేదు.  కానీ అట్లా వుంటుందన్నది నా యోచన.  "సహస్రార" పై ధ్యానం చేయడము ఆజ్ఞాచక్రంపై చేయడంకంటే మేలు.  మన అంతిమ గమ్యము ఎక్కడంటే మన శరీరము రాలిపోయిన అనుభవం గలిగినప్పుడే.  అక్కడ తన ఉనికికి సంబంధించిన ఆధారమే వుండదు. అదే అసలు సిసలైన శూన్యత్వము.  ఒక ఉర్దూకవి ఈస్థితిని ఇలా సూచించెను. "హమ్ వహా హై జహాసే హమ్ కొ భీ కుచ్ హమారి ఖబర్ నహీ హై" (ఎక్కడైతే మనకు సంబంధించిన సమాచారము కూడా మనకు తెలియదో అక్కడ మనమున్నాము).

    అక్కడ నుండి కార్యనిర్వహణ నిమిత్తం కాస్తా క్రిందికి దిగితే అప్పుడు మన సువాసనను మనం (దివ్యమైయున్నదానిని) అణువణువునా గుర్తిస్తాము.  ఆస్థితి కనీసమొక్క క్షణమైనా గమనింపులోనికి రాకుండా ఆస్థితిని అర్థం చేసుకోవడం అత్యంత కష్టము.

 

17. అభ్యాసులు ఆనందమును గూర్చి గ్రంథములలో చదివి అద్భుతమని దానినే గణించి దానినే పొందజూస్తారు. నిజమే అది చాలా సుఖదాయకమే కానీ అదే తుది కాదు.  నేను అభ్యాసులను ఆనందము మరియు అనానందము నుండి కూడా విడివడి వుండాలని కోరుకుంటాను.  నేను అందులకై ప్రార్థిస్తాను.  ప్రాణాహుతి ఫలితాలను గమనించినట్లైతే అందులో ఆనందానుభూతి అతితక్కువగా వుందని తెలుస్తుంది. అందులో నేను భగవత్సాక్షాత్కారస్థితి సారమును కలిపిఇచ్చే యత్నం చేస్తాను.  అది అభ్యాసులకు సౌఖ్యంగా వున్నదా లేదా అన్న విషయానికి నేను ప్రాముఖ్యమివ్వను.  అయినా కొన్నిసమయాల్లో ఇంతో, అంతో కొద్దిగా ఆనందాన్ని అందిస్తూ అభ్యాసి విసుగుచెందకుండా చూస్తుంటాను.

    దీనికి సంబంధించి ఒక సంఘటనను మీకు వివరిస్తాను.  ఆనాటి నాఆధ్యాత్మికస్థాయికి సంబంధించి మా గురువుగారిని అడిగాను.  ఇంత గొప్పగా చెప్పబడుతున్న మహదానంద స్థితి అంటే ఇదేనా?  దీని కోసం తమరు నాపై కృపతో ఇంతకాలం శ్రమపడి నాకు ప్రసాదించిందింతేనా? అన్నాను.  ఆయన చిరునవ్వు నవ్వి ఇలా సమాధానమిచ్చారు.  నీవు రుచిలేనిదిగా భావిస్తున్న నీ ఈస్థితిని నీ నుండి తొలగించివేస్తే యిప్పుడు నీపరిస్థితి ఏమిటి? అన్నారు.  వెంటనే నేను యిలాఅన్నాను.  నా ఈస్థితిని తొలగించే బదులు నేను మరణాన్ని కోరుకుంటాను.  నేను ఈస్థితికి రాక మునుపు కొన్నిసార్లు నేను ఆనందాన్ని ఆశించి వెనుదిరిగాను.  కానీ ఆస్థితులను నేను అధిగమించి యిప్పుడు ఆనందరహితస్థితిని చేరినాను.  ఈ రుచిలేని స్థితినుండి ఒక్క క్షణకాలం కూడా క్రిందికిదిగి ఆనందమయ స్థితికి రావడనికి ససేమిరా ఇష్టపడను.

    నేనిప్పుడు వివరించిన ఈ విషయాలను కేవలం ధార్మిక విద్యాపారంగతులు గాని లేక ఆ ఆనందరహితస్థితిలో యిప్పటికే వున్నవారుగాని మాత్రమే అంగీకరిస్తారు.  కానీ ఈ విషయాన్ని ఎవరైనా హేతువాద దృష్టితో విశ్లేషిస్తే వారికి ఇది ఒక ఉన్నత మనఃస్థితియని అది సర్వదా తనదైన ఒక పరిశుద్ధమార్గమున వ్యవహరించుటకు ఇష్టపడుచుండునని విశదమౌతుంది.  ఆత్మకు సంబంధించి ఇష్టాయిష్టాలకు తావులేదు.  అదిఅదిగా మాత్రమే వుంటుంది.  మహోన్నతస్థాయిలో వ్యక్తిగత మానసము మహత్తర కార్యనిర్వహణమున ఒక పనిముట్టుగా పరిణమిస్తుంది.

 

18. నేను, ఆజ్ఞాచక్రాన్ని, ధ్యానము చేయుటకు అనువైన బిందువుగా స్వీకరింపను.  పిండ ప్రదేశానికి సంబంధించిన శక్తి ఇందులోనికి చేరి ఆశక్తి క్రిందిప్రదేశానికి పంపిణీ చేయబడుతుంది.  ఈబిందువుపై ధ్యానం చేసేవారు ఒక విధమైన మెఱుపులు గమనించడం ద్వారా ధ్యానం అనిశ్చితికి గురౌతుంది.  కెంపువర్ణము అత్యంతస్వచ్ఛమైన స్థితికి సంకేతము.  అయితే వాస్తవం తెలియచేయవలసి వుంది.  అప్పుడు నాలో నేను సంతోషపడతాను.  బుద్ధ భగవానుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారో లేదో నాకు తెలియదు.  టిబెట్టు భౌద్ధులు  "ఓం మణి పద్మేహం" అని జపిస్తారు.  ఒక అద్భుత విషయం ఏమంటే బుద్ధ భగవానుడు తామరపూరేకులతో అలంకరింపబడిన పీఠంపై ఆసీనుడై యుండగా మిగిలిన బుద్ధులు ఆకాశంలో తేలుతూ కనబడతారు.  బుద్ధ భగవానుని స్వచ్ఛతను వారు అలా చూపించారని నేననుకుంటాను.

 

19. ఆజ్ఞాచక్రము లేక అంతకంటే  కాస్త పైనుండి ప్రాణాహుతి ప్రసారంచేస్తే అభ్యాసి తేలికదనాన్ని అనుభూతి చెందుతాడు. చిత్తసరసికి పైభాగానుండే బిందువుపై ప్రాణాహుతి ప్రసారం జరిగితే తేలికదనం కలుగదు.  శక్తిని భరించలేక ఒత్తిడికి లోనౌతారు.  రవి సర్వదా ప్రకాశించే పుణ్యభూపుత్రులము మనము.  ఇచ్చట అంధకారానికి ఆస్కారమే లేదు మరియు కాంతి కూడా వదలి వెళ్ళింది.  మన యోగులు పొగను చూచి అగ్నిని ఊహింపరు.  వారు ప్రతి ఒక్కరి ఆత్మావస్థను తెలుసుకోగలుగుదురు మరియు తమ ఆత్మస్థితిని కూడా తెలుసుకోగలరు.  కొద్ది ఏకాగ్రత చాలు. సర్వం అవగతమై పోతుంది.

 

2౦. మనస్సు తన సున్నిత స్థితితో సంబంధ మేర్పరచుకొనివుంది అంటే అది తనఆట తాను తనపద్దతిలో ఆడటం ప్రారంభించిందన్న మాట.  ఇది సాధనంగా అన్ని సిద్దులు, అద్భుతాలు ప్రదర్శించ గలుగుతుంది.  ఎంత కాలం మనిషి దాని చేతిసాధనంగా ప్రవర్తిస్తాడో అంతకాలం దానితో చుట్టబడి వుండిపోతాడు. భగవంతుని ఆజ్ఞలు ఆదేశాలు కేవలం మనస్సు అధీనంలో చిక్కుబడని వారికి మాత్రమే అందుతాయి.

 21. హృదయ మండలము శిఖరం (శిరస్సు పైభాగం) వరకు వ్యాప్తమై వుంటుంది.  ఆతర్వాత మనోమండలం వుంటుంది.  అది తలవెనుక బిందువు వరకు వ్యాప్తమై వుంటుంది.  నేను "రాజయోగ ప్రభావము" లో సూచించినట్లు ఒక అతీంద్రియస్థితి అక్కడ వుంటుంది.  కానీ అది ఎక్కువ చురుకుదనం కలిగి వుండదు.

 

22. బ్రహ్మాండమండలము ఆజ్ఞాచక్రము తర్వాత మొదలౌతుంది. ఈ మండలానికి పిండప్రదేశము దాటుకొని వచ్చి చేరుతాము.  కనుక   చిత్తసరసి బ్రహ్మాండంలోనే వుంటుంది.  అట్లే సరస్వతీ బిందువు యొక్క స్థానం కూడా ఇదే.  హృదయమండలము తలనుండి పాదముల వరకు వ్యాపించి వుంటుందని, సమస్త సృష్టి ఈ కేంద్రపరిధిలోనే వుంటుందని అంటే శిఖరం వరకు ఇదే వుంటుందని నేను "రాజయోగ ప్రభావం" లో తెలిపియున్నాను.

 

23. పరబ్రహ్మాండమండలం తర్వాత మరో మూడు స్థానాలు వున్నాయి.  వాటి స్థితుల కనుగుణంగా వాటికి పర్షియా భాషలో పేర్లు పెట్టినారు. ఇదంతా నాస్వానుభవం నాకు విశదపరచింది.  ఆ తర్వాత లెక్కలేనన్ని బిందువులు వున్నాయి.  వాటికొక్కోదానికి ఒక్కో ప్రత్యేకత వుంది.  నేను వీటిపై ఒకదాని తర్వాత ఒకటిగా మామూలుగా పని పూర్తి చేసుకుంటూ వెళతాను.

    ఈ బిందువులన్నీ సహస్రార (శిఖరం) లోనే వున్నాయి.  ఈ శిఖరం తర్వాత హృదయమండలం అంతమౌతుంది.  తదనంతరం మనోమండలం ప్రవేశిస్తాము.  అక్కడ కూడా ఒకవిధమైన అతీంద్రియస్థితి నెలకొని వుంది.  దీన్ని గురించి "రాజయోగ ప్రభావం" లో నేను చర్చించలేదు. భగవంతుని కార్యములో ఉపయోగపడే ఒక సాధనం ఇది.  ఇతర అతీంద్రియ స్థితులన్నీ సామాన్యంగా మొగ్గస్థితిలో వుండి విడదీయగానే పూర్తిగా విచ్చుకున్న పుష్పాలుగా మార్పు చెందుతాయి. కానీ ఇది మాత్రం క్రిందివైపుకు వంగి వుండటం వల్ల పూరేకులు క్రిందివైపుకు వ్రేలాడుతుంటాయి.  దీని గుండా సాగిపోయిన అభ్యాసి కేంద్ర మండలం చేరుకుంటాడు.  ఈ అతీంద్రియస్థితి అతడు అద్భుత శక్తులు పొందుటకు సహాయపడుతుంది.  అయితే ఇవి ప్రసాదించడమనేది పూర్తిగా భగవదేచ్ఛపై ఆధారపడి వుంటుంది.  ఇవి అభ్యాసి రాబట్టు కోవాలంటే సాధ్యమయ్యేటివి కావు. అభ్యాసి కేంద్రమండలం లోనికి సంపూర్ణ భక్తి శ్రద్దలతో ప్రవేశించిన తర్వాత వాటికొద్ది అవే అతనిలో పొటమరిస్తాయి.  కానీ యిదంతా ఒక అనుభవమునకు సంబంధించిన విషయము.

 

24. కేంద్రమంటే సాక్షాత్తు భగవంతుడే.  గురుకణము మరియు ఇతరకణములన్నియు ఆయన సృష్టే.  ఎవరైనా ఈ కేంద్రాన్ని తమ ఊహ ద్వారా గుర్తించి దానిపై ధ్యానం చేయడానికి ప్రయత్నించినా ఫలితాన్ని పొందలేరు.  దీనికి నేను "అనంతం వైపు" లో సూచించిన దొక్కటే మార్గము. కానీ నేను ఈ పనికి పూనుకోవద్దనే అందరిని హెచ్చరించాను.  నేను రెండు సార్లు గురుదేవులను ప్రార్థించి కేవలం రెండు, మూడు సెకెండ్ల కాలం ప్రయత్నించాను. అక్కడున్న బాహ్యవలయంయొక్క మహాశక్తిని గుర్తించి నాహృదయాన్ని జాగ్రత్తగా పదిలపరచుకోవడమే గాకుండా మాగురుదేవుల శక్తివంతమైన దివ్యహస్తం నాకు రక్షణగా వుందన్న ధైర్యంతో కూడా నేను కేవలం లోనికి తొంగిచూడగలిగాను. అంతేగాని దానిపై ధ్యానం చేయలేక పోయాను. కారణం అక్కడ ఒత్తిడి హృదయం భరింపశక్యం కానంత అధికంగా వుంటుంది. అంతే గాకుండా అక్కడి వలయం దరిచేరకుండా వెనక్కు నెట్టుతున్న బలమైన శక్తి గలిగి వుంటుంది.  మా గురుదేవులు నేనీప్రయత్నము చేసినందుకు మందలించారు. ఇటువంటి ప్రయత్నము తిరిగి చేయవద్దని హెచ్చరించారు.

 

25. ఈవిషయములో నేను ఎందుకింత మానసిక వ్యధకు లోనయ్యానో అర్థం కాకుండా  వుంది.  ఆధ్యాత్మికోన్నత స్థితిమంతునకు యిటువంటి వ్యధ వుండటానికి వీలులేదన్నది స్పష్టం.  ఈ సందర్భంగా చాలాకాలం క్రిందట జరిగిన నా జీవిత సంఘటన ఒకటి చెబుతాను.  ముప్పై సంవత్సరాల క్రితం నాజ్యేష్ట పుత్రుడు, అప్పటికి నాకొక్కడే కొడుకు, వాడి తొమ్మిదవ ఏట చనిపోయాడు.  కాని అప్పుడు నేను అంతగా బాధపడలేదు.  కేవలం ఒక పెంపుడు చిలుక చనిపోతే గలిగేంత బాధ కూడా కాదది.  మన పద్దతిలో శిక్షణ పొందుతున్న ఒకతనికి నేను ఈ విధంగానే వివరించాను ఆనాడు. అప్పుడు నేను ఎనిమిది, తొమ్మిదేండ్ల అభ్యాసకుడను మాత్రమే.  కానీ యిప్పుడు నలభై ఏండ్ల అభ్యాసం తర్వాత అదేవిధమైన సంఘటనకు నేను చాలా వ్యాకులత చెందినాను.  ఎందుకింత వైరుధ్య భావన?  విద్యావంతులు, మేధావులు అయిన నాసహచరులు ఈ విషయమై శోధించి ఈ ప్రశ్నకు సమాధానము కనుగొందురు గాక!  ఆనాటి నాస్థితి నేటి నా ఈస్థితి కంటె మేలుగా వుండేదని అనుకోవలసి వస్తుంది కదా? కానీ నేను ఆనాటికంటే ఎంతో ముందుకు సాగి ప్రగతి సాధించితినని అనుకుంటున్నాను.  ఈమర్మము విప్పకనే యిప్పటికలా వుంచేద్దాం. కానీ ఒక సూచన మాత్రం చేస్తాను.  మానవత్వము (హృదయ మార్దవము) దివ్యత్వము సరిసమానంగా ప్రక్కప్రక్కనే కలసి ముందుకు సాగుతాయి.  నాదృష్టిలో పరిపూర్ణత అంటే ఇదే.

