ప్రతిధ్వని
(శ్రీరామచంద్రజీ
మహరాజ్ షాజహానపూర్ శిష్యగణ ప్రతిస్పందనలు)
అనువాదం : పి.
సుబ్బరాయుడు, ప్రకశిక్షకులు
9966504951
శ్రీ రామచంద్రజీ మహరాజ్ షాజహాన్ పూర్

పి.
సుబ్బరాయుడు, ప్రశిక్షకుడు
9966504951
v
క : శ్రీ రామచంద్రజీ మీ
సారయశఃచంద్రిక లిల సంభావ్యంబై
మేరలు మీరం వ్యాప్తికి
ధీరత మీశిష్యగణము దెచ్చిరి భక్తిన్
తే:గీ : వారి పలుకులు మీ ప్రతిధ్వను లటంచు
తెలుగుభాషను మాత్రమే తెలుసినట్టి
వారి సౌలభ్యమున కనువాద మొనర
జేసి యిచ్చితి బాబుజీ జేకొ నంగ
v
విషయసూచిక
1.ఆఒక్కటికై అన్వేషణ.. 7
2. శాస్త్రాధారిత సహజమార్గము.... 9
3.మన నిర్మాణమునకు మనమే శిల్పులము.... 14
4. దైవేఛ్ఛ – మానవేఛ్ఛ... 19
5.అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము.... 23
6.ఆయనకొఱకు తపన ఆవేదన.. 29
7.సహజమార్గంలో ప్రార్థన.. 34
8.స్వార్థము.... 38
9. సహజమార్గమున నిజజీవితామృతము.... 42
10. ఇది-అది.. 47
11.దివ్యజీవనము.... 50
ముందుమాట
శ్రీరామచంద్రజీ మహరాజ్‍షాజహాన్‍పూర్‍వారు
(1899
- 1983) దేశికోత్తమలు. వారి సహజమార్గ ఆధ్యాత్మికపద్ధతి ననుసరించు
వారి శిష్యకోటికి వారు దైవ సమానులు. శ్రీరామచంద్రజీ పరమపదించిన తరువాత సంపూర్ణ శ్రద్ధాసక్తులతో
వారి ఆశయాలను శిష్యులు మున్ముందుకు గొనిపోవుచున్నారు. గురువుగారి వద్ద నుండి వారు
అనుభవపూర్వకముగా గ్రహించించిన జ్ఞానమును, గురువర్యులు
రచించిన మరియు వారితో సందర్భవశమున ముచ్చటించిన విషయములను, సాధనద్వారా
వారు నిగ్గుతేల్చుకున్న విషయ విశ్లేషణలను నేటి సహజమార్గ అభ్యాసుల మేలునకై
స్మారకసంచికలలోను, పత్రికలలోను, ఆధ్యాత్మిక
కూటములలోఉపన్యాసములద్వారాను తెలియజేసి
ఆధ్యాత్మికప్రగతికి తోడ్పడు చున్నారు. అవన్నియు గురువుగారి అనుగ్రహభాషణములకు
ప్రతిధ్వనులేయని భావించి, వాటిలో కొన్నింటిని ఆంగ్లమునుండి
తెలుగునకనువదించి, తెలుగు మాత్రమే తెలిసిన అభ్యాసుల సౌకర్యార్థము "ప్రతిధ్వని" యను
నీపుస్తక రూపమున నాశక్తికొలది ప్రయత్నించి వెలువరించితిని. నాయీ ప్రయత్నము యేఒక్క
అభ్యాసికి ఉపయోగ పడినా సఫలీకృతుడ నైనట్లుగనే
భావింతును.
పి. సుబ్బరాయుడు ప్రశిక్షకులు,
9966504951
రచన:-డా: S.Pశ్రీవాత్సవ.లక్నో అనువాదం:-శ్రీP. సుబ్బరాయుడు
"యోగము" అంటే అసలైన
అర్థం "కలయిక". రెండువుండి అవి
ఒకవిధానంప్రకారం పయనించి ఒకదానితో ఒకటి కలవడమే యోగము. ద్వైతం, అద్వైతంరెండూ తొలుత వుంటేనే యీ యోగము నకు అర్థము సిద్ధిస్తుంది.
ఒక్కటైయున్న దానికై సాగే అన్వేషణే యోగముయొక్క సారంశము.
ప్రకృతిపరిధిలో ఉన్నది, కానున్నది
అన్న వాదం ప్రక్కనబెడితే, యోగసాధనానుభవమున ఒకటికైసాగే
అన్వేషణ ముందుకు సాగుతుంది. లక్ష్యమునకు ఒకపేరిడి, దాని
వివరణ లివ్వవవచ్చును. కాని ప్రభువు అన్నమాట విషయగ్రహణకు చక్కగా సరిపోతుంది.
ప్రభువు అన్నమాటకు భగవంతుడు లేక లక్ష్యము అన్నమాటగా అనువదించుటగాక, దాని బదులుగా యిదమిద్దమని చెప్పుట భాషాపరంగా కష్టమగుచున్నది.
ప్రభువు అన్నమాటను
గ్రహించి,
ఒప్పుకున్నతర్వాత, ఇక ఆయనతో కలయికప్రక్రియ
మొదలు పెట్టగనే, ముడి తర్వాత ముడిగా ఆటంకములు కలుగుచున్నవి.
అనగా వ్యక్తి ఆశలు మరియు ముందేయేర్పరచుకున్న భావనలు అను అడ్డంకులను అధిగమించి
పురోగమించవలసి యున్నది. ముడులనువిప్పి, కేవలం కలయిక మత్రమే
గాకుండా, లక్ష్యంలో లీనమగునట్లు జేయు సరియైన మార్గము ప్రేమ
మాత్రమే. కానీ ప్రేమ అన్నింటికంటెను బహుమోసకారి. వ్యక్తి ముందుగనే యేరికోరి
వాంఛాపరితృప్తికై యేర్పరచుకున్న ప్రేమవలన ఉన్నముడులు మరింతగా బిగుసుకపోయి, ప్రభువుకృపా మహిమకు కూడా సడలనివైపోవును. ప్రేమ సహజరీతిలో ఉత్పన్న మైనదైతే,
అది సరళము సులభమునై యుండును. అదే
ప్రయత్నపూర్వకముగా తెచ్చుకొని చూపెడి ప్రేమ సంక్లిష్టముగానూ, సంకుచితముగానూ వుండును.
ప్రేమమార్గము చాలా యిరుకైనది. అందులో ఇద్దరు
ఒకేసారి యిమడరు. నిజమైనప్రేమ ఒకరిని చచ్చేట్లుచేసి, ప్రభువును మాత్రమే
సజీవంగానుంచును. వికటప్రేమ ప్రభువును చావనిచ్చి తానొక్కడే ఒంటిగా జీవిస్తాడు. ఒక
కర్రయొక్క రెండుకొసలవద్ద ఒకేఒకదానికై అన్వేషణజరుపు యోగప్రక్రియను విషదపరచునవే
యీరెండు విధానాలు.
వాస్తవానికి ప్రేమించడం వ్యకియొక్క ముఖ్యవిధి.
కాని ప్రభువే ప్రేమించాలనడం అసంబద్ధం. అయినా ప్రేమ ప్రభువు (గురువు) నుండే
మొదలవ్వాలలి మరి. ఈవిషయంలో ప్రభువు (గురువు) స్వేచ్ఛకు, యెన్నికకు
ఆటంకము కలుగరాదు. ముఖ్యముగా ఆయనకిష్ట మొచ్చిన రీతిలో, ఆయన
యిష్టపడి యెన్నుకున్న వారిపై, ప్రేమ స్వేచ్ఛగా
ప్రసరిస్తుంది. ప్రభువుప్రేమ వర్షముకురిసినట్లు అందరియెడ సమానమే. కాని ప్రభువు
యేబరువు బంధనము లేకుండా, సర్వము గ్రహించి గగనమున తేలిపోవు
(తేలికయైపొయిన) వానినే యెన్నుకొనును. ఆయనతప్ప మరెవ్వరును ఆయన యెన్నికను అర్థముచేసుకొనజాలరు.
గురువుయొక్క హృదయవేదన, పరితాపమునకు యెయ్యదియును సాటిరాదు.
అత్యంతోన్నత స్థాయి గురువర్యులనేకులు, తాము విదుదలచేసిన
శక్తిని సంపూర్ణముగ గ్రహించగల యోగ్యునికొఱకు తమదేహత్యాగం తరువాత వందల సంవత్సరములు
నిరీక్షించ వలసి వచ్చినది.
ప్రభువు (గురువు) ప్రేమద్వార ఉన్నముడులన్ని
విప్పబడి,
ఆయనలో లీనమగుట సంభవమై, యోగము లేక ఒక్కటికై
అన్వేషణతో సహా సమస్తస్థితుల నధిగమించి, మరింతగా
పురోగమింతురు. ప్రభువు (గురువు) ప్రస్తుతం సమాన్యజనం ఆరాధించు దేవునివలె
వివిధరూపాలలో విడివిడిగానుండగా, విడివిడిగావున్న ఆమొత్తం ఒక
పాత్రలో యిమిడిపోయి ఒక్కటైనరీతి, తగినట్లుగామారి
సరియగువిధానమున ప్రభువు (గురువు) ప్రేమకు పాత్రు (యోగ్యు)లౌదురు. స్వార్థమెరుగని
నిశ్చితబుద్ధితో ఒకేఒక్కదానినే (ఏకంసత్ నే
) నమ్మియున్నట్లైన, అదే సరియైన దారి నేర్పరచి,
జీవన్ముక్త (బ్రతికియుండియు మరణించిన వానివలెనుండు) స్థితికి చేర్చి,
అన్వేషణను సఫల మొనర్చి, మనఉనికియైన ఒకటిని
ఒక్కటైయున్న దైవము (ఏకంసత్) వైపుకుత్రిప్పిమున్ముందుకు నడిపి, యీఒకటి ఆఒకటితో ఐక్యమొనర్చును.
v
రచన:-
పూజ్యశ్రీ రాఘవేంద్ర రావ్,
రాయచూర్. అనువాదం:- పి.
సుబ్బారాయుడు, హైదరాబాద్
సైన్స్ (శాస్త్రము)
అంటే యేమిటోకూడా తెలియకుండానే నేటికాలపు
మనుజులు సైన్స్ ప్రకారం ఉండాలన్న తీరునప్రకారం వుండాలన్న తీరున వ్యవహరిస్తున్నారు.
నిఘంటువులో చూపిన ప్రకారం శాస్త్రీయం (సైన్స్) అంటే బాగుగుగా గమనించి
ప్రయోగముద్వారా ఖచ్చితముగా పరిశీలించినదై, ఒక క్రమపద్దతిలో
సామాన్య సూత్రములకనుగుణంగా, వివరింపగలిగినదై వుండాలి.
భౌతికశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే యేవిధమైన సందిగ్దములేకుండా, అసంబద్దముగాని విధానమున వాస్తవములను నిగ్గుదేల్చి అనుభవపూర్వకముగ
గుర్తించి సిద్ధాంతములుగా యేర్పరచి యేవిధమైన వంచనకు స్వప్రయోజనమునకు తావివ్వక
నిజాలు, అనుభవముల ప్రాతిపదికగా కనుగొనబడిన సూత్రములే
శుద్ధశాస్త్ర (ప్యూర్ సైన్స్) మనబడును.
సందిగ్దత, సస్వ ప్రయోజనాపేక్ష లేకుండుటన్నది విస్మరింపరాని ముఖ్యాంశములు.
దురదృష్టవశాత్తు భౌతికవస్తుమయ శాస్త్రము, మనమెక్కడున్నామో
తెలుసుకొనేలోపలే, ఆనేకములైన ఆకర్షక వస్తువులను శాస్త్రరీత్యా
మనఉపయోగార్థమన్నట్లు మనపై విపరీతముగా వచ్చిపడి, శాస్త్రార్థమునకే
భంగము కలుగుతున్నది.
ఇదే
పరిస్థితి మనదేశఆధ్యాత్మిక శాస్త్రమునకూ దాపురించినది. అది డాంబికుల మరియు
క్షుద్రయాచకుల వాతబడి, కొద్ది కొద్దిగా దిగజారి,
ఒకబూటకముగాను, నీచమాంత్రికవిద్య గాను
మారిపోయినది. అంతేగాకుండా మరోవిధంగానూ ప్రక్కదారి పట్టింది. ఆధ్యాత్మికత మాసొంతమని
చెప్పే పెద్ద పెద్ద విద్యావంతులు, నిరర్థకమైన
తత్త్వజ్ఞానమును వారి పేరు ప్రతిష్టలకోసం వ్యాప్తిజేస్తున్నారు. కనుక యేపద్దతిగాని
సిద్దాంతముగాని సరియైన ఆలోచ, సాధన ప్రాతిపదికగా, శాస్త్రసమ్మతముగా నేర్పుతున్నారా లేదా? అవి
నిష్పక్షపాతంగా స్వార్థప్రయోజనరహితంగా వున్నాయా లేదా? అన్నవిషయాన్ని
జాగ్రత్తగా గమనింపవలసి యున్నది.
మరొక్కవిషయం.
ఒక ఆలోచనావిధానము శాస్త్రసమ్మతమైనది అంటే , అది
అద్భుతాలు చూపేదిగాను, చపలచిత్తుల యిచ్ఛగానూ వుండరాదు.
ఆవిధానములో గమనించిన వాస్తవాలు లేదా అనుభవాలు పూర్వము నిర్ధారించిన వాస్తవాల
ఆధారంగా అర్థవంతముగా వివరింప గలిగి వుండాలి. మార్మికవాదులు, తమకైతాము
అపరోక్షాజ్ఞానులమని ప్రకటించుకొన్న బోధకులు యీవాస్తవాన్ని అంగీకరించకపోవచ్చును.
రాధాకమల్‍ముఖర్జీవారు చెప్పినట్లు మర్మజ్ఞాని వాస్తవానికి విశాలదృక్పదంగలిగి
శాస్త్రసమ్మతమైన ఆలోచన గలిగివుండాలి. అద్భుతప్రదర్శనల ప్రపంచమునుండి బయటపడి
చపలచిత్తుడుగాకుండా వుండాలి. శాస్త్రసమ్మతమైన ఆలోచనగలవ్యక్తి, ఇంద్రియ ప్రవర్తనలను చక్కగా విశ్లేశించుకోగలిగి, వాటిని అదుపుచేసుకోగలిగి, ఆచరణలో
పెట్టుకున్నవాడై వుండవలెను, ఒక మార్మికయోగి కూడా పొందికగా
సమ్మతమ గురీతిలో తన క్రొంగొత్త ఆవిష్కరణలను వివరించ గలిగి వుండాలి .
