Saturday, 4 November 2023

బోధామృతము

 

బోధామృతము

మనిషియొక్క కుర్పు, యీవిశ్వముయొక్క కూర్పు ఒక్కటిగనేయున్నవి. ఈవిశ్వము రూపుదాల్చుటకు వెనుక లెక్కలేనన్ని సూక్ష్మ, సూక్ష్మాతిసూక్ష్మ ప్రతిరూపములున్నవి. ఆవిధంగానే యీమానవస్థూలశరీరము వెనుకగూడా సూక్ష్మ, సూక్ష్మాతిసూక్ష్మ రూపముల అస్తిత్వములున్నవి. అన్నిటికంటే బాహ్యరూపమీ స్థూలశరీరము. దీనివెనుక సూక్ష్మశరీరము, కారణశరీరములున్నవి. ఈమూడుశరీరములేగాకుండా, గణింపశక్యముకానన్ని సున్నిత ము, సూ క్ష్మమునైనవున్నవి. విజ్ఞులు వీటిని శరీరములనక ఆత్మకు చుట్టుకొనియున్న సున్నితపొరలనిరి. నిజానికి యీసున్నిత సూక్ష్మపొరల కొక్కకదానికి ఒక్కోపేరుపెట్టుట అసాధ్యమైయున్నది. అవి అసంఖ్యాకములు. సూక్ష్మాతిసూక్ష్ష్మమైన వాటినుండి స్థూలాతిస్థూలమైన యీపొరలన్నికలసి భౌతికప్రపంచపు నకలుప్రతిగా లేక సంపూర్ణవిశ్వంభర భగవానుని ప్రతిరూపముగా అనగా ఏకబిందువు (సున్న) ఆధారముగా ఏర్పడిన బహువృత్తసముదాయముగా మనిషి వ్యక్తమగుచున్నాడు.

  -- శ్రీరామచంద్రాజీ, షాజహాన్‍పూర్.  ("ఆధ్యాత్మ జ్ఞాన్" జూలై-సెప్టంబర్ 2023 లో ప్రచురించబడినది)

 💥💥💥  

 అత్యంతముఖ్యము మరియు అపజయమెఱుగని సాధనము ప్రార్థన. భక్తిప్రేమలతో మనల్నిమనం సమర్పించుకొని (శరణాగతిపొంది) చేసిన ప్రార్థన ఆభగవంతునితో మనకు సంబంధమేర్పరచును. ప్రార్థనతో మనప్రభువునెదుట మనం వినయముతో దాసునివలె నిలబడి, మనవాస్తవస్థితిని విన్నవించుకొని, ఆయన ఇచ్ఛకుసంపూర్ణముగా మనల్నిమనం సమర్పించుకొందుము. ఇదే సరైన ప్రార్థన. ఆమహాప్రభుని ఇచ్ఛతోమనం సంపూర్ణసంతృప్తిని పొంది జీవించవలెను. అత్యవసరమైనవాటికై లేమితో మనస్సు విపరీతముగా కలత జెందినప్పుడుతప్ప, అల్పములైన ప్రాపంచికవస్తు సముపార్జనమునకై, భగవంతుని ప్రార్థించుట అవివేకము. మనల్నిమనం సంపూర్ణముగా మరచిపోయినస్థితిలో ఆమహాత్ముని, ఆసర్వశక్తిమంతుని, ఆసంపూర్ణాత్మకుని మాత్రమే, పూర్ణముగా మనస్సు లగ్నముచేసి, ప్రేమలో మునిగిపోయి, సర్వదా ప్రార్థించవలెను. ఇదిమాత్రమే సరియైన ప్రార్థనావిధానము. ఈస్థితిలో చేసిన ప్రార్థన ఆమహాప్రభువు వినకపోవుటగానీ, అనుగ్రహించక పోవుటగానీ జరుగనే జరుగదు - శ్రీరామచంద్రాజీ, షాజహాన్‍పూర్  ("ఆధ్యాత్మ జ్ఞాన్" జూలై-సెప్టంబర్ 2023 లో ప్రచురించబడినది)

v  

భగవంతుడు లేడన్నఆలోచనతో మనమెప్పుడూ వుండరాదు. ఉన్నాడన్న యోచనతోనే మనముండవలెను. అసలాదైవమే మనజీవితలక్ష్యము. మనందరము దైవమువైపునకే పయనించుచున్నాము. లేదంటేకొందరము తెలిసి మరికొందరము తెలియకనే అటువైపునకు పయనించుచున్నాము. ఎఱుకతో పయనించువారిస్థితి  నిశ్చలమైన నీటిలో యీదులాటవలె నుండును. అట్లుగాక ఎఱుకదప్పి పయనించువారిస్థితి, ఎడారియిసుకలో కాళ్ళూచేతులు ఆడించువారివలె వుండును. గురువు సాధకునకు దైవమునకు మధ్యవర్తిత్వము వహించును. ఆయన అభ్యాసికి భగవంతునకు ఒకబంధమేర్పరచ ప్రయత్నించును. ఆకార్యము సఫలీకృతమైనంతనే ఆయన కర్తవ్యము పూర్తగును.