 

26. నీవు నీ ఉత్తరంలో ఐదు విధములైన విగ్రహములను వేరువేరుగా నిర్వచిస్తూ వ్రాశావు.  నేను మాగురువుగారు తెలిపిన మరో రకపు విగ్రహారాధనను కూడా వివరిస్తాను.  తన అలవాట్లకు ఎవడు బానిసౌతాడో వాడుకూడా విగ్రహారాధకుడేనని ఆయన తెలిపారు. ఇంకా చెప్పాలంటే మనమొకటి తలుస్తాము.  కానీ అది నెరవేరదు.  అదికూడా విగ్రహారాధనయే.  ఎవడు తన కుటుంబాన్ని, పిల్లలను అలాఅలా ప్రేమిస్తూపోతాడో అతడు కూడా విగ్రహారాధకుడే.  వస్తుసంబంధములైన వాటిపై వ్యామోహమంతా విగ్రహారాధనయే.  దీన్ని సమూలంగా నిర్మూలించడం ఎలా?  మన ఆలోచన అట్టివాటి ముద్రలు పడకుండా చేసుకోవడం వల్లనే అది సాధ్యమౌతుంది.  అట్టిది వచ్చిన వెంటనే స్వతఃసిద్దంగా వెనక్కి నెట్టివేయబడుతుంది.  కానీ అది చాలా దూరము పురోగతి చెందినపుడు మాత్రమే సాధ్యము.  మనము ఘనపదార్థములను పూజించుట మానివేయాలి.  తద్వారా అభివృద్దిని సాధించి ఆదశకు చేరగలము.  ఆత్మసాక్షాత్కారమునకు కావలసిన ఎన్నో సూచనలు ప్రత్యాక్షానుభవములద్వారా చూపి చెప్పినప్పటికి గూడా రాతి విగ్రహముల కొలచుట మానడంలేదు. నావద్ద కొంతమంది అభ్యాసుల ప్రత్యాక్షానుభవములున్నవి.  వారికి అప్పటికప్పుడు ఆత్మసాక్షాత్కారస్థితిని చూపగలిగితిని.  వారు ఆస్థితిని అనుభవించి ఎంతగానో అభినందించిరి.  కానీ వారి విగ్రహారాధన మాత్రము మానలేక పోయిరి.  కారణం వారు అంతగా వాటికి అలవాటు పడిపోయిరి.  మరి వారి విజ్ఞత అంతగా మొద్దుబారి పోయినది.  వారు వారి విచక్షణా జ్ఞానమును ఎప్పుడో కోల్పోయిరి.  అదే మన పతనమునకు కారణభూతమైయున్నది.  విచక్షణాజ్ఞానము నశించగానే భయము ప్రవేశించి స్థిరపడును.  వారి పూర్వీకులు చాలా కాలము నుండి చేస్తూ రావడము వలన వారు ఈ విగ్రహారాధన విడువలేకున్నారు.  ఇది ఒక కారణము.  మరొక కారణమేమంటే ఇది వదిలితే ఎదో ఉపద్రవం తమకు సంభవిస్తుందని వారు తలచడం.  ఇదీ మన దయనీయమైన కథ.

 

27. సోమరితనం కూడా పుట్టవ్రణాన్ని (కాన్సర్) కలిగిస్తుందన్నది నాకు కలిగిన ఒకానొక అనుభూతి.  సోమరితనం అనునది తనకుతాను దాసుడుకావడమేనన్న నిర్ధారణకు వచ్చినాను.  మరోమాటలో చెప్పాలంటే సోమరిపోతు తనకుతానే లొంగిపోవడం ద్వారా ఆధ్యాత్మికాభివృద్దికి ఆత్మహత్యా సదృశ్యంగా మార్చేసుకుంటున్నాడు.  నేను కూడా చాలా సొమరిని.  కానీ అది నాయింటిపనులందు మాత్రమే.

 

28. సందేహం లేదు;  లీనమవ్వడం జరుగుతున్నది.  కానీ మనిషి ఆస్థితిలో సత్యతత్త్వములో మునిగిపోయికూడా అవతలి దానితో అంటే ప్రపంచంతో కూడా లంకె వేసుకొనివున్నట్లు అనుభూతి చెందుతున్నాడు.  మానవత్వము కొఱకు ప్రకృతి యేర్పరచిన ఒక ప్రణాళిక ఇది.  ఇదిలేకుండా మనుగడ సాగించలేము.  మనము శాశ్వతముగా కన్ను మూసేవరకు మనము మనుషులంగా జీవించడానికి ఇది ఎంతో అవసరం.  ఇది ప్రకృతి రహస్యము.  ఈతపన కేవలం పైపొరలలోనే వుంటుందని నేను చెప్పుతున్నాను.  వాటిలోతుకు చొచ్చుకుపోతే అవి ఉధృతిచెందుతాయి. కారణం అక్కడ శక్తి వుంది.  అట్టిపరిస్థితి సంభవిస్తే ఆ ఆలోచనను మనసు నుండి సహజమైన శక్తి నుపయోగించి బయటకు పంపేయి.

 

29. సహజమార్గ శిక్షణా విధానము చాలా గొప్పస్థాయి గలిగినది.  అది మూలమును తగిలి కేంద్రము నుండి బాహ్యపొరల వరకు వ్యాపిస్తుంది.ఇది మధ్యాద్గామియైన (లోనుండి బయటకు వ్యాపించు) ప్రగతి.  లోతైన మరియు దీర్ఘకాలముండు ప్రభావాన్ని చూపుతుంది.  ఇతర పద్దతుల బోధించు బోధకులున్నారు. వారు స్థూలమైన పైపొరలలోని ఎఱుకను అంటిపెట్టుకొని అభ్యాసుల మెదడును స్థంభింపజేసి వారిలో నిశ్చేష్టస్థితిని కలిగిస్తారు.  అది అప్పటికి సాధకునికి ఆనందదాయకంగా అనిపించవచ్చు. కానీ తుదకది మెదడును మొద్దుబారేటట్లు మరియు తెలివిహరించుకు పోయేటట్లు చేస్తుంది.  సహజమార్గ విధానంలో మీరు అభ్యాసులలో అద్భుతంగా తెలివితేటలు వృద్దిచెందటం, అది దివ్యజ్ఞానంగా పరిణతి చెందటం గమనిస్తారు.  తగిన గ్రహింపుగలిగిన వ్యక్తులు తమలో క్రమేణ కలిగే పరిణామాన్ని గుర్తించ గలుగుతారుకూడా.

 

3౦. "సృష్టి జరిగే నాటికి మునుపే అణువులుండెను"......... ఇక్కడ అణువులని సామాన్యార్థములో వాడబడలేదు.  ఆణువంటే పదార్థపు అణువౌతుంది.  ఇప్పుడు భావిస్తున్న అణువుయొక్క రూపము నిజానికి సృష్టికి తర్వాతిది. అది సృష్టికి ముందు ఉనికిలో లేనిది. మరి అప్పుడున్న దేమీ? అంటే దాన్ని శక్తి అంటే మేలుగావుంటుంది.  అయితే యిక్కడ వాడిన పదం శక్తియొక్క అణువులు అనుకోవాలి.  అవే క్షోభ యొక్క లేక మొదటి కదలిక అనంతరం పదార్థంగా మారిపోయాయి.

 

31. "భగవంతునకు మనస్సు లేదు. మరియు ఉన్నతినొందిన మానవ మనస్సును భగవంతుడు ఆశ్రయించి సత్యసంధతతో సంబంధమేర్పరచుకోవలసి వుంది."  ఈ విషయంలో ఇంకో మాట చెప్పవలసి వుంది.  ఒక వేళ భగవంతుడు (బ్రహ్మం) మనస్సు కలిగివుంటే ఆ మనస్సు యొక్క కార్యకలాపము కూడా వుండి తీరాలి.  అలాంటప్పుడు ఆయన కూడా తన చర్యల ఫలితాలకు బాధ్యుడు అయితీరాలి. కానీ ఆయన ఈ చర్య ప్రతిచర్యల ఫలితాల కతీతుడన్నది సమస్తవిశ్వమంగీకరించిన విషయము, అంటే మనోవ్యాపారము లేదనే దాని అర్థము.  తుదకు మనస్సు లేదన్నట్టే తేలిపోయింది.  ఇంతకూ ఇంత చిక్కు ఆలోచనలు ఉత్పన్నం కావడనికి కారణం భగవంతునికి సంబంధించి అనేకమైన నమ్మకములుండటమే.  మన ఈ ఆలోచనతో చెప్పవలసి వస్తే నా ఉద్దేశ్యములో భవంతుడు బ్రహ్మంగా తన నిజస్థితిలో అన్నిటికి అతీతుడు. శక్తి, చర్య లేక ఎఱుకకు సైతం అతీతుడు.  ఇక మనస్సును గురించి చెప్పవలసిన పనేలేదు.  ఇప్పుడు ఆలోచిస్తే మానవుడు తన మనస్సుతో పనిచేస్తున్నాడన్నది కూడా వాస్తవం కాదు. అతడు తనకై తాను ఏపనీ చేయడం లేదు. అంతా భగవంతుడన్న మాద్యమం ద్వారానే జరుగుతున్నది. కనుక అది (మనస్సు) భగవంతుని పనిముట్టుగానే ఉపయోగ పడుతున్నది.

 

32. "పదార్థపుఅణువులను శక్తిగా మార్పు చేయవచ్చును" ఈదృక్పథం అంత వివాదాస్పదం కాదు.  ఎందుకంటే పదార్థము సూక్ష్మాతిసూక్ష్మ స్థితిలో శక్తిగా మార్పుచెందుతున్నది.  మరో మాటలో చెప్పాలంటే శక్తి స్థూలరూపములో వుండిన పదార్థమే. ఇది ఒక శాస్త్రసూత్రము.  నేను అర్థము చేసుకొన్న ప్రకారం నవీన శాస్త్రము కూడా దీన్ని అంగీకరిస్తున్నది.  ఇది మన ప్రాణాహుతి ప్రసార పద్దతికి అత్యంత ప్రాధమికాంశము. ప్రాణాహుతి, పదార్థాన్ని శక్తిగాను, శక్తిని దాని తుది ఆధారభూతమైన మూలముగాను మార్పుచేసే పనిని నిర్వహిస్తుంది.

 

33. శూన్యము లేక సున్నా (పూజ్యము) గా వివరింపబడుతున్న తుదిస్థితి వేరు.  ఆనందమయం అనునది ఒక తొడుగు (పొర). ఈ ఆనందమయకోశము ఐదు కోశములలో ఒకటి.  ఆధ్యాత్మికశాస్త్ర రీత్యా గమనించి నప్పటికీ ఈకోశములు నిస్సంకోచముగా పరిమితులకు లోబడినవే.  మనకు తెలిసినంతలో అన్నమయకోశము కూడా పరిమితికి లోబడియున్నదే. దేన్నీ తుది స్థితిగా గ్రహించడానికి వీలులేదు.  అంతిమస్థితి అన్నిటికీ అతీతమైనది.  అది మహదానందానికి కూడా అతీతమే.  ఈ విషయాలన్నిటిని గూర్చి నేనింతకంటే ఎక్కువ చర్చించను.  నీ అనుభవములో నీవే ఈ అన్నమయకోశాన్ని చేదించుకొని అవతలికి వెళ్ళినపుడు కావలసినంత వివరణ దానికై అదే నీకు అందుతుంది.

 

34. "నేరుగా కేంద్రంతో సంబంధమేర్పరచుకోవడం మానవమాత్రుడుగా కూడా సాధ్యమే.  అయితే ఈ భౌతిక నిర్మాణం, మహోన్నత ఎఱుక లేక కేంద్రము చేత స్వచ్ఛత గావింపబడివున్నప్పుడే ఇది సాధ్యమౌతుంది".  ఈ విషయం నేను మరోచోట ఎక్కడో నా దృక్పథం తెలియజేసినప్పుడు చర్చకు వచ్చినట్లుంది.  మహోన్నత స్థితిని అందుకునే విధానం కూడా నేనక్కడే తెలియజేయడం కూడా జరిగింది.  ఇది నిస్సందేహంగా మా గురుదేవుల బోధనలో అత్యంత ప్రత్యేకత గలిగివున్న అంశం.  సంపూర్ణ స్వచ్ఛత ఇట్టి గంభీర స్థితిని పొందుటకు అత్యంతావశ్యకమన్నది నిర్వివాదాంశము. ఏదియేమైనప్పటికిని దానిని పొందగల శక్తిసామర్థ్యములు కలిగి యుండుట కూడా దైవముయొక్క వరమే.

 

35. నా పుస్తకములో చర్చించిన వేదాంత విషయములకు సంబంధించి నేను చెప్పదలచు కున్నదేమంటే, నేను ఒక ఖచ్ఛితమైన ఉద్దేశ్యముతో ఈ విషయమును చేపట్టలేదు.  కనుక పుస్తకమున నిర్ధిష్టమైన వేదాంతవ్యాఖ్యానము వుండదు.  ఉన్నదంతా చర్చనీయంశమునకు నేరుగా సంబంధము గల్గిన విషయములు పలుచోట్ల నుండి గ్రహించి వుపయోగించుకోవడం జరిగింది.

 

36. ఒక వ్యక్తి శరీరముతోవుండగనే కేంద్ర మండలము చేరగలడన్న మహత్తర విషయము మా గురుదేవులు శోధించి బహిర్గతము చేసిరని నేను నా "రాజయోగ ప్రభావము" న తెలియ జేసితిని.  కేంద్ర మండలము ప్రవేశించగనే ఒక బంధము క్రింది స్థానములతో కలుపబడి యుండునట్లు ఏర్పాటు గావింపబడుతుంది.  అట్లు బంధం యేర్పడకపోతే ఆత్మ శాశ్వత శాంతిలోనికి దుమికేస్తుంది. అంతటితో ప్రాణంపోతుంది.  కనుకనే క్రింది స్థాయి వాయువులు కూడా అప్పుడప్పుడు అనుభవంలోనికి రావలసిన ఆవశ్యకతవుంది.  ఏదో విధంగా కేంద్రమండలం చేరిన గొప్ప మహనీయుని స్థితి సైతం ఇలానే వుంటుంది.

 

 37. శూన్యస్థితియగు మహోన్నత స్థాయిలో సైతం అదురు (విదలింపు) కాస్తా అయిన అనుభూతి చెందుతారు.  ప్రతీ స్థాయిలోను ప్రగతికి ఆస్కారం ఎప్పుడూ కనబడుతూనే వుంటుంది.  అంతా సక్రమంగావుండి భగవదీయశక్తి అందుతూ వున్నపుడు కేంద్రమండలములో ఈత మొదలౌతుంది.  కానీ యిదంతా వెలుగువలయాలు దాటిన తర్వాతనే జరుగుతుంది.  ఈత ప్రారంభించడానికి మహోన్నతశక్తి యొక్క సహాయం ఆవశ్యకమై వుంటుంది.

 

38. మా గురుదేవుల మహనీయబోధనల ప్రకారం శరీరంలోని ప్రతి రోమకూపమునకు ఒక శక్తి కేంద్రమున్నది.  అది ఒక్కొక్కటి ఒక మహాద్వీపము.  విశ్వంలో ఏమేమైతే వుందో అదంతాదాని ఆకాశగ్రహ సముదాయంతో సహా అంతా యిక్కడ నిక్షిప్తమై వుంది.  అవన్నీ వాటి సంపూర్ణ జాగృతిలోనికి రావలసి ఉంది.  నా సహచరులందరూ అట్టిస్థితినందుకోవాలని మనఃస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.  వారు అంతటి స్థితినందుకోవడానికి వలయు సేవచేయడనికి నాకు ఒక అవకాశము భవంతుడు కలుగజేయుగాక.  ఇదంతా మా గురుదేవులకు ఒక క్షణకాలపు కార్యము మాత్రమే.  అది ఆయనకే తగినది.  కానీ ఒక్కచూపుతో ఆశక్తిని గ్రహించగల సామర్థ్యమెవరికున్నది? నా సహచరులు ఇట్టి దివ్యశక్తిని గ్రహించగల యోగ్యులుగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నము మీద ప్రయత్నము చేస్తూనే వున్నాను.  కనుక మనం ఈ క్రమానుగత ప్రగతిదాయకమైన విధానమునకు ఎప్పుడూ అనుసంధానమై వుండవలెను.

 

39. అది ఎల్లవేళలా వుండనే వున్నప్పటికిని నేను మాత్రం ఆ కృప యొక్క అనుభూతిని పొందడంలేదనే చెబుతాను.  ఒక సదుద్దేశ్యముతో నేను ద్వంద్వము నాశ్రయించినప్పుడు మాత్రమే ఆ అనుభూతి కలుగుతున్నది.  అది కూడా దివ్యత్వము నుండి ఏదో క్రిందకు దిగుతున్నట్లనిపించినపుడు మాత్రమే జరుగుతున్నది.  ఇది ఒక చిత్రమైన స్థితి.  దీనిని వివరించడానికి మాటలు దొరకడం లేదు.

 4౦. శక్తి తీసివేయబడుతున్నదన్న భావన కలుగుతున్నదంటే అది బహుఃశ శూన్యమునకు అత్యంత సమీపస్థితి యని అర్థము. నేను శక్తి కావాలని ఎన్నడూ కోరను.  కానీ దాని అంతిమస్థితి వుండాలి. ఆ స్థితిలో శక్తి అవసరమైనప్పుడల్లా లభిస్తుంది.

 

41. వ్యక్తిగతంగా ఇది నా అభిప్రాయము.  మనకు ప్రాపంచిక జీవనానికి అవసరమైనవాటినన్నిటిని దూరముచేసి వాటి స్థానములో వుండదగిన విలువైన అంతర్గతజీవనమును ప్రసాదించినట్లైతే వాస్తవానికి మనం ఏమీ నష్టపోయినట్లు కాదు.

 

42. ఈమార్గమందు బాహ్యపరిసరములను సరిచేసుకొని జీవించుటన్నది అట్టే అతకని విషయము.  అంతకంటే అభ్యాసి తను        భగవంతునిఆజ్ఞకు బద్దుడై సాధన చేసుకొనుటకు అనువుగా పరిసర పరిస్థితులతో సర్దుకుపోతాడు.  భగవదేచ్ఛ బలమైనది.  దాని ఫలితంగానే పరిసర పరిస్థితులేర్పడతాయి. మనం వాటిని భగవంతుని కానుకలుగా స్వీకరించడం నేర్చుకోవాలి.  ఇది సామాన్య మానవులకంత సులభమైన పనికాదని నేనూ ఒప్పుకుంటాను.  సామాన్య ప్రతికూల పరిధులలో అతడు అశాంతికిలోనౌతాడు.  అయితే తన అధీనంలో లేని బాహ్యపరిస్థితులకు వ్యధజెందడం కంటే అతడు తన ప్రయత్నముచే తన స్థూలత్వాన్ని మెత్తబరచుకొనే పనికి పూనుకోవాలి.