(ముఖర్జి
1889-1968 – ఒక నవీన భారత స్దామాజిక
శాస్త్రవేత్త. ఆర్థిక సామాజిక ప్రొఫెసర్. లక్నొ (U . P) విశ్వవిద్యాలయ
వైస్‍ఛాన్స్‍లర్)
యోగ
సంబంధ ప్రాణాహుతి ప్రసారము:- ఈప్రధానశాస్త్ర భుమికగా, సహజమార్గంగా గుర్తింపబడిన సాధనను గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
సహజమార్గంలో
గైకొన్న భావనలు సరళమైనవి. అందులో మొదటిది మరియు అతిముఖ్యమై నఅంశం, భగవంతుడున్నాడు, భగవంతుడొక్కడే (ఏకంసత్) అని విశ్వసించడము.
ఈభావనను వృత్తిరీత్య నాస్తికుడైవాడు తప్ప మిగిలినవారు అంగీకరించడానికి సంశయిస్తారు
(నాస్తికుడు అసలొప్పుకోడు) కాని ఒక భౌతికశాస్త్రావేత్త మాత్రము వెంటనే భగవంతుని
లక్షణాలను
C G S లేదా F P C విధానంలో తెలియజేయమంటాడు. శాస్త్రజ్ఞుని, యీప్రశ్నకు
జవాబు, మీరే కనుగొనండి అనాలి. అంటే అతడు నిజంగా
భగవంతునిగురించిన జ్ఞానం పొందితేనే గాని అతనికి సాధ్యపడదు. ఇది అనుభవముద్వారా
పొందవలసిన జ్ఞానం. పుస్తకపఠనం ద్వార లభ్యంకాదు. కేవలం తన్నుతాను భగవంతునితో సమమైన
నిజతత్త్వానికి మార్పుచేసుకున్నప్పుడే సాధ్యమౌతుంది. ఇదే మనకు సహజమార్గంలో లభిస్తున్నది.
ఇక
తర్వాతిభావన, వ్యక్తి భగవంతుని అనుభవజ్ఞానమును ఒక
సమర్థమార్గదర్శకుని సహాయముననే సాధ్యమగుననుట. సహజంగా ఉన్నతజ్ఞానమేదైనా బోధకుని లేక
మార్గదర్సకుని సహాయం లేకుండా సాధ్యపడదు. ఈభావనకూడా బహుసరళమైనది. అనుభవము పొందుటకు
తగియున్నది.
ఇకయీవిధానముయొక్క
ప్రత్యేకతను గూర్చి తెలుసుకుందాం. అది యీవిధానపు శిక్షణాపద్దతి. ఆత్మసాక్షాత్కారమీ
మార్గమున ప్రాణాహుతి యను యోగశక్తి ప్రసారము ద్వారా ఒక జీవిత కాలములోనే సిద్ధించును
. అందుకు ప్రాణాహుతి యోగశక్తి ప్రసారముపై సంపూర్ణాధి కారముగల మహనీయుని
మార్గదర్సకత్వమున యీకార్యము నిర్వర్తింప బడుచున్నది. యీ దద్దతి సరళము మరియు
సహజమైనది. స్పందనలు మార్గదర్శకుని ప్రాణాహుతి ప్రసారముద్వారా సాధకుని కందుచున్నవి.
కొంత సాధనన తర్వాత సాధకుడు ఆధ్యాత్మికస్థితులను ఒకదానితర్వాత ఒకటిగా
అనుభవజ్ఞానమున పొందును. వాటిని భావనలమూలమున
అర్థముచేసుకొని విశ్లేషించుకో నారంభించును. తన మార్గదర్శకుని గురించి ఆయన
కార్యనిర్వహణను గురించి ఆలోచించమొదలిడును. అదే క్రమేణ సహజంగా అతని నిరంతరస్మరణగా
వృద్ధిచెందును.
ప్రత్యేక
జాగరూకత:- ఈవిధానపు ప్రతిభ, వ్యక్తి
ఆధ్యాత్మికపురోగతితోపాటు, ఆత్మశుద్ధీకరణలో నున్నది. హృదయశుద్ధితో
ప్రారంభించి, చక్రములన్నీ పూర్తిగా పరిశుద్ధము గావించి
ఉద్దీపన చేయబడును. ఇది అత్యంతముఖ్యమైన అంశము. దీని కొఱకు ప్రత్యేకశ్రద్ధతో
మార్గదర్శి సంరక్షించుచుండును. ఇట్టి ప్రధానమైన అంశమును విస్మరించినట్లైన లేక
ఖాతరుచేయక పోవుటవలన, సాధకుని చక్రములు మేల్కొనబడుటచే
ఉత్పన్నమైన శక్తులను సాధకుడు దురుప యోగపెట్టు ప్రమాదము గలదు. కనుక అట్టి
ప్రమాదనివారణకుగాను అంతఃశుద్ధీ కరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నది.
సహజమార్గము
నిజానికి మార్పుచేయబడిన రాజయోగము. ఇది సరళము మరుయు సహజమునైన విధానమే గాకుండా
మానవుని సామాన్యప్రాపంచిక జీవనమునకు అనువైనది. ఇది ఆలోచన ఆధారంగా అమరియున్నది.
దీని పనితీరు పూర్వఋషుల చేత శాస్త్రబద్ధంగా పరిశీలింపబడినది. పతంజలియోగదర్శనము
దీనికొక ఉదాహరణము.
నేను
యీవిధానములోని ముఖ్యాంశములను మాత్రమే చర్చించి పాఠకుల యెదుట సహజ మార్గ శాస్త్రాధారాలనుంచితిని.
ఇది మన జీవితచరమలక్ష్యమును చేర్చుటకు తగినట్లు సంస్కరింప డి అత్యంత సున్నితము
సూక్ష్మమునైన స్థాయికి తీసుకొని రాబడినది
-----------------------------------------------------
CGS=
సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ (పొడవు, దవ్యరాశి,
కాలం ప్రాతిపదికగా వివరించు శాస్త్రము)
FPS=
ఫుట్ పౌండ్ సెకండ్ (పై విధంగానే యీ అడుగు, పౌండ్,
సెకండ్ ప్రాతిపదికగా వివరించు శాస్త్రము)
(ఆధ్యాత్మజ్ఞాన్~ జనవరి-మార్చి 2023 పత్రిక నుండి గ్రహించడమైనది)
v
రచన:-R
.రామశాస్త్రి, గుల్బర్గా. అనువాదం;- P. సుబ్బరాయుడు,
హైదరాబాద్.
జనసమూహములు
ఆధ్యాత్మికతను జీవితములో ఆకర్షణ లేనిదిగా, అఇష్టమైనదిగా,
ఆసక్తి లేనిదిగా, పనికిరానిదిగా
భావిస్తున్నారు. ఆధ్యాత్మికసాధనకు జీవితములోని అనేకసంఘటనలు ఆటంకము కలిగిస్తున్నవని,
సామాన్యమనుష్యుని మానసికస్థితిని పరిశీలించినట్లైన విషదమౌతున్నది.
ఈపరిస్థితి కేవలము సహజమార్గసాధనకే పరిమితమైలేదు. ఈఅడ్డంకులు సర్వసామాన్యముగా
యేఆధ్యాత్మికసాధనకైనా ఒకేవిధంగా వుంటాయి.
సాధన
అంటే యేమిటి? ఈప్రశ్న సహజంగా యెవరైనా యెదుర్కోవలసిన
దే. సాధన శాంతికొఱకా? సౌకర్యమునకా? సంతృప్తికా?
జీవితములో సమస్యల నెదుర్కోవ డానికా? లేక
భగవత్సాక్షాత్కారానికా? మనస్సును అంతర్ముఖంగావించి ప్రాపంచిక
వస్తుసముదాయమునకకై ప్రాకులాడకుండా చేయుటకు చేయు తొలిప్రయత్నమిది. నిలకడలేని
చపలచిత్తమునకు క్రమబద్ధముగాని మనస్సునకు, పుట్టుకతోనే
జీవితమొక రణరంగమై పోతున్నది.
మానవమనస్సు
సంస్కృతపదము "మన్" నుండి యేర్పడినది.అది పశువులమనస్సు కంటే భిన్నమైనది.
మానవమనస్సు ఉన్నతము మరియు చైతన్యవంతమైనది. అదే మానవుని పెట్టుబడి, మనుష్యజాతి నిజమైన సంపద. ఇదే జీవితాన్ని క్రమబద్ధీకరించి
పురోగమింపజేస్తుంది. సంతోషానికి, దుఖఃమునకు, ఆనందానికి, బాధకు, ఆరోగ్యానికి,
అస్వస్థకు ఇదే బాధ్యత వహిస్తున్నది. మానసిక ఔన్నత్యమునకు సంబంధించి,
ఆధ్యాత్మికమార్గములో యిదే పని జేస్తుంది. అది అతీంద్రియ స్థితిలో
ఆత్మకు అనుసంధింపబడుతుంది.
రహస్య
మహాశక్తి:- ప్రాపంచికవిషయాల
ఆకర్షణకు లోబడిపోయి, మనం ఆంతరంగికఆత్మ విషయంలో
అంధులమైపోయాము. క్షణభంగురము, నశ్వరమునైన ప్రాపంచికవిషయములకు
ఆకర్షితులమై క్రమేణ మహత్తర మానసికశక్తి అటువైపునకు మరలినది. ఒక తమాషా (పిట్ట)కథలో
చెప్పినట్లు మానవమనస్సు యేవిధంగా ప్రాపంచిక పైపైమెఱుగులకు లోనై బహిర్ముఖమైపోతుందో
గమనించగలరు.
ఒకసారిబ్రహ్మ
ఒకరహస్య శక్తిని సృష్టించాడు. ఆశక్తి మనిషి కోరినవన్నీ యివ్వగల మహిమగలది. అయితే
మనిషి ఆశక్తిని దుర్వినియోగపరుస్తాడేమోనన్న భయం బ్రహ్మకు కలిగింది. బ్రహ్మ దేవతలను
పిలిపించి యీరహస్యశక్తిని యెక్కడదాస్తే బాగుంటుందో చెప్పమన్నాడు. ఇదిఒక గంభీరమైన
సమస్యయై చర్చించి చర్చించి ఒకొక్కరు ఒక్కోసలహా యిచ్చారు. ఒకరు ఆశక్తిని సముద్రపు
లోతుల్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఇంకొకరు పర్వతశిఖరాలలో దాయాలన్నారు. మరొకరు
దట్టమైన దుర్గమారణ్యాలలో దాచిపెట్టాలన్నారు. అయితే యివేవి ఆమోదయోగ్యంగా లేవన్నాడు
బ్రహ్మ. అప్పుడొక తెలివైనదేవత బాగాఆలోచించి యీరహస్యశక్తిని మానవమనస్సులో దాస్తే
సరిపోతుంది. ఎందుకంటే మనిషి తనబాల్యంనుండి బాహ్యప్రపంచపు వస్తువుల
మోజులోపడివుంటాడు గనుక యీరహస్యశక్తిని గుర్తించలేడు అన్నాడు.
కనుక
మనిషి తనలోనేదాగియున్న ఆశక్తిని గురించి తెలుసుకోలేక దానికొఱకు బాహ్యప్రపంచంలో
ఇంద్రియముల సహాయంతో వెతుకుతాడు. ఈఉపాయం అందరికినచ్చి మనిషి మనస్సులోనే దాచివుంచడం
మంచిదన్న నిర్ణయానికొచ్చారు. ఈకథ మానవుని మనస్సుయొక్క వాలకమును చక్కగా
విశ్లేషిస్తున్నది.
నిజమైన
లక్ష్యము:- మన గతజన్మల
సంస్కారములకు మనం దాసులమన్న సంగతి
మరచిపోయాము. మన గతజన్మల సంస్కారబలమునకు లొంగిపోయికూడా మనయిష్టానుసారం
స్వతంత్రంగాఆలోచించి నడచుకోగలమన్న తప్పుడుభావనతో వున్నాము. మన అవసరాలు
తీరినప్పటికిని మనం సంతృప్తిపడక, యింకా కోరికలు తీరలేదని
వాటికొఱకై ప్రాకులాడుచునే యున్నాము. చక్కనిజీవితము గడపడానికి తగినంతవున్నా,
యింకా యింకా కావాలంటూ ప్రయాసపడుతూనే వున్నాము. పూర్వకాలపు ఋషులు
మానవుని మానసిక దుర్బలత్వమును గమనించి, బాహ్యప్రపంచపు
ఆకర్షణలకు లోనుగాకుండా జాగ్రత్తలు చెప్పియున్నారు. ఆధ్యాత్మిక సాధనకు తగినట్లు మన
గతసంస్కారముల ప్రభావమునకు లొంగక, స్థిరముగా పురోగమించవలసి
యున్నది.
పక్షి
తనరెండు రెక్కలతో యెగురుతున్నట్లుగా మనం ప్రాపంచికమైన కుటుంబ బాధ్యతలను, ఆధ్యాత్మికమైన గురువర్యుల మార్గమును సమన్వయపరచుకొనవలెను. ఎందుకంటే మన
గురువర్యులే మనకు జీవితమున నిజమైన లక్ష్యము. ఆధ్యాత్మికమంటే, మనలోని దైవాన్ని సహజమార్గముద్వారా సాక్షాత్కరింపజేసుకొనుటే. కనుక
ఆధ్యాత్మికములో భక్తిగలిగి ఆత్మ, తపనతో పురోగమించుటకు
సహకరించుటే మొదటిమెట్టు.
18
వ శ్డతాబ్దపు ఆధ్యాద్యాత్మికవేత్త జేమ్స్‍రస్సెల్
మహాశయుడు ఒక సందర్భములో యీవిధంగా సెలవిచ్చారు. "నీవు జీవితములో లక్ష్యమును
సాధించుటకు అశక్తుడవైతే అది నీదోషము కానేకాదు. కానీ జీవితానికి ఒకలక్ష్యమే లేదంటే, అది మాత్రము నిజంగా దోషమే. కనుక మనకు ఆధ్యాత్మిక మరియు పాపంచిక విషయములలో
ఒక నిర్ధిష్టమైన ఆలోచన వుండాలి. ఆరెండిటిమధ్య చక్కని సమన్వయమేర్పరచుకోవాలి.
అలాకాని పక్షములో మనజీవితము, మనఉనికి నిష్ప్రయోజనమై
పోతుంది.
ఆధ్యాత్మికజ్ఞానము:-
"జంతూనాం
నరజన్మ దుర్లభం" అని ఆదిశంకరాచార్యులవారు సెలవిచ్చారు. జీవరాసులన్నిటిలో
మానవజన్మ అరుదైనది. అంతేగాక మనిషికి పశువుకు తేడా గమనిస్తే, తెలివి, వివేకము, భవిష్యత్తుకు
సంబంధించి యేది మంచో యేది చెడ్డో లోతుగా ఆలోచించి తెలుసుకోగల విచక్షణాజ్ఞానము,
ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానము మనిషికే వున్నాయి. భగవద్గీత 10
వ అధ్యాయం 32 వశ్లోకంలో "ఆద్యాత్మ విద్యా విద్యానాం" అన్నారు
శ్రీకృష్ణపరమాత్మ. ఆధ్యాత్మికజ్ఞానమే స్వేచ్ఛకు రహదారి. అందుకే అది నిగూడమైనది.
