Monday, 8 August 2022

దేవుడు-మనిషి,God-Man

 

దేవుడు-మనిషి

      -శ్రీ రామచంద్రజీమహరాజ్ . షాజహన్‍పూర్.

 

                  దేవుడు లేడని మనిషి అనలేడు. కానీ దేవుడంటే యేమిటి? ఎవరు? అనేవిషయమై అభిప్రాయభేదములు మాత్రమున్నవి. ఇవికూడా మనిషికి ప్రసాదింపబడిన జ్ఞానమువలన కలుగుచున్నవి. ఈ జ్ఞానము మనిషిసృష్టి కాదు. కనుక దాన్నీ సక్రమముగా ఉపయోగించుకోవాలి. అంతేగాని జ్ఞానమూలాన్నే తిరస్కరించేవిధంగా జ్ఞానాన్ని దుర్వినియోగపరచరాదు. ఈమాట దైవం ఉనికిని మనిషి నిర్ద్వందంగా  ఒప్పుకొనేట్లు చేసి, మొత్తనికి మనిషి  దైవమంటే యేమిటనే అన్వేషణలో పడేట్లు చేస్తుంది.

                    వాస్తవానికి దైవం మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానమే అసలు జ్ఞానమూలాన్ని శంకించే అయుధంగా మనిషి ఉపయోగిస్తున్నాడు. దీన్నిబట్టి ఆలోచిస్తే, దైవం మనిషిఅపనమ్మకాన్ని, యెన్నడూ గణనలోనికి తీసుకోలేదు. అంతేగాకుండా దైవం, మనిషికి పూర్తిస్వేచ్ఛ నిచ్చాడు. హేతువాదమునకు నిలువకున్నచో దైవముయొక్క ఉనికిని సైతం ప్రశ్నించే స్వాతంత్ర్యమిచ్చాడు. అంటే జ్ఞానధిక్కారమన్నమాట. ఏదియేమైనా మనిషి జ్ఞానముద్వారానే దైవంఉనికిని ఒప్పుకోవలి, అంధవిశ్వాసంతో ఒప్పుకోవడం సరికాదు. దేవుడున్నాడన్న నమ్మకంతో ముందుకుసాగాలంటే తెలివినుపయోగించవద్దని చెప్పడం తప్పు. ఈ తప్పును దాదాపు అన్నిమతాలూ యేదో ఒకదశలో చేస్తూనేపోయాయి. ఇది ఆత్మవంచన. దైవం స్వేచ్ఛాయుతజ్ఞానప్రదాత. ఆ జ్ఞానం దైవంఉనికిని శంకించేదిగా వుండకూడదనటం కూడా సరికాదు.

          దేవుడులేడనే నిర్ణయానికి మనిషి రావడం అసాధ్యంమౌతున్నది. ఎందుకంటే, తన‍ఉనికిని తాను యెప్పుడూ లేదనలేడు. అలా అనడానికైనా తానంటూ ఒకడుండితీరాలి. కనుక తన ఉనికిని తాను శంకించడం కుదరదు. ఆ ఉనికి నిజానికి స్థూలశరీరాన్ని సూచించదు. తన్నుతాను లేదనుకోలేడు గనుక, తన ఉనికిని అన్వేషిస్తూ తుదకు దేహానికి, మనస్సుకు, తెలివికి ఆవలనున్న ఆత్మసాక్షత్కారానికి చేరువౌతాడు. ఈవిధంగా లేదనలేని తన సూక్ష్మ ఉనికిని ఉన్నదని ఒప్పుకోవడంద్వారా దారి తెరువబడి, స్వానుభవము, తర్కమువలననే, దైవం అవగతమవ్వవలసినదేకానీ. మతగ్రంథములను గ్రుడ్డిగానమ్మి వాటికి కట్టుబడియుండుటవల్ల  ప్రయోజనములేదు. 

         ఆత్మసాక్షాత్కారానంతరము స్వానుభవము. మరియు జ్ఞానముద్వారా భగవంతుని కనుగొనుటకు మరొక్కడుగు ముందుకేయవలసియుండును. ఈ దేహము, మనస్సు, తెలివియనెడి పొరలను ఒక్కొక్కటిగా  ఛేదించుకుంటూ, ముందుకు పయనించి, తన అంతిమస్థాయి ఉనికిని మనిషి తెలుసుకోగలుగుతాడు. అదే ఆత్మ పరమాత్మ ఒక్కటేనన్న సత్యము. ఈ యేకత్వానుభవం కలగాలంటే, మనిషి తనజ్ఞానంతో తనపై చుట్టుకొనియున్న అసంఖ్యకములైన ఉల్లిపొరలవంటి తొడుగులను తొలచివేసుకుంటూ, ఛేదించుకొంటూ ముందుకువెళ్ళి స్వచ్ఛమైన మనిసిగా తన్నుతాను మార్చుకున్నప్పుడే యిది సాధ్యమౌతుంది.

