Friday, 17 February 2023

సహజమార్గంలో శిక్షణావిధానము

 సహజమార్గంలో శిక్షణావిధానము

                                                                                                    --- శ్రీరామచంద్రజీ

ఉనికియొక్క చైతన్యమొనర్చబడిన భాగమే జీవము. మనమెప్పుడు మనవంతు చైతన్యస్థితిని బహిర్గతమొనర్చితిమో అప్పుడే భౌతిక నికి తనపన్నులంటినీ ప్రారంభించినది. తొలుత అది దివ్యత్వముతో అధికాధికముగా అనుసంధింపబడి వుండినది. అందుండే జీవము పొడసూపినది. జీవమువృద్ధిచెంది క్రియాశీలత మొదలై దానినైజమునకణుగుణముగా మున్ముందుకుసాగి రానురానూ యిప్పటికి మనం మన సమత్వగుణం కోల్పోయి, సమతదప్పినస్థితికి చేరితిమి.


జీవమునకు అనుసంధింపబడియున్నది గనుక చైతన్యము చాలాశక్తివంతమైనది. కనుకనే దాని దురుపయోగము అప్రయోజనకరమై ప్రతికేంద్రమూ తననిజతత్వమును గోల్పోయి వైరుధ్యములను గ్రహించనారంభించినది. తత్కారణమున శరీరనిర్మాణమంతయూ మానవపరిశ్రమాలయమై, మనమంతవరకు గ్రహించినదంతయూ బహిర్గతమొనర్చ మొదలిడినది. ఈప్రక్రియ అనేక సంవత్సములు కొనసాగినది. జీవితకాలము ముగియగానే, మనము సమకూర్చుకొన్న జడత్వప్రభావమునంతయూ గైకొని మరొకదేహధారులమైతిమి. ఈవిధంగా ప్రతిపుట్టుకయందునూ జడత్వచర్యలు హెచ్చించుకొనుచూ తుదకాచర్యలే మనమైపోతిమి. ప్రతినరములకూడలీ ఒకద్రువమై వ్యతిరిక్తవాతావరణముతోకూడిన మార్పుల నుత్పాదిస్తూ పోతిమి. ఈవిధంగా మనచేష్టలు వరుసగా మిక్కుటమై మనదేహకేంద్రములు  బలపడిపోయినవి. తత్ఫలితముగా మనము ఒక్కోవిషయమున ఒక్కోరీతిగా మనకేంద్రముల యొక్క ఆజ్ఞలకు దాసులమైపొతిమి. 


మనజీవితము ఆధ్యాత్మికతనుండి దూరమునకు జరుగుతూ,కడకు జడమై పూర్తిగా చెడిపోతిమి. పరిస్థితులప్రభావముననో లేక భక్తజన సహవాసముచేతనో దివ్యత్వపుతెమ్మెర నాస్వాదించి,మనమున్న యీస్థిని తొల్లింటిస్థితితో పోల్చిచూడ నారంభించితిమి. అప్పుడు మనకింతకంటే మహత్తరస్థితులున్నవన్న విషయ మర్థమైనది. 


మనపూర్వపు వాస్తవస్థితిని తిరిగిపొందుటకు మార్గమన్వేషింప మొదలిడితిమి. తగినవ్యక్తికై వెదకితిమి. ఈఆలోచన అంతర్గతకేంద్రములను స్పృశించి తుదకది అన్నికేంద్రములలో కాననైనది. మరోమాటలో చెప్పాలంటే,మమాధ్యాత్మికతను స్పృశించినంతనే కేంద్రమునందలి మూలపదార్తముతో ఒకవిధమైన కదలికగలిగి తదైనరీతిలో ప్రతిస్పందించి, తత్ఫలితముగా నిజమైన ఆధ్యాత్మిక్కగురువు కడకు దారిచూపుతుంది. అట్లుగాక మనం తప్పుదారిపడితే, ఆధ్యత్మికముసుగులోనున్న మోసగానివైపునకు మరలుదుము. భగవత్సాక్షాత్కారముకొఱకే మనమారాటపడుచున్నట్లైన సరియైనగురువు లభించితీరును. అదృష్టవశాత్తూ మనకు సంపూర్ణమైన ఆధ్యాత్మికగురువు లభించియున్నారు. ఇకమనం మన సమతదప్పిన ఆలోచనలతో నిర్మించుకున్న ద్రువములన్నిటిని నశింపజేయు కర్తవ్యము గురువుదేయగును. అందువల్ల దూర్తవర్తనము నిలచిపోయి మనం సరైన ఆధ్యాత్మికవిధానమున పురోగమింతుము. ప్రతిదీ క్రమబద్ధమై తొల్లింటి నిజస్థితికి గొంపోవు బాధ్యత గురువుగైకొనుటద్వారా మనలో దివ్యత్వపుటెఱుక గలుగనారంభించి అదిమనవాటాగా మనకు లభించును.   