v  

జీవితము అర్థవంతమైనది. ఎందుకంటే దానితోపాటు ఒకశక్తి వెలువడుచున్నది. ఆశక్తిని తమలో యిముడ్చుకోదలచువారికి, దివ్యమైన ఆశక్తే తననుగురించి గుర్తుచేయును. ఆధ్యాత్మికజీవనమును అంగీకరించి, ఆవైపునకు మరలదలచుకొనుటతో అసలైన జీవితం ప్రారంభమౌతుంది. ఆజీవితంలోని అత్యంత‍ఉన్నతస్థితే జీవితంలోనిజీవితం. అది ఆజీవితంలోనే యిమిడివుంటుంది. అట్టిజీవితంలోనికి ప్రవేసించడమే మన ముఖ్యకర్తవ్యమై యున్నది. మన అభ్యాసము అట్టిజీవితము వైపునకు మనలను నడిపించును.---(శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్‍వారి 80వ జన్మదీనోత్సవం సందర్భంగా గుజరాత్‍లోని అహమ్మదాబాద్ (30 -04-1979)లో వారిచ్చిన  సందేశమునుండి గ్రహించడమైనది. ఆధ్యత్మజ్ఞాన్ అక్టోబర్-డిశంబర్ 2021లో ప్రచురించబడినదది.

 💧💧💧


కోరికలు అంతరించినవనగా సంస్కారములంతరించైనవని అర్థము. ఇక పూర్వసంస్కారఫలితము లనుభవించుటే మిగిలియున్నది. ఇవి జీవితకాలములో  ఒక పద్ధతిప్రకారము అమర్చబడి అనుభవమునకు వచ్చును.—(సత్యోదయము.  ఆధ్యాత్మజ్ఞాన్ ఆక్టోబర్-డిశంబర్2019లో ప్రచురించబడినది


 💛💛💛

  అత్యవసరమైన ప్రత్యేకసందర్భములలో తప్ప సాధారణప్రాపంచిక లాభములకై ఆమహాప్రభువును ప్రార్థించుట అవివేకము. అయినప్పటికిని నియమిత ఫలితములకై ప్రభువును ప్రార్థించుట సక్రమమేయగును. ఇట్టివి మర్యాదా ప్రదమైన నిబంధనక్రిందికి వచ్చును. ఇది మనసర్వస్వము ఆయన కప్పజెప్పి ఆయనను ప్రభువుగా సమ్మతితో అంగీకరించుటను సూచించును. ---(శ్రీరామచంద్ర సంపూర్ణరచనలు మొదటి సంపుటి 1989 నుండి గ్రహింవబడినది. ఆధ్యాత్మజ్ఞాన్ ఆక్టోబర్-డిశంబర్ 2021లో ప్రచురించబడినది)

v  

గృహమే, ఓర్పు వినయముల నలవరచుకొనుట కుపయోగపడు పాఠశాల. సరిగ్గాఆలోచిస్తే ఓర్పు ఒకతపస్సే. అది యితరతపస్సులకంటే ఉత్తమమైనది. కనుక దుఃఖము అసహనమునకు మారు ఉదాసీనవైఖరి నవలంభించుట మంచిది. ఇతరులు తిట్టి చీవాట్లు పెట్టినపుడు అనుతాపమొంది, తప్పుతనదే ననుకొని ఓర్పునలవరచుకొనవలెను. ఓర్పు సహనము అలవడి,ప్రాపంచిక దరవస్థలనుండి విముక్తిపొందుటకు, అరణ్యములకేగుట, జనులతో సంబంధములేకుండా ఏకాంతవాసముగడపుట వంటివి, ఇతరులకుపయోగపడునేమోగాని, మనకుమాత్రము మనకుటుంబసభ్యుల, మిత్రుల  మరియు ఈతరుల చీత్కారములు, ఆక్షేపణలు, తిఉర్స్కారములను ఓర్పుతో సహించిజీవించుటే, మనముచేయు తపస్సు.  (మహాత్మ   రామచంద్ర స్వీయచరిత్ర-1 నుండి గ్రహించబడి.  ఆధ్యాత్మజ్ఞాన్  ఆక్టోబర్-డిశంబర్2019లో ప్రచురించబడినది

                                                                             v  

అతిత్వరితముగా గమ్యముచేరవలెనను ఆతురుత, నిరంతరఆవేదన, కలిగియుండుట అనునవి మనత్వరిత విజయమునకు తోడ్పడు అంశములు. సత్యతత్వమును అనగా అనునిత్యప్రశాంతత, శాంతి పొందునంతవరకు మనమొక క్షణమేని విశ్రమింపదగదు. మనమొక దానిని పొమ్దవలెనను తీవ్రమైన ఆకాంక్ష మనలో దానికై ఎనలేని అశాంతిని కలిగించును. ఆశించినది అందిననేగాని, మనలో ఆతీవ్రఆతురత శాంతించదు.—( సత్యోదయంనుండి గ్రహించడమైనది. ఆధ్యాత్మజ్ఞాన్  ఆక్టోబర్-డిశంబర్ 2019లో  ప్రచురించబడినది)