 

43. ఆధ్యాత్మికాన్వేషణకని వచ్చు చాలా మందితో ఒక చిక్కువున్నది. వారు బయటకు చెప్పేది మాత్రం ఆధ్యాత్మికం.  కాని అంతరంగంలో వారు ప్రాపంచిక విషయములను తమకు రుచించే విధంగా తమ ఇచ్ఛకు అణుగుణంగా లభించాలనుకుంటారు.  అలా లభించకపొతే సంస్థను వదలివెళ్ళిపోతారు.  ఒకవేళ వారు కోరుకున్నది లభించినాకూడా వుండరు. ఎందుకంటే వాళ్ళు కోరింది లభించింది. ఇక వారికి దీనితో పనిలేదు.  ఇటువంటి వాళ్ళు అనేకం.  మాగురుదేవుల శిక్షణా పద్దతిలో వస్తుదృష్టితో సంబంధమే లేదు.  నాకు తెలుసు, కొంతమంది స్వాములు వస్తువులు సృష్టించియిచ్చి ఆకర్షిస్తారు.  వారు కొంతవరకు కృతకృత్యులౌతారు. కానీ వారు యివన్నీ చేయడానికి క్రమమార్గాన్నివీడి వ్యవహరించ వలసి వస్తుంది. వారు అనాధ్యాత్మిక మార్గానికి మళ్ళవలసి వస్తుంది.  ఇది నాకు చేదు మాత్రలు మ్రింగుతున్నట్లనిపిస్తుంది. నేను మాత్రము ఖచ్ఛితముగా మాగురుదేవులు నిర్దేశించిన పద్దతికే కట్టుబడి వుంటాను.  అనాధ్యాత్మిక మార్గము ననుసరించుటకు ససేమిరా యిష్టపడను.

 

44. నిస్సందేహంగా నేను నాదగ్గరికొచ్చే వారందరిని మార్చడానికి నాశాయశక్తులా ఆసమయంలో ప్రయత్నిస్తాను.  ఇది నా కర్తవ్యంగా నేను భావిస్తాను.  అదే సమయంలో వచ్చినవ్యక్తిపై కూడా కొంత బాధ్యత వుంటుంది.  అతడు మార్పు కొనితెచ్చే పని కొనసాగనివ్వాలి, సహకరించాలి.  ఇది జరగనివ్వనినాడు అతనికి దీక్షనిచ్చి సాధన కొనసాగించమని ప్రోద్బలము చేసినప్పటికి అతడు కొంతకాలానికి తెగత్రెంపులు చేసుకొని వెళ్ళనే వెళ్ళి తీరతాడు.

 

45. నా కష్టములు మిక్కుటములు. అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి.  చర్చించాలి, సమాధానపరచాలి.  వారిలో ఆతురతను స్థిరత్వాన్ని కలుగజేయాలి.  వారిని తీర్చిదిద్ది వారిలో మార్పును తీసుకురావాలి.  తుదకు వారిని సడలకుండా మార్గంలోవుంచాలి.  అయినా అవతలి వైపునుండి సంపూర్ణ సహకారం అందినట్లయితే యివన్నీ భరించడానికి అడ్డుచెప్పను.  కానీ కొందరి విషయంలో నాపరిస్థితి దయనీయంగా వుంది.  వారినుండి ఎట్టి సహకారము ఆందడంలేదు.  వారు నావద్దనుండి ఆశించేది బాహ్య వస్తుసముదాయం మాత్రమే.  మనపద్దతి విడుదలను (మోక్షం) మరీ అంతకంటే ఆవలిస్థితులను పొందుట కొరకు ఏర్పడినది.  కనుక ఇది అట్టడుగు భావనలకు బహుదూరము.  నన్ను కలిసిన మొదటి నాటి నుండి ఇదే నేను వారికి నేర్పుతాను.  కానీ దీనికై ఆతురత కలిగివుండే వారిలో పూర్తిస్థాయిలో పరిణత స్థితికి రావాలంటే కొంతసమయం పడుతుంది మరి.  నా వద్దకు వచ్చేవారిలో దానికై నిజమైన ఆతురత లేకపోవడంవల్ల వారిలో సహనము లోపించి అది లోతుగా మూలము తాకి క్రమంగా ఫలితము చూపే వరకు ఆగలేకపోతున్నారు.  అట్టివారి విషయంలో నష్టము నాకేనేమో ననిపిస్తున్నది.  మరి వారికి నేనేమి చేయాలి.  అన్నీ నేనే బలవంతంగా వారిలో చొప్పించాలి.  కానీ అది చాలా ప్రమాదకర సాహసోపేతమైన ప్రక్రియ.

 

46. దేశంలోని ఇటు భాగంలో ఒక సంస్థ ఆధ్యాత్మికతను ప్రబోధిస్తున్నది.  చాలా మందినే ఆసంస్థ తన అధీనములోనికి తెచ్చుకున్నది.  ఇందులో చేరిన వారు ఎవ్వరూ అందుండి బయటకు రారు.  నాకు తెలిసి కొంతమంది ఆ సంస్థతో విసుగుచెంది వ్యతిరేకతను కూడా పెంచుకున్నారు. అయినా వారు బయటపడరు. వారు సాధకులను నిర్భందించుటకొరకు అనాధ్యాత్మిక పద్దతులను అవలంబిస్తున్నట్లు నేను కనుగొన్నాను.  వారు సాధకులను మాయమాటలతో మభ్యపెట్టడము కొన్ని ఆకర్షణలకు కట్టుబడునట్లు చేయడమే గాక బెదిరింపులు భయపెట్టడము కూడా చేస్తున్నారు. నేను వారి ఆంతరంగిక స్థితిని గమనించిచూస్తే వారిలో ఒక్కరుకూడా ఆధ్యాత్మికంగా సాధించిందేమి లేదు.  వారు కేవలం స్థూలశక్తులకు లోబడి వుండిపోయారు.  ఏవిధంగా చూచినా వారిలో ఏఒక్కరూ సాధారణ ఆధ్యాత్మిక స్థితికి దరిదాపుల్లో కూడా లేరు.  సంతోషీంచదగ్గ విషయమేమంటే మన సంస్థలోని ప్రశిక్షకుల ప్రాణాహుతి ప్రసారాలలో ఇసుమంతైనా మాయ కానరాదు.  స్వచ్ఛమైన తరంగాలే వారినుండి అభ్యాసిలోనికి ప్రవహిస్తాయి.  నా ఉద్దేశంలో ఏవిధంగానైనా ఇటువంటి పద్దతులకు కట్టుబడివుంటే నిజాయతీ, భక్తి అంతటా వ్యాపింపజేయ వీలౌతుంది.  అటువంటి ఉన్నత వ్యక్తులు ప్రపంచపు వెలుగులోనికి రావడానికి సంసిద్దంకావాలని ప్రార్థిస్తున్నాను.  కాలమే వీరు సాధించిన ఫలితాలను వెలుగులోనికి తెస్తుంది.  అట్టి ఆత్మలను హృదయపూర్వకంగా ఆత్మేణా తయారు చేయడానికి మనం ప్రయత్నించాలి.  వారు రాబోవు ప్రపంచానికి ఉపయోగకరంగాను సహాయకారులుగాను వుంటారు.  కొంతమంది మనల్ని వదలి వెళ్ళిపోవచ్చు.  దానికై అంతగా చింతించపనిలేదు. వారు ఈ కొద్దికాలం మనతో వుండి సంపాదించుకొన్నది ఇప్పటి జీవితానికి ఉపయోగపడకున్నా తర్వాతి జీవితంలో అది వృద్దిపొంది మేలుకలిగిస్తుంది.  కనుక మన కృషి ఏవిధంగాను వృధాకావడంకానీ నష్టపోవడంగాని జరగలేదు.

 

47. మహోన్నతస్థాయికి చేరిన మహనీయునిలో సైతం మానవత్వ లక్షణాలన్నీ తుడిచిపెట్టబడవు.  అలా జరిగితే అతని ప్రాణాలు నిలువవు.  ఈ పరిమితి ఎప్పుడూ వుండి తీరుతుంది.  ఇదో అదో ఏదో ఒక పాత్రను అది పోషిస్తూనే వుంటుంది.  అది ప్రకృతి రహస్యం.

 

48. నా స్వల్పపరిజ్ఞానంతో "ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్" యొక్క అర్థాన్ని తెలియజేస్తాను.  భగవద్గీతలోని అధ్యాయం 8 శ్లోకం 9 లో భగవానుడు వెలుగురూపంలోనున్న అంతిమ సత్యతత్త్వాన్ని వివరించాడు.  అది ఉపాసనకు ఆధారభూతమైనది.  ఇది మొత్తమునకు ప్రారంభ బిందువు. "ఆదిత్యవర్ణం" లోని "ఆది" దీన్నే సూచిస్తున్నది.  దీనికావల సత్యతత్త్వముయొక్క మరింత సూక్ష్మస్థానము కలదు.  దీన్ని భగవానుడు ఈ అధ్యాయంలోనే 2, 21 శ్లోకాలలో వివరించాడు.  ఈ స్థానము అన్ని ప్రారంభములకు ఆవల యున్నది.  ఇక్కడ ఉపాసన సామాన్యంగా అవగాహనకు వచ్చే పరిస్థితి దాటిపోయివుంటుంది. ఉపాసనయొక్క అంతాన్ని గూర్చి దాని ప్రకృతి సిద్దమైన అనుభూతి స్థితిని అసలే చవిచూడని వారిముందు మాట్లాడటం ప్రమాదకరమౌతుంది.  "ఆదిత్యవర్ణం" వారికి అనుకూలంగా అదే అంతిమస్థితియని వివరించడం జరిగింది.

 

49. ఊహించటానికి, చూడటానికి, వినటానికి వీలుకానటువంటిదై అన్నిటికి ఆవలిదైనస్థితిలో ఆయనున్నాడు.  ఆయన సృష్టించిన కాంతి, శబ్దములను దాటుకొని వెళ్ళినప్పుడే మనం ఆయన్ను చేరగలము.

 

5౦. "అన్న" అన్న పదానికి అర్థం కనుగొనేయత్నంలో నీవు "అను" అను మూలం నుండి "శ్వాసించు" అని విశ్లేషించడం బహుచక్కని అంశం.

వ్యాకరణవేత్తలు కొన్ని సమయాల్లో పదముల సహజసిద్దమైన రూపాలను మరియు సత్యతత్త్వోన్నతిని గ్రహించడంలో విఫలమౌతారు.  కారణం వారు అక్షరవిన్యాసాన్ని అతితెలివితో విశ్లేషింపచూస్తారు.  భాషా పరిజ్ఞానంలో మాకెవ్వరు ’సాటి’ అన్న ధీమా ముందే దట్టించుకొని ఆలోచిస్తారు.

    మార్చి 3౦ రాత్రినేనొక చిత్రమైన కలగన్నాను.  జ్ఞాపకమున్నంత మేరకు వివరిస్తాను.  ఇది మీ "అన్న"కు అర్థం వివరిస్తుంది.  ఎలాగో నా మెడమీద ఒక బాకు వల్ల గాయమై నేను మరణించాను.  నన్ను ఒక నదిలో పారవేశారు.  నాకు ఊపిరి నిలిచిపోయింది. గుండె ఆగిపోయింది కానీ నేను మాత్రం జరిగిందంతా గమనిస్తునే వున్నాను.  ఒక వ్యక్తి నేను హత్యకు గురయ్యానని తెలుసుకొని పోలీసులకు సమాచారం తెలియ జేయాలనుకుంటున్నాడు.  అందుకై అతడు నన్ను క్షుణ్ణంగా పరిశీలించాడు.  అతడు నాడి గమనించాడు. అది నిలిచిపోయివుంది.  గుండె కూడా ఆడటం మానేసినట్లు గమనించాడు.  అంతేకాదు, శ్వాస ఆడటం మానేసినా నాకు మాత్రం అంతాతెలుస్తూనే వుంది.  అప్పుడు ప్రాణం తిరిగి లోనికి ప్రవేశించడం మొదలైంది.  నాడి కొట్టుకోవడం ప్రారంభించింది.  గుండె కూడా తన పని మొదలు పెట్టింది.  నేను నిద్రనుండిలేచి దీనిపై లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టాను.  ఒక నిర్ణయానికి వచ్చాను.  ఊపిరి నిలిచిపోయినా, ఇంకే ఇతర జీవప్రక్రియలు లేకపోయినా శరీరం ప్రాణరహితంగా క్రింద పడివున్నా ఎఱుక మాత్రం వుంటుంది.  దీనివల్ల తెలియవచ్చేదేమంటే ఎఱుకే జీవనానికి మూలకారణము.  ఊపిరి యొక్క రహస్యఛేదనము కొఱకు నాకు చూపబడిన దివ్యదృష్టిగా దీన్ని నేను భావిస్తున్నాను.

 

51. మిగిలిన అన్నిఅనుభవాలు గతించిన మీదటనే అంతిమ సత్యానుభూతి మొదలౌతుంది.  సాధ్యమైనంతమేర బ్రహ్మంలో లయావస్థ పొందినవాడు ఒక్కోసారి అందులో చాలా లోతుగాను ఒక్కోసారి పైపైన్నే వుంటాడు.  సంపూర్ణంగా నిత్య బ్రహ్మైక్యము పొందినవాడు ఎట్టి పనినైనను చేయగలడు.  కాని అతడు ఒక శిలావిగ్రహంవలె కనిపిస్తాడు.

 

52. లోపరహితమైన (పూర్ణ) సత్తాయందు దైవీయ స్వభావాలు ఉత్పన్నమౌతాయి. అది గనుక ఇతరముతో సంబంధము గలిగివుంటే అప్పుడది పూర్ణసత్యతత్త్వ విషయంపై వుండదు.  దానికి గడచిపోయిన వాటియొక్క ఎఱుకలేనిస్థితి యొక్క ఎఱుక వుంటుంది.  కాస్త సరిచేసుకుంటే విషయం సంగ్రహంగా తెలుసుకోగలుగుతాడు. సత్యతత్త్వపుశిఖరం చేరిన వారైనా వారిలో మానవత్వం మిగిలేవుంటుంది.

 

53. మార్పులేని స్థితిలో వున్నవారు సైతం ప్రాపంచిక పరిస్థితులతో అశాంతికి గురికావడమనేది నిర్వివాదాంశము. మానవత్వంతో బంధం వుండేతీరాలన్నది సత్యం కనుక ఇలా జరుగుతుంది.  అయితే అది చాలా స్వల్పం.  అది మనిషిని శాశ్వతసత్యంలోనికి దుమికేయకుండా ఆపుచేస్తుంది. మహోన్నతస్థితిలో వున్న వ్యక్తిలో మాటిమాటికి కలిగే పరిస్థితి ఒకటుంది. అతనిలో ఏఆలోచన మెదిలినా దాన్ని అతడు పూర్తి శక్తితో ఆలోచిస్తాడు. అకారణంగా ఫలితం మరింతతీవ్రతను సంతరించుకొంటుంది. వాస్తవానికి మన ఆలోచనాశక్తిని పనికి తగినంతగానే ఉపయోగించాలి. కుటుంబ భారము మన భుజస్కందాలపైయుండుట వలన ఆతురత జొరబడుతుంది.  అయితే ఆ ఆతురత తన హద్దులు మీరినట్లు అనిపించగానే మనం ఆవిషయాన్ని అప్పటికి వదలివేయాలి.

 

54. బాగుపడుతుందనే ఆశ భారతదేశానికీ, మొత్తంమీద ప్రపంచానికీ వుంది. ప్రపంచంలో మార్పు తీసుకువచ్చే నిమిత్తం పనిచేస్తున్న ప్రత్యేక మహాత్ముడు తనపనిని దాదాపు పూర్తిచేసినాడు. దాని ఫలితం భౌతికంగా భూమిమీదకు చాలా నిదానంగా వస్తున్నది.  ఒకవేళ దాన్ని పూర్తి ఊపుతో తీసుకొనివచ్చినట్లయితే ఆ ప్రత్యేక మహాత్ముని పని పూర్తికావడం వల్ల వెంటనే ప్రపంచం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.

 

55. ప్రాపంచిక కష్టముల విషయానికి వస్తే స్థూలస్థితిలో వున్నటువంటి ఏవ్యక్తీ వాటినుండి బయటపడలేడు.  మన అవతార పురుషులు కూడా ఈకష్టముల నుండి బయటపడలేదు.  జన్మజన్మలనుండి వస్తూనేవున్న ఈ కష్టాలను మనం ఆంతంచేసేయాలి.  కష్టాల్లోవున్న ఇతరులతో మనల్ని మనం పోల్చిచూసుకుంటే మనబాధలు కాస్త తక్కువగానే అనిపిస్తాయి.  ఎందుకంటే మన అంతరంగాన్ని ఏదో పరిపాలిస్తున్నది. అది దేన్నీ తీవ్రతరం కానివ్వడం లేదు.