   శరణాగతి మరియు సహకారం

గురువు తనకర్తవ్యముగాభావించి స్వచ్ఛము, దివ్యమునైన తనస్థితిని అభ్యాసిలో ప్రవేశపెట్టి పురోగమింజేయును. ఆయన యీపనుకై మననుండి సహాయ సహకారములాపేక్షించి కొన్నిపద్దతులను నిర్దేశించెను. అందులో అతిముఖ్యమైనది ధ్యానము. ఈవిషయంలోకూడా ఆయన అభ్యాసికి సహాయపడును. ధ్యానమనగా మనసు యెక్కడెక్కడో తిరుగుటమాని కేంద్రముపై నుండునట్లలవాటుచేయుట. దీనికొఱకు హృదయముపై ధ్యానముచేయుటను నిర్ధారించిరి. అలా ఎందుకుచేయమనిరో మనపుస్తకములలో వ్రాయబడియున్నది.కనుక మరలాయిక్కడ నేను చెప్పదలచుకోలేదు.


నేను నిర్దేశించినట్లు అభ్యాసి హృదయముపై ధానముచేయును. అయినప్పటికినీ గురువుపై ఆధారపడు తత్వము తప్పక అభ్యాసికలిగియుండును. ఈ సక్రమమైన మార్గంలో కష్టమేదైనా వున్నదంటే, అది శరణాగతియే. అదికూడా నేరుగా గైకొనుటయందున్నది. జనులు మామూలుగా ఆలయమునకెళ్ళి అందలి విగ్రహమునకు సాగిలబడి శరణుజొచ్చితిమని మాటలలో పలుకుచుందురు. ఇది శణాగతి కానేకాదు. పులివెంటబడగా ఒకబాలుడు పరుగెత్తి తల్లిఒడిచేరినట్లున్నది. తల్లి అతనిని పులిబారినుండి రక్షించగదోలేదో తెలియదు. భగవంతునిపై సంపూర్ణముగా ఆధారపడితినన్న దృఢనిశ్చయమే అత్యుత్తమ శరణాగతి. నేను తొలుతచెప్పినట్లు సమర్థుడైన గురువుపైసమర్పితభావముననుండుట ముఖ్యము. శరణాగతియందు సామాన్యముగా తాను, శరణాగతి పొందుచున్నాననని తెలియుచుండును. ఇక్కడ ముఖ్యముగా నేను అన్నభావముకలిగి ప్రవర్తించుచుందుము. ఈ నేనెను విదళించివేయవలెను. లేనియెడల యీవిధానమున నేను అన్న అహము పెంపొందునేగానీ శరణాగతివుండదు. సరైనభావనతో దైవముపైగల భక్తియొక్క ఫలితమే శరణాగతి.