                                                                                      v  

పరిపూర్ణస్వేచ్ఛ మానవులకొరకే కేటాయించబడి యున్నది. ఆస్థితికి మిమ్ములనందరను గొనిపోయెదనని మాగురువర్యులకు యిచ్చినమాట నేను నెరవేర్చ వలసియున్నది. నిమేషమాత్రమున ఎవరిలోనైనను నేను మార్పుతేగలను. అయితే అందులకు వారు నేను విధించిన సాధనావిధానమునవలంభించి అర్హమైనస్థితిని వారియందు ఉత్పన్నముచేసుకొనవలసియున్నది. -  శ్రీరామచంద్రజీ,  షాజహాన్‍పూర్   ఆధ్యాత్మజ్ఞాన్.   జనవరి-మార్చ్ 2022)

v  

ప్రార్థన అనగా పరమాత్మవద్ద యాచించుట. ధ్యానము యాచించినది పొందుట. స్మరణలోనుండుటనగా యోగ్యమైనస్థితిలో నుండుట. ఎఱుకదప్పియుండుటనగా ఉనిఇలోవుండుటే. అభావస్థితిలోయుండుటనగా ఉనికే లేకుండుస్థితి. . -  శ్రీరామచంద్రజీ,  షాజహాన్‍పూర్   ఆధ్యాత్మజ్ఞాన్.   జనవరి-మార్చ్ 2022)

     v  

మానవులందరియెడ మనము సహృదయులమై యుండవలెను. అప్పుడే శక్తి వారిలోనికి  యదేచ్ఛగా ప్రవహించును. ఆధ్యాత్మికపునరుజ్జీవనమునకు ఇది మొదటిమెట్టుగా నేను భావింతును. ఆధ్యాత్మిక భవననిర్మాణము యీపునాదిపైనే నిర్మించవలసియిన్నది. మానవశ్రేయస్సును మనస్సునందుంచుకొని కార్యనిర్వహణ గావింపనెంచినట్లైన ఆపని యదేచ్ఛగా నెరవేరును. అయితే జనులు సరైనవిధానము నవలంభించునట్లు వారిని తీర్చిదిద్ద వలసిన బాధ్యత మనపై యున్నది. జనుల కొఱకై నీవేదైనా చేయదలచినయెడల, అది కోరిక కానేరదు. అది నీకర్తవ్యమగును. మానవజాతినంతటిని ఉద్ధరించవలెనని నేను వాంఛింతును. అటువంటి విశాలహృదయము మాగురువర్యులు నాకొసగినారు. మాగురుదేవుల అభయహస్తము నావెన్నుదట్టి ప్రోత్సహించుచున్నది.--శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్‍వారి 80వ జన్మదినంసందర్భంగా గుజరాత్‍లోని అహమ్మదాబాద్‍లో (30-04-1979) యిచ్చిన సందేశంనుండి గ్రహింపబడినది. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.

        💚💚💚 

 ఆధ్యాత్మికత దివ్యత్వలో అంతరించిపోతుంది. దివ్యత్వము దాని నిజతత్వములో అంతరించి పోతుంది.----- శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్.

                (ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.                                                             💥💥💥
నిరంతరస్మరణ అనుభవమునకు వచ్చునది కాదు. అది చేయవలసిన పని. శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్.---  ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది. 

💧💧💧 

 జీవన్ముక్తుడగుటన్నది, ఆధ్యాత్మికతయందొక అధ్యాయము.- శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.

💜💜💜 

అనుభవమే (మనసులోని బాధ, సంతోషమువంటి భావనలు ముఖమున ప్రస్ఫుట మగుటే) దైవభాష, దైవముతో నీవు మాటాడుభాష.

( శ్రీరామచంద్రజీషాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది)

 💥💥💥

విశ్వాత్మలో భాగమైయుండిన వ్యక్తిగతాత్మ విడివడి, తనొక ప్రత్యేక ఉనికిగా మార్పుచెందినది. తన వ్యక్తిగత ఉనికియొక్క ఎఱుక లేక అహము, మనిషి కూర్పునకు తొలిపొరయైనది. ఈమొదటి స్థితి తరువాత ఒకటొకటిగా స్థూల స్థూలాతిస్థూల పొరలతో చుట్టుకపోతూ, ఇపుడున్న యీస్థితికి దిగజారినది . తొల్లింటిస్థితికిమరల జేరుకొనుటే మనసమస్య. అందుకొఱకు మన జడత్వపొరలను సాధ్యమైనంతగా తొలగించుకొనుచు వెనుకకు మరలవలెను. భౌతికమైన ఆచరణలు, యాంత్రికపద్దతులు యీవిషయమున నిరర్థకములు. మనకున్న ఏకైకమార్గము, మతపరమైన స్థూలవిధులకు చిక్కువడని ఆధ్యాత్మికతయే. అది మూఢనమ్మకములు, జటిలము, దురభిమానముల కతీతమైయుండవలయును.  శ్రీరామచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2021లో ప్రచురించబడినది.     