 

56. సమర్థులైన ప్రశిక్షకులు సైతం ధ్యానసమయంలో ఆలోచనలు చొరబడుతూనే వున్నాయని మొరపెట్టుకొనుచున్నారు. ఈవిషయమై నేను మనఃపూర్వకంగా చెబుతున్నాను.  ప్రాణాహుతిప్రసారం జరుగుతున్నప్పుడు ఏర్పడే స్థితిని మాగురుదేవులు ఆయన రచనల్లో ఒక చోట యిలా తెలిపారు.  బోధకుని సూక్ష్మశరీరము అభ్యాసి శరీరంలోకి తెలిసిగాని లేక తెలియకుండాగానీ ప్రవేశిస్తుంది. అందువల్ల అభ్యాసియొక్క ఊగిసలాడుతున్న ఆలోచనాస్థితి ప్రశిక్షకునికి కూడా కలుగుతుంది. ప్రశిక్షకుడు బహుఃశ అదంతా తనదేనేమోనని అనుకుంటాడు. సంతోషం. నీకు చాలా మంచి అభ్యాసులు దొరికారు. కనుక చెడ్డ మరియు దూర్తమైన ఆలోచనలు నిన్ను చుట్టుముట్టే అవకాశంలేదు.  దురదృష్టవశాత్తు నాకు కొందరుండేవారు.  వారికి నేను ప్రాణాహుతి ప్రసారం చేస్తుంటే నాలో నాకు రోతగా వున్నట్టనిపించేది. ఆతర్వాత నేను వారిని మన సంస్థలో సభ్యులుగా వుంచుకోకుండా తిరస్కరించాను.  మరొకరి విషయంలో నేను ప్రాణాహుతి ప్రసారం చేస్తుంటే నాకు వివస్త్రలైన స్త్రీలబొమ్మలు కనబడేవి.  కారణం అతడు పక్కా వ్యభిచారి. అందువల్ల అతన్ని సంస్థలోనికి తీసుకోలేదు.  మాగురుదేవులు కూడా ఇటువంటివే రెండు అనుభవాలు గమనించారు.  సమర్థుడైన ప్రశిక్షకుడు ఇటువంటి ఆలోచనలు తనలో చెలరేగకుండా తగ్గించుకోవాలంటే అభ్యాసి వ్యక్తిగత మనస్సును అట్టి పనిచేయకుండా నిలచిపోవాలన్న తలంపు ప్రాణాహుతి ప్రసారంచేసే సమయంలో కలిగి వుండాలి.  ఇది కొంత సహాయకారి కానీ ఈపద్దతిని మాటిమాటికి ప్రయోగించరాదు. అలాచేయడంవలన అభ్యాసియొక్క వ్యక్తిగత విషయాలెన్నో అతని వ్యక్తిగత మానసంద్వారా ప్రశిక్షకునికి తెలిసిపోతాయి.

 

57. ఒక్కోసారి అభ్యాసి మహోన్నతస్థితుల అనుభూతులు పొందుతాడు.  కారణం భగవత్కృప అతనికి పైనుండి బోధకుని ద్వారా అందుతుంది. ప్రశిక్షకుడు తనకు తెలియకుండానే మహోన్నతస్థితుల నుండి ప్రణాహుతి ప్రసారం చేయడం జరుగుతుంది. సున్నితమైన అభ్యాసులు దాని ప్రభావాన్ని అనుభూతి చెందుతారు.

 

58. ప్రియసోదరా! నేనొక అత్యంత వాస్తవ సంఘటన చెబుతున్నాను.  నేను అభ్యాసకాలంలో చాలా తీవ్రమైన మంటతో బాధపడ్డాను. నారొమ్ములో కాలిన పుండ్లు ఏర్పడ్డాయి.  అవన్నీ పూలపాన్పులుగాను అగ్నిపుష్పాలుగాను తయారయ్యాయి.  నా ప్రశాంతతను విక్రయించేసి నేను ఆధ్యాత్మికతను దాటాను.  అంటే నేను అందుకోసం నా శాంతిని త్యాగంచేశాను.  ముందుకువెళ్ళేదారిలో ఎన్నెన్ని మజలీలున్నాయో ఆ భగవంతునకే తెలుసు.  అక్కడంతా ఆగుతూ ముందుకు ప్రయాణించాలి.  మధ్యమధ్యన వుంటూ ప్రయాణాన్ని నిదానపరుస్తున్న ఈ ప్రదేశాలగురించి నీకు ఒక ఉత్తరం వ్రాశాను. దాన్ని నీవు పరిశీలించవలసివుంది.  ఆవిషయాలు నాకిప్పుడు సరిగా జ్ఞాపకం లేవు. ప్రియసోదరా! అనుభవరీత్యా ఒక వ్యక్తి నుండి నిజమైన ఆధ్యాత్మిక ప్రయోజనం పొందగలమన్న విషయం అర్థమైతే అతను తన్నుతాను అప్పజెప్పుకొనితీరాలి.  ఇక్కడ మనం ఒక జీవితంలోనే కైవల్యాన్ని అందుకోవలసి వుంది. అందుకు మన సమస్తసంస్కారాలను సంక్షయం గావించుకోవలసి వుంది.  కొన్నింటిని అనుభవించుట ద్వారాను మిగిలినవి దహించి వేయడం ద్వారాను వాటిని పోగొట్టుకోవాలి. ఒక సంఘటన శ్రీ ఎక్స్ మీద వాలి వుంది, దానికి సంబంధించిన ఎఱుక నాకుంది.  అంతేగాక దీనికి మించి మరికొన్ని విషయాలు కూడా వున్నాయి. వాటిని గురించి అతనితో చర్చించాలి. అందువల్ల అతనికి కూడా విషయం అనుభూతమౌతుంది.  మాగురుదేవుని ప్రార్థించి తొందరగా అతనిలోనివన్నీ శుభ్రంచేసి అతన్ని సంతృప్తి పరచాలి.  అతని మేలుకోసం అతన్ని వుంచవలసినచోట వుంచాలి.  సరే ఏమైనా భవిష్యత్తులో ఇటువంటివి లోనికి ప్రాకిరాకుండా దయచేసి ప్రార్థన చేయి.

 

59. శరీర నిర్మాణాన్ని శుభ్రపరచడానికి నాకు చాలా మాసాలేపడుతుంది.  అందుకే శ్రీఎక్స్ అట్టే అనుభూతి చెందడంలేదు.  ఈ శుద్దీకరణ మనిషిని చేయడానికి అత్యంతావశ్యకం.  నేను ఈవిషయమై చాలా జాగ్రత్త వహిస్తాను.  ఇది ముఖ్యంగా లాలాజీ వారి ఆదేశం కూడా.  శ్రీ "వై" స్వతఃసిద్దంగానే పరిశుద్దుడు. కనుకనే తొందరగా ప్రయోజనం పొందినట్లు తెలుసుకోగలిగాడు.

 

6౦. ప్రియసోదరా! ప్రత్యేక అవతారపుసుషుడే అన్నీ చేయాలి. అంటే నీతిమార్గంలోకి అందర్ని తెచ్చివుంచాలంటే కుదరదు.  సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ కూడా దుర్యోధనుడు మరీ ఇంకా ఎంతోమంది బుద్దులను సరిచేయలేక పోయాడు.  ఆఖరకు మహాభారత యుద్దాన్నే జరిపించవలసి వచ్చింది. ఇప్పుడుకూడా యుద్దాలు జరిగి రక్తము స్రవించి ప్రపంచంలో అధిక భాగం నిర్మానుష్యమైపోయేట్లు జరిగే అవకాశమున్నది.  కేవలం శ్రీకృష్ణపరమాత్మ భక్తులుమాత్రం ఆయన్నుండి మేలుపొందుతారు. కనుక శ్రీ ఎక్స్ చెప్పినట్లు ప్రత్యేక అవతారపురుషుడే జనులను ఆధ్యాత్మికతవైపు మరలిస్తాడన్నది సరికాదు.  మనం ఆ ప్రత్యేకఅవతారపురుషుని వల్ల మేలు పొందుదుముగాక! అన్న నీ ఆకాంక్ష అత్యంత ప్రశస్తమైనది.

 

61. ఎవరిప్రమేయం లేకుండా వెలుగు దానికైఅదే ప్రసారమవ్వడమనేది సర్వసాధారణంగా ఏర్పడివున్న నియమం. ఆతని ఎఱుకలేకుండానే అతని నుండి జనులు ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతున్నారంటే అప్పుడతడు ప్రశిక్షకుడుగా చేయుటకు తగియుండును.

 

62. నీవు నీకై శ్వాసను ధ్యానసమయంలో ఆపవద్దు. దానికై అదే నిలిచిపోతే మంచిదే.  ఆధ్యాత్మికయానము చాలా పైస్థాయిలోవుంటే కొన్నిగంటలు కుడా శ్వాస నిలిచిపోయివుండవచ్చు.  మరియు ఆలోచనల తీవ్రత తగ్గినప్పుడు శ్వాసక్రియ నిదానమైపోతుంది.

 

63. ఏదైతే తీరినప్పుడు హృదయానందము, తీరనప్పుడు దుఃఖము, బాధ కలిగిస్తుందో అదే వాంఛ. ఫలితమేదైనా, అనుభవించేది మాత్రం నీవే. కర్త కూడా నీకై నీవే.  ఫలితం మీద గురిలేకుండా ఆజ్ఞానుబద్దుడై చేసుకుంటూ పోవడమే కర్తవ్యమనబడుతుంది. మహమ్మద్ గజనీ వద్ద అయాజ్ అనే ఒక బానిస వుండేవాడు.  వాణ్ణి ఆయన అమితంగా ప్రేమించేవాడు.  మిగిలిన సభాసదులకు రాజుగారి ఈచర్య నచ్చలేదు.  ఎందుకు మీరు అయాజ్‌ను అంతగా అభిమానిస్తున్నారు అని ఒకతను రాజును అడిగాడు.  కొంతకాలం తర్వాత రాజు సభాసదులను పిలిచి భారతదేశం నుండి తెచ్చిన ఒక విలువైన వజ్రాలచెట్టును తునాతునకలు చేయమన్నాడు. అది సభాభవనం పైకప్పునుండి వ్రేళాడదీయబడివుంది. సభలోని వారెవ్వరు దాన్ని తగలనైనాతగలలేదు. అప్పుడాయన అయాజ్‌ను పిలిచి ఆవజ్రతరువును కొట్టిపారేయి అన్నాడు.  వెంటనే అయాజ్ దాన్ని తునాతునకలు చేసి రాజుగారి ఆజ్ఞను శిరసావహించాడు.  రాజు సభలోనివారికీవిధంగా తెలియచేశాడు. "ఇదిగో చూశారుగదా! ఇందుకోసమే నేను అయాజ్‌ను ఇంతగా అభిమానిస్తున్నాను. అతడు నాఆజ్ఞను అమలుజరపడమే కర్తవ్యంగా భావించాడు. లాభనష్టాల గురించి యోచించనే లేదు." కనుక కర్తవ్యం కోరిక అనిపించుకోదు.

 

64. సత్యతత్త్వాన్ని హేతువాద మాధ్యమం ద్వారా చేరుకోలేము.  సత్యతత్త్వం కేవలం ఒక సాధనం (వాజ్‌దాని) మాత్రమే.  ఇది తిరుగులేని వాస్తవం.  సూఫీలు (ముస్లింతత్త్వవేత్తలు) ఎక్కువగా ఈసాధనాన్నే (వాజ్‌దాని) సత్యతత్త్వ స్థితిగా గ్రహిస్తారు.  మన తాత్వికులు అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళారు.  ఐనా వాజ్‌దాని పదార్థ సంబంధితము.  ఇందులో "నేను" (అహం) ఇమిడి ఉన్నది.  దీని ఆవలనున్న స్థితిని నిజంగా సత్యస్థితి అనవచ్చును.  హేతువాదము అక్కడకు ప్రవేశింపలేదు. వ్యక్తిగత మానసమునుండి "వ్యక్తిగతం" వెళ్ళిపోతే "మానసం" మాత్రం నిలుస్తుంది.  అది ఒకటే అయివుండి భగవన్మానసముగా పిలువబడుతుంది.  కేవలం అది మాత్రమే తన ఆత్మ నిజస్థితిని తన దృక్పథానికి తీసుకువస్తుంది.  హేతువాదం ఇతరవస్తువుపై తెచ్చిపెట్టుకొన్న (దిగుమతి చేసుకున్న) నీ ఆలోచనాపరిధికి మాత్రమే పరిమితమై వుంటుంది.

 

65. నాసత్సంగులు నన్నుమించి పురోగమించాలని నా మనఃపూర్వకమైన కోరిక.  అయితే యిదంతా ప్రేమ స్వయం కృషి మరియు భగవంతుని కృపపై ఆధారపడి యున్నది.  ప్రేమ, కృషి వున్నట్లయితే సంబంధం వృద్దిచెందుతూ వుంటుంది. మన  రోదనావస్థ ప్రభువు సన్నిధిలో తప్పక నివేదింపబడుతుంది.

 

66. వేచి కాచుకొని వుండటం కూడా ఒకరకమైన తీవ్ర స్మరణమే.  అది ఆధ్యాత్మికతకు ఎంతగానో మేలుచేస్తుంది.  ఓ కవి సైతం ఇలా లిఖించాడు. "ప్రేయసికోసం వేచియున్నపుడు కలిగిన ఆ ఆనందం కలుసుకున్నప్పుడు లేదు".

 

67. మొండిఛాందసత్వం తన ముందు తాను నిర్మించుకొన్న గోడవంటిది.  అది తన దారిని అడ్డగిస్తుంది.  ఇది ఎలాగో మనలో ప్రవేశించింది. ముస్లింలను వరుసగా గమనిస్తుండడం వలన ఈదుర్గుణం మనకు సంప్రాప్తమయింది. లేకపోతే ఒక్క అణువుకూడా నిలబడకుండా ముందుకు కదలిపోయే నదీప్రవాహంవంటిది మనకున్న విధానం.

 

68. ఈ విషయములన్నీ ఎప్పుడో ఒకప్పుడు వాటి ముద్రలు మనసుపై వేయక మానవు.  ఉప్పుగనిలో పడిన ప్రతివస్తువు ఉప్పగా మారిపోవలసిందే.  నీవు మన దేశపు ఒక ప్రాంతపు మేధావి వర్గముతో తారసపడతావు.  వారు వారి సాంప్రదాయపు కట్టుబాట్లనే ప్రేమిస్తారు.

 

69. నేనొకవేళ అంత్యముయొక్క స్థితిని వ్రాస్తే శాస్త్రజ్ఞులు నాపై మండిపడే అవకాశముంది.  కడపటి హద్దును గురించి వివరించడం అత్యంతకష్టమైన పనే అయినా ఈమాత్రం వ్రాయగలుగుతున్నాను.  అభ్యాసి తన్నుతాను మరియు భగవంతుని గూడా మరచిపోయినట్లయితే అప్పుడతడు ఈప్రపంచంలోనికి ఏరూపంలోను రాడు అని నిర్ధారించవచ్చును.  ఆస్థితిలో అతడొక సముద్రంలో మునిగిపోయి వుంటాడు.  అక్కడతనికి ’అది’ తప్ప మరేదివుండదు.  అంతకు ముందు పరలోకం కొరకు ఈ లోకం అమ్మివేయబడింది. ఇప్పుడతడు ఆ పరలోకం కూడా అమ్మేస్తే ఇక సత్యతత్త్వమే మిగిలి వుంటుంది.

 

7౦. ప్రేయసి ప్రియుణ్ణి తన ఇష్టమొచ్చినట్లు ఆడిస్తుంది. ఆ ఆటను కూడా ప్రియునికి ప్రేయసియే నేర్పుతుంది. ఆటకు సంబంధించిన పాఠముకూడా ప్రియుడు ప్రేయసినుండే గ్రహిస్తాడు.  నేను ఏర్పాటుచేసి వదలిన కదలిక సరియైనదైతే నిన్ను నీవే మెచ్చుకుంటావు.  తప్పయితే అందులో నీతప్పిదమే కనబడుతుంది.  నీవు దీనిపై అర్థవంతమైన దృక్పథంతో లోతుగా ఆలోచిస్తే ఈ ఆటంతా మనము ఆయన (భగవంతుని) వద్ద నుండే గ్రహించామనిన్నీ, ఆయన జ్ఞాపకమే భక్తులను ప్రేరేపించి తపనకు గురిచేస్తున్నదనిన్నీ గ్రహిస్తావు.

 

71. సృష్టిప్రారంభంలో అన్నీ మనమనుకొన్నట్లు సరియైన రీతిలో కొలతలకు, ప్రమాణాలకు తగ్గట్లులేవు.  అవి వాటి వాస్తవ ప్రతిబింబస్థితిలో రూపమేర్పరచుకొనివుండినవి. ప్రవాహం కంటికెదురుగా పారుతునే వుంది. దాన్ని ఏపదార్థంకానీ, అణువుగానీ అట్టిదేదిగానీ తెరగా ఎర్పడి చూపుకాటంకం కలిగించే పని చేయలేదు.