ఉనికియొక్క అంతర్గత అనుసంధానమే నిజమైన భక్తి. భక్తియే అతిముఖ్యమైన సాధనము. అత్యంతవిశేషమైన పరమభక్తిలో అభ్యాసి ప్రేమిస్తున్నాడనిగాని, అసలెందుకు ప్రేమిస్తిన్నాడో కూడా యెఱుగనిస్థితిలో నుండును. ఇటువంటి సంఘటనలు మనపురాణములలో కృష్ణపరమాత్మకు సంబంధించి వివరింపబడియున్నవి. "నేను" ప్రబలముగానున్నట్టి ఎఱుక శరణాగతిస్ఫూర్తికే ఆటంకము కలిగించును. అది ఆశించినఫలితములనుగాక తద్విరుద్ధములైన ఫలితములనిచ్చును. ఒకపులి తాను పులినన్న బావము కలిగియున్నపుడు, దానిపిల్లలపైగూడా అది గుర్రుగానుండును. మనిషి తాను మనిషినన్న భావముతోనున్నపుడాతడు, దయ్యమువలె యితరులను హింసించును. సంపూర్ణశరణాగతిపొందితిననిన సహజముగా సర్వమానవాళికి తాను శరణుజొచ్చితినన్నభావన ఎఱుకలోనికివచ్చి, తద్విషయము గ్రహించనారంభించును. పరిపూర్ణశరణాగతి గలిగనంతనే, సహజసిద్ధంగా శరణగతియను భావనే మరచియుండును. ఒకాభ్యాసి సహజసిద్ధతకొఱకే ముఖ్యంగా జాగరూకుడైయుండవలెను. శరణాగతి మరియు సహకారమురెండూ కవలబిడ్డలు.


అభ్యాసి రెండువిధముల పురోగమించును. అంటే ప్రాణాహుతిప్రసారమువలన మరియు స్వశక్తివలన. రెండూ ముఖ్యమే. ఒకప్రశిక్షకుడు ప్రవేశపెట్టిన వెలుగులో అభ్యాసి వివిధకేంద్రములకు చేరుకొనును. ఉన్నతస్థాయిబిందువులవద్ద, అభ్యాసి ఒకవిధమగు ప్రకంపనలననుభూతిచెందును. ప్రశిక్షకుడుచేయు మరొకపని, అభ్యాసిని వివిధస్థానములకు కేంద్రములకు పురోగమింపజేయుట. తమ స్వప్రయత్నమున యీ పురోగతి సాధించువారరుదు. సహజమార్గమున మాత్రమే, శిక్షణాక్రమమున అభ్యాసికి సక్రమమార్గమునేర్పరచి ప్రశిక్షకుడు ఆధ్యాత్మిక ప్రయోజనమును సిద్ధింపజేయును. కనుకనే ప్రశిక్షకులుచేయవలసినపని మిక్కుటముగానున్నది. గురువు మరుయు ప్రశిక్షకులసహాయము లేకుండా అభ్యాసి ఉన్నతోన్నతస్థానముల నధిగమించజాలడని నేను నొక్కివక్కాణించున్నాను. ఎందుకనగా జీవము ఉన్నతస్థాయినుండి నిమ్నస్థాయికి దిగివచ్చినది. మరోవిధంగా చెప్పాలంటే, అది తన స్వశక్తితో క్రిందికిదిగుచున్నది. సూక్ష్మమైనశక్తి చాలాబలమైనది. అభ్యాసి తనస్వశక్తితో ఉన్నతస్థాయికి ఎగబ్రాక ప్రయత్నించేకొలది అతడు క్రిందికి నెట్టబడుచుండును. అందులకు కారణమాతడు సూక్ష్మశక్తిని గ్రహింపకుండుటే. తగినసమయములలో కొంతవరకు అభ్యాసి ప్రయత్నించగలడుగాని,ఆతర్వాత తనకైతాను ముందుకుపోజాలడు. ప్రశిక్షకునకు కేంద్రములు మరియు వాటికున్నశక్తికి సంబంధించిన జ్ఞానమున్నది. కనుక ప్రశిక్షకుడు తనపనులన్నిటిని సక్రమముగా చక్కదిద్దుటకాతడు, నేరుగా తనకు లభించు దివ్యశక్తిని గ్రహించి పనిచేయును. ఒకవేళ అభ్యాసి తనస్వశక్తితోనే కొంతముందుకుసాగినా,గురువును అలక్ష్యము చేసినట్లైన, ఒకస్థాయితర్వాత అతనిప్రయాణము వంకరలువోయి దారిలో ముడులేర్పడి ముందుకుకదలుటకాటంకమైపోవును. దీనిని కేవలమొక ప్రాణాహుతిప్రసారము ద్వారామాత్రమే సరిచేయవీలగును.