💛💛💛

 తొలుత "బయలు" (స్పేస్) వుండినది. ఆతర్వాత భగవంతుడక్కడ ప్రకటితమైనాడు. సర్వము భగవంతునినుండే ఉత్పన్నమైనదని వేదములు తెలుపుచున్నవి. ఈమాట సరికాదు. బయలు లేనట్లైన భగవంతుడుండుటకు స్థానమే లేదుగదా? - శ్రీరాంచంద్రజీషాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ 2020లో ప్రచురితమైనది.

 💧💧💧

సహజమార్గవిధానము మహాప్రళయము వరకు కొనసాగుతుంది.--శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ 2020 లో ప్రచురితమైనది.

 💥💥💥

మనసత్సంగములో నేనొక విధానాన్ని ప్రవేశపెట్టదలచితిని. అదేమంటే, సరిగ్గా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రతిఅభ్యాసి ఆసమయంలో ఎక్కడున్నా, ఏపనిచేయుచున్నా, ఆపనిని తాత్కాలికంగా నిలిపివేసి ఓ 15 నిముషములు ధ్యానములో కూర్చొని, మనసోదర సోసరీమణులందరూ ప్రేమా భల్తిభావముతో నిండిపోయి, వారిలో నిజమైన విశ్వాసము దృఢమౌతున్నట్లు భావించవలెను. ఇందువల వారికి మహత్తరమైన ప్రయోజనము సమకూరును. వారి స్వానుభవమే వారికిది ఎఱుకపరచగలదు.--ఋతవాణినుండి గ్రహింపబడినది. ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చ్ 2020లో ప్రచురితమైనది.

(వివరణ:- భారతీయులుమాత్రమే రాత్రితొమ్మిది గంటలకు కూర్చొనగలరు. విదేశీయులు వారి సమయమును భారతకాలమానముతో సరిచేసుకొని ధ్యానముచేసుకొనవలసి యుండును)

 💥💥💥

నేనెవరినైనా ఒక పనిచేయమని ఆజ్ఞాపించినట్లైన, వెంటనే నాసూక్ష్మశరీరము అతనిదేహమున ప్రవేశించి, ఆకార్యము నెరవేర్చును.--(ఇది 08-10-1980 నాడు షాజహాన్‍పూర్‍లో గురు వర్యులు శ్రీరాంచంద్రజీ చెప్పగా గుల్బర్గా ప్రశిక్షకులు సర్నాడ్‍జి వ్రాసికొన్న విషయము) ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురించబడినది)

  💚💚💚

వాస్తవమున ఆధ్యాత్మికత అత్యంత సూక్ష్మమైన మానసికస్థితి. దీనితో పోల్చిచూచిన ప్రతీది భారమైనది, జడమైనదిగనే తోచును. గులాబీపుష్పము యొక్క అతిసున్నితమైన సువాసనకూడా ఆధ్యాత్మికత కంటే బరువుగనే యుండును. నేను దీనిని ప్రకృతితో 

 సంపూర్ణసారూప్యమునొందిన చక్కటి ప్రశాంతత మరియు సంయమనముగా పేర్కొందును. ఇట్టి మానసికస్థితిలో ఇంద్రియకార్యకలాపములుశక్తిసామర్థ్యములన్ని నిద్రాణములై అణగారి యుండును. వాటి పనితీరుస్వయంప్రవర్తకమై యదేచ్ఛగా సాగుతూమనస్సుపై ఎటువంటి ముద్రలు పడనితీరున నుండును. సంపూర్ణప్రశాంతత అనునది యిందులోని గొప్పస్థితి యైననూఅసలైన సత్యస్థితి యింకనూ ముందున్నది. అది పరిపూర్ణ ప్రశాంతయొక్క యెఱుకగూడా లేనిస్థితి. అదిమనకు అవసరమైయున్నది. ---శ్రీరాంచంద్రజీషాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.    

                                                                    💟💟💟

సాధనలో పురోగించినవ్యక్తి కేవలమాహారము వలననే జీవింపడు. అతడు తనమనస్సుయొక్క సామర్థ్యములతో కార్యముల నిర్వర్తించును. మరింతముందుకు వెళ్ళినప్పుడు, నిమ్నకేంద్రములను ఉన్నతకేంద్రములు తమ అధీనమునకు తెచ్చుకొనును. మహోన్నత స్థాయిలో వ్యక్తి, కేద్రశక్తివలన జీవించును. దేహము సంపూర్ణముగా దివ్యతనొంది, కేంద్రముయొక్క అధీనమున ప్రవర్తించును. లాలాజీవారి కృపవలన, సహజమార్గమున యిది సాధ్యమగుచున్నది.- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురితమైనది.    