 

72. మొదట్లో నీవు చేస్తున్నటువంటిది సతతస్మరణ (నిరంతర స్మరణ). రెండవది, ఎప్పుడైతే మెదడు అలసటకు గురియౌతుందో అప్పుడు కూడా దాని (భగవంతుని) స్మరణ అదే ఫలితాన్ని కలుగజేస్తుంది.  మన లక్ష్యం విడుదల పొందుటే.  అంతర్గతస్థితి ఒకేవిధంగా వుండటం లేదనియు అది ఒక్కొసారి అత్యంత సున్నితంగాను తేలికగాను మరోసారి దానికి భిన్నంగాను వుంటున్నదని నీవు వ్రాశావు.  ఇది అట్లే కలుగుతూ వుంటుంది.  తేలికదనము, బరువుగా వుండటం ఒకదానికొకటి విరుద్దమైన స్థితులై అవి నీ అనుభవానికి రాకపోతే అత్యంత సూక్ష్మస్థితియైన మార్పులేనిస్థితికి గుర్తింపు వుండదు.  అంతేగాకుండా ఒక బిందువు నుండి మరోబిందువునకు చేరి, మనమున్న ఆ ప్రస్తుతస్థితిని వదలి ముందుకు కదలగానే బరువుగా వున్నట్లు అనుభూతి చెందుతాము.  ఈ స్థితి మరొక సూక్ష్మస్థితిలోనికి ప్రవేశించి పూర్వపుస్థితిని మరిపించి ఇప్పుడున్న స్థితిలో కుదుటబడేంత వరకు వుంటుంది. ఈ వరుస మొత్తం బిందువులన్నీ దాటి ఇక బిందువులే లేని స్థితి వచ్చేవరకు కొనసాగుతుంది.  కనుక ఈ పరిస్థితులన్నీ నీపురోభివృద్దిని సూచిస్తున్నాయన్న విషయం నీకు యిప్పటికే అర్థమైయుంటుందను కుంటాను.

 

73. దయచేసి మీరు నాకు ఏది అవసరం అనుకుంటున్నారో అది యిచ్చేయండి అని వ్రాశారు.  ఇంకా వ్రాస్తూ మీరు తప్పకుండా ఇస్తారని ఆశతో ఉన్నాను అన్నారు.  నేనెప్పుడు నీవాడినయ్యానో అప్పుడే నాదంతా నీదైపోయింది. ఇది నేను ప్రాపంచిక దృక్పథంతో యిచ్చిన సమాధానం.  నా నిజమైన కోరిక, నన్ను నేను పూర్తిగా అమ్మేసుకోవాలనుకోవడమే.  కానీ వాడుకగా కోనేవాళ్ళు వుంటారనుకుంటే ఒక్కడూ రావడంలేదు.  కారణం నేను నాకంటూ ఏ ధరా నిర్ణయించలేదు. కాలం అలావుంది.  నన్ను ఉచితంగా పొందటానికి కూడా ఎవరూ ముందుకు రావడములేదు. ఒకరకంగా చూస్తే అదీ సబబే.   ఓ పిడికెడు ఎముకలను తీసుకొని ఎవరు మాత్రం ఏమిచేసుకుంటారు.  "నానక్ బూదే బైల్‌కో కౌన్ బంద బస్తదె"  ఓ నానక్!  ముసలి ఎద్దును ఎవరు కాపాడిపోషిస్తారు.  కనుక ప్రియసోదరా! దయచేసి నన్ను కొనుక్కొవడానికి నిన్ను నీవు సిద్దపరచుకో.  అందువల్ల నేను ఇల్లిల్లు తిరిగి అరిచి నన్నునేనమ్ముకోవలసిన అవస్థ తప్పిపోతుంది.

    మరియు ప్రియసోదరా! మంచి ఆరోగ్యము సంపద కావాలని కొంత మేరకైనా కోరిక అందరిలోనూ వుంది.  ఇది సందేహాతీతమైన వాస్తవం.  కానీ నీసొంతమైన, నీవద్దనే వున్నదాన్నే నీవు వాంఛిస్తున్నావు. అందుకే నీవు దానికోసం ఎక్కువ తపన పడుతున్నావు.

 

74. నాకు సున్నాకున్న అర్థం ఇతరులవలె బోధపడకపోవడం సబబే. ఎందుకంటే ఒకసున్నా మరోసున్నా స్థితిని తెలుసుకోలేదు.  ఒక మరణించిన వ్యక్తి, శవము యొక్క స్థితిని తెలుసుకోలేడు. ఎక్కడ అన్ని ద్వంద్వాలు దూరం తొలగి మనం బ్రతికియుండి చచ్చినవాళ్ళమైపోతామో ఆ స్థితియని దీన్ని నీవు మరోవిధంగా పిలువవచ్చు. లేక మనం సంపూర్ణంగా విచక్షణాజ్ఞానం కోల్పోయి సత్యతత్త్వంలో లీనమైపోయి మరియు మనం ఏది సత్యమో ఏది అనుకరణో తేడా తెలియని స్థితిలో వుండిపోవడమన్నమాట.

 

75. ఎలా శ్రద్దను పెంపొందించుకోవాలి అని అడిగావు.  శిక్షకునిపై కొంత నమ్మకముంచి, తద్వారా కొంతమేలు అతనివల్ల అనుభూతమైతే అదే నిజమైన అన్వేషకుని హృదయంలో శ్రద్దను పెంపొందించడం మొదలెడుతుంది.

 

76. ఎప్పుడు హేతువాదదృక్పథం (తర్కం), అనుభూతి ఒక్కటౌతాయి?  అని ఒక చిక్కుప్రశ్న అడిగారు.  లైలా మజ్నులు ఒకేచోట జీవనం గడుపుతున్నప్పుడని చెప్పడం దీనికి సంక్షిప్త సమాధానం కావచ్చు.

బహా లైలా వ మజ్ను ఏక్ హి మొహమిల్ మే రహతే హై

వారి కలయికను దేహమాత్మ లేక మనస్సుబుద్ధి అని నీవు భావింప వచ్చును.  రెండూ తప్పక కలసి వుండవలసిందే.  ఇంకా యోచిస్తే హేతువాదం మరోరూపాన్ని సంతరించుకొని దివ్యజ్ఞానంగా పిలువబడుతుంది.  మరి ఇది సంభవిస్తే అనుభూతియొక్కరూపము కూడా అట్లే ప్రభావితమౌతుంది.  అంటే అనుభూతీ, హేతువాదం రెండూ సానుకూల నిర్ణయానికి రావడం మొదలౌతుంది. ఒకటి చూపెట్టేదిగాను మరియొకటేమో తెలియజెప్పేదిగాను వుంటాయి.  మరొకవిషయం, అనుభూతి ఆత్మకు అతి సమీపంగా తగులుకొని వుంటుందని నేను చెప్పగలను. బుద్ది ఈ    సామీప్యస్థితిని అనుభవిస్తుంది.  మరోమాటలో చెప్పాలంటే అనుభూతి ఆత్మకు సమీపంగానూ బుద్ది అనుభూతికి సమీపంగాను వుంటుంది.  ఏదీ ఎక్కడికి పోదుకానీ వాటి సరియైన ఉపయోగం మొదలౌతుంది.  నీ సతతస్మరణ బుద్దికి సంబంధించినది కాదు. అది హృదయమునకు సంబందించినది. దయచేసి మీరు మేధావులను గట్టిగా నిలవేసి హేతువాద అనుభూతుల విషయం అడగండి.  వారు సరైన సమాధానం యిస్తారు.  నేను చెప్పేది ఒక చదువుకొననివాని సమాధానం. సతతస్మరణ అనుభూతి చెందేది కాదు. అది చేయవలసినది. దాని పద్దతి నీకు ఇది వరకే తెలుసు.

 

77. వాస్తవం చెప్పాలంటే ప్రతిఒక్కరు మూడు ఋణాలు తీర్చుకోవాలి.  నీవు ఎలాగూ ఈ ఋణాలు తీరుస్తున్నావు. సోదరా! నేను ఋషిఋణమన్న పదానికి బదులుగా గురువుగారి ఋణమని మార్చడానికి ఇష్టపడుతున్నాను. నేను ఈ ఋణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను. మాగురువుగారు నన్ను ఎలా తయారుచేశారో అలాగే నేనూ అటువంటి వాడినొకణ్ణి తయారు చేసినపుడే ఆఋణం తీరుతుంది.  అయితే ఈ ఋణవిముక్తి చేసుకొందామన్నా అదీ నిజానికి ఆయన చేతుల్లోనే వుంది.

 

78. ప్రతి ఒక్కరూ ఈప్రాపంచిక జీవితంలో ఎదురు దెబ్బలు తినవలసిందే.  అది నీ జీతమునకు సంబంధించి నీకు తగిలింది. అది నీ ప్రియతముని వద్దనుండి లభించిన కానుక అని అనుకోలేకపోతే అది సైతాను నుండి లభించిందని అనుకో.  నీకు కొంత ధైర్యం కలుగుతుంది. భారముగాతోచడం భగవంతుని దయవల్ల నిర్మూలనమౌతుంది.  ఇప్పటికే బహుఃశ అది నిర్మూలనమై వుంటుంది.

 

79. ఇస్లాం నమ్మకం ప్రకారం మనమంతా ఆదాము బిడ్డలం.  ఆ ఆదాము తినవద్దన్న పండు తినడం వల్ల భూమి మీదకు త్రోసివేయబడ్డాడు.  అదేతత్త్వం మనలో కూడా స్వతఃసిద్దంగా వచ్చియుండాలి.  కానీ సోదరా! ఈ సంఘటన జరిగి కోట్లాది సంవత్సరాలు జరిగిపోయాయి. మన రక్తంలో ఇంకా ఆప్రభావమే ఎలా వుంటుంది?  ఆ ప్రభావము రక్తంలో కలిసి నశించిపోయింది.  కానీ అతని భార్య అవ్వా ప్రభావం మాత్రం మనల్ని వెంటాడడం వదలలేదు. తరతరాలుగా ఆమె ఏదో రూపంలో తారసపడుతూనే వుంది.  ఈ అవ్వాయే మనల్ని మన ఇంటినుండి స్వర్గానికి తీసుకవచ్చింది. అయితే మనం కూడా ఆమె పాదరక్షతో తన్నిన తన్నులకు భూమిమీద పడ్డాము. సోదరా! ఎంత పతనము! ఇప్పుడు మనం ఆమె వెంటబడటం మానుకుంటే మనం పోగొట్టుకున్న స్వర్గాన్ని తిరిగి పొందగలం. నేను ఆదాముగా నుంటినన్న యోచన మానెయ్.  సరే నీవు ఎక్కడి నుండి వచ్చితివో అదే ప్రదేశానికి చేరుకుంటావు.  ఆదాము హవ్వాల వంటి కథే మన హైందవమతంలో మనువు, శతరూపల కథ. నిన్ను నీవు ఆదాము అనుకోవడం మరచిపో.  నిన్ను హవ్వా నుండి విడుదల చేయడం నాబాధ్యత. నీవు ఎలాగైనా ఆదాము యోచన నుండి బయటపడడానికి రూపం మీద ధ్యానం చేస్తున్నావు. గాలిబ్ ఇలా వ్రాశాడు.

    "ఎప్పుడక్కడ ఏమీ వుండదో అప్పుడు భగవంతుడుంటాడు.  నేను ఇట్లా తయారు కాకుండా వుండివుంటే భగవంతుడనయ్యేవాడిని.  ఈ ’కావడం’ నన్ను దోచేసింది.  నేను సంభవించివుండకుండా వుండివుంటే ఏమయ్యుండేది?"

 

8౦. చీవాట్లు కూడా ప్రేమలో సహింపబడతాయి.  కానీ సోదరా! ఆచీవాట్లలో కూడా ఒక చిత్రమైన తియ్యదనముంది.  ఆ చీవాట్లు కూడా ప్రేమయొక్క మత్తునుండే వస్తాయి.  అటువంటివి ఎదో పనికిరాని నీతితక్కువవి గావు.  శ్రీకృష్ణుని ప్రేమలో సూరదాసు పలికిన ప్రసిద్దిగాంచిన మాటలను వ్రాస్తున్నాను.  "నేను బలహీనుడనని నాచేతికి చిక్కకుండా తప్పించుకుంటున్నావు.  కానీ నీవు నిజంగా మగవానివని నమ్మాలంటే నాహృదయంనుండి తప్పించుకోమరి". ఈ మాటలు తను గ్రుడ్డివాడై బావిలో పడిపోయినప్పుడన్నాడు.  కృష్ణపరమాత్మ అతన్ని గట్టుకు చేర్చాడు.  అప్పుడు కృష్ణపరమాత్మ చేయి గట్టిగా పట్టుకొని ఇక నిన్ను పోనివ్వనన్నాడు. కానీ కృష్ణుడు అతని పట్టువిడిపించుకొని పారిపోయాడు.

    అందరూ తప్పులు చేస్తారు.  పొరబడటం మానవ నైజం.  ప్రియ సొదరా! మాగురువు యితరులందరి తప్పులను క్షమించేస్తారు.  కానీ "నీ ఒక్కతప్పు కూడా క్షమించను" అని నాతో అన్నారు. నేను నిస్సందేహంగా సంతోషించాను.  అది ఆయనకు నాయెడలగల ప్రత్యేకప్రేమ.  ఒక కథ చెబుతాను విను ---- మజ్ను తన ప్రేయసి లైలా నుండి వేరుచేయబడినందుకు శరీరంనిండా బూడిద పులుముకొని అడుక్కుతింటున్నాడు.  లైలా ప్రతి గురువారం పేదలకు రొట్టెలు పంచి పెడుతుంది.  ఆమె ఉద్దేశ్యం మజ్ను కూడా తన బిక్షాపాత్రతో తనవద్దకు రావాలనే. ఆమె మజ్నూ బిక్షాపాత్రలో రొట్టెవేసే బదులు బిక్షాపాత్రను పగులగొట్టి పంపుతుంది. ఆచర్యకు మజ్నూ మత్తెక్కినవాడై ఆనందపారవశ్యంతో నాట్యంచేస్తున్నాడు.  "మిత్రమా! నీవు ఎంత అవివేకివి? అందరికి ఆమె రొట్టెనిచ్చి నీ పాత్ర మాత్రం పగులగొట్టింది.  నీవు మాత్రం ప్రేమాతిశయంతో నృత్యంచేస్తున్నావే?" అని జనులడిగారు.  అందుకు బదులిస్తూ "ఈవిధంగా నాకొక్కనికే ప్రత్యేకంగా చేసింది కదా! ఇదే ఆమె ప్రేమలోని ప్రత్యేకత" అన్నాడు మజ్ను.

 

81. నేనిపుడు ఎక్కువ ప్రయోజనం పొందలేకపోయాను అని నీవు ఆలోచించడంచూస్తే నీలో ఆధ్యాత్మికత కోసం తపన ఎక్కువైనదని తెలుస్తున్నది.  నీవు రూపంపై ధ్యానించడం ఏవిధంగానూ సాధ్యం కావడంలేదనిపిస్తే ఆరూపం నీఎదురుగావున్నదన్న యోచన మాత్రం పెట్టు. అదీవీలుకాకపోతే ధ్యానపుతీరు దానికదే వ్యక్తము చేయబడుతుంది.

 

82. ఫకీరు తిరుగుతూ వుండటమే మంచిది. నీవు నిలబడటానికి స్థానమే లేదు.  నీవు అంతిమగమ్యం ఎక్కడుందో అక్కడకు చేరుకునేలోపే అనందం కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడక్కడ నీస్థితి ఏమి? దాన్ని అజ్ఞానమన్నదాంట్లో కూడా కొంత ఏదో వుంది. అయితే ఒక పదముంది. అది సరైన అర్థమిస్తుంది. అదే "సంపూర్ణ అజ్ఞానం".  దీన్ని నేను మార్పులేని స్థితిగా పిలుస్తాను.  ఇదే అసలుసిసలైన  సత్యపుతెర.  ఆధ్యాత్మికత అప్పటికే ఏదో విధంగా వదిలేసింది. ఇది అన్ని శ్రమలకు ప్రయత్నాలకు సారభూతమైనది.  ప్రియసొదరా! దీన్ని జనులు ఎప్పుడూ కోరుకోలేదు. కోరుకొనివుంటే లభించివుండేదే. దాన్ని గురించి అవగాహన లేశమాత్రమైనా లేదు. మరి అట్టిదానిని ఎవరైనా ఎట్లాకోరుకుంటారు! మాగురుదేవులకు ధన్యవాదములు తెలుపవలసి వుంది. ఆయనే దీనికి సంబంధించిన విషయము ప్రజలదృష్టికి తెచ్చారు. ఇప్పుడు నీవు ఆ సంపూర్ణ అజ్ఞానమన్న పదభావం "అవును" "కాదు" కు మధ్యనున్నదిగా గ్రహించు. ఇది కబీరు మహాశయుని భావన. సరి ఇప్పుడు నేను అసలు విషయానికొస్తాను. ఎందులో ఏఆనందమూ లేదో అదే అసలైన ఆనందం. ఎంతకాలం ఆనందానుభూతి వుందో అంతదాక "మాయ" (జడత్వం) అందులో వున్నట్లే. నీవు నీ ఆనందస్థితి బరువుగా వున్నట్లు తెలిపావు. అంటే నీవు పరిమితులకు కట్టుబడి అజ్ఞానపు కేంద్రానికి బంధమేర్పరచుకొని వున్నావు అని నిరూపితమైనది. దీన్ని నీవు బరువు అనడంకంటే విసుగని అనివుంటే మరింత సమంజసంగా వుండేది. విసుగు అనడంవల్ల నీకు హాయిగా వుండే మందమారుతం కావాలని తెలుస్తున్నది. ఎందుకంటే నీవు ఎక్కువ ఆకాశపుటెత్తులో ముందుకు ప్రయాణిస్తున్నావు. శాంతి ఎప్పుడూ మజ్జుగా వుండదు. కారణం నేను పైనవివరించి యున్నాను.  రెండుకండ్లూ పోయేబదులు ఒకకన్ను మాత్రమే పోగొట్టుకొన్నటువంటి వాడే దీన్ని ఇష్టపడతాడు. అదృష్టవశాత్తు ఒక పూరిగుడిశలో వుండే వానికి మంచి సౌకర్యవంతమైన ఇల్లు లభిస్తే వాడు దాన్ని బాగా ఇష్టపడతాడు. అతడట్లే చాలా కాలం అలవాటుగా ఆ ఇంట్లోనేవుంటే, అతడు అంతకంటే మంచి ఇంటిని గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. నీవు విసుగు, మజ్జు అనుభూతి చెందడాన్ని వివరించడానికే ఈవిశదీకరణ ఇవ్వడం జరిగింది. నీవు వ్రాస్తూ నామనస్సు ఈస్థితి నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నది కానీ అందుకు నామనస్సు సిద్దంగాలేదు. అదే సమయంలో ఆస్థితులు కూడా నిజానికి శాంతి, ఆనందదాయకంగా లేవు అన్నావు. మనస్సుయొక్క సహజ లక్షణం లేక మనఃశక్తి మంచిని ఆస్వాదించాలనే అనుకుంటుంది.  అది పదార్థ విషయసంబంధం కానీ లేక ఆధ్యాత్మికం కానీ కావచ్చు. కనుకనే దానికెదురుపడిన ప్రతిదానితోను అది తగులుకుంటుంది.  అది శాంతి కావచ్చు లేక ఆనందం కావచ్చు.