ప్రార్థన యొక్క ప్రాముఖ్యత 

ప్రశిక్షకుని ముఖ్యమైనపనిముట్టు మనశ్శక్తి. అయినను అభ్యాసి మంచిఫలితముల నందుకొనుటకు, తగినపద్దతులుండనేవున్నవినేను సంస్థలోని ప్రశిక్షకులను వారి అనుభవములందివ్వమని అర్థించుచున్నాను. ప్రశిక్షకులు అభ్యాసులకొఱకు ధ్యానము, ప్రార్థనలను విధానములను అనుసరించుచున్నారు. అభ్యాసియొక్క ఉన్నతికొఱకు ప్రశిక్షకుడు తదితర విధానములనుకూడ వినియోగించును.


ప్రార్థనయొక్క అవసరమేమంటే, ప్రార్థనచేయుసమయమున ఒక వినమ్రభావమున నుందుము. అది శరణాగతికి అతిసమీపస్థితి. సులభముగా శరణాగతి చేయలేనప్పుడు, యీవిధానముపయోగపడును. తర్వాతివిషయములు వాటంతటవే సమకూరుచూ పోవును. సందర్భానుసారమో లేక అలవాటుగానో వ్యక్తి మనస్సులో ఉద్రేకమునకు తరచూ గురికాబడును. అతడీపరిస్థితినుండి బయటపడటానికి ఒకగురువు నాశయించును. గురువు ఒకానొక పద్దతినవలంభించమనును. మాగురువర్యులైన లాలాజీ వారి వ్రాతచీటీలో సూచిస్తూ, ఒకప్రామాణిక గ్రంథానుసారము మానసికరుగ్మతకు పరిష్కారము చూపుట సరికాదనెను. ఇటువంటిసమస్యలకు ఒకమహాత్ముడీవిధమగు పరిష్కారముచూపి సఫలుడాయెనని వివరించవచ్చును.ౠజువుచూపెనుగాన ఆవిధానము సరియైనదే కావచ్చును. అయితే దివ్యజ్ఞానోదయమైన గురువుచూపిన పరిష్కారమేదైనప్పటికిని అది నిస్సంకోచముగా సరియైనదే అయివుండును. సహజమార్గవిధానములో పనిచేయుకర్తవ్యము   ప్రశిక్షకునిదైతే సత్ప్రవర్తకుడుగా మారుట  అభ్యాసిపనియైయున్నది.


నైతికధైర్యమే ఆధ్యాత్మికతకు ఆధారము. అదివ్యక్తి నీతివంతుడైనపుడే ఉదయించును. చూచుటకడెంత మహాత్ముడుగా అగుపించినను అతని ప్రవర్తన నీతివంతము గానియెడల, అతనిఘనత అనుమానాస్పదమేనని మాగురువర్యులు చెప్పెడివారు. అట్టివ్యక్తి ఆధ్యాత్మికతనిసుమంతైనా శ్వాసించికూడా ఎఱుగడని చెప్పుదును. నైతికత యనగా శక్తియుక్తులన్నియు సత్కార్యములకై సమతాస్థితినందియుండుటయే.ఈస్థితి అహంభావమునకు దూరమైనపుడు మాత్రమే ఉదయించనారంభించును. కనుక యిదే పరమావధిగా మతవిధానములన్నియు యేర్పడినవి. ఇందుకొఱకు సహజమార్గ విధానములు అత్యంతసులభతరములై యున్నవి. అహమునకు అధికప్రాధాన్యతనిచ్చిన నైతికత చెడిపోవును. కనుకనే "నేను" (అహాన్ని) ను భగవంతునివైపు మరల్చుట ప్రశిక్షకుడు పోషించు ముఖ్యభూమిక.