💜💜💜 

  నేను పెక్కుమందిజనము నావైపునకు రావలెనని ఉత్సాహపడుటలేదు. తమనితాము సముద్ధరించుకొని సమాజమునంతటిని సహజమార్గమువైపునకు ఆకర్షించి అభ్యాసులుగా మార్పుచేయుట కొఱకు నాకు సహకరించ నిచ్చగించి, నా గురుదేవుల మహదాశయమును వ్యాపింపజేసి సఫలీకృతమొనర్చనెంచిన శ్రద్ధాసక్తులుగల సత్యాన్వేషులు నాకు కావలయును.--- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.   

 💧💧💧

నీవేపని చేయుచున్నప్పటికిని, అది భగవదాజ్ఞకనుక, నావిధిగా (కర్తవ్యముగా) చేయుచున్నాననే తలంపుతో చేయుము. తద్వారా దైవస్మరణ నిరంతరంగా స్థిరంగా వుండునట్లు జేసికొనుము. ఇందువల్ల సంస్కారములు (ముద్రలు) ఏర్పడుట నిలచిపోవును. ఇది నీకుగలుగు ప్రత్యేకప్రయోజనము. నిరంతరముగా దైవధ్యాసలో నుండుటవలన, భగవంతునితో ప్రగాఢసంబంధ మేర్పడును. ఈస్థితి దైవముయెడ ప్రేమనుత్పన్నముచేసి పొంగిపొరలునట్లుజేయును. తద్వార భక్తి క్రమేణ పరిపూర్ణస్థితికి చేరుకుంటుంది. ఈవిధానము నవలంభిఒంచుట అత్యంతావశ్యకము.--- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.

💥💥💥 

 సంపూర్ణవిశ్వాసముతో పరతత్వము నభిలషించితివేని, నీవు హృదయపూర్వకముగా ధ్యాసను ఆఅనంతసత్యమునకు సన్నిహితముగా నుండునట్లు చేసుకొనుటొక్కటే నీ కర్తవ్యముగావలెను. అందువలన తక్షణమే నీహృదయమున ప్రేమ భక్తిభావనలు రగుల్గొల్పి నీలోని అణువణువునకు దైవీయశక్తిధార వేగముగా ప్రవహించును. --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ జూలై-సెప్టంబర్ 2022లో ప్రచురితమైనది.

 💧💧💧

సృష్టిమూలమునందు మానవత్వము, దివ్యత్వమునకు సన్నిహితముగా నుండెను. పరిణామక్రమములో చర్య ప్రతిచర్యల వలన గలిగిన కుదుపుల కారణంగా జడత్వమురూపు దాల్చినది. ఇప్పుడున్న మానవరూపముయొక్క కూర్పునకు సంబంధించిన అంశములన్నింటిని, తొల్లింటి అసలైనస భక్తి ప్రశాంతస్థితికి తీసుకొనివచ్చి దివ్యత్వముతో మరల సాన్నిహిత్యమును పునరుద్ధరింపవలెను. ఈకార్యము సఫలమగుటకు మానవునిలో సరియైన సమతాభావనను ప్రవేశపెట్టవలెను. ఈకార్యమునే మనము సహజమార్గమున నిర్వహించుచున్నాము. --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ అక్టోబర్- డిశంబర్ 2022లో ప్రచురితమైనది.

💚💚💚

ఈప్రపంచమును, ఉన్నదున్నట్లు గ్రహించనంతవరకు దీనికి, దీనికతీతమగానున్న ఆవలిప్రపంచమునకును ఉన్న తేడామీదనే మన ఆలోచన తిరుగాడుచుండును. ఈతేడా అంతరించిన తర్వాత, సమస్తవిశ్వము ఒకేవిధముగ నున్నట్లుతోచును, అంతేగాక అంతయు నిరామయ ఉజ్వలలోకస్థాయిలో నున్నట్లనుభూతమగును. అసలుసిసలగు నిజమైనసత్తా నిర్ధారణయై యీభౌతికప్రపంచము, ఉజ్వలప్రపంచముల మధ్య ఏతేడా,ఏఅవరోధములేక ఒకే వాతావరణము (ప్రాపంచిక మరియు ఉజ్వల) స్తాయిలన్నిట అనుభూతమగును.  .     --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురితమైనది.  

  💥💥💥

  సేవాత్యాగములనునవి ఆధ్యాత్మికదేవాలయ నిర్మాణమున కుపయోగపడు పరికరములు. దానికి ఆధారపీఠము ప్రేమ కావచ్చును. నిస్వార్థముతో చేసిన ఏపనియైనను అది ఉపయోగకారియే. వాస్తవమున స్వార్థరహితముగాచేయు మానవసేవయే దైవసేవ. --- శ్రీరాంచంద్రజీ, షాజహాన్‍పూర్.  ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2022లో ప్రచురితమైనది.  

💞💞💞

 ముక్తి తర్వాత అంతకుమించి చాలాదూరమే పయనించవలసి వున్నప్పటికిని, ముక్తికన్నాతక్కువ స్థితిని జీవితగమ్యముగా స్వీకరించదగదు.--శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

వివరణ:- ముక్తి=జననమరణ చక్రమును దాటుకొనుట.