మనపూర్వీకులుగూడా
జీవితములో పురుషార్థములైన ఆర్థ (ఆర్థికవిలువలు) కామ (కాంక్షలు) ధర్మములు
అశాశ్వతములు. అయితే మోక్షము (విడుదల) అనగా జనన మరణ చక్రమునుండి విడుదలపొందుట
శాశ్వతమని నిర్ధారించి చెప్పిరి. ఒక ఉర్దూకవి యిలా అన్నారు. "ఖుద్‍మే ఖుదాహై.
ఖుదా కబ్ జుదాహై? జో యేరాజ్ నసమ్‍ఝే, ఓ
గధాహై" నీలోనే భగవంతుడున్నాడు. నిన్ను వదలి భగవంతుడున్నాడా?లేడుగదా! ఈసత్యం అర్థంకానివాడు గాడిదే. మన భారతఋషుల ఆలోచన ప్రకారం
"తనకుతాను సహాయంచేసుకునేవానికే, భగవంతుడు
సహాయపడతాడు" అన్న వాక్యం సరియైనది. ఉపనిషత్తులలోగూడా "గుర్‍నతి ఉపదిశతి
జ్ఞానం ఇతి గురుః" అని వున్నది. అనగా యెవరు మార్గదర్శియై జ్ఞాన మిచ్చెదరో వారే
నిజమైన గురువు. వారిని దైవముగా భావింతుము (ఆచార్యదేవోభవ) అని ఉపనిషత్ వాక్యము.
ప్రభువు
( గురువు) రక్షిస్తాడు:- సృష్ట్యాదినవున్న
మనిషిస్థితికి తిరిగిచేరుకొనుటే మనజీవిత లక్ష్యమై వుండాలి. ఈలక్ష్యమైన మన
స్వస్థలమునకు చేరుట, మనకసాధ్య మైనందువల్ల,
మనఆత్మను ప్రాణాహుతిశక్తి నుపయోగించి మనస్వస్థలమునకు జేర్చగల
సమర్థుడైన గురువు సహాయం ఆవశ్యకమై యున్నది. గురువుగా, దైవముగా
మనకు మార్గదర్శకులైనవారు మనగురువర్యులు (మాస్టర్). సమర్థుడైన గురువు దొరుకుట
కష్టతరమే. అయితే అన్వేషకుడు మార్గదర్శికై నిజాయితీతో ప్రార్థిస్తే, ప్రకృతే
సహాయపడి గురువును మనగడపవద్దకే పంపుతుంది.
ఆధ్యాత్మికత
అందరికీ అందదని, సామాన్యంగా అనుకుంటున్నట్లు గాకుండా, సాధనద్వారా సామాన్యులుకూడా
భగవత్సాక్షాత్కారము నాశించి పొందవచ్చునని, ఉత్తరప్రదేశ్‍లోని
ఫతేఘడ్ నివాసియైన మన ఆదిగురువులు శ్రీరామచంద్రజీ వారు వివరించి చెప్పారు. వారి
యోగ్యశిష్యులు మరియు వారి ఉత్తరాధికారియైన ఉత్తరప్రదేశ్ షాజహాన్‍పూర్ వాస్తవ్యులైన
శ్రీరామచంద్రజీ వారు కొన్నిమార్పులుచేసిన రాజయోగ విధానమును సహజమార్గమనుపేరున
ప్రవేశపెట్టి, తమ గురువుపేరున శ్రీరామచంద్ర మిషన్‍ను
స్థాపించినారు. 1982 సెప్టంబర్ ఒకటవ తేదీన ప్యారిస్ ప్రకటన ద్వారా సేవింపబడుటకంటే,
సేవచేయుట ఉత్తమమన్న ఆదర్శముతో యీఆధ్యాత్మికసంస్థ మానవసమాజమునకు
సేవలందించునని పూజ్యబాబూజీ ప్రకటించారు.
భగవంతుడు
మరొక భగవంతుని సృష్టించలేడు. కానీ గురువుమాత్రము శిష్యుని, తనంతటి గురువుగా తయారుచేసి, అతనికి
భగవత్సాక్షాత్కారము చేయించగలరు. అన్వేషకుని ఉన్నతజ్ఞానమును గుర్తించి గురువర్యులు
అతనిని కంటికిరెప్పవలె కాపాడు కొనును. పశులక్షణములుగల మనిషిని మానవత్వపు మనిషిగాను,
అటనుండి దైవీయమనిషిగాను మార్పుచేయుటనునదొక దివ్యమైన అద్భుతము.
సర్వజనాళికి శ్రీబాబూజీ "ఆధ్యాత్మికత నాబాధ్యత సాధన మీబాధ్యత" అని
ప్రకటించారు. కనుక కేవలం చదివి ఆనందించడంకాదు, సాధనచేసి
అనుభవమునుపొంది ఆనందించండి - ఓమ్ తత్
సత్.
v
రచన : శ్రీ ప్రశాంత్ శౌరే పూణే
. అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు కడప .
దైవేఛ్ఛమానవేఛ్ఛ మధ్య విభేదమేర్పడినప్పుడే
మానసిక శారీరకవ్యధలేర్పడు చున్నవి
--- బాబూజీ మహరాజ్.
మానవుడు తనఇష్టమొచ్చినరీతిలో ప్రవర్తించుస్వేచ్ఛ భగవంతుడనుగ్రహించి నాడు.
అయినప్పటికిని జీవితములో మన పూర్వసంస్కారములే మన యిచ్ఛనుపయో గించుటను
నిర్ధారించుచున్నవి. దురదృష్టవశాత్తు మానవ జీవిత లక్ష్యమును సాధించుదిశగాకాక
సహజమార్గప్రార్థనలో తెలిపినట్లు ప్రాపంచిక స్వల్పవాంచ్ఛా పరితృప్తికై మనఇచ్ఛ, కోరికలదాసునిగా మనలను మార్చు చున్నది. మన స్వతంత్రే చ్ఛను మనమెంత తెలివిగా
ఉపయోగించినను, ఆశించిన ఫలితము దక్కనపుడు నిరాశకులోనై నకారాత్మక ప్రవృత్తిని రేకెత్తించుచున్నది.
ఫలితము, ఆశించినరీతిలో వున్నట్లైన, అత్యుత్సాహపడుదుము.
ఆశించినదానికి అనుకూల మైనా ప్రతికూలమైనా, యెట్లైనను, మనస్సుపై వాటిముద్రలు పడితీరును. వాటిని అదేపనిగా మాటిమాటికి తలచుకొనుటవలన,
అవి గట్టిపడి (ఘనీభవించి) పోవును. ఈవిధముగా జన్మ జన్మలనుండి
పేరుకపోయి, సంచితములైవచ్చి తిరిగి మరల మరల పుట్టుచు మరణించుట
కాస్పదమైనవి. ఈసంస్కారములలో (ముద్రలలో) కొన్ని పరిపక్వతజెంది, మన అనుభవము నకు (భోగమునకు) వచ్చును. అవి మనమాశించినట్లుండక పోవచ్చును.
మనిషి
మామూలుగా స్వార్థజీవి. తనభవిష్యత్తుతానెఱుగడు. తనకు ప్రతికూలముగా, తనఇచ్ఛకు వ్యతిరేకముగా జరిగిన సంఘటనలు, నిజానికవి
అతని మేలుకు,క్షేమున కేర్పడినప్పటికి, అవి
తనఇచ్ఛకు, భగవదిచ్ఛకు మధ్యగల విభేదముగా తలచును.
ప్రస్తుతానికి జరిగినవన్ని మనకు ప్రతికూలములు, అయిష్టములైన
వైనను, అవన్ని మనమేలుకే జరిగినవి. మనం బాహ్యదృష్టి
కగుపించినవే నిజమనినమ్మే నైజంగలవార మగుటవలన, మన అంతర్వాణి
తరచు మనలను తప్పుచేయనివ్వకుండా హెచ్చరిస్తున్నప్పటికిని, మనమాఅంతర్వాణిని
ఖాతరు చేయుటలేదు. అందువల్ల మనం క్రబద్ధముగాని మలినమనస్సు నిర్దేశించినట్లు చేస్తూ,
దుర్బలులము వశముతప్పిన వారమై పోవుచున్నాము. ఇట్టి
అంతర్గతవిభేదస్థితినుండి బయటపడవలెనన్న, మనల్నిమనం
ఆమహాప్రభుని (గురువర్యుని) ఇచ్ఛకు సమర్పితులం కావడమే పరిష్కారమార్గము. ఆయన ఈచ్ఛకు
సంపూర్ణముగా లోబడి, మనల్నిమనం సమర్పించుకోవడంవల్ల
సమస్యలనెదుర్కొనుటకు, పరిష్కరించుకొనుటకు వలయు సహాయము
లభించడమేగాకుండా, మన నెరవేరనిఆశలు, కోరికలఫలితముగా
గలిగిన వేదనలు నిరాశానిస్పృహల భారము నుండి ఉపశమనము పొందుదుము.
ప్రతిది ఆమహాప్రభువు (గురువు) నుండే
లభించుచున్నదన్న సత్యమునంగీకరించినప్పుడు
మాత్రమే,
మనమాయన వైపునకు మొగ్గుచూపి, ఆయన ఇచ్ఛకు
మనల్నిమనం సమర్పించు కొనుటకు సమ్మతించి కడకు శరణాగతి పొందుదుము. తత్ఫలితముగా సహజమార్గ దశాదేశములలో మనకివ్వబడిన ఐదవఆదేశము
ప్రకారము మనమేలుకై భగవద్‍వరముగా యివ్వబడిన వ్యధలు బాధాలనుండి మనము విడుదల పొంద గోరము.
శరణాగతిలో, వ్యక్తిత్వము అణగారి, ద్యైతభావముపోయి,
ఆమహాప్రభువు (గురువు) ఒక్కడే నిలచియుండును. ఆయనున్నాడు అంటే అక్కడ
మనంలేము. మరోవిధంగా చెప్పాలంటే, ప్రభువుయిచ్ఛ, మన యిచ్ఛమధ్య
సామరస్యముంటే, ఆయన సర్వకాల సర్వావస్థలలో యెప్పుడూ వున్నాడు.
విభేదమున కాస్కారమే వుండదు. "బాధలు వ్యధలు వేదనలు మానవులకే కేటాయింపబడినవి" అని బాబూజీమహరాజ్ తన
ఒకానొక సందేశములో వెలిబుచ్చిరి. పూజ్యగురువర్యుల రచనలలో, అందునా
ముఖ్యంగా ఋతవాణి, దివ్యసందేశములలో తెలిపినట్లు, మానవజాతి, వ్యధలు బాధలనుండి తప్పించుకొనుట జరుగదు.
అవి మానసికమైనవి కావచ్చును లేదా శారీరకమైనవికావచ్చును, అవి
మన పూర్వచర్యలఫలితముగా పేరుకపోయిన ముద్రలు లేక సంస్కారములు. అవి మనం భోగించుటకై
వ్యక్తమైనవి. లేదా దైవాదేశమున మనము
భరించుటకై వచ్చియున్నవి.
మనము
కష్టాలలో వున్నప్పుడు, నిస్సహాయస్థితిలో వ్యధల
నెదుర్కొనలేనప్పుడు, బాధలు మిక్కుటముగా వ్యక్తమౌతాయి. అవి
మానవజీవితములో విడదీయలేని భాగములు. వాటి నుండి యెవ్వరూ తప్పించుకొనజాలరు. ఎవ్వరూ
యేవిధంగానూ మనకు సహాయపడి, కష్టములనుండి గట్టెక్కించలేనప్పుడు,
మనం, మన ప్రభువును (గురువును) ప్రార్థిస్తాము.
సర్వసామాన్యంగా జనులు భగవంతుని సంతోషపెట్టడానికి, ఆయన
ప్రసాదించినవి మరలా ఆయనకే సమర్పించి, తమ బాధలు వ్యధలనుండి
ఆయన గట్టెక్కించాలంటారు.
ఈవిధమగు
సర్వసామాన్యసిద్ధాంతమునకు సహజమార్గ అభ్యాసులుకూడా అతీతులు కారు. పూర్తిగా
దిక్కుతోచని నిస్సహాయస్థితిలో మనం పూజ్యగురువర్యులను ప్రార్థించ మని సలహానిస్తాము.
బాధలు వ్యధలనుండి
విముక్తిపొందుటకు నిస్సహాయులమై, వాటిని గురువర్యుల
పవిత్రపాదము లకడ నుంచుటే మనకున్న మార్గము. గమ్యమును దృష్టిలో నుంచుకొని, మన మెపుడు, ఆయనను ప్రార్థిస్తామో, అప్పుడాయన చాలావరకు వాటిని అంతఃశుద్ధీకరణ, ధ్యానము
మరియు నిరంతరస్మరణ ద్వారా తొలగిస్తారు. మిగిలినవి వాటిని అనుభవించుట (భోగించుట)
ద్వారా నిర్మూలనమగును. మనకున్నది ఒకేఒక జీవితము
( యీజీవితము) మాత్రమే. కనుక తుది గమ్యము వైపునకుసాగు ప్రయాణమును, బాధలు, వ్యధలనుండి తాత్కాలిక ఉపశమనము పొందుటకొఱకు
ఆలస్యముచేసుకొనరాదు. మరోవిధంగాచూస్తే, ఎంతయెక్కువగా వాటిని
అనుభవిస్తే, అంతత్వతగా సహజమార్గమున మన పురోగతి సాగును.
అంతఃశుద్ధీకరణతో సమర్థవంతముగాను వేగముగాను
ప్రయాణముసాగును. మనజీవితలక్ష్యమైన, ఉత్తమోత్తమ
వెలుగులలోకము చేరుటకు, సులభముగా జనన మరణచక్రభ్రమణమును
దాటుకొందుము. కష్టములనెదుర్కొనునప్పుడు, మనకు వాటిననుభవించి,
ముందుకు సాగి బంధనముల నుండి విముక్తిపొందు శక్తిని ప్రసాదించమని పరమపూజ్య గురు దేవులను ప్రార్థించవలెను. మనం
గురుదేవులపై సంపూర్ణముగా ఆధారపడి, ఆయన ఇచ్ఛకు సర్వము
సమర్పించి, జీవితములో
లభించినదంతయు ఆయన కృపతో అనుగ్రహించినదేయని, నమ్మికతో
అంగీకరించి న యెడల, కష్టములనెదుర్కొను శక్తి మనకు సమకూరును.
అనునిత్యము
ఆయనతోనే ఐక్యమై యుండునట్లు, మనలనా మహాప్రభువు (గురుదేవులు) దయతో అనుగ్రహించుగాక.