మనసు మార్పుచెందుటద్వారా జనించిన స్థౌల్యస్థితే యీ ఆహము. ఈవిషమును మరింతవిషదముగా చెప్పి, సామాన్యులకుసైతం అవగాహన కల్పించవలెనన్న, అది (అహము) ఒకవ్యక్తిగతశక్తిగా మారి ఒకప్రత్యేకతను సంతరించుకొన్న ఉనికి యని నేనుచెప్పదలచితిని. మనం ఒకసద్గురువు అధీనంలో ఉన్నట్లైన, మనిషి మహనీయుడుగా మారుటకవసరమైనవన్నియు వాటికైఅవే సంప్రాప్తమగును. వాస్తవమున మనపద్దతిలో నిద్రాణస్థితిలోనున్న అభ్యాసిలో దివ్యత్వముచొప్పించు విధానములు  ప్రశిక్షకునకివ్వబడినవి. అభ్యాసి విధిగ స్మసరణలోనున్నయెడల, అది అతనికత్యంత సహాయకారియగును. దట్టమైనపొరలను తొలగించి దివ్యత్వము వికసింపజేయు కార్యమును గురువు నిర్వహించును. ప్రశిక్షకునికి ఆత్మవిశ్వాసము లేనప్పటికిని తాను ప్రసారముచేయు, ప్రాణాహుతి సూక్ష్మగ్రాహ్యమగు వెలుగును ప్రసరింపజేయును. మనంద్సరిలో ఒకేఒక దివ్యశక్తి పనిచేయుచుండుటయే యిందులకు కారణమగుచున్నది.  తీర్చిదిద్దుట ప్రశిక్షకుని కర్తవ్యము. మనసంస్థలోని ప్రశిక్షకులందరు గురువులమనిగాక సాటివ్యక్తులమను నిస్వార్థబుద్ధితో బాగుగా పనిచేయుచున్నందున, నాకు సంతోషముగా నున్నది. ఈభావము మరితగా వృద్ధిచెందునుగాక!     

(ఆధ్యాత్మజ్ఞాన్ 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసపత్రికలో ఆంగ్లంలో వెలువడిన "method of Training in Sahaj Marg" అనే వ్యాసమునకు తెలుగు అనువాదము. )       

Thursday, 16 February 2023

అంతఃశుద్ధీకరణ,cleaning

 అంతఃశుద్ధీకరణ

                                                                                                     -- శ్రీరామచంద్రజీ

లాలాజీవారిసాటిలేని అనుగ్రహమువలన మనకొక శిక్షణావిధానము లభించినది.అది సాటిలేని ప్రతిభావంతమని నేను నొక్కివక్కాణించగలను.అది మహదాశ్చర్యకరము సరళమునైన విధానమై యుండుటకు గలహేతువేమిటో మీకు తెలియునా? అదే మనసంస్థలో అనుసరిస్తున్న అంతఃశుద్ధీకరణ విధానము.

వాస్తవమునకు మనపూర్వసంస్కారములే మనల నణగద్రొక్కి, మన నడవడిగామారి సరిదిద్దుకొనలేని స్థితిలో పడవైచినవి. మనంమన గతసంస్కారములకు బానిసలమైపోతిమి. మనంస్వతంత్రంగా ఆలోచిస్తున్నామని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామని అనుకుంటున్నాముగాని యిదంతా భ్రమ. మనం ప్రతివిషయంలోను మనగతంచేత నియంత్రబడుతున్నాము.ఈపరిస్థితులలోవున్న వ్యక్తిని మనమెలా మార్చగలము? 

ఇది లాలాజీవారి గొప్పదనము. ఈఅంతఃశుద్ధివిధానముద్వారా గతంయొక్క ప్రభావమును పూర్తిగా నిర్మూలించేస్తాము. అయితే యీపని ఒక్కసారిగాకాక క్రమేణాజరుగుతుంది. ఇదెంతటి గొప్ప వరమో గమనించండి. మారితీరాలని ఒకవ్యక్తి బోధించటంవల్ల ప్రయోజనమేమున్నది? అయినా ప్రతియొక్కరూ మారాలనే అనుకుంటారు. కానీ వారికిది సాధ్యంకానిపని. ఎందుకంటే మనస్సు గతంతో నియంత్రించబడుతున్నది. గత సంస్కారాలతో కూడియున్న మనస్సును శుద్ధీకరించడం వలన మార్పుతీసుకొనిరావచ్చునన్న విషయం మీరు గమనించవచ్చును. ఈ విధంగా గతమ్యొక్క ప్రభావంనుండి విడుదలపొందుట అభ్యాసికి సాధ్యమగును. 