 💧💧💧

దేహధ్యాస, ఇంకాచెప్పాలంటే ఆత్మధ్యాసనుండికూడా విడుదలపొందితే, అతడప్పుడు ఆతురతతో ఎదురుచూస్తున్న దానిని (పరమాత్మను, గమ్యమును) సమీపిస్తాడు --శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

 💜💜💜

మనము చేరవలసిన గమ్యమువద్ద, ఏవిధమైనశక్తి, బలము,చైతన్యమేగాక ఉత్తేజముకూడా కానరాకపోవుటయేగాక, మనిషి సపూర్ణశూన్యము, సున్నా, అనగా అతడు అభావస్థితిలోనికి ప్రవేసిస్తాడు.--శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

                                                            💥💥💥💥

పరమాత్మను పొందవలెనని నీవు సంపూర్ణవిశ్వాసముతో అభిలషించినట్లైన, నిన్నునీవు ఆఅనంతతత్త్వమునకు హృదయపూర్వక శ్రద్ధాసక్తులతో సన్నిహితముగా నుండునట్లు మలచుకొని, ఆవైపునకే నీధ్యాస నుంచుకొనవలెను. అదొక్కటే నీకర్తవ్యమై యుండవలెను. --శ్రీరామచంద్ర, షాజహాన్‍పూర్. ఆధ్యాత్మజ్ఞాన్ ఏప్రిల్-జూన్ 2023.

     💫💫💫

ఒకసారి బాబూజీ నాకు ఉత్తరం ఇలా రాశారు: "బిడ్డా!  ఇదేమి ప్రపంచామమ్మా! అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. అందరికీ జీతాలు పెరిగాయి. కాని నా జీతం పెంచాలని ఎవరూ అనుకోవడంలేదు.  నా జీతం ఏమిటో తెలుసా? మీరంతా నిరంతరస్మరణలోవుంటూ, అతి త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ సహకారమే నా జీతం. ఇలా నాకు ఉత్తరం రాశారు.   

                                                                                        ------ ఒక అబ్యాసిసోదరికి వ్రాసిన ఉత్తరము

 Once Babuji  wrote me a letter as follows: "Daughter, What a world is this! The prices of all things have gone up. Everyone's salary increased. Nobody thinks of increasing my salary. Do you know what my salary is? All of you should be in constant remembrance and reach the goal in the shortest possible time. That co-operation itself is my salary." Like this He wrote to me.        ---- A letter written to an abyasi sister.                                                                                               

 మాయ 

 ప్రజలు దైవాన్ని ఉన్నదున్నట్లుగాక  వారివారి  స్వంత  అభిరుచులకు ఇష్టాలకు అనుగుణంగా వారి మనస్సులలో అనేక కృత్రిమ రూపాలను సృష్టించుకొని ఆరాధిస్తూ, దైవాని మాయపొరల్లో (భ్రమల్లో)చుట్టివేసారు. అందువల్లనే(సాధనాపరమైన)అనేక చిక్కులు (కష్టాలు) ఉత్పన్నమగుచున్నవి.

                                                                                                 -----శ్రీరామచంద్రజీ 

                  నేను జపాన్ని సమర్థించను. అదిపూర్తిగా బాహ్యసంబంధ మైనది. అయితే నేను కూడా కొందరిని జపించమని సలహ నిచ్చాను. కానీ వారి విషయం వేరు. వారు తమప్రగతి కోసం స్వయంగా తమకైతామే ప్రయత్నించే వారు.  అటువంటి వారికుపయోగాపడే సాధనమే జపం. కానీ మన సంస్థలో అభ్యాసి పురోగతి బాధ్యత గురువర్యులే స్వతహాగా తీసుకుంటారు. ప్రాణాహుతిద్వారా అధ్యాత్మికశక్తి నందించి ఆయన యీ కార్యం నిర్వర్తిస్తారు. ఇటువంటప్పుడు అబ్యాసి మిక్కుటమగు భక్తి ప్రేమల కనబరచి గురువుగారి నుండి తనశక్తి మేరకు(ప్రేమ భక్తి కనుగుణంగా) శక్తిని పొందుతాడు. అభ్యాసి తానుచూపిన భక్తి సమర్పణలు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా ఆధ్యత్మికశక్తి అతనిలోనికి ప్రవహిస్తుంది 

                                ---వాయిస్ రియల్ పార్ట్-2

(Divine messages by Dr. S.P. Srivastava  అను పుస్తకమునుండి గ్రహింపబడినది.

  మోక్షము తర్వాత యింకెంతో సాధించవలసి యున్నప్పటికిని, మోక్షమునకంటే తక్కువ స్థాయిని మనగమ్యముగా నిర్ణయించుకొనరాదు.

మోక్షము=జననమరణ చక్రమును దాటిన స్థితి.