(ఇది
ఆధ్యత్మజ్ఞాన్ - 2019 అక్టోబర్-డిశంబర్ పత్రికలో
ప్రచురించిన ,Worries, sufferings due to
‘conflict’ between God’s Will and Man’s will అను వ్యాసమునకు తెలుగుఅనువాదము)
రచన : శ్రీ ప్రశాంత్ శౌరే పూణే .
అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు .
అంతఃశుద్ధీకరణ
సహజమార్గసాధనావిధానముననున్న నాలుగువిధులలో ఒకటి. అంతర్గత శుద్ధీకరణకీ విధి
ఉపయోగపడుచున్నది. ఇందులో అభ్యాసి తన ఇచ్ఛాశక్తి నుపయో గించి తనలోనిచిక్కులు
మలినములేగాకుండా తమస్సు కూడా, బహుకాలము నుండి ఆత్మ చుట్టూ
ముద్రలు లేక సంస్కారములై పొరలుపొరలుగా చుట్టుకొనియున్న వాటినెల్లా తొలగించి వేయుటకు,
గట్టిసంకల్పము చేయును. ఈ మలినములు, చెడుఆలోచనలతో
బంధనముల నేర్పరచి ప్రాపంచికఆకర్షణలకు
లోనగునట్లు చేయుట వలన యేర్పడినవి. ఇవి కేవలం యీజన్మకు సంబంధించినవిమాత్రమే కాదు.
మనమెఱుగని గతజన్మలలోనివి కూడా విక్షేపరూపమున వచ్చిచేరినవి.
సహజమార్గసాధనలో భాగముగా యీఅంతఃశుద్ధీకరణను
ప్రతిరోజు, తనపనులను ముగించుకొనిన తర్వాత సాయంత్రం
నిర్వహించవలసిన విధి. ఇది సహజమార్గులకే ప్రత్యేకం. ఈవిధి మరెక్కడాలేదు. మతపరమైన
ఆచారవ్యవహారములలోగాని, ఇతర ఆధ్యాత్మిక పద్ధతులలోగాని యెక్కడా
యిటువంటిది మనకగుపించదు. బాహ్యశుభ్రతగా, శరీరమును గాని,
యితర వస్తుసముదాయమునుగాని, శుభ్రపరచుకొను
విధానము నకు ముఖ్యముగా ప్రాధాన్యమిచ్చుట, మతాచారములలో కలదు
గాని, అంతఃశుద్ధీకరణ విషయమై యేవిధమైన ఆలోచనగాని లేక
శ్రద్ధగాని చూపించి యెఱుగరు.
మనపూజ్యగురువర్యులైన శ్రీరామచంద్రజీ మహరాజ్
(బాబూజీ) యీవిధానమును ప్రవేశపెట్టిరి. యీవిధానములో అభ్యాసి తనలోని మాలిన్యములన్ని, ఆవిరి లేక పొగరూపమున తనవీపునుండి బయటకు వెళ్ళిపోవుచున్నవని సంకల్పముచేయును
. మనలోని ఆమలినములే మన ఆధ్యాత్మికప్రగతికి అడ్డంకిగామారి, మన
స్వస్థానమునకు తిరిగివెళ్ళు మార్గమున
ప్రతిబంధకములగుచున్నవి. మన స్వస్థానమైన గమ్యమునుచేరి అక్కడ సంపూర్ణముగా ఆమహాప్రభువు
(గురువు) తో ఐక్యమైపోదుము. ఆమహాప్రభువైన గురువర్యులు సంపూర్ణముగా అంతిమసత్యముతో
లయమైయున్నారు. అభ్యాసి తను వదలుకొననెంచిన వాటిపై ధ్యానము చేయకుండా, వాటిని మామూలుగా సులభంగా తుడిచివేయవలెను.
ఒకానొక సందేశములో బాబూజీ, యెందుకీ అంతఃశుద్ధీకరణద్వారా గతాన్నంతా శుద్ధిచేసి తొలగిం చుకోవాలో
వివరించారు. "మన పాతముద్రలు మనల్ని వెనక్కులాగుతాయి. మననడవడిని
చెడుఆకృతికిమార్చి వాటిని సరిదిద్దుకొనలేని స్థితికి తెస్తాయి. మనపాత దురలవాట్ల
సంస్కారములకు బానిసలమై పోదుము. అదే మన బంధానమై పోతుంది”. ఆయన యింకా చెబుతూ, “మనస్సు పూర్వసంస్కారముల ప్రభావములకులోనై వాటిని శుభ్రపరిస్తేనేగాని,
అభ్యాసిలో మార్పుతీ సుకరావడానికి, వీలులేకుండాపోతుంది"అన్నారు
. అవి (సంస్కారములు) మనలో ఒకవైఖరిని
యేర్పరచి, వాటిని మనం మార్చుకోవడం కష్టతరంచేస్తాయి, శుద్ధిచేయబడినట్లైన, చాలామంది విషయంలో వారి
వైఖరినిమార్చి సహజంగా సులభంగా సరిచేయవచ్చును. అప్పుడు ఆలోచనాతీరు, నడవడి సహజంగా సరియైన పద్దతికి మారును.
ప్రభువు (గురువు)
కార్యము
కనుక
ప్రతిదినం, సాయంత్రం ఒకఅరగంట శుద్ధీకరణవిధిని
నిర్వహించడం అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినప్పటికి అతని పాతసంస్కారములు
వెనక్కులాగుతాయి. ఆద్యాత్మికప్రగతి సక్రమంగా సాగాలంటే మనదేహాంతర శుద్ధీకరణ
తప్పనిసరి. ఆధ్యాత్మికప్రగతి నాశించదలిస్తే, అభ్యాసి
గురువుగారికి సహకరించితీరాలి. మనం శ్రద్ధగా సాధనలోని, ధ్యానము,
శుద్ధీకరణ, ప్రార్థన, నిరంతరస్మరణ
పాటిస్తూ గురువుగారికి సహకర్తించాల్సిన
అవసరమున్నది. తద్వారా మనమాయనతో
సంబంధ మేర్పరచుకొనుట జరుగును. అప్పుడాయన కృపాధార నిరంతరంగా మనలోనికి
ప్రవహించి తిరిగి సంస్కారములేర్పడుటను నిరోధించును.
బాబూజీ
వ్రాసినట్లు, అభ్యాసి పూర్వసంస్కారముల నిర్మూలన, గురువుల
కర్తవ్యమే. అయినప్పటికీ అభ్యాసి తన
దురాలోచనలతోను, చెడునడత ద్వారాను తిరిగి జడత్వములోనికి
జారిపోకుండా జాగరూకుడైయుండుట అత్యంతావస్యకము. కనుక జాగ్రత్త చాలాముఖ్యము.
అంతఃశుద్ధీకరణ ప్రతిదినము చేసుకొనుచుండినచో, యేవిధమైన
ముద్రలు పడకుండా, సంస్కారములేర్పడుట జరుగనిస్థితికి
అభ్యాసిచేరుకొనును.
ఆత్మవిశ్వాసంతో, నిశ్చయంతో శుద్ధిప్రక్రియ జరగాలి. శుద్ధిప్రక్రియ పూర్తికాగానే వ్యక్తి తేలికదనాన్ని అనుభవములో పొందాలి.
అనుదినధ్యానం, అంతఃశుద్ధీకరణ వలన మనలోని అస్థిరత, చపలచిత్తాన్ని పోగొట్టుకోగలము. ప్రశాంతత
శాంతి మనయం దంతటా నెలకొనాలి. మనలోని ముద్రలన్ని కడిగివేయబడగానే హృదయభారం
తొలగిపోతుంది. సమర్థవంతమైన శుద్ధీకరణ, రాత్రి
నిద్రించుటకుముందు చేయుప్రార్థన వల్ల ఉదయధ్యానం యేవిధమైన ఆలోచనల తీవ్రతలేకుండా
సజావుగా సాగును.
ఒకసారి
కర్నాటకరాష్ట్రంలోని గుల్బర్గకేంద్ర ప్రశిక్షకసోదరునికి చెబుతూ బాబూజీ
శుద్ధీకరణప్రక్రియ జరుగునపుడు మరియు పూర్తవ్వగానే యేమౌతుందో యిలా తెలియజేశారు.
"హృదయంలో శూన్యమేర్పడి, ఆశూన్యప్రదేసమంతా భగవత్‍కృపతో
నింపబడుతుంది"
ప్రయోజన ద్వయం
అంతఃశుద్ధీకరణప్రక్రియలో
చేసే సంకల్పం లేక ప్రయోగించే ఇచ్ఛాశక్తి
ధ్యానప్రక్రియ లోకూడా అభివృద్దికితోడ్పడి నిరంతరస్మ రణతో శక్తివంతమౌతుంది. ఈ రెండు
సూత్రములతో గురువుగారి కృపాప్రవాహం నిరంతరంగా కొనసాగుతుంది. గురువు గారు
చెప్పినట్లు "పాతవాటిని విఛిన్నంచేయడం ఆధ్యాత్మికశాస్త్రంలో ఒకఅధ్యాయం"
అది గురువుగారి బాధ్యత. సత్యతత్త్వమార్గంలో, పూర్వ
సంస్కారముల విఛిన్నావసరమున అభ్యాసి సహకారమందించడం అవసరం.
మానవజాతికి బాబూజీ యిచ్చిన మొదటిసందేశంలో యిలా
సెలవిచ్చారు. వ్యక్తి తనకు తాను యెలా మేలుచేసుకుంటాడో పరిశీలిద్దాం. ప్రపంచం
సూక్ష్మపరమాణువుల కలయికవల్ల యేర్పడింది. అవి (పరమాణువులు) చాలాదట్టంగా మరియు
చీకటిగా నున్నవి. అయితే వాటిమధ్య మిణుకు మిణుకు మంటున్న కాంతికూడా యున్నది. అది
పురుషుడు ప్రకృతి ప్రక్కప్రక్కనే యుండునన్న
సిద్ధాంతమును నిర్ధారించుచున్నది. తెలివి, వివేకముగలవారు
దివ్యత్వమువైపునకు మరలి, కాంతిదిశకు దృష్టిసారించి ప్రయోజనము
పొందగలిగారు. మిగిలినవారు ప్రాపంచికవస్తు ఆకర్షణకు లోనై చీకటి పరమాణువులతో
సంబంధమేర్పరచుకొని దృడమౌతూ ఆత్మచుట్టూ పొరలపై పొరలలను చుట్టుకొనుచూ పోయిరి. వారు
మాయప్రభావము స్థిరపడుటకు తగు సారవంతమైన భూమిని కల్పించిరి. అందువల్ల ఆప్రభావము
శరీరఅణువులపైబడి , అది పొరలపై కేంద్రీకృతమై, అందుండి మెదడుమధ్య భాగమున
ప్రతిఫలించినది. ఇదే సంస్కారములేపడుటకు కారణమైనది. ఆసంస్కరములే లోనికిచిచ్చుకొనిపోయి
పరిసరములకు, మనస్సు తగులుకొని వ్యక్తిప్రవృత్తులకు
ఊతమిచ్చినది. తద్వారా అతడు చెడునుండి మరింతచెడుకు లోనైపోయెను. ఈస్థితిలో
గురువర్యుల శక్తిమాత్రమే అతని అంతర్గత తమస్సును
తొలగించి రక్షించ సమర్థము.
గురువు లీనమగుట
కేవలమొక
కనుచూపుమాత్రమున సాధకునిలో తేలికదనాన్నుత్పన్నంచేయగల అద్భుతశక్తిమంతుడు
మాత్రమే నిజమైనగురువు. తొలుత నేరుగా
చీకటివైపునకు సాగు, సాధకుని ఆలోచన, వెలుగును అంతరంగమున గ్రహించునట్లు
జేసి, కాంతివైపునకు ఆమహనీయుడు మరల్చును. తద్వారా అతనిని
వెలుగులకుగొంపోవుదారి సుగమమై అతనిలోని అంతర్గతశక్తితో, ఆదారిన
ప్రయాణముసాగించుటకు తోడ్పడును.అందువల్ల అతని సమస్య పరిష్కారమై అతనికి వ్యతిరేకముగా
పనిచేయు శక్తులనుండి రక్షింపబడి అతనిమేలుకై వున్నవాటిని గ్రహించమొదలిడును.
"ఇంకొక విశేష విషయమొకటున్నది. అది గురువు
లీనమగువిధమును గ్రహించి తనూ అదేవిధముగా గురువులో లీనమగుటను సాధించినయెడల, యిక అతడధిగమించలేని ఆధ్యాత్మికస్థితియే వుండదు. నేను దీనిననుసరించితిని.
అది యిప్పుడు నేనున్న స్థాయికి చేరుటలో సహాయపడినది.భగవంతుడు మీకాశక్తి సామర్థ్యముల
ననుగ్రహించుకాక”--శ్రీరామచంద్రజీ షాజహాన్‍పూర్. (Messages
Eternal)
(ఇది
ఆధ్యత్మజ్ఞాన్ – 2024 జనవరి –మార్చి పత్రికలో ప్రచురించిన,
Importance of Cleaning
in Sahaj Marg Sadhana అను వ్యాసమునకు తెలుగు అనువాదము)
v
రచన-శ్రీ
రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్. అనువాదం :- శ్రీ పి.
సుబ్బరాయుడు, ప్రశిక్షకులు,
సహజమార్గదర్శన మను
పుస్తకమున పూజ్యబాబూజీ మహరాజ్ యిలా సెలవిచ్చారు. "సృష్టిజరుగుట అవసరమైనపుడు, భగవంతుడు
ఉనికిలోనికి వచ్చెను. భగవంతుడు సృష్టి చేయవలునను యోచన చేయగనే, కేంద్రము లేక భూమాచుట్టూ నిగూఢమైయున్న చైతన్యము, కుదుపువలన,
దైవీయశక్తి విశ్వనిర్మాణమునకై విడుదలైనది. కేంద్రము నుండి వేరుపడిన
కారణమున వ్యధగలిగి, ఆవ్యధ మనిషిని తన మూలమును గూర్చి
జ్ఞాపకము చేసుకొనుటకు దారితీసినది.
కనుక, సృష్టి దాని పరిణామక్రమములో తన ఉత్పత్తికి కారణమైన మూలమువైపునకు తిరిగి
వెళ్ళుట, మనిషి ఆత్మయొక్క సహజత్వమైయున్నది. సంస్కారములచేత
చుట్టబడిన పట్టుపురుగు ప్యూపా వలెనున్నఆత్మ, మూలము లేక
కేంద్రమునకు తిరిగివెళ్ళుటకు హృదయములో ఆతృత కలిగియున్నది.