వాస్తనమునకు యిదే మనకున్నబంధనము. మన గతసంస్కారములు (ముద్రలు) మన ప్రవృత్తులకు మూలమగును. వీటిని మార్పుచేసికొనుట మనకు కష్టమనిపించును. ముద్రలను పరిశుభ్రపరచినట్లైన ప్రవృత్తులను సులభముగా సవరించవచ్చును. అనేకుల విషయములో దానికైఅదే జరిగిపోవును. అటువంటప్పుడు ఆలోచన ఆచరణ తగురీతిగాను (సరిగ్గాను) సహజంగానూ రూపుదిద్దుకొనును. అనగా ప్రాణాహుతిప్రసారంతోనే అన్నీ సరిదిద్దబడవు. శుద్దీకరణ అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినా, గతసంస్కారములు వెనక్కు లాగుటవలన పతనమగు ప్రమాదము వుండనేవున్నది. పురోగతి నిరాటంకముగా వుండాలంటే, మన అంతర్గత నిర్మలీకరణ అత్యంతావశ్యకము. అందుచేతనే నేను ప్రశిక్షకులకు యీవిషయంగా మరింతశ్రద్ధవహించమని చెబుతూవుంటాను. ఇది అత్యంతముఖ్యాంశము. క్రిందిస్థాయిలో యీపనికై మరింతశ్రమపడవలసివస్తుంది. కనుకనే నిర్లక్ష్యముచేసే పరిస్థితులేర్పడుచున్నవి. అందువల్ల అభ్యాసులకు చేయుసేవ నిరర్థకమౌతున్నది.

మనం అభ్యాసులకు సేవచేయుటకున్నాము. అయినప్పటికీ నిర్మలీకరణ నిర్లక్ష్యముచేయుటవలన, నిజానికి వారికి సేవచేయని వారమౌతున్నాము.

సంపూర్ణసహకారము

ఇది మీమీదే ఆధారపడివుందని నేను మళ్ళీమళ్ళీ మనప్రశిక్షకులకు తెలియజేస్తూనే వున్నాను సంపూర్ణసహకారంవలన  పనిసులువౌతుంది. నేను అభ్యసిని శుద్ధిచేస్తూపోతుంటే, అభ్యాసి మాత్రం జడత్వాన్నిపెంపొందించుకుంటూపోతుంటే, నేనుమాత్రమేమిచేయగలను? మీరు అభ్యసినికూడా సహకరించేట్లు చేయాలి. అతడు తనపురోగతికి సహాయకారిగా వుండేట్లు తనజీవితాన్ని సరిదిద్దుకోవాలి. కూడబెట్టుకున్న గతసంస్కారాలను తొలగించే కార్యాన్ని గురువు నిర్వహిస్తాడు.

కానీ అభ్యాసి అలసత్వంవహించక చురుగ్గావుండి, తనఆలోచనలతో ఆచరణలతో మరింతజడత్వాన్ని పెంపొందించుకొనకుండా వుండాలి. అందుకే మెలకువగావుండటం అవసరం. ప్రతిదినం చేసుకొనే నిర్మలీకరణవిధానాన్ని తప్పక అనుసరిస్తూపోతే, లాలాజీవారి కృపవల్ల ముద్రలేర్పడడం నిలచిపోయేస్థితికి చేరుకుంటారు. ఇక సంస్కారాలేర్పడవు. ఇదిఒక గొప్పస్థితి. కానీ వాస్తవానికిది ప్రయాణంలో ప్రారంభముమాత్రమే.