శరీరాన్ని, ఆత్మను అన్న భావననుండి ఏదోవిధంగా బయటపడినట్లైన, తను ఆతురతతో పొందాలనుకుంటున్న, అద్దానికి చేరువౌతాడు.

  ఎక్కడ అన్నివిధములైన శక్తులు, అధికారము, చేష్టలు, యింకాచెప్పాలంటే చైతన్యముకూడా తొలగిపోయి, మనిషి సంపూర్ణ‍అభావ, శూన్య లేక సున్న (పూజ్యము) స్థితిలోనికి ప్రవేశిస్తాడో, అదే అతడు చేరవలసిన తుదిస్థానము

పరమాత్మను పొందవలెనన్న సత్‍సంకల్పము కలిగియున్నట్లైన, హృదయపూర్వకముగా సత్యసంధతతో ఆవైపునకు మరలి, అనంతసత్యముతో సన్నిహితసంబంధము కలిగియుండుటొక్కటే కర్తవ్యమై యుండవలెను

మనము యెందుండి ఉద్భవమైతిమో ఆ సత్యసత్త్వములో లీనమగుటకొఱకే జీవన మియ్యబడెను. మనతోబాటే తెచ్చుకొన్న ఆ అనంతసత్యసత్వమునకు సన్నిహితముగానుండి, అనంతములో కలసిపోవుటకు, మనఆలోచనలకు స్వేచ్ఛనియ్యవలయును. దీనిని నిర్లక్షముచేసినట్లైన, అనంతసత్యతత్త్వమూలమునకు గాక మనయోచన చర్యలకు కట్టుబడిపోదుము.

 మనమున్న యీస్థితికి మనమే కారణము. కనుక మన భవితవ్యమెక్కువగా మనమీదనే ఆధారపడియున్నది. కాలము, వయస్సుతో నిమిత్తము లేనిదై చిదాత్మ, ఎప్పుడూ వయసుమీరినదైపోదు. కనుక ఆధ్యత్మికతకు ముసలితనమడ్డుకాబోదు. మనిషి తనజీవితములోని అన్నిదశలలో ఆధ్యాత్మికంగా యువకుడుగనే యుండును. అందువల్ల ఆధ్యాత్మికరంగమున, ఏది సాధించడానికైనా వయసు మీరిపోయినదనలేము.

 సృష్ట్యాదిన (మూలమున) మానవత్వము దైవత్వమునకు సన్నిహితముగా నుండినది. మనిషి తన పురోగమనకాలమున, చర్య ప్రతిచర్యల కారణమున కలిగిన కుదుపులవల్ల, స్థూలత్వమును సంతరించుకొనెను. దైవత్వముతో తిరిగి సంబంధమేర్పరచుకొనుటకు, మన నిర్మాణములోని అంశములన్నింటినితొల్లింటి నమ్రత ప్రశాంతతకు తీసుకొనిరావలెను. దీనిని సాధించుటకు మనలోనికి తగిన సమతను చొప్పించవలయును. దీనినే సహజమార్గమున మనమవలంభించుచున్నాము.              

 ప్రాపంచిక జీవనములోని గృహసంబంధమైన చిక్కులు, వ్యధలే మనకు ఓర్పు సహనమలవడుటకు శిక్షణనిచ్చుచున్నవి. అందుకే గృహమే ఒక శిక్షాణాలయమని, మాగురువర్యులు చెప్పుచుండెడివారు. గృహస్థజీవనములోని, ఒడిదుడుకులను ఓర్పుతో భరించడమే గొప్పతపస్సు. అది తపస్సులన్నింటిలో అత్యుత్తమమైనది. ఒడిదుడుకులేర్పడిన పరిస్థితులలో కోపతాపములకు లోనుగాక తప్పునాయందే వున్నదన్న తలంపుతోయుండి, యితరులతో వాదించి నిందించక, ప్రశాంతచిత్తముతో, ఓర్పుతో మెలగవలెను. మన మిత్రుల బంధువుల తిట్లు చీవాట్లను ఓర్పుతో భరించుటే ఘనతపస్సు. అవే విజయమునకు తిరుగులేని సాధనములు.

 ప్రశాంతతాస్థితియందుండికూడా దైవసాక్షాత్కారమునకై తపనపడుచుండు నతడే నిజమైన సాధకుడు.

మనకార్యకలాపములనింటను, యోచనలో ఆ మహోన్నతశక్తితో విడివడని సంబంధము గలిగియున్నట్లనుభూతిచెందవలెను. సమస్తచేష్టలు, కార్యకలాపములన్నిటిని, శక్తివంచనలేక సేవించనెంచిన మన మహనీయప్రభువు, మనకప్పగించిన పనులని, అవి నిర్వర్తించుట మన కర్తవ్యమని భావించినట్లైన, అవి సులువుగా నెరవేరును.

   ప్రభువును (గురువును) తన స్వంతప్రభువుగా అంగీకరించి, మనిషి ఆయన సేవలో సదా నిమగ్నమగుటయందే, అతని పరిపూర్ణత (perfection) ఉన్నది.