లోతైనవిషయములు
గల బాబూజీవారి దశాదేశములవ్యాఖ్యానము అను పుస్తకమున, మొదటిఆదేశము
తొమ్మిదవ ప్యారాలో యిలా వ్రాశారు. "మనిషి తను అంతర్గతముగా తన
ఉత్పత్తిస్థానమునకు తిరిగి వెళ్ళవలెనను ఆకాంక్ష రేకెత్తుటకు కారణము, అతడు తనవంతుగా గైకొన్న ఆ సత్యసారము శక్తివంతమై, ఆవైపునకది
ఆకర్షించుటే. సృష్టికికారణమై, ఉనికిలోనికి వచ్చిన
ఆచైతన్యములో అతని వంతు భాగం అతనిలో (మనిషిలో) ప్రవేశించినది. మనిషిలో ఆ
నిశ్చలస్థితికి తిరిగివెళ్ళవలెనను ఆలోచన వచ్చినంతనే, తనలోనికి
ప్రవేశించి అంతర్గతముగా నిద్రాణమైయున్న శక్తి ఉత్తేజితమై, తనశక్తికొలది
తిరుగుప్రయాణమునకు ప్రయత్నించినది.
దివ్యశక్తిమూలంనుండి
ఆవిర్భవించిన మానవమనస్సు తనమూలమునకు తిరిగివెళ్ళుటకు ఆవేదనతోను, ఆతృతతోనూ తహతహలాడుచున్నది. అది అందులకు తగు విధానము, పద్దతికై అన్వేషించుచున్నది.
అభ్యసి తన లక్ష్యముసాధించుటకు (అన్వేషణ ఫలించుటకు) గురువు అతని హృదయలోనాటిన బీజరూప సత్యసత్వమును
భక్తి ప్రేమలతో సక్రమముగా చేయు ధ్యానముద్వారా, పొంగివచ్చిన
నిరంతరస్మరణ యనెడు జలమునందించి, బీజరూపమున తనలో నిక్షిప్తమైయున్న
గురుశక్తిని పోషించును. నిశ్చితమైన
ఇచ్ఛాశక్తి, నిజమైన మానవ జీవితగమ్యమును చేరవలెనను ఆతృతగలిగి
ఆమహాప్రభువగు గురువర్యుల దీవెన, దయ ప్రాప్తమైనయెడల మానవుని
తిరుగుప్రయాణము సుగమమమగును.
మనిషి
కోరికలగు దాసుడై, ప్రాపంచికవస్తుసముపార్జనలో వ్యధ లకులోనై
మానవజన్మ కలిగినందులకు నిజమైన లక్ష్యసాధన కొఱకు పాటుబడుటను విస్మరించినాడు.
ఆధ్యాత్మిక
ప్రయాణము
తీవ్రమైన
ఆకాంక్ష లేక ఆతృతతో లీనమవ్వడం, వ్యాప్తిజెందడం మరియు
తననుతాను శూన్యునిజేసుకోవడమన్నది, పురోగమనానికి
నిదర్శనము. సహజమార్గవిధానాన్ని సక్రమంగాపాటించడం, ముఖ్యంగా ఆత్మపై యేర్పడిన
ముద్రలను (సంస్కారములను) అంతఃశుద్ధీకరణద్వారా తొలగించుకోవడం వల్ల ఆమహాప్రభువు
(గురువు)నకు శరణుజొచ్చి, మనస్వస్థానమునకు (భూమకు)
తిరిగివెళ్ళుటకు తగు అర్హతనుబొందును.
అభ్యాసి
గురువును ధ్యేయంగా నిశ్చయించుకొని (తూహీ హమారీ జిందగీకా మక్సద్ హై) ఆయనపైనే
ధ్యాసవుంచినట్లైన, బాబూజీ మనగమ్యము మనకు జ్ఞాపకముండేట్లు చేస్తారు.
బాబూజీ వివరించినట్లు అంతరంగమున సృష్టికర్తతో తిరిగి ఐక్యమగుట కొఱకు ఆత్మపడు వ్యధ,
ఆతృత కంటే, అనంతమువైపుసాగు
ఆధ్యాత్మికప్రయాణములో కలుగు ప్రశాంతత, ఆనందము యేమంత
గొప్పకాదు.
మన
స్వప్రయత్నమున వేలజన్మలకైనను మన నిజస్థానమునకు తిరిగివెళ్ళుట సాధ్యము కాదు. మన
బాబూజీవంటి సద్గురువు, మనము అంతిమసత్యముతో ఐక్యమగు నట్లు
చేయగలరు. ఆ అంతిమసత్యమే సమస్తమునకు మూలము.
మన
అదృష్టవశమున దివ్యత్వము మానవరూపమున శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్‍పూర్‍గా
అవతరించినది. ఆయన అవతరణతో మొదటిసారిగా ఆధ్యాత్మిక చరిత్రలో వ్యక్తికి సహజంగా సులువుగా జీవితసమస్యాపరిష్కారము లభ్యమైనది.
కర్ణాటకలోని
రాయచూర్ నివాసియైన పూజ్యశ్రీ రాఘవేంద్రరావ్ (ఆప్యాయతతో ఆయనను అప్పాజీ యని
పిలుచుకొందుము) ఆయనొకసారి చెబుతూ, "నిర్వచింపబడిన
ఆధ్యాత్మిక సాధనలన్నింటిలో స్థిమితముకోల్పోయిన ఆతృతస్థితి మహోన్నతమైనది"
అన్నారు.
ఉర్దూకవిత
1961
వ సంవత్సరం జనవరి 30 న బాబూజీ, అప్పాజీకి వ్రాసిన
ఉత్తరంలో యిలా వున్నది. "నీవు చాలా అందమైనవాక్యం వ్రాశావు. నీవు నాచెంత
లేకపోయినప్పటికిని నాదర్శనంకోసం తహతహలాడు చున్నావు. ఇది సత్యతత్త్వసామ్రాజ్యమందు
నీవందుకున్న మహోన్నతస్థితిని సూచించుచున్నది. దీనినొక ఉర్దూకవితలో, యిలా యిమడ్చబడింది. "రహే తలాబ్ మే ఐసే ఖుద్ రఫ్‍తా హోరహేహై మంజిల్
పహుంచ్‍కర్ మంజిల్ డూండ్‍తేహై" అనగా నేనెంతగా లీనమై మైమరచిపోయానంటే, నేను నాగమ్యం చేరుకొనికూడా యింకా గమ్యంకోసం వెతుకుతూనే వున్నాను.
దేవవాణి
పుట 188 లో పూజ్యబాబూజీ యిలా చెప్పారు. "బాధ లేక ఆతృత, సత్యతత్త్వం వైపునకు దృష్టిమరల్చిన వారి కొఱకైతే, సత్యతత్త్వపుమత్తు
నాకాంక్షించు వారికొఱకు శాంతి ప్రశాంతత వున్నవి" అన్నారు. మొదటిది
పొందుటంత కష్టమూగాదు, రెండవది సాధించుటంత సులువూగాదు. ఇప్పుడొక్కింత ఆలోచించండి. వ్యధ
శాంతికన్నా వెయ్యిరెట్లు విలువైనది. నిజానికి బాధ (వ్యధ) అరుదైన మహనీయుల
నీలోకమునకు దెచ్చిన నిర్మాణమునకాధారమై యున్నది.
నేను బాధ, తీవ్రవాంఛ,
ఆతృత లేక అశాంతిని హృదయపూర్వకముగా కోరుకొంటిని. వాటి కొఱకు నా
వేయిజీవితములను సైతము త్యాగముచేయగలను. నా స్వరూప మంతయు ఆ విధానముననే నిర్మితమైనది. ఈకారణముననే,
మీఅందరి లోనూ యిట్టిబాధ ఉత్పన్నముకావలెనని నేను ఆతృతతో
యెదురుచూచుచుందును. అదే నాకు సంతృప్తినిచ్చు విషయము.
ఈవిషయమున
నన్ను సంతృప్తిపరచుట మీకర్తవ్యముకాదా! నాయెడల రవ్వంతైనా భక్తి ప్రపత్తులున్న
వ్యక్తి సహజంగా నాకు శాంతి, ఓదార్పు కలిగించుపని చేయుటకు
పూను కుంటాడు. అదేగదా! నాజీవితపరిశ్రమ, నా తీవ్రఆకాంక్ష.
శాంతికంటే యీ తీవ్ర ఆతృత (అశాంతి) యొక్క శోభ (ఆకర్షణ) చాలా గొప్పదని నిశ్చితమగా
మీకు నొక్కి వక్కానిస్తున్నాను.
ఇది
తీపిలేని బహుతియ్యనిబాధ. ఒకసారి మీరు దీనిని రుచిచూస్తే చాలు ఒక్కక్షణమైనా అది లేకుండా వుండలేరు. ఈస్థితిని వదలుకొనుటకంటే ప్రాణత్యాగమే మేలని
తలంతురు. ఇది ధ్యానమున కావలనున్న స్థితి. ఈస్థితికి గొంపోవుటకు నిరంతరస్మరణ ఒక వాహనముగా
పనిచేయును. ఇది ప్రగాఢవిశ్వాసముతోగూడిన భక్తి ప్రేమల ఫలితము.
సదా
సంబంధము గలిగియుండుట
ఇది
తీవ్రమైన వాంఛతో ఆతృతతో ఆరాటముతో, విశ్వేశునికొఱకు పడుతపన. నిరంతరం సజీవముగా మండుతున్న అగ్ని.
ఆయనతప్ప మిగిలినదేదియు జ్ఞాపకములేని వాడుగా మారి పోవుట. ఆయనతోనే సంబంధమేర్పరచుకొని
విడువకుండుట.
ప్రియసోదరీ
సోదరులారా! దివ్యదీవెన వల్ల మనము, బాబూజీ మహరాజ్ వారి
పవిత్ర పాదముల చెంత చేరితిమి. ఒక నిముషమైననూ వృధాపరచుకొనక యీసదవకాశమును సద్వినియోగ
పరచుకొందుము గాక! సహాయపడుటకు మన గురువర్యులు సదా మనకందుబాటులో నున్నారు. ఆయన
దయానంద సాగరము. మనహృదయములలో నిత్యము సత్యమునై యున్నారు. ఆయనకోసం మనము ఆతృతతో
వుండటంకన్నా మేలైన విషయమేమున్నది? ఆయనకృప మనలనందరిని
ఆహ్వానిస్తూ, ఆయన హృదయంలో జీవించమంటున్నది. ఆయన జీవితమే
ప్రశస్తజీవితం. ఆయనకొఱకు ఆతృత (తొందర) పడండి. బాబూజీ ఉత్తరం అప్పాజీకి వ్రాస్తూ,
ఒక అద్భుతవాక్యాన్ని ఉదహరించారు. ఆవాక్యంతో నా యీప్రసంగాన్ని
ముగిస్తాను.
"జో
దర్డ్ అస్నా, దిల్
వహీహై కైసేకి ముహబ్బత్‍కి ఖాబిల్
వహీహై"
అంటే
"బాధకలవాటుపడిన హృదయమే ప్రేమించుటకర్హమైనది".---పుట 172
(2-12-2023
న సోలాపూర్ ఫౌండేషన్ డేలో ఆంగ్లములో యిచ్చిన ఉపన్యాసము. ఆధ్యాత్మజ్ఞాన్
జనవరి-మార్చ్ పత్రికనుండి గ్రహించడమైనది)
రచన:- మురళీధరరావ్, ధార్వాడ్. తెలుగుసేత:- పి.
సుబ్బరాయుడు. హైదరాబాద్.
"అత్యంత ముఖ్యమైనది మరియు అపజయమెఱుగని
విధానము ప్రార్థన". అని పూజ్య బాబూజీ మహరాజ్, వారి
రచనలలో తెలియజేశారు. ప్రేమ భక్తిపూర్వకముగా మనల్ని మనం సమర్పించు కోదలచిన దైవముతో
యీప్రార్థన మనలను అనుసంధానిస్తుంది. ప్రార్థనద్వారా మనము ఆయన యెదుట వినయులమై
దీనముగా ఆయన యిచ్ఛకు మనల్నిమనం సంపూర్ణముగా సమర్పించు కొందుము. ఇదే సరైన ప్రార్థనా
పద్దతి. ఆయన నిజమైన భక్తులమైనందుకు మనం ఆయన యిచ్ఛకుసంపూర్ణము (తిరుగులేని విధం) గా
విధేయులమై యుండవలెను.
ప్రపంచములోని మతములన్నిటిలో ప్రార్థన
సామాన్యముగా వుండనే వుంటుంది. అయితే ఆప్రార్థనలు ఒక్కోమతంలో ఒక్కోవిధంగా వుంటాయి .
సర్వసామాన్యంగా వారందరి ప్రార్థనలలో ఆరోగ్యంకోసం, ధనంకోసం,
సంతోషంగావుండటంకోసం లేకపోతే అగచాట్లనుండి, బాధలనుండి
బయటపడాలని యాచిస్తారు. అయితే సహజమార్గ
ప్రార్థన అందుకు భిన్నంగా వున్నది. ఇందులో
కావాలి యని కోరడ మసలే వుండదు. మానవులకు సర్వసామాన్యంగావుండే యిబ్బందులు
నివేదించుకోవడం మాత్రమే వుంటుంది.
ప్రార్థన-
ఓనాథా! నీవే
మానవ జీవనమునకు లక్ష్యము.
మాకోరికలు మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి.
నీవే మా యేకైక స్వామివి, ఇష్ట
దైవము.
నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.
ఈవిధమైన సరళ ప్రార్థనలో లోతైన అర్థమున్నది.
మొదటి వాక్యముద్వారా మనము ఆయనను హృదయపూర్వకముగా పిలుస్తున్నాము. తద్వార ఆయనను
మనవైపునకు ఆకర్షిస్తున్నాము. ఆయనే మనజీవితమునకు లక్ష్యమని అంగీకరించి, మనల్నిమనం ఆయనకు సమర్పించు కుంటున్నాము. మా నిజమైన జీవితలక్ష్యమనడంలో ఒక
విశేష మున్నది. మనకు అనేకములైన లక్ష్యములిన్నవి. అవి విద్యకుసంబంధించినవి, వృత్తికి సంబంధించినవి, ఇంకా వ్యక్తిగతమైన వెన్నో
ఐహికసంబంధములై జీవనగమనములో మారుతున్న కాలానుగుణములైన కోరిక లెన్నో వున్నవి. కానీ
మన ప్రార్థన వాటిజోలికిపోక, జీవితలక్ష్యము ప్రభువే (గురువే) నని తేటతెల్లము జేయుచున్నది. ఆయనే
అన్నింటికి మించినవారు. మనసర్వస్వము. అంతిమసత్యము, భూమా,
లేక సర్వంసహా మొత్తమునకు ప్రభువు. మన లక్ష్యము జీవితములోని
అన్నివిషయములలోనూ మరియు తదనంతరముగూడా ఆయనవలె
మారిపోవడమే.
సామాన్యంగా
ప్రార్థనలన్నీ వ్యక్తిగతంగా వుంటాయి. కానీ సహజమార్గ ప్రార్థన మాత్రము విశ్వజనీనము.
మానవ సమాజమున కంతటికీ సారిపోవునదియై యున్నది. కారణం ప్రభువే సృష్టికర్త. మనమీ
మానవదేహమున నుండుటకు ఆయనే మూలకారణము. అందుకే మనము ఆయననే మానవజీవితమునకు నిజమైన
లక్ష్యమని ప్రకటించు చున్నాము.