               ఒకకవి, యిలా చక్కగా గానంచేశాడు. ఓ హృదయమా! ఆయన  ద్వారమునకు యే తెర అడ్డముగలేదు. అయన దివ్యమంగళముఖారవిందమునకు యే ముసుగూలేదు. నీవే అహంకారమనే ముసుగుధరించి తెరలకావల నిలుచున్నావు సుమా!.

             నీరుల్లిపొరలనన్నింటినీ తొలగించిన తర్వాత మనకగుపడునదేమియు వుండదు. శూన్యం. నాస్తికుడు కూడా దైవమనేదేదీ లేదనేకదా! వాదించడం మొదలుపెడతాడు. కనుక తుదకు నిరామయమని తేలినప్పుడతడు ఆశ్చర్యపోనక్కరలేదు. దేహము, మనస్సు, తెలివిఅనే తొడుగులన్నీ ఛేదించుకొని వెళ్ళినతర్వాత, నీరుల్లిపొరలంతమెలా శూన్యమో, తనవిషయములోకూడా దేహము, మనస్సు, తెలివిఅనే తొడుగులన్నీ తొలుచుకొని లోనికి వెళ్ళినతర్వాత వున్నది శూన్యమేనని అర్థమౌతుంది. మనిషి చేరుకోవాలనుకొనే యీ శూన్యముయొక్క సకారాత్మకపార్శ్వము నిజానికి అత్యంతసన్మోహనమైనది. అది తను ప్రియునికౌగిటిలో పూర్తిగా మైమరచి కరగిపోవుటవంటిది. అదే బుద్దుడు, తన్నుతాను పూర్తిగా మైమరచి (నిర్వాణదశ నందుకొని) ప్రభువుగా, భగవంతునిగా ఆరాధింపబడ్డాడు. భగవంతుడున్నాడు. ఎప్పుడూ? ఎప్పుడక్కడ నీవులెవో అప్పుడు. తాను తనప్రియునివలన కలిగిన దివ్యానందమును తన సస్వభావముతో గ్రోలడమా? లేక వాస్తవనిరామయతను (శూన్యమును) కనుగొనుటకై తననుతాను సైతం కోల్పొవలసియుండునా? అన్నదికూడా అతని యెఱుకలో వుండదు. పొరలన్నీతొలగి రుచిరహితమైన తర్వతగూడా రుచి, అరుచులకు భిన్నమైన రుచేదో ఒకటి వుంటున్నది. ఒకటి (మనిషి) కి సున్న (దేవుడు) ఎడమవైపు (నాస్తికత్వం) ఒకదశాంశబిందువు (స్వసంకల్పం) తో ఇచ్ఛారహితంగా (సహజమార్గంలో నిర్దేశించినట్లు యోగసాధన) చేరుస్తూపోతే సున్నాకు దగ్గరగా, మరింత మరింత దగ్గరౌతూపోతాము. దేవుడు తనరూపముననే మనిషిని సృష్టించెనంటారుకదా! అట్టి మనిషి తనకు ప్రసాదింపబడిన జ్ఞానముతో, తుదకు మిగిలివున్నదేదో తెలుసుకుంటాడు. ఇది గ్రుడ్డినమ్మకంతోగాక, తొలుత తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో లేదు కాదని వాదించినా, తర్వాత జ్ఞానోదయమై అసలువిషయం తెలుసుకుంటాడు.

 మతం అంతమైనప్పుడే, ఆధ్యత్మికత మొదలౌతుంది.

ఆధ్యాత్మికత అంతమైనప్పుడు, సత్యతత్త్వం మొదలౌతుంది.

సత్యతత్త్వం తుదకు చేరగానే ఆనందపరిధిలోనికి ప్రవేశిస్తాము.

ఎప్పుడు దాన్నికూడా అధిగమిస్తామో అప్పుడే మనం గమ్యందరిచేరుతాము.

·       

(ఇది ఏప్రిల్-జూన్ త్రైమసిక "ఆధ్యాత్మిక జ్ఞాన్" పత్రికలో ప్రచురితమైన ఆంగ్లవ్యాసానికి అనువాదము.)

అనువాదం:- శ్రీ పి. సుబ్బరాయుడు ప్రశిక్షకులు కడప.)

 

v  

                      మొక్కకు ముల్లు గట్టిగా పొడవుగా పెరిగిందంటే, దాన్ని కత్తిరించి వేయాల్సిందే, తప్పదు. అసలు గుర్తుంచుకోవలసిన  విషయమేమిటంటే, స్వార్థం యింతోఅంతో అందరిలోనూ వుంటుంది. కానీ అది హద్దుమీరితేనే దోష మౌతుంది. జాగ్రత్తా! స్వార్థం కాసింత హద్దుమీరినా ఆధ్యాత్మిక జీవనం దోషభూయిష్టమౌతుంది. ఇది బాగా గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యవిషయం.

                      --బాబూజి రాఘవేంద్రరావ్ గారికి వ్రాసిన లేఖల సంపుటి- పుట.54.

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...