 

83. నేను నీకు మార్గం చూపించాను. ఏదో ప్రత్యేకమైన మరియు అరుదైన పరిస్థితులలో తప్ప చికిత్స చేయడానికి అంతమంది వైద్యులుంటే మనం ఏమీ చేయలేము.  నీవు నిమగ్నమైన పని కూడా ఏమాత్రం తీసివేయదగింది కాదు. అది మరింత వృద్దిచెందే అవకాశమున్నది.  నీవు మసీహ (క్రీస్తు) కావలని ఇష్టపడటం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది.  అయితే అట్లా కావడానికి తొలుత నీలో నీవు బాధను ఉత్పన్నం చేసుకోవలసి వుంటుంది.

 

84. బోధకుని హృదయనిబ్బరం (ధీరత్వం) తో సడలని బంధమేర్పరచుకోవడమే శ్రద్దకు సరియైన అర్థం.

 

85. నేను అసలైన వజ్రాన్ని ఇవ్వగలను.  దాన్ని కేవలం ఒక వజ్రాలవ్యాపారి మాత్రమే నిగ్గుతేల్చగలడు.  ఒక గాజుల వ్యాపారి వజ్రాల విలువ గుర్తించలేకపోతే అది వజ్రంయొక్క దోషము కానేరదు. పర్షియా భాషలో ఒక సామెత ఇలావున్నది.గబ్బిళం పగటిపూట సూర్యుణ్ణి చూడలేకపోవడం సూర్యునిలోనిలోపం కానే కాదు.  ఇతరులెందరో మేలు పడుతుంటే ఒకానొక్కడు మాత్రం అదేదారిలో మేలుపడటం లేదంటే ఆ ఒకానొకనియందే దోషమున్నదని అర్థం.  ఎవరైన ఒక శిష్యునిగా లేక సత్యాన్వేషిగా నీదరిచేరితే వారు మేలుపడకుండా పోనేపోరు.

 

86. నీ సూక్ష్మగ్రాహ్యత విషయంలో నాకు ఏలోపము కనబడటం లేదు.  కానీ ఆత్మస్థైర్యము విషయమై కొంత లోపమున్నది. సంతృప్తి చెందిన భావము హృదయమున నెలకొనియున్నది. అది సరియైనదే.

 

87. నిజమైన ప్రేమ నెలకొంటే శరీరంలోని ప్రతి అణువు ఏడు మాసములలోపే మార్పు చెందుతుంది.

 88. వీలైనంత మితవ్యయము చేయువాడుగా వుండటానికి ప్రయత్నింపుము. మితవ్యయమంటే నాఉద్దేశ్యం పిసినారిగా మారి పిల్లలను ఇబ్బంది పెట్టమని కాదు.

 

89. నీసేవాధర్మమే నీ ఆధ్యాత్మిక శిక్షణలోనికి జనులను తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక మార్గగామి అతని ఆలోచనలకనుగుణంగానే పరిసర వాతావరణం సృష్టింపబడుతుంది. మనం మానవమాత్రులం. కనుక మానవ పరిజ్ఞానానికనుగుణమైన పద్దతులనే మనం అనుసరించాలి.  ఇది మన కర్తవ్యం కూడా.  కెరటం పైకెగిసిననేగానీ క్రిందపడి అణిగిపోదు.  మనం కెరటాన్ని పైకెగయజేస్తూనే వుండాలి. నేను ఏవిధమైన ప్రచారాన్ని చేయడానికి ఒప్పుకోను. అయినప్పటికి సేవాభావం లోపించినట్లయితే మన ప్రతిచర్య దానికైఅదే శుష్కప్రచారంగా మార్చుకుంటుంది.  కనుక దయచేసి సేవాభావానికి మారండి.  మనం ఆపనేచేస్తున్నాం.

 

9౦. శ్రీ ఎక్స్ తనలో కోపమున్నదని ఉత్తరములో పిర్యాదు చేసినాడు. అదిపోవాలంటే అతడు కన్నీరు వుబికివచ్చునట్లు దీనుడై భగవంతుని వేడుకోవాలి.

 

91. అభ్యాసి పైపైకి ఎదిగి వచ్చేకొద్దీ ముఖ్యంగా "ఏ" బిందువు దాటిన తర్వాత శిక్షణనివ్వడం నాకు సులభమౌతుంది. లోలోపలి మనఃశక్తులు క్రమబద్దీకరింపబడతాయి. ఎట్లైనా వ్యక్తిలోపలి మనఃశక్తులను కష్టపడి ప్రకృతితో ఏకీకృతమగునట్లు అదుపులోనికి తెచ్చుకోవాలి.  దీన్నేముఖ్యంగా నిర్మింపజేయడం (మేకింగ్) అంటారు. ఇది చాలా శ్రమతోగూడిన పని.

 

92. సాధుపురుషులు ఎంత పైస్థాయినందుకున్నా  మానవత్వపు పరిధికి తమకైతాము లోబడినవారుగానే వుంటారు. "జనులు చావంటే భయపడతారు. అయితే నేను మరణించి సంపూర్ణ దివ్యానందమును పొందాలనుకుంటా"నని కబీరు మహాశయుడు చెప్పెను. ఒక పర్షియను కవి ఇలా చెప్పెను. "ఒక్కోసారి నేను తొమ్మిదవ స్వర్గపుగద్దెపై ఆసీనుడనైవుండి మరోసారి నాపాదములకంటే కూడా క్రిందపడివున్నాను." ఈ పరిమితులు లేక బంధమే విచ్ఛిన్నమైపోతే ఆత్మ ఈ అశాశ్వత శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. కనుక గురువులు దీన్ని తగలరు.  లాలాజీవారు కనుగొన్న ఎన్నోవిషయాలలో ఈ 16 వృత్తాల విషయమొకటి. సత్యోదయంలో దీని చిత్రపటము చూపబడినది. ఇప్పటివరకు మాగురుదేవులు మరియు వారి ఆశీర్వాదము పొందినవారుతప్ప ఇతరులెవ్వరు వాటిని దాటి పోలేదు.  ఎవరైనా 17వ వృత్తములోనికి ప్రవేశింప గలిగితిమన్న      సంతోషకరవార్త తెస్తే అక్కడ ఒక బంధాన్ని ఏర్పాటుచేయవలసిన బాధ్యత బోధకునిదౌతుంది. తద్వారా అతని ఆత్మ మూలంలోనికి ఎగిరిదూకకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఈస్థితి వరకు చేరితిమన్న శుభవార్త ప్రజలు నేను బ్రతికుండగానే తేవాలని నావాంఛ. అయితే ఇదంతా భగవంతుని చేతిలో వుంది. ఏపూజలు, ఏఅభ్యాసము కూడా ఇంతకు మించి పోవడానికి సహాయపడలేవు. ఏమహాత్ముడు ఇంతవరకు రాగలిగియుండెనో అతడు మాత్రమే ఈ ప్రయాణము సాగించుటలో సహాయపడగలడు.

 

93. ప్రియ సోదరా! నీవు నన్ను జీతం అడుగుతున్నావు.  నేను నిన్నే యజమానిగా భావిస్తున్నాను.  కనుక ఒక యజమానే తన పనికిగాను సేవకుని కూలి అడగడం ఆశ్చర్యంగా వున్నది. మరింత నీకు వ్రాయాలనుకుంటున్నాను.  కానీ నేను నాగురుత్వాన్ని చూపుకుంటున్నానని ఎవరైనా అనుకుంటారేమోనని జంకుతున్నాను. ప్రియసోదరా! నాకు శిష్యుడు గానీ దేవుడుగానీ లేనప్పుడు నేనెవరిపై నాగురుత్వం జూపగలను.  భగవంతుని దయవల్ల నేను ఎల్లవేళల దాదాపు శున్యస్థితిలో వున్నాను.  అక్కడ నేనులేను, నా దేవుడూ లేడు.  జనులు నన్ను నాస్తికుడని పిలుతురేమోనని భయపడుతున్నాను. నేను నాస్తికత్వాన్ని ఇప్పటికే విచ్ఛిన్నంగావించేశాను.  ఇదంతా మాగురుదేవుల ఆశీర్వాద ఫలితమే.

     ఒక కవి ఇలా అన్నాడు.  "అది విగ్రహారాధన గానీ లేక అల్లా (భగవంతుడు) నామస్మరణ గానీ ఏపూజైనా విశ్వాసరహితంగా వుండదు". ప్రియసోదరా! ఉప్పదనంలేని రాతిలో ఏం సారముందనుకున్నావు? ఈ శూన్యస్థితినుండి వేరుపడాలని కోరనేకోరవు!  విషయమలా వుంటే ప్రాణాహుతి ప్రసారం చేయడానికి ఆస్థితినుండి క్రిందికి దిగి రావలసివస్తుంది. పద్దతి అలాంటిది. కానీ నేను అలా చేయలేకపోతున్నాను. కనుకనే శాంతి, ప్రశాంతత మినహా మరేవిధమైన మానసికోల్లాసాన్ని ఉత్పన్నంచేసి, అభ్యాసిలో మన సంస్థ నియమావళియందు విశ్వాసము కలిగించలేక పోతున్నాను. కానీ నేను వున్నస్థితి నుండి ఒక్కస్థితి క్రిందకుదిగి ఒక క్షణమున్నా ఆస్థితి యొక్క పరావర్తనమే నాకు అనుభూతమగుచున్నది. ఒకసారి నేను ఎవరికో ఇలావ్రాసినట్లు జ్ఞాపకం. "ప్రియసోదరా! నీవు నాకు ఆధ్యాత్మికశిక్షణ నిచ్చావు. మరియు నీవల్లనే నేను ఆధ్యాత్మికంగా పురోగమించాను" . నేను అటువంటి స్థితిలోనికి రాగానే నాకు నీవు గురువుగా గోచరిస్తావు. కానిమ్ము నీవు నా గురువువే. మరి సహజంగా మీరే నాకు శిక్షణనిచ్చినట్లు అంగీకరించబడినది. నాఅనుచరులు వారి తప్పులను, అవివేకాన్ని అది ఎటువంటిదైనా నాదగ్గర విన్నవించుకోవాలనుకుంటాను. అయితే నేను ఈ పద్దతి ననుసరించినట్లయితే (మీరేనాగురువులుగా) తొలుత నేనే నాఅవివేకాన్ని మీకు విన్నవించుకోవాలి. ఒకసారి గొప్ప విజ్ఞాన విద్యాగర్వం గల పండిట్ ఎక్స్ విజ్ఞానరంగంలో నన్ను ఓడించినట్లు భావించాడు. అతడా గర్వమును పెంపొందించుకొనుట అతనికే మంచిది కాదని నేను తలచితిని. వెంటనే నేను ఒక్క మలుపు తిరిగి నాపూర్వస్థితిలోనికి చేరుకొంటిని.  అప్పుడు వెంటనే అతనికిలా వ్రాశాను. "నేను వ్రాసినది నీకు చులకనగా వుండవచ్చు. నేను వ్రాసేది గమనించు. నేనే ఈలోకానికి రాముణ్ణీ, కృష్నుణ్ణీ పంపించాను. నేనే ఋషులకు శృతులనెఱుక పరచాను". నీవు తరచూ ఎందుకు చీకటిలో మునిగి వుంటున్నావో ఇప్పుడు నీకు తప్పక అర్థమైవుంటుంది.

 94. శూన్యస్థితిలో వున్న వ్యక్తి సహజంగానే ఇతరుల దుఃఖములను చూచి తను బాధపడిపోతాడు. ఇతరుల సంతోషానికి తనూ సంతోషపడిపోతాడు. కానీ ఇదంతా పైపైకి మాత్రమే. తర్వాత అతడు తన స్వతఃసిద్ధమైన "ఎలా వున్నాడో అలా" వంటి స్థితికి మరలిపోతాడు.

 

95. మెదడే అన్నిటిని ఆలోచన చేస్తూ వుండగా  మనం హృదయంపై ఎందుకు ధ్యానం చేయాలి? హృదయము మనస్సు యొక్క కార్యక్షేత్రము.  శరీరములోని మరియు మెదడులోని అన్ని బిందువులూ హృదయంలో వుంటాయి. హృదయంపై ధ్యానం చేయడం ద్వారా అన్ని బిందువులను శుద్దిచేయడానికి సౌలభ్యమేర్పడుతుంది.

 

96. ప్రాపంచిక వ్యధలు హృదయంలో భారం కలుగజేస్తున్నాయని నీవు వ్రాశావు.  దీనివల్ల హృదయం పుష్పసుగంధాన్ని కూడా సహించలేనంత మిక్కుటంగా శుభ్రపడిందని నిరూపింపబడింది.  కానీ ఈ వ్యధలు తేలికగా ఎగిరిపోతున్నట్లుండి హృదయము గుర్తించలేనట్లుండాలి.

 

97. శ్రీఎక్స్ తనలో మార్పును తీసుకురమ్మని తిరుపతికి తంతి యిచ్చెను. అది నాకు అలహాబాదులో అందెను. క్షమించవలెను. నేను తంతి ద్వారా అతనిని మార్చలేకపోతిని. కానీ ఆధ్యాత్మిక మార్గమున భగవంతుని పొందవలెనన్న అతని ఆతురత ఈవిధంగా ప్రస్పుటమైనది. అది మంచిదే. నేను ఇప్పుడు రెండురోజుల క్రితం అతనికి జవాబు పంపాను. ఇది వ్రాయడంలో ఒక యుక్తియుక్తమైన విషయమున్నది. నేను క్రొవ్వొత్తి వెలుతురు సూర్యునికి చూపితిని. కానీ సోదరా! అతడు చాలా మంచివాడు. ప్రేమించడం కూడా ప్రారంభించాడు. అయినా సోదరా నేనేమి చేయనూ? ఈ దీనుని ఎముకలలో ఇంకా ఏసారము మిగిలిలేదు. బహుశా అందుకే జనులు నావైపుకు ఆకర్షింపబడటం లేదు. ఇప్పుడు అద్దములో నాముఖాన్ని నేనే చూసుకొనుట ప్రారంభించాలి. అట్లైనా నన్ను నేను చూచుకొని మురిసిపోగలనా?  కానీ నేను అలాచేస్తే నాముఖం అద్దంలో అగుపించదేమోనని భయపడుతున్నాను.  అయినా నేనుమాత్రం ఆ లేకుండా పోవడంలోనే కొంతకుకొంత వున్నానని గ్రహించవచ్చు.  అవును ఇది నిజంగా అంతే. ఎందుకంటే సత్యతత్త్వం శూన్యంలోనే (ఏఅమిలేని చోటే) కనుగొనబడుతుంది.