దైవము మరియు
మహాశక్తి :- ఏవిధంగా ఆకాశంనుండి రాలిన ప్రతినీటిచుక్క
సముద్రముచేరుతుందో, అదేవిధంగా మానవదేహంతో
జన్మించిన ప్రతిఆత్మ తనమూలాన్ని చేరుకోవడంకోసం ఆతృతపడుతుంది. ఆమూలమే ప్రభువు
(మాస్టర్) అన్న పదంతో గుర్తింపబడుతున్నది.
రెండూ మూడు వాక్యములలో మనం మనకోరికలకు బానిసలమని
అంగీకరించి, ఆయన వైపునకు పురోగమించలేని అశక్తులమని,
వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాము. అందుకే, తమరే
మాదైవము మరియు శక్తిమంతులని తెలిపి, నీవుతప్ప మమ్ము రక్షించు
వారెవరున్నారు? నీవేకదా! మాకుదిక్కు. అని ఆయనను మనరక్షణకు పూనుకొనునట్లు
చేయుచున్నాము. అందుకే మనందరిని ఆయనతో,
ఆయనయందే వుండునట్లు అనుగ్రహిస్తున్నారు.
పూజ్యగురువర్యులు చెప్పినట్లు మనము మన గతకర్మలకు
దాసులము. మనము మన మనుకున్నట్లు స్వేచ్ఛగా ఆలోచించి, తదనుగుణంగా
ప్రవర్తిస్తున్నా మనుకుంటున్నాము గానీ, వాస్తవమునకు అది నిజంకాదు.
అదంతామన భ్రమ. మనం మన గతకర్మల కనుగుణంగానే నడుస్తున్నాము.
ప్రార్థనద్వార మనం మన గురువర్యుల యెదుట
శరణాగతులమౌతున్నాము. ఆయనే మన దైవంగా, అనంతశక్తిగా
నమ్మినందువల్ల ఆయన తన దివ్యకరుణ, ప్రేమతో మనల నందరను
అనంతతత్త్వపు తుదిస్థితికి చేరుస్తున్నారు. అందువలననే సహజమార్గ ప్రార్థన సరళము
ప్రత్యేకమైయుండుటేగాదు, అర్థవంతమైనది కూడా. ప్రార్థనలో
మనమేమియు కావలెనని కోరడమములేదు. కానీ ఆయనే నిజమైన జీవితలక్ష్యమని ఆత్మసమర్పణ గావించి,
కోరికలకు దాసులమని ఒప్పుకొని మన నిస్సహాయతను నిర్ద్వందముగా
విన్నవించుకొని, శరణాగతులమై, మనమేప్రయోజనమునకై
జన్మించితిమో ఆప్రయోజనమును పొందగోరుచున్నాము. గురువర్యుల యిచ్ఛాశక్తి సత్యము
నిత్యమునై యున్నది. ఆయన దయాదాక్షిణ్యములకు పాత్రులమై ఆయన మనలను ఆయనకడకు అనగా మన
వాస్తవ జన్మస్థలమగు ఆ దివ్యధామమునకు గొంపొమ్మని వేడుకొను చున్నాము.
(ఆధ్యాత్మజ్ఞాన్
జనవరి-మార్చి 2023 నుండి గ్రహించడమైనది)
v
రచన: డా: విజయకుమార్ వైకుంఠ్, గుల్బర్గా, అనువాదం : పి. సుబ్బరాయుడు,
శ్రీరామచంద్రజీ
మహరాజ్ షాజహాన్‍పూర్ వారు రచించిన దశాదేశముల వ్యాఖ్యానము అను పుస్తకములోని ఆరవ
ఆదేశమిలా వున్నది. "అందరిని సోదరులుగా భావించి, వారినట్లే
ఆదరింపుము".
మొత్తముమీద సత్యసంధతలో యేకమగుటకు దైవీయపిలుపుగా యీఆదేశము
మన కనిపించు చున్నది. ఈవాక్యమునకు, మనము
ప్రతిస్పందించినప్పటికిని, విషయ మింకను, చర్చ నీయాంశముగనే మిగిలియున్నది. పూజ్యగురువర్యులు అహంకార (స్వార్థ) సమస్య,
దానికిగల కారణము, పరిష్కారమును గురించి
వ్యాఖ్యానమున చర్చించిరి. "ఇందులో అంతర్గతము గానున్న నున్న విషయ మెవ్వరూ
అర్థము చేసుకోలేదు" అన్న సూచన అర్థవంతమైనది. ఇప్పుడీ విషయమునర్థము జేసికొనుట కొక్కింత ప్రయత్నింతము.
స్వార్థం
పుట్టుక
గురువుగారు
ఒక వంశవృక్ష ఉదాహరణతో దీనిని వివరించిరి. ఒకేతల్లికి జన్మించిన సోదరీ సోదరులందరూ, ఒకరికొకరు దగ్గరిసంబంధము కలిగియుందురు. తొలుత వారందరూ ఒకజట్టు. ఆతర్వాత
వారందరూ వారివారి కుటుంబములను యేర్పాటు చేసి కొందురు. వారి బిడ్డలు దాయాదులుగా బంధుత్వాన్ని కలిగియుందురు.
అంతేగాని బహుదగ్గరి సంబంధము కలిగియుండరు. కాలముగడిచేకొద్దీ, మరియు
కుటుంబము పెద్దదై సంఖ్యపెరిగేకొద్దీ, ఒకరికొకరు దూరమై,
అన్యులైపోతారు
వంశపరంగాచూస్తే, మనందరి
మూలం కొక్కటే. చూడటానికిమాత్రం ఒకరివలె మరొక రుండక, ఆకారంలోను
ఒడ్డూపొడవులోనూ వేరువేరుగా వున్నాము. మరోమాటలో చెప్పాలంటే, మూలంలో
( ఉత్పత్తిస్థానంలో) మనమంతా ఒకటేగాని,
వ్యక్తిత్వ మేర్పరచుకుంటూ వేరైపోతున్నాము. సోదరభావమునకు మూలమైన
తొల్లింటి
(నిజ )అసలుస్థితి మానవ మేధస్సునుండి
తొలగిపోయింది.
మానవునిదృష్టి
స్థూలరూపంవరకే పరిమితమైనది. అతనిప్రేమ అంతవరకే పరిమితం. స్థూలరూపాన్ని
ప్రేమించడంవల్ల కలిగేఫలి తం ద్వైతమైనది.
అంటే ప్రేమకలదన్నంతనే, తద్విరుద్ధ ( వైర )
భావనకూడ అందులో నిక్షిప్తమైయున్నది.
మనిషి, యీమూలసత్యాన్ని గ్రహించలేక పోతున్నాడు
అందువల్ల
అతడు,
బంధువులు మిత్రులు అన్నభావననుండి దూరమై పోతున్నాడు . అతని
ఆలోచనాస్వరూపము వైవిధ్యగాను, గందరగోళముగాను తయారయింది.
ప్రతిదీ భిన్నముగా కనిపించడం ప్రారంభమైనది. ఇవన్ని వ్యక్తిగత (అల్లికకు
(నిర్మాణమునకు తోడ్పడినవి. ఇది స్వార్థమునకు మరోపేరు. స్వేచ్ఛామార్గమున యిదొక
ప్రతిబంధకము. ఈప్రతిబంధకమునుండి మనిషి తప్పించుకొనవలసి యున్నది.
పరిష్కాము
స్వార్థము, ఇచ్చట అచ్చట అన్నతేడాలేకుండా అంతట ఉండనేవున్నది. భావన విషయంలో
ఒక్కొక్కరిలో ఒక్కొక రకంగా వుండవచ్చును.
అయితే దీనిమూలకారణం వ్యక్తిగతఅల్లికపై ఆధారపడియున్నది. అభ్యాసి తన వ్యక్తిగత
అల్లికను విచ్ఛిన్నము జేసికొన యత్నించి, నిజస్థితికిసమీపించేకొద్ది
అతనిలోని సోదరభావము పొంగిపొరలును. మరోవిధంగా చెప్పాలంటే, అభ్యాసి
సక్రమసాధనవల్ల, వారం వారం సత్సంగంలో పాల్గొనడంవల్ల, ఇది
సుసాధ్యమగును. నిజంచెప్పాలంటే, యిది అనుభవపూర్వక
మార్గదర్శకత్వ పరిణామము. వ్యాఖ్యానములో నేరుగా విషయము చర్చింపబడ నప్పటికి, లోతైన సూచనచేయబడింది. సహజమార్గ బోధనలలో యీవిషయంపై నిశ్చితాభిప్రాయమైతే తెలియజేయడం జరిగింది.
వారంవారం సత్సంగము
సహజమార్గసాధనావిధానములో
(శ్రీరామచద్ర మిషన్‍లో) వారానికొకసారైనా సత్సంగము నిర్వహించుట తప్పనిసరియై
యున్నది. అందులో పాల్గొనడము సభ్యులందరి విధి. పాల్గొను అభ్యాసులందరితో గురువుగారీ సత్సంగమును
నిర్వహింతురు. మార్గదర్శకములను సక్రమముగాపాటించినట్లయిన ఫలితము చాలా
ప్రతిభావంతముగా నుండును.
(1)
దైవీయఉనికిపై విశ్వసము. (2) రాజయోగపద్దతిలో ఆలోచన గలిగియుండుట. (3)మస్పూర్తిగా
స్వేచ్ఛగా సత్సంగమున పాల్గొనుట. (4)సభ్యత మర్యాదగలిగి వ్యవహరించుట.
వారంవారం సత్సంగములవలన రెండువిధముల
ప్రయోజనమున్నది.
(అ) అభ్యాసి తన అంతర్గతకోశముల లో యేర్పరచుకున్న వ్యక్తిగత అల్లికల ప్రభా వమునధిగమించ గలుగును .
(ఇ
) సత్సంము యొక్క ఆరోగ్య వాతావరణము వలన
పరిస్థితుల ప్రభావమున యేర్పడిన
సమస్యలు సమసిపోవును లేదా
వాటి తీవ్రత తగ్గిపోవును
సారాంశము
స్వార్థచింతన, మనిషితనకైతానే యేర్పరచుకున్నాడన్న, విషయమతడెరుగడు.
ఇది అతడంగీక రించకపోయినా యిదే వాస్తవం. ఇది ఒకచిత్రమైన పరిస్థితి. ఇది పతనావస్థ (దిగజారుడు స్థితి). ప్రారంభంలో అభ్యాసి, “మనందరం
ఒకటి” అన్నభావన, తన మనసుకు తానే మరిమరి
సూచనలిచ్చుకొనవలెను. ఇది అతడు భక్తిపరిధిలో వున్నాడని, అలానే
వుండటానికి ప్రయత్నిస్తున్నాడనడానికి నిదర్శనము. ఈవిషయవివరణము వ్యక్తిగతము.
ఈవిషయమును గురించి చర్చించుకొనవవచ్చును . మీఅభిప్రాయములు నాకు తెలియజేయనూ వచ్చును.
v
రచన-శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్. అనువాదం : పి. సుబ్బరాయుడు ప్రశిక్షకులు
మనపూజ్య గురువర్యులు శ్రీరామచంద్రజీ మహరాజ్‍వారు
రచించిన సత్యోదయము లోని మొదటి అధ్యాయాన్ని ముగిస్తూ వారు "నిజజీవితముయొక్క
అమృతము,
ఎప్పటి కప్పుడు అవసరానికి తగిన స్థాయికి తననుతాను యెవడు
చేర్చుకోగలడో అతనికి మాత్రమే లభ్యము" అని వ్రాశినారు. అందులో సూచించిన
అమృతమంటే యేమిటి? అవసరానికి తగినట్లు తనకైతానుపొందవలసిన
స్థాయి యేది? వీటిని గురించి తెలుసుకోవలసి యున్నది.
పూజ్యబాబూజీ అంతిమసత్యస్థితి గనుక సందర్భాను సారముగా వారు వాడిన మాటలకు లోతైన అర్థం
ఉంటుంది. ఈసందర్భంలో సుధ లేక అమృతము అంటే, అదివారి
దివ్యప్రాణాహుతి. అది అత్యంత తేలికైనది,
సూక్ష్మమైనది. అంతకు ముందుటివాక్యములో వారు ఆ అమృతముయొక్క
ప్రభావమును సూచిస్తూ యిలా వ్రాశారు. "సంపూర్ణముగా బంధవిముక్తి పొందవలెనన్న,
మనము దైవలక్షణములకు సన్నిహితములగు సున్నితము, సూక్ష్మముగా
పరిణతిచెందుటకు తపనపడుతూ పూర్తిగా దైవమువలె
మారవలసియున్నది."
స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ
బాబూజీవారి
80 వ,
జన్మదినవేడుకల సందర్భంగా
గుజరాత్‍లోని అహమ్మదాబాద్లో 1979 ఏప్రెల్ 30 న, వారిచ్చిన
సందేశములోని 3వ,పేరాలో
"సమ్మతితో ఆధ్యాత్మిక జీవనము వైపునకు మరలుటే జీవిత ప్రారంభము. దాని
అత్యుత్తమస్థితి, జీవితమందలి జీవితము. అది జీవితమందే
దాగియున్నది మనమా జీవితమునకై ప్రయత్నించవలెను. అందులోనికి ప్రవేశించవలెను. మన
అభ్యాస మంతయూ ఆ జీవనమునకు చేర్చునదై యుండవలెను, అని వారు
ఉద్బోధించిరి. కనుక మనభౌతిక జీవితములో వారిజీవితం (ప్రాణం) ఉండుటే నిజమైన జీవితము.
అదే అవసరమై పొందవలసిన స్థాయి లేక నిజమైన జీవితలక్ష్యము. అది సాక్షాత్తూ
గురుదేవులే. ఒక అభ్యాసిగా మనకు గురుదేవులే నిజమైన లక్ష్యము. అయితే నిజమైన వారి
సహజమార్గవిధాన సభ్యులుగా, వారి ఆశయమే మన ఆశయమై యున్నది. వారు యేలక్ష్యము
కొఱకు మానవునిగా అవతరించిరో ఆలక్ష్యమే మనజీవిత లక్ష్యము.
జీవితమంటే యేమిటి?
బాబూజీవారి
79 వ,
జన్మదినవేడుకల సందర్భంగా కర్ణాటకలోని బెంగుళూరులో 1978 ఏప్రెల్ 30న,
వారిచ్చిన సందేశములోని 3వ, పేరాలో యిట్లు
సెలవిచ్చిరి "భగవంతుడీ ప్రపంచమును
సృష్టించి అందులోని ప్రతిపుష్పమూ వికాసముచెందునట్లొనర్చెను. అయితే కాలముయొక్క
కొరడాదెబ్బలు, భగవంతుని ఆశయమును విస్మరించునట్లు చేసెను.