                                                                                  ----శ్రీరామచంద్రజీ, షాజహాన్ పూర్    (ఆధ్యాత్మజ్ఞాన్ (అక్టోబర్-డిశాంబర్) 2023 నుండి గ్రహించి తెలుగున కనువదించడమైనది)

          సత్యతత్త్వమునకై కలిగిన ప్రగాఢవాంఛ వ్యక్తిని సరియైనమార్గమునకు మళ్ళించగలదు. అది నిద్రావస్థలోనున్న వ్యక్తికి నూతనజీవితమునిచ్చి, మానవులకొఱకు కేటాయించిన మహోన్నతస్థాయిని చేరుటకు సిద్ధపరచును.

  నాహృదయము మీఅందరికోసం ఇక్కడగానీ మరెక్కడైననుగానీ మీతో జతచేయబడియున్నది. అది అనతికాలములోనే హృదయముల ప్రభావితము చేయుటకు ప్రకృతిసిద్ధముగా, నిరంతరనిశ్శబ్దమున స్పందనలను కలుగజేయుచున్నది.

 అందులో (దైవంలో) కలిగినక్షోభయే సృష్టికిమూలము. అదిమానవునిలో మనస్సుగా తెలియబడుచున్నది. దానిమూలములో అంతర్గతముగా, క్షోభలోనుండిన ఇచ్ఛాశక్తియే యున్నది.

 యోచనాశక్తియే ఆధ్యాత్మికతకు మూలము. దాని‍ఉపయోగమును సూర్యవంశపురాజగు దశరథునికి డెబ్బదిరెండుతరములకు పూర్వమొక ఋషి (పతంజలి) చే కనుగొనబడెను. దానినే రాజయోగ మనుచున్నాము. అంతిమస్థాయిని తిరిగిపొందుటకదియే మార్గమని ఆఋషి కనుగొనెను.

మనలోరాజైయున్నది ఆలోచనయే. అదే మనలో ముఖ్యముగా యోగ్యతను పెంపొందించి గమ్యమునకుచేర్చును.

ఆధ్యాత్మికత విలువ జనులకు తెలియడంలేదు. కారణం సంఘంగానీ, తలిదండ్రులుగానీ అటువంటిదేమీ వారికి బోధించిచెప్పలేదు. ప్రజకు విద్యగరిపి, వారు సరియైనమార్గము నెన్నుకొనునట్లు చేయుట మనకర్తవ్యమైయున్నది. మానవసమాజమునకు మనమేదైనా మంచిచేసినట్లైన అది కోరిచేసిన కోరికగాదు. అది మనకర్తవ్యము. మనయెడల వారు వారివిధులను సక్రమముగా నిర్వర్తించినా, నిర్వర్తించకపోయినా, మనముమాత్రము మానవజాతి సముద్ధరణకు మనకర్తవ్యమును మనము నివహించితీరవలెను.

 నిజానికి ఆధ్యాత్మికము మహోన్నతమానసిక స్థితి. దానితో పోల్చిచూచినట్లైన ప్రతీదీ బరువుగానూ, గాఢమైనదిగానూ తోచును. అత్యంతసున్నితమైన గులాబీపుష్పసువాసనకూడా దీనితోపోల్చినట్లైన, జ్ఞానేద్రియములకు భారముగనే తోచును.

 ప్రతి ఆత్మ (జీవి) సంతోషముగాను, ప్రశాంతముగాను జీవించుటన్నది, మరుగుపరచబడియున్న ప్రకృతిసిద్ధాంతము. మనము దానికి విరుద్ధముగా పనిచేయుట, ఆయన (భగవంతుని) విశ్వమును చెడగొట్టినట్లే యగును. 

మనము దివ్యశక్తినుండి ఉద్భవించితిమి. అదే మనకాధారమై యున్నది. కానీ అది కనుమరుగైపోయినది. మనల్నిమనం సంరక్షించుకొనవలెనన్న అద్దానిని తిరిగి పొందవలసియున్నది.

బంధనములనుండి స్వేచ్ఛను పొందుట  ఆత్మయొక్క సహజపరితాపమై యున్నది. ఎప్పుడైనా అలా చిక్కులనుండి విడివడుటకిష్టపడనివారుండిన, వారికిక పరిష్కారమే లేదు.

సహజమార్గవిధానము అకస్మాత్తుగా ఉద్భవించినదికాదు. ఇది ఆతురతతో యెదురుచూచుచున్న మానవజాతికి, దయతో అనుగ్రహించబడినది. సహజమార్గముగాక యేయితర సాధన, ఆరాధన (పూజ) కూడా మానవజీవితకాలములోని అతితక్కువసమయములో సత్‍ఫలితముల నివ్వజాలదు. సహజమార్గము మాత్రము అందుకు కట్టుబడియున్నది

                                                                                                                                                                    ----శ్రీరామచంద్రజీ, షాజహాన్ 

 (ఆధ్యాత్మజ్ఞాన్ (జనవరి-మార్చి) 2024 నుండి గ్రహించి తెలుగున కనువదించడమైనది)

 

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...