 

98. మన మహాత్ములు, సన్యాసులు డబ్బాలకొలది నేతిని యజ్ఞాలలో దహించేశారు. వారు భారతదేశపు ఆర్థికస్థితిని ఖాతరు చేయలేదు.  వారు రెండు మూడు నెలలపాటు ఏకధాటిగా రోజులో 24 గంటలూ అగ్నిలో పేల్చారు. తమ్ము తాము ఉద్దరించుకొను యత్నించు మహాత్ములందరూ భారతదేశపు సంపద యజ్ఞగుండములో దహించడంతోనే ప్రారంభించారు. ఇటువంటి వార్తలు ప్రతిసంవత్సరం వింటూవుంటాము.      దక్షిణభారతదేశ పరిస్థితి నాకంతగా తెలియదు. బహుఃశ వారు కూడా అక్కడ ఇదే చేస్తారు కాబోలు. ఎవరైనా ఇవి చేయకుండావుంటే వారికి "కుండలినీ" అను ఎండమావికై ఆశలురేకెత్తిస్తారు. ఇంతాచేసి మన మహాత్ములు ఏఒక్కని హృదయంలోను అగ్నిని రాజేయలేకపోయారు. కానీ తమ పిల్లలకు ఉపయోగపడే ద్రవ్యాలు మాత్రం విపరీతంగా దగ్ధంచేసేశారు. నిజానికి అవి సరిగా వాడివుంటే హృదయము, మెదడు సక్రమంగా నిర్మింపబడి వుండటానికి ఎంతో దోహదపడి వుండేవి. ప్రాణాన్నే ఆహుతి యివ్వడం ద్వారా మన ఆధ్యాత్మిక సంస్థ ఏ ఒక్కనిలోనైనా అగ్నిని రగిల్చివుంటే అది వేయియజ్ఞములకన్నా మేలైనపనే.  దీనిపై నీవు లోతుగా ఆలోచించిచూస్తే నీవే ఈ అగ్నిని ఎంతోమందిలో రగిల్చి యుండవచ్చునన్న సంగతి విశదమౌతుంది. ఇంకా ఎంతోమంది రగల్పబడడానికి మిగిలివున్నారని కూడా అర్థమైవుండేది. నీవు అటువంటి వారిలో ఒకనివి. నేను ఒకానొక సందర్భంలో నీకు వ్రాసిన ఒక వాక్యం నిన్ను ప్రభావితంచేసి నీలో ఆరిపోయిన స్థితిలో వున్న జ్వాలను తిరిగి ప్రజ్వలింపజేసినది. ఆజ్వాలలే తేజోవంతంగాను, తీవ్రంగాను రేగి బయటకొస్తున్నాయి. నీవు సక్రమంగా ప్రారంభించావు.  దీనికి కావలసిన రంగము సిద్దపరచబడాలి.  అది ఇప్పుడు సిద్దముచేయబడుతూ వుంది. అట్టివానిహృదయము ఎదుటికి వచ్చినట్లైతే ఆరిపోయిన హృదయాలు అందులోనూ వేడికూడా నశించినవైననుసరే తిరిగి రగిలించబడతాయి. నీకార్యక్రమపరిధి విశాలము చేయబడవలసి వుంది.

 

99. ప్రకృతి నీనుండి పనిని రాబట్టుకుంటుంది. నీవు కార్యనిర్వహణమునకు త్వరగా సంసిద్దుడవు కమ్ము. నీవు పని చేయవలసియే యున్నది. నీ పరిమితులన్నీ కాస్తా సడలింపబడనున్నవి.

 

1౦౦. ఇక్కడికి ఎవరు వచ్చినా సందేహాస్పదులయ్యే వెళుతున్నారు.  ఆపైన తన శక్తిసామర్థ్యాలనే సాధనం ద్వారా వేడి చలువలను కొలుస్తూ వారికి తోచిన న్యాయనిర్ణయం వారు చేస్తుంటారు. అక్కడ వేడీ లేదు చలువ లేదు కనుక ఇక వారు కేవలం ఊహాజనితమైన ఏదోఒక నిర్ణయానికి వస్తారు. వారు సందేహంలో ప్రవేశించారు గనుక వారు అదేవిధమైన ఆధారరహితమైన నిర్ణయాల వైపునకు గొంపోబడతారు. కొందరు వాస్తవం చెప్పగలవారు కనబడతారు. కానీ చాలా మంది తప్పునే సరియైనదిగా ప్రదర్శిస్తుంటారు.

 

11. ప్రతి ఒక్కరూ మేధావులను స్తుతిస్తూంటారు.  నేను అదే చేస్తూంటాను. కొన్నిసార్లు నేను కూడా "బలహీనులకు దేవుడు కూడా సహాయం చేయడు" అని అన్నాను. మరి బలహీనుడంటే ఎవరు? ఆత్మస్థైర్యం లేనివాడే. భగవంతుడు మూర్ఖులకోసం ఒక స్థలాన్ని కేటాయించాడు. అదే స్వర్గం. నరకమే పాపులకు, అజ్ఞానులకు స్వర్గం. తెలివైన వారికి స్వర్గపుస్వర్గం వుంది. మరి అమాయకులకు కేటాయించినదే బ్రహ్మలోకం. ఈ కేటాయింపులు సరియైన వనుకుంటాను. వీటికి వివరణలుయిస్తే చాలా పుటలు నిండుతాయి. కనుక ఆవివరణ మీ ఆలోచనకే వదిలేస్తున్నాను.

 

12. నేనొక చిక్కుప్రశ్న వ్రాస్తున్నట్లున్నాను. భగవంతుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? ఎవరైతే ఒకసారి దర్శించి కూడా ప్రక్కనే వుంటాడో అతన్ని. ఈవిషయమై ఒకటి రెండు వాక్యాలు వ్రాయాలనుకుంటున్నాను. ఎప్పుడు మనం భగవంతునికి దూరం జరిగి వుంటాము? ఎప్పుడు మనం యిప్పటి రూపం అంటే  మానవ రూపాన్నే అంటిపెట్టుకొని మూలాన్ని విస్మరిస్తామో అప్పుడు. ఎప్పుడు మనం ఆ గొప్ప మూలంనుండి తొలుత కదలి చాలా క్రిందిభాగమైన గగనతలం చేరితిమో అక్కడ నుండి ఈ (పంచ) భూతాత్మకమైన పంజరాన్ని నివాసస్థలంగా గైకొన్నాము.  మనం మన మూలంయొక్క జ్ఞాపకం సదా వుంచుకోవాలి. తద్వారా భక్తి సామ్రాజ్యంలో వుండేటట్లు చూచుకోవాలి. మరియు మనమీ పంచభూతాత్మకులమైయున్న సంగతిని గ్రహించుకోవాలి. మనం ప్రస్తుతం దైవీయ లక్షణాలతో వుంటున్న ఈస్థలం భగవంతునికి మైళ్ళ దూరంలో వుంది. అంటే భవంతుడు - మానవుడు అన్నయోచన సాక్షాత్కారానంతరం కూడా వుంచుకోవలసిందే. సంక్షిప్తంగా చెప్పాలంటే మానవ మర్యాదను సాక్షాత్కారం తర్వాతగూడా విడనాడకూడదు.

 

13. వాస్తవ ఆధ్యాత్మికత రంగు,రుచి,వాసన లేని స్థితికి మారిపోవడంలోనే వుంది. కారణం భగవంతునికి కూడా యివేవిలేవు. మన పద్దతిలో వ్యక్తిని సత్యతత్త్వం వరకు కొనిపోయే ప్రయత్నం చేస్తాము. రంగు మిగిలి వుంది అంటే అక్కడ శుద్దత లేనట్లే. ఇవన్నీ నీకుతెలుసు.

 14. లైలాను మజ్నూనేత్రములతోనేచూడు అని ఒక పర్షియా భాష నానుడి వున్నది. అంటే లైలా అందవిహీన. ఆమెను చూడాలంటే మజ్నూ కళ్ళే కావాలిమరి. అదేమాదిరి నీవు భగవంతుణ్ణీ చూడాలంటే ఆ రకమైన పిచ్చిచూపులే కావాలి.

 

15. శ్రద్ద మాత్రమే ఉనికి (లేక) ఆధారము.  దానిపైనే సాక్షాత్కారం నిర్మాణమౌతుంది. శ్రద్ద విడదీయరాని బంధము. ఒకసారి యేర్పడితే అది ఇక విడిపోవటానికి వీలేవుండదు. శ్రద్ద పెంపొందించుకోనిఅభ్యాసి  అభివృద్ది చెందలేడు.

 

16. ఒరనుండి పెరికిన ఖడ్గము బహుదా కీర్తింపబడింది. మొత్తానికి దాని పని ఖండించడమే. ఇప్పుడు దాన్ని ఉపయోగించడానికి తెలివి కావాలి. ఎందుకంటే అది శత్రువునే ఛేదించాలి అంతేగాని స్నేహితుణ్ణో లేక తననో కాదు.

 

17. ఎప్పుడైతే శిష్యుడు తన్నుతాను గురువుగారిలో లీనం గావించుకుంటాడో, అప్పుడే గురువుగారు అతన్ని ముందుకుగొంపోయే పనిలో విశ్రాంతరహితుడై పోతాడు. ముఖ్యంగా శిష్యుడు తనకైతాను ముందుకుపోలేని స్థితిలోవుంటే ఇది మరీఎక్కువ.  అందరి హృదయాలలో ఉత్పన్నమయ్యే ఒక ప్రశ్నకు నేనుత్తరమిస్తాను. ఒకవేళ గురువు "బాక్వా" స్థితిలోని ప్రయాణీకుడైతే అతని శిష్యుడు అంతకన్నా పైస్థాయికి అవసరమైతే ఎలావెళ్ళగలడు? గురువు బంధనరహితుడైవుంటే శిష్యునికి తప్పక సహాయపడగలడు. అదికూడా శిష్యుడు తనస్వరం గురువుకు వినబడజేయగల స్థాయిలో వుంటేనే. తన చేత దీక్షగైకొన్న వారి స్వరములైతే తొందరగా గురువును చేరతాయి.  దీనికి తోడు అతని తరపున పనిచేసేవారు మరియు బోధకులు శిష్యుల అవసరాలను నెరవేర్చడానికున్నారు.

 

18. ఎవరైనా ఒకరు తన తప్పిదాలకు పశ్చాత్తాపము చెందివస్తే, అతడు ఇంకా ఆధ్యాత్మికతవైపు మొగ్గు కనబరుస్తూవుంటే  అతన్ని చేర్చుకోవచ్చు. అయితే అతడు తిరిగి తప్పులు చేయకూడదు. అతడు తన మనస్సును భగవంతునివైపుత్రిప్పి తను మున్నుచేసిన తప్పులకు పశ్చాత్తాపపడినట్లైతే తొందరగానే పరిశుద్దుడౌతాడు. అందులకు క్షమాపణార్థం ఏడ్పుతోకూడిన దీనమైన ప్రార్థన చేయాలి. పవిత్ర కొరాన్ (హదీస్)లో ఇలా వ్రాయబడివుంది - "ఒక భక్తుడు (బందా) క్షమించమని ఏడ్చి ప్రార్థిస్తే నేను సిగ్గుపడి వాడిని తిరిగి చేర్చుకుంటాను" అని.

 

19. భగవంతుని ఏకత్వం మీద మనకు నమ్మకంలేదు. మనం పాక్షికంగా పరిసరములచేత ప్రభావితమైనాము. సహవాసదోషంవలన కూడా పాక్షికంగా చెడిపోయినాము. పాశ్చాత్యసంస్కృతి కూడా కొంతవరకు దానిముద్రలు మనపైవేసింది. ఈ విధమైన క్రిందిస్థాయికి వచ్చిన సమయంలో తప్పుడు ఆధ్యాత్మికశిక్షణ మన పతనాన్ని సంపూర్ణం చేసింది. తత్పలితంగా మనం ఆధ్యాత్మికతకు వేల మైళ్ళ దూరమైపోయాము.

 

11౦. మనిషికి ఒక తప్పుకుగాను నాలుగు శిక్షలు ఎందులకు? మనిషి వివిధముల మిశ్రమజీవి. అతడెప్పుడొక మంచిపనో, చెడ్డపనో చేస్తాడో అప్పుడు మనస్సు ఆలోచిస్తుంది.  హృదయం నిర్ణయిస్తుంది. శరీరావయవాలు వాటిపని అవి నిర్వహిస్తాయి. ఈ రెండింటిలో మనస్సునుండి హృదయంనుండి సహాయమందుతుంది. పనిచేసిన జ్ఞానేంద్రియాలు కూడా తప్పొప్పుల భావనతో వుంటున్నాయి. ఇదికూడా శరీరంలోనిభాగం కనుక శరీరంకూడా భాద్యత వహిస్తున్నది. మనం చెడ్డ విషయాలను గురించి ఆలోచిస్తే చెడు ఆలోచనల ముద్రలను వాతావరణానికి పులుముచున్నాము. ప్రకృతి దీనికిగాను ప్రత్యేకంగా శిక్షిస్తుంది. ఒకనికి చెడుజీవితం లేక నరకం వాని చెడ్డచేష్టల కనుగుణంగానే లభిస్తుంది.  నరకంలో వాడు అనుభవించవలసినదంతా అనుభవించి మిగిలినది జన్మనెత్తి ఈ ప్రపంచంలో అనుభవించవలసి వుంటుంది. చేసిన పని చెడ్డది అని తలంచిన మనస్సు శిక్షననుభవించింది. దాని ప్రభావము చెడ్డది గనక అది హృదయానికి శిక్ష. సంఘము కూడా వాణ్ణి అందుకు ఎగతాళిచేసి చీదరించుకుంటుంది. అతడు వాతావరణాన్ని పాడుచేసినాడు కనుక అతనికి నరకం ప్రాప్తించింది.  మూడవశిక్ష శరీరము మరియు దానితో కలసివున్నవి అనుభవించాయి. ఈవిధంగా చెడు చేయడానికి సహాయపడిన వాటన్నిటికి శిక్షపడింది.

 

111. "ప్రేయసిని చూడగానే నామనస్సు కలవరపడింది. తప్పు కళ్ళదే అయినా గుండె (బాకుతో) కుమ్మబడింది".

 

112. ఆధ్యాత్మికవ్యక్తి మాంసము తినకూడదని మాగురువర్యులు చెప్పేవారు. నేను అదేసూత్రాన్ని పాటిస్తాను. నిజానికి కొంతమంది సాధువులు మాంసం తినేవారు. మాంసం తినడం మటుకు మానేయాల్సిందే.

 

113. ప్రశిక్షకుడు క్రమశిక్షణ తప్పితే అతడు ఆ పదవికి ఏమాత్రం తగడు. ప్రశిక్షకుని అవమానం తీవ్రంగా పరిగణించవలసి వస్తే అది గురువు యొక్క అవమానమే.

 

114. నా విషయానికొస్తే నేను సర్వదా నా గురుదేవులపై ఆధారపడి వుంటాను. అంతేగాదు నేను ఎవరికి అణగిమణగి వుండాలని మా గురుదేవులాదేశిస్తారో అతనికి సైతం నేను దాసుడను. ఈ దాసత్వం ద్వారానే నేను నా ఇఛ్ఛాశక్తిని హెచ్చించుకోగలిగాను. అదియంతయు మాగురుదేవుల కానుకే.  దానితో నేను ఒక క్షణంలో ఆధ్యాత్మిక శిక్షకులను వేనవేలు తయారుచేయగలను.

 115. సోదరా! నేనెక్కడనుండి అద్భుతాలు తేగలను. నా ఆలోచన ఎప్పుడూ ఆ దిశలోసాగలేదు. మీరు ఎప్పుడెప్పుడు ఏదైనా కావలసి వాంఛిస్తూవుంటారో అప్పుడు మాత్రం కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి.  నేను అద్భుతాలు చేయగలనని నా గురుదేవులు చెప్పారు. ఆ మాటను నేనూ నమ్ముతున్నాను. అయినా నాకు మాత్రం ఆ ఉద్దేశ్యమేలేదు. రెండవ విషయమేమంటే బోధనలు ప్రజలను ఎప్పుడూ ఆకర్షిస్తాయి.  జీసస్‌క్రీస్తు జీవితాంతం అద్భుతాలు ప్రదర్శించారు. కానీ ఆయన కేవలం పన్నెండుమంది శిష్యులనే సంపాదించుకోగలిగాడు. అందులోను ఒకడు అవిశ్వాసియై ఆయనను శిలువనెక్కించుటకు పట్టియిచ్చెను. అయితే ఆయన బోధనలు ఆయన మరణానంతరము ప్రపంచములోని ప్రజలను విశేషముగా ఆకర్షించెను. మరో విషయమేమంటే హిందువులు సముద్రముదాటుట మతాచార దోషముగా ఆనాడు పరిగణించిరి. ఇది ఆయనకు సహకరించినది. నేను చెప్పదలచుకున్న మాట మరొకటుంది. నాగురుదేవుల కృపవలన నేను చేయగల అద్భుతములు ఎవ్వరూ చేయలేరు. కానీ చూడగల శక్తిమంతులు మాత్రమే చూడగలరు. సోదరా! అవి గత్యంతరములేని పరిస్థితులలో ప్రకృతికార్యము నిర్వర్తించునపుడు చేయవలసి వస్తుంది.