కనుక కొందరు జీవితాశయమును సుఖానుభవముగానూ మరికొందరు విసుగు జనించునదిగానూ తలంచిరి”
అసలు జీవితమంటే యేమిటి అన్నది ప్రశ్న. జీవితకాల మంతయూ శాశ్వతముగా ఉన్నానన్న
తలంపుతో, ప్రతిదశలోను ఉనికి పరిమళమును ఆస్వాదిస్తున్న దేదో
అదే జీవితము.
జీవరాశులేవైనపటికిని, అవి మానవులైనా, జంతువులైనా అన్నీ దైవస్వరూపాలే. సహజ మార్గసాధన
ద్వారా మనం బాబూజీవలె మారి, వారిలోని దైవగుణాలైన స్వచ్ఛత,
ప్రేమను మనము వెలువరించవలసి యున్నది. మన జీవితలక్ష్యమైన
మనగురువర్యులు మనదృష్టిపథంలో లేనట్లైన, మనం వారి ప్రేమను
పొందలేము. అందుకొఱకు వేరెక్కడో అనవసరముగా వెతుకులాడు కొందుము. మనం సహజమార్గ
విధానంద్వారా వారియెడల ప్రేమగలిగి యుండిన మనమూ అట్టిప్రేమను ప్రసరింపజేతుము.
"అందరిని ప్రేమించువారిని (గురువును) ప్రేమించుము తద్వారా మనమందరిని
ప్రేమింతుము"
మనదృష్టిని వారి (గురువు) వైపునకు మరల్చి
వారిపైనే నిల్పినట్లైన, సహజమార్గసారము లేక అమృతము,
మనలను బంధనములన్నింటినుండి విడిపించును. ధ్యానము నిరంతర స్మరణ
జీవనవిధానమై, మన ఉనికి యొక్క ఆశయము అదే అయితే, మనకు సత్య తత్వము లేక గురువర్యులే దృక్పదంలోవుంటే, మనము
వ్యధలను సులువుగా భరింప గలుగుదుము. ప్రతీది మన కర్తవ్యముగా భావించి
నిర్వర్తించినట్లైన, మనము బంధనము నుండి విడుదలబొందుదుము. మనం
ప్రాపంచికవస్తువులను, వాటి సద్వినియోగం కొఱకు మాత్రమే
సేకరించుకొని యుండుట వలన, నిజమైన వైరాగ్యమును పొందు దుము.
మనకున్నటువంటి లేక సంప్రాప్తమైనదంతయు ఆమహాప్రభువు పవిత్రనిధియనీ, దాని నిర్వహణాబాధ్యత మనవిధియని తలంతుము .
శాంతి మరియు ప్రశాంతత, సహజమార్గముద్వార సుసాధ్యము. అది వ్యకపరచుటకు వీలుకానప్పటికి, హృదయమున మాత్రమనుభూతి జెందుదుము. ఆయన ప్రాణాహుతి ప్రసార స్పందలద్వారా
ధ్యానమున ఆయన ఉనికిని అనుభూతిచెందుదుము. ఆయన నుండి యేదోకాకుండ, ఆయననే ఆకాంక్షించినట్లయిన ఆయన,
ఆయనమాత్రమే రుచి లేనిరుచి స్థితితో మనలను ఆశీర్వదింతురు. ఆయనతో
ఏకీకృతమవడంవల్ల, పక్షపాతరహితంగా, అందరము
ఒకేవిధమైన భావనలు కలిగి వుందుము.
బాబూజీ తన 79వ, జన్మదినంనాడిచ్చిన
అదేసందేశంలో చెబుతూ, "మనం దుఃఖ సమయంలో సహితం సంతోషంగా
వుండాలి. అన్నిపరిస్థితులలోను ఆనందంగా వున్నవాడే, నిజమైన
సంతోషి. అది సత్పురుషునిలో ఒకభాగమైయుండును" అన్నారు. ఆయనతో, ఆయనలో మనంవుంటే, ఆనందం దానికైఅదే మనలో వికసిస్తుంది.
ఉదయించే సమయం
ఒకవ్యక్తి
జీవితలక్ష్యాన్ని సాధించాలంటే అతనికి పూజ్యబాబూజీ వంటి సంపూర్ణస్థాయి గురువు
లభించాలి. ఆ గురువు చూపిన విధానాన్ని అనుసరించాలి. ఆమహనీయుడు కేంద్రము లేక భూమా
నుండి అవతరించడానికి కారణమైన వారి ఆశయసాఫల్యత కోసం కృషిచేయాలి. బాబూజివారి 82వ, జన్మదినోత్సవం మలేషియాలోని కౌలాలంపూర్‍లో
1981 ఏప్రెల్ 30న, జరుపుకున్న సందర్భంగా వారిచ్చిన సందేశంలో
యిలా సెలవిచ్చారు. "మనసంస్థ ముఖ్యోద్దేశ్యము, వ్యాప్తిలోనున్న
అనాధ్యాత్మిక స్థానంలో సహజమార్గముద్వారా
ఆధ్యాత్మికతను నెలకొల్పాలి. తద్వారా "నిద్రావస్థలో నున్న జనులారా!
మేల్కొనండి. ఇది సూర్యోదయసమయం" అన్న గురువుల మేల్కొలుపుతో జాగృతపరచాలి.
సంస్థసభ్యులు ప్రేమ, సహనం, సహకారంతో
పనిచేస్తే, సంస్థ ఆశయం తప్పక నెరవేరుతుంది. అటువంటి, సూర్యునివలె ప్రకాశించు వ్యక్తులు సంస్థకొఱకు నాకుకావాలి. మన విధానము
సరియైనదని తెలిస్తే, జనులు వారికైవారే ఆకర్షింపబడి సంస్థలో
ప్రవేశిస్తారు”.
బాబూజీ వంటిగురువు లభించాలని వ్యక్తులు
ప్రార్థించాలి. సంస్థ ఆశయసాఫల్యతకై వారికృప నాశించాలి. అదే ప్రపంచ
ఆధ్యాత్మికపునర్జీవనమునకు దోహదపడి, అణగారిన
హృదయులను ఉత్తేజపరచి, మానవ జీవితలక్ష్యము వైపునకు మరల్చగలదు.
తద్వారా విలువలతోగూడిన నాగరికత స్థాపింపబడును.
బాబూజీగారితో అనుసంధింపబడి, అమృతమగు ప్రాణాహుతిని గ్రోలి, ఆధ్యాత్మికప్రగతిని
బడసి, నిజమైన మనిషిగా మారినందులకు నిజంగా మనమెంతో
అదృష్టవంతులము, ఆశీర్వదించబడినవారము.
తేనెటీగలకు భూమి ఒకపూదోట. అందులోని
పూలపైతిరుగాడి మకరందమును (అమృతము)గ్రహించి వాటితెట్టెలో దానిని తేనెగా
రూపొందించుకుంటాయి. ఆవిధంగానే మన ప్రాపంచికజీవనాన్ని దివ్యజీవనంగా మార్చుకొనుటకు, బాబూజీగారి ప్రాణాహుతిని గ్రహిస్తున్నాము.
భక్తి ప్రేమలతో మనల్నిమనం పూజ్యగురువర్యులకు
సమర్పించుకున్నట్లైన, వారితో ఒక ప్రత్యేకబంధుత్వ
మేర్పడి, మనమెవరమో, యేమిటో, యెందుకు మనిషిగా జన్మించితిమో తెలుసుకోగలిగితిమి. ప్రార్థన, ధ్యానము, శుద్ధీకరణ, నిరంతరస్మరణ
అను యీనాలుగు సహజమార్గపువిధులను మనఃపూర్వకముగా అనునిత్యము పాటించినట్లైన, భగవంతుని సృష్టి, స్థితి, లయములలో
మనకర్తవ్యమేమిటో మనకు అవగతమౌతుంది.
అనంతమువైపు సాగు మనఆధ్యాత్మిక ప్రయాణములో, బంధవిముక్తికొఱకు ఆత్మను జాగృత పరచుటనునది ప్రారంభదశ. విజయమునకై చేయు
పోరాటము ఆత్మోన్నతిలో ఒకఅంశమే. అది మోక్షమునకు దారితీయును. అంతేగాక తదనంతర దశలను
దాటించుచు, నిజగమ్యము లేక స్వదేశము వైపునకు తీసుకెళ్ళును.
అంటే అది సృష్ట్యాదిన మనమీ రూపుదాల్చిన స్థానమునకన్నమాట. నిజానికీవిశ్వమున
రూపుదాల్చిన ప్రతీది తమమూలమునకు తిరిగి చేరవలెనని ఆకాంక్షిస్తున్నది. అయితే
ఆప్రక్రియ ప్రకృతినిబంధనల ప్రకారం దేశకాల పరిమితులకులోబడి జరుగుచున్నది.
మనము మోక్షముతోసహా అనేకదశలను దాటుచూ
సహజసాక్షాత్కార మార్గమున పురోగమిస్తున్నప్పుడు, మన
గురువర్యులు దివ్యచైతన్యము లేక మూలతత్త్వమేయని తెలిసి , అనుభవమున
గ్రహింతుము. సహజమార్గప్రార్థన తుదివాక్యములో చెప్పినట్లు ఆయనే (గురువే) మనలను
గమ్యముచేర్చు యేకైకస్వామి, యిష్టదైవము.
నిజమైనగమ్యము వైపునకు సాగుచూ, దివ్యత్వముజెందుటకై పదార్తము శక్తిగా మార్పును సంతరించుకొనుచుండుటను
గమనించిన, అది (సహజమార్గము దృష్ట్యా) రాజయోగప్రభావ
ప్రకటితమని తెలియుచున్నది.
(కడప బసంత్ (14-02-2024) లో శ్రీ రవికుమార్, ప్రశిక్షకులు,రాయచూర్ వారు ఆంగ్లములో యిచ్చిన
ఉపన్యాస పాఠమునకిది తెలుగు అనువాదము- అనువాదం :- శ్రీ పి. సుబ్బరాయుడు, ప్రశిక్షకులు, కడప )
v
రచన:-డా: S.Pశ్రీవాత్సవ.లక్నో అనువాదం:-శ్రీP. సుబ్బరాయుడు
వాస్తవానికి
మనశరీరము ,
ప్రాపంచికవస్తు సముదాతము, యిదంతా
"ఇది" యని,ఆత్మ ,సత్యతత్త్వ
సారాశమును "ఆది" యని అనవచ్చును. ఈ"అది", "ఇది" చేతకప్పబడుతూ, ఒకపద్దతిప్రకారం ఒకటితో
మొదలై పెక్కుపొరలుగా చుట్టివేస్తూ వెనక్కు నెట్టబడుతూ, ఇప్పటి
పరిస్థికి వచ్చినది. నిజమైనప్రయాణం ,"అది"గా వున్న
టువంటిది తనచుట్టూ చుట్టుకపోయిన "ఇది" యనెడిపొరలను ఒకటొకటిగా ఛేదించు కుంటూ,
తిరిగి తన తొల్లింటి "అది" స్థితికి చేరడమే. అక్కడున్నది
మనదైన, మన కనుకూలమైన స్వదేశనుభవమే. ఈఅనేకత్వం నుండి
యేకత్వమునకు వచ్చుప్రయాణం సామాన్యముగా బహుదూరం. అయితే యీప్రయాణదూరం తగ్గిపోవా లంటే
మహోన్నతుడైన గురువుపై పూర్తిగా ఆధారపడటమొక్కటే మార్గము. ఈదూరభారాలు, పెరగడం తగ్గడ మనేది యెంతకష్టమో అంతేసులభం. ఈ సమస్యకు పరిష్కారం, సత్యతత్త్వమైన ,కేంద్రము లేక మూలముతో
అనుబంధమేర్పరచుకోవడమే. ఈఅనుబంధం ద్వైతభావం లేకుండ "ఇది" "అది"
కి కూడా అతీతమైయుండాలి. తొలిప్రయాణం, మన సంపద ధనం
ఆస్తిపాస్తులరూపంలోనున్న స్థూలపొరలతో చుట్టివేయబడియున్న అసలు సున్నా లేక
శూన్యస్థితిని ప్రభువుకు నివేదించి తిరుగుప్రయాణానికి సిద్ధమవ్వటమే. అదే
మనముందున్న లక్ష్యం. తొలుత అది దూరప్రయాణం. తర్వాత అదికష్టతరం. అదెలాగంటే, సూదిబెజ్జమునుండి ఒంటెను దాటించడమంత కష్టం.
సున్నా
(శూన్యం) ఒకటి కావడానికి జరిగిన ప్రయాణం విస్తరించిన వస్తుప్రపంచపు శాస్త్ర విజ్ఞానంవంటిది.
అదే తిరుగుప్రయాణం, ఒకటి సున్నా (శూన్యం) అవ్వడం, ఆధ్యాత్మిక
విపులత్వానికి దర్పణం పడుతున్నది. ఈ "ఇది" "అది" కావల
యేమున్నదో ఉన్నది (అని మాత్రమే చెప్పగలుగుదుము). శూన్యమన్నది మానవుని మేధస్సు
కందనిదైయున్నది. మన ఉనికిలో
యీ"ఇది" "అది" అనునవి మనజ్ఞానపరిమితికి ఒకహద్దు.
"ఇది" కి సంబంధించి నేటివిజ్ఞానశాస్త్రము చాలానే ఆవిష్కరించినది. కానీ
"అది" పరిపూర్ణ మైనప్పటికి ,దాని అన్వేషణ
అసంపూర్ణముగనే మిగిలిపోయినది.
"ఇది" "అది"ని సైతమధిగమించి
అవిభాజ్యమైన 'ఏకంసత్”లో లీనమై పోవుటకు (మానసాధ్యమైన
మహోన్నతస్థితికి జేరి మహాప్రళయ కాలమున కేంద్రములో అతిసహజంగా సులభముగా ఆత్మ తన
ఉనికిని కోల్పోయి లీనమగుటకు) నిరీక్షిస్తున్న స్థితికి జేర్చుటలో దోహదకారియై
సహజమార్గ విధానమున్నది. ఈవిధానము సంపూర్ణమైన వెలుగులోనికివచ్చుటకు ప్రతియొక్కరి
సహాయసహకారములవసరమై యున్నవి. "ఇది" "అది" కి మధ్య సమతనుసాధించడమే
ప్రతియొక్కరి వ్యక్తిగత సంస్యలపరిష్కారము నకు గల యేకైక మార్గము. సంస్థసక్రమ
పూరోగతికిగాని ఉన్నత మానవత్వ విలువలకుగానీ మూలమదియే. ఇదే సహజమార్గ సందేశము.