సంస్కారాలేర్పడటం నిలిచిపోగానే, గమ్యం నీకనుచూపుమేరలో వుంటుంది. గతంలో పేరుకపోయివున్న సంస్కారాల అవశేషాలేవైనా కొన్నిమిగిలిపోయివుండవచ్చును. వాటిసంగతి గురువుగారే చూసుకుంటారు. అది ఆయనబాధ్యత. నేను మరోవిషయం తెలియజేయవలసి యున్నది. మనం శరీరధారులమైయున్నంతకాలం కొంత జడత్వం వుండనే వుంటుంది. ఒకవేళ దేహి సంపూర్ణంగా శుద్ధిగావింపబడితే, ప్రాణం నిలువదు. అట్లని (నవ్వుతూ) జీవితం కొనసాగడం కోసం మనలో జడత్వాన్ని పెంపొందించుకొనరాదుసుమా! ఎప్పుడైతే సంస్కారాలుయేర్పడడం  నిలచిపోతుందో, అప్పుడే గమ్యం, మన దరిదాపుల్లోకొచ్చిందని గుర్తించాలి. అస్థితిలో వ్యక్తి సాధారణజీవితం సాగిస్తూ, వివిధములైన పనులను చక్కగా నెరవేరుస్తూ వుంటాడు. కానీ అతనికి యేవిధమైన సంస్కారములూ అంటవు. ఈస్థితిలోనివానిని నేను జీవించియూ మరణించినవాడని అంటాను. ఈస్థినందుకోవటానికి అభ్యసి తప్పక సహకరించవలసి వుంటుంది. అదెలాగంటే, చెబుతా వినండి. నేనొక అందమైనగులాబీపువ్వును చూశాననుకోండి. ఆహా! యెంతబాగున్నది అనుకుంటాను. అందులో తప్పేమీలేదు. అలాకకుండా మళీమళ్ళీ దాన్నే చూడాలనుకుంటాను. అదితప్పు. గులాబీ అందంపై మక్కువపెంచుకొని తద్వార లోతైనముద్రలు మనసుపై పడనీయరాదు. అలాజరిగితే మాటిమాటికీ దానిదగ్గరకువెళ్ళి చూడాలనిపిస్తుంది. ఇది, యేర్పడినముద్రలు మరింత బలపడేట్లుచేస్తుంది. ఆతర్వాత దాన్ని పొందాలనే ఆకాంక్ష మొదలై ఒకాటాడిస్తుంది. మనంలొంగిపోయామంటే, యిక దానిపనియది మొదలుపెడుతుంది. గమనించిచూడండి. ఒకచిన్న ఆలోచనను అదుపుచేయకుండా సాగనిస్తే, అది కార్యరూపందాలుస్తుంది. పర్యవసానంగా అది నిరాటంకంగా మున్ముందుకు వెళ్ళి, వరుససంఘటనలకు కారణమై, వాటిలో మనం చిక్కుకొనిపోయేట్లుచేస్తుంది. అందుకేమనం జాగరూకతతో చైతన్యవంతులమై వుండాలి.

దరు సాధనమొదలెట్టగానే ప్రశాంతత కావాలంటారు. కానీ వారికి సాంతం నిరంతరాయంగా ప్రశాంతత నివ్వడమెలా సాధ్యమౌతుంది? నిర్మలీకరణకార్యం జరుగుతున్నపుడు, సంస్కారాలు హృదయంనుండి పెగలింపబడతాయి. అప్పుడు, అభ్యాసి కొంతమేర ఆంధోళనకుగురౌతాడు. కేవలం ప్రశాంతతే కావాలంటే, సంస్కారాలు పూర్తిగా పరిశుద్ధంగావింపబడవు. మోక్షంసిద్ధింపదు. మోక్షంసిద్ధించాలంటే, తపనను ఆహ్వానించటానికి సిద్ధంగా వుండాల్సిందేమరి.

(ఆధ్యాత్మజ్ఞాన్ 2022 అక్టోబర్-డిశంబర్ త్రైమాసపత్రికలో ఆంగ్లంలో వెలువడిన "cleaning" అనే వ్యాసమునకు తెలుగు అనువాదము. )         


 


పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...