 

116. ఇచ్ఛ మరియు వాంఛలను వివరించడానికి వాటిని వేరువేరు భాగాలుగా విడదీసి వివరించాలి. (1) పశుస్థాయి (2) మానసికస్థాయి (3) ఆధ్యాత్మికస్థాయి. ఇవి కోరికలలోని రకములు. కోరికలు మంచివిగాను వుండొచ్చు చెడ్డవిగానూ వుండొచ్చు. చెడ్డ కోరికలు మనోవికారములు, శృంగార చేష్టలు మొదలైన వాటికి సంబంధించి వుంటాయి. దురాశ మొదలైనవి కూడా ఇందులోనికే చేర్చవచ్చు. మనోస్థాయిలోవుండే కోరికలలో స్వాధిక్యత, సొంత ప్రగతి, స్వశక్తి మొదలైనవి గోప్యంగా దాగి వుంటాయి. ఇవిగనుక ఆధ్యాత్మిక పరిధిలోనికి కొనసాగివచ్చాయంటే అతడు కర్తవ్యతామూఢుడైపోతాడు. ఇక అతడు బోనులోనుండి తప్పించుకోవడానికి వ్యధజెందుతాడు. అపుడు భగవత్సాక్షాత్కారము వైపుకు మొగ్గు చూపబడుతుంది. ఇదే వాలకము ముందు పశుప్రవృత్తి వైపునకుండినది. కర్తవ్యతాభావమెపుడు పనిలో కనబడుతుందో అప్పుడది కోరిక అనిపించుకొనదు.  ఇచ్ఛ మానసికస్థితికి అనుసంధానమై యుంటుంది. ఎందుకంటే నీవు మానసిక పరిధిలో నీ గమ్యమును ముందుంచుకొని వ్యవహరిస్తావు. ఇట్లే చివరివరకు కొనసాగుతావు. ఇందువల్ల ప్రతిస్థాయిలో క్రొత్తజీవితాన్ని  పొందుతూనే వుంటావు. ఇది దాని స్వచ్ఛతకు అనుగుణంగా త్వరితగతిన పురోగమిస్తూ సందేహరహితమౌతుంది. అంటే దాని శక్తిని హెచ్చించుకుంటూ పోతుంది. ఇప్పుడు దాని పనితీరు మహామాయ అనదగు ప్రాపంచిక విషయములో చాలా చురుకుగా వుంటుంది. తదనంతరం అది తన అసలు స్వచ్ఛస్థితికి అంటే వజ్రముగా మారుతుంది. ఈస్థితినందుకొన్న తర్వాత ఎవరినైనా ఒక ఆధ్యాత్మికస్థాయినుండి మరొక ఆధ్యాత్మికస్థాయికి వెనువెంటనే మార్చగల శక్తి కలుగును. ఎవరైనా బ్రహ్మనిష్ఠను పొందితే అంటే బ్రహ్మములో లోతుగా మునిగితే అతని ఇచ్ఛకు ఇక అపజయమే వుండదు. కానీ సోదరా! అలా వృద్ధిచెందినతని ఇచ్ఛాశక్తి భగవదీయకార్యములందే సహాయపడటం మొదలౌతుంది. మనిషి (అనంతంవైపు గ్రంధంలో వుంది) సందేహాన్ని సంపూర్ణంగా పోగొట్టుకుంటే ఇఛ్చాశక్తి మహత్తరంగా వృద్దిచెందుతుంది. పాశ్చత్యతత్త్వశాస్త్రము సందేహము ఆధారముగా ఏర్పడింది. దానికి తూర్పు తత్త్వమున స్థానమే లేదు. సంశయాన్ని రానిచ్చినావు అంటే ఇంట్లోకి దొంగనురానిచ్చినట్లే. సోదరా! ఇవన్నీ సాధన ద్వారా వాటికైఅవే తెలుస్తాయి. పద్దతి సరియైనదైవుండి తీరాలి. మార్గదర్శకుడూ నిష్ణాతుడై వుండాలి. మనిషి తనలోని జడత్వాన్ని తొలగించుకోవాలి. సూక్ష్మాతిసూక్ష్మమైనస్థితులలో జీవించాలి.

 

117. జనులకు భగవంతునియందు నమ్మకములేదు. నాకు నా ఆరోగ్యమునందు నమ్మకము లేదు. ఆరోగ్యమునందు నమ్మికలేదంటే అది బలహీనతకు గుర్తు. కానీ భగవంతునియందు విశ్వాసము లేకపోవడమంటే అది ఆధ్యాత్మిక ఆత్మహత్యే. ప్రజలు ఈనాడు పంటలు బాగాలేవని అంటారు. దానర్థమేమంటే భగవంతుడు ముసలివాడై పోయాడని. అందువల్లనే ఆయన (భగవంతుడు) కొన్నిటిని మరిచిపోయివుంటాడు. కానీ ప్రజలు ఆ భగవంతుడిచ్చిన శక్తితోనే ఆయన సృష్టిలో ఎంత గందరగోళం కల్పించారో వారికర్థంకాదు. చర్యలు తదనుగుణంగా కొనసాగుతాయి. ఇప్పుడు మన చర్యలు ప్రకృతి విరుద్ధములై పరిసరములన్నీ చిందరవందరచేసి మన గొంతులే తెగగోసుకొనేస్థితికి తెచ్చుకున్నాము. ఈ పరిస్థితులు పరిశుభ్రము చేయవలసి వుంది. ఇది కొంతవరకు జరుగుతున్నది. మున్ముందుకూడా జరుగుతూనే వుంటుంది. ఇదంతా ప్రజలైన మీరు చేయవలసి వుంది. వారికి తెలియకుండానే సత్పురుషులు కొంతకుకొంత చేస్తూనే వుంటారు. నాకు ధైర్యముంది మరియు నాగురుదేవుల కృపవలన ఎట్టిలోపమూ లేదు. ఈ పని చేయడానికి ఒక క్షణం కూడా అవసరంలేదు. ఇదంతా ప్రజలైన మీరు మీలో ధైర్యం ప్రోదిచేసుకోవడానికే వ్రాశాను. కానీ నేనీపని చేయను. ఎందుకంటే ఎవరైతే వారిశక్తి దుర్వినియోగం చేసి ఇంత రోత చేశారో వారు వారి చర్యలకు తగిన ఫలితం అనుభవించి తీరాలి. ప్రకృతి కూడా ఇదే కోరుకుంటున్నది. వినాశనం తప్పక జరిగి తీరుతుంది. అప్పుడే ఆపని కూడా మొదలైపోయింది. అందుకు కారణాలు ఇవే.

 

118. నేనోవిషయం చెబుతాను. ఏపనైనా పూర్ణ ఆత్మస్థైర్యంతో చేయబూనితే అది సరియైనదే అవుతుంది. అయితే మనిషికి ఈ "నేను" అన్న పదం దేన్ని సరిగ్గా సూచిస్తుందో స్పష్టంగా తెలిసి వుండాలి. నీ మాటల్లో అయితే ఆ "నేను" సంపూర్ణంగా మటుమాయమైపోవాలి.

 

119. సాయంత్రం సాధన చేసే శుద్దీకరణతో జనులు అట్టే ప్రయోజనం పొందడంలేదనిపిస్తున్నది. కారణం అది వారు తప్పుగా చేయడమే. మీ కేంద్రములోని సత్సంగము నిర్వహించే వారందరికి నీవు వారిని కలిసినప్పుడల్లా మాట్లాడి వివరించు. తొలుత జనులు జడత్వంపై ధ్యానం చేసి తర్వాత అది పొగరూపమున వెనుక వైపునుండి బయటకు వెళ్ళిపోతున్నదనుకొనుచున్నారు. వాస్తవం చెప్పాలంటే  వారు మలినాలు బయటికి వెళ్ళిపోతున్నట్లు యోచననిచ్చి నెట్టివేయాలి. ఆరాధనకు సంబంధించి హృదయంపై ఒత్తిడి సృష్టించాలని దీనికంతటికి అర్థము.

 

12౦. ఓకవి చాలా సుందరంగా వచించారిలా "ఆయన (భగవంతుని) దయ పాపుల దరిచేరగానే పాపమెరుగని వారు అవమానంతో కుపితులైరి." గునాహ్‌గారోం కో పహుంచాజో ఉస్కి రహమత్ నె బహుత్ ఖాఫిఫ్ హువె జో గునాహ్‌గార్ న థే. తన్ను తాను పాపిగా అనుకోవడమనేది అణకువకు సూచకము. కానీ ఇది ఇస్లామీయుల భావన. ఇది బహుఃశ మన మతంలో చెప్పబడలేదు. అయినప్పటికి ఇందులో ఓ సౌజన్యతా విషయమున్నది.  మనం ఎప్పుడైతే మనకై మనం పాపులమని భావిస్తామో అప్పుడే ఆయన (భగవంతుని) దయను మనవైపునకు మరల్చుకుంటాము.  ఆయన దయపై పూర్తిగా ఎప్పుడు ఆధారపడతామో అపుడు ఆస్థితిలో మనం సమృద్ధిగా మేలుపొందుతాము. ఇది శరణాగతిలో ఒక భాగము. ఎప్పుడు మనం పైస్థితులకు పోతామో అప్పుడు మన తక్కువదనాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. అందుకే ఆయన దయకోసం ఆయన వైపు తిరిగి ఎదురుచూస్తాము. అప్పుడు మనం మిగిలివుండము. అంటే ఆయన కృపకోసం మనల్నిమనం శూన్యులం చేసుకుంటాము.  ఇదీ సత్యతత్త్వపు పరిస్థితి. ఈస్థితి ఒక అన్వేషకునికే తెలుస్తుంది.

 

 121. ప్రేమ అన్నిచోట్లా ప్రస్తుతింపబడుతుంది. మహాభారతంలో ఒక కథ ఇలా వుంది. కృష్ణపరమాత్మ విదురమహాశయుని ఇంటికి వెళ్ళాడు. విదురపత్ని వస్త్రవిహీనయై స్నానగదిలో జలకమాడుతున్నది. కృష్ణపరమాత్మ స్వరం వినగానే ఆమె ఆనంద పారవశ్యంలో వళ్ళు మరచిపోయి స్నానాలగది నుండి బయటకు వచ్చేసింది. కృష్ణపరమాత్మ తనపైనున్న అంగవస్త్రము ఆమెపైకి విసిరి ఆమెను వస్త్రము లేనిదిగా కాకుండా చేసెను. ఆమె అరటిపండ్లు కృష్ణునకిచ్చుచుండెను. కానీ ఆమె పారవశ్యమున అరటిపండు పారవైచి పైతొక్క మాత్రము కృష్ణున కందించుచుండెను. విదురమహాశయుడు అక్కడికివచ్చి, తట్టి విషయము తెలిపితేనే గానీ ఆమె మనలోకానికివచ్చి కృష్ణునకు పండ్లు తినిపించలేదు. అప్పుడు కృష్ణపరమాత్మ నాకా తొక్కలే పండుకంటే రుచికరంగా వున్నాయన్నాడు. అంతగా పురోగమించని వారిలో భక్తి, ప్రేమలు పెల్లుబికినపుడు విదురపత్నివంటి స్థాయికి చెందిన అనుభూతులను కొన్నిసార్లు పొందుతారు.

 

122. శ్రీ ఎక్స్ నాకు వ్రాస్తూ నన్ను చిక్‌మగళూరు వెళ్ళమన్నారు. నా ఆరోగ్యము చూస్తే ఇటువంటి ప్రయోజనరహిత ప్రయాణాల శ్రమను భరించ గలిగేట్లు లేదు. నేనక్కడికి వెళ్ళడంవలన అతడు పేరు గడించాలనుకుంటున్నాడు. నిజానికి అట్టివి "రాకత్" వల్ల వీలౌతాయి. దీని అర్థం నీకు తెలుసు. సంక్షిప్తంగా చెప్పాలంటే శ్రేష్ఠత, ప్రార్థన మరియు భక్తి ద్వారానే గడింపవీలౌతుంది.

 

123. మనిషి తన పాశవికలక్షణాలు వదలి నిజమైన మనిషిగా మారటానికి ఏదో ఒక పద్దతి తెలుసుకుంటే ఎంత బాగుండునో! అని నేను నా తీరికవేళల్లో ఆలోచిస్తూ వుండే వాడిని. నేను నా అంతరంగమందంతటను మరియు సృష్టిలోను తరచి చూస్తే రెండు శక్తి ఉత్పాదక యంత్రములు కనబడినవి. అందులో ఒకటి వ్యక్తిగతసృష్టి.  మరొకటి విశ్వవ్యాప్తసృష్టి. రెండవదానిజోలికి పోకుండా ప్రస్తుతానికి వదలిపెడుతున్నాను. అది కేవలం ప్రత్యేకావతారమూర్తి వలన మాత్రమే ఉపయోగపెట్టబడుతుంది. సామాన్య మహాత్ములెవ్వరూ కనీసం దాన్ని గురించి తలంచనైనా తలంచలేరని నా విశ్వాసము. మన సంస్థలో ఇద్దరు ముగ్గురు మాత్రమే దాన్ని ఉపయోగపెట్టగల సమర్థులు ఇప్పుడున్నారు. అయినా దీనికి సంబంధించిన కిటుకు వారికి నేను చెప్పదలచుకోలేదు. ఎందుకంటే వారికి నేను ప్రత్యేకశక్తిని ప్రసాదించి అక్కడ వుండగలిగేట్లు చేయాలి. లేకుంటే వారి జీవం దానిలోనే కలిసిపోతుంది.

 

     ఇప్పుడు నేను వ్యక్తిగత సృష్టియైన శక్తియంత్రమును చేపడుతున్నాను. నేను నాగురువు గారి దయవలన దీనిని ఆవిష్కరించాను. ఆయనిచ్చిన సూచన చాలామంచిది. దీనిపై నేను చేసిన యోచన సరియైనదే. దానిని మాగురువు గారు కూడా ఆమోదించారు. ఈ ఆవిష్కృతమున ఎటువంటి అపాయము లేదు. ఇది చాలా ప్రతిభావంతమైన పనిముట్టు. ప్రయోగము చేయువాడు  మాత్రం చాలా హుషారుగా వుండాలి. నేను రెండు దృష్టాంతములు పరిశీలనార్థం గైకొంటిని. కానీ ఒక జీవితం మొత్తానికి ఒకటే సరిపోతుందా అనిపించింది. కాకపోతే అవే మళ్ళీమళ్ళీ చాలా సార్లు కొంత కొంత వ్యవధి తర్వాత ప్రయోగిస్తే సరిపోవచ్చుననిపించింది. ఎవరికైతే నేను ప్రసారం చేసితినో వారిలో మార్పుకు సంబంధించిన గురుతులు కనబడుతున్నాయి. అది ఏవిధమైన మార్పో తెలుసుకోవాలంటే వారు మన దృక్పథంలో వుంటేనే కనగొన వీలౌతుంది. ఈ పద్దతిని బీజవిధానము (న్యూక్లియర్ మెథడ్) అనవచ్చును.

 

124. ప్రతి సత్సంగి ఈసంస్థ నాది అని ఆలోచిస్తే ఇప్పుడు సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. ఎప్పుడైతే మన బిడ్డలను మన సొంతమనుకుంటామో అప్పుడు వారికోసం ఎటువంటి కష్టమైనా ఎదుర్కోవడానికి సంసిద్దులమౌతాము.

 

125. నీనుండి నేను చాలా పని రాబట్టుకోవలసివుంది. అట్లే నీపై కూడా చాలా పని నేను చేయవలసి వుంది. ఈ విధంగా తీసుకోవడం, యివ్వడం రెండు కలిసివున్నాయి. ఆంగ్లంలో ఒక సామెత వుంది. ఇవ్వడం పుచ్చుకోవడం దోపిడీ కానేరదు. నీ తీరిక వేళలలో నీవు భగవంతుని తప్పక స్మరిస్తూవుండు. నీవు అలా చేస్తూపోతే ఏదోకొంత మార్పు జరుగుతున్నట్లు గమనించ గలవు. నేనిప్పుడే నాపని ప్రారంభించాను. భవిష్యత్తులో ఇది మీదృష్టికి వస్తుందని ఆశిస్తాను. దీనికొఱకు నీవు భూమా (శూన్యాకాశం) లో పనిచేయడానికి సంసిద్దంగా వుండు. ఒక్కోసారి అభ్యాసి ధ్యానంలో లీనమైపోతాడు. ఒకోసారి కాలేడు. ఎందుకంటే వాటి పరిధిలో లోతుగా పాతుకొనిపోయిన సంస్కారాలు హృదయం వైపుకు వచ్చి బయటకు వెళ్ళిపోతూంటాయి. ధ్యానం హృదయంలో శూన్యతను ఏర్పరుస్తుంది. అందుకే అలా జరుగుతుంది. సంస్కారాలన్నీ బయటకు నెట్టివేసేవరకు మోక్షము సిద్ధింపదు. వాస్తవం చెప్పాలంటే నేను మామూలు అలవాటుగా శుద్ధి చేస్తూనే వుంటాను. దీనికి సంబంధించి సహజమార్గ పత్రికలో ఒకసారి వ్యాసం వ్రాశాను.

     ధ్యానసమయంలో ఏవిధమైన స్థితి ఉత్పన్నమైనా సరే. అది అభ్యాసికి నచ్చినా నచ్చకపోయినా అది మాత్రం అన్నివిధాల మేలేకలుగజేస్తుంది.

     ఆధ్యాత్మికత చాల సులువైనది. దాన్ని సాధించటానికి అట్టే సమయం పట్టదు. చేయవలసిందల్లా శ్రద్ద, భక్తి పెంపొందిచుకోవడమే. భక్తి, మాటి మాటికి జ్ఞప్తిలోనికి తెచ్చుకోవడం ద్వారా ఉత్పన్నమౌతుంది.

 

ప్రభో శ్రీరామచంద్ర పరమ ప్రేమాంతరంగ

ఇవి దయతో తమరు మాపై వర్షించిన అమృతపు జల్లులు.

// ఓం తత్ సత్ \\

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...