వందలాది
మానవత్వపు సంస్కృతీవిలువల పరిరక్షించు ఆశయమును, నెర వేర్చు హామీతో
దేశకాలపరిమితుల కతీతముగా హద్దులు, అవరోధముల నధిగమించి,
సహజమార్గవిధానము వచ్చినది. సహజమార్గ ఆవిష్కర్త (శ్రీ రామచంద్రజీ ,
షాజహాన్ పూర్ వారి ) కృప, వ్యక్తిత్వపుపరిధులను
దాటి, నిత్య సత్య మూలకారణమై, ప్రతియొక్కరికీ
అందుబాటులో యుండుటేగాక ఆ మహనీయుని ప్రేమించువారికీ, ఆయనను
గుర్తించి, ఆయనపై ఆధార పడినవారి కందరికీ సర్వకాలసర్వావస్థలలో
సన్నిహితుడై (వారి హృదయములలో వెలుగై) వారి జీవితలక్ష్యమును నెరవేర్చుటకు
సంసిద్ధులై ఉంటారు.
(డా:శ్రీవాత్సవ గారి Divine
Messages అను పుస్తకము లో ఆంగ్లములో ప్రచురించిన This And
That అను పాఠమునకిది తెలుగు అనువాదము)
v
11.దివ్యజీవనము
రచన: శ్రీ డి.బాలాజీ, బెంగుళూరు. అనువాదం: శ్రీ పి.సుబ్బరాయడు, కడప
మన జీవన విధానము సహజమార్గ పద్దతితో
అనుసంధించబడి కొనసాగించుటచేత, పూజ్యశ్రీ గురుదేవుల కృపా విశేషమున,
మన జీవనము ప్రాపంచిక విషయవాసనల నుండి దివ్యజీవనమునకు నాటకీయముగా
మార్పుజెందు విషయ వివరణమే, ప్రధానాంశముగా ఇదంతయు
మీముందుంచుచున్నాను.
ఇది మన జీవితకాలమున సంభవించిన
మహదావకాశము. ఇట్టి అవకాశము దొరుకుట
అరుదు. ఎందుకంటే, మానవజాతి
నుద్దరించి ఆధ్యాత్మికతను అంతరాంత రాళములలోనికి చొప్పించగల పూజ్య బాబూజీ వంటి
ప్రత్యేకావతారమూర్తి ప్రభవించుట నిజంగా ఒక అరుదైన ప్రక్రియ.
నేను జీవించుచున్నది గురువర్యులను
పొందియుండుటకేనని, సహజమార్గ విధానమును
సంపూర్ణముగా అనుసరిస్తూ అందులోనూ దశాదేశములు దిశానిర్దేశక శక్తిగా పనిచేస్తుండగా,
నిరంతరస్మరణలో కొనసాగుచుండుటకేనని తెలియజేస్తూ, అలా జీవించుటవల్ల, మనజీవితములో ఎటువంటి పరిణామములు
సంభవిస్తాయో ప్రస్ఫుటంగా వెలువరిస్తుందీ చర్చ.
గురువుగారితో ఎలా అనుసంధానమేర్పరచుకోవాలి, ఎలా ఆ సంబంధాన్ని కొనసాగించి జీవిత గమ్యాన్ని సాధించాలి, అందుకవసరమైన సాధనా క్రమమేమిటన్న విషయాన్నందిస్తుందీ చర్చ.
మన మాతృభూమిని మనకెఱుక పరచి, గమ్యమును చేరుటలో మన పాత్ర ఏమిటో తెలియజేయుచున్న మన పూజ్య గురుదేవుల
బోధనలు, శిక్షణ మనం క్షుణ్ణంగా ఎఱిగినవేనని మన యోచనే మనకు
నిర్ధారించి చూపుచున్నది.
ఇతర విధానములతో పోలిక లేకుండా, యిప్పటి ఆధ్యాత్మిక పద్ధతులవలెగాక, సహజమార్గ సాధన
ప్రాణాహుతి శక్తి యొక్క ప్రత్యేకతను సంతరించుకొని సాటిలేనిదై
విరాజిల్లుతున్నది. అంతేగాక యుగయుగాలకు
ముందు ఈ సృష్టి ఏర్పడక పూర్వమున్న మన నిజస్థితిని సాక్షాత్కరింపజేయు అద్భుత
ప్రక్రియయై యున్నది.
దీనిని దివ్యక్రీడయని లేక ఫిలిక్స్‌కుల్ఫ
(వర్షించిన అదృష్టం) అని అనవచ్చు.
సహజమార్గ సాధనలో ప్రభోదించినట్లు, నాస్తికత్వపు
రొంపినుండి మత మార్పిడి ఉచ్చునుండి, మానవ మనుగడకు - జీవిత
లక్ష్యానికి ఏమాత్రం సంబంధంలేని మూఢ నమ్మకాలు, సిద్ధాంతాలతో
కొట్టుమిట్టాడుతున్న మానవజాతి సముద్ధరణకు అంతిమ సత్యమే (భగవంతుడే) స్వతహాగా
బాధ్యతగైకొన్నట్టి విధివిధానమిది యనవచ్చును.
సూక్ష్మాతిసూక్ష్మమైన స్థితులనధిగమింపజేసి
అర్థవంతమైన నిశ్చయ దివ్యజీవనము గడుపుటకు ఒక సంచలనాత్మక పద్దతి ననుగ్రహించిన
శ్రీరామచంద్రజీ మహరాజ్ వారికి మానవజాతి నిత్య కృతజ్ఞతాభావనను ప్రకటించుచున్నది.
సృష్టి జరిగి, ప్రకృతి రూపుదాల్చినప్పటి నుండి గమనిస్తే నిష్టాగరిష్ఠులైన వివేక
సంపన్నులు మాత్రమే తమను తాము ఉద్ధరింపజేసుకొను సామర్థ్యము గలిగి సూక్ష్మాతి సూక్ష్మము
మరియు సున్నితమునైన స్థితులను పొందగలిగిరి.
వారైనను ఆతృతతో దానికై ఆరాటము చెందిననే కాని సాధ్యపడలేదు.
ఒకసారి దాన్ని మనమవగాహన జేసుకొంటే
చాలు. మనం గడుపుతున్న జీవితం అర్థరహితమని, ఏ లక్ష్యసాధనకై మనము మానవజన్మ గైకొంటిమో ఆ జన్మము, జీవనము
అసంపూర్ణమైయున్నదని, దైవీయ పిలుపును విని సమ్మతితో మనల్ని
మనం సంపూర్ణముగా ప్రభువునకర్పించుకొను యోగ్యతను సముపార్జించుకొనవలెనని
బోధపడుతుంది.
మన జీవనోపాధి యేదైనా, మనమే మతస్తులమైనా, మనమే వారసత్వానికి సంబంధించిన వారమైన
పరవాలేదు. మన శ్రద్ధాపూర్వకమైన సహజమార్గ
సాధనే మనలో సహజసిద్ధమైన సరళతతో కూడిన వినయమును పొటమరింపజేసి అది మన
దివ్యజీవనసంజ్ఞగా మనం ప్రార్థనతోను, ధ్యానం ద్వారాను
గురువర్యులతో సంబంధం ఆలోచనా పరంగాను, భావనాపరంగాను
ఏర్పరచుకుంటే ఆయనలో లీనమై ఆయన స్మరణతోనే కొనసాగి సూక్ష్మాతిసూక్ష స్థితులను
సంతరించుకుంటాము.
ఇలా కొనసాగితే మనం కాలక్రమేణ ఉత్తమలోకంలో
ఎక్కువ సమయం గడప గలుగుతాము. తద్వారా ఈ
అల్లకల్లోలము మరియు అశాశ్వతమైన బాహ్యప్రపంచం నుండి బయటపడగలుగుతాము. అలా భగవదత్తమై, క్రమబద్ధీకరింపబడిన
మనస్సు నుండి డోలాయమానమైన డాంబిక ప్రవృత్తులు వదలిపోయి, ఆలోచనా
తీరులోను, ప్రవర్తనలోను, దృక్పదంలోను,
స్వభావంలోను గణనీయమైన మార్పులు సంభవిస్తాయి.
అధిక సమయమీ సహజమార్గవిధానములో జీవనము
సాగించిన యెడల మనకిపుడు మార్గదర్శకునికంటే, బోధకునికంటే
ఎక్కువై ప్రభవించిన దివ్యపురుషుడూ మన జీవితమున కొక అర్థము, పరమార్థమునైన
గురుదేవుల యెడ భక్తి,ప్రేమలను బీజములు నాటబడతాయి.
మనము మన దైనందిన ప్రాపంచిక విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికి సహజ మార్గము, మన
ప్రశస్తజీవనమునకు ఆధ్యాత్మిక పరిణామాన్ని జోడిస్తుంది. తద్వారా ఒక నూతన అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఈ
నశ్వరచట్రము నుండి బయటికి తీసుకొనివచ్చి ప్రయోజ నాత్మక దిశానిర్దేశముల
నిచ్చుచున్నది.
మరోమాటలో చెప్పాలంటే గురుదేవుల యోచన, యోగశక్తి (ప్రాణాహుతి) మనల్ని సూక్ష్మాతిసూక్ష్మమైన శరీరరహిత స్థితికి
చేర్చి జీవన్ముక్తదశను జీవముతో నుండగనే ప్రసాదిస్తుంది. ఐతే నిరంతరం ఆయనలో లీనమైపోవడానికి తపనజెందుతూ
వుండాలి.
మనమాయన ఆధ్యాత్మిక వారసులంగా శక్తిమంతులమై, ప్రతిభాశాలురమై మనయత్నం లేకుండగనే మన సామాన్య కార్యక్రమంలో మనముండడంతోనే
ఎంతో ప్రయోజనాత్మక పనులు నిర్వర్తింపబడుతుంటాయి.
గురువర్యుల స్మరణలో జరిగే మన ప్రత్యేక
సమావేశములలో వ్యక్తిగతంగాను, సామూహికంగాను ఆయన
పనితనం మన విశ్వాస పరిధిలో మనం వివరణాత్మకంగా గ్రహించవచ్చు. మనం నిశితంగా పరిశీలించి చూస్తే ఇదే ప్రక్రియ
మనరోజువారీ కార్యక్రమంలో కూడా కొనసాగి,
మనజీవనోపాధిపైన, ఇతర వ్యవహారములపైన పనిచేసి
కర్మకారక సంబంధమైన ముద్రల భారం మనపై ఏమాత్రం పడకుండా సాఫీగా సాగిపోతుంది.
కనుక ఎలా మనం నిరంతరం గురుదేవులతో అనుబంధం
కలిగివుండాలి? దీక్ష గైకొననివారు, ప్రారంభకులు దీన్ని మూడవ ఆదేశంలో చెప్పినట్లు మహోన్నతమైన దానికై తపన,
ఆరాటము పడుట ద్వారా పొందెదరు.
"భగవంతునితో ఐక్యము పొందుటే నీ
గమ్యముగా నిర్ణయించుకొనుము. అది
సాధించునంత వరకు విశ్రమింకుము."
ఉన్నతమైన అనుభవము మరియు పరిశీలన ద్వారా
గమనించిన విషయమేమంటే, రాత్రి పడుకొనబోవుటకు ముందు
చేయు ప్రార్థనాసమయము అతి ప్రశస్తమైనది.
అప్పుడు మనల్ని మనం ఆయత్త పరచుకొని ప్రభు సన్నిధానమును భావించి (పదవ ఆదేశం)
ఆయనపైనే మన చింతన, యోచన నిలిపి నిద్రలోనికి జారుకోవడం వల్ల
ఆయనతో మనం చక్కగా అనుసంధింపబడతాము.
పర్యవసానంగా శరీరస్పృహగల స్థూల నిద్ర
ప్రార్థన ప్రభావం వల్ల రాత్రంతా అతీంద్రియ స్థితిలో నిరీక్షణగా మారుతుంది. మనం సూర్యోదయాత్పూర్వమే నిద్ర లేచేటప్పటికి
ప్రార్థనామయ స్థితిలోనే వుండి అప్రయత్నంగానే మన ధ్యానము, ఏ యితర ఆలోచనలు, ఒడుదుడుకులు లేకుండా సాగుతుంది.
క్రమబద్ధీకరింపబడిన మనస్సుతో జాగరూకతను
వృద్ధిచేసుకొని సహజమార్గ ధ్యానము సూక్ష్మాతిసూక్ష్మ స్థితిలో ఆలోచనలకు దూరమై, స్థానమేర్పరచుకొనజాలని, తేలికగా తుడిచిపెట్టుకొని
పోవు ముద్రలతో, ఆ మహా ప్రభువుతో లీనమయ్యెడి అనుబంధముగా
మారిపోతుంది.
కనుక రాత్రి ప్రార్థన, ఉదయపు ధ్యానము గురుదేవులతో విడదీయరాని బంధమేర్పరచి, ధ్యాన
సమయమున ఏర్పడిన శూన్యస్థితి మనలను అతీంద్రియ స్థితిలో నివసింపజేసి జాగృత దశలో
నిరంతరం ఆయన చింతనలో వుండేట్లు జేస్తుంది.
గురువుగారు చెప్పినట్లు ధ్యానము, నిరంతర స్మరణకు దారినేర్పరుస్తుంది.
స్వచ్ఛతనొందిన హృదయము తన మూలమును జ్ఞాపకమునకు తెచ్చుకొంటుంది. సమ్మతితో మన మాతృభూమికి తిరుగు ప్రయాణాన్ని
త్వరిత పరుస్తుంది.
మనిషి తన్నుతాను మరచిపోవడమనే ఉత్తమ
నిరూపణతో ఈ పరిశీలన నిరంతర స్మరణ యొక్క ప్రాధాన్యత నెఱుక పరచింది.
ఎచ్చోట ఆలోచన, భావనలు వ్యక్తీకరించుటకు, వర్ణించుటకు మాటలకలవికాదో
అట్టి తాత్విక సూక్ష్మ ప్రపంచపు పరిధిలోనిదీ విషయమని మనకు నిశ్చయముగా తేటతెల్ల మైనది.
గమ్యంతోనే కలసియుండి, ఎఱుకలేని స్థితి నుండి ఎఱుక గల్గిన స్థితివరకు బాహ్యా భ్యంతరము లందు అన్ని
చోట్ల, అన్ని వేళాలా గూడా మనస్సు గురువర్యుల చింతనతోనే
మెలగుతూ వుండుటయనునది లక్ష్య సాధనకున్న ఒకానొక మార్గము.
అట్టిస్థితిలో చర్య కొనసాగుచుండుటను
నిర్ధారిస్తూ ఉత్తమ శక్తులు మానవుని కార్యకలాపములన్నిటిలోనికి విస్తరించును. సంక్షిప్తంగా చెప్పాలంటే సహజమార్గము అభ్యాసిని
అశాశ్వత ప్రపంచమునుండి విముక్తిని కలిగించి ఆధ్యాత్మిక స్థితులలోనికి
ప్రవేశింపజేసి తనను తాను అవినాశినిగా మార్చేస్తుం ది .
"ఆయన స్మరణ మనల్ని మనం మరచిపోయేట్టు
చేస్తే ...... ఆయన సన్నిధానం మన వాస్తవ స్థితియైన సూక్ష్మత్వాన్ని మనకు జ్ఞాపకం
చేస్తుంది".
🌹🌹🌹